అదానీ గ్రూప్‌నకు మరో షాక్.. కీలక వ్యక్తి రాజీనామా
అదానీ గ్రూప్‌నకు హిండెన్ బర్గ్ రిసెర్చ్ నివేదిక సెగ కొనసాగుతోంది.తాజాగా బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సోదరుడు లార్డ్ జో జాన్సన్ అదానీ గ్రూప్ నుంచి తప్పుకున్నారు. అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న లండన్‌కు చెందిన ఎలారా క్యాపిటల్ డైరెక్టర్ పదవికి జో జాన్సన్ రాజీనామా చేశారు.జో జాన్సన్ ఫిబ్రవరి 1న తప్పుకున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ ధ్రువీకరించింది.భారతీయ కార్పొరేట్లకు నిధులను సమీకరించే క్యాపిటల్ సంస్థగా ఎలారా పనిచేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోలోని 10 బుక్‌రన్నర్‌లలో ఎలారా కూడా ఒకటి.