మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29 రెండు భాగాలుగా రూపొందనుందని సమాచారం. ఈ సినిమా కోసం 2025 జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిసింది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రల ఎంపికకు కూడా రాజమౌళి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
Image Credit: X
ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులతో సినిమా నిర్మాణం
సినిమా గొప్పతనాన్ని మరింత పెంచేందుకు రాజమౌళి వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్‌తో చేతులు కలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికా అడవుల్లో కొన్ని వినూత్నమైన లొకేషన్లను పరిశీలించి, (Mahesh Babu Ai Images)అత్యంత యథార్థంగా ఉండేలా ఎంపిక చేశారని టాక్. అంతేకాకుండా, గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరిపి, ఇంటర్నేషనల్ స్థాయికి తగినంత ఉన్నతమైన విజువల్ ఎఫెక్ట్స్‌పై దృష్టి సారించారు.
Image Credit: X
రెండేళ్ల పాటు షూటింగ్
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్ సెట్స్‌లోనే(Mahesh Babu Ai Images) గడపవలసి ఉంటుంది. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్, అడ్వెంచర్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.
ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ జోడీగా
ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు.
ఎక్స్‌లో మహేష్ బాబు ఏఐ పిక్స్ వైరల్
SSMB29 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) ద్వారా క్రియేట్ చేశారు. SSMB29 కథా నేపథ్యంతో ఏఐ క్రియేట్ చేసిన ఫొటోలు ఆశ్యర్యపరుస్తున్నాయి. సింహంతో ఉన్న మహేష్ బాబు పిక్స్ ఔరా! అని అబ్బురపడేలా ఉన్నాయి. అడవిలో మహేష్ బాబు ఫైట్స్ చేస్తున్నట్లుగా ఏఐ క్రియేట్ చేసింది. మరో ఫొటోలో రాజమౌళి మహేష్ బాబుకు సీన్ వివరిస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం(Mahesh Babu Ai Images) ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇలాగే మహేష్ మెకోవర్ ఉంటే ఫ్యాన్స్‌కు పండగేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Image Credit: X
ముఫాసా పాత్రపై మహేష్ ఉత్సాహం
ఇటీవల మహేష్ బాబు, డిసెంబర్ 20న విడుదల కానున్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్‌లో లీడ్ క్యారెక్టర్ ముఫాసా పాత్రకు వాయిస్ అందించారు. ఈ అవకాశంపై మహేష్ సంతోషం వ్యక్తం చేస్తూ, “ముఫాసా పాత్ర నాకు ఎంతో ఇష్టమైనది. కుటుంబంపై ప్రేమ, సంరక్షణ అనే అంశాలను ఈ పాత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ పాత్రకు డబ్బింగ్ ఇవ్వడం నా కల సాకారమైనంతటిది” అని అన్నారు.
తెలుగు వెర్షన్‌లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు వాయిస్ అందించగా, ఇతర పాత్రలకు (Mahesh Babu Ai Images)సత్యదేవ్, అలీ, బ్రహ్మానందం, అయ్యప్ప పి. శర్మ వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించగా, డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
Image Credit: X
అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
SSMB 29 చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సినిమా కావడం, అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, భారీ బడ్జెట్, మహేష్ బాబు వంటి స్టార్ హీరో అందులో నటించడమే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రం నుంచి మరిన్ని అప్‌డేట్‌ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంచనాలను అందుకునే విధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’