• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 2022 తెలంగాణ, హైదరాబాద్ ఓవరాల్ రౌండప్

  ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు. జాతీయ రాజకీయాల్లోకి BRS తో అడుగుపెట్టిన కేసీఆర్.  ఆదిలోనే ఆటంకం ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రజలను కలవరపెట్టింది. పాఠశాలలు చాలా రోజులే మూతపడ్డాయి. ఎంతలా అంటే బడులు తెరవండి మా పిల్లల్ని భరించలేం ఇంట్లో అని తల్లిదండ్రులే వారించే స్థాయికి … Read more

  2022 ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌ రౌండప్‌

  కొత్త జిల్లాల ఏర్పాటు. వాటి పేర్లపై రచ్చ.  హైకోర్టులో నూతన జడ్జీల ప్రమాణం. మూడు రాజధానులపై రగడ. ఆశావాహులు, అసంతృప్తుల మధ్యే కొలువుదీరిన కొత్త మంత్రివర్గం. అల్లూరి జిల్లాలో 30 అడుగుల విగ్రహం.  అదే సందిగ్ధతలో పోలవరం. టీడీపీ, వైకాపా మధ్య పెరుగుతున్న అంతరం. మధ్యలో జనసేనాని పవన్ కల్యాణ్‌ వైరం. సంక్షేమానికి అప్పులు. మాదక ద్రవ్యాల సరఫరా కట్టడిలో విఫలం. ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు, సమస్యలు, పోరాటాలు మధ్య ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం సాగింది. కొత్త జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ … Read more

  2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

  పొన్నియన్ సెల్వన్ ఎవరు? చోళ సామ్రాజ్యంలో ఈయన పాత్ర ఏంటి?

  పొన్నియన్ సెల్వన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. మణిరత్నం తన సినిమాతో ఈ నవలకు మరింత హైప్ క్రియేట్ చేశాడు. అసలు ఎవరీ పొన్నియన్ సెల్వన్..? అతడి గొప్పదనం ఏంటి? వంటి అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం.  రాజరాజ చోళుడే పొన్నియన్ సెల్వన్..( Who is Ponniyan selvan) చోళ సామ్రాజ్యాధినేత రాజరాజచోళుడినే పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారని చరిత్ర చెబుతోంది. సుందర చోళుడి కుమారుడు. చిన్నగా ఉన్న రాజ్యాన్ని అఖండ సామ్రాజ్యంగా తీర్చిదిద్దిన చక్రవర్తిగా పొన్నియన్ సెల్వన్ ప్రసిద్ధికెక్కాడు. సోదరి కుందవి సాయంతో … Read more

  Jasprit Bumrah: బుమ్రా టీమిండియాకు ఎందుకంత కీలకం?

  ‘ఛ.. బుమ్రా ఉంటే బాగుండేది. బుమ్రా అయితే పరుగులను కట్టడి చేసేవాడు. బుమ్రా అయితే వికెట్ తీసేవాడు’ ఆస్ట్రేలియాతో తొలి T20 మ్యాచ్ చూస్తుండగా ఇలాంటి భావనే అందరికీ కలిగింది. భారత బౌలర్ల ప్రదర్శన అలా ఉంది మరి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మన బౌలర్లు చేతులెత్తేస్తుంటే అందరికీ బుమ్రానే గుర్తుకొచ్చాడు. ఆసియాకప్‌లోనూ బుమ్రా ఉంటే మరోలా ఉండేదేమో? నిజంగా బుమ్రా అంత ప్రభావం చూపగలడా..? అతడిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? గణాంకాలు ఏం చెబుతున్నాయి?  జస్ప్రిత్ బుమ్రా.. భారత జట్టు బౌలింగ్ దళానికి … Read more

  బతుకమ్మ జానపద పాటల ప్రత్యేకత తెలుసా.. ఈ పండుగకు వీటిని నేర్చుకుందామా..!

  తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వచ్చేసింది. బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ప్రతి ఆడపడుచు ఉత్సాహంగా జరుపుకొనే సంబరం ఇది. ఈ సంబరాల్లో బతుకమ్మ పాటలది ప్రత్యేక స్థానం. మన అమ్మలు, అమ్మమ్మలు చాలా చక్కగా వీటిని పాడుతూ.. బతుకమ్మ ఆట ఆడుతుంటారు. కానీ నేటితరం యువతులకు ఈ జానపద పాటలపై పెద్దగా పట్టు లేదు. పెద్దవారితో కలిసి కాలు కదుపుతారు కానీ, పాటను అందుకోలేరు. పదాలు కూడా సరిగా పలకలేరు. ఎంతోమందికి ఈ పాటలు నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నా.. వీలు కాకపోవచ్చు. ఈ … Read more

  బతుకమ్మ స్పెషల్: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న బతుకమ్మ పాటలు ఇవే!

  బతుకమ్మ అంటేనే పూల పండుగ. ఏ ఆడబిడ్డ చేతిలో చూసినా బతుకమ్మే. ఏ గాత్రం నుంచి వచ్చినా బతుకమ్మ పాటే. ఏ కంట చూసినా బతుకమ్మ ఆటే. తెలంగాణ వచ్చినంక బతుకమ్మ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ పండుగపై రూపొందిన ప్రత్యేక పాటలు అశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్‌లో సినిమా పాటలను తలదన్ని రికార్డులు సృష్టించాయి. మిలయన్లలో వ్యూస్‌ని సొంతం చేసుకుని.. బతుకమ్మకు అంకితం చేశాయి. మరి, ఆ పాటలేంటో ఓసారి చూసేద్దామా..! ఆల్ టైం ఫేవరేట్.. బతుకమ్మ వచ్చిందంటే చాలు.. ఈ పాట తప్పకుండా … Read more

  RRRను కాదని ఆస్కార్స్‌కు గుజరాతీ సినిమా..కారణం ఇదేనా!

  ప్రపంచానికి భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఇలా అందరిపేర్లు విశ్వవ్యాప్తంగా మార్మోగాయి. ఈ సారి ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ పేర్లు కూడా ఉంటాయని ఎంతోమంది ప్రముఖ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ చివరికి అందరికీ నిరాశే మిగిలింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘చెల్లో షో’(the last film show)ను ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేసింది. అంత బజ్ క్రియేట్ చేసిన … Read more

  ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!

  అది ఓ అవార్డుల ఫంక్షన్. బాలీవుడ్ హేమాహేమీలు అంతా అక్కడే ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్‌కి ఆహ్వానం అందింది. ఆ పిలుపుతో ముంబయి వెళ్లిన ఆనందం చిరుకి ఎక్కువ సేపు నిలవలేదు. కారణం అక్కడ ఏ దక్షిణాది హీరో కటౌట్ లు, ఫోటోలు లేకపోవడం. దీనిపై మెగాస్టార్ విస్మయం చెందారు. ఉండబట్టలేక నేరుగా అక్కడే అడిగేశారు మా సౌత్ హీరోల ఫొటోలు ఒక్కటి కూడా లేవే అని! దక్షిణాది చిత్రాలంటే వారికి లేక్కలేదు. దక్షిణాది హీరోలని వాళ్లు పట్టించుకోరు. … Read more

  భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

  ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more