• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అలాంటి వాడినే పెళ్లాడుతా: ‘బేబీ’ హీరోయిన్

  మంచి మనసు ఉన్నవాడినే తాను పెళ్లి చేసుకుంటానని ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయేవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పింది. ‘‘నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఆస్తిపాస్తులు లేకపోయినా ఫరవాలేదు. అందంగా లేకపోయినా ఎలాంటి సమస్య లేదు. కానీ మంచి మనసు మాత్రం ఉన్నవాడై ఉండాలి. అలాంటి వాడితోనే నేను ఏడడుగులు వేస్తాను. ఇంతకంటే అతడి నుంచి నేను ఏమీ కోరుకోను.’’ అంటూ వైష్ణవి చెప్పుకొచ్చింది.

  త్వరలో పెళ్లి చేసుకుంటా: అనుష్క

  సమయం కలసి వస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటానని హీరోయిన్ అనుష్క శెట్టి తెలిపింది. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రమోషన్లలో అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లాడుతా. ఇక సినిమాలో అన్విత పాత్రలో నటించాను. ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా హిట్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  ఆసక్తిగా ‘800’ ట్రైలర్!

  శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మురళీధరన్ చిన్ననాటి నుంచి తాను క్రికెటర్‌టా ఎదిగినంతవరకు ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది. మురళీధరన్ పాత్రలో హీరో మధుర్ మిట్టల్ ఒదిగిపోయాడు. కాగా ఈ సినిమాను ఎంఎస్ శ్రీపతి తెరకెక్కించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.

  ఆకట్టుకుంటున్న ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్

  విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగులో నటుడు దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. ఎస్ జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

  అభిమానికి బిర్యానీ తినిపించిన హీరో

  టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన అభిమానికి బిర్యానీ తినిపించి వార్తల్లో నిలిచాడు. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన అభిమానులతో కలిశారు. విజయవాడలోని ఫుడ్ కోర్టులో నవీన్ ప్రమోషన్లు నిర్వహించారు. రోడ్డుపైనే కారు ఆపి బిర్యానీ టేస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఓ అభిమానికి బిర్యానీ తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా వచ్చే నెల 7న విడుదల కానుంది. This tour … Read more

  రుషికొండపై ట్వీట్.. సరిచేసుకున్న వైసీపీ

  AP: రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పడంపై వైసీపీ మాట మార్చింది. నిన్న రాత్రి చేసిన ట్వీట్ పొరపాటుగా వచ్చిందని, అక్కడ కడుతున్నది ప్రభుత్వ నిర్మాణాలేనని స్పష్టం చేసింది. ‘మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. మా అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్‌ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన … Read more

  బద్రీనాథ్ ఆలయంలో రజనీకాంత్

  జైలర్ మూవీ అనంతరం రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. హిమాలయాలను చుట్టొచ్చిన ఆయన నేడు ఉదయం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అయితే, జైలర్ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఓ స్వామీజీ ముందుగానే చెప్పినట్లు రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఇక స్వతహాగా స్వామి చెప్పారంటే.. జైలర్ విజయం సాధించినట్లేనని తాను అనుకున్నట్లు రజనీ పంచుకున్నారు. Superstar FIRST speech after Jailer release. "#Jailer released with lot of expectations. Swamiji said … Read more

  జుకర్‌బర్గ్‌తో ఫైట్.. వెనక్కి తగ్గని మస్క్

  బిలియనీర్ ఎలాన్ మస్క్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మధ్య జగడం అనివార్యం అయ్యేలా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ వరుస ట్వీట్లు ఇందుకు ఊతమిస్తున్నాయి. జుకర్‌బర్గ్‌తో చేయబోయే పోరాటాన్ని ‘ఎక్స్’(ట్విట్టర్)లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని ట్వీట్ చేశారు. ఈ డబ్బులు వృద్ధాశ్రమానికి విరాళం ఇస్తానని ప్రకటించారు. పైగా, ఈ ఎపిసోడ్ తొలి ఎక్స్-వీడియో కాబోతోందన్నారు. అంతకుముందు, మస్క్, జుకర్ ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ‘రా చూసుకుందాం’ అంటూ సవాల్ విసురుకున్నారు. Zuck v Musk fight will be live-streamed on … Read more

  ఇండిగో విమానంలో పనిచేయని ఏసీ

  ఈ మధ్య తరచూ విమానాల్లో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఇండిగో విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చండీఘడ్ నుంచి జైపుర్‌కి వెళ్లే విమానంలో ఈ దుస్థితి తలెత్తింది. దీంతో చేసేదేం లేక ప్రయాణికులు అట్టలతో ఊపుకున్నారు. ఎయిర్ హెస్టెస్ టిష్యూ పేపర్లు అందిస్తే చెమటను తూడ్చుకున్నారు. ఈ వీడియోను పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. 90 నిమిషాల పాటు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేశారు. Had one … Read more

  మీమ్స్ రూపంలో ఫ్రెండ్‌షిప్ డే విషెస్

  Friendship Day Memes: ‘మీమ్స్’(Memes)కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. సోషల్ మీడియా యూజర్లకు ఇవి లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. అందుకే ఏ సందర్భాన్నైనా మీమ్స్ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు. నేడు ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీమర్లు పలు రకాల మీమ్స్, వీడియో మీమ్స్ చేస్తున్నారు. ‘హ్యాపీడేస్’ మూవీలోని సాంగ్‌తో బ్రహ్మానందం సీన్లను ఎడిట్ విషెస్ చెబుతున్నారు. హైదరాబాద్ హవా ట్విట్టర్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి. Happy Friendship Day❤Tag Ur Friends? pic.twitter.com/19oRuD2j7v — Hyderabad … Read more