• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వచ్చే అసెంబ్లీలో నేను ఉండనేమో: రాజాసింగ్

  TS: అసెంబ్లీలో మూడో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగాా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇందులో ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉండరో తెలియదు. నేనైతే ఉండనేమోనని అనిపిస్తోంది అధ్యక్షా. ఎందుకంటే నాకు తెలిసిపోతోంది. బయటివాళ్లు, సొంతవాళ్లు కూడా నేను రావొద్దనే అనుకుంటున్నారు. ఏదేమైనా, నేను, వచ్చినా రాకపోయినా మా ధూళ్‌పేట్ ప్రజలపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ఆశీస్సులు ఉండాలి. వారికి ఏదైనా ఉపాధి కల్పించండి’ అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల తర్వాత నేను అసెంబ్లీలో నేను … Read more

  హిరోషిమా డే.. ప్రపంచంలో చీకటి రోజు

  ప్రపంచ చరిత్రలో పెను విధ్వంసం మొదలైంది ఈరోజు. 1945, ఆగస్టు 6న అమెరికా జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణు బాంబు దాడి చేపట్టింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిన ఈ ఘటన ఆనాడు ఎన్నో వేల మంది జపనీయులను బలితీసుకుంది. ఇప్పటికీ అక్కడ అణు బాంబు సృష్టించిన భీకరానికి ఆనవాళ్లున్నాయి. అందుకే, ప్రతి సంవత్సరం ఈ రోజున జపాన్ ‘హిరోషిమా డే’ని శాంతి దినంగా పాటిస్తోంది. అణు బాంబు దాడితో కలిగే అనర్థాలు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

  లోయలో బస్సు పడి 18మంది మృతి

  మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా, మిగతా వారికి గాయాలయ్యాయి. ప్రయాణ సమయంలో బస్సులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారట. అతివేగంతో వస్తున్న బస్సు మూల మలుపు వద్ద టర్న్ తీసుకుంటుండగా ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 131 అడుగుల లోతులో బస్సు పడిపోయిందని, సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతున్నట్లు మెక్సికో ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ?Autobús de pasajeros cayó aun profundo barranco, de … Read more

  ఆరంభంలోనే ఆకట్టుకున్న తిలక్ వర్మ

  హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 22 బంతుల్లో 39 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా ఉత్తమంగా రాణిస్తున్న తిలక్.. జాతీయ జట్టులోనూ ఫామ్‌ని కొనసాగించాడు. బ్యాటింగ్‌కి వచ్చి తొలి 3 బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు. దీన్ని బట్టి మనోడి ఆటతీరు ఎలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో తిలక్ ఒక్కడే సాధికారిక బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్ ఓడినా తిలక్ వర్మపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Takes a blinder.Hits back to back … Read more

  అదే మా లక్ష్యం: రాహుల్ ద్రవిడ్

  రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించడమే తమ లక్ష్యమని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడం, సెలక్షన్‌పై విమర్శలు రావడంతో ద్రవిడ్ ఇలా స్పందించాడు. ‘రోహిత్, కోహ్లీలకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆసియా కప్, వరల్డ్ కప్‌ ముందు ఇదే మాకు చివరి అవకాశం. అందుకే సిరీస్‌లో ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. సూర్యకు మరిన్ని అవకాశాలు ఇస్తాం. ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి ఆటనే మేం ఆశిస్తున్నాం’ అని ద్రవిడ్ వెల్లడించాడు. Head Coach Rahul Dravid explains #TeamIndia's … Read more

  మానవత్వం చాటుకున్న సీఐ, ఎస్సై

  TS: భూపాలపల్లి సీఐ, చిట్యాల ఎస్సై మానవత్వాన్ని చాటుకున్నారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని ఇటీవల వరద ముంచేసింది. దీంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. అయితే, శవం కుళ్లిన స్థితిలో ఉండటంతో ఎవరూ దగ్గరికి రాలేదు. ఈ క్రమంలో భూపాలపల్లి సీఐ రాంనర్సింహా రెడ్డి శవాన్ని ఓ కట్టెకు కట్టించి స్వయంగా మోసుకొచ్చారు. చిట్యాల ఎస్సై రమేశ్ సాయం తీసుకున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల పాటు మోసుకొచ్చి బంధువులకు అప్పగించారు. దీంతో వీరిని జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే గండ్ర అభినందించారు. … Read more

  రేవంత్ పర్యటన.. ఉప్పల్‌లో ఉద్రిక్తత

  HYD: ఉప్పల్‌లో కాంగ్రెస్ నేతలు మధ్య ఘర్షణ తలెత్తింది. రేవంత్ పర్యటన నేపథ్యంలో రేగా లక్ష్మారెడ్డి ఫ్లెక్సీలను మందముల పరమేశ్వర్ రెడ్డి అనుచరులు చించేశారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తులపై లక్ష్మారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల ఎదుటే తీవ్రంగా దూషిస్తూ కొట్టారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి కిందపడ్డారు. రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడంతో ఉప్పల్‌లో ఉద్రిక్తత నెలకొంది. ‘ఎంపీ కనబడుట లేదు’ అనే పోస్టర్లు వెలిసిన అనంతరం రేవంత్ ఈ పర్యటన చేపట్టడం గమనార్హం. రేవంత్ రెడ్డి పర్యటనలో … Read more

  బాలుడిపై వీధి శునకాలు దాడి

  TS: హైదరాబాద్‌లో అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా సంగారెడ్డి బాలాజీనగర్ కాలనీలోనూ ఓ చిన్నారిపై 5 కుక్కలు దాడికి ఎగబడ్డాయి. వెంటనే అక్కడున్న మహిళ వాటిని తరిమేయడంతో బాలుడు గాయాలతో బయట పడ్డాడు. వీధి కుక్కల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సంగారెడ్డిలోని బాలాజీనగర్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిని వెంబడించి కరిచిన 5 కుక్కలు. పక్కనే ఉన్న ఓ మహిళ … Read more

  ఈదుకుంటూ వెళ్లి కరెంట్ తెచ్చిన హెల్పర్

  TS: చినుకు పడితేనే కరెంట్ పోయే పరిస్థితి. చుట్టూ వరద నీరుంటే అటు వైపే వెళ్లలేం. అలాంటిది ఓ విద్యుత్ ఉద్యోగి చూపిన అంకితభావం ప్రశంసలు అందుకుంటోంది. సూర్యాపేట జిల్లా పాతర్ల పహాడ్ గ్రామ హెల్పర్ కొప్పుల సంతోష్ సాహసం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో గ్రామంలో కరెంటు పోయింది. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ స్తంభం చుట్టూ వరద ఉన్నా లెక్కచేయకుండా ఈదుకుంటూ వెళ్లారు. మరమ్మతులు చేసి విద్యుత్‌ని పునరుద్ధరించారు. కరెంట్ ఇవ్వడం కోసం నీటిలో … Read more

  తెల్లవారుజామున ఘోర విషాదం

  మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 21 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. బస్సుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ప్రమాదానికి కారణమేంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. Maharashtra | Six passengers dead, 21 injured in collision between two buses in … Read more