• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇజ్రాయెల్‌–హమాస్‌ల మధ్య కుదిరిన ఒప్పందం

  ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ గాజాలో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ ప్రకటించింది, దాదాపు 50 మంది బందీలకు విముక్తి, ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఫైటర్ల విడుదలకు ఒప్పందం కుదిరింది. కాల్పుల విరమణకు, బందీల విడుదలకు తగిన సానుకూల పరిస్థితులను సృష్టించే పనిలో మధ్యవర్తులు నిమగ్నమయ్యారని ఖతార్‌ పేర్కొంది ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఒప్పందం కుదిర్చే విషయంలో ఖతార్‌ అత్యంత కీలకంగా వ్యవహరించింది.

  నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట

  మాజీ భారత నౌకాదళ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు అనుమతించింది. భారత అప్పీల్‌ను కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు ఖతార్ పేర్కొన్నాయి. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడినట్లు వీరిపై ఖతార్‌ ఆరోపణలు మోపిన విషయం తెలిసిందే.

  ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య సంధి?

  ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర పోరు నేపథ్యంలో రెండింటి మధ్య సంధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, హమాస్‌ అధిపతి ఇస్మాయిల్‌ హనియా ఓ ప్రకటన వెలువడింది. హమాస్‌ మిలిటెంట్లు చెరలో రెండు వందల మందికి పైగా బంధీలుగా ఉన్నారు. వారి విడుదల కోసం ఇజ్రాయెల్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు తుదిదశకు చేరుకుంటున్నట్లు అమెరికా వెల్లడించింది. ‘గతంలో కంటే దగ్గరగా ఉన్నాం’ అని ఒప్పందాన్ని ఉద్దేశించి అమెరికా సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.

  రన్‌వేపై అదుపుతప్పి సముద్రంలోకి వెళ్లిన విమానం

  అమెరికా నౌకాదళానికి చెందిన ఓ విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో చోటు చేసుకుంది. వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానం నీటిపై తేలడం చూసి సముద్రంలో బోటింగ్‌ చేస్తున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. https://www.eenadu.net/telugu-news/world/us-navy-plane-overshoots-runway/0800/123215814

  దక్షణ గాజా నుంచి పారిపోండి: ఇజ్రాయెల్

  పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి పారిపోవాలని ఇజ్రయెల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌ పౌరులు తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ‘ప్రస్తుత పరిస్థితిల్లో ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. అయితే, ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం’ అని ఇజ్రాయెల్‌ పేర్కొంది.

  అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

  అమెరికా లో మళ్లీ కాల్పుల మోత కలకలం రేపింది. న్యూ హంప్‌షైర్‌లో ఉన్న సైకియాట్రిక్‌ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పలువురికి బుల్లెట్‌ గాయాలు అయ్యాయి. పోలీసుల కాల్పుల్లో అనుమానిత వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన ఆసుపత్రిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

  జిన్‌పింగ్ నియంతే: బైడెన్

  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత బయటకు వచ్చిన బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘జిన్‌పింగ్‌ను నేనింకా నియంతగానే విశ్వసిస్తున్నా.. చైనా ప్రభుత్వ పాలకు మా ప్రభుత్వ పాలనకు చాలా తేడా ఉంది’. అని బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  ‘బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధమే’

  పాలస్తీనాలోని హమాస్‌ మిలిటెంట్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ వద్ద బందీలుగా ఉన్నవారిలో 70 మంది మహిళలు, చిన్నారుల్ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఐదు రోజులపాటు యుద్ధాన్ని నిలిపివేయాలని షరతు విధించారు. ఆ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేసినా, ఆలస్యం చేసినా.. ఇజ్రాయెల్‌దే బాధ్యతని చెప్పారు. ఈ మేరకు హమాస్ మిలిటెంట్‌లు ఆడియో రికార్డును విడుదల చేశారు.

  ట్రంప్ సోదరి మృతి

  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట విషాదం నెలకొంది. ట్రంప్‌ సోదరి మేరియన్ ట్రంప్ కన్నుమూశారు. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె అనారోగ్య కారణాలతో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మేరియన్ న్యూజెర్సీలో ఫెడరల్‌ న్యాయమూర్తిగా పని చేసి 2019లో పదవీ విరమణ పొందారు. గతేడాది ట్రంప్‌ సోదరడు రాబర్ట్‌ ట్రంప్‌ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

  దీపావళి పండుగ.. చైనాకు లక్ష కోట్లు నష్టం!

  చైనాను అన్ని విధాలుగా నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్‌కాట్‌ చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ ఏడాదిలో దీపావళి రోజు దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు సుమారు రూ.1లక్ష కోట్లు నష్టం వాటిల్లింది. గతంలో దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. ఈ మేరకు ఓ నివేదిక పేర్కొంది.