నటుడు మంచు మోహన్ బాబుకు (Manchu mohan babu) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మోహన్‌బాబు హైకోర్టుకు వెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపో, మాపో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసే ...
2024 సంవత్సరం చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి చాలా సూపర్ హిట్స్ వచ్చాయి. ‘హనుమాన్’ మెుదలుకొని రీసెంట్ ‘పుష్ప 2’ ఎన్నో బ్లాక్‌బాస్టర్ చిత్రాలు పాన్ స్థాయిలో సత్తాచాటాయి. ఇప్పుడు డిసెంబర్ ఆఖరి వారంలోనూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు మరికొన్ని చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది రాబోతున్న చివరి చిత్రాలు అవే. అటు ఓటీటీలోనూ ఆసక్తి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు బరోజ్ త్రీడీ మలయాళ నటుడు మోహన్‌లాల్ ...
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ నిర్లక్ష్య ధోరణి కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. ఈ మేరకు ప్రేస్ మీట్ పెట్టి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు.. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి.. మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను.. నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్ క్లియర్ చేశారు.. నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ...
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2‘ (Pushpa 2) తర్వాత టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రస్తుతం అందరూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్‌కు మరో 19 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి సారించారు. అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ...
బుల్లితెర యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే కొద్దిరోజుల క్రితం వరకూ అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. వాటికి అదే స్థాయిలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అనసూయ కౌంటర్లు ఇస్తూ వచ్చింది. అయితే ఇటీవల దూకుడు తగ్గించడంతో కొద్దిరోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో వినిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ...
క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ శుక్రవారం (డిసెంబర్ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ...
సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న పుష్ప2, రిలీజ్ అయిన తర్వాత మరింత జోరుగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ, కొత్త రికార్డులను సృష్టించింది. తాజాగా, హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నికర వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త చరిత్ర సృష్టించింది. రూ.632 కోట్లు (Pushpa 2 Hindi Collections) వసూలు చేసి, 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. ఈ మొత్తాన్ని కేవలం సినిమా విడుదలైన 15 రోజుల్లోనే రాబట్టడం. ...
2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన ‘కల్కి’, ‘పుష్ప 2’, హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం. 1. ఈగల్ మాస్ మహారాజా రవితేజ ఈ ...
బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi) తన అంద చందాలతో సోషల్ మీడియాలోనూ షేక్ చేస్తోంది. తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది. తాజాగా బ్లూ సూట్‌లో ఫొటో షూట్ నిర్వహించిన ఈ అమ్మడు స్మార్ట్ లుక్స్‌తోనే అందరికీ చెమటలు పట్టించింది. ఎద అందాలు చూపిస్తూ వలపు వల విసిరింది. వామికా (Wamiqa Gabbi) ఎద సొగసులు చూసి నెటిజన్లు మైమరిచిపోతున్నారు. తన అందంతో బాలీవుడ్‌ను ఏలడం ఖాయమని ప్రశంసలు రిలీజ్‌కు సిద్ధమైన బాలీవుడ్ చిత్రం ‘బేబీ జాన్’లో ఈ అమ్మడు సెకండ్ ...
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో వసూళ్ల సునామి సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకూ రూ.1400 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్‌లో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది దీనిని గమనించకపోవచ్చు. ప్రస్తుతం ఈ ...
టాలీవుడ్‌లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రముఖ యూట్యూబర్ ప్రసాద్ బెహరా (Prasad Behera Arrest)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ సైతం విధించింది. ఏం జరిగిందంటే? సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్ ...
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేతిలోని ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ‘ (OG) ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా ‘ఓజీ’ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే ఓజీ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్‌డేట్ బయటకొచ్చింది. ఇందులో యంగ్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేహాశెట్టి స్పెషల్ సాంగ్ యంగ్ బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) ...
బాలీవుడ్ నటి అర్చిత అగర్వాల్ (Arrchita Agarwaal) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లీడ్ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee 5) ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయి (Manoj Bajpayee) హీరోగా చేశారు. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన అర్చిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంది. అర్చిత ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏళ్లు అయినప్పటికీ రీసెంట్‌గా వచ్చిన ‘దెస్‌పాచ్’ ...
‘పుష్ప 2‘ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యజమానులతో సహా అల్లు అర్జున్‌ను సైతం పోలీసులు అరెస్టు (sandhya theatre stampede case) చేశారు. ఆ మర్నాడు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై విడుదల కూడా అయ్యారు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఓ ...
Allu Arjun: సీఎం రేవంత్‌పై బన్నీ ఫ్యాన్స్ వైల్డ్ ఫైర్.. మీకో రూల్? బన్నీకో రూలా?
Celebrities Political Figure Social Media
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ సాక్షిగా బన్నీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆపై అతడు సైతం ప్రెస్‌మీట్ పెట్టి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు జేఏసీ నాయకులు బన్నీ ఇంటిపై దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అల్లు అర్జున్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే ...