• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’కు బిగ్‌ షాక్‌.. రిలీజ్‌ కష్టమేనా!

    గ్లోబల్‌ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరెకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రం బృందం వరుసగా ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాలపై అంచనాలు పెంచేస్తోంది. రిలీజ్‌కు సరిగ్గా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఈ క్రమంలో ఆ మూవీకి బిగ్‌ షాక్ తగలిదింది. ఈ సినిమాను తమిళంలో విడుదల చేయడానికి వీల్లేదంటూ అక్కడి నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. 

    ఫిర్యాదు ఎందుకంటే..

    కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ‘గేమ్ ఛేంజర్‘ సినిమా విడుదలను ఆపాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమిళనాడు నిర్మాత మండలికి విజ్ఞప్తి చేసింది. దర్శకుడు శంకర్‌ చేతిలోని ‘ఇండియన్‌ 3’ సినిమాను లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చేసేవరకూ ‘గేమ్‌ ఛేంజర్‌‘ను తమిళనాడులో విడుదల చేయవద్దని నిర్మాత మండలిని కోరింది. దీంతో తమిళనాడులో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా?  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 

    రంగంలోకి శంకర్..!

    తాజా ఫిర్యాదు నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) నిర్మాతలతో డైరెక్టర్‌ శంకర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ‘ఇండియన్‌ 3’ సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉండగా.. వాటిని ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ తర్వాత పూర్తిచేస్తానని శంకర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రస్తుతం శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్ వర్గాలు తెలియజేశాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్ణయాన్ని బట్టి ‘గేమ్‌ ఛేంజర్‌’పై తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకోనుంది. 

    ఎగ్జిబ్యూటర్ల ఆగ్రహం..!

    డైరెక్టర్ శంకర్‌ జరుపుతున్న చర్చలు విఫలమైనా ‘గేమ్‌ ఛేంజర్‌’కు తమిళనాట పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చను అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ లేవనెత్తిన అంశం లీగల్‌గా నిలబడదని సినీ వర్గాలు చెబుతున్నాయి. పైగా తమిళనాడు ఎగ్జిబ్యూటర్లు లైకా ప్రొడక్షన్‌ ఫిర్యాదుపై గరం గరంగా ఉన్నారని తెలుస్తోంది. ఆ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన గత రెండు చిత్రాలు ఫ్లాప్‌ కావడం, సంక్రాంతికి రావాల్సిన ‘విడాముయర్చి’ చిత్రాన్ని చివరి క్షణంలో వాయిదా వేయడంతో లైకా ప్రొడక్షన్స్‌పై ఎగ్జిబ్యూటర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా ‘గేమ్ ఛేంజర్‌’ను అడ్డుకుంటే లైకాకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని చెబుతున్నారు. ఇది గమనించి ఆ సంస్థ కూాడా ఫిర్యాదును వెనక్కి తీసుకోవచ్చని కోలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

    శంకర్‌ సక్సెస్‌ కొట్టేనా?

    ఇక ‘గేమ్ ఛేంజర్’ విషయానికొస్తే ఇందులో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో నటించారు. ఎస్‌జే సూర్య విలన్‌గా యాక్ట్ చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఎస్.ఎస్ థమన్ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజైన సినిమా ట్రైలర్, పాటలు ఫ్యాన్స్‌ని కిక్కిచ్చాయి. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న శంకర్‌.. ‘గేమ్‌ ఛేంజర్‌’ ద్వారా సక్సెస్‌ బాట పట్టాలని చూస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు కూడా ‘గేమ్ ఛేంజర్‌’పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv