హాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్లు
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ హాప్(HOP) పండగ ఆఫర్లను ప్రకటించింది. హాప్ లియో, లైఫ్ మోడళ్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. లియో మోడల్ పై రూ. 4,100, లైఫ్ మోడల్ పై రూ. 3,100 తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ల సాయంతో పండగల సీజన్లో అత్యధిక సేల్స్ రాబట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. సేల్స్‌ను బట్టి రానున్న దసరా, దీపావళి ఫెస్టివల్స్ టైంలో మరిన్ని ఆఫర్లు తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది.