• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Most Watched Web Series in 2024:  ఈ ఏడాదిలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వెబ్ సిరీస్‌లు ఇవే

    ప్రతీరోజు కొత్తగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదల అవుతున్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుని అత్యధిక వ్యూస్ పొందుతాయి. 2024 సంవత్సరం కూడా ఈ విషయంలో అందరి అంచనాలను అందుకుంది. పంచాయత్ లాంటి కామెడీ డ్రామాల నుండి హీరామండి లాంటి గ్రాండ్ సిరీస్‌ల వరకు, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించే హిందీ వెబ్ సిరీస్‌లు ఈ ఏడాది మోస్ట్ వాచ్‌డ్‌గా నిలిచాయి.

    ఈ కథనంలో 2024లో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 హిందీ వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకోండి. మీరు వీటిని చూడటం మిస్ అయితే, ఇక్కడ ఉన్న సమాచారం ద్వారా వెంటనే చూసేలా ప్లాన్ చేసుకోండి!

    1. పంచాయత్ సీజన్ 3 – ప్రైమ్ వీడియో

    ప్రైమ్ వీడియోలో ప్రసారమైన పంచాయత్ సీజన్ 3 ఈ ఏడాది అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా నిలిచింది. రెండేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ సీజన్‌ను అభిమానులు పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ సిరీస్‌కు 2.9 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇటీవలే నాలుగో సీజన్ షూటింగ్ ప్రారంభమైందని ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. 

    2. హీరామండి: ది డైమండ్ బజార్ – నెట్‌ఫ్లిక్స్

    సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హీరామండి: ది డైమండ్ బజార్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సిరీస్. నాటకీయంగా, ఆకర్షణీయంగా రూపొందిన ఈ సిరీస్ 2.1 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. 

    3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ – ప్రైమ్ వీడియో

    బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. సిద్దార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, ఇషా తల్వార్ తదితర నటీనటుల ప్రభావంతో ఈ సిరీస్ 1.95 కోట్ల వ్యూస్ సాధించింది.

    4. కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 – నెట్‌ఫ్లిక్స్

    జేఈఈ, నీట్ పరీక్షల కోసం కోటా నగరంలో సిద్ధమవుతున్న విద్యార్థుల జీవితాల చుట్టూ తిరిగే కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీజన్ 1.57 కోట్ల వ్యూస్‌ను అందుకుంది.

    5. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 – హాట్‌స్టార్

    హనుమంతుడి గాథ ఆధారంగా రూపొందిన యానిమేషన్ సిరీస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఈ ఏడాది రెండు సీజన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రెండు సీజన్లు కలిపి 1.48 కోట్ల వ్యూస్‌ను సాధించాయి.

    6. షోటైమ్ – హాట్‌స్టార్

    సినిమా ప్రపంచం వెనుక జరుగే ఇంట్రెస్టింగ్ కథతో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన షోటైమ్, ఈ ఏడాది అత్యంత విశేష ప్రేక్షకాదరణ పొందిన మరో సిరీస్. ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ 1.25 కోట్ల వ్యూస్ అందుకుంది.

    7. గుల్లక్ సీజన్ 4 – సోనీలివ్

    కుటుంబం, కామెడీతో ప్రేక్షకుల్ని అలరించిన గుల్లక్ సీజన్ 4 ఈ ఏడాది సోనీలివ్‌లో హిట్ అయింది. మొదటి మూడు సీజన్ల విజయానంతరం వచ్చిన ఈ కొత్త సీజన్ 1.21 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

    8. మహారాణి సీజన్ 3 – సోనీలివ్

    రాజకీయ నేపథ్యంతో రూపొందిన మహారాణి వెబ్ సిరీస్ మూడో సీజన్ ఈ ఏడాది విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీజన్ 1.02 కోట్ల వ్యూస్‌ను సాధించింది.

    9. కిల్లర్ సూప్ – నెట్‌ఫ్లిక్స్

    మనోజ్ బాజ్‌పాయీ, కొంకనా సేన్ శర్మ నటించిన కిల్లర్ సూప్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సిరీస్ 92 లక్షల వ్యూస్ సాధించింది.

    10. జమ్నాపార్ – అమెజాన్ మినీటీవీ

    ఢిల్లీలోని వెనుకబడిన ప్రాంతం నుంచి కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువకుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన జమ్నాపార్ వెబ్ సిరీస్. అమెజాన్ మినీటీవీలో ప్రసారమైన ఈ సిరీస్ 92 లక్షల వ్యూస్‌ను సంపాదించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv