సంక్రాంతి పండుగకు బాలకృష్ణ సినిమాలు అంటే ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ అన్నట్లుగా మారింది. బాలయ్య నటించిన చిత్రాలు సంక్రాంతి విడుదల కాగానే సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన వీరసింహా రెడ్డి మిక్స్డ్ టాక్‌ను అధిగమించి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
ఈసారి బాలయ్య మరింత క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా డాకు మహారాజ్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదటి నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్ బాలయ్య మాస్ అవతార్‌ను కళ్లకు కట్టింది.
రిలీజ్ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్
తాజాగా డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. మొదట విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, తాజా రిలీజ్ ట్రైలర్ మాత్రం నందమూరి అభిమానులకు మాస్ ట్రీట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లో బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు.
ఈ డైలాగ్స్ గమనించారా?(Daaku Maharaaj Dialogues)
ఈ ట్రైలర్‌లో బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి:
- “ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు.. వైల్డ్ యానిమల్”
- “రాయలసీమ మాలూమ్ హే తెరకు.. ఓ బి మై అడ్డా”
- “ఎవడైనా చదవడంలో మాస్టర్స్ చేస్తాడేమో.. నేను చంపడంలో మాస్టర్స్ చేశా”
ఈ మాస్ డైలాగ్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌లో బాలయ్య శివతాండవం లాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి.
డాకు మహారాజ్ చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా, సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
సంక్రాంతికి హిట్ గ్యారంటీ?
సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాలు విజయవంతంగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి కూడా డాకు మహారాజ్ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, సంక్రాతికి వస్తున్నాం సినిమాలతో పోటీపడాల్సి వస్తోంది. వీటిలో గేమ్ ఛేంజర్ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సంక్రాంతి బరిలో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్