• TFIDB EN
  • నందమూరి బాలకృష్ణ
    ప్రదేశం: చెన్నై
    నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. బాలకృష్ణ నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు తమిళనాడులోని చెన్నైలో 1960 జూన్ 10న జన్మించారు. NTR 12 మంది సంతానంలో బాలయ్య ఆరవ కుమారుడు. బాలకృష్ణ బాల్యం చెన్నైలోనే గడిచింది. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో ఆయన కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

    నందమూరి బాలకృష్ణ వయసు ఎంత?

    బాలకృష్ణ వయసు 64 సంవత్సరాలు

    నందమూరి బాలకృష్ణ ముద్దు పేరు ఏంటి?

    బాలకృష్ణ , బాలయ్య , NBK , నటసింహం , యుగరత్న

    నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత?

    5'8'' (174cm)

    నందమూరి బాలకృష్ణ అభిరుచులు ఏంటి?

    ఉదయాన్నే లేచి దేవుడికి పూజ చేయడం, పుస్తకాలు చదవడం, కుకింగ్

    నందమూరి బాలకృష్ణ ఏం చదువుకున్నారు?

    బీకాం

    నందమూరి బాలకృష్ణ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    నిజాం కాలేజీ, హైదరాబాద్‌

    నందమూరి బాలకృష్ణ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    ఇండస్ట్రీలో చిరంజీవితన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని బాలకృష్ణ చాలా సందర్భాల్లో వెల్లడించారు. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ కూడా తన మిత్రుడు, సోదరుడు అంటూ బాలకృష్ణ తాజాగా వ్యాఖ్యానించారు.

    నందమూరి బాలకృష్ణ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    ఇప్పటివరకూ 108 చిత్రాల్లో బాలకృష్ణ నటించారు.

    నందమూరి బాలకృష్ణ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    హాట్‌ స్టార్‌లో ఈ టాప్ హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు తెలుసా?Editorial List
    హాట్‌ స్టార్‌లో ఈ టాప్ హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు తెలుసా?
    2023లో బెస్ట్ తెలుగు సినిమాలు.. వీటిని మాత్రం ఓటీటీల్లో మిస్ కావొద్దు!Editorial List
    2023లో బెస్ట్ తెలుగు సినిమాలు.. వీటిని మాత్రం ఓటీటీల్లో మిస్ కావొద్దు!
    Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?Editorial List
    Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?

    నందమూరి బాలకృష్ణ తల్లిదండ్రులు ఎవరు?

    నందమూరి తారకరామారావు, బసవతారకం. దివంగత రామారావు టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ నటులు. 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించారు. 300 పైగా చిత్రాలు చేశారు.1983 - 1995 మధ్య మూడు పర్యాయాలు ఉమ్మడి ఏపీకి సీఎంగా చేశారు.

    నందమూరి బాలకృష్ణ‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    "రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. బాలకృష్ణకు ఆరుగురు సోదరులు, నలుగురు సిస్టర్స్ ఉన్నారు. సోదరులు: నందమూరి రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ,హరికృష్ణ(యాక్టర్‌), మోహనకృష్ణ, రామకృష్ణ, జయ శంకర్‌ కృష్ణ. వీరిలో హరికృష్ణ టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. టీడీపీ పార్టీ తరపున ఎంపీ కూడా అయ్యారు. సిస్టర్స్‌: లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి (పొలిటిషియన్‌), నారా భువనేశ్వరి (చంద్రబాబు భార్య), ఉమా మహేశ్వరి. వీరిలో పురందేశ్వరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున కేంద్ర మంత్రిగానూ ఆమె పని చేశారు.

    నందమూరి బాలకృష్ణ పెళ్లి ఎప్పుడు అయింది?

    1982లో వసుంధర దేవిని బాలకృష్ణ పెళ్లి చేసుకున్నారు.

    నందమూరి బాలకృష్ణ కు పిల్లలు ఎంత మంది?

    బాలకృష్ణకు ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. మెుదటి అమ్మాయి బ్రాహ్మిణిని మేనల్లుడు లోకేష్‌ (చంద్రబాబు - భువనేశ్వరి కుమారుడు)కు ఇచ్చి పెళ్లి చేశారు. రెండో అమ్మాయి తేజస్వినీని గీతం యూనివర్సిటీ యజమాని భరత్‌కు ఇచ్చి వివాహం చేశారు. మూడో సంతానం మోక్షజ్ఞ తేజ.. బాలకృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

    నందమూరి బాలకృష్ణ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    బాలకృష్ణ పాపులర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన నటన, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌ ఆయన్ను ప్రత్యేకంగా నిలిపాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్‌ సినిమాలు చేయాలంటే బాలయ్య తర్వాతే ఎవరైన అన్న ముద్రను వేశారు.

    నందమూరి బాలకృష్ణ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తాతమ్మ కల' చిత్రంతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ 11 చిత్రాల్లో కనిపించారు. అయితే సోలో హీరోగా లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం మాత్రం 'సాహసమే జీవితం'.

    తెలుగులో నందమూరి బాలకృష్ణ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన నందమూరి బాలకృష్ణ తొలి చిత్రం ఏది?

    నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ పాత్రలు పోషించారు. వాటిలో ఆదిత్య 369, నిప్పు రవ్వ, భైరవ ద్వీపం, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహా, అఖండ, భగవంత్‌ కేసరి చిత్రాల్లో వేసిన పాత్రలు అత్యుత్తమమైనవిగా చెప్పవచ్చు.

    నందమూరి బాలకృష్ణ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Nandamuri Balakrishna Stage Performance

    Watch on YouTube

    NBK Stage Performance

    Watch on YouTube

    Balayya Stage Performance

    నందమూరి బాలకృష్ణ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Dislogues

    Watch on YouTube

    Best Dialogues

    Watch on YouTube

    NBK Best Dislogues

    నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు.

    నందమూరి బాలకృష్ణ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    కోడి పలావు, చికెన్‌ బిర్యానీ

    నందమూరి బాలకృష్ణ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నందమూరి బాలకృష్ణ కు ఇష్టమైన నటి ఎవరు?

    నందమూరి బాలకృష్ణ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    నందమూరి బాలకృష్ణ ఫెవరెట్ సినిమా ఏది?

    నందమూరి బాలకృష్ణ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెలుపు

    నందమూరి బాలకృష్ణ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    BMW 7 Series Porsche Panamera

    నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    2024 ఎన్నికల అఫిడవిట్‌లో బాలకృష్ణ తన ఆస్తుల విలువను రూ.482 కోట్లుగా ప్రకటించారు. ఇందులో చర ఆస్తులు రూ.283 కోట్లు కాగా, స్థిర ఆస్తులు రూ.199 కోట్లు. 5 కేజీల బంగారం, 156 కేజీల వెండి, 580 క్యారెట్స్‌ వజ్రాలు ఉన్నాయని అఫిడవిట్‌లో చూపించారు. వాటి విలువ మెుత్తంగా రూ.7 కోట్లు ఉంటుంది.

    నందమూరి బాలకృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.22 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

    నందమూరి బాలకృష్ణ సోషల్‌ మీడియా లింక్స్‌

    నందమూరి బాలకృష్ణ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్స్‌ - 2001

      బెస్ట్‌ యాక్టర్‌ - నరసింహానాయుడు

    • నంది అవార్డ్స్‌ - 2010

      బెస్ట్‌ యాక్టర్‌ - సింహా

    • నంది అవార్డ్స్‌ - 2014

      బెస్ట్‌ యాక్టర్‌ - లెజెండ్‌

    • సినిమా అవార్డ్స్‌ - 2010

      బెస్ట్‌ యాక్టర్‌ - సింహా

    • సైమా అవార్డ్స్‌

      బెస్ట్‌ యాక్టర్‌ - లెజెండ్‌

    • టి. సుబ్బిరామిరెడ్డి అవార్డ్స్‌ - 2010

      బెస్ట్‌ యాక్టర్‌ - సింహా

    • టి. సుబ్బిరామిరెడ్డి అవార్డ్స్‌ - 2011

      బెస్ట్ యాక్టర్‌ - శ్రీరామ రాజ్యం

    • టి. సుబ్బిరామిరెడ్డి అవార్డ్స్‌ - 2014

      బెస్ట్ యాక్టర్‌ - లెజెండ్‌

    నందమూరి బాలకృష్ణపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు.

    నందమూరి బాలకృష్ణ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి యజమానిగా ఉన్నారు. అలాగే ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వ్యహరిస్తున్నారు.

    నందమూరి బాలకృష్ణ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    వెగ శ్రీ గోల్డ్‌ అండ్‌ డైమెండ్స్‌ యాడ్‌లో బాలకృష్ణ నటించారు.

    నందమూరి బాలకృష్ణ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    ఏపీలోని తెలుగు దేశం పార్టీలో బాలకృష్ణ క్రీయాశీలకంగా ఉన్నారు.

    నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన నియోజకవర్గం ఏంటి?

    ఏపీలోని హిందూపురం నియోజకవర్గం 2014 నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
    నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నందమూరి బాలకృష్ణ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree