• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సరికొత్త లుక్‌తో బాలయ్య

  భగవంత్‌ కేసరి’తో దసరా విజయాన్ని అందుకున్నారు హీరో బాలకృష్ణ మరో మూవీకి రెడీ అయ్యారు. తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రం ఈ నెల 6నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనుందని సమాచారం. 1980ల నేపథ్యం ఉన్న మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు.

  స్టార్‌ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా!

  ‘భగవంత్‌ కేసరి’ సినిమా విజయంతో బాలయ్య ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. అయితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసే గాసిప్‌ ఒకటి బయట చక్కర్లు కొడుతోంది. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ – బాలయ్య కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ‘NBK100’గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పవచ్చు.

  భగవంత్ కేసరి రికార్డు కలెక్షన్లు

  బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 106. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. మరోవైపు అమెరికాలోనూ భగవంత్ కేసరి అదరగొడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సంపాదించడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా శ్రీలీల కూతురుగా నటించింది. థమన్ సంగీతం అందించగా.. అనిల్ రావుపూడి డైరెక్ట్ చేశారు.

  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్పష్టత

  మోక్షజ్ఞ ఎంట్రీపై నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాదే మోక్షజ్ఞ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు. ‘నేను రాసిన ఆదిత్య 999 మ్యాక్స్ కథ ఒకటి ఉంది. ఈ కథను నేను ఒక రాత్రిలో రాసేశాను. అలాగే, ఇంకో కథ కూడా ఉంది. మరికొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, ఏ కథతో మోక్షజ్ఞ మొదటి సినిమా తెరకెక్కుతుంది అనేది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ, వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా వస్తాడు’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

  భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ

  బాలయ్య నటించిన భగంత్ కేసరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయలను ట్వీట్ చేస్తున్నారు. ప్రతిఒక్కరు తమ కూతుళ్లతో తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. బాలకృష్ణ చాలా కొత్తగా కనిపించారు. డైలాగ్స్, యాక్షన్ సీన్లు బాగున్నాయి. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరింది. సెకండాఫ్ మాస్ ఎంటర్‌టైనర్. థమన్ బీజీఎం కాస్త నిరుత్సాహపరిచింది. కథ బాగున్నా అనిల్ రావుపూడి నరేషన్ ప్లాట్‌గా ఉంది అని చెబుతున్నారు. పూర్తి రివ్యూ కాసెపట్లో..

  భగవత్ కేసరి రికార్డు బుకింగ్స్

  భగవంత్ కేసరి అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. నిన్న టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవగా హాట్‌ కేక్‌ల్లాగా అమ్ముడు పోతున్నాయి. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాగా ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల బాలకృష్ణ కూతురుగా నటించింది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

  ‘భగవంత్ కేసరి’ తాజా అప్‌డేట్

  బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో భగవంత్ కేసరికి సెన్సార్ లో ఒక్క కట్ కూడా చెప్పలేదు. దీనితో సినిమాని మేకర్స్ ఎలా అయితే సెన్సార్‌కి పంపించారో అదే విధంగా జీరో కట్స్‌తో సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. దీనితో ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. హీరోయిన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ నెల 19న విడుదలకు … Read more

  వరంగల్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్

  భగవంత్ కేసరి ట్రైలర్ లాంచింగ్ వేదిక ఖరారైంది. ఈ సినిమా ట్రైలర్‌ను వరంగల్‌లోని ఆర్ట్స్‌ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో హీరో బాలకృష్ణ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 8న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. తండ్రి కూతుళ్ల అనుబంధమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావుపూడి తెరకెక్కిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కానుంది.

  ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

  సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.

  ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’: బాలకృష్ణ

  సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అని చెప్పుకొచ్చారు. సినిమా వాళ్లు స్పందించక పోవడం కూడా పట్టించుకోనని తెలిపారు. ఏపీలో సైకో పరిపాలన నడుస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదని చెప్పారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ పేర్కొన్నారు.