• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటి నుంచి ఇంటర్‌ క్లాస్‌లు

    తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈరోజుతో వేసవి సెలవులు ముగియడంతో కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు రెడీ అవుతున్నారు. మొత్తంగా ఈ విద్యాసంవత్సరం(2023-24)లో 227 రోజులు ఇంటర్ కాలేజీలు నడవనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ తొలి విడత ప్రవేశాలు జూన్ 14 వరకు జరగనున్నాయి. ప్రవేశాల పూర్తి అనంతరం పస్టియర్ క్లాసులు జరగనున్నాయి.

    తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు

    తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడని వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నట్లు వివరించింది. ఈరోజు వరంగల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యపేట, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఈమేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

    నా గెలుపుల్లో కాపులదే సగభాగం: కొడాలి

    మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వంగవీటి రాధా గుడివాడ నుంచి పోటీ చేయడు. రాధా నా సొంత తమ్ముడి లాంటివాడు, 20 ఏళ్ల నా రాజకీయ జీవితంలో వచ్చిన నా గెలుపుల్లో కాపులదే సగభాగం. చచ్చినా రాజకీయాల కోసం కాపులను విమర్శించను. టీడీపీవాళ్లు నేను మాట్లాడిన దాన్ని కట్ పేస్ట్ చేసి వీడియోలు వదిలారు. అవి చూసి జనసైనికులు స్పందిస్తున్నారు, జీవితంలో ఇప్పటివరకు రంగాకు వ్యతిరేకంగా జరిగిన ఏ కార్యక్రమంలోనూ నేను పాల్గొనలేదు’ అని చెప్పుకొచ్చారు.

    ముస్లింలను వాడుకుంటున్నారు: అసదుద్దీన్

    అన్ని పార్టీలు ముస్లింలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని అంటున్నారు.. ఒక్క బీజేపీ ఎంపీ అయినా ముస్లింల సంక్షేమం గురించి మాట్లాడుతారా? యూపీలో ఒక్క స్థానం గెలవలేదంటున్నారు.. మేం గెలవమని మాకు తెలుసు, నా పోరాటం రేపటి కోసం. దళితులకు రూ.10 లక్షలు ఇస్తున్నారు.. కేసీఆర్ దళిత బంధులాగా ముస్లింలకు ఆర్థిక సాయం చేయాలి.. అయినా ప్రభుత్వం ఇవ్వడం లేదు. వైద్యశాఖ మంత్రి ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. ఉస్మానియా … Read more

    శ్రీవారి దర్శనానికి 10 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల వరకు సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,871 మంది భక్తులు దర్శించుకున్నారు. మరో 32,859 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. మంగళవారం వెంకన్న హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 తగ్గి రూ.55,450కి పడిపోయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.110 తగ్గి రూ.60,490 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి ధర రూ.500 తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.76,500కు చేరింది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

    హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్ల గ్యారేజీలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగింది. ఎల్బీనగర్‌లోని కార్ మెన్ కార్ అనే గ్యారేజ్‌లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న టింబర్‌డిపోకు కూడా మంటలు అంటుకున్నాయి. ఫైరింజన్లతో మంటలు ఆర్పే క్రమంలో గ్యారేజీలో ఉన్న సిలిండర్లు పేలడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 50 కార్లు ధగ్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

    ఏపీలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదేసమయంలో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే ఉంటాయని పేర్కొంది.