• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఓటర్లకు రామ్‌గోపాల్‌ వర్మ సూచనలు

  హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్రాటు చేసిన ఆర్ట్‌ ఫర్‌ డెమోక్రసీ కార్టూన్‌ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు పలు సూచనలు చేశారు. నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని సూచించారు.

  టీడీపీ-జనసేన గెలుపు ఖాయం: లోకేష్

  2024లో టీడీపీ-జనసేన గెలుపు ఖాయమని టీడీపీ నేత నారా లోకేశ్‌ అన్నారు. 212వరోజు ముమ్మిడివరంలో లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులకు భయపడే కుటుంబం కాదన్నారు. తాను చేస్తున్నపాదయాత్ర అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ పిల్ల సైకోలు తాననేమి చేయలేవని విమర్శించారు. ఏ అధికారులైతే జగన్‌ మాట విన్నారో.. వాళ్లంతా దిల్లీకి క్యూ కడుతున్నారని లోకేష్ పేర్కొన్నారు.

  చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా

  IRR కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం విచారణ డిసెంబర్‌ 1కి వాయిదా వేసింది.

  జగన్‌ పాలనకు ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలే: లోకేష్

  సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ తరలించేందుకు జగన్‌ జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో సెక్రటేరియట్‌లో కూర్చుని జగన్‌ ఇదేం రాజధాని అంటున్నారని విమర్శించారు. వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే కంపెనీలను జగన్ రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పాలన ఎక్స్‌పైరీ డేట్‌ 3 నెలలు మాత్రమే ఉందన్నారు.

  IRR కేసు.. చంద్రబాబుపై చర్యలొద్దు: హైకోర్టు

  అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి రాష్ట్ర హైకోర్టు విచారణను వాయిదా వేసింది.

  డీప్‌ఫేక్‌పై శ్రేణులు అప్రమతంగా ఉండండి: కేటీఆర్

  డీప్‌ఫేక్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో డీప్‌ఫేక్‌లు చాలా రావొచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ రానున్న 4-5 రోజుల్లో అనేక ఫేక్ వీడియోలు, ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ వాళ్లు ఇలా చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో ఓటర్లను చైతన్యం చేయాలని కేటీఆర్ సూచించారు.

  కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు: KTR

  తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు, ప్రాజెక్టుల కోసం రూ.1.70 లక్షల కోట్టు ఖర్చు పెట్టడమే కాకుండా.. నాలుగేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నిర్మించినట్లు వివరించారు. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని కేటీఆర్ సూచించారు.

  చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా

  అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ వాయిదా పడింది. నేడు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు రేపటికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించగా శుక్రవారం సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

  27 నుంచి మళ్లీ లోకేష్ పాదయాత్ర

  టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 27 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. డిసెంబరు నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడంతో సెప్టెంబర్ 9 నుంచి లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిలు లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు. పొదలాడ నుంచే తిరిగి లోకేష్ యాత్ర ప్రారంభం కానుంది.

  కాంగ్రెస్ ఉంటే దేశాభివృద్ధి కష్టమే: మోదీ

  కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రతీక అని విమర్శించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ చోరులకు, అల్లరి మూకలకు అప్పగించిందని ఆరోపించారు.