• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan Kalyan: ‘కంటెంట్ ఉన్నోడికి కటోట్‌ చాలు’ వీడియో వైరల్!

    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కచ్చితంగా టాప్‌లో ఉంటారు. వీరి నుంచి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అటువంటి టాప్‌ హీరోలు ఒక సినిమాను ప్రమోట్‌ చేస్తే ఇంకెంత అటెన్షన్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. పవన్‌ కల్యాణ్‌ సైతం ఏపీ ఉపముఖ్యమంత్రి తన మూవీ షూటింగ్స్‌లోనే పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘డ్రింకర్‌ సాయి’ సినిమా యూనిట్‌ వారిచేత సరికొత్త ప్రమోషన్స్‌కు తెర లేపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

    కటౌట్‌తో ప్రమోషన్స్‌

    ధర్మ, ఐశ్వర్య జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డ్రింకర్‌ సాయి’. బ్రాండ్ ఆఫ్‌ బ్యాడ్ బాయ్స్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను డిసెంబర్‌ 27న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు కిరణ్‌ తిరుమలశెట్టి చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. వారి సమక్షంలో తన సినిమా ఈవెంట్‌ జరగాలన్న ఉద్దేశ్యంతో పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ పోస్టర్‌ను ఏర్పాటు చేశాడు. హీరో ధర్మ.. ప్రభాస్‌కు అభిమాని కావడంతో డార్లింగ్‌ పోస్టర్‌ను సైతం వేదికపై పెట్టారు. ఇది చూసి ఈవెంట్‌కు వచ్చిన వారంతా చప్పట్లో వారిని అభినందించారు. 

    పబ్లిసిటీ స్టంట్‌లో భాగమేనా?

    ప్రస్తుతం పెద్ద హీరోల చిత్రాలకు తప్ప చిన్న సినిమాలకు థియేటర్లలో పెద్దగా ఆదరణ లభించడం లేదు. దీంతో తమ సినిమాను ప్రమోట్‌ చేసేందుకు మేకర్స్‌ వినూత్న పద్దతులను అనుసరిస్తున్నారు. కొత్త తరహా ప్రమోషన్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రింకర్‌ సాయి టీమ్‌ కూడా స్టేజీపై పవన్‌, ప్రభాస్‌ పోస్టర్లను ఏర్పాటు చేసి ఉండొచ్చు. ప్రభాస్‌, పవన్‌పై అభిమానంతోనే డైరెక్టర్‌, హీరో తమ హీరోల పోస్టర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఇది పబ్లిసిటీ స్టంట్ అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆయా హీరోల అభిమానులను తమ సినిమా చూసేలా ప్రేరేపించడం కోసమే వారు ఈ విధంగా చేసి ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ‘డ్రింకర్‌ సాయి’ టీమ్‌ ఆలోచనకు సెల్యూట్‌ చేయాల్సిందేనని అంటున్నారు. 

    ఆ సినిమాలు కూడా అంతే..

    ఇటీవల విడులైన ‘మట్కా‘ (Matka) సినిమా కోసం హీరో వరుణ్‌ తేజ్‌ (Varun Tej) వినూత్నంగా ప్రమోషన్స్‌ చేసి నెట్టింట వైరల్‌గా మారాడు. తన గత చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని చేసిన వీడియో అప్పట్లో తెగ ట్రెండ్ అయ్యింది. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) బామ్మర్ది సుధీర్‌ బాబు (Sudheer Babu) కూడా తన రీసెంట్‌ చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Ma Nanna Super Hero) సినిమాకు సరికొత్తగా ప్రమోషన్స్‌ చేశాడు. సినిమా బ్యానర్‌ను సిద్ధం చేసి పలువురు సెలబ్రిటీలు ఫొటోలు తీసుకుంటున్న టైమ్‌లో పోస్టర్‌ కనిపించేలా ప్రమోషన్స్ నిర్వహించారు. ఆ ప్రమోషన్స్ కూడా బాగా క్లిక్ అయ్యాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv