• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అబ్బాయిల లవ్‌ ప్రపోజల్‌కు " నో " చెప్పడమెలా?
  శర్వానంద్- రక్షితారెడ్డి నిశ్చితార్థం... రక్షితా రెడ్డికి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
  నేడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న కేఎల్ రాహుల్- అతియ.. పెళ్లి విశేషాలు ఇవే..
  అతిపెద్ద గిరిజన జాతర వచ్చేసింది.. జనవరి 21న నాగోబా జాతర ప్రారంభం
  See More

  వివాహేతర సంబంధాలకు ప్రధాన కారణాలివే..!

  ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు అనేకం అవుతున్నాయి. రిలేషన్ షిప్‌లో భాగస్వాముల మధ్య మనస్పర్దలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శారీరక కోరికలు తీరకపోవడం, ఒంటరితనం, ఒకరికొపై మరొకరికి నమ్మకం లేకపోవడం, ప్రేమ తగ్గిపోవడం కూడా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ అవసరాల కోసం వేరొక వ్యక్తిని స్త్రీ, పురుషులు ఆశ్రయిస్తున్నారట. ఈ సమస్య నుంచి బయట పడేందుకు భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని, ఒకరికొకరు కూర్చుని మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు.

  త్వరగా నిద్ర పట్టడానికి చిట్కాలు

  అర్ధరాత్రి కొంతమందికి నిద్ర పట్టదు. ఇక చేసేది ఏమి లేక ఫోన్ పట్టుకొని టైంపాస్ చేస్తారు. అయితే, కొన్ని అలవాట్లు చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే ముందు తప్పనిసరిగా ఒక గ్లాస్ పాలు తాగాలని చెబుతున్నారు. ఇది అలసటను పోగొట్టి బాగా నిద్రపట్టేలా చేస్తాయట. అరికాలిపై 2 నుంచి 5 నిమిషాలు లైట్‌గా మసాజ్ చేస్తే ఆక్యు ప్రెషర్ పాయింట్లపై రిలీఫ్ కలిగి నిద్ర వస్తుందన్నారు. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవటం కూడా ముఖ్యం. గోరువెచ్చిని నీటితో స్నానం చేయడం, ఫోన్ వంటివి … Read more

  మద్యం అతిగా తాగుతున్నారా?

  మద్యం అతిగా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ, దీనివల్ల వృద్ధాప్యం కూడా త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వయసు మీద పడుతున్న కొద్ది అవయవాలను, మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఫలితంగా త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్ది దాహం తక్కువై శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుందని చెబుతున్నారు.

  పెళ్లికి ముందు ఇవన్నీ ఆలోచిస్తున్నారా?

  ప్రస్తుతం సమాజంలో బ్రేకప్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా పెటాకులు అవుతున్న సంఖ్య కూడా అధికమే. అందుకే వివాహానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలంటున్నారు. ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే గొడవలు జరగవు. అప్పటివరకు స్వేచ్ఛగా గడిపిన మీరు.. పెళ్లి తర్వాత బాధ్యతలను మోయాల్సి ఉంటుందని గ్రహిస్తే మంచింది. సంతానం, వృత్తిపరమైన విషయాల్లో ముందే అవగాహనకు వస్తే కలహాలు ఉండవు.

  అర్ధరాత్రి తింటున్నారా?

  ప్రస్తుతం చాలామంది ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. పని వల్లనో, పార్టీలు కారణమో కానీ రాత్రి వేళ తినేవారి సంఖ్య పెరిగింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రి తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ఏర్పడి బరువు పెరగటమే కాక ఊభకాయం వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మసాలా ఉండే జంక్, ఫ్రైడ్ వంటి ఫుడ్స్‌ సరిగా అరగక ఇబ్బంది పెడతాయి. అంతేకాదు, నిద్రకు కూడా ఆటంకం ఏర్పడి మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.

  స్టెమ్ సెల్స్‌తో చికెన్ మాంసం ఉత్పత్తి

  కృత్రిమ మాంసం ఉత్పత్తిలో మరో ముందడుగు పడింది. కోడి స్టెమ్ సెల్స్‌తో కణాలను వృద్ధి చేసి తయారు చేసిన మాంసంలో అవసరమైన పోషకాలు ఉన్నాయని అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. అంటే భవిష్యత్తులో ఇక జంతువులను వధించడం తగ్గిపోతుంది. అమెరికాలో కృత్రిమ మాంసం తినడానికి దాదాపు 10శాతం మంది ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే, ఈ మాంసం ఇండియాలో అందుబాటులోకి రావడానికి మరో ఐదారేళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కోడి మాంసాన్ని వృద్ధి చేశారు. తదనంతరం మేక, గొర్రె.. ఇలా కావాల్సిన జంతు మాంసాన్ని … Read more

  గుండె రక్తనాళాల్లో పూడికలు ఎలా వస్తాయి?

  గుండె రక్తనాళాల్లో పూడికలు మాసం ఎక్కువగా తినడం వల్ల వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇది పేగుల్లోని సూక్ష్మక్రిముల ద్వారా పెరుగుతాయని వెల్లడించారు. మాంసంలో ఎల్- కార్నిటైన్‌ రసాయనం, కోలిన్ పోషకం ఎక్కువగా ఉంటాయి. వీటిని పేగుల్లోని సూక్ష్మక్రిములు జీర్ణం చేసుకుంటాయి. ఈ క్రమంలోనే కొన్ని మెటబాలైట్లు పుట్టుకొచ్చి పూడికలు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. మెటబాలైట్లు గ్రంథుల వలే పనిచేసి హర్మోన్ల మాదిరిగా రక్తం ద్వారా శరీరమంతటా ప్రయాణిస్తూ ప్రభావం చూపుతాయి. ఇలా గుండె జబ్బులు పెరుగుతాయి.

  స్మార్ట్‌ఫోన్లతో ‘టెక్‌నెక్‌’ బారిన పడుతున్న పిల్లలు

  రోజులో చాలా సమయం స్మార్ట్‌ఫోన్లు వాడటం వల్ల ఎన్నో దుష్ఫలితాలు ఉంటాయని తెలుసు. అయితే తాజాగా మరో కొత్త సమస్య వస్తోంది.నిరంతరం స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల టెక్‌నెక్‌ లేదా టెక్స్ట్‌నెక్‌ అనే వింత జబ్బు వస్తోంది. దీని కారణంగా మెడ, భుజాల నొప్పి, తలనొప్పి మాత్రమే గాక వేళ్లు వణకడం వంటి సమస్యలు కూడా వస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇండియాలోనూ టెక్‌నెక్‌ పెరుగుతోందని… ముఖ్యంగా చిన్నపిల్లల్లో అధికంగా ఉంటోందని పలువురు వైద్యులు అంటున్నారు.

  నిద్రలేకపోతే ఇన్ని తిప్పలు?

  సాధారణంగా మనిషికి రోజుకి 7-9 గంటల నిద్ర అవసరం. నిద్ర తగ్గితే మెదడు, శరీరం కోలుకోవటం కష్టమవుతుంది. అలసట, నీరసం తలెత్తుతాయి. హుషారు, ఉత్సాహం తగ్గుతాయి. ఏకాగ్రత కొరవడుతుంది. పోషక విలువలు లేని జంక్‌ఫుడ్, చిరుతిళ్లు తినాలనే కోరికలు ఎక్కువ అవుతాయి. రాత్రి నిద్ర తగ్గినప్పుడు పగటిపూట అరగంట సేపు కునుకు తీస్తే కొంతవరకు ఉపయోగపడొచ్చు. అంతకన్నా ఎక్కువసేపు పడుకుంటే నిద్ర ఆవహిస్తోంది. అయితే పగటి కునుకుతో రాత్రి నిద్ర భర్తీ కాదు.

  ‘కోకోనట్ టీ’ ఎప్పుడైనా తాగారా?

  సాధారణంగానే చాయ్ అంటే నచ్చని వారుండరు. పైగా కొందరికి ఫ్లేవర్లు ఎంతో ఇష్టం. అల్లం చాయ్, మసాలా టీ, ధమ్ చాయ్.. ఇలా చాలానే రకాలుంటాయి. కానీ, కోకోనట్ టీ గురించి విన్నారా? అంటే కొబ్బరిని వేసి టీ చేయడం కాదు. కొబ్బరి చిప్పలో చాయ్ చేయడం. ప్రస్తుతం ఈ కొబ్బరిచిప్ప చాయ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మామూలు పాత్ర స్థానంలో కొబ్బరి చిప్పను గ్యాస్ స్టవ్‌పై పెట్టి టీ చేశారు. ముందుగా కొన్ని నీళ్లు పోసి అందులో అల్లం వేసి మరిగించారు. … Read more