• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Most Searched Travel Destinations 2024: భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పర్యాటక ప్రదేశాలు ఇవే!

    కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రతి సంవత్సరం కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలను మనం స్వీకరించేందుకు సిద్ధమవుతాం. ఈ ప్రయాణంలో ట్రావెలింగ్ అంటే చాలామందికి ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది. కొత్త ప్రదేశాలను అన్వేషించడం, కొత్త అనుభవాలను పొందడం జీవితానికి ఓ కొత్త అర్థాన్ని తీసుకొస్తుంది.

    ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పర్యాటనకు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. ఈ క్రమంలో 2024లో భారతీయులు గూగుల్లో వెతికిన టాప్ 10 ప్రదేశాలు ఎక్కడన్నది గూగుల్ వెల్లడించింది. ఈ లిస్టులో చరిత్ర, సంస్కృతి, ప్రకృతి(Most Searched Travel Destinations 2024) అందాలు కలగలిపిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అత్యద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఈ ఏడాదిలో పర్యాటకుల మనసులు దోచుకున్న ఈ టాప్ డెస్టినేషన్లను ఇప్పుడు తెలుసుకుందాం.

    1. అజర్‌బైజాన్

    అజర్‌బైజాన్ చరిత్రకు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. ఈ దేశం 2024లో గూగుల్ సెర్చ్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. ఆగ్నేయ యూరప్, పశ్చిమ ఆసియా మధ్య ఉన్న ఈ దేశం ప్రత్యేకమైన సంస్కృతికి నిలయం. 2023 జనవరి నుంచి జూలై  మధ్యలో 1,40,000 మంది భారతీయ పర్యాటకులు అజర్‌బైజాన్‌ను సందర్శించారు. పర్యాటకుల సంఖ్య పెరగడం వల్ల ప్రత్యేక విమాన సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

    2. బాలి, ఇండోనేషియా

    ఇండోనేషియాలోని బాలి బీచ్‌లు, పురాతన దేవాలయాలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ప్రపంచంలోని పర్యాటకులు బాలి చూడటానికి ఆసక్తి చూపుతారు. భారతీయులు కూడా ఈ ప్రదేశాన్ని విరివిగా సందర్శిస్తున్నారు. బాలి బీచ్‌లు మీ హాలీడేకు ప్రశాంతతను అందించడమే కాకుండా, కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేకమైన వేదికగా నిలుస్తాయి.

    3. మనాలి, హిమాచల్ ప్రదేశ్

    మనాలి హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ అందమైన హిల్ స్టేషన్. పర్వత శ్రేణులు, మంచు కప్పిన కొండలు, మాల్ రోడ్, రోహ్తంగ్ వ్యాలీ లాంటి ప్రదేశాలు పర్యాటకుల హృదయాలను కట్టిపడేస్తాయి. ప్రత్యేకించి చలికాలంలో ఇక్కడ హిమపాతం చూడటానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు.

    4. కజకిస్తాన్

    కజకిస్తాన్ వీసా అవసరం లేకుండా వెళ్లే దేశాల్లో ఒకటి. ఈ దేశం 2023లో 29,000 మంది భారతీయ పర్యాటకులను ఆహ్వానించగా, 2024లో ఈ సంఖ్య 49% పెరిగింది. ప్రకృతి అందాలు, ఆతిథ్యంతో కజకిస్తాన్ టూరిస్టులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. (Most Searched Travel Destinations 2024)

    5. జైపూర్, రాజస్థాన్

    రాజస్థాన్‌లోని పింక్ సిటీ జైపూర్ చారిత్రక కోటలు, ప్రాచీన నిర్మాణాలు, లోకల్ మార్కెట్‌లకు ప్రసిద్ధి. అమెర్ కోట, హవామహల్, జోహ్రి బజార్ లాంటి ప్రదేశాలు టూరిస్టుల మనసును దోచుకుంటాయి. ఈ నగరం చారిత్రక సాంస్కృతిక విశేషాలకు నిలయం.

    (Most Searched Travel Destinations 2024)

    6. జార్జియా

    జార్జియా యూరప్ మరియు ఆసియా మధ్య ఉన్న ఒక చారిత్రక దేశం. ప్రకృతి అందాలు, పర్వతాలు, ప్రత్యేకమైన సంస్కృతితో ఈ దేశం పర్యాటకులకు కలల రాజ్యంగా ఉంటుంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఎన్నో అనుభూతులను అందిస్తుంది.

    7. మలేషియా

    మలేషియా సాంస్కృతిక వైవిధ్యం, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. కౌలాలంపూర్ వంటి రంగుల నగరం టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారతీయులకూ ఇక్కడ విరివిగా పర్యటనలు చేయడం కోసం అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

    8. అయోధ్య, ఉత్తర ప్రదేశ్

    శ్రీరాముడి జన్మభూమి అయోధ్య ఇప్పుడు ఒక ప్రఖ్యాత యాత్రాస్థలంగా నిలిచింది. రామ మందిర నిర్మాణంతో ఈ ప్రదేశం భారతదేశ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. విదేశాల నుండి కూడా పర్యాటకులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి తరలివస్తున్నారు.

    9. కాశ్మీర్

    ప్రకృతి అందాల కలగూరగా పేరొందిన కాశ్మీర్ “భూమిపై స్వర్గం”గా పిలువబడుతుంది. మంచు కొండలు, నదులు, ఉపత్యకలు చూసి పర్యాటకులు మంత్ర ముగ్ధులవుతారు. ప్రతి ఏడాది దేశవిదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

    10. సౌత్ గోవా

    గోవాలోని దక్షిణ ప్రాంతమైన సౌత్ గోవా ప్రశాంతమైన బీచ్‌లు, విలాసవంతమైన(Most Searched Travel Destinations 2024) రిసార్ట్‌లతో పర్యాటకుల హృదయాలను కొల్లగొడుతుంది. కొత్త సంవత్సర వేడుకలు ఇక్కడ మరింత ప్రత్యేకంగా జరుగుతాయి. సహజ సౌందర్యం కోసం సౌత్ గోవా తప్పక చూడవలసిన ప్రదేశం.

    ఇవి 2024లో భారతీయుల గూగుల్ సెర్చ్‌లలో అత్యధికంగా ప్రాధాన్యం పొందిన ట్రావెల్ డెస్టినేషన్లు. ప్రతి ప్రదేశం ప్రత్యేకమైన చరిత్ర, ప్రకృతి, సంస్కృతికి నిలయం. మీరు కూడా కొత్త సంవత్సరంలో మీ ట్రావెలింగ్ జాబితాలో ఈ ప్రదేశాలను చేర్చుకోండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv