• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూ.2 వేలలోపు సూపర్ ఫీచర్స్ ఉన్న టాప్ 5 స్మార్ట్ వాచ్‌లు ఇవే..
  టాప్ 5 బడ్జెట్ ప్రెండ్లీ ల్యాప్ టాప్స్ ఇవే
  IQoo నుంచి మార్కెట్‌లోకి కొత్ 5G ఫోన్‌
  Redmi Note 12 Series : భారత మార్కెట్లలోకి నయా 5జీ స్మార్ట్‌ఫోన్లు!
  See More

  పెరిగిన fb యూజర్లు.. అత్యధికంగా భారత్‌లోనే

  ఫేస్‌బుక్ యూజర్ల పెరుగుదలలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని మెటా సంస్థ వెల్లడించింది. డెయిలీ, మంథ్లీ యాక్టివ్ యూజర్స్ పెరుగుదల జాబితాలో టాప్‌లో ఉన్న దేశాల్లో భారత్ ఒకటని తెలిపింది. 2021 నుంచి 2022 డిసెంబరు 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2బిలియన్లకు చేరుకుందని తెలిపింది. అదేవిధంగా మంథ్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 2శాతం పెరిగి 2.96 బిలియన్లుగా నమోదైందని మెటా పేర్కొంది. రోజుకు లేదా నెలకు ఒకసారైనా యాప్‌ని ఓపెన్ చేయడం, లాగిన్ కావడం వంటి వాటితో … Read more

  1టీబీ వరకు గూగుల్ డ్రైవ్ స్టోరేజీ పొడిగింపు

  గూగుల్ డ్రైవ్ వాడేవారికి శుభవార్త. ఉచిత స్టోరేజీ లిమిట్‌ని గణనీయంగా పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం 15జీబీ వరకు గూగుల్‌లో ఉచితంగా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఇకనుంచి ఈ స్టోరేజీ లిమిట్ 1టీబీ(1024జీబీ) వరకు పొడిగించనుంది. పీడీఎఫ్, ఇమేజ్, క్యాడ్ వంటి వంద రకాలైన ఫైళ్లను స్టోర్ చేసుకోవచ్చని తెలిపింది. వీటికి ఎలాంటి ఫీజు చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. 15జీబీ నుంచి 1టీబీకి వాటంతటవే అప్‌గ్రేడ్ అవుతాయని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం చాలామంది ఈ గూగుల్ వర్క్‌స్పేస్‌ని వినియోగిస్తున్నారు. దీంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది.

  వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు ఇవే

  వాట్సాప్ సరికొత్త ఫీచర్లు తీసుకురానుంది. టెక్ట్స్ ఎడిటర్, న్యూ ఫాంట్స్, గ్రూప్ చాట్స్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్ లిమిట్, ఇమేజ్ క్వాలిటీ తదితర ఫీచర్లపై వర్క్ చేస్తోంది. యూజర్లకు కొత్త అనుభూతిని కలిగించేలా వీటిని తీర్చిదిద్దుతోంది. ముఖ్యంగా ఫొటో క్వాలిటీ తగ్గకుండా, ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేసే వీలుండేలా ఫీచర్‌ని తీసుకొస్తోంది. గ్రూప్ చాట్స్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ లిమిట్‌ని 24 నుంచి 100కు పెంచనుంది. టెక్ట్స్ ఎడిటర్ ద్వారా యూజర్‌కి మరిన్ని కస్టమైజేషన్ సదుపాయాలు కల్పించనుంది. నచ్చిన ఫాంట్ సెలక్ట్ చేసుకోవడంతో పాటు టెక్ట్స్ … Read more

  త్వరలో నెట్‌ఫ్లిక్స్ పెయిడ్ షేరింగ్ ఫీచర్

  నూతన సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ముమ్మర చర్యలు చేప్టటింది. పాస్‌వర్డ్ షేరింగ్‌ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకనుంచి ప్రైమరీ అకౌంట్ నుంచి కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు పెయిడ్ షేరింగ్ ఫీచర్‌ని తీసుకొస్తోంది. 2023 ఏప్రిల్ నెల నుంచి చాలా దేశాల్లో ఈ ఫీచర్‌ని అమలు చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ప్రైమరీ అకౌంట్ హోల్డర్స్ తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ని షేర్ చేయాలని భావిస్తే కచ్చితంగా అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

  కోబ్రా వాచ్; యాపిల్ వాచ్‌కు ధీటుగా..

  దేశీయ వేరబుల్స్ అండ్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ మరో సరికొత్త వాచ్ సృష్టించింది. కోబ్రా పేరుతో స్ట్రాంగెస్ట్ స్మార్ట్ వాచ్ తయారీ చేసింది. ఈ వాచ్‌లు ఫ్లిప్‌కార్ట్, ఫైర్ బోల్ట్.కామ్ వెబ్‌సైట్లలో దొరుకుతాయి. కోబ్రా స్మార్ట్ వాచ్ 1.78 అంగుళాల డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 123 స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఫీచర్లతో సరికొత్తగా ఉంది. నాలుగు కలర్స్‌లో ఈ వాచ్ అందుబాటులో ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై రెండు వారాలు పనిచేస్తుంది. అలారం, ఫ్లాష్‌లైట్, హెల్త్ రిమైండర్ వంటి ఫీచర్లతో … Read more

  బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్‌ వాడితే అంతే!

  మేసేజ్‌లు, లింకులు పంపించి హ్యాక్‌ చేయడం గురించి మనకు తెలిసిందే. కానీ బ్లూబగ్గింగ్‌ విధానంలో సైబర్‌ నేరగాళ్లు ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారు. బ్లూటూత్‌ ఆన్‌లో ఉన్న ఫోన్లు లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నపుడు 10 మీటర్ల పరిధిలో బ్లూటూత్‌ ఆన్‌లో ఉన్న ఫోన్లకు రిక్వెస్ట్ పంపి కనెక్ట్‌ అవుతారు. మనం వాడే ఇయర్‌ఫోన్స్‌, స్మార్ట్‌ వాచి వంటివి గమనించి ఆ డివైజ్‌ పేరుతో రిక్వెస్ట్ పంపుతారు. ఒకసారి కనెక్ట్‌ అయ్యామా..అంతే! మాల్‌వేర్లను పంపించి మన ఫోన్‌ను వారి చేతుల్లోకి తీసుకుంటారు.

  ఇకపై ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్

  నేటి నుంచి కొన్ని పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఓల్డ్ వెర్షన్స్‌లో నడుస్తున్న ఆండ్రాయిన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎల్జీ ఆప్టీమస్ ఎఫ్3, సోనీ ఎక్స్‌పీరియా ఎం, లెనోవా ఏ820, వికో సింక్ 5 ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ, శాంసంగ్ గెలాక్సీ కోర్, గెలాక్సీ ఏస్2, గెలాక్సీ ఎస్2 మినీ, గెలాక్సీ ఎస్2 మినీ, విన్కో డార్క్ నైట్, ఆర్కోస్ 53 ప్లాటినం, హ్యూవే అసెండ్, జడ్‌టీఈ గ్రాండ్ మెమో, ఎల్జీ ఆప్టిమస్ ఎల్5 LI, తదితర ఫోన్లలో వాట్సాస్ … Read more

  బ్రెయిన్‌తోనే ఇన్‌స్టా వాడేయొచ్చు.. ఎలాగంటే?

  బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్(BCI)లో భాగంగా మరో బ్రెయిన్ చిప్‌ని కనుగొన్నారు. వెంట్రుక కన్నా చిన్నగా, సన్నగా ఉండే సైజులో ఈ చిప్‌ని అమెరికన్ సంస్థ ‘ప్రిసిషన్ న్యూరోసైన్స్’ అభివృద్ధి చేసింది. దీనిని మెదడులోకి చొప్పిస్తే శరీర సాయం లేకకుండానే కంప్యూటర్‌ని ఉపయోగించొచ్చు. సోషల్ మీడియాలో బ్రౌజ్ చేయొచ్చు. పక్షవాతం, ఇతర వైకల్యం ఉన్న వారి కోసం దీనిని రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. పుర్రెపై సన్నటి రంధ్రం ద్వారా మెదడులోకి చిప్‌ని ప్రవేశపెట్టొచ్చని తెలిపింది. ఎలాన్ మస్క్ ఫండింగ్ చేసిన ‘న్యూరాలింక్’ కూడా ఇదే తరహా … Read more

  వాట్సాప్‌లో కొత్త ఫీచర్; చెక్ చేశారా?

  ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘వీడియో మోడ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంతకుముందు వాట్సాప్‌లో వీడియో రికార్డు చేసేందుకు కెమెరా బటన్ నొక్కి పట్టుకుంటేనే వీడియో రికార్డ్ అయ్యేది. వీడియో పూర్తయ్యేవరకు కెమెరా బటన్‌పై వేలు నొక్కి పట్టుకునే ఉండాలి. కానీ ‘వీడియో మోడ్’ ఫీచర్‌‌తో ఆ శ్రమ అక్కర్లేదు. ఈ ఫీచర్‌లో వీడియో మోడ్ ఆన్ చేస్తే చాలు రికార్డింగ్ అవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్ది మందికే అందుబాటులో ఉంది.

  మీకు ‘ఈ సిమ్’ ఉందా? దాని ఫీచర్స్ తెలుసా?

  ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ దర్శనమిస్తోంది. ఫోన్ లేనిదే ఏ పనీ కావడం లేదు. ప్రస్తుతం సెల్‌ఫోన్లలో ఉపయోగించే ‘సిమ్’ కార్డు కనుమరుగై పోతోంది. తొలుత పెద్ద సైజులో ఉన్న సిమ్.. నానో సైజుకు మారిపోయింది. ప్రస్తుతం కంటికే కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. మొబైల్ స్టోర్‌లోకి వెళ్లకుండానే ఈసిమ్ పొందవచ్చు. మల్టీపుల్ ఫోన్ నంబర్లను, ప్లాన్లను ఒకే డివైజ్‌లో ఉపయోగించవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా సిమ్ యాక్టివేట్, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సైబర్ నేరాల నుంచి తప్పించుకోవచ్చు.