దేశీయ స్మార్ట్‌ఫోన్ ఫొన్ కంపెనీ.. లావా తన బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో కొత్త ఫోన్‌ను భారత(Lava Yuva 2 5G) మార్కెట్‌లో లాంచ్ చేసింది. “లావా యువ 2 5G” పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు ప్రీమియమ్ ఫీచర్లను అందిస్తోంది. యువతను దృష్టిలో పెట్టుకుని మార్బుల్ ఫినిష్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్ ధర రూ.9,499గా నిర్ణయించింది. ఇది మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.
లావా యువ 2 5G స్పెసిఫికేషన్‌లు
- డిస్‌ప్లే: 6.67 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్, 90Hz రీఫ్రెష్ రేటుతో కూడిన 700 నిట్స్ బ్రైట్‌నెస్.
- ప్రాసెసర్: UNISOC T760 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
- బ్యాటరీ: 5000mAh సామర్థ్యంతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలిగి ఉంది.
- స్టోరేజీ: 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ (1TB వరకు పెంచుకునే అవకాశం).
- కెమెరా: వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా.
ప్రత్యేక ఫీచర్లు
- నోటిఫికేషన్ లైట్: ఈ ఫోన్ బ్యాక్ కెమెరా మాడ్యూల్ చుట్టూ ప్రత్యేక నోటిఫికేషన్ లైట్ అమర్చారు. ఇది ఇన్‌కమింగ్ కాల్స్, అలర్ట్స్ కోసం ఉపయోగపడుతుంది.
- డిజైన్: మార్బుల్ ఫినిష్ డిజైన్ యువతను ఆకట్టుకునేలా ఉంది.
- సౌండ్ క్వాలిటీ: డ్యూయల్ స్టీరియో స్పీకర్లు స్పష్టమైన ఆడియోని అందిస్తాయి.
- భద్రత: సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సదుపాయం.
ధర
లావా యువ 2 5G ఒకే వేరియంట్‌లో (4GB ర్యామ్ + 128GB స్టోరేజీ) అందుబాటులో ఉంది. (Lava Yuva 2 5G)దీని ధర రూ.9499గా నిర్ణయించబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం లావా రిటైల్ స్టోర్లలో లభ్యమవుతుంది. ఆన్‌లైన్ కొనుగోలు విషయమై ఇంకా స్పష్టత లేదు.
ఉచిత సర్వీస్ హామీ
లావా కంపెనీ వినియోగదారులకు ఒక ప్రత్యేక హామీని అందిస్తోంది. ఫోన్‌లో ఏదైనా లోపం తలెత్తితే, సర్వీస్ సెంటర్‌కి వెళ్లకుండానే నేరుగా ఇంటికి వచ్చి ఉచితంగా సరిచేయడానికి ప్రత్యేక సేవను అందిస్తున్నారు.
కనెక్టివిటీ- ఇతర ఫీచర్లు
- కనెక్టివిటీ: 5G (SA/NSA), బ్లూటూత్ 5.2, వైఫై, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, GPS, FM రేడియో.
- ఆడియో జాక్: 3.5mm ఆడియో జాక్.
ఫోన్ ఇతర ప్రత్యేకతలు
- బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్.
- అత్యాధునిక ప్రాసెసర్, మెరుగైన కెమెరా ఫీచర్లు.
- 1TB వరకు స్టోరేజ్ విస్తరణ.
- నోటిఫికేషన్‌ల కోసం ప్రత్యేకమైన లైట్.
కేవలం రూ.10,000 లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్ యువతకు ప్రత్యేకంగా రూపొందించబడింది. పనితీరు, డిజైన్, ఫీచర్ల పరంగా లావా యువ 2 5G ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో మంచి ఎంపికగా నిలుస్తుంది.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!