ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏ స్థాయి ఘన విజయాన్ని సాధించాడో అందరికీ తెలిసింది. కూటమి తరపున బరిలోకి దిగిన 21 మంది జనసేన ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను పవన్ దగ్గరుండి గెలిపించుకున్నారు. 100% స్ట్రైక్‌రేట్ సాధించి దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి పొలిటిషియన్‌గా అవతరించాడు. ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ప్రజల క్షేమం కోసం అహర్నిశలు పాటు పడుతున్నారు. ఇదిలాఉంటే తాజాగా వెలువడిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ మరోమారు 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. దీంతో అతడి పేరు మహారాష్ట్ర సహా, యావత్ దేశం మారుమోగుతోంది.
100% స్ట్రైక్ రేట్ ఎలాగంటే
మహారాష్ట్ర ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ‘మహాయుతి’ (Mahayuti) కూటమి ఘన విజయం సాధించింది. ఇవాళ (నవంబర్ 22) వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెుత్తం 288 స్థానాలకు గాను 230 సీట్లలో భాజపా కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఇదిలా ఉంటే ఇటీవల పవన్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మాన్ని రక్షించాలని, భాజపా భాగస్వామ్యంలోని మహాయుతి కూటమిని గెలిపించాలని కోరారు. తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న ‘పుణె’, ‘బల్లార్ పూర్’, ‘షోలాపూర్’, ‘డెగ్లూర్’, ‘లాతూర్’ నియోజకవర్గాల్లో పవన్ సుడిగాలి క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే పవన్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో భాజపా కూటమి ఘన విజయం సాధించడం విశేషం. దీంతో పవన్ మరోమారు 100% స్ట్రైక్ రేటు సాధించాడంటూ పవన్ అభిమానులు, జనసైనికులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
చరిత్రలో గెలవని సీటు సైతం..
పవన్ ప్రచారం నిర్వహించిన డెగ్లూర్ నియోజకవర్గంలో భాజపా ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలవలేదు. అయితే పవన్ చేసిన ప్రచారం నేపథ్యంలో తొలిసారి ఆ స్థానాన్ని భాజాపా తన ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో పవన్ ఏ స్థాయి ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. అటు షోలాపూర్‌లో విజయం సాధించిన మహాయుతి అభ్యర్థి పవన్‌పై ప్రశంసలు కురిపించారు. తాను గెలవడానికి ప్రధాన కారణం పవన్ అంటూ ఆకాశానికెత్తారు. పవన్ ప్రచారం నిర్వహించిన నియోజక వర్గ అభ్యర్థులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ వచ్చి తమ గెలుపును ఏకం పక్షం చేశారని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. పవన్ చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేమని చెబుతున్నారు.
ఫ్యాన్స్ ఎలివేషన్స్..
మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ తన మార్క్ చూపించడంపై జనసేన కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘పవన్ అంటే లోకల్ అనుకుంటివా.. నేషనల్, ఏ రాష్ట్రాల ఎన్డీయే అభ్యర్థులనైనా గెలిపించేస్తాడు’ అంటూ నెట్టింట పోస్టులు చేస్తున్నారు. ‘పవన్ కల్యాణ్ అన్‌ప్రిడక్టబుల్’ అంటూ ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్‌ను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు పవన్‌ను ప్రశంసిస్తూ గతంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను మరోమారు ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. పవన్ అభిమానులుగా ఈ ఏడాది తమకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. పవన్ నామ సంవత్సరంగా 2024 మారిపోతుందని అంటున్నారు. గతంలో ‘కాంగ్రెస్ హఠావో’ అంటూ పవన్ ఇచ్చిన నినాదాన్ని సైతం మరోమారు నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం