ఒక్క పథకం ఆపితే.. రోడ్లు వేయొచ్చు: కొడాలి నాని
వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిలో ఏ ఒక్క పథకం ఆపినా రాష్ట్రంలో రహదారులు వేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గుడివాడలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు వేయాలంటే రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపినా సరిపోతుందని తెలిపారు. రోడ్లపై ఉన్న చిన్నచిన్న గుంతల వద్ద చేరి టీడీపీ, జనసేన నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని మండిపడ్డారు.