• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Interim Budget 2024: వస్తువుల ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!

    ఏప్రిల్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా పూర్తి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్టెట్‌ (Union Budget 2024)ను ఆమె ప్రకటించారు. 2024-25 నాటికి బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ఉంటుందని కేంద్ర మంత్రి ప్రకటించారు. వీటిలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు కాగా.. పన్ను వసూళ్లు రూ. 26.02 లక్షల కోట్లు ఉంటాయని నిర్మల అన్నారు. అయితే వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ పద్దులను ఇక్కడ చుద్దాం.

    కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు
    • గ్రామీణ ఉపాధి హామీ పథకం : రూ. 86,000 కోట్లు
    • ఆయుష్మాన్‌ భారత్‌ పథకం : రూ.7,500 కోట్లు
    • పారిశ్రామిక ప్రోత్సహకాలు : రూ. 6,200 కోట్లు
    • సెమీ కండక్టర్స్‌, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ : 6,903 కోట్లు
    • సోలార్ విద్యుత్‌ గ్రిడ్‌ : రూ.8,500 కోట్లు
    • గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ : రూ.600 కోట్లు
    ప్రభుత్వ శాఖలు వారీగా బడ్జెట్‌ కేటాయింపులు
    • రక్షణ : రూ.6.2 లక్షల కోట్లు
    • ఉపరితల రవాణా, జాతీయ రహదారులు : రూ.2.13 లక్షల కోట్లు
    • రైల్వే : రూ. 2.55 లక్షల కోట్లు
    • వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ. 2.13 లక్షల కోట్లు
    • హోం శాఖకు : రూ.2.03 లక్షల కోట్లు
    • గ్రామీణాభివృద్ధి రూ. 1.77 లక్షల కోట్లు
    • రసాయనాలు, ఎరువులు రూ. 1.68 లక్షల కోట్లు
    • కమ్యూనికేషన్లు : రూ.1.37 లక్షల కోట్లు
    • వ్యవసాయం, రైతు సంక్షేమం రూ. 1.27లక్షల కోట్లు
    ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి!(What Costs More and What is Cheaper 2024 budget)

    మధ్యంతర బడ్జెట్‌ ప్రకటన నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ప్రస్తుత ధరలతో పోలిస్తే మరింత ప్రియంగా మారతాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    • సిగరేట్స్‌
    • పొగాకు ఉత్పత్తులు
    • కార్లు
    • మోటర్‌ సైకిల్స్‌
    • విమాన ప్రయాణ ఛార్జీలు
    • ఈ- రీడింగ్‌ డివైజ్‌లు
    • పాదరక్షలు
    • ఫర్నీచర్‌
    • గొడుగులు
    • చాక్‌లెట్స్‌
    ఈ వస్తువుల ధరలు తగ్గుతాయ్‌! (What Costs More and What is Cheaper 2024 Budget)
    • ఎల్‌ఈడీ బల్బులు
    • సోలార్‌ ల్యాంప్స్‌
    • జీడిపప్పు
    • నకిలీ లేదా ఇమిటేషన్‌ జ్యూయలరీ ధరలు
    • సెటప్‌ బాక్సులు
    • రూటర్స్
    • తక్కువ ధర కలిగిన గృహోపకరణ వస్తువులు
    • టెంపర్డ్‌ గ్లాసెస్
    • కొన్నిరకాల కెమికల్స్‌

    గత రెండేళ్లలో పెరిగిన, తగ్గిన వస్తువులు ఇవే..

    2023-24 ఆర్థిక సంవత్సరంలో..

    గతేడాది టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, రొయ్యల ఫీడ్‌, ల్యాబ్‌లో తయారైన వజ్రాలు, లిథియం-అయాన్‌ కణాలను తయారు చేసే యంత్రాల ధరలు తగ్గాయి. మరోవైపు అదే సమయంలో సిగరేట్లు, సైకిల్స్‌, ఇమిటేషన్‌ జ్యూయలరీ, ఎయిర్‌ ట్రావెల్‌, ఎలక్ట్రిక్‌ చిమ్నీ, కాపర్ స్క్రాప్‌, టెక్స్‌టైల్స్ ధరలు పెరిగాయి.

    2022-23 ఆర్థిక ఏడాదిలో..

    అంతకుముందు సంవత్సరంలో ఇమిటేషన్‌ జ్యూయలరీ, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్‌, మెుబైల్స్‌, పెట్రోలియం రిఫైనరింగ్‌, పాలిష్డ్‌ డైమండ్‌ ధరలు తగ్గాయి. అదే సమయంలో గొడుగులు, దిగుమతి వస్తువులు, చాక్‌లెట్స్‌, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌ ధరలు పెరిగాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv