టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగుతోంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 స్టైక్ రేట్‌తో గెలిచి ఆయన రాజకీయాల్లో నయా రికార్డును సృష్టించారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు.. కూటమి విజయం (164/175)లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున విష్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ (Akira Nandan) తన తండ్రి కోసం ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.
నాన్నకు ప్రేమతో..
పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. విజయోత్సహంలో ఉన్న పవన్ కల్యాణ్ సంతోషంలో పాలుపుంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా తన తండ్రి కోసం ఎడిట్ చేసిన వీడియోను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్ (Akira Nandan) చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్ (Renu Desai) దీనికి క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
పవన్ పంచ్ డైలాగ్స్..
అకిరా ఎడిట్ చేసిన వీడియోలో పవన్ సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ఉన్నాయి. ‘ఖుషి’ (Kushi) నుంచి ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) వరకు పవన్ చేసిన చిత్రాల్లోని పవర్‌ఫుల్ డైలాగులతో అకీరా ఈ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చూసిన పవన్ ట్రెండింగ్ వీడియోల్లో ఇదే బెస్ట్ అంటూ అకీరాను ఆకాశానికి ఎత్తుతున్నారు.
తండ్రితోనే అకిరా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఫలితాలు వెలువడిన రోజు పవన్ భార్య అన్నా లెజ్నెవా ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలో పవన్ రెండో భార్య కుమారుడు అకిరా నందన్ కూడా కనిపించాడు. పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య వీర తిలకం పెడుతుండగా.. అకీరా కూడా అక్కడే నిలబడ్డాడు. అనంతరం తండ్రితో పాటే అమరావతిలోని నివాసానికి అకిరా వెళ్లాడు. కూటమి విజయం అనంతరం పవన్‌ను కలవడానికి వచ్చిన చంద్రబాబు కాళ్లకు నమస్కారం సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అకిరా ఎంతో టాలెంటెడ్!
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం