ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Hotstarఫ్రమ్
Watch
Free
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
YouSay Review
Bheemla Nayak Movie Review
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో శేఖర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన సినిమా ‘భీమ్లానాయక్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియ...read more
How was the movie?
తారాగణం
పవన్ కళ్యాణ్
SI సర్హాద్ భీమ్లా నాయక్రానా దగ్గుబాటి
మాజీ హవిల్దార్ డేనియల్ డానీ శేఖర్నిత్యా మీనన్
సుగుణసంయుక్త మీనన్
కమలిసముద్రకని
డేనియల్ తండ్రిరావు రమేష్
నాగరాజుమురళీ శర్మ
సీఐ కోదండ రాంరఘు బాబు
బాలాజీతనికెళ్ల భరణి
ఎమ్మెల్యేఅనంత్ బాబు
పబ్లిక్ ప్రాసిక్యూటర్హర్ష వర్ధన్
రవి వర్మ
నాగరాజు హెంచ్మెన్శత్రు
నాగరాజు హెంచ్మెన్సంజయ్ స్వరూప్
తేజ కాకమాను
నర్రా శ్రీను
కాదంబరి కిరణ్
చిట్టి
పమ్మి సాయి
లక్ష్మణ్ మీసాలఖైదీ (భీమ్లా నాయక్ పాటలో అతిధి పాత్ర)
రామచంద్రరాజు
ఖైదీ (భీమ్లా నాయక్ పాటలో అతిధి పాత్ర)అయ్యప్ప పి. శర్మ ఖైదీ (భీమ్లా నాయక్ పాటలో అతిధి పాత్ర)
బ్రహ్మానందం
జడ్జి కెబి ఆనందరావు (అతి అతిథి పాత్ర)సునీల్
సప్తగిరి
హైపర్ ఆది
సిబ్బంది
సాగర్ కె చంద్ర
దర్శకుడుసూర్యదేవర నాగ వంశీనిర్మాత
తమన్ ఎస్
సంగీతకారుడుత్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లేరవి కె. చంద్రన్
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
సంయుక్త మీనన్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
సంయుక్త మీనన్.. తెలుగులో భీమ్లా నాయక్ చిత్రం(2022) ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఈ చిత్రంలో రాణా భార్యగా నటించింది. అయితే ధనుష్ నటించిన సార్ చిత్రంలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత విరూపక్ష, బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ హిట్‌తో తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. మరి తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరిన సంయుక్త మీనన్(samyuktha menon) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
సంయుక్త మీనన్ పుట్టిన తేదీ?
సెప్టెంబర్ 11, 1995
సంయుక్త మీనన్ ఎక్కడ పుట్టింది?
పాలక్కాడ్, కేరళ
సంయుక్త మీనన్ నటించిన తొలి సినిమా?
పాప్ కార్న్
సంయుక్త మీనన్ ఎత్తు ఎంత?
5 అడుగుల 7అంగుళాలు
సంయుక్త మీనన్‌కు తెలుగులో తొలి చిత్రం?
భీమ్లా నాయక్(2022)
సంయుక్త మీనన్ అభిరుచులు?
సామాజిక సేవా కార్యక్రమాలు
సంయుక్త మీనన్‌కు ఇష్టమైన ఆహారం?
నాన్‌వెజ్
సంయుక్త మీనన్‌కు ఇష్టమైన కలర్?
వైట్, బ్లాక్
సంయుక్త మీనన్‌కు ఇష్టమైన హీరో?
పవన్ కళ్యాణ్
సంయుక్త మీనన్ ఏం చదివింది?
ఎకానామిక్స్‌లో డిగ్రీ చేసింది
సంయుక్త మీనన్ పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సంయుక్త మీనన్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/iamsamyuktha_/?hl=en
https://www.youtube.com/watch?v=NtisrzL43Vs
అక్టోబర్ 22 , 2024
Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.
ఫిబ్రవరి
ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) కలెక్షన్స్ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్ చేసింది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
మార్చి
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా నటించారు.
ఏప్రిల్
2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.
మే
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేసింది.
జూన్
ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.
జులై
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్ పాన్ ఇండియా స్థాయికి తెలిసింది.
ఆగస్టు
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా చేసింది.
సెప్టెంబర్
గత నెల సెప్టెంబర్ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.
అక్టోబర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
నవంబర్
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు.
డిసెంబర్
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్ చేసింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందనుంది.
అక్టోబర్ 17 , 2024
68th Filmfare Awards South 2023: బెస్ట్ యాక్టర్స్‌గా రామ్‌చరణ్, తారక్.. ఆ చిత్రాలకు అవార్డుల పంట!
దర్శకధీరుడు రాజమౌళి (S.S. Rajamouli) రూపొందించిన 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) కథానాయకులుగా చేసిన ఈ మూవీ గ్లోబల్ స్థాయిలో సత్తా చాటింది. పలు అంతర్జాతీయ అవార్జులను కొల్లగొట్టింది. అంతేకాదు పలు విభాగాల్లో ఆస్కార్ బరిలో నిలిచి ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాదికి గాను తాజాగా ప్రకటించిన ‘ఫిల్మ్‌ఫేర్ సౌత్ 2023’ (68 Filmfare Awards south 2023) అవార్డుల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' మరోమారు సత్తా చాటింది. ఏకంగా ఏడు అవార్డులు కైవసం చేసుకొని అందరి ప్రశంసలు అందుకుంటోంది. అటు సీతారామం, విరాటపర్వం, భీమ్లా నాయక్ మూవీలకు సైతం అవార్డులు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఫిల్మ్‌ఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్క్
68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. దక్షిణాది భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) 2022, 2023 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 24న విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ సినిమా (ఆర్ఆర్ఆర్), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ నటుడు (రామ్‌చరణ్, తారక్), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్, ఉత్తమ కొరియోగ్రాఫర్ (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ('కొమురం భూముడో' సాంగ్ పాడిన కాలభైరవ) విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.
‘సీతారామం’కు అవార్డుల పంట
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత టాలీవుడ్ నుంచి ‘సీతారామం’ సత్తా చాటింది. వాస్తవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సీతారామం’ మధ్యనే గట్టి పోటీ నడిచింది. రాజమౌళి మేనియాను తట్టుకొని సైతం ‘సీతారామం’ నిలబడగలిగింది. ఎక్కువ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. మెుత్తం ఐదు పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ మూవీ (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (క్రిటిక్స్), ఉత్తమ నటి (మృణాల్ ఠాకుర్), ఉత్తమ లిరిక్స్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డులు వరించాయి. అలాగే రానా, సాయిపల్లవి జంటగా నటించిన 'విరాటపర్వం' రెండు అవార్డులు, పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్'కు ఓ అవార్డు లభించింది. మరి ఏఏ విభాగాల్లో ఎవరెవరికి ఈ అవార్డులు దక్కాయో ఒకసారి పరిశీలిద్దాం.
ఆర్‌ఆర్‌ఆర్ అవార్డ్స్
ఉత్తమ సినిమా - ఆర్ఆర్ఆర్
ఉత్తమ దర్శకుడు - ఎస్ఎస్ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటుడు - రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్ - నాటు నాటు పాట)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) - కాల భైరవ (కొమురం భీముడో పాటకు)
సీతారామం అవార్డ్స్
ఉత్తమ మూవీ (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి - మృణాల్ ఠాకుర్ (సీతారామం)
ఉత్తమ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి - కానున్న కల్యాణం (సీతారామం)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) - చిన్మయి శ్రీపాద (సీతారామం - ఓ ప్రేమ..)
ఇతర చిత్రాలు
ఉత్తమ నటి (క్రిటిక్స్) - సాయిపల్లవి (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాటపర్వం)
ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
జూలై 12 , 2024
BRO Movie Review: వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేశాడు.. ఫిలాసఫికల్ సినిమాతో పవన్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడా?
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, రోహిణి, వెన్నెల కిశోర్, తదితరులు
దర్శకత్వం: సముద్రఖని
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: త్రివిక్రమ్ శ్రీనివాస్
మ్యూజిక్: తమన్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి రీమేక్ హిట్ల అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన మరో రీమేక్ ఇదే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు, పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మలిచారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాతృక దర్శకుడు సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. మరి, ఫిలాసఫికల్ టచ్‌తో వచ్చిన ఈ మూవీ థియేటర్లలో మెప్పించిందా? టైం కాన్సెప్ట్ ప్రేక్షకుడిని కన్వీన్స్ చేసిందా? ‘బ్రో’ మూవీతో పవన్ హ్యాట్రిక్ రీమేక్ హిట్ అందుకున్నాడా? అనే విశేషాలు రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
మార్కండేయుడు(సాయితేజ్) ఓ బిజినెస్‌మేన్ పెద్దకొడుకు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మార్క్‌పై పడతాయి. గజిబిజి హడావుడిలో పడిపోయి అటు కుటుంబానికి, లవర్‌కి పెద్దగా టైం కేటాయించని పరిస్థితి మార్క్‌ది. ఈ క్రమంలో అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతాడు. మార్క్‌ని తీసుకెళ్లడానికి టైటాన్(పవన్ కళ్యాణ్) వస్తాడు. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయని, వాటిని పూర్తి చేశాక వస్తానని కాలదేవుడిని ఒప్పిస్తాడు. ఈ క్రమంలో మార్క్ చేసే ప్రతి పనిలోనూ ఎదురు దెబ్బ తగులుతుంది. మరి, చివరికి మార్క్ వాటినెలా పూర్తి చేశాడు? టైటాన్ ఏమైనా సాయం చేశారా? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/captain_India_R/status/1684756208845045760?s=20
ఎలా ఉంది?
‘వినోదయ సిత్తం’ మూవీ కంప్లీట్‌గా ఫిలాసఫికల్ మూడ్‌లో సాగుతుంది. కానీ, బ్రో ఇందుకు కాస్త భిన్నం. తత్వాన్ని బోధిస్తూనే కమర్షియల్ హంగులను అద్దుకుందీ సినిమా. దేవుడికి కూడా టైం రావాలని, దేవుడి కన్నా గొప్పది ‘టైం’ అనే విషయాన్ని చెబుతుంది. దీనినే పూర్తిగా ఫ్యాన్ మేడ్‌లా రూపొందించి కన్వే చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే పూర్తి సినిమాను మలిచారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుంచే ఈ ఫ్లేవర్ కనిపిస్తుంది. అసలే ఆకలితో ఉన్న ఫ్యాన్స్‌కి పవన్ పాపులర్ సాంగ్స్‌ని మిక్స్ చేసి బిర్యానీ తినిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ లుక్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ని కుర్చీలో కూర్చోనివ్వవు. ఇంట్రవెల్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ సినిమాకు అసెట్‌గా నిలుస్తాయి. సన్నివేశాలకు అనుగుణమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కథనం వేగంగా సాగుతుంటుంది. క్లైమాక్స్‌లో ఎమోషన్ పీక్స్. అప్పటిదాకా ఎంజాయ్ చేసిన సినిమాను చివరి 20 నిమిషాల్లో మర్చిపోతాం. థియేటర్ల నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ క్లైమాక్స్ మాత్రమే గుర్తుంటుంది. అయితే, కొన్ని చోట్ల సీన్లు ఓవర్‌గా అనిపించడం, కుటుంబం ఎమోషన్లు ఊహించినంతగా పండకపోవడం కాస్త మైనస్. సినిమాలో ఏపీ పాలిటిక్స్‌ని ఇరికించడం రుచించకపోవచ్చు.
https://twitter.com/CharanRuthless/status/1684406412892606464?s=20
ఎవరెలా చేశారు?
కాలదేవుడిగా పవన్ కళ్యాణ్ ఇరగ దీశాడు. ఎంట్రీ సీన్ నుంచి సినిమాకు ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చాడు. సినిమా ఆసాంతం నాటి పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేసేలా నటించాడు. తన పాపులర్ సాంగ్స్‌లలో స్టెప్పులతో అలరించాడు. క్లైమాక్స్‌లోనూ ఎమోషన్స్‌ని చక్కగా పండించాడు. ఇక మార్క్‌పై సానుభూతి కలిగేంతలా నటించాడు సాయితేజ్. తన రియల్ లైఫ్‌కి ఇది చాలా దగ్గరగా ఉండటంతో అట్టే ఒదిగిపోయాడు. మావయ్యతో కలిసి చేసే సీన్స్‌లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. చివర్లో సాయితేజ్ ఏడిపించేస్తాడు. ఇక, కేతిక శర్మ తన పాత్రకు పరిమితమైంది. తల్లిగా రోహిణి, చెల్లిగా ప్రియా ఓకే అనిపించారు.
టెక్నికల్‌గా
సినిమాకు కథ ఎంతో బలాన్నిచ్చింది. రీమేక్ అయినప్పటికీ మాతృ కథలోని ఆత్మ పోకుండా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ సముద్రఖని సఫలమయ్యాడు. ఎంత వరకు అవసరమో, ఫ్యాన్స్‌కి ఏం కావాలో అంతే చూపించాడు. ఇక, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగ్స్‌లో త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది. ఇక, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఆకట్టుకుంటుంది. శ్లోకం బీజీఎం ఒక వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్‌ని యంగ్‌గా చూపించడంలో సుజీత్ వాసుదేవ్ తన పనితనం చూపించారు. నిర్మాణ విలువలు సరిపోయాయి.
https://youtu.be/jnzuXnj6HE0
ప్లస్ పాయింట్స్
పవన్, సాయితేజ్ మధ్య సీన్స్
పవన్ సాంగ్స్ మిక్స్
డైలాగ్స్, స్క్రీన్ ప్లే
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
ఓవర్ సీన్స్
పొలిటికల్ డైలాగ్స్
చివరగా.. సినిమా చూసొచ్చాక జీవితంలో ఏదైనా చేయాలనిపిస్తుంది ‘బ్రో’
రేటింగ్: 3/ 5
https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
జూలై 28 , 2023
Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్.. ఎప్పుడూ ఇదే వరస!
మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేశ్ బాబును విభిన్నంగా చూపించి మెప్పించాడు త్రివిక్రమ్. తన మార్క్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు బర్త్ డే(Mahesh babu Birthday) సందర్భంగా మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. అయితే, తెర వెనకాల ఇందుకు పరిస్థితి విరుద్ధం. వీరి కాంబోలో మూవీ వస్తుందంటే అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏళ్లకు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ విషయంలోనూ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు.
రెండేళ్లు..
అతడు(Athadu Movie) మూవీ 2005లో విడుదలైంది. నాని, అర్జున్ సినిమాల వరుస పరాభవం తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ మూవీ రిలీజ్ కావడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలయ్యాక ఈ ఆలస్యాన్ని మరిచిపోయి ఫ్యాన్స్ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఒక ఏడాదిలో 1350 సార్లు టీవీల్లో ప్రసారం అయిన తొలి సినిమాగా(Athadu Movie Record) ఇది రికార్డ్ నెలకొల్పింది.
https://twitter.com/GunturKaaram/status/1672478971827720192
మూడేళ్లు..
అతడు స్టోరీ ఒప్పుకున్నాక మహేశ్ బాబు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే, ఖలేజా మూవీ విషయంలో సూపర్ స్టార్ పూర్తి సమయాన్ని కేటాయించాడు. అతిథి (2007) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఖలేజా చిత్రీకరణకే తన టైంని డెడికేట్ చేశాడు. అలా, వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలతో సినిమా షూటింగ్ మూడేళ్లకు పూర్తయింది. 2010లో ఖలేజా మూవీ విడుదలైంది. కానీ, మధ్యలో ఫ్యాన్స్ తెగ నిరీక్షించారు.
https://twitter.com/GunturKaaram/status/1664273686810198024
గుంటూరు కారం
2021 మే నెలలో మహేశ్, త్రివిక్రమ్‌ల మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తొలుత 2022 సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి వాయిదా వేద్దామని చూశారు. అయినప్పటికీ పూర్తి కాలేదు. స్క్రిప్ట్‌లో మాటల మాంత్రికుడు తెగ మార్పులు చేశాడట. ఈ క్రమంలోనే ఓల్డ్ రీల్స్‌ని తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా సీన్లు తెరకెక్కించాడట. ఇక, ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోందని భావిస్తుండగానే మరో షాక్ ఎదురైంది.
కారణాలు..
సినిమా నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. కారణాలు వెల్లడి కానప్పటికీ బుట్ట బొమ్మ స్థానంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్ రోల్‌లోకి వచ్చేసింది. దీంతో సీన్స్‌ని మళ్లీ తెరకెక్కించాల్సి వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌ని మీనాక్షి చౌదరికి అప్పగించడంతో పని రెట్టింపయ్యింది. ఇదిలా ఉండగానే, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీఎస్ వినోద్‌ని చిత్రబృందం తీసేసినట్లు ప్రచారం జరిగింది. ఇతడి స్థానంలో రాధేశ్యామ్, బీస్ట్ మూవీలకు పనిచేసిన మనోజ్ పరమహంసను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పీఎస్ వినోద్ పేరునే ఉంచడం గమనార్హం. ఇలా గందరగోళం నెలకొనడంతో చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.
https://twitter.com/SSMB_CULTS_/status/1680635379073032192
త్రివిక్రమ్ డైవర్ట్?
‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశాడు. దీంతో మహేశ్ సినిమాపై త్రివిక్రమ్ సరిగా ఫోకస్ పెట్టట్లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సినిమా షూటింగ్ వాయిదాకు దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరి, ఇప్పటికైనా సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా? అంటే సందేహమే.
https://twitter.com/GunturKaaram/status/1664248261442678784
నిరాశలో ఫ్యాన్స్
సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా వెల్లడించింది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే, మహేశ్ బర్త్ డే సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని తెగ నిరుత్సాహ పరిచింది. తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి చిత్రబృందం కసరత్తులు చేయడంతో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అది తుది రూపం దాల్చలేదు. ఏ క్షణమైనా పాటను రిలీజ్ చేయాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా ప్రోమోని కూడా కట్ చేసి పెట్టుకున్నారట. చివరికి ఆ ఆశ నిరాశే అయింది. శ్రీలీల, మహేశ్ బాబు బర్త్ డేలు రెండూ ఒక్కటేనా? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.
https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU
ఆగస్టు 09 , 2023
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
MEGA HEROS: టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ డామినేషన్.. ఇంత మంది హీరోలా?
ఒకప్పుడు టాలీవుడ్ అనగానే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్‌స్టార్ కృష్ణ గుర్తుకువచ్చేవారు. కానీ చిరంజీవి (Chiranjeevi) రాకతో తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన చిరు.. ఇండస్ట్రీలో అగ్రహీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తద్వారా తన ఫ్యామిలీలోని యువతరానికి ఇండస్ట్రీ తలుపులు తెరిచాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా హీరోల హవా నడుస్తోంది. ప్రతీ ఏడాది మెగా హీరోల నుంచి కనీసం ఒక సినిమా అయినా రావాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌ను శాసిస్తున్న మెగా హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
పవన్ కల్యాణ్
చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరిగా క్రేజ్ సంపాదించాడు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (1996) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్.. సుస్వాగతం, తొలి ప్రేమ, ఖుషీ మూవీలతో అగ్రహీరోల సరసన చేరిపోయాడు. రీసెంట్‌గా పవన్ తీసిన వకీల్ సాబ్ (Vakeel saab), భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీర మల్లు సినిమా షూటింగ్‌లలో పవన్ బిజీగా ఉన్నాడు.
రామ్‌చరణ్
చిరు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్ (Ram Charan).. ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. మెుదట చిరుత సినిమా ద్వారా చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. రంగస్థలం (Rangasthalam) సినిమాతో చెర్రీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దానిని ఆర్‌ఆర్‌ఆర్ మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ సినిమా ఉండనుంది.
అల్లుఅర్జున్
చిరు మేనల్లుడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా అల్లుఅర్జున్ (Allu Arjun) సినిమాల్లోకి వచ్చారు. తొలి సినిమా ‘గంగోత్రి’తో బన్ని మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన ఆర్య, బన్నీ, దేశముదురు చిత్రాలతో హీరోగా అల్లుఅర్జున్ స్థిరపడ్డారు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప (Pushpa) సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తెలుగు హీరోల్లో బన్నీ తొలిస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) షూటింగ్‌లో బన్నీ బిజీబిజీగా గడుపుతున్నాడు.
సాయిధరమ్ తేజ్
చిరంజీవి సోదరి కుమారుడైన సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా మెగా మేనల్లుడుగానే ఇండస్ట్రీ తలుపు తట్టాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ (2014) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, చిత్ర లహారి సినిమాల ద్వారా సూపర్ హిట్స్ అందుకున్నారు. సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరణ్ తేజ్
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా వరణ్ తేజ్(Varun Tej) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం ‘ముకుంద’తో తేజ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తేజ్ హీరోగా చేసిన కంచె, అంతరిక్షం, తొలిప్రేమ, ఫిదా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం తేజ్ VT13, గాంధీవదారి అర్జున సినిమాల్లో నటిస్తున్నాడు.
పంజా వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej) కూడా చిరు సోదరి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ఉప్పెనతోనే ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన కొండపొలం మూవీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే రీసెంట్‌గా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా వైష్ణవ్‌కు షాక్ ఇచ్చింది. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అల్లు శిరీష్
చిరు మేనల్లుడిగా, బన్నీ తమ్ముడిగా అల్లు శిరీష్ (Allu Sirish) సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రం గౌరవంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్... ఒక క్షణం, ABCD, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకున్నాడు. శిరీష్ చేసిన శ్రీరస్తూ శుభమస్తూ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చింది. అయితే శిరీష్ లేటెస్ మూవీ ఊర్వశివో రాక్షసివో చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
కళ్యాణ్ దేవ్
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విజేత సినిమా ద్వారా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైన కళ్యాణ్ దేవ్ పర్వాలేదనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూపర్ మచ్చి, కిన్నెర సాని చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ఏప్రిల్ 11 , 2023
Pawan Kalyan: 2029 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ పొలిటికల్ థ్రిల్లర్?
ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన సక్సెస్ మీట్‌లో నాగవంశీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తమ బ్యానర్‌పై రాబోయే చిత్రాల గురించి మాట్లాడారు.
నాగవంశీ చెప్పిన వివరాల ప్రకారం, 2018లో ఒక డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు తమకు మంచి విజయాలను అందించాయి. ఈ సక్సెస్ తరువాత త్రివిక్రమ్‌తో మరో భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నాగవంశీ వెల్లడించారు. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాగా ఉండబోతుందని, ఈ చిత్రం 2029 ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్‌తో నేరుగా త్రివిక్రమ్ చేసిన లాస్ట్ చిత్రం అజ్ఞాతవాసి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన బీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలు త్రివిక్రమ్ మార్గదర్శనంలో సాగాయి. దీంతో వీరి కలయికలో సాలిడ్ హిట్ కోసం ప్రేక్షకులైతే ఎదురు చూస్తున్నారు.
కథా నేపథ్యం
నాగవంశీ స్పీచ్ తర్వాత.. త్రివిక్రమ్ తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పవన్ కళ్యాణ్ ఏవిధంగా చూపించబోతున్నాడు. ఆయన ఎలాంటి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు అనే ఆసక్తి పెరిగింది. 2014 నుంచి పవన్ కళ్యాణ్ ప్రస్థానం, జనసేన పార్టీ ఆవిర్భవానికి గల కారణాలు వంటివి సినిమాలో ఉండే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి ఎపిసోడ్, జగన్ ప్రభుత్వ పాలన లోపాలు వంటివి చూపించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం ప్రధానంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పెట్టుకున్న పొత్తు, చంద్రబాబు జైలు ఎపిసోడ్, వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు సినిమాలో ప్రధాన భాగం కావొచ్చు.
ఇప్పటి వరకు ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ జనర్లకే పరిమితమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు.. పొలిటికల్ థ్రిల్లర్‌కు మారడం సర్వత్రా ఉత్కంట నెలకొంది. అయితే ఆయన తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్‌లో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నందున, ఈ కథకు ఆయన అనుకూలమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
షూటింగ్‌ల్లో పవన్ బిజీ బిజీ
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తన పెండింగ్ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఓజీని వచ్చే ఏడాది అక్టోబర్ 25న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్ ఫిక్స్ చేసింది.
నవంబర్ 02 , 2024
DIRECTORS: దర్శకులుగా వచ్చి నటులుగా సెటిల్ అయిపోతున్న డైరెక్టర్లు
సినిమా వాళ్ల కెరీర్ అంతా చిత్ర విచిత్రమే. ఎందుకంటే విలన్ అవుదామనుకొని కమెడియన్‌గా, హీరో అవ్వాలనుకొని దర్శకులుగా, డైరెక్టన్ చేయాలని వచ్చి డాన్స్ మాష్టర్లుగా సెటిల్ అవుతుంటారు. ఇక ఇంకో కేటగిరీ కూడా ఉంది. దర్శకులుగా హిట్లు కొట్టి తర్వాత నటులుగా మారిపోతుంటారు. దండిగా వచ్చే ఆదాయమో లేదా ఇష్టమో కానీ, ఇలా మారిన దర్శకులు చాలామందే ఉన్నారు వాళ్లేవరో చూద్దామా?
సముద్రఖని
సముద్రఖని తొలుత అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చి తమిళ్‌లో సినిమాలకు దర్శకత్వం వహించాడు. రఘువరన్ బీటెక్ చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు సముద్రఖని. అప్పట్నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అలా వైకుంఠపురం చిత్రంతో విలన్‌గా మారాడు ఈ దర్శకుడు. క్రాక్, బీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలతో తనలో ఉన్న మరో కోణాన్ని వెలికి తీసి ఇప్పుడు నటుడిగా సెటిల్ అయిపోయాడు.
ఎస్‌జే సూర్య
పవన్ కల్యాణ్‌తో ఖుషీ సినిమా తీసిన ఎస్‌జే సూర్య తెలియనివారు ఉండరు. వివిధ చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ చేశాడు సూర్య. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబోలో వచ్చిన స్పైడర్ చిత్రంలో విలన్‌గా విశ్వరూపం చూపించాడు. ఏడుస్తున్న వారిని చూసి నవ్వుతూ సంతోషపడే క్యారెక్టర్ బాగా పేలింది. తర్వాత మెర్సల్, మానాడు వంటి చిత్రాల్లో ఎస్‌జే సూర్య నటనకి ఫిదా అవ్వాల్సిందే.
గౌతమ్ మీనన్
ఘర్షణ, ఏ మాయ చేశావే, ఎటో వెళ్లిపోయింది మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ మీనన్ నటుడిగా బిజీ అయిపోయాడు. పోలీస్ పాత్రలకు సరిగ్గా సరిపోయే పర్సనాలిటీ గౌతమ్‌ది. కనులు కనులు దోచే సినిమాలో నెగటివ్ షేడ్ రోల్‌లో మెప్పించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్ చిత్రంలో విలన్‌గా కనిపించి షాకిచ్చాడు ఈ దర్శకుడు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధమని మిగతా దర్శకులకు హింట్ ఇచ్చేస్తున్నాడు.
భారతీ రాజా
శ్రేదేవితో పదహారేళ్ల వయసు చిత్రం తీసిన దర్శకుడు గుర్తున్నాడా? అంత సులభంగా లెజెండరీ దర్శకుడిని ఎలా మర్చిపోతారు. అతడే భారతీ రాజా. ఆయన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ధనుశ్ హీరోగా వచ్చిన తిరు చిత్రంలో తాతగా నవ్వించారు. ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన సార్‌లోనూ చివర్లో గెస్ట్‌రోల్‌లో నటించారు భారతీ రాజా.
తరుణ్ భాస్కర్
పెళ్లి చూపులు వంటి మెుదటి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తర్వాత నటుడిగా అవతారమెత్తాడు. ఫలక్‌నామా దాస్‌లో మాస్ పోలీస్ ఆఫీసర్‌గా, నేను మీకు తెలుసా చిత్రంలో నటనతో ఆకట్టుకున్నాడు. ఏ సినిమాలో ఛాన్స్ వచ్చినా తరుణ్ భాస్కర్ వదులుకోవట్లేదు.
రిషబ్ శెట్టి
కాంతారా హీరో రిషబ్ శెట్టి తెలుసు కదా.. ఆయన మెుదట దర్శకుడు. క్లాప్ బాయ్, స్పాట్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎదిగాడు. హీరో రక్షిత్ శెట్టితో కలిసి రిక్కీ అనే చిత్రం చేయగా.. యావరేజ్ టాక్ వచ్చింది. తర్వాత అదే హీరోతో కిర్రిక్ పార్టీ చిత్రాన్ని తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కాంతార సినిమాతో ఏకంగా పాన్ ఇండియాను షేక్ చేశాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం వహించాడు.
ఏప్రిల్ 27 , 2023
SAMYUKTHA MENON: విరూపాక్షలో గ్లామర్ డోస్ పెంచిన సంయుక్త… ఇక దేనికైనా తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మ
టాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ సంయుక్త మీనన్. విరూపాక్షతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
సంయుక్త మళయాలం చిత్రాలతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చాలా సినిమాల్లో నటించింది.
బింబిసార చిత్రానికి మెుదట సంతకం చేసినప్పటికీ తెలుగులో విడుదలైన ఫస్ట్ చిత్రం బీమ్లా నాయక్
కల్యాణ్ రామ్ నటించిన బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకుంది సంయుక్త. అందులో మోడ్రన్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో మెప్పించింది.
ధనుష్ నటించిన సార్ చిత్రంలోనూ తళుక్కున మెరిసింది ఈ అమ్మడు. అది కూడా విజయవంతం కావటంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ఇప్పటివరకు సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఉన్న రోల్స్‌లోనే మెరిసింది సుందరి. గ్లామర్ పాత్రల్లో నటించలేదు.
సూపర్ హాట్‌గా కనిపించే సంయుక్త బికినీ ఫోటోలు పెట్టి అప్పట్లో అందర్ని షాక్‌కు గురిచేసింది. ఆ పిక్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. విరూపాక్ష సినిమాలో కాస్త గ్లామర్‌కి పనిచెప్పింది ఈ అమ్మడు. హాఫ్ సారీలో అందచందాలు ప్రదర్శించింది సంయుక్త మీనన్.
సాయిధరమ్ తేజ్‌తో చేసిన కొన్ని సీన్లలో బొల్డ్‌గా కనిపించింది. చీరకట్టులోనైనా కావాల్సిన చోట అందాలు ఆరబోసింది.
పవన్ కల్యాణ్ బీమ్లా నాయక్‌లో ఆఫర్ రావటానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కారణమనే రూమర్స్ ఉన్నాయి. ఆయన కారణంగా అవకాశాలు వస్తున్నాయని టాక్.
చీరకట్టులోనూ ఈ వయ్యారి లుక్ ఇచ్చిందంటే కుర్రాళ్ల మతిపోవాల్సిందే. ఆమె పెట్టె ఫోటోల కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు.
సామాజిక మాధ్యమాల్లో సంయుక్త మీనన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో ఆమెకు 2.6 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు.
సంయుక్త మీనన్ ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన డెవిల్ అనే సినిమాలో చేస్తోంది. బింబిసార 2లోనూ కనిపించే అవకాశం ఉంది.
https://telugu.yousay.tv/sanyukta-menon-is-stunning-in-a-saree.html
https://telugu.yousay.tv/virupaksha-full-review-virupaksha-with-horror-suspense-plot-sai-dharam-tej-super-come-back.html
ఏప్రిల్ 24 , 2023
Akira Nandan: పవన్ కళ్యాణ్ కోసం అకిరా నందన్ ఎమోషనల్ వీడియో.. నెట్టింట వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగుతోంది. ఏపీలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100 స్టైక్ రేట్‌తో గెలిచి ఆయన రాజకీయాల్లో నయా రికార్డును సృష్టించారు. పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలవడంతో పాటు.. కూటమి విజయం (164/175)లో కీలక పాత్ర పోషించిన పవన్‌కు శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, అభిమానులు ఆయన్ను పెద్ద ఎత్తున విష్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో పవన్ తనయుడు అకిరా నందన్ (Akira Nandan) తన తండ్రి కోసం ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.
నాన్నకు ప్రేమతో..
పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాడు. విజయోత్సహంలో ఉన్న పవన్ కల్యాణ్ సంతోషంలో పాలుపుంచుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా తన తండ్రి కోసం ఎడిట్ చేసిన వీడియోను పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘కొన్ని వారాల క్రితం వాళ్ల నాన్న కోసం అకీరా నందన్ (Akira Nandan) చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్‌పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అకీరా ఎంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాడు’ అని రేణు దేశాయ్ (Renu Desai) దీనికి క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో పవన్ అభిమానులను జనసేన కార్యకర్తలను విపరీతంగా ఆకర్షిస్తోంది.
View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
పవన్ పంచ్ డైలాగ్స్..
అకిరా ఎడిట్ చేసిన వీడియోలో పవన్ సినిమాలకు సంబంధించిన క్లిప్స్ ఉన్నాయి. ‘ఖుషి’ (Kushi) నుంచి ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) వరకు పవన్ చేసిన చిత్రాల్లోని పవర్‌ఫుల్ డైలాగులతో అకీరా ఈ వీడియోను రూపొందించాడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తున్నాయని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుదంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తాము చూసిన పవన్ ట్రెండింగ్ వీడియోల్లో ఇదే బెస్ట్ అంటూ అకీరాను ఆకాశానికి ఎత్తుతున్నారు.
https://twitter.com/i/status/1798036906124657133
తండ్రితోనే అకిరా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. పిఠాపురంలో 70 వేలకు పైగా మెజార్టీ సాధించారు. ఫలితాలు వెలువడిన రోజు పవన్ భార్య అన్నా లెజ్నెవా ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలో పవన్ రెండో భార్య కుమారుడు అకిరా నందన్ కూడా కనిపించాడు. పవన్ కల్యాణ్‌కు ఆయన భార్య వీర తిలకం పెడుతుండగా.. అకీరా కూడా అక్కడే నిలబడ్డాడు. అనంతరం తండ్రితో పాటే అమరావతిలోని నివాసానికి అకిరా వెళ్లాడు. కూటమి విజయం అనంతరం పవన్‌ను కలవడానికి వచ్చిన చంద్రబాబు కాళ్లకు నమస్కారం సైతం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
https://twitter.com/i/status/1797940145787908224
https://twitter.com/i/status/1798002911848673587
అకిరా ఎంతో టాలెంటెడ్!
అకిరా నందన్ వ్యక్తిగత విషయాలకు వస్తే అతడు ఎంతో టాలెంటెడ్. ఆటలు, పాటలు ఇలా అన్నింట్లో అకిరాకు ప్రావిణ్యం ఉంది. బాస్కెట్ బాల్ కూడా బాగా ఆడతాడని అతడి సన్నిహితులు తెలిపారు. అకిరా చదువులో కూడా ఫస్ట్ ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సంగీతంపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం అతడు మ్యూజిక్ కోర్సులు చేస్తున్నాడు. అతడి మ్యూజిక్ టాలెంట్ తెలిసే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో అతడి చేత ప్రత్యేక పర్‌ఫార్మెన్స్ చేయించింది. ఆ సందర్భంలోనే యానిమల్ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అంటూ పాటకు పియానో వాయించి అకిరా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/i/status/1747251367033577947
జూన్ 06 , 2024
రానా దగ్గుబాటి (Rana Daggubati) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తన నటనతో విలక్షణ నటుడిగా ఎదిగాడు రానా దగ్గుబాటి. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ భాషల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్నాడు. బాహుబలి1, బాహుబలి2, నేనేరాజు నేనే మంత్రి, లీడర్ చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు రానా దగ్గరయ్యాడు. తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
రానా అసలు పేరు?
రామానాయుడు
రానా ఎవరు?
తెలుగులో దిగ్గజ నిర్మాత అయిన డి.రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు
రానా ఎత్తు ఎంత?
6 అడుగుల 2 అంగుళాలు
రానా ఎక్కడ పుట్టారు?
నిజామాబాద్
రానా వివాహం అయిందా?
మిహికా బజాజ్‌తో 2020లో పెళ్లి జరిగింది.
రానాకి ఇష్టమైన రంగు?
బ్లాక్
రానా తల్లిదండ్రుల పేరు
డి.సురేష్ బాబు, లక్ష్మి దగ్గుబాటి
రానా అభిరుచులు?
చెత్తను రీ సైక్లింగ్ చేయడం, బాక్సింగ్, ఫొటోగ్రఫి, వంటచేయడం వంటివి అతని అభిరుచులు
రానాకి ఇష్టమైన ఆహారం?
నాటు కోడి పులుసు
రానా అభిమాన నటుడు?
కమల్ హాసన్, అక్షయ్ కుమార్
రానాకు స్టార్ డం అందించిన సినిమాలు?
లీడర్, బాహుబలి సిరీస్, నేనేరాజు నేనే మంత్ర
రానా ఏం చదివాడు?
ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీలో డిగ్రీ చదివాడు
రానా ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 22 సినిమాల్లో నటించాడు
రానా సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.8కోట్ల వరకు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=WHGxx6ganOY
రానా ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
బాహుబలి2 చిత్రానికి గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నాడు. అలాగే సైమా అవార్డుల్లో ఉత్తమ ప్రతినాయకుడు అవార్డులను బాహుబలి1,2 చిత్రాలు, భీమ్లానాయక్ సినిమాలకు గాను గెలుచుకున్నాడు.
మే 29 , 2024
Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి.
[toc]
Drushyam
దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్) ఊరిలో కేబుల్ నెట్‌వర్క్ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ.
Karthikeya 2
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే…
కార్తికేయ (నిఖిల్)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.
Bichagadu 2
ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ
F2
2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్(వరుణ్ తేజ్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ.
Ante Sundaraniki
గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ.
Tholiprema
ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే..
అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ.
Pelli Choopulu
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్ (విజయ్ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్ పెట్టే ఫుడ్ ట్రక్ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
ఓటీటీ సన్ నెక్ట్స్
Spyder
స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే…
ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ.
ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్
Raja The Great
రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా
Ori Devuda
వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది.
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా
Bichagadu
ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో
Jalsa
సంజయ్ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు.
ఓటీటీ: ఆహా
Nenu
అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
Sye Raa Narasimha Reddy
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే..
భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ
Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది.
Bharat Ane Nenu
సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా
Ye Maaya Chesave
ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Baahubali: The Beginning
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
Businessman
ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్
Good Luck Sakhi
బంజార యువతి సఖి (కీర్తి సురేష్) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Oxygen
అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
Adipurush
ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ
ఓటీటీ: సన్ నెక్ట్స్
SR Kalyanamandapam
కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్.ఆర్. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్ చదివే కల్యాణ్ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ.
ఓటీటీ: ఆహా
Disco Raja
భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ
ఓటీటీ: సన్ నెక్స్ట్
Goutham Nanda
మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
Kirrak Party
కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Teja
తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
Pelli Sandadi
శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ.
ఓటీటీ:యూట్యూబ్
Swathi Muthyam
బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.
ఓటీటీ: జియో టీవీ
Dhruva
ఐపీఎస్ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్).. సిద్ధార్థ్ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
KGF 2
రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ.
Baadshah
ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
ఓటీటీ: యూట్యూబ్
Pushpa
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
Nannaku Prematho
హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
Ala Modalaindi
లవ్ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్ మొదలవుతుంది.
ఓటీటీ: జీ5, ప్రైమ్
Sir
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
Jersey
అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: జీ5
Hit: The First Case
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Aditya 369
అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
Aha Naa Pellanta
ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Vikram Vedha
వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ: ప్రైమ్
Bro
మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్(పవన్ కళ్యాణ్)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Khaidi
ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
Uppena
మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్ తేజ్) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Geetha Govindam
గోవింద్ (విజయ్ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
Acharya
బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
Rang De
అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5
ఓటీటీ: ప్రైమ్
Induvadana
వాసు (వరుమ్ సందేశ్) ఫారెస్ట్ పోలీసాఫీసర్. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
Maharshi
మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
Aakaasam Nee Haddhu Ra
సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్
Ala Vaikunthapurramuloo
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Munna
కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
RRR
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5
Bommarillu
సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
Dear Comrade
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Jathi Ratnalu
మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ: ప్రైమ్
Dirty Hari
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ
ఓటీటీ: ఆహా
Arjun Reddy
అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా, ప్రైమ్
Rangasthalam
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్
జూన్ 25 , 2024
Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్.. ఇది మామూలు హైప్ కాదు భయ్యా!
‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్ జరగ్గా రానాపై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘రానా భయపెట్టాడు’
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్ చేస్తూ సీరియస్ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్ లుక్ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1843720706057724332
కథ మార్చేసిన రజనీ
వేట్టయన్ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేష్ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.
రజనీపై తమిళ డైరెక్టర్ ఆరోపణలు
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రజనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చేయనున్నారు రజనీ.
అక్టోబర్ 09 , 2024
Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘రజనీ.. గందరగోళం చేసేశారు’
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మూడు చిత్రాలకు వర్క్!
దర్శకుడు కె.ఎస్. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.
33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..!
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్ 3 రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
దసరా బరిలో రజనీ చిత్రం
రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘కూలీ’లో స్టార్ క్యాస్ట్!
ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.
అక్టోబర్ 07 , 2024
Ravanasura Review: విలన్ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్..!
నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్, సంపత్, మురళి శర్మ, రావు రమేష్
దర్శకుడు: సుధీర్ వర్మ
రచయిత: శ్రీకాంత్ విస్సా
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
మాస్ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం.
కథ ఏంటంటే:
రావణసుర కథలోకి వెళితే... ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ మేఘా ఆకాష్ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం.
ఎలా చేశారంటే:
ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్ రోల్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు. హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్, మురళి శర్మ, రావు రమేష్ నటన కూడా ఆకట్టుకుంటుంది.
టెక్నికల్‌గా:
ఈ సినిమాను డైరెక్టర్ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్
రవితేజ యాక్టింగ్హీరోయిన్స్ గ్లామర్కథబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్
సినిమా ఫస్టాప్ సాగదీత సన్నివేశాలు
చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్.
రేటింగ్: 2.75/5
ఏప్రిల్ 07 , 2023
Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
సూపర్ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్ ‘కామిక్ కాన్’ (Comic Con). అవెంజెర్స్, స్పైడర్‌మ్యాన్, అవతార్, సూపర్ మ్యాన్ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్ కాన్ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హనుమాన్ (Hanuman)
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్ సూపర్ మ్యాన్ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్ హెయిర్ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు.
భీమ్ (ఆర్ఆర్‌ఆర్)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్’ చిత్రంలో తారక్ (Jr NTR) భీమ్ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాడే సీన్ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్ వేస్తే మీరూ భీమ్ లాగా కనిపించవచ్చు.
బాహుబలి (Bahubali)
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో అంతం చేస్తాడు. అటువంటి బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.
భల్లాల దేవ (Bhallala Deva)
‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.
కట్టప్ప (Kattappa)
‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.
కాలకేయ (Kalakeya)
కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్ రోల్ హైలెట్ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు.
అపరిచితుడు (Aparichithudu)
ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ నిపుణులతో విక్రమ్ చేసే ఫైట్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్ డ్రెస్ ధరించి లాంగ్ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.
రోబో (Robo)
భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో రజనీకాంత్ సూపర్ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.
పక్షిరాజా (Pakshi Raja)
‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.
అరుంధతి (Arundhati)
తెలుగులో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.
పశుపతి (Pasupathi)
తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.
ఆదిత్య 369 (Aditya 369)
బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్ మిషన్ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్ జాకెట్‌ను వేయండి.
సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy)
చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్ చిరంజీవిలాగా లాంగ్ హెయిర్, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.
బింబిసార (Bimbisara)
5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్ రామ్ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్ హెయిర్ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్ రామ్ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.
అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)
బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.
ఫిబ్రవరి 29 , 2024
Ayesha Khan: ‘ఓం భీమ్ బుష్’ భామ అయేషా ఖాన్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
యంగ్ బ్యూటీ అయేషా ఖాన్.. తాజాగా విడుదలైన 'ఓం భీమ్ బుష్' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హాస్యనటుడు ప్రియదర్శికి జోడీగా నటించి తన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను కట్టిపడేసింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ భామ తన అందచందాలను ఆరబోస్తుండటంతో టాలీవుడ్‌కు మరో గ్లామర్ హీరోయిన్ దొరికేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయేషా ఖాన్ (Ayesha Khan) పేరును నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ అయేషాఖాన్ ఎవరు? ఆమె చేసిన చిత్రాలు ఎన్ని? అయేషా ఇష్టా ఇష్టాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అయేషా ఖాన్ ఎవరు?
టాలీవుడ్‌కు చెందిన యువ నటి. హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే ఆమె ఎదుగుతోంది.
అయేషా ఖాన్ ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్రలోని ముంబయిలో అయేషా పుట్టింది.
అయేషా ఖాన్ పుట్టిన తేదీ?
13 సెప్టెంబర్, 1992
అయేషా ఖాన్ తల్లిదండ్రులు ఎవరు?
అయేషా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు షాదబ్ ఖాన్ & Mrs ఖాన్
అయేషా ఖాన్‌కు సోదరులు ఉన్నారా?
ఈ బ్యూటీకి ఇద్దరు సోదరులు ఉన్నారు. అన్న షాదబ్ ఖాన్ ఓ ప్రైవేటు కంపెనీ పని చేస్తున్నాడు. తమ్ముడు షాబజ్ ఖాన్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అయేషా ఖాన్ ఎత్తు ఎంత?
162 సెం.మీ
అయేషా ఖాన్ ఏం చదివారు?
ఈ భామ ఇంటర్ వరకూ చదువుకుంది.
అయేషా ఖాన్ ఎక్కడ చదివారు?
ఈ బ్యూటీ విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే జరిగింది.
అయేషా ఖాన్ కెరీర్ ఎలా మెుదలైంది?
కెరీర్ ప్రారంభంలో అయేషా మోడల్‌గా చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ ఆమెకు గుర్తింపు ఉంది.
అయేషా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఘటన?
హిందీలో 'బిగ్ బాస్ 17' సీజన్‌లో పాల్గొనడం అయేషా ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ రియాలిటీ షో ద్వారా అయేషా అందరి దృష్టిలో పడింది.
అయేషా ఖాన్ నటనా ప్రవేశం ఎలా జరిగింది?
హిందీలో స్టార్‌ప్లస్ ఛానెల్‌లో వచ్చిన 'కసౌతి జిందగీ కే' సీరియల్‌తో అయేషా ఖాన్ తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సోనీలో 'బల్‌వీర్ రిటర్న్స్' అనే సీరియల్‌లోనూ కనిపించింది.
అయేషా ఖాన్ తొలి చిత్రం?
తెలుగులో వచ్చిన ముఖచిత్రం (2022) ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది.
అయేషా ఖాన్ లేటెస్ట్ చిత్రం?
అయేషా నటించిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’. ఇది ఆమెకు రెండో సినిమా. ఇందులో రత్తాలు పాత్రలో అయేషా గ్లామర్ షో చేసింది.
అయేషా ఖాన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం అయేషా.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.
అయేషా ఖాన్ ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్ అంటే ఈ భామకు చాలా ఇష్టం. చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏదైనా ఇష్టంగా తింటుందట.
అయేషా ఖాన్ ఫేవరేట్ నటుడు?
ఈ భామకు అక్షయ్ కుమార్ నటన అంటే చాలా ఇష్టమట.
అయేషా ఖాన్ ఫేవరేట్ హీరోయిన్?
ప్రియాంక చోప్రా తన ఫేవరేట్ అని అయేషా ఓ సందర్భంలో తెలిపింది.
అయేషా ఖాన్ ఇష్టమైన కలర్?
నలుపు, తెలుపు
అయేషా ఖాన్ ఫేవరేట్ రియాలిటీ షో?
బిగ్‌బాస్
అయేషా ఖాన్‌కు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?
మునావర్ ఫారుఖీతో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. దీనిపై ఆమె ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అయేషా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ?
https://www.instagram.com/ayeshaakhan_official/?hl=en
మార్చి 23 , 2024
Preity Mukhundhan: ‘ఓం భీమ్ బుష్’ బ్యూటీ ప్రీతి ముకుందన్ గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan).. ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు (Sri Vishnu)కు జోడీగా కనిపించి అందర్ని మెప్పించింది. మంచు విష్ణు (Manchu Vishnu) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa)లోనూ ఈ బ్యూటీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీంతో ప్రీతి ముకుందన్ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తెచ్చింది.
ప్రీతి ముకుందన్ ఎవరు?
టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరోయిన్
ప్రీతి ముకుందన్ ఎక్కడ పుట్టింది?
తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతం ఆమె జన్మ స్థలం
ప్రీతి ముకుందన్ పుట్టిన తేదీ?
జులై 30, 2001లో ప్రీతి ముకుందన్ జన్మించింది.
ప్రీతి ముకుందన్ తల్లిదండ్రులు ఎవరు?
తన పేరెంట్స్ సంబంధించిన సమాచారాన్ని ప్రీతి ఎక్కడా బహిరంగ పరచలేదు. దీనిపై ఆమె గోప్యత పాటిస్తోంది.
ప్రీతి ముకుందన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
ప్రీతి తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అని తెలుస్తోంది.
ప్రీతి ముకుందన్ ఏం చదివారు?
ఈ బ్యూటీ బిటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేసింది.
ప్రీతి ముకుందన్ ఎక్కడ చదివారు?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచ్చి (NIT-T)
ప్రీతి ముకుందన్‌కు భరతనాట్యం వచ్చా?
ఈ భామకు డ్యాన్స్ అంటే మహా ఇష్టం. తన ఐదో ఏట నుంచి భరతనాట్యానికి శిక్షణ తీసుకుంది. ‘కన్నప్ప’ చిత్రంలో అవకాశం రావడానికి ఈ నైపుణ్యం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో టాక్.
ప్రీతి ముకుందన్ ఎలాంటి డ్యాన్స్‌లు చేయగలదు?
ప్రీతి తొలుత క్లాసికల్ డ్యాన్సర్. ఆ తర్వాత హిప్‌హాప్, సినీ ఫోక్, వెస్టర్న్ తదితర వాటిలో కూడా పట్టు సాధించిది. కళాశాల సమయంలో పలు డ్యాన్స్ ఈవెంట్స్‌లో పాల్గొని ప్రీతి బహుమతులు కూడా అందుకుంది.
ప్రీతి ముకుందన్ కెరీర్ ఎలా మెుదలైంది?
సినిమాల్లోకి రాకముందు ప్రీతి కొంతకాలం పాటు మోడల్‌గా పనిచేసింది. ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసింది.
ప్రీతి ముకుందన్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఏవి?
మోడలింగ్ తర్వాత ప్రీతి యూట్యూబ్ కేంద్రంగా పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. ' Muttu Mu2' ఆల్బమ్‌తో ఆమె పేరు ఒక్కసారిగా తమిళనాడులో మార్మోగింది. ఈ వీడియోకు యూట్యూబ్‌లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ప్రీతి ముకుందన్ తొలి చిత్రం ఏది?
‘ఓం భీమ్ బుష్’ సినిమా ద్వారానే ప్రీతి తొలిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వాస్తవానికి ‘కన్నప్ప’.. తెలుగులో ఆమె ఓకె చెప్పిన మెుదటి చిత్రం. అది ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
ప్రీతి ముకుందన్ ఫ్యూజర్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం తమిళంలో స్టార్ అనే సినిమా చేస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ కెవిన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఎలాన్ దర్శకత్వం వహిస్తుండగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రీతి ముకుందన్‌కు ఇష్టమైన హీరో, హీరోయిన్, ఫుడ్ ఏవి?
తన ఫేవరేట్ హీరో, హీరోయిన్లు, ఫుడ్ గురించి ప్రీతి ముకుందన్ ఏ వేదికపైన పంచుకోలేదు. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ప్రీతి ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ?
https://www.instagram.com/preity_mukhundhan
మార్చి 22 , 2024
Om Bheem Bush 4 Days Collections: ‘ఓం భీమ్ బుష్’ కలెక్షన్ల సునామీ.. 4 రోజుల్లో రికార్డు స్థాయి వసూళ్లు!
శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush). శ్రీ హర్ష కొనుగంటి (Sri Harsha Konuganti) దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ (UV Creations), వి సెల్యులాయిడ్స్ (V Celluloids) సంయుక్తంగా నిర్మించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. నాలుగు రోజుల్లో గణనీయమైన వసూళ్లను రాబట్టింది. అటు యూఎస్‌లోనూ ఈ సినిమా అదరగొడుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నాలుగు రోజుల కలెక్షన్స్
‘ఓం భీమ్ బుష్’ చిత్రం.. హిట్ టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.21.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో ఇదే హయేస్ట్ నాలుగు రోజుల గ్రాస్ వసూళ్లు. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా.. నాల్గో రోజు హోలీ సందర్భంగా మరిన్ని కలెక్షన్స్‌ను రాబట్టింది. నిన్న ఒక్కరోజే రూ.4.75 కోట్ల గ్రాస్‌ను సంపాదించింది. తొలి రోజు వసూళ్లతో (రూ.4.60 కోట్ల గ్రాస్) పోలిస్తే అధికంగా రాబట్టడం విశేషం.
https://twitter.com/Box_Office_BO/status/1772492175797813683
నెట్ వసూళ్లు ఎంతంటే?
‘ఓం భీమ్ బుష్’ సినిమా నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో భారత్‌లో రూ.8.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తొలి రోజున రూ.1.75 కోట్లు, రెండో రోజు రూ.2.5 కోట్లు, మూడో రోజు రూ,2.35 కోట్లు, నాల్గో రోజు రూ.1.50 + కోట్లు రాబట్టింది. మున్ముందు ఈ నెట్ వసూళ్లు మరింత పెరగనున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఓవర్సీస్‌లో డాలర్ల వర్షం
భారత్‌తో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా 'ఓం భీమ్ బుష్'కు మంచి ఆదరణ లభిస్తోంది. ఓవర్సీస్‌లో తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం 4 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది. మరిన్ని డాలర్లు కొల్లగొట్టే దిశగా ప్రస్తుతం దూసుకుపోతోంది. ఈ వీకెండ్ లోపూ ఓవర్సీస్‌లో 6 లక్షల డాలర్ల మార్క్‌ను ‘ఓం భీమ్ బుష్’ అందుకునే అవకాశం కనిపిస్తోంది.
మార్చి 26 , 2024