• TFIDB EN
  • Editorial List
    హాట్‌ స్టార్‌లో ఈ టాప్ హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు తెలుసా?
    Dislike
    600+ views
    10 months ago

    తెలుగు ప్రేక్షకులకు డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాం బోలెడంతా వినోదాన్ని పంచుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరిస్తుంటుంది. అయితే తాజాగా మరికొన్ని హిట్ చిత్రాలను ఫ్రీ స్ట్రీమింగ్ జాబితాలో చేర్చింది. వీటిలో విక్రమ్, భీమ్లానాయక్, బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం వీటిని చూసి ఆనందించండి మరి..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . జై బోలో తెలంగాణ(ఫిబ్రవరి 04 , 2011)
    A|141 minutes|డ్రామా
    తెలంగాణ స్వాతంత్రయ సమరయోధుడి కుమారుడైన వర్షిత్‌.. ఉద్యమంలో పాల్గొనడానికి ఇష్టపడడు. అయితే తన తాతయ్య ఊరికి వెళ్లిన తర్వాత నిర్ణయం మార్చుకుంటాడు. ఆ తర్వాత వర్షిత్ ఏం చేశాడు? అన్నది కథ.
    2 . ప్రేమిస్తే(డిసెంబర్ 17 , 2004)
    UA|డ్రామా,రొమాన్స్
    ఓ బైక్‌ మెకానిక్‌ గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. ఓ రోజు వారిద్దరు పారిపోతారు. అప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులు వారి కోసం విపరీతంగా గాలిస్తారు. మరి ఆ జంట దొరికిందా? హీరో ఎందుకు పిచ్చివాడు అయ్యాడు? అన్నది కథ.
    3 . విశ్వాసం(జనవరి 10 , 2019)
    U|156 minutes|యాక్షన్,డ్రామా
    రావులపాలెంలో ఎంతో గౌరవంగా ఉండే గ్రామపెద్దల్లో వీర్రాజు(అజిత్) ఒకరు. అతను ఊరి ప్రజలకు ఎల్లవేళలా సహాయం చేస్తుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల వీర్రాజు భార్య (నయనతార) అతనికి దూరంగా ఉంటుంది.అయితే ముంబైలో ఉంటున్న వీర్రాజు కుటుంబానికి ఓ సమస్య వస్తుంది.
    4 . ఊహలు గుసగుసలాడే(జూన్ 20 , 2014)
    U|128 minutes|హాస్యం,రొమాన్స్
    హీరో (నాగశౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది లక్ష్యం. దీనిని ఆసరాగ చేసుకోని కంపెనీ ఎండీ (అవసరాల శ్రీనివాస్‌) హీరోయిన్‌ను పడేసేందుకు సాయం చేయమంటాడు. అలా హీరో ఇచ్చిన సలహాలతో హీరోయిన్‌కు దగ్గర అవ్వాలని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఎండీని కాదని హీరోయిన్‌ హీరోకు ఎలా దగ్గరయ్యింది? అన్నది కథ.
    5 . గద్దలకొండ గణేష్(సెప్టెంబర్ 20 , 2019)
    UA|172 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
    ఒక ఫిల్మ్ మేకర్ గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలని కలలు కంటాడు. ఈ క్రమంలో రియల్ గ్యాంగ్‌స్టర్ అయి గద్దలకొండ గణేష్‌ని తన సబ్జెక్ట్‌గా ఎంచుకుంటాడు. గద్దలకొండ గణేష్‌కు తెలియకుండా అతన్ని అనుసరిస్తాడు. ఈ విషయం గద్దలకొండ గణేష్‌కు తెలిసి ఏం చేశాడు అనేది కథ.
    6 . KGF: చాప్టర్ 1(డిసెంబర్ 21 , 2018)
    UA|155 minutes|యాక్షన్,డ్రామా
    రాకీ అనే యువకుడు, చనిపోయిన తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అధికారం, సంపద కోసం పోరాడుతాడు. అతను తను ఎదిగే క్రమంలో బంగారం మాఫియాతో తలపడుతాడు.
    7 . కేరింత(జూన్ 12 , 2015)
    U|140 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    ఈ చిత్రం కాలేజీ విద్యానంతరం స్నేహం, ప్రేమ, మరియు వివిధ జీవిత దశల ఊహాలను దాటుతూ ఒక యువ మిత్రుల జీవితాల చుట్టూ తిరిగే కథను చెబుతుంది.
    8 . అర్జున్(ఆగస్టు 18 , 2004)
    U|174 minutes|డ్రామా
    అర్జున్ తన సోదరి మీనాక్షికి ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేస్తాడు. అయితే ఈ పెళ్లి ఇష్టంలేని మీనాక్షి అత్తమామలు ఆమె చంపాలని నిర్ణయించుకుంటారు. వారి నుంచి అర్జున్‌ మీనాక్షిని ఎలా కాపాడుతాడనేది కథ
    9 . భలే భలే మగాడివోయ్(సెప్టెంబర్ 04 , 2015)
    U|145 minutes|హాస్యం,రొమాన్స్
    లక్కీ అనే యువకుడు ఒక మొక్కల శాస్త్రవేత్త. మతిమరుపుతో బాధపడుతుంటాడు. నందన అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. తన లోపాన్ని దాచడానికి కష్టపడుతుంటాడు.
    10 . దూకుడు(సెప్టెంబర్ 23 , 2011)
    UA|175 minutes|యాక్షన్,డ్రామా
    మాజీ ఎమ్మెల్యే శంకర్‌ కోమాలోకి వెళ్లి కొన్ని సంవత్సరాల తర్వాత బయటకి వస్తాడు. డాక్టర్లు ఆయనకు షాకింగ్ విషయాలు చెప్పవద్దని చెప్తారు. దీంతో పోలీసాఫీసర్ అయిన అజయ్‌ తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు యత్నిస్తాడు. అదే సమయంలో తండ్రికి అన్యాయం చేసిన వారిపై ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడు? అన్నది కథ.
    11 . ప్రతి రోజు పండగే(డిసెంబర్ 20 , 2019)
    U|146 minutes|హాస్యం,డ్రామా
    తన తాత రఘు రామయ్య చివరిరోజుల్లో సంతోషం ఉండాలని సాయి కోరుకుంటాడు. రఘు రామయ్య పిల్లలు అతన్ని పరామర్శించేందుకు కూడా ఇష్టపడరు. దీంతో సాయి ఏం చేశాడు. వారిని ఎలా రప్పించాడు అనేది సినిమా కథ
    12 . రంగస్థలం(మార్చి 30 , 2018)
    UA|174 minutes|డ్రామా,హిస్టరీ,రొమాన్స్
    ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ.
    13 . సూర్య vs సూర్య(మార్చి 05 , 2015)
    U|130 minutes|రొమాన్స్
    సూర్య వంశపారంపర్యమైన వ్యాధితో బాధపడుతుంటాడు, అది అతన్ని పగలు బయటికి వెళ్లనివ్వదు. అతను టీవీ యాంకర్ సంజనతో ప్రేమలో పడడంతో పరిస్థితులు మారిపోతాయి.
    14 . 118(మార్చి 01 , 2019)
    UA|126 minutes|యాక్షన్,థ్రిల్లర్
    గౌతమ్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అతనికి రోజూ ఒక మహిళ హత్యకు గురైనట్లు పదే పదే పీడకలలు వస్తుంటాయి. అయితే తన కల వెనుక నిజాన్ని కనుగోనేందుకు అన్వేషణ మొదలు పెడుతాడు.
    15 . జయ జానకి నాయక(ఆగస్టు 11 , 2017)
    UA|149 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    గగన్, స్వీటీ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ ఆమె తండ్రి గగన్‌ను అంగీకరించకపోవడంతో విడిపోవాల్సి వస్తుంది. ఒక రోజు దుండగుల నుంచి ఒక కుటుంబాన్ని రక్షించే సమయంలో, గగన్ తనకు తెలియకుండా స్వీటీని రక్షిస్తాడు.
    16 . రాజు గారి గది 3(అక్టోబర్ 18 , 2019)
    UA|122 minutes|హాస్యం,హారర్
    అశ్విన్, మాయ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమకు ఒక ప్రేతాత్మ అడ్డుపడుతోందని తెలుసుకుంటారు. తమ జీవితాన్ని సాధారణ స్థితికి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్న అశ్విన్ ఏం చేశాడు అనేది కథ
    17 . డియర్ కామ్రేడ్(జూలై 26 , 2019)
    UA|170 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ.
    18 . శక్తి(ఏప్రిల్ 01 , 2011)
    UA|170 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    పొలిటిషియన్‌ కూతురైన ఐశ్వర్య శక్తిని కలుస్తుంది. అతడి ప్రవర్తన మూలంగా మెుదట్లో శక్తని ద్వేషిస్తుంది. అయితే గ్యాంగ్‌స్టర్ల నుంచి తన ప్రాణం కాపాడటంతో ఆమె శక్తి ప్రేమలో పడుతుంది. ఇంతకి ఐశ్వర్యపై దాడి చేసింది ఎవరు? శక్తి గతం ఏంటి? అన్నది కథ.
    19 . ఎంత మంచివాడవురా(జనవరి 15 , 2020)
    U|144 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    తల్లిదండ్రుల చనిపోవడంతో బాలు కుటుంబ ప్రేమ లేకుండా పెరుగుతాడు. పెద్దాయ్యక ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. తనలాగే తల్లిదండ్రులను కోల్పోయి కుటుంబ ప్రేమను పొందలేని వారిని అక్కున చేర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు.
    20 . రఘువరన్ బి.టెక్(జూలై 18 , 2014)
    U|135 minutes|యాక్షన్,రొమాన్స్
    రఘువరన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్న నిరుద్యోగి. చదువుకు సంబంధం లేని పని చేయడానికి ఇష్టపడడు. దాంతో అతను చాలా అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. అనిత(సురభి) వల్ల రఘువరన్‌కి సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం వస్తుంది. ఆ జాబ్‌లో రఘువరన్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అన్నది కథ.

    @2021 KTree