ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ సూన్ ఆన్Hotstar
Watch
Free
స్ట్రీమింగ్ సూన్ ఆన్Youtube
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
అల్లు అర్జున్
విరాజ్ ఆనంద్ఉపేంద్ర
దేవరాజ్ నాయుడుసమంత రూత్ ప్రభు
సమీర / సుబ్బలక్ష్మి, విరాజ్ ప్రేమ ఆసక్తినిత్యా మీనన్
వల్లి, దేవరాజ్ సోదరిస్నేహ
దేవరాజ్ భార్య లక్ష్మిఅదా శర్మ
కొలసాని పల్లవి, ఆనంద్‌కి మాజీ కాబోయే భార్యరాజేంద్ర ప్రసాద్
సమీర తండ్రి పైడా సాంబశివరావురావు రమేష్
పల్లవి తండ్రికోట శ్రీనివాసరావు
దేవరాజ్ తండ్రిపవిత్ర లోకేష్
శారద, ఆనంద్ తల్లిసింధు తోలానీ
ఆనంద్ కోడలువెన్నెల కిషోర్
ఆనంద్ సోదరుడుఅలీ పరమధామయ్య a.k.a. పరమ
బ్రహ్మానందం
కోడా రామ్మోహన్, దేవరాజ్ బావమరిదిసిబ్బంది
త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకుడుఎస్. రాధా కృష్ణ
నిర్మాతదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుప్రసాద్ మూరెళ్ల
సినిమాటోగ్రాఫర్ప్రవీణ్ పూడి
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
“విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం.
నువ్వు నాకు నచ్చావ్!
ప్రకాశ్ రాజ్ ఇంటికి వెంకటేశ్ వచ్చినపుడు సునీల్ తనని ఔట్ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్ సెటైర్ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్ పేరు లంకా” అనేస్తాడు.
https://www.youtube.com/watch?v=UVFCtTNU29s
అత్తారింటికి దారేది
అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్ “ ఒరేయ్ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్ ఎలా కట్టాలి అని ప్లాన్ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు.
https://www.youtube.com/watch?v=9-PckWpekQY
జల్సా
జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.
https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI
అ ఆ
‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు.
https://www.youtube.com/watch?v=qrrldRJc5e8
మన్మథుడు
మన్మథుడులో సునీల్ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్ ఇస్తాడు.
https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు.
అజ్ఞాతవాసి
“సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి)
S/O సత్యమూర్తి
“రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్)
భీమ్లా నాయక్
“ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్)
అతడు
“హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఏప్రిల్ 14 , 2023
Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.
అరవింద సమేత వీరరాఘవ
హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.
https://www.youtube.com/watch?v=qmqQHtla20w
S/O సత్యమూర్తి
ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’ (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది.
https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ
అజ్ఞాతవాసి
ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు.
https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc
జులాయి
తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.
https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U
ఖలేజా
మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.
https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE
ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.
https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
జూన్ 12 , 2023
Allu Arjun - Trivikram: బన్నీ-త్రివిక్రమ్ కాంబోపై క్రేజీ అప్‌డేట్.. వరుసగా నాల్గో బ్లాక్‌బాస్టర్ లోడింగ్!
టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి ముఖ్యంగా కొద్దిమంది హీరోలు, డైరెక్టర్ల కాంబో అంటే ఆడియన్స్ పిచ్చెక్కిపోతారు. ప్రభాస్-రాజమౌళి, త్రివిక్రమ్-పవన్ కల్యాణ్, తారక్ - కొరటాల శివ, అల్లు అర్జున్-సుకుమార్, హరీష్ శంకర్-రవితేజ కాంబోలో చిత్రం అంటే అభిమానులకు పూనకాలే అని చెప్పవచ్చు. అయితే వీటితో పాటు మరో క్రేజీ కాంబోలో కూడా టాలీవుడ్‌లో ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్స్‌లో అదే టాప్ అని చెప్పవచ్చు. అదే బన్నీ-త్రివిక్రమ్ కాంబో. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అది పక్కాగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. గతంలో వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాయి. వీరి కాంబోలో ఫోర్త్ ఫిల్మ్ కూడా ఉండనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్స్ బయకొచ్చాయి.
ముహోర్తం ఫిక్స్!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ కోసం ఆడియన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ముహోర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుండటంతో ఈ సినిమా కూడా మల్టీ లాంగ్వేజెస్‌లో రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ చిత్రం ద్వారానే తొలిసారి పాన్ ఇండియా మార్కెట్‌లో అగుడుపెడతారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆ ఇద్దరిలో ఎవరు!
బన్నీ-త్రివిక్రమ్ చిత్రానికి సంబంధించి హీరోయిన్ ఎంపిక కూడా దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అలియా భట్ (Alia Bhatt)లలో ఒకర్ని బన్నీకి జోడీగా తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. 'దేవర' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన నేపథ్యంలో జాన్వీకి తెలుగులో క్రేజ్ ఏర్పడింది. దీంతో జాన్వీ వైపే త్రివిక్రమ్ మెుగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అటు బన్నీ సరసన ఆలియా కంటే జాన్వీనే బాగా సెట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే బాలీవుడ్‌లో జాన్వీ కంటే ఆలియాకు ఎక్కువ క్రేజ్ ఉండటం వల్ల ఆమెను తీసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలియాను తీసుకుంటే పాన్ ఇండియా స్థాయిలో కలిసిరావొచ్చని కూడా భావిస్తున్నారట. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
హ్యాట్రిక్ హిట్స్
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో గతంలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రూపొందిన ‘జులాయి’(Julayi), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (S/o Satyamurthy), ‘అల వైకుంఠపురంలో’ (Ala Vaikunthapurramuloo) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. హీరో అల్లు అర్జున్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యేలా చేశాయి. ఈ మూడు కూడా హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌గా సగటు సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వీరి కాంబోలో రానున్న నాల్గో చిత్రం కూడా ఆ స్థాయిలోనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. గత రికార్డులను ఈ మూవీ చెరిపేయాలని ఆశిస్తున్నారు.
‘పుష్ప 2’తో బిజీ బిజీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో 'పుష్ప 2' (Pushpa 2) చేస్తున్నాడు. డిసెంబర్ 6న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. బ్లాక్ బాస్టర్ చిత్రం 'పుష్ప' (Pushpa)కు సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వ్యయంతో నిర్మించిన ఓ సెట్‌లో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. పతాక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్ చేస్తున్నట్లు సమాచారం. హీరో బన్నీతో పాటు కీలక నటులంతా ఈ షూట్‌లో పాల్గొంటున్నారు.
ఆగస్టు 07 , 2024
Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్
ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు. తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.
అందాల రాక్షసి -
ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్ చేయటం మనసులకు హత్తుకుంటుంది.
https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM
సఖి -
మాధవన్, శాలిని మధ్య లవ్ ప్రపోజల్ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.
https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ
ఆర్య -
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.
https://www.youtube.com/watch?v=UyywQrR6NvY
3 (Three) -
ఈ చిత్రంలో రామ్ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే.
https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM
ఏ మాయ చేసావే -
మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.
https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk
మిర్చి -
ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తావా అంటూ ప్రభాస్ అనుష్కకి ప్రపోజ్ చేసే సన్నివేశానికి విజిల్స్ పడ్డాయి.
https://www.youtube.com/watch?v=Yqu04K59uuw
కలర్ ఫొటో-
తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్ ఓ అద్భుతం.
https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ
సూర్య S/O కృష్ణన్ -
దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.
https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI
మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు -
ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్, నిత్యమీనన్ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్.
https://www.youtube.com/watch?v=U7itGT4xajs
మజ్ను
నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్ లెటర్ సీన్ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో తెలియజేస్తుంది.
https://www.youtube.com/watch?v=mat52aolY9g
ఫిబ్రవరి 13 , 2024
Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ చిత్రాలు
'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్ లవ్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.
భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy)
మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.
తొలి ప్రేమ (Tholi Prema)
వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.
ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade)
నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.
అష్టా చమ్మా (Ashta Chamma)
నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.
అలా మెుదలైంది (Ala Modalaindi)
డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్ ఫెయిల్ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.
సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan)
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి (Majili)
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
ఓకే బంగారం (Ok Bangaram)
ప్రస్తుత కాలంలో డేటింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.
ఏ మాయ చేశావే (Ye Maya Chesave)
తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్ మీనన్ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.
పెళ్లి చూపులు (Pelli Chupulu)
తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్ బిజినెస్‌లో భాగమై సక్సెస్ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.
సీతారామం (Sita ramam)
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్ క్లాసిక్ మూవీగా దీన్ని చెప్పవచ్చు.
హాయ్ నాన్న (Hi nanna)
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్ నాన్న తప్పకుండా ఉంటుంది.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju)
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్ (Oye)
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha)
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి (Raja Rani)
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను (Jaanu)
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
గోదావరి (Godavari)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్ కొట్టదు. హీరో సుమంత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది.
ఆనంద్ (Anand)
ఈ ఫీల్‌గుడ్ మూవీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
మార్చి 22 , 2024
True Love Movies: ఈ చిత్రాలు ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతునే ఉంటాయి!
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించాయి. యాక్షన్, శృంగార సన్నివేశాలు, ఐటెం సాంగ్స్ ఇలాంటివి లేకపోయినా.. స్వచ్చమైన ప్రేమ, ఆకట్టుకునే కథ-కథనం, చక్కటి ప్రజెంటేషన్ ఉంటే చాలని అవి నిరూపించాయి. ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రగిలించి కొత్త రకం ప్రేమ కథలను ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ (Sitaramam), ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రాలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం ఈ చిత్రాలు కదిలించాయి. నార్త్ అభిమానుల ఫేవరేట్ చిత్రంగా మారిపోయాయి. మరి టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వచ్చి కల్ట్ క్లాసిక్ మూవీలు ఏవి? అవి ప్రేక్షకులకు ఇచ్చిన సందేశం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
సీతారామం
2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది.
హాయ్ నాన్న
ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది.
సూర్య S/O కృష్ణన్
హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.
మజిలి
తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.
నిన్ను కోరి
హీరో ఒక యువతిని ఎంతగానో ఇష్టపడతాడు. అనూహ్యంగా ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. తొలత ఆమెను దక్కించుకోవాలని భావించినప్పటికీ చివరికీ ఆమె సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు.
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.
ఓయ్
బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు.
తొలి ప్రేమ
టాలీవుడ్‌లో వచ్చి కల్ట్ క్లాసిక్ ప్రేమ కథా చిత్రాల్లో తొలి ప్రేమ ఒకటి. విదేశాల నుంచి వచ్చిన యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆమెకు తన భావాలను చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. తిరిగి వెళ్లేపోతున్న క్రమంలో తానూ హీరోను లవ్ చేస్తున్నట్లు యువతికి అర్థమవుతుంది.
నిన్నే పెళ్లాడతా
కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన నిన్నే పెళ్లడతా చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు.
రాజా రాణి
ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు.
జాను
శర్వానంద్, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్ లవ్ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్ టూ గెదర్ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.
ఫిబ్రవరి 13 , 2024
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బాస్టర్ సినిమాలు తెలుసా?
ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ అవుతాయి కానీ అన్నీ తెరమీదకు రావు. రకరకాల కారణాలతో ఆగిపోతాయి. సీనియర్ హీరోల నుంచి నేటి తరం హీరోల వరకూ అందరి కెరీర్‌లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు పూర్తిగా అటకెక్కితే కొన్ని మాత్రం వేరే హీరోలతో వస్తాయి. కొన్ని బ్లాక్ బస్టర్లు అవుతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాపులుగా మిగులుతాయి. ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో ఇలాంటి సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
మెరుపు
అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించబోతున్నాడన్న వార్తతో అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బంగారం’ సినిమా తీసిన దర్శకుడు ‘ధరణి’ ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నాడు. మెగా సూపర్ గుడ్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్‌లో మొదలుపెట్టిన ఈ సినిమా ఆ తర్వాత అటకెక్కింది. దీంతో అదే బ్యానర్‌లో రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమా చేశారు.
రామ్ చరణ్- కొరటాల శివ
రామ్ చరణ్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సింది కానీ స్క్రిప్ట్ సరిగా పూర్తి కాక ఈ సినిమా ఆగిపోయింది. అయితే కొరటాల శివతో రామ్ చరణ్ తప్పకుండా ఓ సినిమా చేస్తారని అంటుంటారు.
శ్రీమంతుడు
కొరటాల ‘శ్రీమంతుడు’ కథను కూడా రామ్ చరణ్‌కు వినిపించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఈ సినిమా తెరకెక్కించగా సూపర్ హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్‌తో పాటు మరికొందరు హీరోలు కూడా శ్రీమంతుడుకు నో చెప్పారు.
సూర్య s/o కృష్ణన్
తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ సూపర్ హిట్ మూవీ సూర్య s/o కృష్ణన్ కోసం మొదట రామ్ చరణ్‌ను సంప్రదించారట. కానీ అప్పటికే రాజమౌళి మగధీరతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ సినిమా చేయలేకపోయారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. రామ్ చరణ్‌కు ‘మగధీర’ స్టార్ ఇమేజ్‌ను తీసుకురావడమే గాక అప్పట్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
https://telugu.yousay.tv/a-record-breaking-game-changer-first-look-poster.html
లీడర్
శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘లీడర్’. రానా తెరంగేట్రం చేసిన ఈ సినిమా కూడా తొలుత రామ్ చరణ్ దగ్గరికే వెళ్లిందట. కానీ రామ్ చరణ్ ఈ కథను తిరస్కరించాడు.
డార్లింగ్
అప్పటిదాకా మాస్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న ప్రభాస్‌ను అమ్మాయిలకు ‘డార్లింగ్’ను చేసిన సినిమా ఇది. కరుణాకర్ మార్క్ లవ్ స్టోరీ, GV ప్రకాశ్ కుమార్ సెన్సేషనల్ మ్యూజిక్‌తో ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఇది కూడా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఒకటి.
కృష్ణం వందే జగద్గురుమ్
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ప్రయోగాత్మక, కళా విలువలు ఉన్న సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. ప్రయోగాత్మక సినిమాలకు పెట్టిన పేరు రానానే ఈ సినిమాలోనూ నటించాడు. తొలుత ఈ సినిమా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లినా రిజెక్ట్ చేశాడట.
https://telugu.yousay.tv/virat-kohli-biopic-will-ram-charan-be-set-as-virat-kohli-the-story-climax-directors-of-the-movie-are-all-uproar-on-the-net.html
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ RC15లో నటిస్తున్నాడు. సినిమా టైటిల్ కూడా ‘గేమ్ చేంజర్’గా ఫిక్స్ చేశారు. ఇది పక్కా శంకర్ స్టైల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. రామ్ చరణ్ ఇందులో ఎన్నికల అధికారిగా కనిపించబోతున్నారు.
ఏప్రిల్ 01 , 2023
EXCLUSIVE: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సైడ్ రోల్స్.. ఓ లుక్కేయండి!
సాధారణంగా సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలే ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుంటాయి. విలన్ నటన బట్టి ఆ పాత్రనూ ఆదరించేవారు ఉంటారు. అయితే కొన్నిసార్లు క్రేజ్‌తో సంబంధం లేకుండా సైడ్ పాత్రలు కూడా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంటాయి. తెరపై ఆ పాత్ర సాగుతున్నంతసేపు తమ వెంటే ప్రేక్షకుల అటెన్షన్‌ను తీసుకువెళ్తుంటాయి. టాలీవుడ్‌లో మరో పదేళ్లు గడిచినా ఆ పాత్రలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ పాత్రలు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి?
[toc]
సత్యరాజ్ (బాహుబలి)
బాహుబలిలో ప్రభాస్, రాణా పాత్రల తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ కట్టప్ప. దర్శకుడు రాజమౌళి ఈ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కట్టప్ప పాత్ర లేకుండా బాహుబలి చిత్రాన్ని అసలు ఊహించలేము. సీనియర్ నటుడు సత్యరాజ్ (Sathyaraj) ఆ పాత్రలో పరాకయప్రవేశం చేసి మరి నటించాడు.
ప్రకాష్ రాజ్ (అతడు)
మహేష్ కెరీర్‌లో వచ్చిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే పాత్ర ప్రకాష్ రాజ్‌ది. సీబీఐ ఆఫీసర్‌గా అతడి అందరినీ అలరించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్, ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
https://youtu.be/Kk93JgAM7wA?si=5saRnFWzIEeDf3fR
సుకుమారి (మురారి)
మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘మురారి’ (Murari) చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని శబరి పాత్రలో సీనియర్ నటి మెప్పించింది. మహేష్ జాతకంలో ఉన్న గండం వల్ల అతడికి ఏం జరుగుతుందో అని భయపడుతూ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. హీరో కోసం చివర్లో ప్రాణ త్యాగం చేసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.
https://youtu.be/3GrsswRGUaA?si=TgwJ6hZRa0rtRu18
శ్రీకాంత్ (శంకర్‌దాదా MBBS)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేసిన ‘శంకర్ దాదా MBBS’ చిత్రం అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసింది. ఇందులో ‘ఏటీఎం’ అనే పాత్ర ఎంతో కీలకమైనది. సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) ఈ పాత్రలో కనువిందు చేశాడు. చిరుకి రైట్‌గా ఉంటూ సందర్భానుసరంగా వచ్చే సీన్లలో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ శ్రీకాంత్ ఈ తరహా పాత్రనే చేసి అదరగొట్టాడు.
https://youtu.be/QHdvEYMIOao?si=K5wkBfT-Y1gUFlZ3
రాజేంద్ర ప్రసాద్ (ఆ నలుగురు)
డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదని నిరూపించిన చిత్రం ‘ఆ నలుగురు’ (Aa Naluguru). ఇందులో రఘు రామయ్య పాత్రలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) నటించాడు. నైతిక విలువలు కలిగిన ఓ పత్రికా ఎడిటర్‌గా, ఎంత కష్టం వచ్చినా న్యాయంగా వ్యవహరించే ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి మరి నటించారు.
https://youtu.be/AYZjTMg2EbM?si=iOSHIruH84KVRJ-0
శ్రీహరి (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
సిద్ధార్థ్ - త్రిష జంటగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో నటుడు శ్రీహరి (Srihari)కి మంచి పాత్ర దక్కింది. హీరోయిన్‌కు అన్నగా ఆయన ఎంతో అద్భుతంగా నటించాడు. అన్న అంటే ఎలా ఉండాలో ఈ పాత్ర ద్వారా తెలియజేశారు. క్లైమాక్స్‌లో హీరో చేసిన హత్యను తనపైన వేసుకొని జైలుకు వెళ్లే దృశ్యాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి.
https://youtu.be/WNCwQvHa1w4?si=f2K-X2pSMJSzfQtd
గొల్లపూడి మారుతిరావు (లీడర్)
దిగ్గజ నటుడు గొల్లపూడి మారుతిరావు (Gollapudi Maruti Rao).. ‘లీడర్’ సినిమాలో ఓ అద్భుతమైన క్యామియో చేశారు. సీనియర్ పొలిటిషన్‌గా హీరో రాణాతో ఆయన చెప్పే డైలాగ్స్ ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడతాయి. ఆ సీన్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://youtu.be/AjLNxJCU1Cs?si=nNVLqa_4N5Md1O8y
అభినవ్ గోమఠం (ఈ నగరానికి ఏమైంది)
తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్య నటుల్లో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగారానికి ఏమైంది చిత్రం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. కౌషిక్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.
https://youtu.be/qAluEZGqhh8?si=xRLufanS8xSuqf9h
సుహాసిని (నువ్వు నాకు నచ్చావ్)
వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ జంటగా చేసిన ఈ చిత్రంలో సీనియర్ నటి సుహాసిని (Suhasini) హీరోయిన్‌కు అత్తగా మెప్పించింది. అత్తింటిలో కొందరి ఆడవారి కష్టాలు ఎలా ఉంటాయో తన డైలాగ్స్ ద్వారా కళ్లకు కట్టింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరోయిన్ తండ్రిని పెళ్లికి ఒప్పించే సీన్ అదరహో అనిపిస్తుంది.
https://youtu.be/XlXM5l95rEg?si=pepiyzzgooAEmbwe
అక్టోబర్ 22 , 2024
NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్-7 కొరియన్ డ్రామాలు ఇవే !
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.
1. SQUID GAME
ఈ సిరీస్ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో దాదాపు 90 దేశాల్లో మెుదటి స్థానంలో నిలిచింది. స్క్విడ్ గేమ్ ఓ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా. ఇందులో అప్పులతో సతమతమై డబ్బుల కోసం చూస్తున్న కొంతమందిని ఓ ఆట ఆడితే ప్రైజ్ మనీ ఇస్తామని తీసుకెళతారు. ప్రతి ఆటలో ఎలిమినేట్ అయినవారిని చంపుతుంటారు. చివరకు ఎవరు మిగిలారు. వాళ్లకు డబ్బులిచ్చారా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కథ. మీరు చూడకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూడండి.
https://www.youtube.com/watch?v=oqxAJKy0ii4
2. MY NAME
మై నేమ్ కొరియన్ డ్రామా 2021లో విడుదలయ్యింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఓ మహిళ. ఇందుకోసం ఓ గ్యాంగ్‌లో చేరుతుంది. నకిలీ పేరుతో చలామణీ అవుతూ పోలీసులను నమ్మిస్తుంటుంది. అంతేకాదు, నార్కోటిక్స్ అమ్మే ఓ డిటెక్టివ్‌తో జతకట్టి పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=ZOl7iOrD31Q
3. MR. SUNSHINE
మిస్టర్ సన్ షైన్ లవ్ పొలిటికల్, హిస్టారికల్ డ్రామా. జోసియన్ దేశంలో బానిస కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి యూఎస్ పారిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత చిన్నప్పుడే నిశ్చితార్థం అయిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. కథ మెుత్తం వీరి ప్రేమ, రాజకీయం, చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది. కొరియన్ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.
https://www.youtube.com/watch?v=rPJSo4fhtRU
4. CRASH LANDING ON YOU
రొమాంటిక్ డ్రామాలంటే ఇష్టముండే వారికి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఓ అద్భుతమైన సిరీస్. ఇది హృదయాన్ని హత్తుకునే టెలివిజన్ డ్రామా. సౌత్ కొరియా రాజకుటుంబానికి చెందిన ఓ వారసురాలు అనుకోకుండా సైనిక రహిత జోన్ మీదుగా నార్త్ కొరియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ యువ సోల్డియర్ ఆమెను తీసుకొని వెళతాడు. ఇది కొరియాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
https://www.youtube.com/watch?v=eXMjTXL2Vks
5. OUR BLUES
ఈ సిరీస్ 2022లో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. జెజూల్యాండ్ అనే ప్రాంతంలో రోజువారీ సంఘటనలు, మనుషుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ చూస్తున్నప్పుడల్లా అందులో ఉన్నది మనమే అనే భావన కలిగేలా రూపుదిద్దుకుంది. కొరియన్ డ్రామాల్లో కాస్త రియలిస్టిక్‌గా ఉన్న సిరీస్ ఇది.
https://www.youtube.com/watch?v=vSBIJQOLKoY
6. SIGNAL
షెర్‌లాక్, బ్రాడ్ చర్చ్ ఫ్యాన్స్ ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. సిగ్నల్ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ క్రిమినల్ ప్రొఫైల్‌కు 2015లో ఓ వాకీ టాకీ దొరకుతుంది. దానితో అతడు 1989లోని పోలీసుతో మాట్లాడతాడు. అలా ఓ కేసును చేధిస్తారు. ఇందులో దృష్టి మరల్చలేని ట్విస్టులతో సీటు అంచుల్లో కూర్చుంటారు.
https://www.youtube.com/watch?v=OonjouzGJKk
7. ALL OF US ARE DEAD
జాంబీ జోనర్‌లో వచ్చిన సిరీస్ ఇది. కొందరు విద్యార్థులు ట్రాప్ చేయబడతారు. ఓ సైన్స్ ఎక్సపర్‌మెంట్ విఫలమైన జాంబీ వ్యాప్తిలో చిక్కుకున్నారని గ్రహిస్తారు. ఇది ప్రేక్షకులను చాలా థ్రిల్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=IN5TD4VRcSM
ఏప్రిల్ 26 , 2023
Tollywood Best Climax Scenes: తెలుగులో ఇలాంటి క్లైమాక్స్‌లు మళ్లీ మళ్లీ రావు.. మీరే చూడండి!
ఏ సినిమాకైనా సరైన ముగింపు అవసరం. మూవీలో పాత్రల తీరుతెన్నులు, కథాబలం, హాస్యం, భావోద్వేగాలు ఎంత చక్కగా కుదిరినప్పటికీ క్లైమాక్స్ సరిగ్గా లేకుంటే ఆశించిన ఫలితం లభించలేదు. అందుకే డైరెక్టర్లు సినిమా అంతా ఒక ఎత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు అని భావిస్తుంటారు. అందుకు అనుగుణంగా సినిమా ముగింపును డిజైన్ చేసుకొని హిట్స్ కొడుతుంటారు. తెలుగులో ఇప్పటివరకూ వందలాది చిత్రాలు విడుదలైన కొన్ని సినిమాల క్లైమాక్స్‌లు మాత్రమే ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. అటువంటి బెస్ట్ క్లైమాక్స్ సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
దసరా (Dasara)
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ 'దసరా'. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమాలో క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అప్పటివరకూ మోస్తరుగా సాగుతున్న కథకు క్లైమాక్స్‌తో గట్టి బూస్టప్ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా నాని ఆ సీన్‌లో విశ్వరూపం చూపిస్తాడు. శత్రువులను ఊచకోత కోస్తాడు. 15నిమిషాల పాటు సాగే క్రైమాక్స్ సీన్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
https://youtu.be/IUCbmWfVd8g?si=CPovFG1Ig_7cdS9b
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
రామ్‌చరణ్, తారక్ కథానాయకులుగా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ప్రతీ సీన్ ఓ దృశ్యకావ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. తరుముకొస్తున్న బ్రిటిష్ సేనలను ఎదిరించే ధీరులుగా క్లైమాక్స్‌లో తారక్, చరణ్‌లను చూపించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను శ్రీరాముడిగా చూపే సీన్‌ను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అటు తారక్ సైతం ఎంతో సాహసోపేతంగా బ్రిటిష్ సైన్యాన్ని ఏరిపారేస్తాడు.
https://youtu.be/8HTrv_MAuSE?si=CMqWkW8LRa3GqLA9
బాహుబలి 2
‘బాహుబలి 2’ సినిమా క్లైమాక్స్‌ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ద్వారాలు మూసి ఉన్న మాహిష్మతి కోటలోకి అమరేంద్ర బాహుబలి తాడి చెట్లను ఉపయోగించి వెళ్లే సీన్ ఆకట్టుకుంటుంది. భల్లాలదేవ సైన్యంతో ప్రభాస్ సానుభూతి పరులు చేసే యుద్దం గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. చివర్లో రాణాను చంపి ప్రభాస్ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడంతో సినిమా ముగుస్తుంది.
https://youtu.be/4s6k7UpFnKc?si=7G-OJDfUuey9hKVV
గ్యాంగ్ లీడర్ (Gang Leader)
మాస్ ఆడియన్స్‌కు ఇప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో అదరగొట్టాడు. అటు చిరు సినిమాల్లో వచ్చిన బెస్ట్ క్లైమాక్స్ సీన్ అనగానే ముందుగా ఈ సినిమానే అందరికీ గుర్తుకు వస్తుంది. తన అన్నను చంపిన విలన్లపై క్లైమాక్స్‌లో చిరు రివేంజ్ తీర్చుకోవడం హైలెట్‌గా నిలుస్తుంది. సోదరుడ్ని ఎలా చంపారో అచ్చం అదే విధంగా బండరాయి కట్టిన భారీ ప్రొక్లెయిన్‌ను విలన్ మీద వేసి చిరు హతమారుస్తాడు.
https://youtu.be/v0_E2uqVeaM?si=8z1LFqnzEJ3Wzy4x
ఈగ (Eega)
దర్శకధీరుడు రాజమౌళి అద్భుత సృష్టిగా ‘ఈగ’ సినిమా తెరకెక్కింది. పవర్‌ఫుల్ విలన్ సుదీప్‌ను ఒక సాధారణ ఈగ ఎలా చంపుతుంతో క్లైమాక్స్‌లో రాజమౌళి చూపించాడు. తాను చనిపోతానని తెలిసి కూడా ఈగ మంటల గుండా మందుగుండు ఉన్న తుపాకీలోకి దూకుతుంది. దీంతో గన్ ఫైర్ అయ్యి విలన్ చనిపోయే సీన్స్ క్లాప్స్ కొట్టిస్తుంది.
https://youtu.be/1SCFGWtXtDE?si=r1AnoKHjBFFyrNXu
పోకిరి (Pokiri)
తెలుగులో అప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో ‘పోకిరి’ తరహా క్లైమాక్స్ ఎందులోనూ రాలేదు. అప్పటివరకూ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న మహేష్ బాబు.. పోలీసు అని రౌడీలను ఏరివేసే మిషన్‌లో పనిచేస్తున్నాడని తెలిసి సగటు ఆడియన్స్ షాక్‌కు గురవుతారు. తన తండ్రిని చంపిన ప్రకాష్ & కోపై క్లైమాక్స్‌లో రివేంజ్ తీర్చుకునే సీన్ నెవర్ బీఫోర్ అన్నట్లుగా ఉంటుంది.
https://youtu.be/PvkITH66FEc?si=2CJl4283NO85bYmd
తమ్ముడు (Thammudu)
స్పోర్ట్స్ తరహాలో ఓ క్లైమాక్స్‌ను డిజైన్ చేయవచ్చు అని ‘తమ్ముడు’ సినిమా ద్వారా డైరెక్టర్ జగన్నాథ్ చూపించారు. తన అన్న కోసం బాక్సింగ్ కోర్టులో నిలిచిన పవన్ కల్యాణ్.. తొలుత విలన్ చేతుల్లో తన్నులు తింటాడు. తన తండ్రి, అన్న మాటలతో ప్రేరణ పొంది.. తిరిగి పుంజుకుంటాడు. విలన్‌ను బాక్సింగ్ కోర్టులో ఓడించి తన అన్న కలను నెరవేరుస్తాడు. అప్పటివరకూ పనికిరాని వాడంటూ తిట్టిన తండ్రి చేత శభాష్ అనిపించుకుంటాడు.
https://youtu.be/CZY-tl5JbSo?si=Ui97I0J_rOAi5s5j
ఖుషి (kushi)
పవన్ కల్యాణ్, భూమిక జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా క్లైమాక్స్‌ను కూడా దర్శకుడు ఎస్.జే. సూర్య రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌ను రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో డైరెక్టర్ ప్లాన్ చేశారు. ఊరికి వెళ్లిపోతున్న హీరోయిన్‌ను పవన్ కల్యాణ్ ఏంతో టెన్షన్‌తో వెతుకుతుంటాడు. కట్ చేస్తే పెళ్లై వారిద్దరూ అరడజనుకు పైగా పిల్లలతో కనిపించి చివర్లో కొద్దిసేపు నవ్వులు పూయిస్తారు.
https://youtu.be/R9VXMjfP6Kc?si=nt00kn-z4dqexdCZ
విరుపాక్ష (Virupaksha)
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా చేసిన ‘విరూపాక్ష’ చిత్రం.. ఓ హారర్ సెన్సేషన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరోయినే ప్రధాన విలన్ తెలియడంతో ఆడియన్స్ షాకవుతారు. ఈ మూవీ ముగింపును చూసి ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీలవుతారు. ఈ విజయంలో క్లైమాక్స్ కూడా కీలక పాత్ర పోషించిందని అప్పట్లో విశ్లేషణలు కూడా వచ్చాయి.
https://youtu.be/C1vmB8G2oTw?si=hcLk1a9tPl1WC6xQ
సై (Sye)
నితిన్ - జెనిలియా జంటగా నటించిన ఈ సినిమా ఓ కాలేజీ గ్రౌండ్ చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రౌండ్‌ను సొంతం చేసుకునేందుకు కాలేజీ స్టూడెంట్ అయిన నితిన్ తోటి విద్యార్థులతో కలిసి.. విలన్లతో రగ్బీ ఆడతాడు. మానవ మృగాల్లాంటి విలన్లతో కాలేజీ కుర్రాళ్లు పోరాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
https://youtu.be/oc4J_qQcNkw?si=rSuIQ2jUftA4c4Mx
రోబో 2.0 (Robo 2.0)
డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్.. విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో విలన్ పక్షిరాజా (అక్షయ్ కుమార్)తో రోబో (రజనీకాంత్) తలపడతుంది. ఈ తరహా క్లైమాక్స్‌ను హాలీవుడ్‌లో తప్ప భారత సినీ చరిత్రలో చూసి ఉండరు.
https://youtu.be/I04BTA2fl-E?si=9hCEwzbPcG-m81VM
అలా వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo)
అల్లుఅర్జున్ బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ‘అలా వైకుంఠపురంలో’ ఒకటి. ఈ సినిమా క్లైమాక్స్‌ను ఓ పాటతో దర్శకుడు త్రివిక్రమ్ ముగించడం విశేషం. క్లైమాక్స్‌లో ‘సిత్తరాల సిరపడు’ పాటతో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. పాట పూర్తయ్యే లోగా విలన్‌తో పాటు అతడి అనుచరులకు తనదైన శైలిలో బుద్ది చెబుతాడు.
https://youtu.be/ljHApHUTWeo?si=90dOM8aTCAWsSHoU
అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో క్లైమాక్స్ వైవిధ్యంగా ఉంటుంది. ఎటువంటి ఫైట్స్ లేకుండా భావోద్వేగ మాటలతోనే త్రివిక్రమ్ ఈ సినిమాను ముగించాడు. తన అత్తను పుట్టింటికి తీసుకెళ్లేందుకు పవన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ మెుత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో చిత్రీకరించడం గమనార్హం.
https://youtu.be/HsV7k8m0QU0?si=42tjl5fOTTS4xEz6
సుస్వాగతం (Suswagatham)
భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ క్లైమాక్స్ వరకు హీరోయిన్‌ను సిన్సియర్‌గా లవ్ చేస్తుంటాడు. కానీ ఆమె పవన్ ప్రేమను అర్థం చేసుకోదు. క్లైమాక్స్‌లో పవన్ ప్రేమను అర్థం చేసుకొని హీరోయిన్ అతడి వద్దకు వెళ్తుంది. అప్పుడు పవన్ చెప్పే డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆమె ప్రేమకోసం తాను ఏమేమి కోల్పోయానో చెప్పడంతో పాటు.. ప్రేమ మూలంగా యువత ఎలా పిచ్చోళ్లుగా మారుతున్నారో పవన్ పేర్కొంటాడు.
https://youtu.be/323OoE0Figo?si=pm-8iXzG8DleERw1
మార్చి 12 , 2024
Hero's In Middle Class Roles: మన జీవితాలను కళ్లకు కట్టిన స్టార్ హీరోల పాత్రలు.. ఓ లుక్కేయండి!
సాధారణంగా హీరో పాత్రలు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ఉంటాయి. యాక్షన్ చిత్రాల్లో ఒకలా.. సోషియోఫాంటసీ జానర్స్‌లో మరోలా ఉంటాయి. చాలా వరకూ సినిమాల్లో హీరో పాత్రను సాధారణ ప్రేక్షకులు ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే ఆ చిత్రాల్లో వారు కలర్‌ఫుల్ డ్రెస్‌లు వెసుకుంటూ కార్లల్లో తిరుగుతుంటారు. హైఫై జీవితాలను గడుపుతుంటారు. అయితే కొన్ని సినిమాలు అలా కాదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి. మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కడతాయి. ఆ సినిమాల్లో హీరో ఎలాంటి హంగులు లేకుండా కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉంటాడు. అందుకే సమాజంలోని మెజారిటీ యూత్ ఆ హీరో పాత్రలను ఓన్ చేసుకుంటారు. తమను తాము తెరపై చూసుకుంటున్నట్లు భావిస్తారు. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన టాప్ మిడిల్ క్లాస్ హీరో పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఈ (Aadavari Matalaku Arthale Verule) సినిమాలో హీరో వెంకటేష్ (Venkatesh) సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. ఉద్యోగం లేక తండ్రి కోటా శ్రీనివాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. చివరికీ ఉద్యోగం రావడంతో తండ్రిని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. ఓ కారణం చేత తండ్రిని కోల్పోయి అనాథగా మారతాడు. ఇలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మిడిల్ క్లాస్ జీవితాలను గుర్తు చేస్తూనే ఉంటుంది.
రఘువరన్ బీటెక్
ఈ (Raghuvaran Btech) సినిమాలో రఘువరన్ (ధనుష్) కుటుంబం కోసం ఏదోటి కోల్పోతూనే ఉంటాడు. ఓ అవసరం కోసం దాచుకున్న డబ్బును తమ్ముడికి ఇచ్చేస్తాడు. తల్లి చనిపోవడంతో ఇష్టం లేని ఉద్యోగానికి ఇంటర్యూలకు తిరుగుతాడు.
తమ్ముడు
ఈ (Thammudu) సినిమాలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలుత ఆకతాయి తనంగా ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఉంటాడు. బాక్సింగ్ పోటీలకు సిద్దమైన అన్నపై అతడి ప్రత్యర్థులు దాడి చేయడంతో పవన్‌లో మార్పు వస్తుంది. అన్న కోసం జల్సా జీవితాన్ని వదులుకొని ఎంతో కష్టపడి బాక్సింగ్ నేర్చుకుంటాడు. అన్నను ఆస్పత్రిపాలు చేసిన విలన్‌కు బాక్సింగ్ కోర్టులో బుద్ది చెప్తాడు.
అలా వైకుంఠపురంలో
ఇందులో (Ala Vaikunthapurramuloo) అల్లు అర్జున్ కోటీశ్వరుడు. మురళిశర్మ చేసిన కుట్రతో అతడే తండ్రి అని నమ్మి చిన్నప్పటి నుంచి అతడి ఇంట్లోనే పెరుగుతాడు. అతడి భార్యను తల్లిగా, కూతుర్ని సొంత చెల్లెలని భావిస్తాడు. పెద్దయ్యాక తనెవరో నిజం తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న అసలైన తల్లిదండ్రులను కాపాడతాడు. కానీ వారికి నిజం చెప్పడు. మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపేందుకు ఇష్టపడతాడు.
గ్యాంగ్ లీడర్
గ్యాంగ్‌లీడర్‌లో (Gang Leader) చిరంజీవి (Chiranjeevi) తొలుత ఖాళీగా తిరుగుతుంటాడు. పెద్దన్న మరణంతో రెండో అన్న చదువు బాధ్యత తనపై వేసుకుంటాడు. డబ్బు కోసం ఓ కేసులో జైలుకు సైతం వెళ్తాడు. అలా తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి
ఈ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో రవితేజ (Ravi Teja)కు తన తండ్రి ప్రకాష్ రాజ్ అంటే అసలు పడదు. తన తల్లిని వదిలేశాడని కోపంతో ఉంటాడు. అనుకోకుండా తల్లి చనిపోవడంతో ఆమె ఆఖరి కోరిక మేరకు బాక్సింగ్ కోచ్ అయిన తండ్రి దగ్గరకు వెళ్తాడు. విలన్ తన తండ్రిని, సవతి చెల్లిని మోసం చేశాడని తెలుసుకొని బాక్సింగ్ కోర్టులో తలపడి అతడికి బుద్ధి చెప్తాడు.
అ ఆ
ఇందులో (A Aa) నితిన్ (Nithin) పక్కా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. రావురమేష్‌కి తన ఫ్యామిలీ అప్పు ఉండటంతో ఇష్టం లేకపోయినా అతడి కూతుర్ని చేసుకునేందుకు సిద్ధపడతాడు. కోటీశ్వరురాలైన అత్త కూతురు సమంత ప్రేమిస్తోందని తెలిసినప్పటికీ క్లైమాక్స్ వరకూ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
జెర్సీ (Jersey)
క్రికెటర్ అయినా నాని (Nani) అనారోగ్య కారణంతో ఆటకు దూరమవుతాడు. రైల్వే ఉద్యోగం కోల్పోయి భార్య సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. క్రికెటర్‌గా చూడాలని కొడుకు చెప్పడంతో తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. ఒక మధ్యతరగతి తండ్రి కొడుకును ఎంతగా ప్రేమిస్తాడో ఈ సినిమాలో నాని చూపించాడు.
నేనింతే
ఈ (Neninthe) సినిమాలో రవితేజ (Ravi Teja).. సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అనారోగ్యంతో ఉన్న తల్లికి వైద్యం చేయించలేని స్థితిలో ఉంటాడు. ఓ వైపు లక్ష్యం.. మరోవైపు తల్లి ఆరోగ్యం మధ్య అతడు పడే సంఘర్షణ చాలా మంది జీవితాలను ప్రతిబింబిస్తుంది.
యోగి
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన యోగి (Yogi) చిత్రం మిడిల్ క్లాస్ యువతకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. డబ్బుకోసం తల్లిని విడిచి నగరానికి వచ్చిన హీరో ఓ హోటల్‌లో పనిచేస్తుంటాడు. రూపాయి రూపాయి కూడగట్టి తల్లికి గాజులు చేయిస్తాడు. అయితే ఆ గాజులు వేసుకోకుండానే తల్లి చనిపోవడం చాలా మందికి తమ గతాన్ని గుర్తు చేస్తుంది.
మార్చి 01 , 2024
EXCLUSIVE: ఈ సీన్స్ చాలా ఎమోషనల్.. అయినా నవ్విస్తాయి.. ఎలాగంటే?
సాధారణంగా ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి డైరెక్టర్లు ఎమోషనల్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటారు. కథకు సెంటిమెంట్, భావోద్వేగ సన్నివేశాలను జోడించడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. అయితే ఆ ఎమోషనల్ సీన్సే కొన్నిసార్లు మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాస్తవానికి దూరంగా ఉండటం వల్ల అటువంటి సన్నివేశాలు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతుంటాయి. అటువంటి సందర్భాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సినిమా రిలీజ్ తర్వాత వాటిపై విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
[toc]
సరైనోడు (Sarrainodu)
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ చిత్రం అప్పట్లో బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఇందులోని ఓ సీన్‌పై అప్పట్లో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ ఏమోషనల్ సీన్ చూస్తే నవ్వు వచ్చిందని అప్పట్లో నెటిజన్లు కామెంట్లు చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను రౌడీలు వెంటాడుతారు. నాలుగు రోజుల నుండి తాను పరిగెడుతూనే ఉన్నానంటూ ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంది. ఇందులో లాజిక్ ఎక్కడ ఉందంటూ ఆడియన్స్ ప్రశ్నించారు.
https://youtu.be/BTG1U_-sl-o?si=8SMhJezyIsBEMKG-
వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)
రామ్‌చరణ్, బోయపాటి కాంబోలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఇందులో చరణ్ ట్రైన్‌పై నిలబడి బీహార్ వెళ్లే సీన్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలోని ‘తందానే తందానే’ పాటలో వచ్చే ఎమోషనల్ సన్నివేశంపైనా నెటిజన్లు ట్రోల్స్ చేశారు. పాట మధ్యలో హీరో అన్న ప్రశాంత్‌కు భోజనం సమయంలో పొలమారుతుంది. అయితే భార్య స్నేహా నీళ్లు ఇవ్వడానికి బదులు అతడ్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇదేమి లాజిక్ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు.
https://youtu.be/GKrpi9NX6LY?si=78kGcH01QiUR6oej
అరవింద సమేత (Aravinda Sametha)
తారక్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా తర్వాతే పూజా హెగ్డేపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మెుదలయ్యాయి. ఇందులో ఓ సీన్‌లో విలన్ మనుషులు పూజా హెగ్డేతో పాటు ఆమె సోదరుడ్ని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు తారక్‌కు పూజా సీక్రెట్‌గా కాల్ చేస్తుంది. అప్పుడు తారక్ నిన్ను విలన్లు చంపేయచ్చు అనగానే ఆమె ఏడుస్తూ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌పై నెట్టింట తెగ ట్రోల్స్ వచ్చాయి. ఈ సీన్‌లో ఆమెను చూసి నవ్వు ఆగలేదని చాలా మంది ఆడియన్స్ పోస్టు చేశారు.
https://youtu.be/uOTclNEcCAE?si=VaLMevP8Ir2yaLA1
మెుగుడు (Mogudu)
కృష్ణవంశీ దర్శకత్వంలో గోపిచంద్, తాప్సీ జంటగా చేసిన చిత్రం ‘మెుగుడు’. ఈ సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్ హైలెట్‌గా ఉంటుంది. అదే సమయంలో ఈ ఏమోషనల్ సీన్ గందరగోళంగా ఉందంటూ ట్రోల్స్ వచ్చాయి. ఇందులో హీరో హీరోయిన్లకు పెళ్లి జరుగుతుంది. అప్పగింతల సమయంలో ఓ విషయం దగ్గర హీరోయిన్ తల్లి రోజా.. హీరో తరుపు బంధువు చెంప పగలగొడుతుంది. ఆ గొడవ పెద్దదై రోజా, హీరో తండ్రి రాజేంద్ర ప్రసాద్, గోపిచంద్, తాప్సీ ఒకరినొకరు చేయిచేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరూ విడాకులకు అప్లై చేస్తారు. అయితే ఈ సీన్ మరీ నాటకీయంగా ఉందని చాలా మంది విమర్శించారు. తమకు కామెడీ సీన్‌లాగా అనిపించదని అప్పట్లో పోస్టులు పెట్టారు.
https://youtu.be/tSph1y0x9BA?si=PQvdooUFVQPxvKpX
అత్తారింటికి దారేది (Attarintiki Daredi)
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ క్లైమాక్స్ సీన్‌ను చాలా ఏమోషనల్‌గా తీర్చిదిద్దాడు దర్శకుడు. తన చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోయిన అత్తపై తమ కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో పవన్ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కంట నీరు పెడుతూ ఆయన చెప్పే డైలాగ్స్ చాలా మందికి రుచించలేదు. పవన్ ఏడుస్తూ డైలాగ్స్ చెబుతుంటే తమకు విపరీతంగా నవ్వు వచ్చిందని కొందరు కామెంట్స్ చేశారు. పవన్ ఏడుపుకు సంబంధించిన ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్ చేశారు.
https://youtu.be/HsV7k8m0QU0?si=B2YwpApzSRLAHGDO
శ్రీమంతుడు (Srimanthudu)
మహేష్, కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇందులో హీరో తన తండ్రి పుట్టిన ఊరికి వచ్చి అభివృద్ధి చేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామస్తుడు తమ కష్టాలను తీర్చాలని మరిన్ని సమస్యలు మహేష్‌తో చెప్పుకోబోతాడు. అప్పుడు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్.. అతడ్ని అడ్డుకుంటాడు. అలిసిన బతుకులు కదా ఏదో ఆశగా కనిపించే సరికి అడిగేశాడు అని అంటాడు. ఈ ఏమోషనల్ సీన్‌పై కొన్ని సోషల్ మీడియా పేజ్‌లు విపరీతంగా మీమ్స్ చేశాయి. ఇప్పటికీ ఆ సీన్‌కు సంబంధించిన మీమ్ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది.
https://youtu.be/V_52TOrTqKI?si=xJkICf7HF-JiFikn
హ్యాపీ (Happy)
అల్లు అర్జున్, జెనీలియా జంటగా చేసిన హ్యాపీ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో బన్నీ చాలా ఏమోషనల్ అవుతాడు. పోలీసు స్టేషన్‌లో గుండెలు బాదుకుంటూ లాకప్‌లో ఉన్న హీరోయిన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. వారి ప్రేమ గొప్పతనం గుర్తించిన పోలీసు ఆఫీసర్ ఆమెను విడిపెడతాడు. అయితే ఈ సీన్‌లో బన్నీ నటన చూసి అతడి యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. బన్నీని ఈ సెంటిమెంట్ సీన్‌లో అసలు చూడలేకపోయామని, పైగా నవ్వు వచ్చిందని కామెంట్స్ చేశారు.
https://youtu.be/H3h5fkT5wG4?si=sufvXBa7KErXPRM7
మిర్చి (Mirchi)
ప్రభాస్, కొరటాల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో హీరో విలన్ ఇంటికి వెళ్లి వారిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో విలన్ ఇంటి పెద్ద నాగినీడు ఊరి ప్రజలు అతడ్ని ఎంతగా గౌరవిస్తున్నారో తెలియజేస్తారు. దీంతో చదువుకు ఎందుకు అని పంపేసిన అమ్మాయిని స్కూల్‌లో జాయిన్ చేయించడానికి హీరోతో కలిసి నాగినీడు వెళ్తాడు. ఆ యువతి ఇంటి ముందు కారు ఆపి రా బండెక్కు అని పిలుస్తాడు. ఈ సీన్‌పై కూడా అప్పట్లో ట్రోల్స్ వచ్చాయి. మీమర్స్ దీనిని తమకు అనుకూలంగా నెటిజన్లకు నవ్వు తెప్పించేలా వాడుకున్నారు. ఆ తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌తో జరిగే సంభాషణపై కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చాయి.
https://youtu.be/8hbZeVdLOKU?si=njdIZGjrVoE55Iv1
అక్టోబర్ 22 , 2024
LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్ హీరోయిన్‌ల హాట్ లిప్‌లాక్ సీన్స్.. ఇవి చాలా హూట్ గురూ!
సినిమాల్లో లిప్‌లాక్ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్ సీన్ అంటే ఒక సెన్సేషన్. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే లిప్ లాక్ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? ఇప్పుడు చూద్దాం.
[toc]
సమంత (Samantha)
‘ఏమాయ చేశావే’ చిత్రంతో నటి సమంత హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో ఆమె అద్భుతమైన నటన కనబరిచింది. వీరిద్దరి మధ్య వచ్చే కిస్ సీన్స్ అప్పట్లో యూత్‌ను కట్టిపడేశాయి. ముఖ్యంగా చైతు, సమంత మధ్య వచ్చే ట్రైన్ సీన్‌లో వారిద్దరు లిప్‌కిస్‌లతో రెచ్చిపోయారు. ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషీ’ చిత్రంలోనూ సమంత లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
https://youtu.be/f1felGoecKE?si=pVGUjkN0VAIctHJg
https://youtu.be/0oD68xOTg3Q?si=wGwFqNyNrGrzJBSS
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)
మహేష్ బాబుతో కాజల్ ఓ లిప్‌లాక్ సీన్ చేసింది. ‘బిజినెస్ మ్యాన్’ చిత్రంలోని ‘చందమామ నవ్వే’ సాంగ్‌లో కాజల్ పెదాలపై మహేష్ కిస్ చేస్తాడు. ఈ సీన్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోనూ మహేష్‌తో ఓ లిప్‌లాక్ సీన్ కాజల్ చేసింది. అలాగే ‘ఆర్య 2’లో బన్నీతో కలిసి లిఫ్ట్‌లో ముద్దుసీనులో నటించింది.
https://youtu.be/uGsFI3FmhnI?si=NO5P0FFGoh7S5W4n
https://youtu.be/5Hi1Ss8blKo?si=4TVKPCplYiPEBi8q
నయనతార (Nayanthara)
‘వల్లభ’ చిత్రంలో నటుడు శింభుతో కలిసి నయనతార రెచ్చిపోయింది. లిప్‌కిస్ సీన్లను ఏ మాత్రం బెరుకు లేకుండా చేసింది. అప్పట్లో వారిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ముద్దు సీన్లలో మెుహమాటపడలేదని సమాచారం.
https://youtu.be/GYn1g47mFZc?si=16ytg37esqYLiSsW
రష్మిక మందన్న (Rashmika Mandanna)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం రెండు చిత్రాల్లో అదర చుంబనం చేసింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించింది. అలాగే ఇటీవల వచ్చిన ‘యానిమల్’ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో రెచ్చిపోయింది.
https://youtu.be/TSyLvBis830?si=OKi8o_8mIJGrU5dE
https://youtu.be/Ma8GcZXvKeM?si=NfAYyztDJ4AtkNZj
నేహా శెట్టి (Neha Shetty)
యంగ్ బ్యూటీ నేహా శెట్టి డీజే టిల్లు చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్ చేసింది. ముఖ్యంగా ఓ పాట చివర్లో సిద్ధూకు డీప్ కిస్ ఇచ్చి మతి పోగొట్టింది. అలాగే ఇటీవల వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలోని ఓ పాటలో విశ్వక్ సేన్ పెదాలను తాకిస్తూ ముద్దు పెట్టింది.
https://youtu.be/DzegLt5UZuM?si=x8QPhZlMXzjCkUfe
https://youtu.be/GpcIMmvdY9A?si=RUvpds4l1NcH9zYz
రుహానీ శర్మ (Ruhani Sharma)
'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. తెలుగు సినిమాల్లో పద్దతిగా నటించిన రుహానీని అగ్రా చిత్రంలో అలా చూసి సినీ లవర్స్ షాకయ్యారు. అలాగే ‘దిల్‌సే దిల్’ వీడియో సాంగ్‌లోనూ లిప్‌లాక్ సీన్‌లో ఆమె కనిపించింది. థియేటర్‌లో వచ్చే ముద్దు సీనులో ఆమె నటించింది.
https://youtu.be/ooCxCQh1dcI?si=-3Ifodd842oG9k5k
కేతిక శర్మ (Ketika Sharma)
యంగ్ బ్యూటీ కేతిక శర్మ తన ఫస్ట్ ఫిల్మ్ ‘రొమాంటిక్’ మూవీలో ముద్దు సీన్లతో మైమరపించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరితో బస్‌లో ముద్దుల ప్రయాణం చేసింది. అలాగే ‘రంగ రంగ వైభవంగా’ మూవీలో పంజా వైష్ణవ్ తేజ్‌తోనూ లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
https://youtu.be/vXjWi6UQDMk?si=PUQ99x3oWOqQ7Ec7
https://youtu.be/tCc3R96puEI?si=LJeyKB98VHuCCeri
డింపుల్ హయాతి (Dimple Hayathi)
విశాల్‌తో చేసిన ‘సామాన్యుడు’ చిత్రంలో హీరోయిన్ డింపుల్ హయాతి లిప్‌లాక్ సీన్‌లో చేసింది. థియేటర్‌లో హీరో విశాల్ పెదాలపై ఎంతో క్యూట్‌గా ముద్దు పెట్టింది. అలాగే రవితేజ ‘కిలాడీ’ సినిమాలో బికినీలో కనిపించడంతో పాటు ఘాటు ముద్దు సీన్లు సైతం చేసింది.
https://youtu.be/72xq28fxAj4?si=Vlm0s1dAnS2nIK1M
https://youtu.be/LWOj-SxqES4?si=CTGBapB7zFw0giPF
మాళవిక మోహన్ (Malavika Mohanan)
మలయాళ నటి మాళవిక మోహన్ 'యుధ్రా' సినిమాతో ఇటీవల బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. హీరో సిద్ధాంత్ ఛతుర్వేదితో కలిసి బోల్డ్ సీన్స్‌లో నటించింది. గతంలో ఈ స్థాయి రొమాన్స్ మాళవిక చేయలేదు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ సీన్‌లో ముద్దులతో విరుచుకుపడింది.
https://youtu.be/QpWysxpVgkg?si=dmIpGe-s9c1qXLpK
https://youtu.be/apzjoosKrHM?si=61ea0jQcIRmwX7d1
తృప్తి దిమ్రి (Tripti Dimri)
బాలీవుడ్ భామ తృప్తి దిమ్రీ పేరు ‘యానిమల్’ చిత్రంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇందులో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఆమె ఇంటిమేట్ సీన్‌లో నటించింది. ఘాటైన లిప్‌లాక్‌తో కవ్వించింది. అలాగే ఇటీవల హిందీలో వచ్చిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలోనూ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె లిప్‌లాక్ సీన్ చేసింది.
https://youtu.be/OWBr0mtA09w?si=PYy7JvnIBwQGeS6j
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)
‘RX100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ అందులో హీరో కార్తికేయతో రొమాంటిక్ సీన్స్ చేసింది. లిప్‌లాక్ ముద్దులతో అతడ్ని ముంచెత్తింది. ‘RDX లవ్’ అనే మరో సినిమాలోనూ కుర్ర హీరోతో తన పెదాలను పంచుకుంది.
https://youtu.be/M0A073kZqOs?si=Wem1xfWcBkihcjRP
https://youtu.be/p63JKf879T4?si=4FmfuopZSq25C0p3
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)
యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ‘బేబీ’ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో ఆమె పలు రొమాంటిక్ సీన్స్‌లో నటించింది. నటుడు విరాజ్‌తో కలిసి పబ్‌లో లిప్‌లాక్ సీన్ చేసింది. అలాగే ఇంటిమేట్ సీన్‌లోనూ కనిపించి హార్ట్ బీట్‌ను అమాంతం పెంచేసింది.
https://youtu.be/dFo8klGt58Y?si=pi-dhy59FkD9CHnu
కావ్యా థాపర్ (Kavya Thapar)
గ్లామర్ బ్యూటీ కావ్యా థాపర్ కుర్ర హీరో సంతోష్ శోభన్‌తో కలిసి లిప్‌లాక్ సీన్ చేసింది. ‘ఏక్ మినీ కథ’ చిత్రంలోని ఓ సాంగ్‌లో ఘాటైన రొమాన్స్ చేసింది.
https://youtu.be/Vbnp6wIf8XY?si=bmWPAr5lWg-YgNOn
అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)
ఒకప్పుడు ట్రెడిషనల్ పాత్రలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్య కాలంలో రొమాంటిక్ సీన్స్‌కు పెద్ద పీట వేస్తోంది. యూత్‌ను ఆకర్షించే క్రమంలో ‘రౌడీ బాయ్స్’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాల్లో రెచ్చిపోయింది. హీరోలను ముద్దులతో ముంచెత్తింది.
https://youtu.be/vm8sg_Gtwf8?si=a0zPMR1VSnhROOIX
https://youtu.be/-GqC3e4K4f0?si=ilK643bC0cRF8Uus
https://youtu.be/ZY6U0N0jxtE?si=kZ1d5zGrK75cP-q-
షాలిని పాండే (Shalini Pandey)
అర్జున్ రెడ్డి చిత్రంతో నటి షాలిని పాండే టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో విజయ్ దేవరకొండతో కలిసి మల్టిపుల్ లిప్ లాక్ సీన్స్ చేసింది.
https://youtu.be/p8OExtmSVQc?si=a7d-gIT9KwGMbW0A
https://youtu.be/y9nY4xZ7d9c?si=g7NIk_s8k8M1MOm-
శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala)
ప్రముఖ హీరోయిన్ శోభితా దూళిపాళ్ల కూడా పలు లిప్‌లాక్ సీన్లలో నటించింది. 'మేడ్ ఇన్ హెవెన్' వెబ్‌సిరీస్‌లో బోల్డ్ సీన్స్‌లో రచ్చ రచ్చ చేసింది. అలాగే ‘మంకీ మ్యాన్’ అనే హాలీవుడ్ మూవీలోనూ ఈ అమ్మడు ముద్దు సీన్లలో నటించింది. టాలీవుడ్ నటుడు నాగ చైతన్యతో శోభితాకు నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
https://youtu.be/-sZwctU1-AI?si=u7O55-nGt5lABZG4
https://youtu.be/ui5J3MMqyks?si=ORhbahScSjs_xvLu
మానసా చౌదరి (Maanasa Chowdary)
రోషన్ కనకాల హీరోగా పరిచయమైన 'బబుల్ గమ్' చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఒక్క సాంగ్‌లోనే ఏకంగా 14 లిప్ లాక్స్ ఉన్నాయి.
https://youtu.be/ASWoafIYNpg?si=_4DmWUSQO03DibjZ
https://youtu.be/jK5Yz41NqSU?si=I9juu_-cUhn2NCBU
అక్టోబర్ 05 , 2024
Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ పవర్‌ఫుల్ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బాహుబలి (Baahubali)
బాహుబలిలో ప్రభాస్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్ చాలా అద్భుతంగా చేశాడు.
https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN
శివ (Siva)
హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్ చైన్ తెంపే సీన్ ఇప్పటికీ చాలా ఫేమస్.
https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g
ఆర్ఆర్‌ఆర్ (RRR)
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్‌చరణ్(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్ ఇంట్రడక్షన్ సీన్ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.
https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&v=Y8rREdo1LqU&feature=youtu.be
సలార్ (Salaar)
ఇందులో హీరో ప్రభాస్ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్ ఫైట్, కాటేరమ్మ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ దుమ్మురేపాడు.
https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID
యానిమల్ (Animal)
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్ రీవెంజ్ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.
https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit
సింహాద్రి (Simhadri)
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్ సీన్ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్ విజిల్స్ వేయిస్తాయి.
https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS
విక్రమార్కుడు (Vikramarkudu)
స్టార్ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్ రాథోడ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్ సీన్ మాత్రం నెవర్ బీఫోర్ అన్నట్లుగా ఉంటుంది.
https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY
కర్తవ్యం (Karthavyam)
టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ ఫీమేల్ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti) చేసిన రోల్ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.
https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg
అంకుశం (Ankusam)
హీరో రాజశేఖర్ సూపర్ హిట్ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.
https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_
గ్యాంగ్ లీడర్ (Gang Leader)
మెగాస్టార్ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్ అయ్యింది.
https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C
అర్జున్ రెడ్డి (Arjun Reddy)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.
https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J
ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar)
టాలీవుడ్‌లోని క్లాసిక్ హీరోగా ‘రామ్ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్ తొలిసారి సిక్స్ ప్యాక్ చేయడం విశేషం.
https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a
పోకిరి (Pokiri)
ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.
https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
మార్చి 28 , 2024
Abhinav Gomatam: కామెడీ స్టార్ అభినవ్ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్ నటుల్లో ‘అభినవ్ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన అభినవ్.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అతడు లీడ్ రోల్ చేసిన ‘సేవ్ ద టైగర్స్ 1 & 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అభినవ్ గోమఠం ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్
అభినవ్ గోమఠం ఎప్పుడు పుట్టాడు?
జనవరి 1, 1986
అభినవ్ గోమఠం ఎత్తు ఎంత?
5 ఫీట్ 10 ఇంచెస్ (178 సెం.మీ)
అభినవ్ గోమఠం రాశి ఏది?
సింహా రాశి
అభినవ్ గోమఠం స్కూలింగ్ ఎక్కడ జరిగింది?
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అభినవ్.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు.
అభినవ్ గోమఠం విద్యార్హత ఏంటి?
హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో బీటెక్ చేశాడు.
అభినవ్ గోమఠానికి పెళ్లి జరిగిందా?
కాలేదు
అభినవ్ గోమఠం తండ్రి ఏం చేసేవారు?
అభినవ్ తండ్రి ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగి.
అభినవ్ గోమఠం కెరీర్ ప్రారంభంలో ఏం చేశాడు?
నటనపై ఆసక్తితో ఉడాన్ థియేటర్, అహరం థియేటర్ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అభినవ్ గోమఠం చేసిన తొలి షార్ట్ ఫిల్మ్ ఏది?
ఆర్టిఫిషియల్ (2012)
అభినవ్ గోమఠం చేసిన మొదటి చిత్రం ఏది?
మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya)
అభినవ్ గోమఠంను పాపులర్ చేసిన చిత్రం?
ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi)
అభినవ్ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి?
‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’..
అభినవ్ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు?
‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’
అభినవ్ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి?
టాలీవుడ్ నటి కల్పిక.. అభినవ్ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్ కొట్టిపారేశారు.
అభినవ్ గోమఠం నెట్ వర్త్ ఎంత?
ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా)
అభినవ్ గోమఠం ఫేవరేట్ హీరో ఎవరు?
షారుక్ ఖాన్
అభినవ్ గోమఠం ఫేవరేట్ డైరెక్టర్ ఎవరు?
మణిరత్నం
అభినవ్ గోమఠం బెస్ట్ డైలాగ్ ఏది?
ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్ సీన్.. అభినవ్‌ను చాలా పాపులర్ చేసింది. నలుగురు ఫ్రెండ్స్ (విష్వక్, కౌషిక్ (అభినవ్), ఉప్పు, కార్తిక్) బార్‌లో సిట్టింగ్ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్ వేసే డైలాగ్స్ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అభినవ్ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్.. ఆ వాంట్ టూ సే సమ్‌థింగ్ రా.
విష్వక్: వీడొకడు..
అభినవ్ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్ మోస్ట్ 4 ఇయర్స్. ఐ యామ్ వెరీ హ్యాపీ. తాగుదాం.
ఉప్పు : రేయ్.. త్రీ డేస్ బ్యాక్ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం.
అభినవ్ : అది వేరురా..
కార్తిక్: లాస్ట్ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం
అభినవ్ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు.
విష్వక్ : టూ డేస్ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్ చేసి..
అభినవ్ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్.
విష్వక్ : పళ్లు రాలతాయ్.. అర్థమవుతుందా
ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్ వేసుకున్నాడు చూశావా?
అభినవ్ : లవ్ అయ్యిందా రా? (కార్తిక్ తో)
కార్తిక్ : లవ్ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి.
నలుగురు ఫ్రెండ్స్: డెవలప్.. డెవలప్.. డెవలప్.. డెవలప్..
https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s
అభినవ్ గోమఠంను ఫేమస్ చేసిన సింగిల్ లైన్ డైలాగ్స్?
‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్’
‘ఏం రా వేడి చేసిందా’
అభినవ్ గోమఠం బెస్ట్ యాక్టింగ్ సీన్?
ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్ పాత్రను పరిచయం చేసే సీన్ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్ పర్‌ఫార్మెన్స్ ఓ సారి మీరు చూసేయండి.
https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF
అభినవ్ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు?
అభినవ్ గోమఠం వైరల్ వీడియో ఏది?
దావత్ అనే షోలో అభినవ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్ వర్క్స్ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి.
https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అభినవ్ గోమఠం రీసెంట్ ఫొటోలు?
ఏప్రిల్ 26 , 2024
S. S. Rajamouli Style: రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలన్నీ చాలా వరకు ఒక కామన్ పాయింట్‌ను బేస్ చేసుకుని సాగుతుంటాయి. అది అతని మొదటి సినిమా స్టూడెంట్ నెం.1 నుంచి ఈ మధ్య వచ్చిన RRR వరకు ఒక్కటి మాత్రం బాగా గమనించవచ్చు. రాజమౌళి సినిమాల్లో ఏ కథ అయినా ఏ ఫార్మట్ అయినా గమనించండి. స్టూడెంట్ నం.1, సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు, మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 అయిన ఆ సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకులను ఎమోషన్‌తో బైండ్ చేసి సినిమాకి మంచి ఊపు తీసుకొస్తాడు.
స్టూడెంట్ నం.1 సినిమాలో కొడుకుగా తన తండ్రి ఆదరణ కోసం ఆరాటే పడే కుర్రాడి పాయింటు. అందు కోసం జైలు నుంచి కాలేజీకి వెళ్ళడమనే ట్విస్టు. బ్రాగ్రౌండ్‌లో ఓ అమ్మాయిని కాపాడటం కోసం ఓ వ్యక్తిని చంపడం, దీంతో అక్కడ ప్రేక్షకులను రాజమౌళి ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలిగాడు.
సింహాద్రిలో ఒక పనిపై హీరో కేరళ వెళ్ళినపుడు అక్కడ అన్యాయన్ని ఎదురించి అక్కడ ప్రజలకు అండగా నిలబడటం అనే అంశం ఆధారంగా సినిమా తీశాడు. భూమిక ఎన్టీఆర్‌ను పొడవటం ట్విస్ట్.
సైలో రగ్బీ ఆట మేయిన్ పాయింట్ అయితే... తన కాలేజీని ఆక్రమించకున్న విలన్ భిక్షు యాదవ్‌పై పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ కనెక్టివిటీని తీసుకొచ్చాడు. ఇందులో విలనే రగ్బీకి సవాలు చెయ్యటం ట్విస్టు.
ఛత్రపతిలో హీరో వాళ్ళ అమ్మని బేస్ చేసుకొని ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండిస్తాడు హీరో. తల్లీ కొడుకుల మధ్య దూరం మెయిన్ పాయింటు అయితే.. తన తమ్ముడు తనను తల్లికి దూరం చేయాలనుకోవడం ట్విస్ట్.
ఈగ సినిమాలో హీరోయిన్ కోసం విలన్ హీరోని చంపేస్తే హీరో ఈగ లాగా మారి ప్రతీకారం తీర్చుకోవడం మెయిన్ పాయింట్. చివర్లో ఈగ ఆత్మార్పణ చేసుకుని విలన్‌ను చంపే విధానాన్ని ఎమోషనల్ బైండింగ్ చేశాడు రాజమౌళి.
RRRలో రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట ఇచ్చి అందు కోసం పోలీస్ ఆఫీసర్ అవడం మెయిన్ పాయింట్. తన లక్ష్య సాధనలో అడ్డుగా ఉన్న భీంను హింసించడం ఎమోషనల్ కనెక్టివిటీ. చివరకు భీంతో కలిసి బ్రిటీష్ వారిపై పోరాడి ఆయుధాలు సంపాందించి తన నాన్న కల నెరవేరుస్తాడు రామ్.
అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు. 1st హాఫ్‌లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఉంటుంది. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ... ఆ స్టోరీ ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో ఆది సాధిస్తాడు.
జూలై 06 , 2023
Father's Day Special: నాన్నలతో ఈ స్టార్ సెలబ్రిటీల అనుబంధం చూశారా?
ఫాదర్స్ డే (Fathers Day 2024)ను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ వారిపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఓ పాత ఫొటోను షేర్ చేశారు. ‘ప్రతి చిన్నారికి తన తండ్రే తొలి హీరో. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చారు.
https://twitter.com/KChiruTweets/status/1802187791251509401
మహేష్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara) కూడా తన తండ్రితో కలిసి ఉన్న క్యూట్ ఫొటోను షేర్ చేసింది. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా.. ఐ లవ్ యు సో మచ్’ అని రాసుకొచ్చింది.
View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni)
అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టింది. భర్త అల్లు అర్జున్ తన పిల్లలతో ఉన్న ఫొటోలతో పాటు.. మామ అల్లు అరవింద్ (Allu Aravind), తన తల్లిదండ్రులతో దిగిన పిక్స్‌ను పంచుకుంది. ‘ప్రపంచంలోని ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
యంగ్ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కూడా ఫాదర్స్ డే సందర్భంగా ఓ ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు. చిన్నప్పుడు తన తండ్రి నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘ది ఓజీ’ ఈ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.
లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన హీరోయిన్ నయనతార (Nayanthara).. తన భర్త విగ్నేష్ శివన్, కవల పిల్లల ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ చెప్పింది.
View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) కూతురు ఐశ్వర్య.. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ‘నా హార్ట్ బీట్, నాకు అన్నీ.. లవ్ యు అప్పా’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
దిగ్గజ నటుడు, తండ్రి కమల్ హాసన్ (Kamal Hassan)తో తాను, చెల్లి అక్షర కలిసి ఉన్న ఫొటోను నటి శృతిహాసన్ షేర్ చేసింది.
https://twitter.com/shrutihaasan/status/1802221449899610217
మెగా బ్రదర్, తండ్రి నాగబాబు (Naga Babu)తో సెల్ఫీ దిగుతున్న ఫొటోను యంగ్ హీరో ‘వరుణ్ తేజ్’ అభిమానులతో పంచుకున్నారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా’ అని క్యాప్షన్ ఇచ్చారు.
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా తన తండ్రితో పాటు భర్త, తనయుడు నీల్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ‘బెస్ట్ పాపాస్‌కి హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యు’ అనే క్యాప్షన్ ఇచ్చింది.
View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)
జూన్ 17 , 2024
WOMEN'S DAY SPECIAL: తెలుగులో పవర్‌ఫుల్ లెడీ క్యారెక్టర్స్.. వీళ్లు నటనకు కొత్తదారిని చూపారు!
తెలుగులో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చాలానే వచ్చాయి. కొన్ని చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు కూడా ఉన్నాయి. పాజిటివ్, నెగటివ్ అనే తేడా లేదు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటనతో మెప్పిస్తున్నారు మన హీరోయిన్లు. ఇప్పటి వరకు తెలుగులో కథనాయికలు చేసిన పవర్‌ఫుల్ రోల్స్‌పై ఓ లుక్కేద్దాం.
సీతారామం
సీతారామం చిత్రంలో సీత క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ మధ్య వచ్చిన చిత్రాల్లో ఇంతలా ప్రభావం చూపిన లేడీ క్యారెక్టర్లలో మరొకటి లేదని చెప్పాలి. యువరాణిగా హుందాతనం, ప్రియురాలిగా కొంటెతనం అన్ని కలగలిపిన పాత్ర సీతది. ఈ పాత్ర తెలుగులో వచ్చిన బెస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు.
అరుంధతి
కోడి రామకృష్ణ తెరకెక్కించిన అరుంధతి చిత్రంలో జేజమ్మ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజ జీవితంలో ఆ క్యారెక్టర్ ఉంటే ఇలానే ఉంటుందేమో అనిపించేలా అనుష్క లీనమయ్యింది.
మహా నటి
సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటిలో కీర్తి సురేశ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో అచ్చం సావిత్రిలానే నటించిందని అందరూ ప్రశసించారు.
కర్తవ్యం
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు నయనతార. కర్తవ్యం అనే సినిమాలో ఓ IAS అధికారిగా నయన్ మెప్పించి ప్రశంసలు దక్కించుకుంది.
ధర్మ యోగి
హీరోయిన్ త్రిషను విలన్ రోల్‌లో ఎలివేట్ చేసిన చిత్రం ధర్మ యోగి. ధనుశ్ హీరోగా చేసిన చిత్రంలో పొలిటిషన్‌గా వెన్నుపోటు పొడిచే పాత్రలో త్రిష నటన అద్భుతం.
శివగామి
బాహుబలిలో ప్రభాస్ కన్నా శివగామి ఫేమస్. అంతటి పవర్‌ఫుల్ రోల్‌ను రమ్యకృష్ణ ఒంటి చేత్తో నిలబెట్టింది. రాణిగా ఆమె చూపించిన రాజసం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటే అతిశయోక్తి కాదు.
అత్తారింటికీ దారేది
పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నదియా రోల్ చిత్ర పరిశ్రమలో ఓ టర్నింగ్ పాయింట్. కథను హీరోపై కాకుండా మహిళ పాత్రపై నడిపించారు. నదియా పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు.
ఓసేయ్ రాములమ్మ
ఎవరెన్ని పవర్‌ఫుల్ పాత్రలు పోషించినా విజయశాంతిని వెనక్కి నెట్టలేరు. ఓసేయ్ రాములమ్మ చిత్రంలో నక్సలైట్‌గా ఆమె చేసిన ఎన్ని తరాలైనా అలానే ఉంటుంది.
అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి
పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోనే కాదు లేడీ రోల్స్ కూడా అంతే మాస్‌గా ఉంటాయి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో సహజనటి జయసుధ రవితేజ తల్లి క్యారెక్టర్‌లో ఇరగొట్టారు. ఇందులో ఆమె రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి.
చంద్రముఖి
చంద్రముఖి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జ్యోతిక మాత్రమే. ఈ చిత్రంలో ఆమె నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిజంగా జ్యోతిక.. చంద్రముఖిలా మారిందేమో అనిపించేలా మెప్పించింది.
మార్చి 07 , 2024
#90s A Middle Class Biopic: #90s వెబ్ సిరీస్ ఎందుకు చూడాలంటే? ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటి?
నిన్నటి గతాన్ని భద్రపరిచి నేటి తరానికి అందిస్తూ.. ఆనాటి మంచి, చెడు, ఆనందాలు, సమస్యలు అన్నింటిని హానెస్ట్‌గా చూపించింది #90s MiddleClass Biopic. మిడ్ 2000ను ఒక కాలచక్రంలో బంధించి అందమైన పాత్రల భావోద్వేగాలను చూపిస్తుంది. వెబ్‌సిరీస్‌లో పెద్దగా చెప్పుకోవడానికి కథేమి ఉండదు. కానీ ప్రతి వ్యక్తి జీవితంలో డే టూ డే లైఫ్‌ను అద్భుతంగా తెరకెక్కించింది. సిల్లీ సండే మూమెంట్స్, పండుగలు, హాలిడే ఎంజాయ్‌మెంట్‌ను కళ్లకు అద్ధినట్లు చూపిస్తుంది. నిజానికి ఇదే కదా లైఫ్ అంటే. మనం బ్రతికేది ఆ మూమెంట్స్‌లోనే కదా! చాలా విషయాలు మనం ఏదొక అజెండాతో చేస్తాం. ఎలాంటి ఎజెండా లేకుండా మనం చేసే పనులే మన లైఫ్. సరిగ్గా అలాంటి విషయాలను దగ్గరకు తెచ్చినదే #90s MiddleClass Biopic. ఈ సిరీస్ చూస్తున్నంతసేపూ అన్ని సీన్లు మన నిజ జీవితంలో ఎక్కడొక్కడ మనకు తారసపడినవే. వాటినే అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఆదిత్య హాసన్. లెడీస్ తాలుకు సెన్సిటివ్ విషయాలను చాలా సూపర్బ్‌గా షోలో క్యారీ చేయించాడు.
ఇక 90s A MiddleClass Biopic టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈటీవి విన్ ఫ్లాట్‌ఫాం నుంచి వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌కు IMDB ఏకంగా 9.6 రేటింగ్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఓ వెబ్‌సిరిస్‌కు ఈ స్థాయిలో రేటింగ్ రాలేదనే చెప్పాలి. ఈ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో 90వ దశకం మధ్యతరగతి వాతావరణాన్ని చాలా అద్భుతంగా చూపించారు. ప్రతి పాత్ర ఆ కాలం నాటి సాధక బాధకాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా 90sలో పుట్టినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా వరకు పోస్టులు ఈ వెబ్‌సిరీస్‌లోని ఏదొక సీన్‌తో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పాత్రలను అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. మరి అంతలా అభిమానించే విధంగా ఆ వెబ్‌సిరీస్‌లో క్లారెక్టర్ల తాలుకు ఔచిత్యాన్ని ఓసారి విశ్లేషిద్దాం.
చంద్రశేఖర్(శివాజీ): ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టార్. మధ్యతరగతి మనస్తత్వం కలవాడు. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిపిస్తూ వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. ఖర్చు విషయంలో ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెడుతుంటాడు. పిల్లల భవిష్యత్ గురించి కలలుగంటగా పనిచేస్తుంటాడు. సినిమా చూస్తున్నంత సేపు శేఖర్ క్యారెక్టర్ 90వ దశకంలో సగటు తండ్రి ఆలోచనలకు ప్రతినిధిగా కనిపిస్తాడు. పిల్లల పట్ల అతను వ్యవహరించే తీరు నవ్వు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల వారి భవిష్యత్ గురించి సగటు తండ్రిగా శేఖర్ పడే బాధ కంటతడి పెట్టిస్తుంది. ఆడ పిల్ల తండ్రి కావడంతో ఆమెకు ఏదో ఒకటి కూడ బెట్టాలన్న మధ్యతరగతి సమస్యలు కనిపిస్తుంటాయి. పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉంటూనే వారికి అందించాల్సి సౌకర్యాల కోసం ఆలోచిస్తుంటాడు.
https://twitter.com/sunny5boy/status/1745383429808517544?s=20
రాణి(వాసుకీ): ఈ వెబ్‌సిరీస్‌లో సగటు మధ్యతరగతి గృహిణిగా రాణి పాత్రలో వాసుకీ ఆనంద్ అద్భుతమైన నటన కనబర్చింది. నిరంతరం కుటుంబం కోసం ఆలోచించే గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. భర్త తెచ్చిచ్చే కాస్త డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటుంది. భర్తకు తన బాధ్యతలు గుర్తు చేస్తూ అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఆడపిల్ల ఉన్న ఇంట్లో మధ్యతరగతి గృహిణి భయాలు ఆమెలో స్పష్టంగా కనిపించాయి. పిల్లల కోరికలను తీర్చుతునే... అనవసరమైన ఆశలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆనాటి జీవనగతిని కళ్లకు కట్టింది.
https://twitter.com/Ga_ne_sh_5/status/1745774847375069388?s=20
ఆదిత్య: ముఖ్యంగా ఈ సినిమాకు నిజమైన హీరో మౌలి అనే చెప్పాలి. చిన్నవయసులోనే అద్భుతమైన నటన కనబరిచాడు. అతన్ని చూస్తుంటే ప్రతింట్లో ఉండే చిన్న కొడుకు మాదిరి కనిపిస్తాడు. సాధారణంగా ఇళ్లల్లో చిన్న కొడుకు గారాభంగా పెరుగుతుంటారు. వాళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో వంట నచ్చకపోతే మారం చేయడం, తోటి పిల్లలను ఆట పట్టించడం వంటి చేష్టలు హాస్యంగా కనిపిస్తాయి. మార్కులు తక్కువ వచ్చినప్పుడు అమ్మ-నాన్న దగ్గర ఆదిత్య చెప్పే అబద్దాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంటికి ఎవరైన చుట్టాలు వచ్చినప్పుడు వారివద్ద చిన్నపిల్లలు చేసే సరదా చేష్టలు ఆదిత్య క్యారెక్టర్ 90s కాలాన్ని గుర్తు చేస్తాయి. ముఖ్యంగా ఆ వయసులో చిన్నపిల్లలు పడే మానసిక వ్యథ.. ఆదిత్య పాత్రలో ప్రతిబింబిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఆదిత్య- చంద్రశేఖర్ క్యారెక్టర్‌కు సంబంధించిన సీన్లు ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
https://twitter.com/Iharish999/status/1744674325352132686?s=20
ప్రశాంత్ &దివ్య:
పదోతరగతి చదువుతున్న ప్రశాంత్ టీనేజ్ కుర్రాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు. బయట ఆడుకోవాలని ఉన్నా, తన తండ్రి మాట కోసం ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. 10thలో జిల్లా ఫస్ట్ రావాలనే తన తండ్రి కోరిక కోసం పరిశ్రమిస్తుంటాడు. అతని తమ్ముడు ఆదిత్యతో చేసే సరదా సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక దివ్య మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయి పుడితే ఎలా పెరుగుతుందో అలాగే కనిపించింది. తల్లిద్రండ్రుల భయాల మధ్య వారి మాటకు అనుగుణంగా పెరుగుతూ కనిపిస్తుంది.
https://twitter.com/_Shivatweets/status/1745269317112119543?s=20
https://telugu.yousay.tv/90s-web-series-review-how-is-the-90s-series-a-reflection-of-middle-class-families.html
జనవరి 16 , 2024
#90’s Web Series Review: మధ్యతరగతి ఫ్యామిలీలకు ప్రతీరూపం #90’s.. సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: శివాజీ, వాసుకి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు
రచనం, దర్శకుడు: ఆదిత్య హాసన్
సంగీతం: సురేష్ బొబ్బలి
సినిమాటోగ్రఫీ: అజాజ్ మహ్మద్
ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి
నిర్మాత: రాజశేఖర్ మేడారం
శివాజీ, వాసుకి జంటగా నటించిన లెేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘#90's. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ట్యాగ్‌లైన్. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వచ్చిన ఈ వినోదాత్మక సిరీస్‌ను రాజశేఖర్ మేడారం నిర్మించారు. మధ్యతరగతి కుటుంబ భావోద్వేగాలతో నవ్వులు పూయిస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. కాగా ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సిరీస్ ప్రసారంలోకి వచ్చింది. మరి దీని కథేంటి? లెక్కల మాస్టార్‌గా శివాజీ ఎలా నటించారు? ఇప్పుడు చూద్దాం.
కథ
చంద్రశేఖర్ (శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్. భార్య రాణి (వాసుకీ), పిల్లలు రఘు (ప్రశాంత్), దివ్య (వాసంతిక), ఆదిత్య (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. ప్రభుత్వ టీచర్ అయినప్పటికీ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో జాయిన్ చేస్తాడు. వారి చదువుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాడు. 10th చదువుతున్న రఘు జిల్లా ఫస్ట్ వస్తాడని చంద్రశేఖర్ ఆశిస్తాడు. మరి వచ్చిందా? క్లాస్‌మేట్ సుచిత్ర (స్నేహాల్ కామత్), రఘు మధ్య ఏం జరిగింది? చంద్రశేఖర్ ఇంట్లో ఉప్మా కథేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
ఎవరెలా చేశారంటే
చంద్రశేఖర్ పాత్రలో శివాజీ ఒదిగిపోయారు. మిడిల్ క్లాస్ తండ్రులందరికీ ప్రతినిధిగా ఆయన కనిపించారు. మధ్య తరగతి గృహిణి రాణిగా వాసుకీని చూస్తే 90లలో పిల్లలకు తమ తల్లి గుర్తుకు వస్తుంది. భర్తతో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇంట్లో పరిస్థితి గురించి చెప్పే సన్నివేశంలో ఆమె అద్భుత నటన కనబరిచారు. రఘు పాత్రలో మౌళి నటన సహజంగా ఉంది. అతడు చక్కగా చేశాడు. వాసంతి, స్నేహాల్ కామత్ అందంగా నటించారు. చిన్నోడు రోహన్ అయితే పక్కా నవ్విస్తాడు. చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల అతిథి పాత్రలో మెప్పిస్తారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
90లలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాతావరణాన్ని దర్శకుడు ఆదిత్య హాసన్ చక్కగా తెరపై ఆవిష్కరించారు. కథ రొటిన్‌గా అనిపించినప్పటికీ క్యూట్ & లిటిల్ మూమెంట్స్‌తో దర్శకుడు ఆకట్టుకున్నాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ సిరీస్‌తో ప్రేక్షకులను 90ల నాటి రోజుల్లోకి తీసుకెళ్లి ఆ స్మృతులను ఆదిత్య గుర్తుచేశారు. కుటుంబ విలువలను సిరీస్‌లో చక్కగా చూపించారు. చిన్న చిన్న విషయాల్లో సంతోషం వెతుక్కునే '90స్' మధ్యతరగతి కుటుంబాన్ని కళ్లకు కట్టారు. ముఖ్యంగా మనం 90ల నాటి పిల్లలమైతే ఈ సిరీస్‌కు కనెక్ట్ అవుతాం. దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రతి ఒక్కరికీ అందమైన జ్ఞాపకాలను అందించారు.
టెక్నికల్‌గా
సాంకేతికంగా #90’s సిరీస్ బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సన్నివేశాలు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా చేసింది. అప్పటి పరిస్థితులను ఆవిష్కరించడానికి యూనిట్ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నటీనటులుకథ, దర్శకత్వంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
రేటింగ్: 3/5
జనవరి 05 , 2024