• TFIDB EN
  • సింహ
    ATelugu2h 36m
    శ్రీమన్నారాయణ కాలేజీ ప్రొఫెసర్. అతని కాలేజీలోకి జానకి అనే యువతి కొత్తగా చేరుతుంది. శ్రీమన్నారాయణను చూసిన వెంటనే ఆమె ప్రేమలో పడుతుంది. అయితే జానకి గతం.. శ్రీమన్నారయణ తండ్రి గతంతో లింక్ అయి ఉంటుంది. ఇంతకు జానకి ఎవరు? శ్రీమన్నారాయణ తండ్రి గతం ఏమిటి అన్నది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నందమూరి బాలకృష్ణ
    as Srimannarayana
    నయనతార
    నరసింహ భార్య మరియు శ్రీమన్నారాయణ తల్లి
    స్నేహ ఉల్లాల్
    ఒక విద్యార్థి మరియు శ్రీమన్నారాయణ ప్రేమిస్తారు
    నమిత
    శ్రీమన్నారాయణతో పిచ్చి ప్రేమలో ఉన్న అతని సహోద్యోగి
    సాయి కుమార్
    ఒక గ్యాంగ్ స్టర్ మరియు విరోధి
    KR విజయ
    శ్రీమన్నారాయణ అమ్మమ్మ
    ఆదిత్య మీనన్
    ఒక గ్యాంగ్‌స్టర్ మరియు వీరకేశవుడు కొడుకు
    బ్రహ్మానందం
    నరసింహ కాంపౌండర్
    కోట శ్రీనివాసరావు
    వీరకేశవుడు తండ్రి
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    కళాశాల ప్రిన్సిపాల్
    చలపతి రావు
    బొబ్బిలి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
    వేణు మాధవ్
    మహిమతో పిచ్చి ప్రేమలో ఉన్న సంస్కృత లెక్చరర్
    కృష్ణ భగవాన్
    శ్రీమన్నారాయణ సేవకుడు
    రవి ప్రకాష్
    జానకి సోదరుడు
    శ్రవణ్వీరకేశవుడు తమ్ముడు
    హేమంత్ బిర్జే
    వీరకేశవుడు సోదరుడు
    జివి సుధాకర్ నాయుడు
    వీరకేశవుడు అనుచరుడు
    ఎల్బీ శ్రీరామ్
    ఝాన్సీ లక్ష్మి
    ఝాన్సీ
    మధుసూధన్ రావు
    రాజకీయ నాయకుడు
    ఫిష్ వెంకటయ్య
    రాజకీయ నాయకుడు
    ధాము డేర్సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
    సిబ్బంది
    బోయపాటి శ్రీను
    దర్శకుడు
    పరుచూరి కిరీటినిర్మాత
    బోయపాటి శ్రీను
    రచయిత
    చక్రి
    సంగీతకారుడు
    ఆర్థర్ ఎ. విల్సన్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Razakar Movie Review: రజాకార్ల అకృత్యాలను కళ్లకు కట్టిన డైరెక్టర్‌.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు:  బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, రాజ్ అర్జున్‌, తేజ్ స‌ప్రు, జాన్ విజ‌య్‌, దేవీ ప్ర‌సాద్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యాట స‌త్య‌నారాయ‌ణ‌ సంగీతం: భీమ్స్ సిసిరోలియో ఛాయాగ్ర‌హ‌ణం: కె.ర‌మేష్ రెడ్డి ఎడిటింగ్‌ : తమ్మిరాజు నిర్మాత‌: గూడూరు నారాయ‌ణ రెడ్డి విడుద‌ల తేదీ: 15-03-2024 తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో సాగే చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిన చిత్రం ‘ర‌జాకార్‌’ (Razakar). బాబీ సింహా, వేదిక‌, అన‌సూయ‌, ఇంద్ర‌జ‌, ప్రేమ‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ‌కీయంగా ఎన్నో వివాదాల‌కు కారణమైన ఈ చిత్రం.. పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? తెలంగాణ పోరాట యోధుల‌ గాథ‌ను ఎలా చూపించారు? వివాదాస్ప‌ద‌మైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు చూద్దాం.  కథ దేశంలో అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్‌ (నైజాం)ని భారత్‌లో విలీనం చేయడానికి నిజాం ప్రభువు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ (మకరంద్‌ పాండే) ఇష్టపడడు. నైజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్‌గా మార్చి ఓ ప్రత్యేక దేశంగా పాలించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఖాసీం రజ్వీ(రాజ్‌ అర్జున్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. బలవంతపు మత మార్పిడి కోసం ఖాసీం రజ్వీ ప్రజలను అతి దారుణంగా హింసిస్తాడు. ఈ క్రమంలో ఐలమ్మ (ఇంద్రజ), గూడూరు సూర్య నారాయణ, రాజి రెడ్డి (బాబీ సింహా) రజాకార్లకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశారు? ఈ సమస్యను కేంద్ర హోమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (తేజ్‌ సప్రు) ఎలా పరిష్కరించారు? రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో కనిపించినా ప్రతీ పాత్ర కీలకమే. ఫ‌లానా పాత్రే ప్రధానమైనదని చెప్ప‌డానికి వీల్లేదు. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో పాత్ర హీరోగా నిలిచింది. చాక‌లి ఐల‌మ్మ‌గా ఇంద్ర‌జ‌, రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంత‌వ్వ‌గా వేదిక‌, నిజాం రాజుగా మ‌క‌రంద్ దేశ్ పాండే, స‌ర్దార్ వ‌ల్ల‌భభాయ్ ప‌టేల్‌గా రాజ్ స‌ప్రు, ఖాసీం రిజ్వీగా రాజ్ అర్జున్‌, లాయ‌క్‌గా జాన్ విజ‌య్... ఇలా ప్ర‌తిఒక్క‌రూ త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టారు. ముఖ్యంగా ఖాసీం రిజ్వీ పాత్ర‌లో రాజ్ అర్జున్ క‌న‌బ‌ర్చిన న‌ట‌న‌.. ప‌లికించిన హావ‌భావాలు.. సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తాయి. జాన్‌ విజయ్‌, తలైవసల్‌ విజయ్‌, అరవ్‌ చౌదరి, మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు యాట స‌త్య‌నారాయ‌ణ.. తాను రాసుకున్న క‌థ‌ను య‌థాత‌థంగా తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కొన్ని ఎపిసోడ్స్‌ చాలా బాగా చూపించారు. కాక‌పోతే క‌థాంశం సాగిన తీరు ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌క‌పోవ‌చ్చు. ప్రథమార్ధంలో ఎక్కువ‌గా ర‌జాక‌ర్ల అకృత్యాలను చూపిస్తే.. ద్వితీయార్ధంలో వారికి ఎదురుతిరిగిన ప్ర‌జ‌ల పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కొత్త పాత్రని తెరపైకి తీసుకురావడం.. వారికి ఇచ్చిన ఎలివేషన్‌.. యాక్షన్‌ సీన్స్‌ ఇవన్నీ ఆకట్టుకుంటాయి. వెయ్యి ఉరిల మర్రి చరిత్ర, పరకాల హింసకాండ, బైరాన్‌పల్లి మారణహోమం లాంటి సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. సర్ధార్‌ పటేల్‌.. ఖాసీం రిజ్వీకి ఇచ్చే వార్నింగ్‌ ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ప‌తాక స‌న్నివేశాలు భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టే పోలీస్ చ‌ర్య‌తో సాగుతాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను డైరెక్టర్‌ మరింత ఆసక్తికరంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.  సాంకేతికంగా సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం భీమ్స్ సిసిరోలియో సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో అతడు అదరగొట్టేశాడు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. కథలో భాగంగానే సాంగ్స్‌ వస్తుంటాయి. బతుకమ్మ పాటతో పాటు చివర్లో వచ్చే జోహార్లు సాంగ్స్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్‌కు వంకపెట్టనక్కర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన పాత్రల నటనప్రజా పోరాట ఘట్టాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ మితిమీరిన హింసతెలిసిన కథ కావడం.. Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 15 , 2024
    REVIEW: కోనసీమ థగ్స్‌
    REVIEW: కోనసీమ థగ్స్‌
    దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్‌ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్‌ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి  ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం. చిత్రబృందం: దర్శకత్వం: బృందా గోపాల్‌ సంగీతం: సామ్‌ CS నటీనటులు: హ్రిదు హరూన్‌, అనస్వర రాజన్‌, బాబీ సింహా తదితరులు ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంటోనీ సినిమాటోగ్రఫీ: ప్రియేష్‌ గురుస్వామి కథ: శేషు( హ్రిదు హరూన్‌) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?.  దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ. ఎలా ఉందంటే: దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్‌ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్‌ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ చక్కగా సెట్‌ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.  స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్‌ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే. సాంకేతికంగా సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్‌ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది.  ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్‌ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.  నటీ,నటుల పెర్ఫార్మెన్స్ హ్రిదు హరూన్‌ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్‌ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. బలాలు: కథ, సెకండాఫ్‌ నటీ నటుల పెర్ఫార్మెన్స్‌ సినిమాటోగ్రఫీ బీజీఎం బలహీనతలు ఫస్టాఫ్‌ కథనం సమీక్ష: ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్‌’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది. రేటింగ్‌: 2.75
    ఫిబ్రవరి 24 , 2023
    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌ సంగీతం: రవి బస్రూర్‌ సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌ విడుదల: 22-12-2023 పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స‌లార్‌’. ఇందులో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా నటించారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఎప్ప‌ట్నుంచో  ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అభిమానుల కోలహాలం మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్‌ కటౌట్‌కు తగిన హిట్‌ పడిందా? డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌కు ఖాతాలో మరో బ్లాక్‌ హిస్టర్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.  కథ ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. ఆ సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. అయితే రాజ మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. దొరలు అంతా కలిసి సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకొని రాజమన్నార్‌ను అంతం చేస్తారు. అయితే తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని ఖాన్సార్‌కు రూలర్‌గా చూడాలనేది రాజమన్నార్‌ కోరిక‌. దీంతో వ‌ర‌ద త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌నికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాస‌న్) ఎలా వ‌చ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఆ స్థాయిలో మెప్పించిన చిత్రం సలార్‌. తన కటౌట్‌కు తగ్గట్లు యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. త‌ల్లి చాటు కొడుకుగా, మాట జ‌వ‌దాట‌ని స్నేహితుడిగా ఆయన నటన ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్లో ప్ర‌భాస్ క‌నిపించిన తీరు, హీరోయిజం, స్టైల్ మెప్పిస్తుంది. శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేనప్పటికీ ప్ర‌థ‌మార్ధంలో ఆమే కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ అద్భుత నటన కనబరిచాడు. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఈశ్వ‌రీరావు, బాబీ సింహా, జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి,  శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ‘సలార్‌’తో మరోమారు తన మార్క్‌ చూపించారు. ఖాన్సార్ పేరుతో ఓ క‌ల్పిత  ప్ర‌పంచాన్ని సృష్టించి దాని చుట్టూ అద్భుతమైన క‌థ‌ని అల్లారు. కె.జి.యఫ్ సినిమాల‌తో పోలిస్తే హీరోయిజం, ఎలివేష‌న్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొస్తోంది. అయితే ప్ర‌భాస్‌కి త‌గ్గట్టు మాస్, యాక్ష‌న్ అంశాల్ని మేళ‌వించ‌డంలో ప్ర‌శాంత్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. అవసరమైన చోట్ల ప్రభాస్‌కు ఎలివేష‌న్ల‌ు ఇచ్చి అభిమానుల‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్. అయితే కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో స‌ర‌ళంగా క‌థ‌ని చెప్ప‌లేక‌పోయారు డైరెక్టర్. ఓవరాల్‌గా స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా డ్రామాను నడిపించడంలో ప్రశాంత్‌నీల్‌ సక్సెస్ అయ్యారు.  సాంకేతికంగా సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఖాన్సార్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. రవి బ‌స్రూర్ బాణీలు, నేప‌థ్య‌ సంగీతం, భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. అన్బ‌రివ్ స్టంట్స్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ ప్రభాస్, పృథ్వీ నటనయాక్షన్‌ సన్నివేశాలుభావోద్వేగాలు, క్లైమాక్స్ మైనస్‌ పాయింట్స్‌ సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ రేటింగ్‌: 3.5/5
    డిసెంబర్ 22 , 2023
    AKHANDA 2: టార్గెట్ AP ఎలక్షన్స్.. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా బాలయ్య, బోయపాటి సినిమా!
    AKHANDA 2: టార్గెట్ AP ఎలక్షన్స్.. ప్యూర్ పొలిటికల్ డ్రామాగా బాలయ్య, బోయపాటి సినిమా!
    నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. సింహా, లెజెండ్, అఖండ.. సినిమాలతో వీరు హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడింట్లోనూ కామన్‌గా పొలిటికల్ టచ్ ఉంటుంది. నాటి వర్తమాన రాజకీయ పరిస్థితులకు అనువదించుకుని వచ్చే సన్నివేశాలు, డైలాగ్స్.. ఈ సినిమాల్లో ఎన్నో ఉన్నాయి. అయితే, మరోసారి వీరి కాంబో రిపీట్ కానుంది. అఖండ పార్ట్ 2 కోసం ప్లాన్ చేస్తున్నారట. ఈ సారి పొలిటికల్ డోజ్ మరింత పెంచనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి.  స్టోరీ ఇదేనట.. రాష్ట్రంలోని ప్రముఖ హిందూ దేవాలయాల్లోని పరిస్థితుల చుట్టూ సినిమా కథ ఉంటుందని టాక్. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న దాడులు, అధికార యంత్రాంగం ప్రవర్తనా తీరును ఎండగట్టేందుకు బాలయ్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ అన్య మతస్థుడు అధికారంలో ఉంటే రాష్ట్రంలోని ఆలయాల దుస్థితి ఎలా ఉంటుంది? వీటిని రక్షించడానికి కథానాయకుడు ఎలాంటి పోరాటం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం తెరకెక్కనుందట. ప్యూర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తూనే మాస్ ఎలివేషన్స్‌ని హైలైట్ చేయనున్నట్లు సమాచారం.  ఎన్నికల నేపథ్యంలో.. రాజకీయాలే లక్ష్యంగా అఖండ పార్ట్ 2 రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా విడుదలను కూడా పక్కాగా ప్లాన్ చేశారట. సరిగ్గా ఏపీ ఎన్నికల ముందే సినిమాను రిలీజ్ చేయాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు టాక్. ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ విధానాలను సినిమా ద్వారా ఎండగట్టాలని చూస్తున్నారట. ఎన్నికల ప్రచారానికి ఈ సినిమాను ఓ ఆయుధంలా వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి, ఈ సినిమాకు బాలయ్య పుట్టినరోజు నాడు శ్రీకారం చుట్టునున్నట్లు టాక్. జూన్ 10న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్లు సమాచారం.  లెజెండ్ కూడా.. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’. ఈ సినిమా 2014 మార్చి 24న విడుదలైంది. సరిగ్గా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కూడా రాజకీయ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇదే నేపథ్యంలో కొనసాగుతుంది. ఇందులోని డైలాగులు కూడా పొలిటికల్ టచ్‌తో ఉన్నాయి. నాడు ఈ సినిమా ఎలక్షన్లకు కలిసొచ్చింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగ్గా బాలయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ సెంటిమెంట్‌ని మరోసారి వర్కౌట్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది.  అఖండ టీంతోనే.. అఖండ పార్ట్ 2 సినిమాలో కూడా దాదాపు అదే టీం పనిచేయనుంది. ఈ సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఎస్.ఎస్.థమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్‌లో దద్దరిల్లింది. దీంతో పార్ట్ 2కి సైతం థమన్‌నే కొనసాగించనున్నారట. ఇతర టెక్నికల్ టీం కూడా మరోసారి కలిసి పనిచేయనుంది.  వరుస సినిమాలు.. ఓ వైపు ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బాలయ్య వరుస సినిమాలను చేస్తున్నారు. ఇటీవల వీరసింహారెడ్డితో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. పక్కా తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ అనంతరం బోయపాటితో అఖండ2 కు బాలయ్య రెడీ కానున్నారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాకు మేకప్ వేసుకోనున్నట్లు సమాచారం.
    మే 01 , 2023
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    NBK 109 vs Devara: బాక్సాఫీస్‌ బరిలో బాలయ్య,  తారక్‌, రవితేజ .. ఎవరిది పైచేయి?
    టాలీవుడ్‌లో సినిమా - సినిమాకు మధ్య పోటీ సాధారణమే. ఒకే రోజున రెండు, మూడు చిత్రాలకు పైగా రిలీజవుతూ ఒకదానికొకటి సవాలు విసురుకుంటాయి. అయితే ఆ పోటీ ముగ్గురు స్టార్‌ హీరోల మధ్య ఉంటే ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. త్వరలో అటువంటి పోటీనే టాలీవుడ్‌లో చూడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR), మాస్‌ మహారాజ్ రవితేజ (Ravi Teja) బాక్సాఫీస్‌ వద్ద తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఒకే రోజున వారి సినిమాలు రిలీజ్‌ అయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రసవత్తర పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఆసక్తి ఇప్పటి నుంచే అభిమానుల్లో మెుదలైంది.  బాలయ్య vs రవితేజ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్‌కు బాలయ్య దూరంగా ఉన్నప్పటికీ అతడి పాత్ర మినహా రిమైనింగ్‌ షూటింగ్‌ను బాబీ శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్‌ ముగియడంతో త్వరలోనే బాలయ్య సెట్స్‌లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాలయ్య పైన ఉన్న సీన్స్‌ త్వరగా షూట్‌ చేసి సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మరోవైపు మాస్‌ మహారాజ్‌ రవితేజ - దర్శకుడు హరీష్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో 'మిస్టర్‌ బచ్చన్‌' మూవీ తెరకెక్కుతోంది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) 'ఓజీ' (OG) సినిమా వాయిదా పడటంతో ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ఫుల్‌ ఫోకస్‌ మెుత్తం రవితేజ చిత్రంపైనే పెట్టారు. చాలా ఫాస్ట్‌గా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ మూవీని కూడా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని హరీష్‌ శంకర్‌ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే బాలయ్య - రవితేజ బాక్సాఫీస్‌ ఎదుట తలపడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ ఆసక్తికర పోరులో విజయం ఎవరినీ వరిస్తుందో చూడాలి.  గతంలో బాలయ్యదే పైచేయి బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్‌ వద్ద తలపడటం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా సందర్భాల్లో వారు చేసిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. గతేడాది బాలయ్య చేసిన ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఒకే రోజున బాక్సాఫీస్‌ బరిలో నిలిచాయి. అయితే ఈ పోరులో బాలకృష్ణ పైచేయి సాధించారు. ఆయన చేసిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ప్రశంసలు అందుకుంది. అయితే ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మాత్రం రూ. 48 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి కూడా బాలయ్యదే గెలుపు అని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటే.. కాదు కాదు రవితేజనే బాక్సాఫీస్‌ కింగ్‌గా నిలుస్తాడని అతడి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  దేవర నుంచి గట్టిపోటీ తప్పదా? తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' (Devara) చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం.. 'దేవర'ను సైతం సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయాలని కొరటాల టీమ్‌ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఆ రోజున రావాల్సిన పవన్‌ కల్యాణ్‌ 'ఓజీ' చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో దేవరను రెండు వారాల ముందుగానే రిలీజ్‌ చేస్తే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. ఇదే జరిగితే ఆ రోజున బాక్సాఫీస్‌ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.  'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న ‘NBK 109’ చిత్రం నుంచి ఇటీవలే క్రేజీ గ్లింప్స్‌ విడుదలైంది. బాలయ్య బర్త్‌డే రోజున ఈ స్పెషల్‌  గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.  https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 13 , 2024
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    Abhinav Gomatam: కామెడీ స్టార్‌ అభినవ్‌ గోమఠం గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లోని టాలెంటెడ్ యంగ్‌ నటుల్లో ‘అభినవ్‌ గోమఠం’ ముందు వరుసలో ఉంటాడు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించిన అభినవ్‌.. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ఓ వైపు హాస్య పాత్రలు పోషిస్తూనే మరోవైపు కథానాయకుడిగా, ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌రా’, ‘మై డియర్‌ దొంగ’ చిత్రాలు ఇటీవల రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. అతడు లీడ్‌ రోల్‌ చేసిన ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 & 2’ సిరీస్‌లు ఓటీటీలో సూపర్‌ హిట్ అయ్యాయి. దీంతో అభినవ్‌ గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి ఈ ఆర్టికల్‌లో అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  అభినవ్‌ గోమఠం ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్‌ అభినవ్‌ గోమఠం ఎప్పుడు పుట్టాడు? జనవరి 1, 1986 అభినవ్‌ గోమఠం ఎత్తు ఎంత? 5 ఫీట్‌ 10 ఇంచెస్‌ (178 సెం.మీ) అభినవ్‌ గోమఠం రాశి ఏది? సింహా రాశి అభినవ్‌ గోమఠం స్కూలింగ్‌ ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అభినవ్‌.. తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అభినవ్‌ గోమఠం విద్యార్హత ఏంటి? హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశాడు.  అభినవ్‌ గోమఠానికి పెళ్లి జరిగిందా? కాలేదు   అభినవ్‌ గోమఠం తండ్రి ఏం చేసేవారు? అభినవ్‌ తండ్రి ఎయిర్‌ ఫోర్స్‌లో ఉద్యోగి.  అభినవ్‌ గోమఠం కెరీర్‌ ప్రారంభంలో ఏం చేశాడు? నటనపై ఆసక్తితో ఉడాన్‌ థియేటర్‌, అహరం థియేటర్‌ వంటి సంస్థల ఆధ్వర్యంలో పలు నాటకాలు ప్రదర్శించాడు. ఆ తర్వాత లఘు చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  అభినవ్‌ గోమఠం చేసిన తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ఏది? ఆర్టిఫిషియల్‌ (2012) అభినవ్‌ గోమఠం చేసిన  మొదటి చిత్రం ఏది? మైనే ప్యార్ కియా (Maine Pyaar Kiya) అభినవ్‌ గోమఠంను పాపులర్‌ చేసిన చిత్రం? ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi) అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన చిత్రాలు ఏవి? ‘మైనే ప్యార్ కియా’, ‘బిల్లా రంగ’, ‘జగన్నాటకం’, ‘మళ్ళీరావా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘జెస్సీ’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘సీత’, ‘మీకు మాత్రమే చెప్తా’, ‘రంగ్ దే’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘సెహరి’, ‘విరూపాక్ష’, ‘గూఢచారి’, ‘గాందీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘కిస్మత్’, ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’, ‘మై డియర్ దొంగ’.. అభినవ్‌ గోమఠం ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు? ‘అర్థమైందా అరుణ్ కుమార్’, ‘తులసివనం’, ‘సేవ్ ద టైగర్స్’, ‘సేవ్ ది టైగర్స్ 2’ అభినవ్‌ గోమఠంపై వచ్చిన వివాదస్పద ఆరోపణలు ఏంటి? టాలీవుడ్‌ నటి కల్పిక.. అభినవ్‌ గోమఠంపై సంచలన ఆరోపణలు చేసింది. అభినవ్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. తనను వేధించాడని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అభినవ్‌ కొట్టిపారేశారు.  అభినవ్‌ గోమఠం నెట్‌ వర్త్‌ ఎంత? ఏడాదికి రూ.1.5 కోట్లు (అంచనా) అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ హీరో ఎవరు? షారుక్‌ ఖాన్ అభినవ్‌ గోమఠం ఫేవరేట్‌ డైరెక్టర్‌ ఎవరు? మణిరత్నం అభినవ్‌ గోమఠం బెస్ట్‌ డైలాగ్ ఏది? ఈ నగరానికి ఏమైంది సినిమాలో వచ్చే బార్‌ సీన్‌.. అభినవ్‌ను చాలా పాపులర్‌ చేసింది. నలుగురు ఫ్రెండ్స్‌ (విష్వక్‌, కౌషిక్ (అభినవ్‌), ఉప్పు, కార్తిక్‌) బార్‌లో సిట్టింగ్‌ వేస్తారు. ఆ సందర్భంలో అభినవ్‌ వేసే డైలాగ్స్‌ యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఆ సీన్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం.  అభినవ్‌ : ఈ నగరానికి ఏమైంది. ఓ పక్కన బారు.. ఇంకో పక్కన ఫ్రెండ్స్‌. అయినా ఎవరూ తాగట్లేదేంటి? రేయ్‌.. ఆ వాంట్‌ టూ సే సమ్‌థింగ్‌ రా. విష్వక్‌: వీడొకడు.. అభినవ్‌ : ఎన్నేళ్లు అయ్యిందిరా మనం ఇట్ల కూర్చొని తాగి. ఆల్‌ మోస్ట్ 4 ఇయర్స్‌. ఐ యామ్‌ వెరీ హ్యాపీ. తాగుదాం.  ఉప్పు : రేయ్‌.. త్రీ డేస్‌ బ్యాక్‌ పెంట్ హౌస్‌లో కూర్చొని తాగాం మనం. అభినవ్‌ : అది వేరురా.. కార్తిక్‌: లాస్ట్‌ వీకే కదరా.. క్లబ్‌లో ఎంట్రీ కోసం వచ్చి తాగినాం అభినవ్‌ : నేను ఎక్కువ తాగలేదు ఆ రోజు. విష్వక్‌ : టూ డేస్‌ అయ్యింది వీడు మందు తాగాం అని కాల్‌ చేసి.. అభినవ్‌ : అయితే ఏంది ఇప్పుడు.. నేను అనొద్దా ఇట్లా. ఎగ్జామినేషన్‌ హాల్‌లో కూర్చున్నట్లు అందరం సైలెంట్‌గా కూర్చోవాలా. నువ్వేందిరా గ్లాసెస్ వేసుకున్నావ్‌ (విష్వక్‌తో). ఆరింటి తర్వాత కళ్లద్దాలు పెట్టుకుంటే గుడ్లు పెట్టి కొట్టేవాళ్లం నీకు గుర్తు లేదా? ఎందుకు పెట్టుకున్నావ్‌. విష్వక్‌ : పళ్లు రాలతాయ్‌.. అర్థమవుతుందా ఉప్పు : కళ్లల్లో మండే అగ్ని గోళాలను ఆపుకోడానికి ఈ రైబాన్‌ వేసుకున్నాడు చూశావా? అభినవ్‌ : లవ్‌ అయ్యిందా రా? (కార్తిక్‌ తో) కార్తిక్ : లవ్‌ ఏముంది రా.. ఫస్ట్ డెవలప్‌ అవ్వాలి.. పెళ్లి అయ్యాక ఇవన్నీ అయిపోతాయి. నలుగురు ఫ్రెండ్స్‌: డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. డెవలప్‌.. https://youtu.be/qAluEZGqhh8?si=IymIAooV_cchv61s అభినవ్‌ గోమఠంను ఫేమస్‌ చేసిన సింగిల్‌ లైన్‌ డైలాగ్స్‌? ‘ఛీ దీనెమ్మ ఏం టార్చర్‌’ ‘ఏం రా వేడి చేసిందా’ అభినవ్‌ గోమఠం బెస్ట్‌ యాక్టింగ్‌ సీన్‌? ఈ నగరానికి ఏమైంది సినిమాలో అభినవ్‌ పాత్రను పరిచయం చేసే సీన్‌ హైలెట్‌గా ఉంటుంది. ఇందులో అభినవ్‌ తన నటనతో అదరగొట్టాడు. ముఖ్యంగా జంతువులకు డబ్బింగ్‌ చెప్పేటప్పుడు అతడు ఎక్స్‌ప్రెషన్స్‌ నవ్వులు తెప్పిస్తాయి. అభినవ్‌ పర్‌ఫార్మెన్స్‌ ఓ సారి మీరు చూసేయండి.  https://youtu.be/9uiW6XzEEWc?si=SxGSZETzIZbJcyzF అభినవ్‌ గోమఠం చిత్రాలు/సిరీస్‌లకు సంబంధించిన పోస్టర్లు? అభినవ్‌ గోమఠం వైరల్‌ వీడియో ఏది? దావత్‌ అనే షోలో అభినవ్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఇందులో సన్నీ లియోన్‌ ప్రస్తావన రాగా.. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ప్రీవియస్‌ వర్క్స్‌ చూసేవాడినని చెప్తాడు. ఈ మాటతో యాంకర్‌ రీతు సహా అక్కడ ఉన్న వారంతా ఇరగపడి నవ్వుతారు. ఇందుకు సంబంధించిన వీడియోపై ఓ లుక్కేయండి. https://www.instagram.com/reel/C5ksjvkpqib/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== అభినవ్‌ గోమఠం రీసెంట్‌ ఫొటోలు?
    ఏప్రిల్ 26 , 2024
    మానస చౌదరి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    మానస చౌదరి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
     తెలుగు కుర్ర హీరోయిన్ మానన చౌదరి.. రీసెంట్‌గా 'బబుల్‌గమ్‌' సినిమాతో తెరంగేట్రం చేసింది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని.. టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రాళ్లను కవ్వించే మానస చౌదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts about Manasa Chowdary)  ఓసారి చూద్దాం. మానస చౌదరి ఎప్పుడు పుట్టింది? August 2, 2000 మానస చౌదరి ముద్దు పేరు? మానస మానస చౌదరి హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? బబూల్‌గమ్(2023) మానస చౌదరి ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  మానస చౌదరి రాశి ఏది? సింహ రాశి మానస చౌదరి ఎక్కడ పుట్టింది? పుత్తూరు, ఏపీ మానస చౌదరి అభిరుచులు? సినిమాలు చూడటం మానస చౌదరికు ఇష్టమైన ఆహారం? బిర్యాని మానస చౌదరికి ఇష్టమైన కలర్? వైట్ మానస చౌదరికి ఇష్టమైన హీరో? అల్లు అర్జున్, మహేష్ బాబు మానస చౌదరి ఏం చదివింది? డిగ్రీ మానస చౌదరి పారితోషికం ఎంత తీసుకుంటుంది? ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. మానస చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మానస చౌదరి ఎమోజీ అనే వెబ్ సిరీస్‌ ద్వారా ఫేమస్ అయింది మానస చౌదరికి ఎఫైర్స్ ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు మానస చౌదరి ప్రస్తుతం ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ మానస చౌదరి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/maanasa.choudhary1/?hl=en
    ఏప్రిల్ 05 , 2024
    NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
    NBK110: బాలయ్య - బోయపాటి చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌.. ఇక బాక్సాఫీస్‌కు ఊచకోతే!
    నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బాబీ (Bobby) కాంబినేషన్‌లో ఓ సినిమా సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ‘NBK109’గా ఇది ప్రచారంలో ఉంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్‌ను ఇటీవలే శివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌ గెటప్‌లో కనిపించారు. ఈ చిత్ర నిర్మాణంలో త్రివిక్రమ్‌ సొంత సంస్థ ఫార్చూన్‌ ఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉండటం విశేషం. ‘NBK109’ సినిమా తర్వాత బాలయ్య తన 110వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  బాలయ్య - బోయపాటి కాంబో రిపీట్‌! టాలీవుడ్‌లో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన సింహా (Simha), లెజెండ్‌ (Legend), అఖండ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. లేటెస్ట్ బజ్‌ ప్రకారం బాలకృష్ణ తన ‘NBK110’ చిత్రాన్ని బోయపాటి శ్రీనుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య 110వ చిత్రానికి చాలా మంది డైరెక్టర్ల పేర్లు వినిపించినప్పటికీ చివరకూ బోయపాటి శ్రీనును ఫైనల్‌ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ‘NBK110’ మూవీ కోసం బోయపాటి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కోరిక మేరకు కొన్ని మార్పులు కూడా జరుగుతున్నట్లు టాక్‌. ఈ చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.  నెక్స్ట్‌ చిత్రం 'అఖండ 2' కాదా? బాలకృష్ణ 110వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మించనున్నారు. ‘అఖండ’ తర్వాత తమ కాంబోలో సీక్వెల్‌ కూడా ఉంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను అప్పట్లోనే ప్రకటించారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని అప్పట్లో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. మరి ఇప్పుడు ఆయన ప్రమేయం లేకుండా 'అఖండ 2' (Akhanda 2) నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. దీని బట్టి బాలయ్య - బోయపాటి కాంబోలో 'అఖండ 2' కాకుండా మరో కొత్త చిత్రం రూపొందుతుందా? అన్న సందేహం కలుగుతోంది. బాలయ్య, బోయపాటి చిత్రానికి ఏప్రిల్‌ 9 ముహోర్తం కుదరినట్లు తెలుస్తుండగా ఆ రోజే ఈ చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ‘NBK110’ చిత్రానికి థమన్‌ సంగీతం అందింబోతున్నారు.  ఏపీ ఎన్నికల తర్వాతే షూట్‌! ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి మెుదలైన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘NBK109’ చిత్రాన్ని వేగంగా ఫినిష్‌ చేసేందుకు బాలకృష్ణ యత్నిస్తున్నారట. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ షెడ్యూల్‌ను త్వరగా పూర్తి చేసి ఎన్నికల వరకూ తన ఫోకస్‌ను ఏపీ రాజకీయాలపై పెట్టాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం బాలయ్య.. ఏపీలో హిందూపురం టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. స్థానికంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటితో చేయనున్న ‘NBK110’ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ ఏపీ ఎన్నికల తర్వాతే జరగనున్నట్లు తెలుస్తోంది.   నాని డైరెక్టర్‌తో సినిమా! ఇప్పటికే తన లైనప్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులను పెట్టుకున్న బాలకృష్ణ.. మరో యంగ్‌ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. 'ట్యాక్సీవాలా' (Taxiwala)తో వచ్చి 'శ్యామ్ సింగ రాయ్' (Shyam Singha Roy)తో భారీ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్‌ రాహుల్ సంకృత్యాన్‌ (Rahul Sankrityan) చెప్పిన కథకు బాలయ్య దాదాపుగా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ మధ్యనే రాహుల్.. బాలయ్యను కలిసి ఒక పిరియాడికల్ స్టోరీ లైన్ గురించి చర్చించాడట. ఆ పీరియాడిక్ డ్రామా బాలయ్యకు నచ్చి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా కథ.. బాలయ్యకు పూర్తిగా నచ్చితే ఈ మూవీ కూడా కన్ఫామ్ కానుంది.
    మార్చి 14 , 2024
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.  సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.  గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.  ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి. 
    మార్చి 12 , 2024
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
    This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు వెయ్‌ దరువెయ్‌ ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’ (Vey Dharuvey). యషా శివకుమార్‌ హీరోయిన్‌. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌, సత్యం రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.  రజాకార్‌  బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.  తంత్ర యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్‌ ధ్రువన్‌ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.  షరతులు వర్తిస్తాయి! చైతన్యరావ్‌, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్‌ కుమార్‌, విజయ, కృష్ణకాంత్‌ సంయుక్తంగా నిర్మించారు.  లైన్‌మ్యాన్‌ త్రిగుణ్‌, కాజల్‌ కుందర్‌ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్‌’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.  రవికుల రఘురామ ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్‌ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్‌ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్‌ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది. లంబసింగి  భరత్‌ రాజ్‌ హీరోగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్‌ తన్నీరు నిర్మించారు.  యోధ సిద్ధార్థ్‌ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యోధ’ (Yodha). సాగర్‌ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇతర చిత్రాలు పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateHanuman MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
    మార్చి 11 , 2024
    Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?
    Balakrishna - Simran: బాలకృష్ణ- సిమ్రాన్‌ జంటగా ఎన్ని సినిమాల్లో నటించారంటే? అందులో హిట్ సినిమాలు ఎన్నో తెలుసా?
    నందమూరి నటసింహం బాలకృష్ణ- సిమ్రాన్‌కు తెలుగులో సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వీరి జోడికి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఉండేది. బాలయ్య- సిమ్రాన్ కాంబోలో ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం. సమరసింహారెడ్డి సిమ్రాన్- బాలకృష్ణ(Balakrishna - Simran) కాంబోలో వచ్చిన మొదటి చిత్రం సమర సింహా రెడ్డి(1999).  సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను బి.గోపాల్ తెరకెక్కించారు. గొప్పింటి అల్లుడు సమరసింహారెడ్డి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి జోడి కుదరింది. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో వచ్చిన 'గొప్పింటి అల్లుడు'(2000) చిత్రంలో బాలయ్య- సిమ్రాన్ కలిసి నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. నరసింహ నాయుడు బాలకృష్ణ- సిమ్రాన్(Balakrishna - Simran) జోడిగా వచ్చిన హ్యాట్రిక్ చిత్రం నరసింహనాయుడు(2001). ఈ చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నరసింహనాయుడు అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని  బి.గోపాల్ డైరెక్ట్ చేశారు. సీమసింహం బాలకృష్ణ- సిమ్రాన్ కాంబోలో వచ్చిన నాల్గోవ చిత్రం సీమసింహం(2002). సీమసింహం చిత్రాన్ని జి.రామ్‌ప్రసాద్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్లాప్‌గా నిలిచింది. ఒక్క మగాడు  'సీమ సింహం' సినిమా తర్వాత బాలకృష్ణతో సిమ్రాన్ చివరిసారిగా  'ఒక్క మగాడు' చిత్రంలో నటించింది. ఈ సినిమా బాలయ్య కేరిర్‌లో బిగ్గెస్ట్‌ డిజాస్టర్ మూవీగా నిలిచింది. మొత్తంగా  బాలయ్య, సిమ్రాన్  కలిసి ఐదు సినిమాల్లో జంటగా నటించారు. వీటిలో ఒక్కమగాడు మినహా మిగతా సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. . 
    నవంబర్ 08 , 2023
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..! 
    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..! 
    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన హీరో యాక్టింగ్‌ని ఆస్వాదిస్తున్నారు. అయితే, జైలర్ 2 (Jailer 2) కూడా ఉండబోతోందని చెప్పి ఫ్యాన్స్‌కి మరో ట్రీట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.  భారీ తారాగణంతో.. జైలర్ మూవీ భారీ తారాగణంతో తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు. పాత్ర నిడివి కాసేపే అయినా సినిమాపై మంచి ప్రభావాన్ని చూపించారు. నట సింహం నందమూరి బాలకృష్ణతో కూడా జైలర్‌లో ఓ పాత్ర చేయించాలని నెల్సన్ చూశాడట. కానీ, బాలయ్య మాస్ ఫాలోయింగ్‌కి ఆ రోల్ సరితూగక పోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో, జైలర్ సీక్వెల్(Jailer Sequel) మూవీలోనూ బిగ్ స్టార్స్ ఉండే అవకాశం ఉంది. మ్యూజిక్ అతడేనా నెల్సన్ దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 4 సినిమాలు చేశాడు. జైలర్‌కి ముందు బీస్ట్, డాక్టర్, కోలామావు కోకిల చిత్రాలు తెరకెక్కించాడు. ఈ నాలుగింటికి అనిరుధ్ రవిచందర్‌ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం. నెల్సన్‌ తీసిన / తీయబోయే చిత్రాలకు అనిరుధ్‌ ఆస్థాన సంగీత దర్శకుడిగా మరిపోయాడు. జైలర్ మూవీ సక్సెస్‌లో మ్యూజిక్ కీ రోల్ పోషించిన విషయం తెలిసిందే. దీంతో జైలర్ సీక్వెల్‌లోనూ అనిరుధ్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు, తొలి సినిమా నుంచి ఒకే డీవోపీతో వర్క్ చేశాడు నెల్సన్. మరి, జైలర్ పార్ట్2 కి కూడా ఆర్.నిర్మల్ డీవోపీగా ఉంటాడేమో చూడాలి.  వీటికి కూడా సీక్వెల్స్? జైలర్‌తో పాటు తాను తీసిన తొలి మూడు చిత్రాలకు సీక్వెల్ తెరకెక్కించడానికి నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేస్తున్నాడట. కొలామావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు పార్ట్ 2 తీయాలని చూస్తున్నాడట. మరి, వీటిలోనూ వారినే కొనసాగిస్తారా? లేక ఇతర హీరోలను పెట్టుకుంటాడా? అనేది వేచి చూడాలి. అయితే బీస్ట్ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి, పార్ట్ 2కి విజయ్ ఏమంటాడో.  రజనీ, విజయ్‌లతో మూవీ కోలీవుడ్‌లో రజనీ, విజయ్‌లకు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాటల్లో చెప్పలేం. వీరిద్దరికీ వీరాభిమానులు ఉన్నారు. కోలీవుడ్‌లోనే కాక తెలుగు, మలయాళం, కన్నడలోనూ ఈ హీరోల సినిమా వస్తుందంటే ఆసక్తితో ఎదురు చూస్తారు. మరి, ఈ హీరోలు ఇద్దరు స్క్రీన్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది? నెల్సన్ దిలీప్ కుమార్ కూడా రజనీ, విజయ్‌లతో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడట. వీరిద్దరితో సినిమా చేయడం తన కల అని వెల్లడించాడీ డైరెక్టర్. ఈ చిత్రం పట్టాలెక్కితే కోలీవుడ్ చరిత్రలోనే మైలురాయి చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. 4 రోజుల్లో 300 కోట్లు జైలర్ మూవీ తొలి 4 రోజుల్లో రూ.300 కోట్లు కలెక్షన్లను వసూలు చేసింది. తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.95.78 కోట్లు, రెండో రోజున రూ.56.24 కోట్లు, మూడో రోజున రూ.68.51 కోట్లు, నాలుగో రోజున రూ.82.36 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.302.89 కోట్ల వసూళ్లను రాబట్టింది. 
    ఆగస్టు 14 , 2023
    S. S. Rajamouli Style:  రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
    S. S. Rajamouli Style:  రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
    దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలన్నీ చాలా వరకు ఒక కామన్ పాయింట్‌ను బేస్‌ చేసుకుని సాగుతుంటాయి. అది అతని మొదటి సినిమా  స్టూడెంట్ నెం.1 నుంచి ఈ మధ్య వచ్చిన RRR వరకు ఒక్కటి మాత్రం బాగా గమనించవచ్చు.  రాజమౌళి సినిమాల్లో ఏ కథ అయినా ఏ ఫార్మట్‌ అయినా గమనించండి. స్టూడెంట్ నం.1, సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు,  మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 అయిన ఆ సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకులను ఎమోషన్‌తో బైండ్‌ చేసి సినిమాకి మంచి ఊపు తీసుకొస్తాడు.  స్టూడెంట్ నం.1 సినిమాలో కొడుకుగా తన తండ్రి ఆదరణ కోసం ఆరాటే పడే కుర్రాడి పాయింటు.  అందు కోసం  జైలు నుంచి కాలేజీకి వెళ్ళడమనే ట్విస్టు. బ్రాగ్రౌండ్‌లో ఓ అమ్మాయిని కాపాడటం కోసం ఓ వ్యక్తిని చంపడం,  దీంతో అక్కడ ప్రేక్షకులను రాజమౌళి ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలిగాడు.  సింహాద్రిలో ఒక పనిపై హీరో కేరళ వెళ్ళినపుడు అక్కడ అన్యాయన్ని ఎదురించి అక్కడ ప్రజలకు అండగా నిలబడటం అనే అంశం ఆధారంగా సినిమా తీశాడు. భూమిక ఎన్టీఆర్‌ను పొడవటం ట్విస్ట్. సైలో రగ్బీ ఆట మేయిన్ పాయింట్ అయితే... తన కాలేజీని ఆక్రమించకున్న విలన్ భిక్షు యాదవ్‌పై పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ కనెక్టివిటీని తీసుకొచ్చాడు. ఇందులో విలనే రగ్బీకి సవాలు చెయ్యటం ట్విస్టు. ఛత్రపతిలో హీరో వాళ్ళ అమ్మని బేస్ చేసుకొని ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండిస్తాడు హీరో.  తల్లీ కొడుకుల మధ్య దూరం మెయిన్ పాయింటు అయితే.. తన తమ్ముడు తనను తల్లికి దూరం చేయాలనుకోవడం ట్విస్ట్. ఈగ సినిమాలో హీరోయిన్ కోసం విలన్ హీరోని చంపేస్తే హీరో ఈగ లాగా మారి ప్రతీకారం తీర్చుకోవడం మెయిన్ పాయింట్. చివర్లో ఈగ ఆత్మార్పణ చేసుకుని విలన్‌ను చంపే విధానాన్ని ఎమోషనల్ బైండింగ్ చేశాడు రాజమౌళి.  RRRలో రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట ఇచ్చి అందు కోసం పోలీస్ ఆఫీసర్ అవడం మెయిన్ పాయింట్. తన లక్ష్య సాధనలో అడ్డుగా ఉన్న భీంను హింసించడం ఎమోషనల్ కనెక్టివిటీ. చివరకు భీంతో కలిసి బ్రిటీష్ వారిపై పోరాడి ఆయుధాలు సంపాందించి తన నాన్న కల నెరవేరుస్తాడు రామ్. అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు. 1st హాఫ్‌లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఉంటుంది. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ... ఆ స్టోరీ ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో ఆది సాధిస్తాడు.
    జూలై 06 , 2023
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    SS RAJAMOULI: రాజమౌళి సినిమాల్లో కామన్‌గా కామాంధుడి పాత్ర… అసలు ఎందుకిలా ?
    దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాను ఎమోషన్‌తో నడిపిస్తాడు. ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేందుకు కొన్ని క్యారెక్టర్లను సృష్టిస్తాడు. తన సినిమాల్లో ఓ కామాంధుడి పాత్ర కామన్‌గా ఉంటుంది. మెుదటి సినిమా స్టూడెంట్‌ నంబర్‌ 1 నుంచి మెుదలుకొని చాలా సినిమాల్లో మనకు ఈ పాత్రలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టర్లు ఏంటో ఓసారి చూద్దాం..  స్టూడెంట్‌ నంబర్‌ 1 ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్‌ నంబర్‌ 1 సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్‌ ఓ అమ్మాయిని రేప్ చేయాలని చూస్తుండగా హీరో వాళ్లని అడ్డుకుంటాడు. ఫైట్‌ చేసి అమ్మాయిని రక్షిస్తాడు. ఈ క్రమంలో మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు ఎన్టీఆర్. ఇలాంటి ట్విస్ట్‌తో స్క్రీన్‌ప్లే మార్చేశాడు జక్కన్న. https://www.youtube.com/watch?v=z3zTPvCLNcI సింహాద్రి ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమా తీసి ఊర మాస్ హిట్‌ కొట్టాడు రాజమౌళి. ఇందులో విలన్ రాహుల్‌ దేవ్‌ కామాంధుడి పాత్రలో కనిపిస్తాడు. అత్యంత కిరాతకాలు చేస్తున్న అతడిని చంపేయడంతో సింగమలై అని ఎన్టీఆర్‌ను పిలుస్తుంటారు. అతడిని చంపేయడంతోనే సినిమా కీలక టర్న్ తీసుకుంటుంది. సింగమలై అంటూ కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు హైలెట్‌. ఈ సినిమా కథను తొలుత  ప్రభాస్‌కు చెప్పాడట రాజమౌళి.  https://www.youtube.com/watch?v=53DHset7VEw సై.. నితిన్‌ హీరోగా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రం సై. ఇందులో రగ్బీ గేమ్‌తో సంచలనం సృష్టించాడు జక్కన్న. ఈ చిత్రంలోనూ విలన్‌ ప్రదీప్‌ రావత్‌కు అమ్మాయిల వీక్‌నెస్‌ ఉంటుంది. హీరో ముప్పు తిప్పలు పెడుతున్న వేళ శశికళ అనే అమ్మాయి దగ్గరికి వెళతాడు. వీళ్లిద్దరి మధ్య కూడా కొన్ని కామెడీ సన్నివేశాలు తీశాడు దర్శకుడు. https://www.youtube.com/watch?v=FUqXJb37DU4 ఛత్రపతి ఛత్రపతిలో ఎన్ని పాత్రలు ఉన్న షఫీ క్యారెక్టర్‌ ప్రత్యేకం. సినిమాలో ప్రభాస్‌ చెల్లిలి బస్సులో వెళ్తుండగా అసభ్యంగా ప్రవర్తిస్తాడు షఫీ. అతడిని చితక్కొట్టి గుండు గీయిస్తాడు ప్రభాస్. అక్కడే వాళ్లిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. ఇలా ప్రేక్షకులు చిత్రంలో లీనమయ్యేలా చేశాడు దర్శక దిగ్గజం రాజమౌళి.  https://www.youtube.com/watch?v=_rImbIj2wp8 విక్రమార్కుడు విక్రమార్కుడులో బావూజీ కుమారుడిగా నటించిన అమిత్ తివారిది కామాంధుడి పాత్ర. ఊర్లో నచ్చిన మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తుంటాడు. అతడిని చితకబాది జైలులో వేస్తాడు రవితేజ. ఈ ఒక్క సీన్‌తో విక్రమ్ రాథోడ్‌ పవర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు రాజమౌళి.  ఈ సీన్‌ సినిమాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. https://www.youtube.com/watch?v=Tf8N3VNHt8w మగధీర మగధీరలోనూ రాజమౌళి కామాన్ని ప్రధాన ఇతివృత్తంగా మేళవించాడు.  మిత్రవిందపై రణదేవ్ బిల్లా కన్నపడుతుంది. పునర్జన్మల నేపథ్యంలోనూ రణదేవ్ కామంధుడి  క్యారెక్టర్‌లో కొనసాగుతాడు. కాజల్‌పై ఉన్న ఇష్టాన్ని తరచూ చూపిస్తుంటాడు. ఇలా విలన్‌ పాత్రను ప్రేక్షకులకు నచ్చకుండా చేస్తూ హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేశాడు జక్కన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. https://www.youtube.com/watch?v=Fl2plgSlZnE ఈగ ఈగలో కిచ్చ సుదీప్‌ క్యారెక్టర్‌ కూడా దాదాపు ఇలాంటిదే. సినిమా ప్రారంభంలోనే హంసనందినితో వచ్చే సన్నివేశాలు.. తర్వాత సమంతను ఇష్టపడుతూ ఆమెతో ట్రావెల్‌ చేస్తున్న సంఘటనలతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. https://www.youtube.com/watch?v=fUY1hIAZyzo బాహుబలి 2 బాహుబలి 2లోనూ ఓ కామంధుడి పాత్ర మనకు కనిపిస్తుంది.  దేవసేన దైవ దర్శనం కోసం వస్తుంటే సేతుపతి( రాకేష్ వర్రే) ఆమెను అవమానించాలని ప్రయత్నిస్తాడు. ఆమెతో వస్తున్న మహిళలను అసభ్యంగా తాకుతూ.. దేవసేనను తాకెందుకు ప్రయత్నిస్తాడు. దేవసేన కత్తితో అతని వేళ్లను నరుకుతుంది. ఈ సీన్‌ తర్వాత కోర్ట్ సీన్‌లో ప్రభాస్ సేతుపతి తల నరికే సన్నివేశం గూస్‌బంప్స్ కలిగిస్తుంది.  https://youtube.com/shorts/Ih_Dnp-BbaI?feature=share https://telugu.yousay.tv/ssmb29-rajamoulis-huge-sketch-for-maheshs-film-talks-with-kamal-haasan-chiyan-vikram.html
    ఏప్రిల్ 25 , 2023
    <strong>Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!</strong>
    Bharateeyudu 2 Review: ఆ అంశాల్లో తీవ్రంగా నిరాశపరిచిన ‘భారతీయుడు 2’.. మూవీ ఎలా ఉందంటే!
    నటీనటులు : కమల్‌హాసన్‌, సిద్ధార్థ్‌, కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా భవాని, వివేక్‌ డైరెక్టర్‌ : శంకర్ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌ : రవి వర్మన్‌ ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌ నిర్మాత : అల్లిరాజా సుభస్కరన్‌ విడుదల తేదీ: 12-07-2024 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం ఎంతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండితనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? భారతీయుడిగా మరోమారు కమల్‌ ఆకట్టుకున్నారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చిత్ర అరవిందన్‌ (సిద్ధార్థ్), అతని ఫ్రెండ్స్‌ దేశంలోని అవినీతి, అన్యాయాలపై పోరాటం చేస్తుంటారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారంతా భారతీయుడు మళ్లీ రావాలంటూ పోస్టులు పెడతారు. దీంతో గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి (కమల్ హాసన్) తిరిగి ఇండియాకి వస్తాడు. దారుణమైన అవినీతి చేసిన వారిని, ప్రజల సొమ్మును దోచుకున్న కొందర్ని చంపేస్తాడు. అలాగే యూత్‌ను మోటివేట్ చేస్తాడు. అయితే అనూహ్య ఘటనలతో భారతీయుడుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది? సామాన్య జనం సేనాపతిని ఎందుకు నిందించారు? వారి కోపానికి కారణం ఏంటి? భారతీయుడు తిరిగి వచ్చిన లక్ష్యం నెరవేరిందా? లేదా? అనేది కథ. ఎవరెలా చేశారంటే 'భారతీయుడు 2'లో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం చూపించాడు. సేనాపతి పాత్రలో మరోమారు తన మార్క్‌ నటన కనబరిచారు. తన నటనతో సినిమా మెుత్తాన్ని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. నటుడు సిద్ధార్థ్‌ కూడా కీలక పాత్రలో మెప్పించాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె. సూర్య వంటి నటులు కూడా తమ నటనతో సినిమాకు ఎస్సెట్‌గా మారారు. అయితే వారి పాత్రలు బలహీనంగా ఉండటం మూవీకి మైనస్‌గా మారింది. ఇతర నటీనటులు ప్రదర్శన పర్వాలేదు.  డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ శంకర్‌ భారతీయుడు కథనే మళ్లీ రిపీట్‌ చేసినట్లు అనిపించింది. ఔట్‌ డేటెడ్‌ కథను నేటి తరానికి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారు. భారతీయుడు ఎలా చంపుతాడో అనేది ఈ తరానికి చూపించడానికే సీక్వెల్‌ తీసినట్లు ఉంది. డైరెక్షన్‌లో శంకర్ మార్క్‌ కనిపించదు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా ఉంది. కమల్‌ హాసన్‌ ఇంట్రడక్షన్‌ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. కొన్ని సన్నివేశాలను బాగానే తెరకెక్కించినా మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకుల ముందు తేలిపోయాయి. అయితే కమల్ హాసన్‌ ఛేజింగ్ సీక్వెన్స్‌, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్‌ మెప్పిస్తాయి. సోషల్‌ మెసేజ్‌ సినిమాకు కాస్త బలాన్ని చేకూర్చుంది. కానీ, భారతీయుడులో లాగా తండ్రి కూతురు సెంటిమెంట్‌ లేకపోవడం, పాటలు ఆ స్థాయిలో వినసొంపుగా లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్‌ ప్రభావం చూపించింది. ఓవరాల్‌గా ఈ సీక్వెల్‌ సేనాపతి ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడంలో పూర్తిగా వెనకబడ్డాడని చెప్పవచ్చు. సాంకేతిక అంశాలు టెక్నికల్‌ విషయాలకు వస్తే.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ అందించిన పాటలు గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. అయితే కొన్ని సీన్స్‌ను BGM మరి డామినేట్‌ చేసినట్లు అనిపించింది. సినిమాటోగ్రాఫర్‌ పనితనం బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కమల్‌ హాసన్‌ నటనసందేశంయాక్షన్‌ సీక్వెన్స్‌ మైనస్‌ పాయింట్స్‌ ఔట్‌డేటెడ్‌ స్టోరీస్క్రీన్‌ప్లేభావోద్వేగాలు పండకపోవడంసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5   నెటిజన్లు ఏమంటున్నారంటే? (Public Talk) ఎక్స్‌ (ట్విటర్‌)లో సైతం 'భారతీయుడు 2' మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా బాగుందని కొంతమంది మాత్రమే కామెంట్‌ చేస్తుంటే చాలా మంది ఫ్లాప్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో నెగిటివ్‌ టాక్ 'భారతీయుడు 2' చిత్రాన్ని చుట్టేసింది. కొందరు ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించాడా? అంటూ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; భారతీయుడు 2 సినిమా డిజాస్టర్‌ అంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. బోరింగ్‌, ఔట్‌ డేటెడ్‌ స్టోరీ, సాగదీశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. https://twitter.com/TheWarriorr26/status/1811574234780733548 'భారతీయుడు 2' స్టోరీ ముందుకు సాగుతున్న కొద్ది బోరింగా అనిపించిందని మరో నెటిజన్ అన్నాడు. ఫస్టాఫ్‌లో గ్రిప్పింగ్‌గా, ఎగ్జైట్‌మెంట్‌ సీక్వెన్స్‌ ఏమి లేవని అన్నాడు.&nbsp; https://twitter.com/newMovieBuff007/status/1811561032780820788 ‘సినిమా నిరుత్సాహపరిచింది. స్క్రీన్‌ప్లే అస్సల్‌ బాగోలేదు. ఎమోషనల్‌ సీన్స్‌ వర్కౌట్‌ కాలేదు. ఇండియన్‌ 3 కష్టమే’ అని ఒకరు ట్వీట్‌ చేశారు. https://twitter.com/TheWarriorr26/status/1811574234780733548 'ఇండియన్‌ 2' బిలో యావరేజ్‌ చిత్రమని విజయ్‌ అనే నెటిజన్‌ పోస్టు పెట్టాడు. క్లైమాక్స్‌లో ఇండియన్ 3కి సంబంధించిన ట్రైలర్‌ ప్లే చేశారని అది కాస్త ఆసక్తిగా అనిపించిందని చెప్పాడు. 'ఇండియన్‌ 3' ఆశలు రేపుతోందని చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/vijay827482/status/1811579025699066091 మరో నెటిజన్‌ 'భారతీయుడు 2' సినిమాపై ప్రశంసలు కురిపించాడు. శంకర్‌ డైరెక్షన్‌ మరో లెవల్‌లో ఉందంటూ పోస్టు పెట్టాడు.. కమల్‌ హాసన్‌ నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగున్నాయంటూ మూవీకి 4 స్టార్‌ రేటింగ్ ఇచ్చాడు. https://twitter.com/FMovie82325/status/1811559067925524625
    జూలై 12 , 2024
    <strong>Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!</strong>
    Telugu OTT Movies: ‘భారతీయుడు 2’ వచ్చేస్తున్నాడు.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత రెండు వారాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) మినహా ఏ కొత్త సినిమా థియేటర్లలోకి రాలేదు. ప్రభాస్‌ చిత్రానికి పోటీగా తమ మూవీని రిలీజ్‌ చేసేందుకు దర్శక నిర్మాతలు సాహసించకపోవడమే ఇందుకు కారణం. అయితే తొలి వారంలోనే కల్కి సినిమాను వీక్షించిన వారు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకుల మందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో అలరించనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు భారతీయుడు 2 కమల్‌ హాసన్‌ (Kamal Haasan), డైరెక్టర్‌ శంకర్‌ (Shankar) కాంబోలో పాతికేళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' (Bharateeyudu) చిత్రం సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అవినీతి, లంచగొండతనంపై భారతీయుడు చేసిన పోరాటం అప్పటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. 'భారతీయుడు 2' (Bharateeyudu 2 Release Date) టైటిల్‌తో జులై 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాలో కమల్‌తో పాటు సిద్ధార్థ్‌ (Siddharth), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh), ఎస్‌.జె.సూర్య (S.J Surya), బాబీ సింహా (Bobby Simha), బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని (Samuthirakani) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. సారంగదరియా రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మహారాజా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన రీసెంచ్‌ చిత్రం మహారాజా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసింది. జులై 12 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చని పేర్కొంది. విజయ్‌ సేతుపతి కెరీర్‌లో 50వ చిత్రంగా వచ్చిన మహారాజా.. థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. రూ.100 వసూళ్లను సాధించి ఆశ్చర్యపరిచింది. థియేటర్‌లో ఈ మూవీని చూడలేకపోయినవారు ఓటీటీలో వీక్షించేందుకు ఎదురుచూస్తున్నారు.&nbsp; ధూమం మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) నటించిన చిత్రం ‘ధూమం’. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై పర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam Telugu OTT) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ఓ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateReceiverSeriesEnglishNetflixJuly 10Wild Wild PunjabMovieHindiNetflixJuly 10Vikings : Wall HallaSeriesEnglishNetflixJuly 11Commander Karan SaxenaSeriesHindiHotstarJuly 8MastermindSeriesEnglishHotstarJuly 10Agni SakshiSerial SeriesTeluguHotstarJuly 12Show TimeSeriesEnglishHotstarJuly 1236 DaysSeriesTelugu/HindiSonyLIVJuly 12Pil&nbsp;MovieHindiJio CinemaJuly 12 గత 15 రోజుల్లో విడుదలైన చిత్రాలు &amp; వెబ్‌ సిరీస్‌లు.. గత 15 రోజుల్లో చాలా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. అత్యధిక వీక్షణలు సాధిస్తూ ఆయా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ చిత్రాలు, సిరీస్‌లపై ఓ లుక్కేయండి.&nbsp; TitleCategoryLanguagePlatformMirzapur 3SeriesTelugu/ HindiAmazon PrimeMalayali From IndiaMovieTelugu/ MalayalamSonyLIVFuriosa: A Mad Max SagaMovieEnglish/ TeluguAmazon PrimeSasi MadanamSeriesTeluguETV WinMarket MahalakshmiMovieTeluguAhaBhaje Vayu VegamMovieTeluguNetflixSathyabamaMovieTeluguAmazon PrimeLove MouliMovieTeluguAhaVindu BhojanamMovieTeluguAhaGuruvayoor AmbalanadayilMovieTelugu/ MalayalamAhaAham RebootMovieTeluguAha
    జూలై 08 , 2024
    <strong>Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?</strong>
    Mirzapur Season 3 Review: ఆ విషయంలో దెబ్బేసిన ‘మిర్జాపూర్‌ 3’.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు : అలీ ఫజల్‌, పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, విజయ్‌ వర్మ, రాశిక దుగల్‌, హర్షిత గౌర్‌, షాజీ చౌదతరి తదితరులు దర్శకులు : గుర్మిత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌ సినిమాటోగ్రాఫర్‌ : సంజయ్‌ కపూర్‌ నిర్మాత : ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిద్వాని విడుదల తేదీ : జులై 5, 2024 ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో సూపర్‌ సక్సెస్‌ అయిన క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌లలో 'మీర్జాపూర్‌' (Mirzapur) ఒకటి. 2018లో తొలి సీజన్‌ ప్రేక్షకుల ముందుకు రాగా.. దానికి కొనసాగింపుగా 2020లో రెండో సీజన్‌ రిలీజైంది. ఈ రెండూ అంచనాలకు మించి సక్సెస్‌ కావడం, వీటిలోని బోల్డ్‌ కంటెంట్‌, డైలాగ్స్‌ యూత్‌ను ఆకట్టుకోవడంతో.. థర్డ్ సీజన్‌పై అందరి దృష్టి ఏర్పడింది. మూడో పార్ట్‌ కోసం యూత్‌తోపాటు&nbsp; ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మిర్జాపూర్‌ సీజన్‌ 3’ (Mirzapur Season 3 Review) అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. 10 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ మూడో సీజన్‌.. హిందీ, తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రసారం అవుతోంది. మరి గత సీజన్లలాగే మూడో పార్ట్‌ కూడా ఆకట్టుకుందా? అందరి అంచనాలను అందుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; గత సీజన్లలో ఏం జరిగిందంటే? మీర్జాపూర్‌ మొదటి సీజన్‌లో గుడ్డు భయ్యా (అలీ ఫజల్), బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) అనే&nbsp; ఇద్దరు అన్నదమ్ములు కాలీన్ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) కోసం పనిచేయడం చూపించారు. ఆ సీజన్‌ చివర్లో కాలీన్ భయ్యా కుమారుడు మున్నా చేతిలో గుడ్డూ తన సోదరుడితో పాటు సన్నిహితులను కోల్పోతాడు. దానికి రెండో సీజన్లో గుడ్డూ భయ్యా రివేంజ్ తీర్చుకుంటాడు. కాలీన్, మున్నా భయ్యాలపై దాడి చేసి మున్నాను గుడ్డు చంపేస్తాడు. కానీ, కాలీన్ భయ్యా మాత్రం తప్పించుకొని పారిపోతాడు. దీంతో సీజన్‌ 2 ముగుస్తుంది. సరిగ్గా అక్కడి నుంచే సీజన్‌- 3 ప్రారంభం అవుతుంది. మీర్జాపూర్‌ సీజన్‌ 3 కథేంటి కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్‌కు కొత్త డాన్‌గా గుడ్డు భయ్యా అవతరిస్తాడు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్‌గా ఉంటుంది. మిర్జాపూర్ సీజన్‌ 2లో కాలీన్‌ భయ్యాను కాపాడిన శరద్ శుక్లా, శతృఘ్న కూడా మీర్జాపూర్‌ సింహాసనంపై దృష్టి సారిస్తారు. దీంతో శరద్ శుక్లా, గుడ్డూ మధ్య ఘర్షణ మెుదలవుతుంది. మరోవైపు మున్నా భార్య సీఎం మాధురి (ఇషా తల్వార్) కూడా గుడ్డూ భయ్యాను బలహీనపరిచేందుకు శరద్‌ శుక్లాతో చేతులు కలుపుతుంది. అటు కాలిన్‌ భయ్యా (పంకజ్ త్రిపాఠి) కూడా మిర్జాపూర్‌ పీఠం కోసం అనూహ్యంగా తెరపైకి వస్తాడు. ఈ విపత్కర పరిస్థితులను గుడ్డూ భయ్యా ఎలా ఎదుర్కొన్నాడు? గుడ్డూ షూట్‌ చేశాక కూడా కాలిన్‌ ఎలా తిరిగొచ్చాడు? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలన్న సీఎం మాధురి లక్ష్యం నెరవేరిందా? లేదా? తెలియాలంటే సీజన్‌ 3 చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. ఈ సీజన్‌ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి ఎక్కడా నిరాశపరచలేదు. గత సీజన్లలో కంటే ఇందులో ఆమె పాత్ర మెప్పిస్తుంది. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోసింది. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. ఫజల్ అలీ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌ వర్మ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా తన మార్క్‌ నటనతో మెప్పించారు. మిగిలిన పాత్రదారులు.. తమ రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి పొలిటికల్‌ డ్రామాను దర్శకులు ఎక్కువగా చూపించారు. డ్రామా అంతా మంచి ఇంటెన్స్‌గా క్రేజీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. మీర్జాపూర్‌ను దక్కించుకునే క్రమంలో వేసే ఎత్తులు, పైఎత్తులు, కుయుక్తులను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో వచ్చే&nbsp; ట్విస్టులు, కొన్ని సస్పెన్స్ ఫ్యాక్టర్స్‌ ఆకట్టుకుంటాయి. అయితే మీర్జాపూర్‌ సిరీస్‌కు కేరాఫ్‌గా మారిన హింసను మాత్రం సీజన్‌లో చాలా వరకూ తగ్గించేశారు. అలాగే మున్నా భయ్యా పాత్ర లేకపోవడం, కాలిన్‌ భయ్యా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఇవ్వకపోవడం ఈ సీజన్‌కు పెద్ద మైనస్‌గా మారింది. పైగా ఒక్కో ఎపిసోడ్‌ 45-50 నిమిషాలు ఉండటంతో సాగదీసిన ఫీలింగ్‌ కలిగింది. ఒకప్పటిలా బోల్డ్‌ డైలాగ్స్‌ కూడా లేకపోవడం యూత్‌కు నిరాశకు గురిచేయవచ్చు. ఇక కథలో నెక్స్ట్‌ ఏంటీ అన్న క్యూరియాసిటీ రగిలించడంలోనూ డైరెక్టర్స్‌ ఫెయిల్‌ అయ్యారు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మీర్జాపూర్‌ సీజన్‌ 3 ఆకట్టుకుంటుంది. కానీ, మునుపటి సీజన్లతో ఈ సిరీస్‌ను పోలిస్తే మాత్రం వీక్షకులకు ఎదురుదెబ్బ తప్పదు. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల పరంగా చూస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సన్నివేశాల్లో లీనమయ్యేందుకు ఇది దోహదం చేసింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్‌ తన కత్తెర ఇంకాస్త పని కలిగించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువ మాత్రం ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారగణం నటనట్విస్టులతో కూడిన పొలిటికల్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆశించిన స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంసాగదీత సన్నివేశాలు&nbsp;గత సీజన్లతో&nbsp; పోలిస్తే యూత్‌ను అట్రాక్ట్ చేసిన బోల్డ్ డైలాగ్స్ లేకపోవడం Telugu.yousay.tv Rating :3/5&nbsp;
    జూలై 05 , 2024
    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
    NBK 110 : బాలయ్య-బోయపాటి కొత్త సినిమా ప్రకటన.. సరికొత్త రోల్‌లో బాలయ్య చిన్న కూతురు!
    టాలీవుడ్‌లో హీరోలకే కాకుండా కొన్ని రకాల కాంబినేషన్స్‌కు కూడా సెపరేట్‌ ఫ్యాన్స్ బేస్‌ ఉంటుంది. అలాంటి వాటిలో బాలకృష్ణ - బోయపాటి కాంబో ఒకటి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌లో ఈ కాంబోకు యమా క్రేజ్‌ ఉంది. గతంలో బాలయ్య - బోయపాటి చేసిన హ్యాట్రిక్‌ చిత్రాలు ఇండస్ట్రీని షేక్‌ చేశాయి. ఇవాళ (జూన్‌ 10) బాలకృష్ణ పుట్టని రోజు సందర్భంగా వీరిద్దరి కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది. దీంతో నందమూరి అభిమానులు సంతోషంతో ఊగిపోతున్నారు.&nbsp; బాలయ్య కుమార్తె సమర్పణలో.. ఇవాళ (జూన్‌ 10).. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకొని బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త సినిమా ఖరారైంది. ఇది 'NBK 110' చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య - బోయపాటి అప్‌కమింగ్‌ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్ సంస్థ ఆధ్వర్యంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. 'లెజెండ్‌' చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్న ఈ ఇద్దరు నిర్మాతలు.. 'NBK110' చిత్రాన్ని కూడా రాజీ పడకుండా భారీ ఎత్తున తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనుండటం విశేషం. షూటింగ్‌ ఎప్పుడంటే? బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం గురించి ఇప్పటి నుంచే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ సెట్స్‌ పైకి ఎప్పుడు వెళ్తుందా అని ఫ్యాన్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో టాక్‌ ప్రకారం.. 'NBK110' చిత్రం ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్‌ బాబీతో కలిసి 'NBK109' చిత్రంలో చేస్తున్నాడు. చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఏపీ ఎన్నికల నేపథ్యంలో కాస్త బ్రేక్ పడింది. మిగిలిన కాస్త షూటింగ్‌ను పూర్తి చేసిన బోయపాటి సినిమాను పట్టాలెక్కించాలన్న ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు.&nbsp; బోయపాటికే సాటి.. ఇండస్ట్రీకి హ్యాట్రిక్‌ విజయాలను అందించిన బాలకృష్ణ - బోయపాటి జర్నీ.. 'సింహా' సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్‌', 'అఖండ' చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్‌ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్‌ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం అనౌన్స్‌ కావడంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. వీరి కాంబో ఈసారి కూడా ఇండస్ట్రీని షేక్‌ చేస్తుందని నందమూరి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.&nbsp; 'NBK109' నుంచి క్రేజీ గ్లింప్స్‌ నందమూరి బాలకృష్ణ- యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో NBK 109 పేరుతో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి బాలయ్య బర్త్‌డే గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. "దేవుడు చాలా మంచోడయ్యా.. దుర్మార్గులకి కూడా వరాలిస్తాడు.. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది.. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అర్థాలే తెలియని అసురుడు" అనే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలైంది. ఇక డైలాగ్ పూర్తి కాగానే బాలయ్య అలా నడుచుకుంటూ ఎంట్రీ ఇచ్చారు. ఇక గ్లింప్స్ చివరిలో గుర్రంపై బాలయ్య కనిపించిన సీన్ హైలెట్‌గా ఉంది. మొత్తానికి బాలయ్య బర్త్‌డేకి మంచి ట్రీట్ ఇచ్చింది NBK109 టీమ్. మీరూ గ్లింప్స్‌ చూసేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=Ib7bmm-PiaU
    జూన్ 10 , 2024
    Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
    Most Powerful Hero Roles in Telugu: ఈ సినిమాల్లో హీరో పాత్రలు ఉంటాయి భయ్యా.. నెవర్‌బీఫోర్ అంతే!
    సాధారణంగా ప్రతీ సినిమాకు హీరో పాత్రనే కీలకం. కథానాయకుడి క్యారెక్టరైజేషన్‌పైనే దాదాపుగా ఆ సినిమా ఫలితం ఆధారపడుతూ ఉంటుంది. హీరో రోల్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఆ సినిమా సక్సెస్‌ రేట్ అంతగా పెరుగుతుంది. ఎందుకంటే తమ హీరోను చాలా అగ్రెసివ్‌గా, దృఢంగా చూసేందుకే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకూ కొన్ని వందల చిత్రాలు రిలీజు కాగా బలమైన ఇంటెన్సిటీ ఉన్న హీరో పాత్రలు కొన్నే వచ్చాయి. ఇంతకీ ఆ&nbsp; పవర్‌ఫుల్‌ హీరో పాత్రలు ఏవి? అందులో నటించిన స్టార్‌ హీరోలు ఎవరు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; బాహుబలి (Baahubali) బాహుబలిలో ప్రభాస్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యుద్ధరంగంలోకి దిగితే శత్రువులకు ఇక చుక్కలే అన్నట్లు ఆ రోల్‌ ఉంటుంది. ముఖ్యంగా కాలకేయతో యుద్ధం, బాహుబలి 2 క్లైమాక్స్ సీన్స్‌లో ప్రభాస్‌ చాలా అద్భుతంగా చేశాడు.&nbsp; https://youtu.be/mRAi0lTRiMc?si=tIPOoBp8Tq_SjknN శివ (Siva) హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ సినిమాలో చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తాడు. కాలేజీ స్టూడెంట్‌గా క్లాస్‌గా కనిపిస్తూనే రౌడీలకు తన విశ్వరూపం చూపిస్తాడు. ముఖ్యంగా ఆ సైకిల్‌ చైన్‌ తెంపే సీన్‌ ఇప్పటికీ చాలా ఫేమస్‌.&nbsp; https://youtu.be/jqwh3PgW4dE?si=eSViXQpf7DJ6SW4g ఆర్ఆర్‌ఆర్‌ (RRR) ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌(Ram Charan) పాత్రను దర్శకధీరుడు రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ ప్రతీ ఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. వందలాది మంది ఆందోళన కారుల్ని రామ్‌చరణ్‌ ఒక్కడే కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లైమాక్స్‌లోనూ బ్రిటిష్‌ వారిపై విశ్వరూపం చూపిస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?si=-3losZAoAU0zUG-2&amp;v=Y8rREdo1LqU&amp;feature=youtu.be సలార్‌ (Salaar) ఇందులో హీరో ప్రభాస్‌ (Prabhas) తన కటౌట్‌కు తగ్గ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఊర్రూతలుగించాడు. బాహుబలి తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో డార్లింగ్ అలరించాడు. ఇంటర్వెల్‌ ఫైట్‌, కాటేరమ్మ ఫైట్‌, క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లో ప్రభాస్‌ దుమ్మురేపాడు.&nbsp; https://youtu.be/aniqM3iKskM?si=aAVsDePkCn0z8IID యానిమల్‌ (Animal) అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఈ సినిమాను చాలా వైలెంట్‌గా తెరకెక్కించాడు. బాలీవుడ్‌ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) తన కెరీర్‌లోనే ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రను పోషించలేదు. తన తండ్రిని చంపేందుకు యత్నించిన వారిపై రణ్‌బీర్‌ రీవెంజ్‌ తీర్చుకునే విధానం చాలా క్రూరంగా ఉంటుంది.&nbsp; https://youtu.be/6DfaBq2rVoE?si=tZXe7295t9MYMmit సింహాద్రి (Simhadri) ఈ సినిమాలో ఒక డిఫరెంట్‌ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. అంతకుముందు ‘ఆది’లో ఫ్యాక్షనిస్టుగా కనిపించినప్పటికీ సింహాద్రిలో దానికంటే పవర్‌ఫుల్‌గా తారక్‌ రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైటింగ్‌ సీన్‌ అదరహో అనిపిస్తాయి. కేరళలో నడిరోడ్డుపై రౌడీలను నరికేసే సీన్‌ విజిల్స్ వేయిస్తాయి.&nbsp; https://youtu.be/u0PlQ1J6EHo?si=9Rqa8abQvN1jzYRS విక్రమార్కుడు (Vikramarkudu) స్టార్‌ హీరో రవితేజను ఈ సినిమాలో చూసినంత అగ్రెసివ్‌గా ఎందులోనూ చూసి ఉండరు. ముఖ్యంగా విక్రమ్‌ రాథోడ్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ఇంట్రవెల్‌కు ముందు వచ్చే ఫైట్‌ సీన్‌ మాత్రం నెవర్‌ బీఫోర్‌ అన్నట్లుగా ఉంటుంది.&nbsp; https://youtu.be/G3ojv3yp03s?si=O1YYFEFiPUm53_WY కర్తవ్యం (Karthavyam) టాలీవుడ్‌లో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా కర్తవ్యంలో విజయశాంతి (Vijayashanti)&nbsp; చేసిన రోల్‌ గుర్తుకు వస్తుంది. ఇందులో లేడీ శివంగిలా ఆమె నటించింది. పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో నేరస్తులకు చుక్కలు చూపిస్తుంది.&nbsp; https://youtu.be/8mnwQLH4Src?si=Ukzv6Q6IZYQmSChg అంకుశం (Ankusam) హీరో రాజశేఖర్‌ సూపర్‌ హిట్‌ సినిమా అనగానే ముందుగా ‘అంకుశం’ మూవీనే మదిలో ప్రత్యక్షమవుతుంది. ఇందులో నిజాయతీ గల పోలీసు అధికారిగా అతడు కనిపించాడు. నేరస్తులపై ఉక్కుపాదం మోపి అలరించాడు.&nbsp; https://youtu.be/BQW-c1yEpoc?si=X3IFaKaJ7BFjJgA_ గ్యాంగ్ లీడర్ (Gang Leader) మెగాస్టార్‌ చిరు (Chiranjeevi)ను మాస్ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఇందులో చిరు పాత్ర చాలా రఫ్‌గా ఉంటుంది. ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అన్న డైలాగ్‌ ఈ సినిమా ద్వారా చాలా ఫేమస్‌ అయ్యింది.  https://youtu.be/g1ajziOPdJ8?si=BeDHUUGnDRNZfT2C అర్జున్ రెడ్డి (Arjun Reddy) యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైన వెళ్లే ప్రియుడిగా అదరగొట్టాడు. ఈ పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. అందుకే ఈ సినిమా చాలా పెద్ద హిట్‌ అయ్యింది.&nbsp; https://youtu.be/tdQWGkTiWd4?si=EFo1pe0NlqpTEP0J ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) టాలీవుడ్‌లోని క్లాసిక్‌ హీరోగా ‘రామ్‌ పోతినేని’ (Ram Pothineni)కి పేరుంది. అటువంటి రామ్‌ను కూడా ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) ద్వారా చాలా వైలెంట్‌గా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh). ఈ సినిమా కోసం రామ్‌ తొలిసారి సిక్స్‌ ప్యాక్‌ చేయడం విశేషం.&nbsp; https://youtu.be/xYb2-OLUQ-U?si=gAXIB9okHto4iH1a పోకిరి (Pokiri) ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో కనిపించే మహేష్‌ బాబు (Mahesh Babu).. పోకిరి (Pokiri) సినిమాతో వచ్చి అప్పట్లో అందర్ని సర్‌ప్రైజ్‌ చేశాడు. సినిమాలో చాలా వరకూ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించి విలన్లను ఏరివేస్తాడు. క్లైమాక్స్‌తో అతడు పోలీసు అని తెలియడంతో ఆడియన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ తరహా పాత్ర టాలీవుడ్‌లో ఎప్పుడు రాలేదు.&nbsp; https://youtu.be/KzQOoyoAGKo?si=5IhFm-wK-PYeIneq
    మార్చి 28 , 2024
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమలాపాల్‌, అపర్ణ బాలమురళి, వినీత్‌ శ్రీనివాసన్‌, జిమ్మీ జీన్‌ లూయీస్‌, లీనా, సంతోష్‌ కీఝాత్తూర్‌, అకేఫ్‌ నజీం, శోభా మోహన్‌ తదితరులు దర్శకుడు : బ్లెస్సీ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : సునీల్‌ కే.ఎస్‌ నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్‌ లూయీస్‌, స్టీవెన్ ఆడమ్స్‌, కే.జీ అబ్రహం విడుదల తేదీ : 28-03-2024 ‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్‌లో ప్రభాస్‌ ఫ్రెండ్‌గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్‌లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్‌ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్‌ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్‌ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్‌లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్‌పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్‌లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్‌ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్‌. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్‌ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్‌తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.&nbsp;&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్‌ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్‌ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్ ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్ స్లో నారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 28 , 2024

    @2021 KTree