UATelugu2h 54m
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
రామ్ చరణ్
చెల్లుబోయిన చిట్టి బాబుసమంత రూత్ ప్రభు
రామలక్ష్మిఆది పినిశెట్టి
చెల్లుబోయిన కుమార్ బాబుజగపతి బాబు
అధ్యక్షుడు ఫణీంద్ర భూపతిప్రకాష్ రాజ్
ఎమ్మెల్యే దక్షిణామూర్తినరేష్
కోటేశ్వరరావుఅనసూయ భరద్వాజ్
కొల్లి రంగమ్మపూజిత పొన్నాడ
పద్మఅన్నీ
చిట్టిబాబుబ్రహ్మాజీ
తహసీల్దార్బెనర్జీ
దక్షిణామూర్తి వైద్యుడుసత్య అక్కల
ఒక బూడిద రంగు షేడ్ గ్రామస్థుడుఅజయ్ ఘోష్
శేషు నాయుడుమహేష్ ఆచంటమహేష్
శత్రు
కుమార్ బాబు మరియు చిట్టిబాబుల శ్రేయోభిలాషిఅమిత్ శర్మశ్రీమన్నారాయణ
నాగ మహేష్రామలక్ష్మి తండ్రి
చత్రపతి శేఖర్
భూపతి గురించి చిట్టిబాబుని హెచ్చరించిన సాధువునోయెల్ సీన్
ఎర్ర శ్రీనురాజీవ్ కనకాల
రంగమ్మ దివంగత భర్తపూజా హెగ్డే
సిబ్బంది
సుకుమార్
దర్శకుడువై. నవీన్నిర్మాత
వై. రవిశంకర్నిర్మాత
C. V. మోహన్నిర్మాత
సుకుమార్
రచయితదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుఆర్. రత్నవేలు
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్ర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Pottel Movie Review: రిలీజ్‌కు ముందు ‘రంగస్థలం’తో పోలికలు.. మరి ‘పొట్టేల్’ ఆ స్థాయిలో ఉందా?
నటీనటులు: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు
రచన, దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె
నిర్మాణ సంస్థ: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
విడుదల తేదీ: 25-10-2024
అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్ (Pottel Movie Review). సవారి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్’కు వచ్చింది. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ 'రంగస్థలం'తో పోలుస్తూ ప్రశంసలు కురిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సైతం సినిమా బాగుందంటూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశారు. శుక్రవారం (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుందా? అనన్యకు మంచి విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కథేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పటేల్‌గా అజయ్ అద్భుతంగా జీవించాడు. ‘విక్రమార్కుడు’లో టిట్ల పాత్రతో ఎంత ఇంపాక్ట్ ఇచ్చాడో ఈ సినిమాలో అంతకు మించిన ప్రభావం చూపించాడు. అటు గంగాధరీ పాత్రలో కొత్త నటుడు యువ చంద్ర అదరగొట్టాడు. బిడ్డను చదివించాలి, ఊరికి మంచి జరగాలి అని తాపత్రయ పడే వ్యక్తి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతనికిది తొలి చిత్రమే అయినా పాత్రకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లిపోయాడు. తెలుగమ్మాయి అనన్య నాగళ్లకు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. బుజ్జమ్మగా అలరించింది. డీగ్లామర్ పాత్రే అయినా చక్కగా నటించింది. సింగర్ నోయల్‌కు కూడా ఇందులో మంచి పాత్రే దక్కింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ ఆరంభంలోనే ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రల పరిచయం, హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్ పార్ట్ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్రధాన పాత్రల్ని విలన్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయనే భావనతో సన్నివేశాల్ని మలిచినట్టు కనిపిస్తుంది. సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
సాంకేతికంగా..
సాంకేతిక విషయాలకొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. పాటలు, నేపథ్య సంగీతం చిత్రంపై మంచి ప్రభావం చూపించాయి. ఎడిటింగ్ పరంగా లోపాలు ఉన్నాయి. ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కటి పనితీరు కనబరిచింది. తమ పనితనంతో 80ల నాటి వాతావరణాన్ని సృష్టించారు.
ప్లస్ పాయింట్స్
కథప్రధాన తారాగణం నటనసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తి రేకెత్తించని కథనంసాగదీత సన్నివేశాలు
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 25 , 2024
Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్ పోస్ట్ వైరల్!
బుల్లితెర యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్‌గా మారింది.
అనసూయ షాకింగ్ పోస్టు
బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
https://twitter.com/anusuyakhasba/status/1816155138421317791
విజయ్ దేవరకొండను ఉద్దేశించేనా?
అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్‌లోని ఓ సీన్‌పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్‌కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్ మ్యానర్స్ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్ టైల్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్ అవుతూ పోస్టులు పెట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.
గతంలోనూ ఇలాగే..
అనసూయ ఈ తరహా అగ్రెసివ్ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన క్యాప్షన్ పెట్టి అందరినీ షాక్ గురిచేసింది. తన గ్లామరస్ ఫోటోలోను షేర్ చేస్తూ హాట్ క్యాప్షన్ ఇచ్చింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను' అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం గత కొంతకాలంగా కామన్‌గా మారిపోయింది.
View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)
అనసూయ ప్రస్థానం
జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్ యూ బ్రదర్, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్ బ్యాక్ మూవీలో అనసూయ నటిస్తోంది.
జూలై 25 , 2024
Ram Charan New Movie: మూడు నేషనల్ అవార్డ్స్ సాధించిన డైరెక్టర్‌తో రామ్‌చరణ్ కొత్త సినిమా!
చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్.. తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో నటనకు పెద్ద స్కోప్ లేని పాత్రలు చేసిన చరణ్.. ‘రంగస్థలం’ సినిమాతో తనలోని అసలైన నటుడ్ని పరిచయం చేశాడు. 'ఆర్‌ఆర్ఆర్' ద్వారా నటనలో మరో స్టెప్ పైకెక్కి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ జాతీయ స్థాయిలో బజ్ ఉంది. అటు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, సుకుమార్‌తోనూ సినిమాను అనౌన్స్ చేశాడు. లేటెస్ట్‌గా తమిళ స్టార్ డైరెక్టర్‌తో మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
డైరెక్టన్ ఎవరంటే?
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran)తో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్‌తో వెట్రిమారన్ సినిమా ఉంటుందని విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ, అది వర్కౌట్ కాలేదు. రీసెంట్‌గా చరణ్‌కు తమిళ డైరెక్టర్ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది చరణ్‌కు బాగా నచ్చిందని సమాచారం. కథలో స్వల్ప మార్పులు చేయాలని చరణ్ సూచించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది. ఆ ఛేంజస్ తర్వాత త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎవరీ వెట్రిమారన్?
తమిళంలో వెట్రిమారన్ చిత్రాలకు (Vetrimaaran Movies) చాలా గుర్తింపు ఉంది. ఆయన హీరోల కంటే కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన సినిమాల్లో కథే ప్రధాన హీరో. వెట్రిమారన్ తీసిన ‘డుకాలం’, ‘విసారణై’, ‘వడాచైన్నై’, ‘అసురన్’, ‘విడుతలై’ వంటి సినిమాలు గమనిస్తే అందులో కథే కీలక పాత్ర పోషించింది. అందులో నటీనటుల కంటే పాత్రలే ఆడియన్స్ కనిపించాయి. వెట్రిమారన్ ఇప్పటివరకూ 8 చిత్రాలకు దర్శకత్వం వహించగా అందులో మూడు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్నాయి. అటువంటి డైరెక్టర్‌తో రామ్‌చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. నటుడిగా రామ్‌చరణ్ మరో మెట్టు ఎక్కుతాడనడంలో ఎలాంటి సందేహాం ఉండదని ఫ్యాన్స్ అంటున్నారు.
రెండేళ్లు ఆగాల్సిందే!
ప్రస్తుతం రామ్ చరణ్.. తమిళ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘బుచ్చి బాబు’ దర్శతక్వంలో చరణ్ చేయనున్నాడు. మరోవైపు సుకుమార్‌తోనూ ఓ సినిమా చేసేందుకు చరణ్ కమిట్‌మెంట్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే ఆయన వెట్రిమారన్‌తో సినిమా చేసే అవకాశముంది. ఇందుకు దాదాపు రెండేళ్ల సమయం పట్టొచ్చు. అటు వెట్రిమారన్ కూడా ప్రస్తుతం 'విడుదతలై పార్ 2'కు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే గరుడాన్ అనే ఫిల్మ్‌కు కూడా వెట్రిమారన్ కథ అందిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి చేసుకున్న తర్వాతనే రామ్‌చరణ్ మూవీపై ఆయన పూర్తిగా ఫోకస్ పెట్టనున్నారు.
బిగ్ అప్‌డేట్స్ ఎక్కడా!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఒక్క సాంగ్ తప్ప ఎలాంటి బిగ్ అప్‌డేట్స్ రాలేదు. సినిమా షూట్ నుంచి అప్పుడప్పుడు వస్తున్నా లీక్స్ తప్ప సినిమాలో ఎవరి ఫస్ట్ లుక్స్ రిలీజ్ కాలేదు. అయితే ఈ సంవత్సరం ఎలాగైన సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్‌రాజు పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది. ప్రముఖ నటి అంజలి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
మే 28 , 2024
పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.
పూజా హెగ్డే ముద్దు పేరు?
పూజిత
పూజా హెగ్డే వయస్సు ఎంత?
1990, అక్టోబర్ 13న జన్మించింది
పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా?
ఒక లైలా కోసం(2014)
పూజా హెగ్డే ఎత్తు ఎంత?
5 అడుగుల 9 అంగుళాలు
పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది?
మంగళూరు, కర్ణాటక
పూజా హెగ్డే ఉండేది ఎక్కడ?
ముంబై
పూజా హెగ్డే ఏం చదివింది?
Mcom
పూజా హెగ్డే అభిరుచులు?
ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం
పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం?
బిర్యాని, ఫిజా
పూజా హెగ్డేకి ఇష్టమైన కలర్ ?
బ్లాక్, వైట్
పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో?
హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్
పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్?
మాధురి దీక్షిత్
పూజా హెగ్డే పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
పూజా హెగ్డే తల్లిదండ్రుల పేరు?
లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే
పూజా హెగ్డే రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/hegdepooja/
పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ?
రూ.50కోట్లు
https://www.youtube.com/watch?v=B-Ep3Hhy2Sk
ఏప్రిల్ 16 , 2024
RC 17: మద్రాస్ చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రామ్ చరణ్-సుకుమార్ మూవీ.. రాజమౌళి క్రేజీ కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో ‘RC17’ చిత్రాన్ని చరణ్ చేయనున్నాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి బ్లాక్‌బాస్టర్ హిట్ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రానుండటంతో ఇప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ‘RC17’పై దర్శకధీరుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై ఓ లుక్కేద్దాం.
చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో..!
'RC 17' చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా మెుదలు కాకముందే ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందట. మద్రాసు పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పటి సామాజిక నిబంధనలను ధిక్కరించిన ఓ గుఢాచారి (స్పై) ఎమోషనల్ యాక్షన్ జర్నీనే ఈ సినిమా అని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి వ్యాఖ్యలు వైరల్
‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్ సమయంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. ‘RC17’ చిత్రం గురించి మాట్లాడారు. ‘రామ్ చరణ్‌తో సుకుమార్ తీయనున్న సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌కు వచ్చేస్తారని మాత్రం కచ్చితంగా నమ్ముతున్నాను’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
‘ఓపెనింగ్ సీన్ అద్భుతం’
మరోవైపు రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) కూడా ‘RC 17’పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు చరణ్ చెప్పాడు. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అద్భుతమని తెలిపాడు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్ చేయలేను’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు చిత్రబృందాన్ని ట్యాగ్ చేశారు.
ఈ ఏడాది చివర్లో ప్రారంభం!
ప్రస్తుతం రామ్‌చరణ్.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. దీనిని స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) రూపొందిస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu)తో చరణ్ ‘RC16’ సినిమాను పట్టాలెక్కిస్తాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తైన వెంటనే ‘RC17’ సెట్‌లోకి రామ్‌చరణ్ అడుగుపెడతాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా మెుదలవుతుందని సమాచారం. వచ్చే ఏడాది చివరిలో ‘RC17’ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
రేపు అదిరిపోయే ట్రీట్!
రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ‘జరగండి’ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఉదయం 9.00 గంటలకు ఈ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రూపొందించిన ఈ పాట కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మార్చి 26 , 2024
RamCharan Global Craze: రామ్ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్’ (Ramcharan).. టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్ (Jr NTR), రామ్‌చరణ్ గురించి గ్లోబల్ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
‘చరణ్ లాంటి నటుడు కావాలి’
హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్ ఇసాక్ (Oscar Isaac), టెనెట్ (Tenet) నటుడు జాన్ డేవిడ్ వాషింగ్టన్ (John David Washington), టాప్ గన్ (Top Gun) ఫేమ్ మైల్స్ టెల్లర్ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్ (RRR)లో రామ్‌చరణ్ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్ ఫిజిక్, లుక్స్ ఉన్న నటులు కావాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్‌చరణ్ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20
‘గేమ్ ఛేంజర్’లో ఎన్ని కోణాలో!
ప్రస్తుతం రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ మూవీలో పీరియాడికల్ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, ఎస్.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. రాధికా మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొదలయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు రామ్‌చరణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తన సతీమణి ఉపాసనతో కలిసి ఈ పెళ్లి వేడుకల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ మాత్రమే అనంత్ పెళ్లి వేడుకలకు హాజరుకాబోతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు షారుఖ్ ఖాన్ తన భార్య పిల్లలతో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బుచ్చిబాబుతో స్పోర్ట్స్ డ్రామా చిత్రం!
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది.
ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ!
హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చరణ్ ఫోకస్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబర్ 150 వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన చరణ్.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో కూడిన చిన్న సినిమాలను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చర్స్’ పేరుతో మరో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశభక్తి మూవీని చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
మార్చి 01 , 2024
Ram Charan Wax Statue: ప్రభాస్, మహేష్, బన్నీ సరసన రామ్ చరణ్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ (Ram Charan) టాలీవుడ్ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘చిరుత’ (Chirutha) సినిమాతో తెరంగేట్రం చేసిన అతడు రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR)తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే మరో అరుదైన ఘనతను సైతం రామ్‌చరణ్ అందుకోబోతున్నాడు.
సింగపూర్‌లో మైనపు విగ్రహం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) అరుదైన గౌరవం దక్కనుంది. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్‌లోని మ్యూజియంలో చరణ్‌తోపాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహాన్ని కూడా పెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోషూట్ ఇప్పటికే పూర్తయింది. విగ్రహం ఏర్పాటు చేసే విషయాన్ని టుస్సాడ్స్ టీమ్ ఐఫా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై మెగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తరహాలోనే అంచెలంచెలుగా ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/Nilzrav/status/1840120654193897699
ఫస్ట్ తెలుగు హీరోగా రికార్డు!
టాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు స్టార్ హీరోల మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటితో పోలిస్తే ఈసారి చరణ్ మైనపు విగ్రహం చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లండన్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ విగ్రహాన్ని ఏర్పాటుచేయబోతున్నారు. మేడమ్ టుస్సాడ్స్ పుట్టిన ఇల్లు అయిన లండన్ మ్యూజియంలో అడుగుపెడుతున్న ఫస్ట్ తెలుగు యాక్టర్ రామ్ చరణ్ కావడం విశేషం. ఈ అరుదైన గౌరవాన్ని చరణ్ సొంతం చేసుకోబుతున్నారు. ఆయనకు మూగ జీవాలపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన పెంపుడు కుక్క రైమ్ విగ్రహాన్ని అక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయనుండటం గమనార్హం.
చరణ్ కంటే ముందే..
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అడుగు పెట్టిన మొదటి తెలుగు హీరో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన మైనపు విగ్రహం బ్యాంకాక్ మ్యూజియంలో పెట్టారు. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం ఉంది. ఆ మ్యూజియంలోనే శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సైతం ఉంచారు. ఆమె నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'మిస్టర్ ఇండియా'లో గెటప్ తీసుకుని ఆ విగ్రహం రూపొందించారు. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ సైతం అక్కడే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. పుష్పరాజ్ గెటప్‌లో బన్నీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.
బాలీవుడ్ స్టార్స్ విగ్రహాలు
బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలు సైతం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు అయ్యాయి. వీరిలో కొందరివి లండన్‌లో, ఇంకొంత మంది విగ్రహాలు సింగపూర్, దుబాయ్ మ్యాజియమ్స్‌లో ఉన్నాయి. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహా మరి కొందరి మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఏర్పాటు చేశారు.
చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
రామ్‌చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' (Game Changer) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు (Director Buchi Babu) దర్శకత్వంలో రామ్‌చరణ్ (Ram Charan) నటించబోతున్నాడు. ‘RC16’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన సైతం వచ్చేసింది. 'పుష్ప 2' రిలీజ్ అనంతరం రామ్, సుకుమార్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
సెప్టెంబర్ 30 , 2024
RC 17: పాన్ వరల్డ్ స్థాయిలో చరణ్-సుకుమార్ చిత్రం.. రికార్డులు దాసోహం కావాల్సిందే!
టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' (Ram Charan) ఒకరు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే నటుడిగా రామ్ చరణ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన చిత్రం మాత్రం 'రంగస్థలం' (Rangasthalam). డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్ నట విశ్వరూపం చూపించాడు. ఈ మెగా వారసుడి నటనకు ఇండస్ట్రీ మెుత్తం ఫిదా అయ్యింది. చరణ్‌లోని అసలైన నటుడ్ని సుకుమార్ బయటకు తీసుకొచ్చారని సర్వత్రా ప్రశంసలు కురిశాయి. అటువంటి చరణ్-సుక్కు కాంబోలో మరో చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘RC 17’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ గురించి చాలా రోజుల తర్వాత క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
పాన్ వరల్డ్ స్థాయిలో..
రామ్ చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడు మెుదలవుతుందా? అని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రాన్ని మించి 'RC 17' ఉండాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో చరణ్-సుక్కు మూవీ రూపుదిద్దుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తూ వచ్చారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం 'RC 17' గ్లోబల్ స్థాయిలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఓ సమస్యను కీ పాయింట్‌గా చేసుకొని సుక్కు ఈ మూవీని తెరకెక్కించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మెుదలైనట్లు టాక్ వినిపిస్తోంది. సుకుమార్ టేకింగ్‌కు పాన్ వరల్డ్ స్థాయి మూవీ పడితే ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే అని చెప్పవచ్చు. 'RC 17'కు సంబంధించి త్వరలోనే కీలక అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
ఆ మూవీ తర్వాతే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తైనట్లు తెలుస్తోంది. దీంతో గతంలో ప్రకటించిన విధంగానే ‘ఉప్పెన’ (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) డైరెక్షన్‌లో చరణ్ నటించనున్నారు. 'RC 16' వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందనుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుంది. బుచ్చిబాబు ప్రాజెక్ట్ తర్వాత చరణ్-సుకుమార్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సెట్స్‌పైకి ఎప్పుడంటే?
డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేసేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే ‘RC 17’ ప్రాజెక్ట్‌పై సుకుమార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశముంది. అయితే ఇప్పటికే రామ్‌చరణ్ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను సుకుమార్ మెుదలుపెట్టినట్లు కూడా టాక్ ఉంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్దం చేసి వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సుకుమార్ భావిస్తున్నారు.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అతడి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందట. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్-సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు.
ఆగస్టు 08 , 2024
సమంత గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
సమంత దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో ఏమాయ చేసావే(2010) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ తమిళ్ అందం... దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లే చెట్టు, యశోద, శాకుంతలం చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సమంత గురించి కొన్ని(Some Lesser Known Facts About Samantha) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
సమంత ఎవరు?
సమంత భారతీయ నటి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
సమంత దేనికి ఫేమస్?
సమంత.. ఏమాయ చేసావే, పుష్ప, దూకుడు, రంగస్థలం వంటి హిట్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది.
సమంత వయస్సు ఎంత?
సమంత 1987 ఏప్రిల్ 28న జన్మించింది. ఆమె వయస్సు 36 సంవత్సరాలు
సమంత ముద్దు పేరు?
సామ్
సమంత ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
సమంత ఎక్కడ పుట్టింది?
చెన్నై
సమంతకు వివాహం అయిందా?
2017లో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2021లో విడిపోయింది.
సమంత అభిరుచులు?
పాటలు పాడటం, షాపింగ్, జిమ్ చేయడం
సమంత ఇష్టమైన ఆహారం?
స్వీట్ పొంగల్, డైరీ మిల్క్ చాక్‌లెట్, పాలకోవ
సమంత అభిమాన నటుడు?
ధనుష్, సూర్య, రజనీకాంత్
సమంత తొలి సినిమా?
ఏమాయ చేసావే
సమంత ఏం చదివింది?
కామర్స్‌లో డిగ్రీ చేసింది
సమంత పారితోషికం ఎంత?
సమంత ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
సమంత తల్లిదండ్రుల పేర్లు?
జోసెఫ్ ప్రభు, నైనిటీ
సమంతకు అఫైర్స్ ఉన్నాయా?
సమంత తొలుత సిద్ధార్థతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరు విడిపోయినట్లు తెలిసింది
సమంతకు ఎన్ని అవార్డులు వచ్చాయి?
4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు వచ్చాయి.
సమంత ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/samantharuthprabhuoffl/?hl=en
సమంత సిగరేట్ తాగుతుందా?
కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లలో సమంత స్మోకింగ్ చేస్తుందని ఉంది
సమంత మద్యం తాగుతుందా?
తెలియదు
సమంత ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?
సమంత తొలుత నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్‌లో నటించింది. ఆ తర్వాత నానితో లిప్‌లాక్ సీన్‌లో నటించింది.
సమంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
చిన్మయి, రానా, అక్కినేని అఖిల్
సమంతకు టాటూలు అంటే ఇష్టమా?
అవును, తన కుడి వైపు నడుము పై భాగంలో 'చై' అని టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత టాటూ తొలగించింది.
సమంతకు వచ్చి వ్యాధి పేరు?
ఆటో ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్(మయోసైటిస్), ఈ వ్యాధితో పాటు 2013లో ఆమెకు డయాబెటిస్ ఉన్నట్లు తెలిసింది.
సమంత గుడి ఎక్కడ ఉంది?
ఆంధ్రప్రదేశ్- బాపట్లలోని ఆలపాడు గ్రామంలో సమంత గుడిని ఆమె అభిమాని తెనాలి సందీప్ కట్టారు.
https://www.youtube.com/watch?v=TRAuBpbd_nI
ఏప్రిల్ 27 , 2024
HBD Ram Charan: ‘రామ్‌చరణ్’కు బాల్యంలో చిరు ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్‌చరణ్ (Ram Charan).. టాలీవుడ్ (Tollywood)లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. చిరుత (Chirutha)తో తెరంగేట్రం చేసిన చరణ్.. రెండో సినిమా 'మగధీర' (Magadheera) ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. రంగస్థలం (Rangasthalam)తో నటుడిగా తనకు తిరుగులేదని నిరూపించిన అతడు.. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. ఇవాళ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బాల్యానికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్‌చరణ్‌కు చిన్నప్పుడు సిగ్గు చాలా ఎక్కువట. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో అసలు పాల్గొనేవాడే కాదట. అల్లు అర్జున్ (Allu Arjun), శిరీష్ (Allu Sirish) డ్యాన్స్ వేస్తుంటే చూస్తూ కేరింతలు కొడుతూ ఉండేవట.
ప్రస్తుతం రామ్‌చరణ్ ఈ స్థాయిలో డ్యాన్స్ వేయడానికి చిరు నుంచి వచ్చిన నైపుణ్యమే కారణమట. చరణ్ ఇప్పటివరకూ ఎలాంటి డ్యాన్స్ కోచింగ్ తీసుకోలేదట. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అవసరం లేకుండానే అతడు డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం.
రామ్‌చరణ్‌కు బాల్యంలో సినిమాలపై ఆసక్తి ఉండేది కాదట. అందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ కారణంగా చెప్పవ్చచు. ఎందుకంటే చరణ్‌పై సినిమాల ప్రభావం పడకుండా చిరు జాగ్రత్తపడే వారట.
చరణ్‌కు చదువుపై శ్రద్ధ పెరిగేందుకు సినిమా పోస్టర్లు కూడా ఇంట్లో ఉండనిచ్చేవారు కాదట . పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్’ ఇచ్చారు చిరు.
చరణ్ చదువు విషయానికొస్తే.. అతడు యావరేజ్ స్టూడెంట్. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదట.
రామ్‌చరణ్ తన బాల్యం నుంచి టీనేజ్ వరకూ తరచూ స్కూల్స్ కాలేజీలు మారాల్సి వచ్చిందట. ఇప్పటివరకూ చెర్రీ.. 8 స్కూల్స్, 3 కాలేజీలు మారినట్లు సమాచారం. అయితే చదువు కంటే ఆటలంటేనే చెర్రీకి బాగా ఇష్టమట.
నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి.
సినిమాల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్ విషయంలోనూ అంతేనట. అందుకే చరణ్ బైక్ రైడింగ్ చేస్తానంటే చిరు ఎంకరేజ్ చేసేవారు కాదట.
రామ్‌చరణ్‌కు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు.
రామ్‌చరణ్ ప్రతీ ఏటా ఏదోక మాలధారణలో కనిపిస్తూనే ఉంటారు. దానికి ఓ బలమైన కారణమే ఉంది. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు.
అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు.
తన సినిమాలు చూశాక మెగాస్టార్ చిరంజీవి చేసే కామెంట్స్ తనకు ఎంతో ముఖ్యమైనవని చరణ్ తెలిపాడు. డ్యాన్స్ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చిరు చెప్పేవారట.
ధ్రువ చూసిన తర్వాత కథకు పాత్రకు బాగా న్యాయం చేశావంటూ చిరు మెచ్చుకున్నారట. రంగస్థలం సినిమా చూస్తూ తన తల్లి భావోద్వేగానికి గురైనట్లు రామ్‌చరణ్ తెలిపారు. ఈ రెండూ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు అని చరణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
రామ్‌చరణ్ ఇప్పటివరకూ.. ‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16) కూడా రామ్‌చరణ్ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది.
రామ్‌చరణ్.. మరో కొత్త సినిమాను కూడా ఇటీవల అధికారికంగా ప్రకటించాడు. డైరెక్టర్ సుకుమార్‌తో ‘RC17’ చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత వీరు మళ్లీ సినిమా చేస్తుండటంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మార్చి 27 , 2024
RC 17: రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో కొత్త మూవీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
మెగా పవర్ రామ్‍చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అటు ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతోనూ రామ్‌చరణ్ చిత్రం ఖరారైంది. స్పోర్ట్స్ డ్రామాగా రానున్న ‘RC16’ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అయితే తాజాగా రామ్‌చరణ్‌కు సంబంధించి మరో మూవీ కన్ఫార్మ్ అయ్యింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్‌బాస్టర్ ఇచ్చిన సుకుమార్.. ‘RC17’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు విడుదలైంది.
హోలీ స్పెషల్ అనౌన్స్‌మెంట్..
రామ్‍చరణ్ - సుకుమార్ కాంబినేషన్‍లో భారీ సినిమా తెరకెక్కనుందని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నేడు అధికారికంగా వెల్లడించింది. హోలీ సందర్భంగా చెర్రీ, సుకుమార్ రంగులు పూసుకొని సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. అలాగే జోడు గుర్రాల పోస్టర్‌తో ‘రోరింగ్ టూ కాంకర్’ అనే ట్యాగ్ లైన్ మరో పోస్టర్‌ను కూడా నిర్మాణ సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సుకుమార్ లాంటి దిగ్గజ దర్శకుడితో రామ్‌చరణ్ మళ్లీ పనిచేయనుండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1772195858693698029
రంగస్థలం కాంబో రిపీట్!
సుకుమార్ - రామ్‌చరణ్ కాంబోలో గతంలోనే ఈ సినిమా వచ్చింది. 2018లో వచ్చిన పీరియడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘రంగస్థలం’ భారీ విజయాన్ని అందుకుంది. నటుడిగా చెర్రీని మరోస్థాయికి తీసుకెళ్లింది. అప్పటి వరకు క్లాస్ సినిమాలతో మెప్పించిన సుకుమార్.. రంగస్థలంతో మాస్ అంటే ఏంటో చూపించారు. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు ‘ఆర్‌సీ17’ చిత్రానికి ఈ హిట్ కాంబినేషన్ మొత్తం రిపీట్ అవుతోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
రామ్చరణ్ - సుకుమార్ కాంబోలో రూపొందనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని... 2025 రెండో అర్ధభాగంలో రిలీజ్ చేసేలా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో సినిమా పూర్తయ్యాక వెంటనే ఈ మూవీ షూటింగ్‍లో చెర్రీ పాల్గొనే ఛాన్స్ ఉంది.
మార్చి 25 , 2024
Telugu Beautiful Anchors: ఈ యాంకర్లు చాలా హాట్ గురూ!
ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో మంది మహిళా యాంకర్లు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. సుమ, ఝాన్సీ, శ్యామల, ఉదయభాను వంటి సీనియర్ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ప్రస్తుతం తెలుగులోని బ్యూటీఫుల్ యాంకర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
1. అనసూయ (Anasuya)
యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్ హిట్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
2. రష్మి (Rashmi)
జబర్దస్త్ షో ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న మరో యాంకర్ రష్మి. జబర్దస్త్ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది.
3. శ్రీముఖి (Srimukhi)
యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది.
4. వింధ్య (Vindhya)
తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్ ఆమెనే. ఐపీఎల్ వచ్చినా, కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది
5. మంజూష (Manjusha)
హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్ల లాగా టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లలోనే తళుక్కున మెరుస్తూ ఉంటుంది.
6. వర్షిణి (Varshini)
అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు యాంకర్ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. టీవీ షోలలో ఎక్కువగా కనిపించే ఈ భామ.. ఇటీవల కాలంలో తన దూకుడు బాగా తగ్గించింది. పెద్దగా ఏ షోలలోనూ కనిపించడం లేదు.
7. విష్ణు ప్రియ (Vishnu Priya)
తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆగస్టు 04 , 2023
Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయి. గత కొద్ది కాలంగా విలేజ్ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
రంగస్థలం
రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.
దసరా
సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా క్రాస్ చేసింది.
బలగం
అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.
విరూపాక్ష
పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.
పుష్ప
సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.
కేరాఫ్ కంచరపాలెం
కంచరపాలెం, భీమిలి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక్కడి ప్రజల జీవనశైలిని నిశితంగా పరిశీలించి చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ వెంకటేశ్ మహా భావించాడు. అలా ఓ కథను ఎంచుకుని గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా సినిమాను తీశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
శ్రీకారం
వ్యవసాయానికి ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన చిత్రం ఇది. గ్రామాల్లోని రైతుల మధ్య ఉండే అనుబంధాలను ఇందులో చక్కగా చూపించాడు డైరెక్టర్ కిశోర్. శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
కాంతార
చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కాంతార. ఓ మారుమూల అటవీ గ్రామంలోని ఆచారాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. అడవి, గ్రామస్థులు, వారి అలవాట్లు, జీవన విధానం.. ఇలా ప్రతి కోణంలోనూ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు.
జూన్ 13 , 2023
Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను పలకరించాయి. అయితే రొటీన్ కథలతో విసిగిపోయిన టాలీవుడ్‌కు కొన్ని సినిమాలు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. హీరోకు లోపం ఉన్న కథతో వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కొత్తగా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తాయని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? లోపంతో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం.
పుష్ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లుఅర్జున్ ఒక లోపంతో కనిపిస్తాడు. అతడి కుడి భుజం సహజంగా కంటే మరీ పైకి ఉంటుంది. సినిమా అంతా బన్నీ అలాగే ఉంటాడు. భుజాన్ని అలాగే పైకి పెట్టి షూటింగ్‌లో పాల్గొనటం ఎంతో కష్టంగా అనిపించిందని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చాడు.
రంగస్థలం
రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి పెదాల కదలికలను బట్టి మాటలను ఆర్థం చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో ఆ చెవిటి తనమే చెర్రీకి సమస్యగా మారుతుంది. తనను ఎవరూ చంపారో అన్న చెప్పినప్పటికీ అది బుచ్చిబాబు చెవికి ఎక్కదు. చివరకు విలన్ ప్రకాష్‌రాజ్ అని తెలుసుకొని చంపేయడంతో కథ సుఖాంతమవుతుంది.
రాజా ది గ్రేట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా టాలీవుడ్ భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజకు కళ్లు కనిపించవు. బ్లైండ్‌గా ఉంటూ రవితేజ చేసిన కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడిని నిలదొక్కుకునేలా చేసింది.
సూర్య vs సూర్య
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘సూర్య vs సూర్య’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ జన్యుపరమైన లోపంతో బాధపడుతుంటాడు. అతడి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో పగటివేళ బయటకు వెళ్తే 15 నిమిషాల్లో చనిపోతాడని వైద్యులు చెబుతారు. దీంతో రాత్రివేళ మాత్రమే హీరో బయటకు వస్తుంటాడు. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
భలే భలే మగాడివోయ్
హీరో నాని, డైరెక్టర్ మారుతీ కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నాని మతిమరుపుతో బాధపడుతుంటాడు. ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతూ నవ్వులు పూయించాడు. అయితే అతడికున్న ఆ సమస్య కొన్ని చిక్కులను సైతం తెచ్చిపెడుతుంది. హీరోయిన్‌తో తన ప్రేమకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది.
సవ్యసాచి
నాగచైతన్య హీరోగా చేసిన ‘సవ్యసాచి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలకు పూర్తి భిన్నం. ఇందులో హీరో ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే లోపంతో బాధపడుతుంటాడు. అవిభక్త కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడమే ఈ సమస్యకు కారణం. ఇందులో నాగచైతన్య మెదడు, ఎడమ చేయి కవల సోదరుడి ఆధీనంలో ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించనప్పటికీ ఒక మంచి సినిమాగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
నా పేరు సూర్య
అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య‘. ఇందులో బన్నీ సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో బన్నీకి విపరీతమైన కోపం ఉంటుంది. దాంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సైన్యం నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. ఇందులో అల్లుఅర్జున్ అగ్రెసివ్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మే 31 , 2023
HBD SAMANTHA: ఆ ఒక్కటి సమంతకే చెల్లింది.. బోల్డ్ అయినా, ఎమోషనల్ అయినా సామ్ దిగనంత వరకే!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతది ప్రత్యేకమైన ప్రయాణం. ఏమాయ చేశావే చిత్రంతో జెస్సీగా పరిచయమై అందరి మనసుల్ని కొళ్లగొట్టింది సామ్. 2010లో కెరీర్ ప్రారంభించి దాదాపు 13 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సమంత ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ వర్తమాన హీరోయిన్స్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెకున్నంత డైహార్ట్ ఫ్యాన్స్ హీరోయిన్స్‌లో మరెవరికి లేరని చెప్పవచ్చు. ఏప్రిల్ 28న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు సమంత చేసిన విభిన్న పాత్రలు ఓసారి గుర్తు చేసుకుందాం…
రంగస్థలం రామ లక్ష్మి
రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయి పాత్రలో జీవించేసింది సమంత. ఆంధ్రా స్లాంగ్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇందులో సామ్ చేసిన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
మజిలీ శ్రావణి
నాగచైతన్య, సమంత నటించిన చిత్రం మజిలీ. ఇందులో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సామ్ నటన నెక్స్ట్ లెవల్. క్లైమాక్స్‌లో సమంత పర్‌ఫార్మెన్స్ కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలా క్యారెక్టర్‌ను ముందుకు తీసుకెళ్లింది.
ఓ బేబీ
సమంత హీరోయిన్‌గా వచ్చిన లేడి ఓరియెంటెడ్ ఇది. ఓ ముసలి వ్యక్తి కొన్ని కారణాల వల్ల యవ్వనంలోకి వెళ్తుంది. కానీ, ఆ పాత్రను చేసిన వ్యక్తిలానే నటించడం చాలా కష్టమైన పని. సీనియర్ యాక్టర్‌లా హావాభావాలు పండిస్తూ… చూడటానికి 25 ఏళ్లున్నా వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో చించేసింది ఈ బ్యూటీ.
యశోద
అద్దె గర్భం కాన్సెప్ట్‌లో వచ్చిన యాక్షన్ సినిమా. ఇందులో సమంత పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. తన కోసం చిక్కుల్లో పడిన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం వంటివి ఆకట్టుకున్నాయంటే ఆమెనే కారణం. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలే వచ్చాయి.
శకుంతల
కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ సినిమాను పూర్తి చేసింది. ఇందులో తన పాత్ర కోసం చాలానే కష్టపడింది. శకుంతల పాత్రలో జీవించింది. గ్లామర్ పరంగా ఏమాత్రం తగ్గకుండా నటించింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చినప్పటికీ సామ్ చేసిన డిఫరెంట్ రోల్స్‌లో ఇదొకటని చెప్పవచ్చు.
పుష్ప ది రైజ్
పుష్ప చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఫ్యామిలీ మెన్ రాజీ
మనోజ్ బాజ్‌పేయ్ లీడ్ రోల్‌లో వచ్చిన ఫ్యామిలీ మెన్ సిరీస్ పార్ట్ 2లో సమంత విభిన్నమైన క్యారెక్టర్‌లో కనిపించింది. శ్రీలంక రెబల్ గ్రూప్ అంటే నక్సలైట్ పాత్రలో మెరిసింది సుందరి. డీ గ్లామరస్ రోల్‌లో కనిపించడమే కాకుండా బోల్డ్ సీన్‌లో నటించి షాకిచ్చింది.
సిటాడెల్
హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ సిరీస్‌ను బాలీవుడ్‌లో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా పోషించిన యాక్షన్ రోల్‌ను సామ్ చేయనుంది. ఇప్పటికే షూటింగ్ కోసం చిత్రబృందంతో జత కట్టింది చెన్నై సుందరి.
ఏప్రిల్ 27 , 2023
Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ ఆసిస్టెంట్ డైరెక్టర్లు:
శ్రీకాంత్ ఓదెల(srikanth odela)
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు. శ్రీకాంత్ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్ చెప్పారంటే ఈ డైరెక్టర్ టాలెంట్ అర్థమవుతోంది.
https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html
https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20
బుచ్చిబాబు(Buchi Babu Sana)
సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తారని స్వయంగా చరణ్ చెప్పే స్థాయికి ఎదిగాడు.
పల్నాటి సూర్యప్రతాప్(Palnati surya pratap)
సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంటగా ‘18 పేజెస్’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, సుకుమార్ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్ రైటర్‌గా పనిచేశాడు.
రాజమౌళి ఆసిస్టెంట్ డైరెక్టర్లు: (Rajamouli assistant directors)
G.R కృష్ణ( GR KRISHNA )
టాలీవుడ్ డైరెక్టర్ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు.
కరుణ కుమార్ ( KARUNA KUMAR)
మరో టాలీవుడ్ డైరెక్టర్ కరుణ కుమార్ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.
అశ్విన్ గంగరాజు (ASHWIN GANGA RAJU)
డైరెక్టర్ అశ్విన్ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..!
రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది.
రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఏప్రిల్ 06 , 2023
Allu Ayaan: చరణ్ మామ అంటేనే ఇష్టం.. ట్విట్టర్‌ను షేక్ చేస్తున్న అల్లు అయాన్ వీడియోలు, ఫొటోలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. బన్నీ సినిమా రిలీజ్ అంటే థియేటర్స్ దగ్గర పూనకాలే. బన్నీకి బయటనే గాక సోషల్ మీడియాలోనూ భారీగా క్రేజ్ ఉంది. ఇవాళ బన్నీ గారాల పట్టి అల్లు అయాన్ పుట్టిన రోజు కావడంతో నెటిజన్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ‘అల్లు అయాన్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ తమదైన శైలిలో బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. దీంతో ట్విటర్‌లో #AlluAyan పేరు ట్రెండింగ్‌గా మారింది.
అయాన్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే మై స్వీటెస్ట్ ‘చిన్నిబాబు’ అంటూ అయాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టును బన్నీ ప్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
https://twitter.com/alluarjun/status/1642732690700111877
https://twitter.com/ShivaBoya1231/status/1642805820370063360
అటు రామ్‌చరణ్ ఫ్యాన్స్ కూడా అయాన్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. ‘చెర్రీ మామ’ అంటూ అయన్ ముద్దుగా పిలిచిన వీడియోను షేర్ చేస్తున్నారు. అంతేగాక రంగస్థలంలో చరణ్ ఫోజును అనుసరిస్తూ అయాన్ దిగిన ఫొటోను పంచుకుంటున్నారు. నటుడిగా తనకు రామ్‌చరణ్ ఇష్టమని ఓ సందర్భంలో అయాన్ చెప్పడం గమనార్హం.
https://twitter.com/IMPravallikaM17/status/1642825725471346688
https://twitter.com/BBhanuTweets/status/1642733395859099650
సైరా ఆడియో ఫంక్షన్ సందర్భంగా అయాన్‌పై అల్లుఅర్జున్ ప్రేమ చూపించిన వీడియోను బన్నీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అమితంగా ప్రేమించే బన్నీ లాంటి నాన్న దొరికినందుకు అయాన్ అదృష్టవంతుడని కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/i/status/1642785636104171520
బన్నీ చిన్నప్పుడు అయాన్‌ను ఎత్తుకున్న ఫొటోలను ఫ్యాన్స్ ట్విటర్‌లో పోస్టు చేస్తున్నారు. అలాగే అల్లు అర్హాతో అయాన్ దిగిన పిక్‌ను వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/iam_naveen66/status/1642706542188453888
డీజే టిల్లు ఆడియో ఫంక్షన్ వేదికపై అయాన్ నమస్కరిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న అయాన్‌ను చూసి బన్నీ మురిసిపోవడం వీడియోలో కనిపిస్తోంది.
https://twitter.com/i/status/1642749681167138817
అల్లు అర్జున్‌తో కలిసి అయాన్ స్విమ్మింగ్ పూల్‌లో దూకే వీడియో కూడా ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.
https://twitter.com/i/status/1642713358968451072
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఘనీ సినిమాను ప్రమోట్ చేస్తూ అప్పట్లో అల్లు అయాన్ చేసిన వీడియో ఇప్పడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో బాక్సింగ్ ప్రాక్టిస్ చేస్తూ అయాన్ కనిపిస్తాడు.
https://twitter.com/i/status/1642727327212929024
అల్లు అరవింద్ శతజయంతి వేడుకల్లో అయాన్ తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు
https://youtu.be/YKOZYqSLRbM
మెుత్తంగా అల్లుఅర్జున్‌కు సరైన వారసుడు అయాన్ అవుతాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జూనియర్ అల్లుఅర్జున్ అంటూ ఇప్పటినుంచే ఆకాశానికి ఎత్తుతున్నారు.
ఏప్రిల్ 03 , 2023
#AskNani: ఫ్యాన్‌కు నాని స్ట్రాంగ్ కౌంటర్… మళ్లీ చెబుతున్నా KGF, దసరా ఒకటి కాదు.. ఒరిజినల్ పీస్
దసరా చిత్రంతో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నాని. మార్చి 30న మెుదలవుతున్న మాస్ జాతర కోసం సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావటంతో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రచారంలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్… ట్విటర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఓసారి వాటిపై లుక్కేయండి.
దసరా రన్‌టైమ్
#Asknaniలో భాగంగా దసరా చిత్రం రన్ టైమ్ రివీల్ చేశాడు నాని. ఈ చిత్రంలో బాగా హై ఇచ్చే సీన్ ఏదంటూ అభిమాని అడిగిన ప్రశ్నకు 2 గంటల 36 నిమిషాలు అలానే ఉంటుందనే సమాధానం ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636016970473828353
ఫుల్ బిందాస్
సినిమా ఔట్‌పుట్‌పై మీరు సంతోషంగా ఉన్నారా ? అడిగిన ప్రశ్నకు నాని పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ట్రైలర్‌లోని ఓ చిన్న వీడియోను జోడిస్తూ సమాధానం చెప్పాడు యంగ్ హీరో. దీంతో చిత్రం అదిరిపోతుందని చెప్పకనే చెప్పాడు.
https://twitter.com/NameisNani/status/1636015575284748288
స్ట్రాంగ్ రిప్లై
రంగస్థలం, పుష్ప చిత్రాలతో పోలీస్తే దసరా సినిమాలో తేడా ఏంటీ ? నార్త్ ఇండియాలో కొంతమంది చిత్రాన్ని కేజీఎఫ్‌తో పోల్చి పట్టించుకోవడం లేదని తెలిపాడు ఓ అభిమాని. దీనికి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్, ఆర్నాల్డ్ ఒకే రకం జాకెట్ వేసుకున్నంత మాత్రాన హాలీవుడ్ టర్మినేటర్, బాలీవుడ్ దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమాలు ఒక్కటి కావంటూ రిప్లే ఇచ్చాడు.
https://twitter.com/NameisNani/status/1636005865101877255
ఫన్నీ సమాధానం
నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చిన నాని. భలే భలే మెుగాడివోయ్ చిత్రం ఎప్పుడనే క్వశ్చన్‌కు నాని ఎపిక్ రిప్లై ఇచ్చాడు. సినిమా కథను గుర్తు చేస్తూ “ వాడికి గుర్తొచ్చినప్పుడు” అన్నాడు.
https://twitter.com/NameisNani/status/1636006778805837824
ఎవరైనా ఒక్కటే
నేచురల్ స్టార్ కొత్త దర్శకులకు అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు. అలా కాకుండా టాప్ డైరెక్టర్లతో పనిచేయాలని ఓ వ్యక్తి చెప్పగా… “ టాలెంట్ కొత్తది అయితే ఏంటి? పాతది అయితే ఏంటి? తేడా తెలియట్లేదు నాకు” అంటూ చెప్పిన సమాధానాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1636004611210502150
ఒరిజినల్ పీస్
సినిమా ట్రైలర్ చూస్తే నిజంగానే కొత్త దర్శకుడు తీసినట్లుగా అనిపించదు. చాలా అనుభవం ఉన్న వ్యక్తి చిత్రాన్ని తెరకెక్కించిన ఫీలింగ్ వస్తుంది. దీనిపై నానికి ప్రశ్నలు ఎదురయ్యాయి. “ఊహల్లో ఇప్పటికే చాలా తీసేశాడు. దొరికాడు మనకు ఒకడు, ఒరిజినల్ పీస్” అంటూ శ్రీకాంత్ ఓదెలను కొనియాడాడు.
మార్చి 16 , 2023
Suriya: సూర్యతో జక్కన్న తీయాలనుకున్న సినిమా అదేనా!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించి 'కంగువా' (Kanguva) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నవంబర్ 14న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండంతో నటుడు సూర్యతో పాటు కంగువా టీమ్ చురుగ్గా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి గతంలో సూర్యతో సినిమా చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా? అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్టింట ఆసక్తికర చర్చ మెుదలైంది. గతంలో రాజమౌళి తీసిన ఆ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తొలుత సూర్యతోనే తీద్దామని అనుకున్నట్లు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ మూవీ ఏదంటే?
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్‌లో ‘మగధీర’ (Magadheera) ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాతో చరణ్ క్రేజ్ తారాస్థాయికి చేరింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాను తొలుత సూర్యతో చేయాలని జక్కన్న భావించినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రానికే సూర్యను తీసుకోవాలని భావించినట్లు స్ట్రాంగ్‌గా రూమర్లు వచ్చినా అందులో వాస్తవం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ కటౌన్‌ను చూసే ‘బాహుబలి’ స్టోరీ సిద్ధం చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. కాబట్టి ‘మగధీర’ కోసమే రాజమౌళి సూర్యను సంప్రదించి ఉండొచ్చని అంటున్నారు. ‘కంగువా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య చేసిన ‘గజిని’ చిత్రాన్ని రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ లెక్కన చూసినా ‘గజిని’ 2005లో రిలీజైంది. 2009లో మగధీర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మగధీర చిత్రీకరణ మూడేళ్లపాటు జరిగింది కాబట్టి 2006 సమయంలోనే మగధీర స్క్రిప్ట్‌ను రాజమౌళి సిద్ధం చేశారు. ఈ లాజిక్స్ పరంగా చూస్తే ‘మగధీర’ సినిమానే సూర్య చేయాల్సిందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
అదే జరిగి ఉంటే?
ఒకవేళ నిజంగానే మగధీర చిత్రాన్ని గనుక రామ్‌చరణ్ చేయకుండా ఉండుంటే అతడి ఇంకోలా ఉండేదని చెప్పవచ్చు. ఎందుకంటే ‘మగధీర’ వంటి బ్లాక్ బాస్టర్ లేకుండా చరణ్ సినీ జీవితాన్ని ఊహించుకోలేము. తొలి చిత్రం ‘చిరుత’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకోవడంతో ఫ్యాన్స్ దృష్టిలో చరణ్ పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఆ తర్వాత చేసిన సెకండ్ ఫిల్మ్ ‘మగధీర’తోనే చిరు తనయుడిగా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు చరణ్. మగధీర తర్వాత చాలా చిత్రాలే చేసినప్పటికీ ‘రంగస్థలం’ (2018) వరకూ సరైన బ్రేక్ రాలేదు. అప్పటివరకూ మగధీరతో వచ్చిన ఫేమ్‌తోనే చరణ్ నెట్టుకు వచ్చాడు. అటువంటి ‘మగధీర’ సినిమా చరణ్ కెరీర్‌లో లేకపోయి ఉంటే అతడి కెరీర్‌లో కచ్చితంగా డౌన్‌ఫాల్‌లో ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు మెగా ఫ్యాన్స్ సైతం బయటకు చెప్పకపోయిన ఇదే ఫీలింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
‘సూర్యతో చేసే ఛాన్స్ మిస్ అయ్యా’
కంగువా’ (Kanguva) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్ నటుడు సూర్య (Suriya)పై దర్శకుడు రాజమౌళి (Rajamouli) ప్రశంసలు కురిపించారు. ఆ నటుడి స్ఫూర్తితోనే పాన్ ఇండియా చిత్రాలను తెరకెక్కించానని తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడంలో సూర్యనే తనకు స్పూర్తి అని జక్కన్న అన్నారు. ‘గజిని’ చిత్ర సమయంలో ఆయన చేసిన ప్రచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. వేరే చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు తెలుగువారికి ఎలా దగ్గర కాగలిగాడు? అనే దాన్న కేస్ స్టడీగా తీసుకోమని మన హీరోలు, నిర్మాతలకు చెప్పినట్లు తెలిపారు. అలా తన పాన్ ఇండియా మూవీ బాహుబలికి సూర్య ప్రేరణగా నిలిచాడని గుర్తుచేశారు. సూర్య సినిమా చేయాలనుకున్నామని కానీ అది కుదర్లేదని స్పష్టం చేశారు. సూర్యతో చేసే ఛాన్స్ తాను మిస్ అయ్యాయని పేర్కొన్నారు.
https://twitter.com/AadhanTelugu/status/1854710204740309097
‘కథ చెప్పారు.. వర్కౌట్ కాలేదు’
తమిళ స్టార్ హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కార్తీ ఇంటర్యూ చేశారు. ఇందులో సూర్య (Suriya), కార్తీ (Karthi) కలిసి నటించడంపై గౌతమ్ మీనన్ ప్రశ్నించగా గతంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని కార్తీ పంచుకున్నాడు. 'నేను కార్తిక్ కలిసి నటిస్తాం. అందుకు తగ్గ స్క్రిప్ట్ రావాలి. గతంలో రాజమౌళి సర్ మాకు ఒక కథ వినిపించారు. అది బాగానే ఉంది కానీ ఆ సినిమా వర్కౌట్ కాలేదు' అని తెలిపాడు. ఇది విన్న సినీ లవర్స్ ఆశ్చర్యపోయారు. రాజమౌళి కథ చెబితే ఎలా వదులుకున్నారంటూ ప్రశ్నించారు. ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే సూర్య, కార్తీ రేంజ్ మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు.
https://twitter.com/adarshtp_offl/status/1835533193111392319
నవంబర్ 08 , 2024
Ananya Nagalla: అనన్య నాగళ్లకు సపోర్ట్‌గా సందీప్ రెడ్డి వంగా.. ఏమైందంటే?
తెలుగు ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘పొట్టేల్’ (Pottel). అక్టోబర్ 25న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ అనన్య బిజీ బిజీగా ఉంటోంది. రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అనన్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ ఎవరికైనా ఇచ్చారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్న టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై అనన్య మరోమారు మాట్లాడారు. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తమ టీమ్‌కు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
సందీప్‌పై అనన్య ప్రశంసలు
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రల్లో సాహిత్ మోత్కూరి రూపొందించిన సినిమా ‘పొట్టేల్’ (Pottel). మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడకకు 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నటి అనన్య మాట్లాడారు. తమ ‘పొట్టేల్’ ప్రమోషన్స్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకసారి కాదు రెండుసార్లు తమ మూవీ వేడుకల్లో పాల్గొన్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమా స్థాయికి తీసుకెళ్లడం కోసం మీరు చేస్తున్న సపోర్ట్ మాటల్లో చెప్పలేనని వ్యాఖ్యానించారు.
https://twitter.com/i/status/1848603026728358266
'రంగస్థలం’ తర్వాత పొట్టేలే: సందీప్ రెడ్డి
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిన్న కథను తెరకెక్కిస్తున్నానంటూ దర్శకుడు సాహిత్ ఓ రోజు తనకు చెప్పాడని సందీప్ అన్నారు. కథ వినగానే 'ఇది చిన్న కథ కాదు పెద్దది' అని అనిపించిందన్నారు. తాను ఇప్పటికే సినిమా చూశానని బాగా నచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఆ విధంగా ఉంటుందని అసలు ఊహించలేదన్నారు. మీకూ తప్పకుండా నచ్చుతుందని ఆడియన్స్‌ను ఉద్దేశించి చెప్పారు. 'రంగస్థలం' తర్వాత పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో చూసిన సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. చిన్న సినిమాలను ప్రతీ ఒక్కరు ప్రోత్సహించాలంటూ ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేశారు.
https://twitter.com/i/status/1848595831508652364
సంస్కారం ఉంటే ఆ ప్రశ్నలు వేయరు: అనన్య
‘పొట్టేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి అనన్య నాగళ్ల మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమిట్‌మెంట్‌పై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను మరోమారు లేవనెత్తుతూ చురకలు అంటించారు. ‘ఇంత డైరెక్ట్‌గా సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనుకున్నా. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కల. 5 సంవత్సరాల నుంచి దీని కోసం నేను ఇంట్లో ఫైట్ చేస్తున్నా. పొట్టేల్ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారని భావించా. కమిట్‌మెంట్ ప్రశ్న వేసి ఆనందం లేకుండా చేశారు. ఇప్పుడు నేను సక్సెస్ అయినా కమిట్‌మెంట్‌కు అంగీకరించాను కాబట్టే సక్సెస్ అయ్యానని అందరూ అనుకుంటారు. హీరోయిన్లు మేకప్ వేసుకుని ఎప్పుడూ నవ్వుతూనే ఉంటున్నంత మాత్రాన వారికి హృదయం ఉండదు, ఫ్యామిలీ ఉండదని కాదు. మమ్మల్నీ గౌరవించండి’ అని అనన్య కోరారు.
అసలేం జరిగిందంటే?
పొట్టేల్ మూవీకి సంబంధించి ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటి సంయుక్త మీనన్ ట్రైలర్ విడుదల చేసింది. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఓ మహిళా రిపోర్టర్ క్యాస్టింగ్ కౌచ్‌పై అనన్య నాగళ్లను ప్రశ్నించారు. 'ఒక హీరోయిన్‌కు కానీ, ఆర్టిస్ట్‌కు కానీ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్‌మెంట్ అడుగుతుంటారు. దీనికి మీరు ఏం చెబుతారు? మీరెప్పుడైనా ఫేస్ చేశారా?’ అని అడిగారు. అందుకు అనన్య బదులిస్తూ ‘కమిట్‌మెంట్ అడుగుతారని మీరు కచ్చితంగా ఎలా చెబుతున్నారు. అలాంటిదేమి లేదు’ అని చెప్పింది. ఆ తర్వాత రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు చేసే సైన్ అగ్రిమెంట్‌లోనే కమిట్‌మెంట్ ఉంటుందంట కదా. ఇండస్ట్రీ ఫ్రెండ్సే చెప్పారు' అని ప్రశ్నించింది. 'ఇది వందశాతం రాంగ్ అండి. సీరియస్‌గా నేనెప్పుడు ఫేస్ చేయలేదు. అసలు అలాంటిది ఉండదు' అని అనన్య పేర్కొంది.
https://twitter.com/tfpcin/status/1847262295266865248
రిపోర్టర్‌పై మల్లేశం నిర్మాత ఫైర్
అనన్య నాగళ్లను మహిళ రిపోర్టర్ ప్రశ్నించిన తీరుపై నెటిజన్లు మండిపతున్నారు. వీడియో వైరల్ అవుతుండటంతో మల్లేశం నిర్మాత వెంకట్ సిద్దారెడ్డి కూడా స్పందించారు. రిపోర్టర్ ప్రశ్న సరైంది కాదంటూ ఎక్స్ వేదికగా సుదీర్గ పోస్టు పెట్టాడు. మల్లేశం షూటింగ్ సందర్భంగా అనన్య భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలను సైతం పోస్టులో మెన్షన్ చేశారు. మహిళా రిపోర్టర్ అంత దారుణంగా అడగడం అస్సలు బాలేదని పేర్కొన్నారు. అది కూడా ఒక సినిమా ప్రమోషన్‌లో కంప్లీట్‌గా అనవసరమైన ప్రశ్న వేశారని మండిపడ్డారు. ఆమెకు అనన్య చక్కగా సమాధానం చెప్పిందని ప్రశంసించారు. ఈ పోస్టుకు అనన్య సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచినందుకు వెంకట్ సిద్ధా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
https://twitter.com/AnanyaNagalla/status/1847503625607680498
అక్టోబర్ 22 , 2024