• TFIDB EN
  • శక్తి
    UATelugu2h 50m
    పొలిటిషియన్‌ కూతురైన ఐశ్వర్య శక్తిని కలుస్తుంది. అతడి ప్రవర్తన మూలంగా మెుదట్లో శక్తని ద్వేషిస్తుంది. అయితే గ్యాంగ్‌స్టర్ల నుంచి తన ప్రాణం కాపాడటంతో ఆమె శక్తి ప్రేమలో పడుతుంది. ఇంతకి ఐశ్వర్యపై దాడి చేసింది ఎవరు? శక్తి గతం ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtube
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఎన్టీ రామారావు జూనియర్.
    శక్తి స్వరూప్ మరియు రుద్ర
    ఇలియానా డి క్రజ్
    గౌరీ
    మంజరి ఫడ్నిస్
    రుద్ర భార్య
    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
    విజయరాయ (మహదేవరాయ తండ్రి)
    ప్రభు
    కేంద్ర మంత్రి మహదేవరాయ (ఐశ్వర్య తండ్రి)
    జాకీ ష్రాఫ్
    జానకి వర్మ / జాకీ ది గ్రేట్
    వినోద్ కుమార్ అల్వా
    ప్రచండ
    పూజా బేడీ
    ఫక్తూని
    సోనూ సూద్
    ముక్తార్ (ఫక్తూని భర్త)
    విద్యుత్ జమ్వాల్
    వసీం అలీ (ఫక్తూని చిన్న కొడుకు)
    నాసర్
    ఋషి
    అలీ
    టామీ
    బ్రహ్మానందం
    అవతార్
    కృష్ణ భగవాన్
    దేవుడు / డేవిడ్
    సాయాజీ షిండే
    సాయాజీ షిండే
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    సుబ్బారావు
    వేణు మాధవ్
    సత్తి బాబు
    ఎంఎస్ నారాయణ
    హరిద్వార్ పూజారి
    మంజు భార్గవి
    మహదేవరాయ తల్లి
    చత్రపతి శేఖర్
    బసవ (రుద్ర సేవకుడు)
    సిబ్బంది
    మెహర్ రమేష్
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    మెహర్ రమేష్
    రచయిత
    యండమూరి వీరేంద్రనాథ్
    రచయిత
    JK భైరవి
    రచయిత
    మణి శర్మ
    సంగీతకారుడు
    సమీర్ రెడ్డి
    సినిమాటోగ్రాఫర్
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా!&nbsp;</strong>
    PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్‌ హీరో.. ప్రశాంత్‌ వర్మ గట్టిగానే ప్లాన్‌ చేశాడుగా!&nbsp;
    ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్‌ పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్‌ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్‌ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా&nbsp; PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశాడు.&nbsp; ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761 పోస్టర్‌లో ఇవి గమనించారా? ‘మ‌హా కాళీ’ పోస్టర్‌ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుద‌ల చేయ‌నున్నట్లు ప్రకటించారు. కాళికాదేవి శక్తితో.. మహాకాళి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్‌ పాత్ర ఏ హీరోయిన్‌ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423 ‘జై హనుమాన్‌’ కంటే ముందే.. తన సినిమాటిక్‌ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్‌’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్‌ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.&nbsp; మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ! బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్‌ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్‌ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్‌ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్‌ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్‌ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
    అక్టోబర్ 10 , 2024
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    Operation Valentine Review In Telugu: ఫైటర్‌ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులు దర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా సంగీతం: మిక్కీ జే మేయర్‌ సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం ఎడిటింగ్‌: నవీన్‌ నూలి సంభాషణలు: సాయి మాధవ్‌ బుర్రా నిర్మాత: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్ద విడుదల: 01-03-2024 వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine). మానుషి చిల్లర్‌ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక‌కాలంలో నిర్మాణం జ‌రుపుకొని ఇవాళ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది?  ఫైట‌ర్ పైల‌ట్ పాత్ర‌లో ఎలా చేశాడు? వరుణ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అర్జున్ రుద్ర‌దేవ్ అలియాస్ రుద్ర (వ‌రుణ్‌తేజ్‌) ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్ర‌న్ లీడ‌ర్‌. ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ (మానుషి చిల్ల‌ర్‌)తో రుద్ర ప్రేమ‌లో ఉంటాడు. ప్రాజెక్ట్ వ‌జ్ర కోసం న‌డుం క‌ట్టిన స‌మ‌యంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వరుణ్‌ తేజ్‌ (Operation Valentine Review in telugu) కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్ర‌తిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్ల‌ర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప‌రిమితంగానే క‌నిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు. డైరెక్షన్ ఎలా ఉందంటే భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్ర‌తిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్ర‌తిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయ‌కా నాయిక‌ల మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌లోనే గాఢ‌త చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్‌ అని చెప్పవచ్చు. ఇక క‌థ‌నంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ‘ఫైట‌ర్’ క‌థ‌కి ఆపరేషన్‌ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్‌ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్న‌తంగా ఉన్నాయి. బ‌డ్జెట్ ప‌రంగా ప‌రిమితులున్నా నాణ్య‌మైన విజువ‌ల్స్‌తో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌తేజ్‌ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ క‌థ‌నంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ Telugu.yousay.tv Rating : 3/5 Click Here For English Review https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
    మార్చి 01 , 2024
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    Animal Movie Review: యాక్షన్ సీన్లలో రణబీర్‌ ఉగ్రరూపం.. ‘యానిమల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా&nbsp; విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023&nbsp;&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటించారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ భారీగా హైప్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని అయిన ఆయనకు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) కుమారుడు. విజయ్ దూకుడు మనస్తత్వం కలవాడు. అయితే తండ్రి అంటే ప్రాణం. కుమారుడి ప్రవర్తన నచ్చక బల్బీర్‌ అతడ్ని బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత ఓ గొడవ వల్ల తండ్రి కొడుకుల మధ్య మరింత దూరం పెరుగుంది. ఈ క్రమంలోనే విజయ్ అమెరికా వెళ్లిపోతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత భారత్‌కు వస్తాడు. తండ్రిపై అటాక్ చేసిన వాళ్ళ అంతు చూస్తానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది కథ. ఎవరెలా చేశారంటే తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా నటించే అతి కొద్ది మంది హీరోలలో రణబీర్ కపూర్‌ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు అతడు ప్రాణం పోశాడు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్ ఇలా వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా అందులో ఒదిగిపోయాడు. అటు గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేసింది. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్, పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులు అదరహో అనిపిస్తాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్‌తో ఆకట్టుకుంది. అటు రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ అదరగొట్టాడు. ఇక రణ్‌బీర్ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు బాబీ డియోల్. ఆయన విలన్‌గా కళ్లతోనే భయపెట్టేశారు. రణబీర్ - బాబీ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాతో మరోమారు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. సోదరిని ర్యాగింగ్‌ చేశారన్న కోపంతో&nbsp; హీరో గన్‌ పట్టుకొని ఆమె కాలేజీకి వెళ్లే సీన్‌ ఆయన మార్క్‌ యాక్షన్‌కు ఉదాహరణ. ఇలాంటి కొత్త తరహా వైలెన్స్‌ యాక్షన్ సీన్స్‌ సినిమాలో చాలానే ఉన్నాయి. కథలో కొత్త దనం లేకపోయినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలో డైరెక్టర్‌ ఎటువంటి మెుహమాటాలకు పోలేదు. ముఖ్యంగా రణబీర్‌ - బాబీ డియోల్‌ మధ్య ఫైట్‌ సీన్స్‌ సందీప్‌ వంగా దర్శకత్వం ప్రతిభకు అద్దం పడతాయి. అయితే నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని సీన్లు మరి సాగదీసినట్లు అనిపిస్తుంది. దీని వల్ల ప్రేక్షకులు అక్కడక్కడ బోర్‌ ఫీలవుతారు. టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.&nbsp; హర్షవర్ధన్ రామేశ్వర్ తన BGMతో సినిమాకు ప్రాణం పోశారు. హీరోయిజాన్ని తన BGMతో చాలా బాగా ఎలివేట్ చేశారు. కెమెరా వర్క్ టాప్ క్లాస్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.&nbsp; డైలాగ్స్‌లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది.&nbsp; ప్లస్‌ పాయింట్‌ రణ్‌బీర్ నటనయాక్షన్‌ సీన్లునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్ నిడివిసాగదీత సీన్లు రేటింగ్‌ : 4/5
    డిసెంబర్ 01 , 2023
    Happy Birthday Kamal Hassan: నవరసాల నట వైవిధ్యం కమల్ హాసన్
    Happy Birthday Kamal Hassan: నవరసాల నట వైవిధ్యం కమల్ హాసన్
    ]సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ నట విశ్వరూపమే ప్రదర్శించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో అతను ప్రదర్శించిన శాంతి రసం ఎంతో అద్భుతం. ఎంతో శక్తివంతమైన క్లైమాక్స్ సన్నివేశాల్లో ఇది ఒకటిశాంతి- సాగర సంగమం (1983)
    ఫిబ్రవరి 11 , 2023
    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న  “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్  హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.  ‘హనుమాన్‌’గా&nbsp; తొలుత యష్ ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్‌' ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్‌ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది.&nbsp; దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా? రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్‌ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
    అక్టోబర్ 30 , 2024
    <strong>Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి</strong>
    Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి
    దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా "తొమ్మిది రాత్రులు" అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రి జరుగుతుంది, ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది శార్దీయ నవరాత్రి. ఇది హిందూ చంద్ర కాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వస్తుంది. ఈ సంవత్సరం, శార్దీయ నవరాత్రి అక్టోబర్ 3న ప్రారంభమవుతూ, అక్టోబర్ 12న దసరాతో ఈ ఉత్సవం ముగుస్తుంది. శార్దీయ నవరాత్రి అనేది ఆధ్యాత్మిక దార్శనికత, ఉపవాసం మరియు ప్రార్థన కాలం. ఈ తొమ్మిది రాత్రుల సమయంలో, దుర్గాదేవి దైవ శక్తి పరాకాష్టకు చేరుకుంటుందని హిందువులు నమ్ముతారు. భక్తులు ఆమె ఆశీర్వాదాలను పొందెందుకు పూజిస్తారు. ఈ క్రమంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు, అవి ఆమె శక్తి,&nbsp; దయ రూపాలను ప్రతిబింబిస్తాయి. శార్దీయ నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి రోజుకు ఒక నిర్దిష్ట రంగు చీరతో అమ్మవారిని అలంకరించి భక్తులు పూజిస్తారు. ఈ రంగులు దేవి గుణాలు, లక్షణాలను ప్రతిబింబిస్తుంటాయి. నవరాత్రి రోజుల్లో భక్తులు ఈ రంగుల్లో దుస్తులు లేదా ఆభరణాలు ధరించి దేవిని స్మరించి, ఆమె ఆశీర్వాదాలను కోరుకుంటారు.&nbsp; మొదటిరోజు- పసుపు&nbsp; నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవిని పూజించే రోజు. ఈ రోజు పసువు దుస్తులు ధరించడం ఆనవాయితీగా ఉంటుంది.&nbsp; మరి ఈరోజున భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజించడంతో పాటు .. కాస్త ట్రెండీగా కనిపించేందుకు ఇక్కడ మన టాలీవుడ్ హీరోయిన్లు ధరించిన పసుపు రంగు డ్రెస్సింగ్ స్టైల్స్‌ను మీకోసం అందిస్తున్నాం. ఓ లుక్ వేయండి. దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ .. ఈ ట్రెడిషనల్ పసుపు రంగు చీరలో ఎంత అందంగా ఉందో చూడండి. సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్‌తో ఎంబ్రాయిడరీ లేస్‌తో ప్రీమియం మాస్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై వచ్చిన అందమైన డిజైనర్ చీర ఇది. ఈ చీర మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. కృతి శెట్టి లాగా మీరు కూడా ఎల్లో హాఫ్‌ శారీలో అందరి మనసులు దోచుకోవచ్చు.&nbsp; పసుపు రంగుకు మ్యాచ్‌ అయ్యేలా గ్రీన్ బ్లౌస్ ధరిస్తే.. మీ అందం రెట్టింపు అవడం ఖాయం. &nbsp;లైగర్ బ్యూటీ అనన్య పాండే మాదిరి మీరు కూడా&nbsp; లెహెంగాలో అందంగా కనిపించవచ్చు. ఫ్లోరల్ ముకాయిష్ డిజైన్‌లో మీ అందానికి మెరుగులు దిద్దుకోండి. పూజా హెగ్డే లా, మీరు పసుపు రంగు లెహెంగాలో మెరసిపోవచ్చు.&nbsp; అందంగా సంప్రదాయ కుందన్ ఆభరణాలతో&nbsp; అలంకరించుకోండి.&nbsp; మీ సొగసు మరింత రెట్టింపు అవుతుంది. View this post on Instagram A post shared by Tree-Shul Media Solutions (@treeshulmediasolutions) ప్రగ్యా జైస్వాల్ సూర్యకాంతి వెలుగులో రెండు రంగుల ఎంబ్రాయిడరీ క్రాప్ టాప్,&nbsp; ఆకర్షనీయమైన బ్లౌజ్ డిజైన్‌లో మెరిసిపోతుంది. నవరాత్రి వేళ మీరూ ఈవిధంగా కనిపించాలనుకుంటున్నారా. ఇది మంచి ఛాయిస్ రాశీ ఖన్నా లా, మీరు సిల్క్ డ్రెస్‌లో అట్రాక్ట్ లుక్‌ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ టైప్ బెస్ట్ ఛాయిస్.&nbsp; దీనికి మ్యాచింగ్‌గా లాంగ్ ఈయరింగ్స్, బంగారు గాజులు, బర్గండి లిప్ స్టిక్‌తో మీ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. రకుల్ సింగ్ మాదిరి మోడ్రన్ స్టైల్‌లో అనార్కలి, స్టేట్‌మెంట్ గోల్డ్ నెక్లెస్‌తో కనిపించాలనుకుంటున్నారా… ఈ పండుగ వేళ ఈ డ్రెస్‌ను కచ్చితంగా దీనిని ట్రై చేయండి. షెహ్నాజ్ గిల్ పసుపు రంగు డ్రెస్‌లో తన అందాన్ని మరింత వికసింప జేసింది. ఈ డ్రెస్‌తో మీరు కూడా అలా కనిపించవచ్చు.
    అక్టోబర్ 04 , 2024
    <strong>The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?</strong>
    The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?
    నటీనటులు: నందు, తేజస్వి మదివాడ, ప్రియా ఆనంద్‌, అశుతోష్‌ రానా, పావని రెడ్డి, కేశవ్‌ దీపక్, సుధా, భానుచందర్‌ తదితరులు డైరెక్టర్‌: అనిష్‌ కురువిల్లా సినిమాటోగ్రఫీ : నవీన్‌ యాదవ్‌ సంగీతం : శక్తికాంత్‌ కార్తిక్‌ ఎడిటింగ్‌: ఉమైర్‌ హాసన్‌, ఫయాజ్‌ రాయ్‌ నిర్మాతలు: గోపిచంద్‌ ఆచంట, రామ్ ఆచంట ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్‌ అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island Review). నటుడు అనిష్‌ కురువిల్లా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు రూ.24 వేల కోట్లు. చనిపోవడానికి ముందే ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని విశ్వక్‌ వీలునామా రాస్తాడు. అయితే ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్‌లో వారం రోజులపాటు ఉండాలని షరతు విధిస్తాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్‌ సేన్‌ కుటుంబ సభ్యులు మోక్ష ఐలాండ్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరిగా చనిపోవడం జరుగుతుంది. అసలు మోక్ష ఐలాండ్‌ మిస్టరీ ఏంటి? అక్కడ వారం రోజులు ఉండాలని విశ్వక్ ఎందుకు నిబంధన విధించాడు? వెళ్లిన వారు విశ్వక్‌ కుటుంబ సభ్యులేనా? కాదా? విశ్వక్‌కు మోక్ష ఐలాండ్‌కు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ వెబ్‌సిరీస్‌లో (The Mystery of Moksha Island Review) చాలా మంది యాక్ట‌ర్స్ ఉన్నారు. వారిలో ప్రియా ఆనంద్‌, నందు, అశుతోష్‌ రానా ఆకట్టుకుంటాయి. ఐలాండ్ మిస్ట‌రీ ఛేదించేందుకు తాప‌త్ర‌య‌ప‌డే యువ‌కుడిగా నందు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. క‌న్నింగ్ సైంటిస్ట్ పాత్ర‌కు అశుతోష్‌ రానా వంద‌శాతం న్యాయం చేశాడు. తేజ‌స్వి మ‌దివాడ, అక్ష‌ర గౌడ నటనతో కంటే తమ గ్లామ‌ర్‌తోనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల కుమారుడు రోషన్‌ కనకాల గే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. భానుచంద‌ర్‌, సోనియా అగ‌ర్వాల్‌, అజ‌య్ క‌తుర్వార్‌, స‌త్య‌కృష్ణతో పాటు మిగిలిన వారు తమ నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అనిష్‌ కురువిల్లా ఐలాండ్‌ నేపథ్యంలో రాసుకున్న మిస్టరీ స్టోరీ బాగుంది. మాస్‌, క్లాస్ ఇలా విభిన్న నేప‌థ్యాల‌తో సిరీస్‌లోని ప్రతీ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్ వెనుక ఓ తెలియ‌ని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని ఎవరు హ‌త్య‌లు చేస్తున్నారు? ఒక‌రిని మ‌రికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వ‌ర‌కు ఐలాండ్ గురించి అనేక ప్ర‌శ్న‌లు రేకెత్తిస్తూ వీక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులను ఒక్కొక్కొటిగా విప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే లెక్కకు మించి పాత్రలు స్క్రీన్‌పై కనిపించడం గందరగోళానికి గురిచేస్తుంది. రొమాంటిక్‌, బోల్డ్‌ సీన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. క్లైమాక్స్‌ అంత సంతృప్తిగా అనిపించదు. అయితే థ్రిల్లర్‌ జానర్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సిరీస్‌ తప్పకుండా నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే నవీన్‌ యాదవ్‌ సినిమాటోగ్రఫీ వర్క్‌ బాగుంది. బీచ్‌ ఎపిసోడ్స్‌ను బాగా చూపించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా మంచి పనితీరు కనబరిచింది. ల్యాబ్‌ సెటప్‌ సహజంగా అనిపిస్తుంది. శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనఆసక్తికర కథనంట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ బోల్డ్‌ కంటెంట్‌లెక్కకు మించిన పాత్రలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 21 , 2024
    Brinda Web Series Review: పోలీసు ఆఫీసర్‌గా త్రిష తొలి వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుందా?
    Brinda Web Series Review: పోలీసు ఆఫీసర్‌గా త్రిష తొలి వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుందా?
    నటీనటులు: త్రిష, ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు రచన, దర్శకత్వం: సూర్య మనోజ్‌ వంగల సినిమాటోగ్రఫీ : దినేష్‌ కె. బాబు సంగీతం : శక్తి కాంత్‌ కార్తిక్‌ ఎడిటర్‌ : అన్వర్‌ అలీ నిర్మాత : కొల్ల ఆశిష్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 ఓటీటీ వేదిక : సోనీలివ్‌ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ రాణించిన త్రిష (Trisha) ఓటీటీలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలిసారి బృంద (Brinda) అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సూర్య మనోజ్‌ వంగల దర్శకత్వం వహించారు. ఇందులో త్రిష పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బృంద సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనిలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బృంద (Trisha) ఓ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై. మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. ఈ క్రమంలో ఓ రోజు స్థానిక చెరువులో శవం బయటపడుతుంది. హంతకుడు దానికి గుండు కొట్టి, గుండెల్లో 16 సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టంలో తేలుతుంది. అయితే ఉన్నతాధికారి ఈ కేసును క్లోజ్‌ చేయమని చెప్పినా బృంద ఇన్వెస్టిగేషన్‌ మెుదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు సంచలన నిజం తెలుస్తుంది. ఆ తరహాలో మొత్తం 16 మంది అతి దారుణంగా హత్యకు గురైనట్లు ఆమె కనిపెడుతుంది. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి అందులో బృందని భాగస్వామిని చేస్తారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడ్ని బృందా టీమ్ ఎలా పట్టుకుంది? మూఢ నమ్మకాలకు ఈ హత్యలకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే పోలీసు ఆఫీసర్‌ బృందాగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆత్మగౌరవం కలిగిన మహిళగా ఆమె నటన మెప్పిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టింది. మరోవైపు విలన్‌గా ఆనందసామి మెప్పించాడు. అమాయకత్వం, క్రూరత్వం కలగలుపుతూ ఆనందసామి చేసిన నటన సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇంద్రజీత్‌, రవీంద్ర విజయ్‌ తమ పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులు కూడా తమ యాక్టింగ్‌తో పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కథ పరంగా చూస్తే రొటిన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ థీమ్‌తోనే దర్శకుడు సూర్య మనోజ్‌ వంగల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆరంభ సన్నివేశం నుంచి ఆసక్తిరేకెత్తించేలా స్క్రీన్‌ప్లేను నడిపి ఆకట్టుకున్నారు. భూత, వర్తమాన కాలాల్లో జరిగే సంఘటనలను ఒకదానితో ఒకటి ముడివేస్తూ చెప్పిన తీరు బాగుంది. ఇక హంతకుడిని కనిపెట్టే క్రమంలో బృందా టీమ్‌ ఒక్కో క్లూను కనిపెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే డిటెయిల్ ఇన్‌వెస్టిగేషన్‌ పేరుతో సిరీస్‌ను మరీ పొడిగించినట్లు అనిపిస్తుంది. ఆధారాలు సేక‌రించే సీన్స్ కొన్ని లాజిక్‌ల‌కు దూరంగా సాగుతాయి. ఆమె చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్స్ చిన్న చిన్న క్లూలు కూడా క‌నిపెట్ట‌లేనివారిగా చూపించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోదు. త్రిష చెల్లెలి ఎపిసోడ్ క‌థ‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది. మెుత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సీరిస్ సాగగా కొన్ని ఎపిసోడ్స్‌ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్‌గా మెుదటి నుంచి చివరి వరకూ కథను ఎంగేజింగ్‌గా నడపడించి దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనాలుత్రిష నటనఇన్‌వెస్టిగేషన్‌ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ నిడివిసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    Operation Valentine Box Office Collection Day 1: వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ కలెక్షన్లు... కారణం ఇదేనా?
    మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం శుక్రవారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లపై సర్వత్రా క్రేజీ బజ్ ఏర్పడింది. ఈ చిత్రానికి పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో ఎంత కలెక్ట్ చేసిందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన కొన్న ఉద్రిక్త సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో&nbsp; డైరెక్టర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జ‌రిపిన పుల్వామా దాడులు మొద‌లుకొని, దానికి ప్రతిగా భార‌త వైమానిక ద‌ళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్&nbsp; వ‌ర‌కూ ప‌లు సంఘ‌ట‌న‌లు ఇందులో ప్రతిబింబించాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్‌, క్లైమాక్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. కలెక్షన్లు ఇలా… ప్రముఖ వెబ్‌ సైట్ సాక్‌నిక్ ముందస్తు అంచనాల ప్రకారం ఈ చిత్రం తొలి రోజు రూ.1.25కోట్లు కలెక్ట్ చేసినట్లు కథనం(Operation Valentine Box Office Collection) రాసింది. అయితే తొలి రోజు లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని, ఈ కలెక్షన్లే పూర్తి విలువ కాదని పేర్కొంది.&nbsp; మరో బాలీవుడ్ వెబ్‌సైట్ కోయిమోయి ఆపరేష్ వాలెంటైన్ చిత్రం రూ.3కోట్లు-రూ.4 కోట్ల వరకు వసూలు చేసినట్లు వెల్లడించింది. అయితే వరుణ్ తేజ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు చాలా తక్కువ అని స్పష్టం చేసింది. గతంలో వచ్చిన F3 సినిమా తొలి రోజు రూ.15కోట్ల వరకు వసూలు చేసిందని గుర్తు చేసింది.&nbsp; ఇదేనా కారణం? అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతుండటం, పోటీపరీక్షలకు నోటిఫికెషన్లు జారీ కావడం వంటి అంశాలు ఈ చిత్రం వసూళ్ల ప్రభావం పడింది. పాజిటివ్ టాక్ ఉండటంతో వీకెండ్స్‌లో ఈ చిత్రం కలెక్షన్లు(Operation Valentine Box Office Collection) భారీగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ రివ్యూస్ మరోవైపు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా ఆ పాత్రలో జీవించాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచాడు. వరుణ్ సరసన నటించిన మానుషి చిల్లర్ (Manushi Chhillar)&nbsp; సైతం తన పాత్రకు న్యాయం చేసింది. వీళ్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయి. నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ పాత్రలు కూడా సినిమాలో మెప్పిస్తాయి. సినిమా సాంకేతికంగాను ఉన్నతంగా ఉంది. పోరాట సన్నివేశాలు కోరుకునేవారికి ఈ చిత్రం మంచి విజువల్ ఫీస్ట్‌గా ప్రేక్షకులు చెబుతున్నారు. అప్పుడే &nbsp;ఓటీటీలోకి! అటు 'ఆపరేషన్ వాలంటైన్' సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అయితే నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఏప్రిల్ తొలి వారంలో ఈ చిత్రం ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. థియేటర్‌ వెర్షన్‌లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైలన ఈ చిత్రం… ఓటీటీల్లో మాత్రం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. https://telugu.yousay.tv/operation-valentine-review-in-telugu-varun-tej-who-is-popular-as-a-fighter-pilot-is-the-movie-a-hit-free.html
    మార్చి 02 , 2024
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    Top 15 Comic Con Characters In Telugu: హాలీవుడ్‌కే కాదు.. మనకూ సూపర్‌ హీరోలు ఉన్నారు.. ఓ లుక్కేయండి!
    సూపర్‌ హీరోలను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో వారు చూపించే తెగువ, ధైర్య సాహసాలు వీక్షకులను ముఖ్యంగా చిన్న పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. రొటీన్‌ సినిమాల్లో హీరోల్లా కాకుండా వారు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటారు. కొండను సైతం పిండి చేయగల సామర్థ్యం వారి సొంతం. అటువంటి సూపర్‌ హీరోలందర్నీ ఏటా ఒక చోటకు చేరుస్తూ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఈవెంట్‌ ‘కామిక్‌ కాన్‌’ (Comic Con). అవెంజెర్స్‌, స్పైడర్‌మ్యాన్‌, అవతార్‌, సూపర్‌ మ్యాన్‌ వంటి పాత్రలు ఆ ఈవెంట్‌లో తళుక్కుమంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్‌ హీరోల అభిమానులు అక్కడ ప్రత్యక్షమై తమకు నచ్చిన హీరో వేషధారణను ధరిస్తాయి. అయితే తెలుగులోనూ కామిక్‌ కాన్‌ స్థాయి హీరో పాత్రలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (Hanuman) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్‌’ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తొలి ఇండియన్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జ పాత్రను ఎలివేట్‌ చేశాడు. హనుమంతుడి పవర్స్‌ను పొందిన హీరో.. ఈ సినిమాలో చాలా శక్తివంతంగా మారతాడు. భారీ కొండరాయిని సైతం అలవోకగా చేతితో పైకెత్తుతాడు. తమ ఊరికి హాని తలపెట్టాలని చూసిన విలన్లకు తగి బుద్ది చెబుతాడు. అయితే హనుమాన్‌ గెటప్‌లోకి మీరూ సింపుల్‌గా మారవచ్చు. లాంగ్‌ హెయిర్‌ చేతిలో గదతో పాటు హీరో ధరించిన టీషర్ట్‌ వేసుకుంటే మీరు హనుమాన్‌లాగా మారిపోతారు. భీమ్ (ఆర్ఆర్‌ఆర్‌) రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రంలో తారక్‌ (Jr NTR) భీమ్‌ పాత్రలో కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో పెద్ద పులిని సైతం ఎదుర్కొని తన బలం ఎంటో నిరూపిస్తాడు. విరామానికి ముందు వచ్చే సీన్‌లో అడవి జంతువులతో కలిసి బ్రిటిష్‌ వారిపై పోరాడే సీన్‌ చూసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. ఇక భీమ్‌లా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా?. తారక్‌లా కర్లీ హెయిర్‌స్టైల్‌, చేతిలో బల్లెం పట్టుకొని ఆ పాత్రకు తగ్గ డ్రెస్‌ వేస్తే మీరూ భీమ్‌ లాగా కనిపించవచ్చు. బాహుబలి (Bahubali) ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వచ్చిన బాహుబలి (Bahubali) చిత్రంలో ప్రభాస్‌ ఎంతో శక్తివంతంగా కనిపిస్తాడు. మదగజం లాంటి ఏనుగును సైతం కంట్రోల్‌ చేయగల సామర్థ్యం అతడికి ఉంటుంది. కండలు తిరిగిన దేహంతో వందలాది మంది శత్రుసైనికులను బాహుబలి తన ఖడ్గంతో&nbsp; అంతం చేస్తాడు. అటువంటి&nbsp; బాహుబలిలాగా మీరు కనిపించాలంటే ఈ కింద ఫొటోలో ఉన్న గెటప్‌లోకి వెంటనే మారిపోండి.&nbsp; భల్లాల దేవ (Bhallala Deva) ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడైన భల్లాల దేవ పాత్రలో రానా కనిపించాడు. ఇంట్రడక్షన్‌ సీన్‌లో భారీ దున్నపోతుపై భల్లాల పై చేయి సాధించడాన్ని బట్టి అతడు ఎంత పవర్‌ఫుల్‌లో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో వచ్చిన శక్తివంతమైన విలన్ పాత్రలో భల్లాల దేవ కచ్చితంగా టాప్‌-3లో ఉంటాడు. భల్లాలలాగా మిమ్మల్ని మీరు చూసుకోవాలని ఉందా? అయితే గదను పోలిన ఆయుధాన్ని పట్టుకొని.. యుద్ధానికి వెళ్లే సూట్‌ ధరిస్తే సరి. కాకపోతే ముఖంలో కాస్త క్రూరత్వం ఉండేలా ఎక్స్‌ప్రెషన్ పెట్టాల్సి ఉంటుంది.&nbsp; కట్టప్ప (Kattappa) ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప పాత్రను కూడా దర్శకుడు రాజమౌళి ఎంతో దృఢంగా తీర్చిదిద్దాడు. విశ్వాసానికి నిలువెత్తు రూపంగా ఆ పాత్రను చూపించాడు. ‘బాహుబలి 2’ క్లైమాక్స్‌లో ప్రభాస్‌ సాయం చేస్తూ విలన్లపై కట్టప్ప దండెత్తే తీరు అతడి ధైర్య సాహసాలకు అద్దం పడుతుంది. బాహుబలి తొలి భాగం రిలీజ్‌ తర్వాత కట్టప్ప పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం గమనార్హం. అయితే కట్టప్పలా కనిపించడం చాలా సింపుల్‌. తలపై గుండు.. నెరిసిన గడ్డంతో కట్టప్ప తరహా డ్రెస్‌ వేస్తే మీరు అలాాగే మారిపోతారు.&nbsp; కాలకేయ (Kalakeya) కొన్ని సినిమాల్లో హీరో పాత్రకు సమానంగా విలన్‌ రోల్‌ హైలెట్‌ అవుతుంటాయి. ఈ కోవకు చెందిందే ‘బాహుబలి’ సినిమాలోని ‘కాలకేయ పాత్ర’. చూస్తేనే భయం వేసేలా ఆ పాత్రను రాజమౌళి రూపొందించారు. నటుడు ప్రభాకర్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. ముఖ్యంగా కిలికి భాషలో ఆకట్టుకున్నాడు. ఈ వేషధారణను ధరించడం అంత తెలిక కాదు. నిపుణులు వద్దకు వెళ్తే వారు సులభంగా వేయగలరు. అపరిచితుడు (Aparichithudu) ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగల అతికొద్ది మంది హీరోల్లో తమిళ నటుడు విక్రమ్‌ ఒకరు. అతడు హీరోగా చేసిన ‘అపరిచితుడు’ చిత్రం ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇందులో విక్రమ్‌ చేసిన మూడు పాత్రల్లో కెల్లా అపరిచితుడు ఎంతో అగ్రెసివ్‌. తప్పు చేసిన వారిని దండిస్తూ చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌ నిపుణులతో విక్రమ్‌ చేసే ఫైట్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అపరిచితుడిలా మీరు కనిపించాలంటే ముందుగా బ్లాక్‌ డ్రెస్‌ ధరించి లాంగ్‌ హెయిర్‌ను ముఖం మీదకు వదిలేయాలి. ఆ తర్వాత సగం ముఖం వరకూ పుర్రె స్టిక్కర్‌ను ధరిస్తే సరిపోతుంది.&nbsp; రోబో (Robo) భారతీయ సినిమా చరిత్రలో ‘రోబో’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా డైరెక్టర్ శంకర్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో చిట్టి అనే రోబో పాత్రలో&nbsp; రజనీకాంత్‌ సూపర్‌ హీరోలా కనిపిస్తాడు. అసాధ్యం అనుకున్న పనులను ఎంతో తెలిగ్గా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తాడు. అయితే రోబోలా కనిపించాలని మీరు కోరుకుంటే వెంటనే రోబో సూట్‌ను ఆర్డర్‌ పెట్టేయండి. చిట్టిలా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.&nbsp; పక్షిరాజా (Pakshi Raja) ‘రోబో 2’ చిత్రంలో ప్రతినాయకుడు పక్షిరాజా పాత్ర హాలీవుడ్‌ సినిమాల్లో విలన్లను తలపిస్తుంది. ప్రకృతిని కంట్రోల్‌ చేయగల పవర్‌ను పొంది అతడు చాలా శక్తివంతంగా కనిపిస్తాడు. కథానాయకుడు రజనీకాంత్‌కు సవాళ్లు విసురుతూ ఇబ్బందులకు గురిచేస్తాడు. పక్షి రాజాలా మారాలనుకుంటే కాస్త శ్రమ పడాల్సిందే. కాబట్టి నిపుణుల వద్దకు వెళ్తే వారు మిమ్మల్ని అచ్చం అలాగే తయారు చేస్తారు.&nbsp; అరుంధతి (Arundhati) తెలుగులో పవర్‌ఫుల్‌ ఫీమేల్‌ పాత్ర అనగానే ముందుగా అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమానే అందరికీ గుర్తుకువస్తుంది. దుర్మార్గుడైన పశుపతిని ఎదిరించే వీర వనితగా ఇందులో అరుంధతి కనిపిస్తుంది. అరుంధతి లాగా మీరు పవర్‌ఫుల్‌గా కనిపించాలని అనుకుంటే ముందుగా ముఖాన గుడ్రపు బొట్టు ధరించాలి. శిగను మూడేసి అనుష్క కట్టిన స్టైల్‌లో ఆభరణాలు, శారీ కడితే మీరు అరుంధతి అయిపోతారు.&nbsp; పశుపతి (Pasupathi) తెలుగు సినీ చరిత్రలో ‘పశుపతి’ లాంటి విలన్‌ను చూసి ఉండరు. అరుంధతి చేతిలో చనిపోయినా అతడు పగ తీరని పిశాచిలా మళ్లీ తిరిగి వస్తాడు. అరుంధతి రూపంలో ఉన్న ఆమె వారసురాలని ఇబ్బందులకు గురి చేస్తాడు. పశుపతి లాగా కనిపంచాలంటే మీరు అఘోరాలాగా మారాల్సి ఉంటుంది.&nbsp; ఆదిత్య 369 (Aditya 369) బాలయ్య హీరోగా చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఇందులో బాలయ్య ఓ టైమ్‌ మిషన్‌ ద్వారా శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి వెళ్తాడు. అలాగే ఫ్యూచర్‌లోకి వెళ్లి అప్పటి పరిస్థితులు ఎలా ఉండనున్నాయో కళ్లకు కడతాడు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణలాగా మీరు మారిపోవాలని అనుకుంటే అతడు ధరించిన రోబోటిక్‌ జాకెట్‌ను వేయండి.&nbsp; సైరా నరసింహా రెడ్డి (Sye Raa Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం.. నిజమైన యోధుడి జీవిత కథ ఆధారంగా రూపొందింది. బ్రిటిష్‌ వారి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి.. ఆంగ్లేయులకు సింహస్వప్నంలా సైరా మారతారు ప్రజల కోసం చివరికీ ప్రాణ త్యాగం చేసి అసలైన సూపర్‌ హీరోగా నిలుస్తారు. సైరా నరసింహా రెడ్డి మీరూ కనిపించాలంటే సేమ్‌ చిరంజీవిలాగా లాంగ్‌ హెయిర్‌, కోరమీసంతో వీపున కత్తి ధరించండి.&nbsp; బింబిసార (Bimbisara) 5వ శతాబ్దానికి చెందిన మగద రాజ్యాధిపతి బింబిసారుడు కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించాడు. శత్రువులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేసే శూరుడిలా బింబిసారుడు కనిపిస్తాడు. అతడి మీరూ కనిపించాలంటే లాంగ్‌ హెయిర్‌ గడ్డంతో పాటు చేతిలో ఖడ్గాన్ని ధరించాలి. కళ్యాణ్‌ రామ్‌ తరహాలో వజ్రాహారాలు, రాజ దుస్తులను ధరిస్తే బింబిసార గెటప్‌లోకి మారిపోతారు.&nbsp; అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) బ్రిటిష్‌ వారికి ముచ్చెమటలు పట్టించిన స్వాతంత్ర సమరయోధుల్లో ‘అల్లూరి సీతారామరాజు’ ఒకరు. సూపర్‌ కృష్ణ ఆయన జీవిత కథను సినిమాగా తీశారు. ఆగస్టు 15 సందర్భంగా ఇప్పటికీ చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణను ధరించి ఆయన్ను గుర్తు చేస్తుంటారు. ఇలా అల్లూరి సీతారామరాజు గెటప్‌లో కనిపించడం చాలా సింపుల్‌. చొక్క లేకుండా శరీరానికి కాషాయ రంగు వస్తాన్ని చుట్టుకొని.. వీపున బాణాలు.. చేతిలో విల్లు పట్టుకుంటే ఆ మహాత్ముడిలా కనిపించవచ్చు.&nbsp;
    ఫిబ్రవరి 29 , 2024
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    These Villains Actually Right: ఈ తెలుగు సినిమాల్లో విలన్లు మంచోళ్లే.. కానీ!
    సాధారణంగా ప్రతీ సినిమాలోనూ విలన్లను దుర్మార్గులుగా చూపిస్తుంటారు. ప్రజలను పట్టిపీడిస్తున్నట్లు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు వారి పాత్రలను డిజైన్‌ చేస్తుంటారు. అప్పుడు హీరో అతడి అన్యాయాలను ఎదిరించి విలన్‌ను అంతం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. అయితే కొన్ని సినిమాల్లో విలన్లు అలా కాదు. వారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడంతో వారు ప్రతినాయకులుగా మారాల్సి వస్తుంది. తెలుగులో వచ్చిన అలాంటి విలన్‌ పాత్రలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; రోబో 2.0 - పక్షి రాజు రజనీకాంత్‌ హీరోగా డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో (Robo 2.0) పక్షిరాజా అనే విలన్‌ పాత్రలో అక్షయ్‌ కుమార్ నటించాడు. విలన్‌కు పక్షులంటే అమితమైన ఇష్టం. సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ వల్ల పక్షులు చనిపోతున్నాయని వాటి వాడకాన్ని మానుకోవాలని ప్రచారం చేస్తుంటాడు. ఎవరు పట్టించుకోకపోడవంతో పెద్ద సంఖ్యలో పక్షులు చనిపోతుంటాయి. ఆ బాధతో సెల్ టవర్‌కు ఊరేసుకొని భయంకర శక్తిగా మారతాడు విలన్‌. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. రోబోలా వచ్చిన రజనీకాంత్‌ అతడ్ని అడ్డుకొని అంతం చేస్తాడు. ప్రజలను కాపాడతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=5OkypaWGYAo నేను లోకల్‌ - నవీన్‌ చంద్ర హీరో నాని - కీర్తి సురేష్‌ జంటగా నటించిన ‘నేను లోకల్‌’ (Nenu Local) చిత్రంలో నవీన్‌ చంద్ర (Naveen Chandra) విలన్‌ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు. కథలోకి వెళ్తే నవీన్‌ హీరో కంటే ముందే హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. ఆమె తండ్రి విధించిన షరతుతో పోలీసు ఆఫీసర్‌గా మారి తిరిగి వస్తాడు. ఈ గ్యాప్‌లో హీరో-హీరోయిన్‌ ప్రేమలో పడతారు. హీరోపై కోపంతో హీరోయిన్‌ తండ్రి నవీన్‌ చంద్రతో ఆమె పెళ్లిని నిర్ణయిస్తాడు. నానిని అడ్డుకునేందుకు నవీన్ విఫలయత్నం చేయగా చివరికీ హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=rYcZLAgPLps ‘వి’ - నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘వి’ (V) చిత్రంలో హీరో నాని ప్రతి నాయకుడి పాత్ర పోషించాడు. వరుసగా హత్యలు చేస్తూ డీసీపీ ఆదిత్య (సుధీర్‌ బాబు)కు సవాళ్లు విసురుతుంటాడు. అయితే నాని చేసే హత్యల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని విలన్లు హత్య చేస్తారు. దీంతో నాని వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు.&nbsp; https://youtu.be/2vvywZbPvIc?si=NHylb0Fm4xXRv_nf నిన్నుకోరి - నాని ఈ సినిమాలో నాని కథానాయకుడే అయినప్పటికీ.. ద్వితియార్థంలో కాస్త స్వార్థంతో కనిపిస్తాడు. ప్రేయసికి పెళ్లైందని తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. భార్య భర్తల మధ్య గొడవలు సృష్టించి వాళ్లు విడిపోయేలా చేయాలని అనుకుంటాడు. అయితే హీరోయిన్‌కు తన భర్తపై ఉన్న ప్రేమను చూసి నాని తన మనసు మార్చుకుంటాడు. తన ప్రేమను చంపుకొని ఇల్లు వదిలి వెళ్లిపోతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ie8feBbd4VA సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు - రావు రమేష్‌ వెంకటేష్‌-మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా చేసిన ఈ చిత్రంలో నటుడు రావు రమేష్‌.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఇందులో ధనవంతుడైన రావు రమేష్‌.. హీరో ఫ్యామిలీకి డబ్బు లేదని విమర్శిస్తూ ఉంటాడు. ఖాళీగా తిరుగుతున్న వెంకటేష్‌, మహేష్‌లను ఏదైనా పని చేసుకొని బాగుపడాలని సూచిస్తుంటాడు. అతడు చెబుతున్న మాటలు మంచివే అయినప్పటికీ వాటి వెనక ఉన్న అహంకార ధోరణి రావు రమేష్‌ను విలన్‌గా మార్చింది. https://www.youtube.com/watch?v=G50OUBEZm-4 మగధీర - శ్రీహరి మగధీరలో రామ్‌చరణ్‌ తర్వాత ఆ స్థాయిలో మెప్పించిన నటుడు శ్రీహరి. ఇందులో షేర్‌ఖాన్‌ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. అతడు కాలభైరవుడు (రామ్‌చరణ్‌) సేనానిగా ఉన్న రాజ్యంపైకి దండెత్తుతాడు. దీంతో హీరో.. షేర్‌ఖాన్‌ సైన్యంలోని వంద మందిని చంపి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తాడు. హీరో ధైర్యసాహసాలకు మెచ్చిన శ్రీహరి.. ఇచ్చిన మాట ప్రకారం మరో జన్మలో రామ్‌చరణ్‌కు సాయం చేస్తాడు.&nbsp; https://youtu.be/6L-sfTeMSZM?si=cx22Tp3DbXpIL5ec పుష్ప - శత్రు పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పట్టుకునే డీఎస్పీ గోవిందప్ప పాత్రలో నటుడు శత్రు నటించాడు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు గోవిందప్ప తీవ్రంగా శ్రమిస్తుంటాడు. అయితే హీరో ఎర్ర చందనం స్మగ్లర్‌ కావడంతో అతడ్ని పట్టుకునేందుకు యత్నించిన శత్రు.. ఆటోమేటిక్‌గా ప్రేక్షకుల దృష్టిలో విలన్‌గా మారిపోయాడు.&nbsp; https://www.youtube.com/watch?v=krENzIi3Tto పరుగు - ప్రకాష్‌ రాజ్‌ బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌, షీలా కౌర్‌ జంటగా చేశారు. ప్రకాష్‌ రాజ్ చిన్న కూతురైన హీరోయిన్‌ను చూసి బన్నీ ప్రేమిస్తాడు. లేచిపోయిన పెద్ద కూతురు కోసం తండ్రి పడుతున్న ఆవేదన చూసి హీరో మారతాడు. ఆమెను లేపుకెళ్లడానికి వెనకాడతడు. క్లైమాక్స్ ముందు వరకూ విలన్‌గా కనిపించిన ప్రకాష్‌ రాజ్‌.. చివర్లో చిన్న కూతురు ప్రేమను అర్థం చేసుకొని ఆమెను బన్నీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=R7Vw3cJnjyU విక్రమ్‌ - కమల్‌ హాసన్‌ ఇందులో హీరో కమల్‌ హాసన్ మాస్క్‌ మ్యాన్‌ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఆఫీసర్ అయిన తన కొడుకును డ్రగ్స్‌ మాఫియా లీడర్‌ సంతానం (విజయ్‌ సేతుపతి) హత్య చేస్తాడు. ఇందుకు కారణమైన వారిని హత్య చేస్తూ కమల్‌ హీరోగా మారతాడు. తొలి భాగంలో తాగుబోతు, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిలా విలన్‌లా కనిపించే కమల్‌.. సెకండాఫ్‌లో తన యాక్షన్‌తో అదరగొడతాడు. https://youtu.be/x7WPik_LnmY?si=zJ9KW1ZxulMB1ZH2 రిపబ్లిక్‌ - రమ్యకృష్ణ సాయిధరమ్ తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ విలన్‌ పాత్ర పోషించింది. తొలుత ఆమెప్రాంతీయ పార్టీ అధినేత్రిగా మంచి పొలిటిషియన్‌గా కనిపించారు. ప్రజల మేలు కోరే ఆదర్శ రాజకీయ నాయకురాలిగా మెప్పిస్తారు. కానీ ఆమె నిజ స్వరూపం తెలిశాక ఆడియన్స్ షాకవుతారు.&nbsp; https://www.youtube.com/watch?v=FWg79VONoTY
    ఫిబ్రవరి 27 , 2024
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    Latest OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో 25కి పైగా సినిమాలు
    ఫిబ్రవరిలో లాస్ట్‌ వీక్ రానే వచ్చింది. ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేవు. అయితే వ్యూహం, ఆపరేషన్ వాలెంటైన్, చారీ 111, భూతద్దం భాస్కర్ ఈ వీకెండ్ విడుదలయ్యే సినిమాల్లో చెప్పుకోదగ్గవి. మరి వీటిలో ఏది బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో చూడాలి. మరోవైపు ఈవారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యేందుకు 25కు పైగా చిత్రాలు రెడీ అయ్యాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్‌ వేద్దాం. ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) మెగా హీరో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శక్తి&nbsp; ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిస్టారికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయి చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఇలాంటి సినిమాలు దేశ రక్షణ కోసం పొరాడే సైనికులకు నిజమై సెల్యూట్ అంటూ ప్రశంసించారు. భూతద్దం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana) శివ కందుకూరి, రాశి సింగ్ ప్రధాన పాత్రల్లో పురుషోత్తం రాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విలేజ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. చారీ 111 (Chaari 111) స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటిస్తున్న చిత్రం చారీ 111. ఈ చిత్రాన్ని టీజీ కీర్తి కుమార్ డైరెక్ట్ చేయగా..సైమన్ కే కింగ్ సంగీతం అందించారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ జనర్‌లో తెరకెక్కింది. చారీ 111 చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateAmbajipeta Marriage Band&nbsp;MovieTeluguAhaMarch 01Indigo&nbsp;MovieIndonesian CinemaNetflix&nbsp;Feb 27American Conspiracy: The Octopus MurdersSeries&nbsp;EnglishNetflix&nbsp;Feb 28Code 8 Part 2MovieEnglishNetflix&nbsp;Feb 28The Mire Season 3Series&nbsp;PolishNetflix&nbsp;Feb 28A Round of ApplauseSeriesTurkishNetflix&nbsp;Feb 29Man SooangMovieThaiNetflix&nbsp;Feb 29The Indrani Mukherjee Story: Buried TruthMovieHindiNetflix&nbsp;Feb 29Furies&nbsp;SeriesFrenchNetflix&nbsp;Feb 29Mamla Legal HighSeriesHindiNetflix&nbsp;March 01My Name is Loh KiwonMovieKoreanNetflix&nbsp;March 01Shake, Rattle &amp; Roll: ExtremeMovieTagalogNetflix&nbsp;March 01Somebody Feed Phil Season 7&nbsp;SeriesEnglishNetflix&nbsp;March 01Space ManMovieEnglishNetflix&nbsp;March 01The Pig The Snake and the PigeonMovieMandarinNetflix&nbsp;March 01The Netflix SlamMovieEnglishNetflix&nbsp;March 03Bootcut BalarajuMovieTeluguAmazon PrimeMarch 01Wedding Impossible&nbsp;SeriesKoreanAmazon PrimeFeb 26Anyone But YouMovieEnglishAmazon PrimeFeb 26Poor ThingsMovieEnglishAmazon PrimeFeb 27Blue StarMovieTamilAmazon PrimeFeb 29Paw Patrol: The Mythical MovieMovieEnglishAmazon PrimeFeb 29Iwaju&nbsp;SeriesEnglishDisney+hotstarFeb 28&nbsp; ShogunSeriesEnglishDisney+hotstarFeb 28Wonderful WorldSeriesKoreanDisney+hotstarMarch 01Sunflower Season 2SeriesHindiZee 5March 01Five Nights at Freddy's&nbsp;MovieEnglishJio CinemaFeb 27
    ఫిబ్రవరి 26 , 2024
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    Cute Love Proposal: తెలుగు సినిమాల్లో క్యూట్ లవ్ ప్రపోజల్ సీన్స్‌
    ప్రేమ. ఈ రెండక్షరాల పదం ఒక మనిషిని మార్చగలదు. విచ్ఛిన్నం చేయగలదు. &nbsp; తెలుగు సినిమాలో కొన్ని రొమాంటిక్ లవ్ ప్రపోజల్స్‌ గురించి తెలుసుకుందాం. ఆ మరపురాని సన్నివేశాలను మరోసారి గుర్తు చేసుకుందాం.&nbsp;&nbsp; అందాల రాక్షసి - ఈ జనరేషన్‌లో వచ్చిన కల్ట్‌ క్లాసిక్‌ ప్రేమ కథల్లో అందాల రాక్షసి ఒకటి. హీరో తన ప్రేమను కవితాత్మకంగా వర్ణిస్తూ ప్రపోజ్‌ చేయటం మనసులకు హత్తుకుంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=tTKfsFq_6lM సఖి -&nbsp; మాధవన్, శాలిని మధ్య లవ్‌ ప్రపోజల్‌ సన్నివేశం తరాలపాటు గుర్తుండిపోతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించే శక్తి మణిరత్నం సంభాషణలకు ఉంది అనిపించే స్థాయిలో మాటలు ఉంటాయి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=NflqnPbBmOQ ఆర్య - సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమాలో క్లైమాక్స్‌ గుండెల్ని పిండేస్తుంది. ఆర్యపై తనకున్న ప్రేమను తెలుసుకున్న గీత అతడి దగ్గరికి పరిగెత్తుకెళ్లటం చూస్తే కన్నీళ్లు వచ్చేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=UyywQrR6NvY 3 (Three)&nbsp; - ఈ చిత్రంలో రామ్‌ తన ప్రేమ గురించి జననికి చెప్పినప్పుడు ప్రేమలో స్వచ్ఛత, యుక్త వయసులో కలిగే ఫీలింగ్స్‌ను తెలుపుతాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఈ సన్నివేశం ఎప్పుడూ ప్రత్యేకమే. https://www.youtube.com/watch?v=p0paKJ9vaXM ఏ మాయ చేసావే - మీ భాగస్వామి పట్ల ఉన్న ప్రేమ కారణంగా గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ డ్రామాకు సలాం కొట్టాల్సిందే. కార్తిక్‌ ప్రేమను జెస్సీ అంగీకరిస్తూ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ, ఇందులో చైతూ, సామ్‌ నటన ఆ ప్రేమ సన్నివేశాన్ని మరింత అందంగా మార్చాయి.&nbsp; https://www.youtube.com/watch?v=C3rLlWq5kLk మిర్చి - ఈ సినిమాలో ప్రేక్షకుల మనసును గెలిచే ఈ సన్నివేశం కొద్దిసేపు మాత్రమే ఉన్నప్పటికీ, సీన్‌ ప్రభావం మాత్రం బాగా ఉంటుంది. ఒక్క ఛాన్స్‌ ఇస్తావా అంటూ ప్రభాస్‌ అనుష్కకి ప్రపోజ్‌ చేసే సన్నివేశానికి విజిల్స్‌ పడ్డాయి.&nbsp; https://www.youtube.com/watch?v=Yqu04K59uuw కలర్‌ ఫొటో- తెలుగు చిత్ర పరిశ్రమలో ఊహించని ప్రయత్నం ఈ సినిమా. అమాయకత్వం, నిజాయితీ అనే భావాలను కలర్‌ ఫొటోలో చూపించారు. నిజాయితీగా తన ప్రేమను హీరోయిన్‌కు చెప్పి ఆమెను ఒప్పించే సీన్‌ ఓ అద్భుతం.&nbsp; https://www.youtube.com/watch?v=ADBaHmoWxmQ సూర్య S/O కృష్ణన్‌ - దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ సినిమా ద్వారా తనలో మరో కళను బయటపెట్టాడు. చిత్రంలో తండ్రి, కుమారుడు మధ్య సమాంతరంగా జరిగే ప్రేమ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. కానీ, ‘నాలోనే పొంగెను నర్మద’ అనే పాట పాడుతూ హీరోయిన్‌కు తన ప్రేమను తెలిపే సన్నివేశం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=hQycQ7r_OsI మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు - ప్రేమించిన వ్యక్తి పట్ల ఉండే ఫీలింగ్స్‌ గురించి సినిమా సాగుతుంది. ప్రత్యేకంగా శర్వానంద్‌, నిత్యమీనన్‌ కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ వారిద్దరి మధ్య అదే గౌరవం, ప్రేమ ఉండటం, ఇద్దరూ కవిత్వం ద్వారా ప్రేమను వ్యక్తపరచడం సినిమాలో అదిరిపోయే సీక్వెన్స్‌. https://www.youtube.com/watch?v=U7itGT4xajs మజ్ను నాని హీరోగా నటించిన మజ్ను.. మీ జీవితంలో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ను గుర్తు చేసే సినిమా. ఇందులోని లవ్‌ లెటర్‌ సీన్‌ ఒక మనిషి నిజంగా ప్రేమలో పడితే ఎన్ని ఎమోషన్స్‌ ఉంటాయో తెలియజేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=mat52aolY9g
    ఫిబ్రవరి 13 , 2024
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
    Animal New Record: ‘యానిమల్‌’ మరో సంచలనం.. తొలి భారత చిత్రంగా రికార్డు!
    బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా అర్జున్‌ రెడ్డి (Arjun Reddy) ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇప్పటికే ఓటీటీలో (Netflix) విడుదలైన యానిమల్‌ అక్కడ కూడా టాప్ ట్రెండింగ్‌ మూవీగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది.&nbsp; మ్యూజిక్‌ రికార్డు ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ స్పాటిఫై (Spotify)లో యానిమల్‌ ఈ అరుదైన ఘనత సాధించింది. 500 మిలియన్లకుపైగా స్ట్రీమింగ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచింది. ఇండియాలో వేగంగా ఈ మార్క్‌ను చేరుకున్న తొలి చిత్రంగా 'యానిమల్' (Animal Music Record) సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ (Spotify) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ‘యానిమల్‌’ పేరు నెట్టింట మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన సమాచారం #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (ట్విటర్‌)లో వైరల్ అవుతోంది.&nbsp; హైలేట్‌ సంగీతం యానిమల్‌ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా తృప్తి దిమ్రితో రణ్‌బీర్‌ రొమాన్స్ చేస్తుండగా వచ్చే 'ఎవరెవరో' సాంగ్‌ యూత్‌ను విపరీతంగా ఆకర్షించింది. అలాగే తండ్రిపై ప్రేమను చాటే 'నాన్న నువ్వు నా ప్రాణం'.. క్లైమాక్స్‌తో వచ్చే 'యాలో యాలో' పాట కూడా మనసులను హత్తుకుంటాయి. ఇక ‘జమాలో జమాలో’ పాట ఏ స్థాయిలో ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాంగ్‌ను మ్యూజిక్ ప్రియులు రిపీటెడ్‌ మోడ్‌లో విన్నారు. మిగిలిన పాటలను సైతం తమ ఫేవరెట్‌ సాంగ్స్‌ లిస్టులో చేర్చేశారు. బీజీఎంతో గూస్‌బంప్స్‌ అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. రణ్‌బీర్‌ కపూర్‌ను ఎలివేట్‌ చేసే క్రమంలో వచ్చే BGM గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. థియేటర్‌లో చూసిన వారు యానిమల్‌ నేపథ్య సంగీతాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా మ్యూజిక్‌ లవర్స్‌ యానిమల్‌ BGMను తమ కాలర్‌ ట్యూన్‌గా, రింగ్‌టోన్‌గా పెట్టుకొని అస్వాదిస్తున్నారు. యానిమల్‌ బీజీఎం విన్నప్పుడల్లా తాము ఎంతో ఉత్తేజానికి గురవుతున్నట్లు పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయ పడ్డారు. లాభాలే లాభాలు.! డిసెంబర్ 1న రిలీజైన యానిమల్‌ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.900 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల పంట పండించింది. ‘యానిమల్’ (Animal) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.2 కోట్ల షేర్‌ను రాబట్టాలి. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.25.55 కోట్ల షేర్‌ని కలెక్ట్ చేసింది. బయ్యర్స్‌కి ఈ మూవీ రూ.14.35 కోట్ల లాభాలను అందించిందని సమాచారం.&nbsp;&nbsp;&nbsp;&nbsp;
    ఫిబ్రవరి 12 , 2024
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా&nbsp; సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక&nbsp; (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    MRUNAL THAKUR: అల్లరి పిల్ల మృణాల్‌ థాకూర్‌&nbsp; పిలక జుట్టుతో ఉన్న రేర్ పిక్స్ చూశారా?
    MRUNAL THAKUR: అల్లరి పిల్ల మృణాల్‌ థాకూర్‌&nbsp; పిలక జుట్టుతో ఉన్న రేర్ పిక్స్ చూశారా?
    చిత్ర పరిశ్రమలో మృణాల్‌ థాకూర్‌ ఓ సెన్సేషన్‌. అందచందాలతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్‌ తన చిన్ననాటి ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. ఈ హాట్‌ బ్యూటీ అప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.&nbsp; చిన్నతనంలో మృణాల్ బబ్లీ గర్ల్.&nbsp; పిలక జుట్టు వేసుకొని ఫొటో కోసం ఇచ్చిన ఫోజు ఎంతో క్యూట్‌గా ఉంది.&nbsp; ఐదేళ్ల వయసులో తను విన్న ప్రతి కథకి ఆకర్షితురాలు అయ్యేదట. మళ్లీ ఆ పాత్రలో మాదిరిగా కనిపించేందుకు ఇంట్లో ఉన్న దుస్తులు, వస్తువులతో సిద్దమయ్యేది. అలా మీరాభాయ్‌ గెటప్‌ వేసుకుంది మృణాల్. టీ షర్ట్‌, పాంట్ వేసుకునేది ఈ హీరోయిన్‌. మదర్స్‌ డే సందర్భంగా తల్లితో కలిసి ఆమె పెట్టిన ఫొటో చూస్తే తెలిసిపోతుంది. మృణాల్‌ టామ్‌ బాయ్‌ గెటప్‌లో ఉండేది.&nbsp; ఎక్కువగా వాళ్ల పిన్ని దగ్గర పెరిగింది. తను స్వయం శక్తితో ఎదిగేందుకు ఆమె కారణమని చెబుతుంది. మృణాల్ థాకూర్ అథ్లెట్‌. టీనేజ్‌లో ఉన్నప్పుడు వివిధ రన్నింగ్‌ పోటీల్లో పాల్గొంది. ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తుండేదట ఈ హీరోయిన్.&nbsp; మృణాల్ థాకూర్‌ డీ గ్లామరస్‌ ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.&nbsp; పాత ఫొటోలు ఎప్పుడూ మరపురానివంటుంది ఈ ముద్దుగుమ్మ. తనకు ఇష్టమైన పిక్‌ను షేర్ చేసింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) మృణాల్‌ చిన్నప్పటి నుంచే అల్లరి పిల్ల. మిక్కీ గెటప్‌లో మృణాల్‌ ఇచ్చిన ఫోటోలు చూస్తే అర్థం చేసుకోవచ్చు.
    ఏప్రిల్ 26 , 2023
    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?
    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా?
    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. దాదాపు మూడేళ్ల తర్వాత సల్మాన్‌ తెరపై కనిపిస్తున్నాడు. తమిళ్ చిత్రం వీరమ్ రీమేక్‌గా చిత్రాన్ని రూపొందించారు. కొద్దిపాటి మార్పులు చేసి తీర్చిదిద్దిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్టరీ వెంకటేశ్ రోల్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోండి. దర్శకుడు: ఫర్హద్ సమ్జీ నటీ నటులు: సల్మాన్‌ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేశ్ సంగీతం:&nbsp; రవి బస్రూర్, హిమేశ్‌ రేష్మియా, దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: వి. మణికందన్ కథ భాయ్ జాన్( సల్మాన్ ఖాన్) తన ఊరిలో శక్తివంతమైన నాయకుడు. అమ్మాయిలంటే పడుదు. తన జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాలనుకుంటాడు. తన ముగ్గురు సోదరులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అయితే&nbsp; అతని ముగ్గురు తమ్ముళ్లు తన&nbsp; అన్నయ్యకు పెళ్లి చేసి వాళ్ల ప్రేమకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మిని ( పూజా హెగ్డే) ప్రేమించేలా చేస్తారు. ఆమె ప్రేమలో పడిన భాయ్ జాన్, భాగ్యలక్ష్మికి ప్రాణ హాని ఉందని తెలిసి ఆమెను ఎలా కాపాడతాడు. అసలు&nbsp; భాగ్యలక్ష్మికి&nbsp; విలన్‌ నుంచి ఉన్న ఆపద ఏంటి? భాగ్యలక్ష్మిని భాయి జాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది మిగతా కథ.&nbsp; ఎలా ఉందంటే ఈ సినిమాను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు రెండు సార్లు చూశారు. అజిత్ హీరోగా నటించిన వీరమ్‌ చిత్రం తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయినా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ అదే కథను కాటమ రాయుడుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దీన్ని కిసీకా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్‌ తీశాడు.&nbsp; చిత్రంలో స్వల్పంగా మార్పులు మాత్రమే చేశారు. అచ్చుగుద్దినట్లు కాటమరాయుడు చూస్తున్నట్లే అనిపిస్తుంది.సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో కామెడీతో మెప్పించాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ మధ్యలో మాస్ ఫైట్లు అలరించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఫైట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది.&nbsp; సెకాండాఫ్ సాదాసీదాగా సాగుతున్నప్పటికీ వెంకటేశ్‌, సల్మాన్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక సల్లు భాయ్‌ లుంగీలో చేసిన డాన్స్‌ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. క్లైమాక్స్‌ అంతా రొటీన్‌గానే ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చుతుందో చూడాలి.&nbsp; ఎవరెలా చేశారు సినిమా మెుత్తం సల్మాన్ ఖాన్ వన్‌ మేన్‌ షో. చిత్రం మెుదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సల్లు భాయ్‌దే హవా. కామెడీ, ఫైట్లతో అలరించాడు. మరోసారి సినిమాను తన భుజాలపై మోశాడు. పూజా హెగ్డే నటనతో మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విక్టరీ వెంకటేశ్, షెహనాజ్ గిల్‌ సహా మిగతా వారందరూ తమ పరిధి మేరకు నటించారు. పాటలో రామ్ చరణ్‌ డాన్స్‌ బాగుంది.&nbsp; సాంకేతిక పనితీరు సినిమాటోగ్రఫీ బాగుంది. కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్ చిత్రానికి దాదాపు ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్‌ ప్లేపై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది. అచ్చుగుద్దినట్లు కాకుండా మార్పులు చేర్పులు చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; బలాలు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కామెడీ బలహీనతలు తెలిసిన కథ రేటింగ్ : 2.75/5
    ఏప్రిల్ 21 , 2023
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    Anchor Anasuya: రంగమ్మత్త అంటేనే మాకిష్టం..ఆ డైరెక్టర్‌తో గొడవ అయిందా?..ట్విట్టర్‌లో అనసూయ చిట్‌చాట్‌
    యాంకర్‌ అనసూయ బుల్లితెరపై ఎంత ఫేమస్సో… సోషల్‌ మీడియాలో అంతకంటే ఎక్కువ ఫేమస్‌. నెటిజన్లు వేసే ట్రోలింగ్ పోస్టులకు తనదైన శైలిలో సమాధానమిస్తూ అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. ఇవాళ కూడా మరోమారు అనసూయ నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఎప్పటిలా నెటిజన్లను తిడుతూనే, విమర్శిస్తూనో కాదు. ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన కొంటె ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చి ఆశ్యర్యపరిచింది. ఇంతకీ అనసూయను నెటిజన్లు ఏ ప్రశ్నలు అడిగారు?. అందుకు ఆమె ఇచ్చిన ఆన్సర్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: మీపై వచ్చే ట్రోల్స్‌, జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటిపడేలా మిమ్మల్ని&nbsp; మోటివేట్ చేసే అంశం? అను: జీవితంలో తగిలే ఎదురుదెబ్బలను నేను అసలు పట్టించుకోను. ఇక ట్రోలర్స్‌ నన్ను ఎప్పటికీ కిందకు లాగలేరు. పైగా ట్రోల్స్‌ నన్ను బలమైన శక్తిగా చేస్తాయి.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646470630639034368 ప్రశ్న: ఇప్పటివరకూ చూసిన వాటిలో మీకు బాగా సంతృప్తి ఇచ్చిన పాత్ర? అను: నేను చేసిన పాత్రలు అన్ని నాకు ఇష్టమే. ఎందుకంటే చేసింది నేను కదా.. https://twitter.com/anusuyakhasba/status/1646469527897800706 ప్రశ్న: రంగ మార్తండలో మీ పాత్ర బాగుంది. కానీ రంగస్థలంలోని రోల్‌ అంటేనే ఇప్పటికీ ఇష్టం. మీరేమంటారు? అను: ఒక నటిగా ప్రతీ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడానికే ప్రయత్నిస్తా. నేను ఎంచుకునే పాత్రలు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయాలనేదే నా తాపత్రయం.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646463701757878274 ప్రశ్న. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు?. ఇటీవల వెళ్లిన పుణ్య క్షేత్రం? ఏమైనా మెుక్కుకున్నారా? అను: హనుమంతుడు నా ఫేవరెట్‌. ఇటీవల శ్రీకాళహస్తి వెళ్లా. మెుక్కు చెప్తే తీరదంటారు. https://twitter.com/anusuyakhasba/status/1646461240250896389 https://telugu.yousay.tv/trolls-on-anasuya-they-dont-understand.html ప్రశ్న: ఫ్యాన్స్‌కు ఫొటోస్ ఎందుకు ఇవ్వరు.. ఫ్యాన్స్ వల్లే ఈ స్టేజీలో ఉన్నారు. అను: మనుషులు అన్నాక కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రెటీలు అయినంత మాత్రానా మేము మనషులు కాదనుకుంటే ఎలా. చాలా మందికి సెల్ఫీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నన్ను ఇలా జడ్జ్‌ చేయడం కరెంట్ కాదు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646458862214733824 ప్రశ్న: మీపై జరిగిన ట్రోలింగ్స్‌, సినిమా ప్రమోషన్స్‌లో అసభ్య పదజాలంపై మీరు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఆ తర్వాత జరిగే పర్యవసానాలపైన మీకు&nbsp; భయం వేయలేదా? అను: నీ తప్పు లేనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదని మా అమ్మ చెప్పింది. చేయాల్సింది చేయ్‌ మిగతాది పైవాడు చూసుకుంటాడని అన్నది.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646456898613579776 ప్రశ్న: ఇవాళ గురువారం రెండు ఫోటోలు పెట్టొచ్చుగా? అను: అయ్యో.. త్వరలో దీనికి పరిష్కారం ఇద్దాం. https://twitter.com/anusuyakhasba/status/1646455609506816001 ప్రశ్న: పుష్ప సినిమాలో మీకున్న మంచి ఎక్స్‌పీరియెన్స్‌ చెప్పిండి? అను: పుష్ప సెట్‌లో పాలుపంచుకోవడమే ఒక మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఆ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. https://twitter.com/anusuyakhasba/status/1646455293927374851 ప్రశ్న: జబర్దస్త్‌లో ఒక టీమ్‌/ డైరెక్టర్‌తో గొడవ జరిగి వెళ్లి పోయారంటా నిజమేనా? అను: అది నిజం కాదు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1646438774950477826 ప్రశ్న: మీపై ఆన్‌లైన్‌లో జరిగే ట్రోల్స్‌పై ఏమంటారు? అను: నథింగ్‌.. ప్రతీ ఒక్కరినీ సరిదిద్దాలని అనుకోవడం నా పని కాదు. https://twitter.com/anusuyakhasba/status/1646437957228965889 https://telugu.yousay.tv/anasuyas-romance-with-sunflowers.html
    ఏప్రిల్ 14 , 2023
    <strong>Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్?</strong>
    Mokshagna Teja: మోక్షజ్ఞ సరసన స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్?
    నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ(Mokshagna Teja) హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. దీనికి ‘హనుమాన్’(Hanuman) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆ మూవీకి ‘సింబ’(Simba) అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. కానీ ఇందులో నటించే నటీనటులకు సంబంధించిన విషయాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇందులో హీరోయిన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.&nbsp; హీరోయిన్‌గా స్టార్ నటి కూతురు! మోక్షజ్ఞ సినిమా కోసం ఓ స్టార్‌ హీరోయిన్‌ కూతుర్ని హీరోయిన్‌గా సెట్‌ చేసినట్లు నెట్టింట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ (Raveena Tandon) కుమార్తె రాషా థడానిని (Rasha thadani) కథానాయికగా ఎంపిక చేసినట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. ఇందుకోసం ఆమె ఆడిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన స్టోరీ కూడా ప్రశాంత్ వర్మ చెప్పడంతో ఆమె గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. అలాగే డిసెంబర్‌ నుంచి ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లే యోచనలో ప్రశాంత్ వర్మ ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే హీరో, హీరోయిన్‌ ఇద్దరూ కొత్తవారు కావడంతో వారిని ప్రశాంత్ ఏ విధంగా మ్యానేజ్‌ చేస్తారో చూడాలి. విలన్‌గా రానా! మోక్షజ్ఞ - ప్రశాంత్‌ వర్మ ప్రాజెక్ట్‌లో విలన్‌ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రతినాయకుడి పాత్రకు దగ్గుబాటి రానా పేరును ప్రశాంత్ వర్మ పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్రూరమైన విలన్‌ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తాడని చిత్ర బృందం కూడా నమ్ముతోందట. దీనిపై రానాతో సంప్రదింపులు కూడా జరిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయినట్లు సమాచారం. దీంతో డిసెంబర్‌ 2న మూవీ షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారట. ఆ రోజున సినిమాకు క్లాప్‌ కొట్టి రెగ్యులర్‌ షూటింగ్‌ మెుదలు పెట్టాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఈ చిత్రానికి బాలయ్య చిన్నకూతురు ఎం. తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు.&nbsp; బాలయ్య స్పెషల్‌ రోల్‌! మోక్షజ్ఞ - ప్రశాంత్‌ వర్మ కాంబోలో రానున్న చిత్రంలో నందమూరి బాలకృష్ణ కూడా ఓ స్పెషల్‌ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. హనుమాన్‌ తరహాలోనే ఈ సినిమాలో సూప‌ర్ హీరో, మైథ‌లాజిక‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయ‌ని అంటున్నారు చివ‌ర్లో బాల‌య్య శ్రీ‌కృష్ణుడిగా ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంద‌ని నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేదంటే అర్జునుడి పాత్రలోనైనా బాలయ్య కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై ప్రశాంత్‌ వర్మ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కుమారుడి ఎంట్రీ ఫిల్మ్‌లో బాలయ్య నటిస్తే ఆ కిక్కే వేరని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; మహాకాళి ప్రాజెక్ట్‌ ప్రశాంత్ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి మోక్షజ్ఞ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే తన యూనివర్స్ నుంచి మరో చిత్రాన్ని కూడా ప్రశాంత్‌ వర్మ ప్రకటించారు. ‘మ‌హా కాళీ’ పేరుతో కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశాడు. మహాకాళి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించరు. మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు ఈ మూవీని తెరకెక్కిస్తారు.
    అక్టోబర్ 26 , 2024

    @2021 KTree