• TFIDB EN
  • ప్రేమిస్తే
    UATelugu
    ఓ బైక్‌ మెకానిక్‌ గొప్పింటి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. ఓ రోజు వారిద్దరు పారిపోతారు. అప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులు వారి కోసం విపరీతంగా గాలిస్తారు. మరి ఆ జంట దొరికిందా? హీరో ఎందుకు పిచ్చివాడు అయ్యాడు? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    భరత్
    సంధ్య
    సుకుమార్
    దండపాణి
    S. కృష్ణ మూర్తి
    అరుణ్ కుమార్
    శరవణన్
    శరణ్య నాగ్
    పల్లు బాబు
    ముత్తురామన్
    శివకుమార్
    శ్రీధర్
    సూరి
    సిబ్బంది
    బాలాజీ శక్తివేల్
    దర్శకుడు
    ఎస్. శంకర్
    నిర్మాత
    జాషువా శ్రీధర్
    సంగీతకారుడు
    S. D. విజయ్ మిల్టన్
    సినిమాటోగ్రాఫర్
    జి. శశికుమార్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్‌ కామెంట్స్‌ రష్మిక గురించేనా?</strong>
    Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్‌ కామెంట్స్‌ రష్మిక గురించేనా?
    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు డేటింగ్, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారని పెద్ద ఎత్తువ కథనాలు సైతం వచ్చాయి. తాము కేవలం స్నేహితులమని ఇద్దరూ చెప్పినా తరచూ టూర్లు, రెస్టారెంట్స్‌లో దర్శనమివ్వడంతో ఎవరూ నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. లవ్‌, డేటింగ్‌ అంటూ జరుగుతున్న ప్రచారాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆ రోజున బయటపెడతా’ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు తెలుగుతోపాటు నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. దీంతో మీరు రిలేషన్‌లో ఉన్నారా? అంటూ జాతీయ మీడియా ప్రతినిధి విజయ్‌ దేవరకొండను ప్రశ్నించారు. దీనిపై విజయ్‌ మాట్లాడుతూ ‘నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా. ప్రపంచం తెలుసుకోవాలి, అందరితో పంచుకోవాలని అనుకున్నప్పుడు తప్పకుండా ఆ విషయాన్ని బయటపెడతా. దానికంటూ ఒక ప్రత్యేక కారణం, సమయం ఉండాలి. కాబట్టి, అలాంటిరోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా’ అని విజయ్‌ సమాధానం ఇచ్చాడు.  వ్యక్తిగత జీవితంపైనా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ ప్రేమ వ్యవహారం తరుచూ వార్తల్లో నిలవడంపైనా విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) స్పందించాడు. ‘పబ్లిక్‌ ఫిగర్‌గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అదీ వృత్తిలో భాగంగానే భావిస్తా. దానినుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను. వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా. ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా’ అని విజయ్‌ దేవరకొండ తెలిపాడు. మీడియా, సోషల్‌ మీడియాల్లో తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఏదీ మనసుకు తీసుకోనని పరోక్షంగా తెలియజేశాడు.  ప్రేమపై షాకింగ్‌ కామెంట్స్‌ ‘హద్దులు లేని ప్రేమ’ అనే బంధంపై మీ అభిప్రాయం ఏంటని విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)ను మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీనిపై విజయ్‌ మాట్లాడుతూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో నాకు తెలియదు. ఒకవేళ అదే ఉంటే దానితోపాటే బాధ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది’ అని విజయ్‌ తెలిపాడు. దీంతో ఈ కామెంట్స్ రష్మికను ఉద్దేశించి చేశాడా? అని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రష్మికను అమితంగా ప్రేమించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.  నాకు అలాంటివాడే కావాలి: రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హీరోయిన్ రష్మిక కాబోయో వాడు ఎలా ఉండాలో స్పష్టం చేసింది. 'నా భాగస్వామి నా జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలి. అన్నివేళలా భద్రతనివ్వాలి. కష్ట సమయంలో నాకు సపోర్ట్‌ చేయాలి. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసిఉండొచ్చు’ అని తెలిపింది. అటు ప్రేమ గురించి సైతం మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదు. ఒడుదొడుకుల్లో మనతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి’ అని రష్మిక చెప్పుకొచ్చింది.  వచ్చే ఏడాదే పెళ్లి! ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత విజయ్‌ దేవరకొండ - రష్మిక మందన్న నిశ్చితార్థం (Vijay Devarakonda - Rashmika Mandanna Engagement) చేసుకోబోతున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నెలలో నిశ్చితార్థం నిర్వహించి వచ్చే ఏడాది ఆరంభంలోనే పెళ్లి (Vijay Devarakonda - Rashmika Mandanna Wedding) చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.  దీనిపై త్వరలోనే రష్మిక - విజయ్‌ దేవరకొండ జాయింట్‌గా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉందంటూ నెట్టింట పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. తాజా ఇంటర్వ్యూలో విజయ్‌ చెప్పిన సమయం అదే కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
    డిసెంబర్ 19 , 2024
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    Miral Movie Review: రెండేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన తమిళ హార్రర్‌ థ్రిల్లర్‌.. ‘మిరల్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు: భరత్, వాణి భోజన్, కేఎస్ రవికుమార్, మీరా కృష్ణన్, రాజ్‌కుమార్, కావ్య అరివుమణి తదితరులు దర్శకత్వం: ఎం. శక్తివేల్ మ్యూజిక్ డైరెక్టర్: ప్రసాద్ ఎస్ఎన్ సినిమాటోగ్రాఫర్: సురేష్ బాలా ఎడిటర్: కలైవనన్.ఆర్ నిర్మాత: సీహెచ్ సతీష్ కుమార్ విడుదల తేదీ: 17-05-2024 ప్రేమిస్తే ఫేమ్‌ భరత్‌ హీరోగా నటించిన చిత్రం 'మిరల్‌'. రెండేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో డబ్‌ చేసి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఎం. శక్తివేల్‌ దర్శకత్వంలో హార్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హరి (భరత్‌), రమ (వాణీ భోజన్‌) ప్రేమ వివాహం చేసుకొని కొడుకుతో సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు రమకు పీడ కల రావడంతో ఊరులో ఉన్న కుల దైవానికి పూజా చేయించమని ఆమె తల్లి చెబుతుంది. దీంతో ఊరికి వెళ్లి పూజలు చేయిస్తారు. ఈ క్రమంలో హరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఓకే కావడంతో అర్ధరాత్రి ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మెయిన్‌ రోడ్డులో వెళ్లాల్సిన వారి కారు ఓ కారణం చేత మరో రూట్‌లోకి వెళ్తుంది. అయితే ఆ రూట్‌లో ఆత్మ తిరుగుతుందని ఊరి ప్రజల నమ్మకం. అందుకని రాత్రి వేళ్లలో ఆ దారిలో ఎవరూ ప్రయాణించరు. అటువంటి మార్గంలో వెళ్లిన హరి ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? నిజంగానే ఆ మార్గంలో అతీత శక్తి ఉందా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హీరో భరత్‌ ఎప్పటి లాగే తన నటనతో అదరగొట్టాడు. హరి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. అటు నటి వాణి భోజన్‌.. భరత్‌తో పాటు సినిమాను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. తమ హావ భావాలతో ఎమోషనల్‌ సన్నివేశాలను చక్కగా పండించారు. KS రవికుమార్, రాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిలో పర్వాలేదనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు ఎం. శక్తివేల్‌.. ఓ కుటుంబం చుట్టూ సాగే హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్‌ ముందు వరకూ ఏదో జరుగుతోందన్న సస్పెన్స్‌ను మెయిన్‌టెన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ పరంగా చూస్తే రొటిన్‌ స్టోరీ అయినప్పటికీ స్క్రీన్‌ ప్లే విషయంలో మాత్రం చక్కటి పనితీరును కనబరిచాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌లో ఏదో జరిగిపోతుందని భావించిన ప్రేక్షకులకు చివర్లో వచ్చే ట్విస్ట్ ఊసూరుమనిపిస్తుంది. అప్పటివరకూ మెయిన్‌టెన్‌ చేసిన ఆసక్తి మెుత్తం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. చాలా సన్నివేశాల్లో నేపథ్యం సంగీతం భయపెడుతుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ భరత్‌, వాణీ భోజన్‌ నటనఆసక్తికరంగా సాగే కథనంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథలో కొత్తదనం లేకపోవడంపేలవమైన క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    <strong>Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!</strong>
    Telugu Love Dialogues: తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చి బెస్ట్ లవ్ డైలాగ్స్ ఇవే!
    ప్రేమ అంటే రెండు అక్షరాల కలయిక కాదు. రెండు మనసుల కలయిక. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పరితపించేది, అన్వేషించేది ప్రేమ కోసమే. మనిషి నుంచి పశు పక్ష్యాదుల వరకు ప్రేమతోనే జీవితాలు ముందుకు సాగుతుంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలలతో సంబంధం లేకుండా జీవన నావా ముందుకు సాగాలంటే ప్రేమ అనే చమురు చాలా అవసం. ఒకరిపై ఎంత ప్రేమో చెప్పాలంటే మాటలు సరిపోవు. కానీ కొన్ని మనసును తాకి మనలోని ప్రేమను ధ్వనింపజేస్తాయి. తెలుగు సినీలోకంలో ప్రేమ కావ్యాలు కోకొల్లలు. ప్రేక్షకులను ప్రేమ మాయలోకి దింపిన ఆ దృశ్య కావ్యాల నుంచి మనసుకు హత్తుకునేలా చేసిన డైలాగ్స్ మీకోసం.. [toc] బేబీ “ఫస్ట్ టైమ్ లవ్ చేసినప్పుడే అనుకున్నా.. రెండోసారి, ఇంకోసారి ప్రేమ అనే మాట ఉండదని” “మీ అంత బలం లేకుండొచ్చు. గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఇంకెవడూ ఎవడూ కొట్టలేడు” “అమ్మాయి జీవితంలోకి వచ్చే ముందు కష్టం వస్తుందని దేవుడు ఎందుకు సిగ్నల్ ఇవ్వడు” వాన “ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు” మన్మథుడు “నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను.. కానీ ఎంతిష్టమో చెప్పగలను!” కంచె&nbsp; “గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం” నిన్నుకోరి “నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది” ఆర్య “నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను “ ఆరెంజ్‌ “ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి” ప్రేయసిరావే “ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవ కణంలోనూ నీ జ్ఞాపకమే ఉంటుంది.” ఏమాయ చేశావె “ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా ఇప్పటి నుంచి నా సిస్టర్సే , ఒక్క నువ్వు తప్ప.” మళ్లీ మళ్లీ ఇది రాని రోజు “కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా!”&nbsp; మజిలి “పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది” ఊపిరి “ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుంది. ప్రేమిస్తున్నామని చెబితే.. ఎక్కడ రిజెక్ట్‌ చేస్తారోనని భయం. దగ్గరయ్యాక ఎక్కడ కోల్పోతామోనని భయం. మనకి కావాల్సిన వాళ్లు దూరమైతే.. ఎలా ఉన్నారని భయం. నిజానికి భయం ఉంటే.. ప్రేమ ఉన్నట్టే” జాను “పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే” అందాల రాక్షసి “నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను” "రాళ్ళను పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు." ఓయ్ “నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే” కలర్ ఫొటో “ప్రేమించిన వారిని అందనంత ఎత్తులో నిలబెట్టడమే నిజమైన ప్రేమ.” “ఆడపిల్ల ఇంట్లో ఉన్న మనిషి..ఈ సముద్రం గట్టున నిల్చున్న మనిషి ఇద్దరూ ఒకటే సముద్రం వచ్చి చల్లగా మన కాళ్లు కడుగుతోందని అనుకుంటాం. కానీ మనకే తెలియకుండా కాళ్ల కింద ఇసుకని వెనక్కి లాగేసుకుని పోతుంది. &nbsp;మొగుడి దగ్గర మనసు దాచుకోగలం.. కానీ ఒళ్లు దాచలేం.” “ఈ ప్రపంచం మొత్తమ్మీద స్వచ్ఛమైన వాటిలో రెండోది అమ్మాయి నవ్వు.మొదటిది ఓ మగాడి కన్నీళ్లు.” “నీరు పట్టిన చద్దన్నం ఆకలి తీర్చకపోవచ్చు..కానీ కుడితి కలిపి పెడితే ఆవులు ఆవురావురుమంటూ తాగుతాయి. అలాగే మురికి నీళ్లు మనకు దాహం తీర్చకపోవచ్చు..కానీ నిప్పును ఆర్పుతాయి. ప్రపంచంలో ఏదీ ఊరికే పోదు అన్నీ ఉపయోగపతడాయి.” మనం “మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు” పడిపడిలేచె మనసు మిమ్మల్ని ప్రేమించిన వాళ్లకి.. అది కష్టమైనా, నష్టమైనా చివరి వరకూ మీతోనే ఉండాలనిపిస్తుంది. హలో గురు ప్రేమకోసమే “గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి... మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం చచ్చేదాకా మర్చిపోలేం.” తీన్‌మార్ “మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది” అల వైకుంఠపురములో.. “ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్టే.., కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.” “బరువు పైన ఉంటే కిందకి చూడలేం, ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.” “ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికే వెలుగు, అదే గుడిలో వెలిగితే ఊరంతటికి వెలుగు” “ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్ననాన్నలు బాగుండాలని పిల్లలు అనుకోరా.! “ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండ కలిసిపోతారు సర్, &nbsp;ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబంలో ఉన్న అందరూ వాళ్ల స్వార్థం, ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.”
    ఆగస్టు 23 , 2024
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!
    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.&nbsp; 7/G బృందావన కాలనీ లవ్ స్టోరీ అంటే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఈ సినిమానే. ఎన్ని ప్రేమ కథా చిత్రాలు వచ్చినా ఈ మూవీకి ఉండే ప్రాధాన్యత వేరు. ఒక అమ్మాయిని అబ్బాయి ఇంత గాఢంగా ప్రేమించగలడా? అనే ఆశ్చర్యం కలగక మానదు. 2004లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ ప్రేక్షకుల మన్ననను పొందుతోంది.&nbsp; ప్రేయసి రావే ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రేమ కోసం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చంటారు. మరి, ప్రేమనే త్యాగం చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించారు. శ్రీకాంత్, రాశి జంటగా నటించిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. నాడు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.&nbsp; మహర్షి ఈ సినిమా గురించి నేటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. 1987లో వచ్చిందీ సినిమా. ఇది కూడా ఓ అమర ప్రేమికుడి కథే. ప్రేమించిన అమ్మాయికి వేరొక అబ్బాయితో పెళ్లయితే ఉండే బాధ వేరు. అనుక్షణం తననే తలుచుకుంటూ, తనను ఒక్కసారైనా చూడాలనే తపన కంటతడి పెట్టిస్తుంది. ప్రియురాలి మెప్పు పొందేందుకు చివరికి తన ప్రాణాలనే అర్పించే త్యాగధనుడు ప్రేమికుడు. నేటి యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. అభినందన లవ్ ఫెయిల్యూర్ సినిమాల్లో ముందు వరుసలో ఉంటుందీ ‘అభినందన’. ప్రతి భగ్న ప్రేమికుడు ఇందులోని పాటలు పాడుకుంటాడు. ప్రతి విరహ ప్రేమికుడు తనను తాను హీరో పాత్రలో ఊహించుకుంటాడు. ఇప్పటికీ ఈ సినిమాల్లోని పాటలను ఎంతోమంది వింటారు. 1987లో సినిమా విడుదలైంది. ‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు ఎంత కఠినం’ అనే పాట ఈ సినిమాలోనిదే.&nbsp;&nbsp; ఓయ్ మనసు ఇచ్చిన అమ్మాయి దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఊహకు తెలియని ఒంటరితనం దరిచేరుతుంది. అలాంటి ఓ సినిమానే ఇది. మంచి ఫీల్‌ని ఇస్తుంది. ప్రేమించిన అమ్మాయి గురించి ఓ యువకుడు పడే తపన ఇందులో కనిపిస్తుంది. తనకే ఇలా ఎందుకు అవ్వాలన్న జాలి కలుగుతుంది. 2009లో ఈ మూవీ రిలీజ్ అయింది. సుస్వాగతం జీవితంపై దృష్టి పెట్టాల్సిన వయసులో ప్రేమ పేరుతో జగాన్ని మర్చిపోతే మిగిలేది శూన్యం. ఈ విషయాన్ని సుస్వాగతం మూవీ ప్రస్ఫుటిస్తుంది. ఇల్లు, కుటుంబం, భవిష్యత్‌ని లెక్క చేయకుండా ఓ అమ్మాయి వెంట తిరగడం సరికాదనే సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో ప్రేమ ఒక భాగమే. కానీ, ప్రేమే జీవితం కాదనే విషయం సినిమా చూశాక బోధపడుతుంది. నేటి తరం యువత తప్పక చూడాల్సిన సినిమా ఇది. ప్రేమిస్తే ప్రేమించడం ఈజీ. కానీ, ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ సినిమా గుర్తుండిపోవడానికి కూడా ఇదే కారణం. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను కన్నవారే నమ్మించి మోసం చేస్తే పిచ్చోడైపోయే అబ్బాయి కథ ఇది. ప్రేమికుడి దుస్థితికి తనే కారణమని విలపించే ప్రియురాలి స్వచ్ఛమైన ప్రేమకు చప్పట్లు కొట్టాల్సిందే. ఈ కథ కల్పించింది కాదు. నిజంగా జరిగింది. ఎన్నో భాషల్లో రీమేక్ అయింది.&nbsp;
    ఆగస్టు 14 , 2023
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్‌ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
    తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌. రవికుమార్‌ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్‌ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘రజనీ.. గందరగోళం చేసేశారు’ సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. మూడు చిత్రాలకు వర్క్‌! దర్శకుడు కె.ఎస్‌. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్‌ టాక్‌ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.&nbsp; 33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..! రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ! సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్‌ 3 రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.&nbsp; దసరా బరిలో రజనీ చిత్రం రజనీ కాంత్‌ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘కూలీ’లో స్టార్ క్యాస్ట్‌! ప్రస్తుతం రజనీకాంత్‌ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్‌ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.&nbsp;
    అక్టోబర్ 07 , 2024
    జీవితంలో తప్పక చూడాల్సిన ‘బ్రూస్ లీ’ చిత్రాలు
    జీవితంలో తప్పక చూడాల్సిన ‘బ్రూస్ లీ’ చిత్రాలు
    ]1970లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల నుంచి సన్నివేశాలను ఎన్నో దేశాలు, ఎన్నో భాషల్లో కాపీ కొట్టారు. ఏదీ ఏమైనా ఇవి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు. ఇలాంటి చిత్రాలే లీని ఆస్థాయిలో నిలబెట్టాయి. ఈ సినిమాలు చూసిన తర్వాత కచ్చితంగా మనం బ్రూస్ లీని ప్రేమిస్తాం.ఎన్నో భాషల్లోకి..
    ఫిబ్రవరి 14 , 2023
    <strong>Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;</strong>
    Nayanthara: భర్తతో రొమాంటిక్‌ ఫొటోలు షేర్‌ చేసిన నయనతార.. ముద్దులతో ముంచెత్తి మరి విషెస్‌!&nbsp;
    తన భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పుట్టినరోజును పురస్కరించుకొని నటి నయనతార (Nayanthara) తాజాగా కొన్ని స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేశారు.&nbsp; ఇందులో ఆమె ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎవ్రీథింగ్‌. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వు కన్న కలలు నిజం అయ్యేలా దేవుడు నిన్ను దీవించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యూట్‌ కపుల్‌ అని పలువురు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘నేనూ రౌడీనే’ సినిమా కోసం నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా చిత్రీకరణలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.&nbsp; ఆ స్నేహం కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. అలా సుమారు ఏడేళ్ల పాటు ఈ జంట ప్రేమించుకుంది.&nbsp; 2022లో పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సరోగసి విధానంలో ఇద్దరు కవల పిల్లలకు నయన్‌ జంట తల్లిదండ్రులయ్యారు.&nbsp;ఇద్దరు మగ పిల్లలకు ఉయిర్‌ రుద్రోనిల్‌ ఎన్‌.శివన్‌, ఉలగ్‌ దైవాగ్‌ ఎన్‌. శివన్‌ అని పేర్లు పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే విఘ్నేశ్‌ శివన్‌ ప్రస్తుతం ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అన్నపూరణి’ సినిమాకు గాను నయనతార (Nayanthara) ఉత్తమ నటిగా ఇటీవల సైమా అవార్డును సొంతం చేసుకుంది.&nbsp; నయనతార ప్రస్తుతం టెస్ట్‌’, ‘డియర్ స్టూడెంట్స్‌’, ‘తన్ని ఒరువన్‌ 2’ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; నయనతార వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె పుట్టుకతో మలయాళీ. మల్లువుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది. ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యింది. అన్ని భాషల్లో తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.&nbsp; ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది. నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి. తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది. శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది. ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది. ‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి&nbsp; విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ. ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయన్‌ జీవితంలోకి తమిళ డైరెక్టర్ విఘ్నేశ్‌ వచ్చాడు. అప్పటి నుంచి ఈ ‌అమ్మడు సినిమాల పరంగా వ్యక్తిగతంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం దక్షిణ చలన చిత్ర పరిశ్రమలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
    సెప్టెంబర్ 18 , 2024
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    Tollywood : మీ ప్రేయసితో తప్పక చూడాల్సిన ఫీల్‌ గుడ్‌ చిత్రాలు
    'ప్రేమ' అనే రెండక్షరాల పదం అప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అందుకే లవ్‌ను ఆధారంగా చేసుకొని టాలీవుడ్‌లో ఇప్పటికే వందలాది చిత్రాలు వచ్చాయి. ఇకపైనా వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే&nbsp; చాలమంది అబ్బాయిలు తమ ప్రేయసికి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను చూపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు హీరో, హీరోయిన్ల పాత్రల్లో తమని తాము ఊహించుకుంటారు. అటువంటి వారి కోసం You Say ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఫ్రెష్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రాలు యూత్‌కు చాలా బాగా నచ్చుతాయి. ముఖ్యంగా తమ గార్ల్‌ఫ్రెండ్‌తో ఈ సినిమాలు చూస్తే వారి బంధం మరింత బలపడే అవకాశముంది.&nbsp; భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేమికులకు కచ్చితంగా నచ్చుతుంది. నిజమైన ప్రేమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు అడ్డురావని నిరూపించింది. ఈ సినిమాలో హీరో నాని మతిమరుపు సమస్యతో బాధపడుతుంటాడు. హీరోయిన్‌ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. చివరికీ హీరోయిన్‌ తండ్రి అతడి ప్రేమను గుర్తించి వారికి పెళ్లికి అంగీకరిస్తాడు.&nbsp; తొలి ప్రేమ (Tholi Prema) వరుణ్‌ తేజ్‌, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్.. ప్రేమికులను మెప్పిస్తుంది. లవర్స్ మధ్య ఎన్ని గొడవలు వచ్చిన అది వారి ప్రేమపై ప్రభావం చూపదని ఈ సినిమా నిరూపిస్తుంది. కొన్ని సంవత్సరాల ఎడబాటు వచ్చినప్పటికీ హీరో హీరోయిన్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రేమను కోల్పోరు. ఈ సినిమా మీ ప్రేయసికి కచ్చితంగా నచ్చుతుంది.&nbsp; ఊహలు గుసగులాడే (Oohalu Gusagusalade) నాగశౌర్య, రాశి ఖన్నా జంటగా చేసిన ఈ చిత్రం.. ఒక డిఫరెంట్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో రూపొందింది. ప్రేమకు ముఖ పరిచయంతో సంబంధం లేదని మనకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యే భావాలు ఎదుటి మనిషి కలిగి ఉంటే చాలని తెలియజేస్తుంది. ఇందులో హీరోయిన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. హీరోయిన్‌ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆ వ్యక్తికి హీరో సాయం చేస్తాడు. హీరో చెప్పించే మాటలు, రాసిన లేఖలకు హీరోయిన్‌ ఫిదా అవుతుంది. చివరికీ హీరోను పెళ్లి చేసుకుంటుంది.&nbsp; అష్టా చమ్మా (Ashta Chamma) నాని, అవసరాల శ్రీనివాస్‌, స్వాతి ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రం లవర్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో హీరోయిన్‌కు మహేష్‌ అనే పేరంటే పిచ్చి. దీంతో హీరో తన పేరు మహేష్‌ అని అబద్దం చెప్పి దగ్గరవుతాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. చివరికీ వారు ఎలా ఒక్కటయ్యారు అన్నది స్టోరీ.&nbsp; అలా మెుదలైంది (Ala Modalaindi) డైరెక్టర్‌ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మెుట్ట మెుదటి సినిమా ‘అలా మెుదలైంది’. నిత్యా మీనన్‌ ఈ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. లవ్‌ ఫెయిల్‌ అయిన హీరో (నాని) జీవితంలోకి ఓ రోజు నిత్యా వస్తుంది. అయితే అప్పటికే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. నిత్యాతో పరిచయంతో నాని మళ్లీ ఆమెతో ప్రేమలో పడతాడు. మరి వీరు చివరికీ ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. అయితే ఈ సినిమా ఆధ్యాంతం ఎంతో సరదాగా సాగిపోతుంది. క్లైమాక్స్‌లో మాత్రం కాస్త కంటతడి పెట్టిస్తుంది.&nbsp; సూర్య S/O కృష్ణన్ (Surya S/o Krishnan) హీరో సూర్య నటించిన అద్భుతమైన ప్రేమ కథ చిత్రం ‘సూర్య S/O కృష్ణన్’. హీరో తను గాఢంగా ప్రేమించిన యువతిని కోల్పోతాడు. దీంతో చెడు అలవాట్లకు బానిస అవుతాడు. అయితే మరో అమ్మాయి రూపంలో ప్రేమ అతడి జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ సినిమాలో తండ్రి కొడుకుల బంధాన్ని కూడా చాలా చక్కగా చూపించారు.&nbsp; మజిలి (Majili) తెలుగులో మరో గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం ‘మజిలీ’. క్రికెటర్ అయిన హీరో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె అతడికి దూరం అవుతుంది. దీంతో హీరో మరో యువతిని పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. తన స్వచ్ఛమైన ప్రేమతో హీరో హృదయాన్ని ఆమె గెలుచుకుంటుంది.&nbsp; ఓకే బంగారం (Ok Bangaram) ప్రస్తుత కాలంలో డేటింగ్‌ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. దీనిని కథాంశంగా చేసుకొని దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లిలో కలుసుకున్న ఓ జంట ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కొద్దికాలం పాటు సహజీవనం చేస్తారు. ఈ ప్రయాణంలో వారు ఏం గ్రహించారు. చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? స్టోరీ. ఈ సినిమాను యూత్‌ఫుల్‌గా చాలా బాగుంటుంది.&nbsp; ఏ మాయ చేశావే (Ye Maya Chesave) తెలుగులో వచ్చిన ఎవర్‌గ్రీన్‌ ప్రేమ కథా చిత్రాల్లో ‘ఏ మాయ చేశావే’ ఒకటి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమికుల మధ్య ఎంత దూరం పెరిగినా లవ్‌ మాత్రం అలాగే ఉంటుందని దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపించాడు. ఇందులో నాగచైతన్య, సమంత కెమెస్ట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ సినిమా ద్వారానే వీరికి పరిచయమై చివరికీ పెళ్లి కూడా చేసుకున్నారు.&nbsp;&nbsp; పెళ్లి చూపులు (Pelli Chupulu) తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతు వర్మ జంటగా చేశారు. పెళ్లిచూపులకు వెళ్లిన విజయ్‌ను రీతు రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ హీరో ఆమె ఫుడ్‌ బిజినెస్‌లో భాగమై సక్సెస్‌ చేస్తాడు. ఈ ప్రయాణంలో వారు ప్రేమలో పడి ఒక్కటవుతారు. ఈ సినిమా మీ ప్రేయసితో గనక చూస్తే ఆమె కచ్చితంగా థ్రిల్ అవుతుంది.&nbsp; సీతారామం (Sita ramam) 2022లో వచ్చిన రొమాంటిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ 'సీతారామం'. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. సైన్యంలో పని చేసే హీరో యువరాణి నూర్జహాన్‌ను ప్రేమిస్తాడు. ఆమె కూడా ఇష్టపడుతుంది. అతడి కోసం ఆమె తన సర్వస్వాన్ని వదులుకొని పెళ్లి చేసుకుంటుంది. ఓ రోజు హీరో పాక్‌ సైన్యానికి బందీగా దొరుకుతాడు. ఆమె అతడి జ్ఞానపకాలతోనే జీవిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన చిత్రాల్లో సూపర్‌ క్లాసిక్‌ మూవీగా దీన్ని చెప్పవచ్చు.&nbsp; హాయ్‌ నాన్న (Hi nanna) ఈ చిత్రం కూడా విభిన్నమైన ప్రేమ కథతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతి సంతోషం కోసం హీరో తన ప్రేమనే త్యాగం చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే విధి వారిని మళ్లీ కలుపుతుంది. గతం మర్చిపోయిన ఆమె తిరిగి భర్తతోనే ప్రేమలో పడుతుంది. వారికి దగ్గరవుతుంది. తెలుగులో కచ్చితంగా చూాడాల్సిన చిత్రాల్లో హాయ్‌ నాన్న తప్పకుండా ఉంటుంది.&nbsp; మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) రెండు హృదయాల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈ చిత్రం అద్దం పడుతుంది. హీరో నేషనల్ లెవల్ రన్నర్‌. ముస్లిం యువతిని కళ్లు చూసి ప్రేమిస్తాడు. అనుకోని కారణంగా వారు విడిపోయిన్పపటికీ ఆమె జ్ఞాపకాలతో జీవితాన్ని గడుపుతుంటాడు. చివరికి వారు కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. నిజమైన ప్రేమకు అంతం లేదని ఈ చిత్రం చెబుతోంది.&nbsp; ఓయ్‌ (Oye) బొమ్మరిల్లు సిద్ధార్థ్, షామిలి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓయ్'. హీరో ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే ఆమెకు క్యాన్సర్‌ ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆమె చివరి కోరికలు తీర్చడం కోసం ప్రయత్నిస్తాడు. చివరి రోజుల్లో ఆమె వెంటే ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నిన్నే పెళ్లాడతా (Ninne Pelladatha) కృష్ణ వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘నిన్నే పెళ్లడతా’ చిత్రం అప్పట్లో యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్‌లో చూసేవారు చాలా మందే ఉన్నారు. కథలోకి వెళ్తే.. వరుసకు బావ మరదళ్లైన హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు. అయితే వారి కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. హీరో తన ప్రేమను గెలిపించుకోవడం కోసం చావు వరకూ వెళ్తాడు. రాజా రాణి (Raja Rani) ఈ చిత్రం విభిన్న కథాంశంతో రూపొందింది. పెళ్లి చేసుకున్న యువతిని కూడా ప్రేమించవచ్చు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇద్దరు భార్య భర్తలు గతంలో ప్రేమలో విఫలమై ఉంటారు. వారి గురించి ఆలోచిస్తూ తమ కాపురాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. చివరికి ప్రేమికులుగా దగ్గరవుతారు. జాను (Jaanu) శర్వానంద్‌, సమంత జంటగా చేసిన ‘జాను’ సినిమా కూాడా కల్ట్‌ లవ్‌ స్టోరీతో రూపొందింది. తమిళంలో వచ్చిన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. హీరో పదో తరగతిలో ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ఆలోచనలతో పెళ్లి చేసుకోకుండా జీవిస్తుంటాడు. ఓ రోజున గెట్‌ టూ గెదర్‌ సందర్భంగా వారి కలిసి తమ గతాన్ని, ఆలోచనలను పంచుకుంటారు.&nbsp; గోదావరి (Godavari) శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు చూసిన అసలు బోర్‌ కొట్టదు. హీరో సుమంత్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా గోదావరి నిలిచింది. ఇందులో పాటలు, కమలని ముఖర్జీ నటన మెప్పిస్తుంది. మీ ప్రేయసిలో మీరు కోరుకునే లక్షణాలన్ని కమలిని ముఖర్జీలో ఉంటాయి. కథ ఏంటంటే.. ఉన్నత ఆదర్శాలు ఉన్న శ్రీరామ్ తన మరదలు రాజీని ప్రేమిస్తాడు. కానీ రాజీ తండ్రి ఆమె పెళ్లిని ఒక IPS అధికారితో నిశ్చయిస్తాడు. దీంతో ఆ బాధను మరిచిపోయేందుకు శ్రీరామ్ గోదావరి నదిపై విహారయాత్రకు వెళ్తాడు. ఈ ప్రయాణంలో సీత అనే యువతితో స్నేహం అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆనంద్‌ (Anand) ఈ ఫీల్‌గుడ్‌ మూవీ కూడా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిందే. ఈ సినిమా చాలా మందికి ఫేవరేట్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్‌ ఏంటంటే.. రూప కుటుంబం కారు ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆమె ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఆనంద్ అనే ధనవంతుడు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.
    మార్చి 22 , 2024
    <strong>Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్‌ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?</strong>
    Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్‌ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా?
    నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు. దర్శకుడు : పవన్ సుంకర సంగీత దర్శకుడు : టి.ఆర్. కృష్ణ చేతన్ సినిమాటోగ్రఫీ : అనుష్ కుమార్ ఎడిటర్: నరేష్ అదుప నిర్మాత : సైర్ధర్ మారిస ఓటీటీ వేదిక:&nbsp; ఈటీవీ విన్‌ ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ 'లీలా వినోదం' (Leela Vinodham Review). పవన్‌ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్‌'లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి సినిమా కథ 2008లో జరుగుతుంటుంది. ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్. క్లాస్ మేట్ లీలా (అనగ అజిత్)ను ప్రేమిస్తాడు. కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో కాలేజీ అయిపోవడంతో ఇద్దరూ ఒకరి ఫోన్‌ నెంబర్లు ఒకరు మార్చుకుంటారు. అలా సరదాగా రోజూ చాట్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రెండ్ రాజేష్‌ (మిర్చి శరణ్‌) హెల్ప్‌తో తన ప్రేమ విషయాన్ని లీలాకు చెబుతాడు ప్రసాద్‌. దీంతో లీలా సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణం నుంచి ఆమె సైడ్‌ నుంచి ఒక్క మెసేజ్‌ గానీ, ఫోన్‌ కాల్‌ గానీ రాదు. లీలా ఎందుకు రిప్లే ఇవ్వలేదు? అప్పుడు ప్రసాద్ ఏం చేశాడు? అతడి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ప్రసాద్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమను చెప్పేందుకు ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అతడు జీవించాడు. లవ్‌ సీన్స్‌లో అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ను ఇంప్రెస్‌ చేస్తాయి. 2008 కాలంలో అబ్బాయిలు ప్రేమ విషయంలో ఎంత బిడియంగా ఉండేవారో తన నటనతో కళ్లకు కట్టాడు. హీరోయిన్ అనగ అజిత్‌ కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్‌ చేసింది. వీరిద్దరి జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఫ్రెండ్ పాత్రలు చేసిన మిర్ఛి శరణ్‌, ప్రసాద్ బెహరా తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు పవన్ సుంకర స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిడ్‌ ఏజ్‌ వాళ్లకి కనెక్ట్‌ అయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా 30+ ఉన్న వారు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. తమ టీనేజ్‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో యువకులు ఎంత ఇబ్బంది పడతారో దర్శకుడు బాగా చూపించాడు. చాటింగ్‌ చేసుకునే సీన్స్‌ను కూడా చక్కగా తెరకెక్కించారు. ‌మిర్ఛి శరణ్‌, ప్రసాద్ బెహరా పాత్రలతో కామెడీని రాబట్టాడు. అయితే రొటీన్‌ స్టోరి, ఆసక్తి లేని కథనం సినిమాకు మైనస్‌గా మారాయి. చాటా చోట్ల కథ నెమ్మదిగా, అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలిగింది. ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది. ఆమని, గోపరాజు రమణ, రూపలక్ష్మీ వంటి సీనియర్ నటులు ఉన్నా వారి పాత్రలకు ప్రాధాన్యం లేదు.  సాంకేతికంగా..&nbsp; టెక్నికల్‌ విషయాలకు వస్తే (Leela Vinodham Review In Telugu) సినిమాటోగ్రఫీ బాగుంది. అనుష్ కుమార్ తన కెమెరా పనితనంతో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించాడు. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. &nbsp; టి.ఆర్. కృష్ణ చేతన్ అందించిన సంగీతం బాగుంది. అతడు ఇచ్చిన నేపథ్య సంగీతంతో సన్నివేశాలు చాలా ప్లెజెంట్‌గా సాగిపోయాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ షణ్ముఖ్‌, అనగ అజిత్‌ నటనవింటేజ్‌ లవ్‌ సీన్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ అసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    డిసెంబర్ 19 , 2024
    <strong>Miss You Review: మిస్‌ ఫైర్‌ అయిన సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ డ్రామా.. మరో ఫ్లాప్‌ ఖాతాలో పడినట్లే!</strong>
    Miss You Review: మిస్‌ ఫైర్‌ అయిన సిద్ధార్థ్‌ ఎమోషనల్‌ డ్రామా.. మరో ఫ్లాప్‌ ఖాతాలో పడినట్లే!
    నటీనటులు : సిద్ధార్థ్‌, ఆషికా రంగనాథ్‌, కరుణాకరన్‌, బాల శరవణన్‌ తదితరలు డైరెక్టర్‌ : ఎన్‌. రాజశేఖర్‌ సంగీతం: జిబ్రాన్‌ సినిమాటోగ్రఫీ: కె.జి. వెంకటేష్‌ ఎడిటర్‌: దినేష్‌ పోనరాజ్‌ నిర్మాత : శామ్యూల్‌ మాథ్యూ విడుదల తేదీ: &nbsp;డిసెంబర్‌ 13, 2024 ప్రముఖ నటుడు సిద్ధార్థ్ (siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్‌ యు’ (Miss You Movie Review In Telugu). యు.ఎన్‌.రాజశేఖర్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని 7 మైల్స్‌ పర్‌ సెకండ్‌ సంస్థ నిర్మించింది. ఒక యునిక్‌ లవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు తమ చిత్రం తప్పక నచ్చుతుందని ప్రమోషన్స్‌ సందర్భంగా ఊదరగొట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 13న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందిపడుతున్న సిద్ధార్థ్‌కు సక్సెస్ అందించిందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.  కథేంటి వాసు (సిద్ధార్థ్‌) డైరెక్టర్‌ కావాలని కలలు కంటాడు. ఈ ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా అతడికి యాక్సిడెంట్‌ జరుగుతుంది. దీంతో రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు బాబీ (కరుణాకరన్‌)తో అయి పరిచయం అతడి జీవితంలో అనుకోని పరిణామాలను తీసుకొస్తుంది. అతడితో కలిసి బెంగళూరుకు వెళ్లిన వాసుకి అక్కడ సుబ్బలక్ష్మీ (ఆషికా రంగనాథ్‌) పరిచయమవుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని ఆమెకు చెప్తాడు. అయితే సుబ్బలక్ష్మీ రిజెక్ట్‌ చేస్తుంది. అయితే సుబ్బలక్ష్మీ అలా ఎందుకు చేసింది? వాసుతో సుబ్బలక్ష్మీకి ముందే పరిచయం ఉందా? మంత్రితో ఆమెకున్న ఉన్న వైరం ఏంటి? వాసు మర్చిపోయిన రెండేళ్లలో ఏం జరిగింది? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో నటుడు సిద్ధార్థ్ (Miss You Review) మరోమారు సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. బాగా కలిసొచ్చిన లవర్ బాయ్‌ పాత్రలో అలరించాడు. వాసు పాత్రకు అతడు పూర్తిగా న్యాయం చేశాడని చెపొచ్చు. ఇక హీరోయిన్‌ సుబ్బలక్ష్మీ పాత్రలో ఆషికా రంగనాథ్‌ (Miss You Movie Review In Telugu) అదరగొట్టింది. క్యారెక్టరైజేషన్‌ పరంగా చూస్తే సిద్ధార్థ్‌ కన్నా ఆమె రోల్‌ బాగా హైలెట్‌ అయ్యింది. కరుణాకర్ కామెడీ పంచ్‌లు బాగానే పేలాయి. మిగతా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఓ మోస్తరుగా అలరించారు. జయప్రకాశ్, శరత్ లోహితస్వ నటన బాగుంది. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ఎన్.రాజశేఖర్ రాసుకున్న కథ బాగున్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. వాసు పాత్రను డిజైన్ చేసిన తీరు సైతం ఏమాత్రం ఆకట్టుకోదు. సినిమాను ప్రారంభించిన విధానం బాగున్నప్పటికీ కథ సాగుతున్న కొద్ది క్యూరియాసిటీగా అనిపించదు. యాక్సిడెంట్‌ తర్వాత ఆడియన్స్‌లో ఆసక్తి పెంచినప్పటికీ ఆపై వచ్చే రెగ్యులర్‌ సీన్స్‌తో కథను సాదాసీదాగ మార్చేశారు. హీరో పరిచయం, యాక్సిడెంట్‌ తర్వాత వచ్చే సీన్స్, కరుణాకరణ్‌ కామెడీతో ఫస్టాఫ్‌ పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు డైరెక్టర్‌. సినిమాకు ఎంతో కీలకమైన ఎమోషనల్ డ్రామాను సరిగ్గా పండించలేకపోయారు.&nbsp; క్లైమాక్స్ మినహా మిగతా ఎమోషనల్‌ సీన్స్‌ అన్ని సాగదీసిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ అంశాలకు వస్తే (Miss You Movie Review In Telugu) జిబ్రాన్‌ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం పెద్దగా కనెక్ట్‌ కావు. వెంకటేష్ సినిమాటోగ్రఫీ వర్క్ డిసెంట్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనకామెడీ సీన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిలేని కథనంకనెక్ట్‌ కానీ ఎమోషన్‌ డ్రామారొటీన్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2/5&nbsp;
    డిసెంబర్ 13 , 2024
    <strong>KCR Movie Review: ‘కేసీఆర్‌’ వీరాభిమానిగా రాకింగ్‌ రాకేష్ హిట్‌ కొట్టినట్లే.. కానీ!</strong>
    KCR Movie Review: ‘కేసీఆర్‌’ వీరాభిమానిగా రాకింగ్‌ రాకేష్ హిట్‌ కొట్టినట్లే.. కానీ!
    నటీనటులు: రాకింగ్‌ రాకేష్‌, అనన్య కృష్ణన్‌, లోహిత్‌, మైమ్‌ మధు, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్‌, ధనరాజ్‌, జోర్దార్‌ సుజాత తదితరులు దర్శకత్వం: అంజి గరుడవేగ&nbsp; సంగీతం: చరణ్‌ అర్జున్‌ ఎడిటర్‌: చింతాల మధు నిర్మాత: రాకింగ్‌ రాకేష్‌ నిర్మాణ సంస్థ: గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ (Rocking Rakesh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'కేశవ చంద్ర రమావత్‌’&nbsp; (Kesava Chandra Ramavat Movie) . షార్ట్‌ కట్‌లో ‘కేసీఆర్‌’ (కేసీఆర్‌)'. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుతో ఈ సినిమా రూపొందించడం, ఇందులో హీరో పాత్ర కేసీఆర్‌ అభిమాని కావడంతో ఎక్కడా లేని హైప్‌ వచ్చింది. కాగా, ఇందులో అనన్య క్రిష్ణన్‌ హీరోయిన్‌గా చేసింది. అంజి గురడవేగ దర్శకత్వం వహించారు. తనికెళ్ల భరణి, ధనరాజ్‌, రచ్చరవి, లోహిత్‌ కుమార్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నవంబర్‌ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీతో రాకింగ్‌ రాకేష్‌ మెప్పించాడా? కేసీఆర్‌ అభిమానిగా హిట్‌ కొట్టాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (KCR Movie Review) కథేంటి వరంగల్‌ జిల్లా రంగబాయి తండాకు చెందిన కేశవచంద్ర రమావత్‌ అలియాస్‌ కేసీఆర్‌ (రాకింగ్‌ రాకేష్‌) చిన్నప్పటి నుంచి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్‌) అభిమాని. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ప్రసంగాలు విని ప్రభావితమవుతాడు. గ్రామంలో ఉండే మరదలు మంజు (అనన్య కృష్ణన్‌) కేశవను ప్రేమిస్తుంటుంది. కానీ పట్టణానికి చెందిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్‌ బాగుంటుందని కేశవ భావిస్తాడు. ఈ క్రమంలో డబ్బున్న ఆసామి కూతురితో పెళ్లి కుదుర్చుకుంటాడు. సీఎం కేసీఆర్‌ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానని శబదం చేస్తాడు. ఆయన్ను ఒప్పించి రప్పించేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. అలా నగరానికి వచ్చిన కేశవకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రింగ్‌ రోడ్డు వల్ల కేశవ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? దాని పరిష్కారానికి కేశవ ఏం చేశాడు? ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ను ఊరికి తీసుకెళ్లగలిగాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే జబర్దస్త్‌ రాకింగ్‌ రాకేష్‌ (Kesava Chandra Ramavat Movie Review) కేసీఆర్‌ అభిమానిగా ఇందులో ఆకట్టుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో మెప్పించాడు. ఊరి కోసం పోరాడే యువకుడిగాను మంచి నటన కనబరిచాడు. కేసీఆర్‌ అభిమానిగా ఆయన జీవించాడు. మరదలు మంజు పాత్రలో కొత్తమ్మాయి అనన్య పర్వాలేదనిపించాడు. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. కేశవ చంద్ర తండ్రి పాత్రలో సీరియల్‌ నటుడు లోహిత్‌, మామ పాత్రలో మైమ్‌ మధు ఆకట్టుకున్నారు. తాగుబోతు రమేష్‌, జోర్దార్‌ సుజాత కనిపించింది కొద్దిసేపే అయినా నవ్వించారు. తనికెళ్ల భరణి, ధన్‌రాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఓ సాధారణ లంబాడి యువకుడు (KCR Movie Review) ఊరి మీద, కేసీఆర్‌ మీద కొండంత అభిమానం పెంచుకొని నగరానికి వచ్చిన వైనం, తన కలను సాకారం చేసుకున్న తీరును దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో ఆవిష్కరించారు. తొలి భాగంలో హీరో పరిచయం, కేసీఆర్‌ ఉద్య ప్రసంగానికి ప్రభావితమైన తీరు, పల్లెటూరి వాతావరణం చూపించారు. పాత్రలను పరిచయం చేస్తూ ఇంట్రస్టింగ్‌గా నడిపించారు. కేసీఆర్‌ను పెళ్లికి తీసుకొస్తానని శబదం చేయడం ద్వారా సెకండాఫ్‌పై దర్శకుడు ఆసక్తి పెంచాడు. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చిన కేశవ అక్కడ ఎదుర్కొన్న కష్టాలు, కేసీఆర్‌ను కలుసుకునే ప్రయత్నంలో ఎదురైన అవరోధాలతో కథను ఎమోషనల్‌గా నడిపించాడు. అదే సమయంలో కేసీఆర్‌ హయాంలో హైదరాబాద్‌ ఏవిధంగా డెవలప్‌ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. మరోవైపు రింగ్‌ రోడ్డు కారణంగా హీరో ఊరే ఖాళీ అయ్యే పరిస్థితి రావడం, క్లైమాక్స్‌ సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉండటం బాగుంది. ‌అయితే ఒక పార్టీ నాయకుడిని హైలేట్‌ చేయడం వల్ల కేశవ చంద్ర రామవత్ ఓ పార్టీకి సంబంధించిన మూవీగా మారిపోయింది. కేసీఆర్ అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇదొక పండగ లాంటి చిత్రం. సినిమా లవర్స్‌, ఇతర పార్టీల వారు ఈ సినిమాను ఎంతమేరకు ఆదరిస్తారోనన్నది అనుమానమే.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతికంగా (Kesava Chandra Ramavat Movie Review)సినిమా బాగుంది. దర్శకుడు అంజి గురడవేగ సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అర్జున్‌ కంపోజ్‌ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం భావోద్వేగాలను రగిలించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాకింగ్‌ రాకేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ పొలిటిషియన్‌ను హైలేట్ చేయడంకొన్ని సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 23 , 2024
    <strong>Devaki Nandana Vasudeva Review: మ్యాటర్‌ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్‌ వర్మ? పాపం అశోక్‌ గల్లా!</strong>
    Devaki Nandana Vasudeva Review: మ్యాటర్‌ లేని కథను కట్టబెట్టిన ప్రశాంత్‌ వర్మ? పాపం అశోక్‌ గల్లా!
    నటీనటులు : అశోక్‌ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే తదితరులు డైరెక్టర్‌ : అర్జున్ జంధ్యాల కథ : ప్రశాంత్ వర్మ డైలాగ్స్‌: బుర్ర సాయి మాధవ్‌ సినిమాటోగ్రాఫీ: ప్రసాద్‌ మురెళ్ల, రసూల్‌ ఎడిటింగ్‌: తిమ్మరాజు విడుదల తేదీ: నవంబర్‌ 22, 2024 ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్‌ కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ (Ashok Galla) హీరోగా రూపొందిన తాజా చిత్రం 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva Review). హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి కథ అందించగా అర్జున్‌ జంద్యాల దర్శకత్వం వహించారు. ఇందులో ఆధ్యాత్మిక, వాణిజ్య అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని చిత్ర యూనిట్‌ మెుదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో నవంబర్‌ 22న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కథలో ప్రశాంత్ వర్మ మార్క్‌ కనిపించిందా? ఇప్పుడు తెలుసుకుందాం. కథేంటి కంసరాజు (దేవదత్తా) పరమదుర్మార్గుడు. ఒక రోజు కాశీకి వెళ్లిన కంసరాజుకు అఘోరా తారసపడి నీ మరణం నీ చెల్లెలికి పుట్టబోయే మూడో సంతానం చేతిలో ఉందని చెప్తాడు. దీంతో కడుపుతో ఉన్న చెల్లి (దేవయాని)పై కంసరాజు దాడి చేస్తాడు. ఆమె భర్త చనిపోవడంతో 21 సంవత్సరాల పాటు జైలుకు వెళ్తాడు. అయితే కంసరాజు చెల్లికి ఆడపిల్ల సత్య (మానస వారణాసి) పుడుతుంది. పెద్దయ్యాక ఆమెను కృష్ణ (అశోక్‌ గల్లా) ప్రేమిస్తాడు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన కంసరాజు మేనకోడలు సత్యను ఏం చేశాడు? కంసరాజుకు తెలియకుండా అతడి చెల్లెలు దాచిన సీక్రెట్ ఏంటి? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం సత్య ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కృష్ణ పాత్ర కోసం అశోక్‌ గల్లా (Devaki Nandana Vasudeva Review) చాలా కష్టపడ్డాడు. అతడి కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. గత చిత్రంతో పోలిస్తే నటన, బాడీ లాంగ్వెజ్‌పరంగా అశోక్‌ మెరుగయ్యాడు. కీలకమైన సన్నివేశాల్లో అతడి నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా మానస వారణాసి అలరించింది. తెరపై వారి కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే భావోద్వేగాలు పలికించే విషయంలో మానస అక్కడక్కడ తడబడింది. విలన్‌గా దేవదత్తా నాగే ఆకట్టుకున్నాడు. అతడి చెల్లెలు పాత్రలో దేవయాని నటన బాగుంది. హీరో తల్లి పాత్రలో ఝాన్సీ చక్కగా చేసింది. సంజయ్‌ స్వరూప్‌, శత్రు, శ్రీధర్‌ రెడ్డి, గెటప్‌ శ్రీను తదితరులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే హనుమాన్‌ (Hanuman) ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) అందించిన కథలో పెద్దగా స్టఫ్‌ లేదు. స్టోరీకి మైథాలజీని ముడిపెట్టినప్పటికీ అది ఎక్కడా సింక్‌ అయినట్లు అనిపించదు. పురాణాల నేపథ్యం లాజిక్‌ లెస్‌గా అనిపిస్తుంది. దర్శకుడు అర్జున్‌ జంధ్యాల కథనంలోనైనా మ్యాజిక్ చేయాల్సింది. కానీ అలా జరగలేదు. స్క్రీన్‌ప్లేను ఇంట్రస్టింగ్‌గా నడిపించడంలో విఫలమయ్యాడు. ఓ మూఢనమ్మకాన్ని ప్రోత్సహించేలా తెరకెక్కించిన సీన్స్‌ స్వాగతించేలా లేవు. ఇక హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ కూడా పేలవంగా అనిపిస్తుంది. కృష్ణ, కంసరాజు మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ సైతం బలంగా చూపించలేకపోయారు. కృష్ణ పాత్రను ఎలివేట్‌ చేసేందుకు తీసిన కొన్ని సీన్స్‌ మరీ ఓవర్‌గా అనిపిస్తాయి. మెుత్తానికి దర్శకుడు చాలా చోట్లనే ప్రేక్షకులకు బోర్‌ కలిగించాడు.&nbsp; సాంకేతిక అంశాలు టెక్నికల్‌ విషయాలకు వస్తే భీమ్స్‌ సిసిలియో సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను అతడి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ఎడిటర్‌ తమ్మిరాజు పనితనం ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ అశోక్‌ గల్లా నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ మెరుపులు లేని కథనంలవ్‌ట్రాక్‌మిస్‌ఫైర్‌ అయిన మైథాలజీ టచ్‌ Telugu.yousay.tv Rating : 2/5&nbsp;
    నవంబర్ 22 , 2024
    <strong>Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?</strong>
    Dhoom Dhaam Review: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అద్దం పట్టిన ‘ధూం ధాం’.. మరి హిట్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు : చేతన్ కృష్ణ, చేతన్ మద్దినేని, వెన్నెల కిషోర్, సాయికుమార్, వినయ్ వర్మ, ప్రవీణ్, నవీన్ నేని, గోపరాజు రమణ తదితరులు. దర్శకత్వం :&nbsp; సాయి కిషోర్ మచ్చా సంగీతం:&nbsp; గోపీ సుందర్&nbsp; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి నిర్మాత : ఎం.ఎస్‌ రామ్ కుమార్&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 చేతన్ మద్దినేని (Chetan Maddineni), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam Review). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పిందించిందా? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; కథేంటి కార్తిక్‌ (చేతన్ మద్దినేని)కు తన తండ్రి రామరాజు (సాయికుమార్‌) అంటే చాలా ఇష్టం. నాన్నపై విపరీతమైన ప్రేమాభిమానాలను చూపిస్తుంటాడు. అటు రామరాజు సైతం కొడుకుపై అంతే ప్రేమ చూపిస్తుంటాడు. ఏ విషయాన్నైనా ఇద్దరు పంచుకుంటారు. ఇదిలా ఉంటే ఓ రోజు సుహానా (హెబ్బా పటేల్‌)ను చూసి కార్తిక్‌ తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ, ఆమె పట్టించుకోదు. కోపంతో పోలాండ్‌కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన సుహానా తిరిగి కార్తిక్‌ ప్రేమను దక్కించుకుంటుంది. మరోవైపు కార్తీక్‌కు సుహానా పెద్దనాన్న (రామరాజు), అతడి తమ్ముడు (బెనర్జి)తో వైరం ఉంటుంది. కార్తీక్‌ను చంపాలని వారు చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? సుహానా ఫ్యామిలీతో కార్తిక్‌కు వైరం ఎందుకు వచ్చింది? కార్తీక్‌ వాటిని ఎలా పరిష్కరించాడు? చివరికీ సుహానా - కార్తిక్‌ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే హీరో కార్తిక్‌ పాత్రలో చేతన్‌ కృష్ణ పర్వాలేదనిపించాడు. నటన పరంగా గతంతో పోలిస్తే పరిణితి చూపించాడు. అయితే ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో మరింత వర్క్‌ చేసి ఉంటే బాగుండేది. కీలక సన్నివేశాల్లో అతడి నటన తేలిపోయింది. ఇక హీరోయిన్‌ సుహానా పాత్రలో హెబ్బా పటేల్ ఎప్పటిలాగే మెప్పించింది. చాలా రోజుల తర్వాత కమర్షియల్ పాత్రలో ఆమె ఆకట్టుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి జోడి బాగా కుదిరింది. హీరో కజిన్‌గా సుహాస్‌ పాత్రలో వెన్నెల కిషోర్ అదరగొట్టాడు. అతడి కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వీరితోపాటు సాయికుమార్‌, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్‌, ప్రవీణ్‌, గిరిధర్‌ తదిరులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సాయికిషోర్‌ మచ్చా ఎంచుకున్న కథ సాదాసీదాగా ఉంది. అయితే మంచి రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని అందించాలనే ప్రయత్నం మాత్రం అభినందనీయం. లవ్‌ట్రాక్‌ ఉన్నా ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు. తండ్రీ కొడుకుల ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల బాండింగ్‌తో పాటు ఫ్యామిలీ అనుబంధాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, వారి మధ్య వచ్చే గొడవలు, అలకలు చూపించారు. ఇవి కాస్త రొటీన్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రవీణ్‌ చేసే కామెడీ రిలీఫ్ ఇస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌ను ఆసక్తికరంగా మార్చారు డైరెక్టర్‌. హీరోయిన్ ఫాదర్‌ గురించి తెలిసి హీరో షాకవ్వడం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్‌ మెుత్తాన్ని వెన్నెల కిషోర్‌ తన భుజాలపై నడిపించాడు. స్లో న్యారేషన్‌, గొప్ప క్యాస్టింగ్‌ ఉన్నా సరిగా వాడుకోకపోవడం, అక్కడక్కడ హీరో ఇచ్చే అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాకు మైనస్‌గా మారాయి. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాలకు వస్తే గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్‌ ప్రధాన అసెట్ అయ్యింది. పాటలు చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా కొత్త ఫీల్‌ను అందించింది. అలాగే సిద్ధార్థ్‌ రామస్వామి కెమెరా వర్క్‌ మెప్పించింది. విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటిర్‌ సినిమాను మరింత షార్ట్‌గా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యాద్భుతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వెన్నెల కిషోర్ కామెడీఫ్యామిలీ ఎమోషన్స్సంగీతం మైనస్ పాయింట్స్‌ రొటీన్ స్టోరీరెగ్యులర్‌ లవ్‌ట్రాక్‌స్లో న్యారేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 08 , 2024
    <strong>KA Movie Review: ‘ క’&nbsp; సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు</strong>
    KA Movie Review: ‘ క’&nbsp; సినిమాను హిట్‌ చేసిన టాప్ 5 అంశాలు
    విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్ తదితరులుదర్శకత్వం: సందీప్, సుజిత్నిర్మాత: చింతా గోపాల్ కృష్ణ రెడ్డిసంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. ప్రమోషన్లతతో బాగా హైప్ తీసుకొచ్చాడు. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. సినిమా ఎలా ఉందంటే? ఈ చిత్రంలో ప్రధానంగా తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. కథనం, థ్రిల్లర్ మూమెంట్స్, క్లైమాక్స్ బాగున్నాయి.. కథలో ఉన్న బలమైన క్యారెక్టర్లు, వాటి నిర్మాత్మక శైలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి.&nbsp; కథనంలో ట్విస్టులు కొత్తదనాన్ని జోడించాయి. కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో రెండు భిన్న వేరియేషన్స్‌లో చాలా బాగా నటించాడు. నయన్ సారిక హీరోయిన్ పాత్రలో బాగా న్యాయం చేసింది, ఆమె నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. బలగం జయరామ్ అద్భుతంగా నటించాడు. ఇతర ముఖ్య పాత్రలలో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్స్ సందీప్, సుజిత్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో కొత్తదనాన్ని రాబట్టడంలో కొంతవరకు విజయం సాధించారు. స్క్రీన్ ప్లేలో మరింత మెరుగులు దిద్దే అవకాశం ఉన్నప్పటికీ కొంత విస్మరించారు. కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముఖ్యమైన కాంప్లిక్ట్&nbsp; పాయింట్ పూర్తిగా క్లారిటీగా వ్యక్తం కాకుండా సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొనసాగిన కారణంగా కథలో లోపాలు కనిపిస్తాయి. కథనంలో కొన్ని అనవసర సన్నివేశాలు సస్పెన్స్‌ని దెబ్బతీసినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయాలు సినిమాకి కొంత మైనస్‌గా మారాయి. స్క్రీన్‌ప్లేను ఇంకా మెరుగ్గా మలచి ఉంటే సినిమాకి మరింత ప్రభావవంతంగా ఉండేది. సాంకేతిక విభాగం: ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మసాన్, డేనియల్ విశ్వాస్ ల సినిమాటోగ్రఫీ, ముఖ్యమైన సన్నివేశాలకు ప్రాణం పోసింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకి బలాన్ని ఇచ్చింది. ఎడిటింగ్ చాలా బాగుంది. చింతా గోపాల్ కృష్ణ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరగా మొత్తం గా చెప్పాలంటే, "క" అనే ఈ చిత్రం ప్రధానంగా సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో సాగుతూ మంచి కథా నేపథ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాన్సెప్ట్ బలంగా ఉండటంతో పాటు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాని&nbsp; బాగా లేపాయి. సస్పెన్స్ కథలకు ఆసక్తి ఉన్నవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. రేటింగ్ : 3.5/5
    నవంబర్ 01 , 2024
    <strong>Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;</strong>
    Prabhas: ప్రభాస్‌ పెళ్లిపై మనసులో మాట చెప్పిన తమన్నా!&nbsp;
    టాలీవుడ్‌ సహా భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ ప్రభాస్‌ (Prabhas) గుర్తుకు వస్తాడు. ఈ పాన్ ఇండియా స్టార్‌ పెళ్లి టాపిక్‌ చాలా సార్లు సోషల్‌ మీడియాలో చర్చకు వచ్చింది. స్టార్‌ హీరోయిన్స్‌ కృతి సనన్, అనుష్క శెట్టితో ప్రభాస్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు గతంలో వార్తలు సైతం వచ్చాయి. కానీ, వీటిపై ప్రభాస్‌ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే అవన్నీ అవాస్తవాలనీ తేలిపోయింది. మరి పెళ్లి ఎప్పుడూ అని ప్రభాస్‌ని ఎవరు ప్రశ్నించినా? ఒక చిరు నవ్వుతో సమాధానం దాటవేస్తుంటాడు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ పెళ్లి గురించి స్టార్ హీరోయిన్‌ తమన్నా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.&nbsp; ప్రభాస్ పెళ్లిపై ఏమన్నదంటే? ప్రభాస్‌ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ (Bahubali) చిత్రంలో మిల్క్‌ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా చేసింది. ప్రభాస్‌కు బాగా క్లోజ్‌ అయిన హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న ఆమె ప్రభాస్‌ పెళ్లిపై మాట్లాడింది. బాహుబలి తర్వాత దేశంలోని చాలా మంది అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలని భావించారని చెప్పింది. గతంలో అతడి ఫాలోయింగ్‌ దక్షిణాది వరకే ఉండేదని, బాహుబలి రిలీజ్‌ తర్వాత యావత్‌ దేశం విస్తరించిందని చెప్పింది. దేశంలోని అమ్మాయిలు ప్రభాస్‌ని పెళ్లాడాలని భావించారన్నది. అటు అమరేంద్ర బాహుబలి పాత్రలాగానే ప్రభాస్ నిజ జీవితంలో కూడా సాధారణంగా ఉంటారని తెలిపింది. అతడు రాజు లాంటివాడని మనసు కూడా సున్నితంగా దయతో ఉంటుందని చెప్పింది. బలమైన వ్యక్తిత్వం కూడా ఉందంటూ ఆకాశానికెత్తింది.&nbsp; మనసు పడ్డ తమన్నా ఫ్రెండ్స్‌ ప్రభాస్‌ పెళ్లి గురించి నటి తమన్నా గతంలోనూ చాలా సార్లు మాట్లాడింది. ఓసారి తన స్నేహితులు, కజిన్స్‌ ప్రభాస్‌ను ప్రేమిస్తున్నామని చెప్పినట్లు తెలిపింది. అతడిని వ్యక్తిగతంగా పరిచయం చేయమని ఒత్తిడి కూడా తెచ్చారని చెప్పింది. మరోవైపు ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి తాను ఎంతగానో ఇష్టపడతానని తమన్నా పేర్కొంది. స్క్రిప్ట్ దొరికినప్పుడు కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రభాస్​తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే బాహుబలి కంటే ముందే ప్రభాస్‌తో తమన్నా నటించింది. ప్రభాస్- తమన్నా కాంబోలో 2012లో 'రెబల్' విడుదలైంది. దీనికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.&nbsp; ‘ఫౌజీ’ షూట్‌లో ప్రభాస్‌! పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, దర్శకుడు హను రాఘవపూడి కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ప్రభాస్‌ తాజాగా ఈ మూవీ షూట్‌లో జాయిన్‌ అయినట్లు తెలుస్తోంది. పీరియాడిక్‌ వార్‌కు సంబంధించిన సెట్స్‌లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. ఇక ఈ మూవీలో ప్రముఖ డ్యాన్సర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లెయన్సర్‌ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తోంది. పాపులర్‌ మలయాల భామ నమిత ప్రమోద్‌ కూడా సెకండ్‌ ఫీమేల్‌ లీడ్‌గా ఎంపికైనట్లు తాజాగా వార్తలు వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు నమితా ప్రమోద్‌ ఇప్పటికే తెలుగులో ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో నటించింది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ! ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబోలో రానున్న ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌ లవ్‌ డ్రామాగా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ర‌జాకార్స్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్ డ్రామాగా ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ క‌థ‌ను రాసిన‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ సంస్థానం భార‌తదేశంలో విలీనం అయ్యే టైమ్ పీరియ‌డ్‌లో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం. ‘ఫౌజీ’ అంటే సైనికుడు అని అర్థం. ఇందులో ఇండియ‌న్ పారా మిలిట‌రీకి చెందిన సైనికుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అయితే ఇందులో ఇమాన్ ఇస్మాయిల్ అనే యువతి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఇమాన్‌ పాల్గొని తన లుక్స్‌తో సోషల్‌ మీడియాను అట్రాక్ట్‌ చేసింది.&nbsp;
    అక్టోబర్ 26 , 2024
    <strong>Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;</strong>
    Viral Video: సినిమా చూసి నటుడిపై మహిళ దాడి.. వీడియో వైరల్‌&nbsp;
    అంజ‌న్ రామ‌చంద్ర‌, శ్రావ‌ణి హీరో హీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ రెడ్డి' (Love Reddy). గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో ఫెయిల్యూర్‌ మీట్‌ పేరుతో చిత్ర బృందం థియేటర్లకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ ధియేటర్‌కు వెళ్లిన మూవీ యూనిట్‌కు ఊహించని ఘటన ఎదురైంది. బృందంలోని నటుడిపై ఓ మహిళ దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.&nbsp; దాడి ఎందుకు జరిగిందంటే? లవ్‌ రెడ్డి చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాకపోవడంతో చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. 'బ్లాక్‌ బాస్టర్‌ బట్‌ ఫెయిల్యూర్‌ మీట్‌' పేరుతో వినూత్న ఈవెంట్‌ను ప్రారంభించింది. సినిమా ఆడుతున్న థియేటర్లను విజిట్‌ చేస్తూ అభిమానుల రెస్పాన్స్‌ను తెలుసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌ నిజాంపేటలోని జీపీఆర్‌ మాల్‌కు 'లవ్‌ రెడ్డి' బృందం వెళ్లింది. అప్పుడే ఆ సినిమాలో క్లైమాక్స్‌ సీన్‌ రన్‌ అవుతోంది. హీరోయిన్‌ ప్రేమను అంగీకరించని ఆమె తండ్రి (ఎన్‌.టీ రామస్వామి) కూతుర్ని రాయితో కొడతాడు. ఆ సీన్‌ చూసి ఆగ్రహంతో ఊగిపోయిన థియేటర్‌లోని మహిళ, తండ్రి పాత్ర పోషించిన నటుడిపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠత్‌ పరిణామంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.&nbsp; https://twitter.com/telugu_insider/status/1849700707248767217 ‘లవ్‌ రెడ్డి’ ఎలా ఉందంటే పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. కథ ఏంటంటే నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; https://telugu.yousay.tv/love-reddy-review-if-even-a-single-caste-hinders-love-what-is-the-situation-of-love-reddy.html
    అక్టోబర్ 25 , 2024
    <strong>Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;</strong>
    Underrated Telugu OTT Movies: ఎందుకు మిస్‌ అయ్యామా అని బాధపడేలా చేసే బెస్ట్ ఓటీటీ చిత్రాలు.. ఓ లుక్కేయండి!&nbsp;
    ప్రస్తుతం సినిమా అనేది ప్రధాన వినోద మాధ్యమంగా మారిపోయింది. ఓటీటీ పుణ్యమా అని ప్రతీవారం ఇంట్లోనే కొత్త చిత్రాలను చూసే అవకాశం ఆడియన్స్‌కు కలుగుతోంది. అయితే ప్రతీవారం కొత్త మూవీస్‌ రిలీజ్‌ అవుతుండటంతో కొన్ని మూవీస్‌ ఆటోమేటిక్‌గా మరుగున పడిపోతున్నాయి. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా కూడా అవి అండర్‌ రేటెట్‌ ఫిల్మ్స్‌గా మారిపోతున్నాయి. అటువంటి చిత్రాలను YouSay ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రాలను ఒకసారి చూస్తే ఇంతకాలం ఎందుకు మిస్‌ అయ్యామా? అని కచ్చితంగా ఫీల్‌ అవుతారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? స్టోరీ ప్లాట్‌? తదితర విశేషాలన్నీ ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ ఆ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.&nbsp; కంచె (Kanche) వరణ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌ కంచె. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా చేసింది. రెండో ప్రపంచం యుద్ధం నేపథ్యానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి ఈ సినిమాను రూపొందిచారు. ప్రస్తుతం ఈ సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఈ సినిమా కథ ఏంటంటే.. నిమ్న కులానికి చెందిన హరిబాబు (వరుణ్‌ తేజ్‌).. తమ ఊరి జమీందారు కూతురు సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్‌)ను కాలేజీలో ప్రేమిస్తాడు. వీరి ప్రేమ ఊరిలో కులాల మధ్య చిచ్చు పెడుతుంది. ఆ మంటను హరిబాబు ఎలా చల్లార్చాడు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా పాల్గొన్నాడు? యుద్ధభూమి నుంచి తిరిగి తన టీమ్‌తో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య (Uma Maheswara Ugra Roopasya) నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు.&nbsp; మలయాళంలో విజ‌య‌వంత‌మైన‌ ‘మహేశ్‌ ఇంటే ప్రతికారం’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. ఒక మంచి వాడికి ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘ఉమా మహేశ్వర రావు ఓ ఫోటోగ్రాఫర్, గొడవలంటే ఇష్టముండదు. కానీ ఓ రోజు జోగి అనే రౌడీతో గొడవపడుతాడు. రద్దీగా ఉండే మార్కెట్‌లో జోగి చేత దెబ్బలు తిని ఘోరంగా అవమానించబడుతాడు. మరి ఉమా మహేశ్వరావు.. జోగిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు’ అనేది కథ. పలాస 1978 (Palasa 1978) రక్షిత్‌ అట్లూరి హీరోగా కరుణ కుమార్‌ డైరెక్షన్‌ వచ్చిన పలాస 1978 చిత్రం థియేటర్లలో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 1978లో శ్రీకాకుళంలోని ఓ చిన్న గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సింగర్‌ రఘు కుంచే ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అమెజాన్‌లో అందుబాటులో ఉంది. కథ విషయానికి వస్తే.. భూస్వామి అయిన గురుమూర్తి, అతని సోదరుడు నిమ్న కులాల వారిని బానిసలుగా చూస్తారు. వారికోసం ఎంతో చేసిన నిమ్నకులాలకు చెందిన మోహన్‌రావు అతని సోదరుడు రంగారావుని అవమానిస్తారు. దీంతో భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వారిద్దరు నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.&nbsp; మను (Manu) బ్రహ్మనందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మను’. ఫణీంద్ర నర్సెట్టీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని అప్పట్లో క్లౌడ్‌ ఫండింగ్‌ రూపంలో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీని చూడవచ్చు.&nbsp; కథ విషయానికి వస్తే.. మను (రాజా గౌతమ్‌) నీలు (చాందిని చౌదరి)ను డైరెక్ట్‌గా చూడకుండానే ఇష్టపడతాడు. వారు కలుసుకునే క్రమంలో నీలు లైఫ్‌లో విషాద ఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత నీలుకు ఏమైంది? నీలు కోసం వెళ్లిన మను ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా? అన్నది కథ. వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఆహా (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. చక్రవ్యూహం: ది ట్రాప్‌ (Chakravyuham: The Trap) అజయ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించాడు. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది ఇతర ముఖ్యపాత్రల్లో చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా కథ కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే.. సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే హత్యకు గురవుతుంది. బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారం కూడా పోతుంది. ఈ కేసును సీఐ సత్య (అజయ్‌) విచారిస్తాడు. తొలుత సంజయ్ ఫ్రెండ్ శరత్‌ (సుదీష్‌)పైనే అనుమానం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే కొద్ది సిరి హత్య కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది స్టోరీ.&nbsp; మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీవిష్ణు హీరోగా నివేద పేతురాజ్‌, అమృత శ్రీనివాసన్‌ హీరోయిన్లుగా చేసిన చిత్రం ‘మెంటల్‌ మదిలో’. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని మంచి ఫీల్‌ గుడ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిల్లో ఒకరిని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు అతని జీవితం ఎలాంటి గదరగోళంలో పడుతుంది అన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime)లో అందుబాటులో ఉంది. కథలోకి వెళ్తే.. చిన్నప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌తో ఉండే హీరో లైఫ్‌లోకి పెళ్లి చూపుల ద్వారా హీరోయిన్‌ వస్తుంది. పెళ్లికి చాలా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో అతడు మరో యువతికి దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడు ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? అన్నది కథ.&nbsp; రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. క్షణం (Kshanam) అడివి శేషు, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘క్షణం’. రవికాంత్‌ పేరెపు దర్శకుడు. మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. హీరో తన మాజీ ప్రేయసి కోసం ఇండియాకు వస్తాడు. మిస్‌ అయిన ఆమె పాప కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది కథ.
    అక్టోబర్ 22 , 2024
    <strong>EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!</strong>
    EXCLUSIVE: తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లకు ప్రాతినిధ్యం వహించిన టాలీవుడ్‌ చిత్రాలు ఇవే!
    సినిమా అనేది ఒక విస్తృతమైన మాద్యమం. దానికి ఎటువంటి హద్దులు లేవు. సాధారణంగా సినిమాలు అనేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పడతాయి. సమాజంలోని స్థితిగతులను కళ్లకు కట్టే ప్రయత్నం చేస్తాయి. అయితే మరికొన్ని సినిమాలు స్థానికతను బేస్‌ చేసుకొని వచ్చి మంచి ఆదరణ పొందాయి. స్థానిక ప్రజల భాష, మనుషుల వ్యక్తిత్వాలు, చుట్టుపక్కల పరిస్థితులను ఆడియన్స్‌కు తెలియజేశాయి. టాలీవుడ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జిల్లాలను ప్రతిబింబించేలా ఇప్పటివరకూ చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో ముఖ్యమైన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; [toc] పుష్ప (Pushpa) అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. ప్రధానంగా తిరుపతిలోని శేషాచలం అడవుల చుట్టు తిరుగుతుంది. అంతేకాదు చిత్తూరు దాని పరిసర ప్రాంతాల ప్రభావం కూడా సినిమాలో కనిపిస్తుంది. ఇందులో బన్నీ చిత్తూరు శ్లాంగ్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను రిప్రజెంట్‌ చేశాడు.&nbsp; గుంటూరు కారం (Guntur Karam) మహేష్‌ బాబు (Mahesh Babu) రీసెంట్‌ చిత్రం.. ‘గుంటూరు కారం’ పేరుకు తగ్గట్లే ఏపీలోని ఆ ప్రాంతాన్ని రిప్రజెంట్‌ చేసింది. ఈ సినిమాలో గుంటూరు దాని పరిసర ప్రాంతాలను చూపించారు. ఇందులో మహేష్‌ది గుంటూరు కావడంతో పదే పదే ఆ ఊరి పేరు సినిమాలో వినిపించడం గమనార్హం.&nbsp; బలగం (Balagam) ప్రియదర్శి (Priyadarsi) హీరోగా జబర్దస్త్ ఫేమ్‌ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ చిత్రం గతేడాది ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలంగాణ గ్రామాలకు అద్దం పట్టింది. ఊర్లో ప్రజల మధ్య ఉండే అనుబంధాలను తెలియజేసింది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో అనుసరించే విధానాలను కళ్లకు కట్టింది రంగస్థలం (Rangasthalam) రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం 1980ల నాటి గోదావరి పరివాహక గ్రామాలను గుర్తు చేస్తుంది. ఇందులో రామ్‌చరణ్‌ చిట్టిబాబు పాత్రలో గోదావరి జిల్లాల అబ్బాయిగా కనిపించాడు. తన యాస, భాషతో ఆకట్టుకున్నాడు.&nbsp; దసరా (Dasara) హీరో నాని నటించిన దసరా సినిమాను గమనిస్తే.. తెలంగాణలోని పెద్దపల్లి/రామగుండం ఏరియాల ప్రభావం కథపై కనిపిస్తుంది. నాని కూడా స్థానిక భాషలో డైలాగ్స్ చెప్పి మెప్పించాడు. సింగరేణి బొగ్గుగనుల సమీపంలో జీవించే వారి జీవితాలకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరరూపం ఇచ్చారు. ఈ సినిమాను చూసి ఆ ప్రాంత వాసులు అప్పట్లో సంతోషం వ్యక్తం కూడా వ్యక్తం చేశారు.&nbsp; కలర్‌ఫొటో (Colour Photo) కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం.. మంచి విజయాన్ని సాధించింది. స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా గుర్తింపు పొందింది. అయితే ఈ సినిమా కథ మెుత్తం కోనసీమ చుట్టూ తిరుగుతుంది. అక్కడి అందాలను డైెరెక్టర్‌ తెలుగు ఆడియన్స్‌కు చూపించారు. ఈ సినిమా ద్వారానే హాస్య నటుడు సుహాస్ హీరోగా మారాడు.&nbsp; ఉప్పెన (Uppena) యంగ్ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ (Panja Vaishnav Tej), డైరెక్టర్‌ బుచ్చిబాబు (Buchi Babu) కాంబోలో వచ్చిన ఉప్పెన చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కాకినాడ తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల జీవన స్థితులను డైరెక్టర్ కళ్లకు కట్టాడు. చేపల వేటకు వెళ్లినప్పుడు వారు ఎంత కష్టపడతారో చూపించారు.&nbsp; కొత్త బంగారు లోకం (Kotha Bangaru Lokam) వరుణ్‌ సందేశ్ (Varun Sandesh) హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో రూపొందిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాను 50 శాతానికి పైగా రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. ఆ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తారో దర్శకుడు చూపించారు. అక్కడ వారి మనసులు ఎంత స్వచ్చంగా ఉంటాయో తెలియజేశారు. విరాట పర్వం (Virata parvam) హీరో రానా, సాయిపల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 1990-92 ప్రాంతంలో మలుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎలా జీవించారో తెలియజేస్తుంది. రాజకీయ నాయకులు, మావోయిస్టులు, పోలీసులు ప్రభావం అప్పట్లో ఎలా ఉండేదో చూపించారు.&nbsp; ఇస్మార్ట్ శంకర్‌ (Ismart Shankar) రామ్‌పోతినేని, పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ను పరిశీలిస్తే.. ఇందులో హీరో ఓల్డ్‌ సిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తన మాటలు, హావ భావాలు కూడా ఆ ప్రాంత వాసులను గుర్తుచేస్తాయి. ఇందులో హీరోయిన్‌గా చేసిన నభా నటేష్‌.. వరంగల్‌ పోరీ అంటూ పదే పదే చెప్పుకోవడం గమనార్హం. కేర్ ఆఫ్‌ కంచరపాలెం (C/o కంచరపాలెం) మహా వెంకటేష్‌ (Maha Venkatesh) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. అయితే ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. పాత్రల మాటతీరు కూడా విజయనగరం జిల్లా యాసను పోలి ఉంటాయి. కార్తిక్‌ రత్నం, రాజు, రాధా బెస్సీ, ప్రణీ పట్నాయక్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు.&nbsp; రాజావారు రాణివారు (Raja Vaaru Rani Gaaru) కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా చేసిన 'రాజావారు రాణిగారు'.. ఒక అహ్లాదకరమైన సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఉభయ గోదావరి జిల్లాలను ప్రతిబింబిస్తుంది. అక్కడి గ్రామాల్లో ఉండే కల్మషంలేని వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. గోదావిరి నేటివిటీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.&nbsp; గోదావరి ఆధారంగా వచ్చిన చిత్రాలు టాలీవుడ్‌ చాలా సినిమాలు ఉభయ గోదావరి జిల్లాలను ఆధారంగా చేసుకొని వచ్చాయి. గల గలపారే గోదావరి నది ఆయా చిత్రాల్లో చాలవరకూ సన్నివేశాల్లో ప్రతింబింబిస్తుంది. ‘సితారా’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘అత్తిలి సత్తిబాబు’, ‘బెండు అప్పారావు’, ‘శతమానం భవతి’ తదితర చిత్రాలన్నీ గోదావరి బ్యాక్‌డ్రాప్‌తో వచ్చినవే.&nbsp; .&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?</strong>
    Love Reddy Review: ఒకే కులమైనా ప్రేమకు పరువు అడ్డొస్తే.. ‘లవ్‌ రెడ్డి’ పరిస్థితి ఏంటి?
    నటీనటులు : అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి, ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ తదితరులు రచన, దర్శకత్వం : స్మరణ్‌ రెడ్డి సంగీతం : ప్రిన్స్‌ హెన్రీ సినిమాటోగ్రఫీ : మోహన్‌ చారీ, అస్కర్‌ అలీ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు నిర్మాత : హేమలతా రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 అంజన్‌ రామచంద్ర, శ్రావణిరెడ్డి కీలక పాత్రల్లో స్మరన్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌రెడ్డి’ (Love Reddy Movie Review). ఎన్‌.టి. రామస్వామి, గణేష్‌ డి.ఎస్‌, రవి కళాబ్రహ్మ, వాణి గౌడ పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ క్రమంలో అక్టోబరు 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నారాయణ రెడ్డి (అంజన్‌ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్‌ చేస్తుంటాడు. ఓ రోజు బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)ని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా మారిపోతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్‌ చేస్తుంది. లవ్‌రెడ్డిపై ఇష్టం ఉన్నప్పటికీ దివ్య ఎందుకు రిజెక్ట్‌ చేసింది? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్‌ ఎలాంటి మలుపు తిరిగింది? వీరి ప్రేమ కథ చివరికి సుఖాంతం అయ్యిందా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే ‘లవ్‌రెడ్డి’ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్‌ తండ్రిగా చేసిన ఎన్‌.టి రామస్వామి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్‌ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా చేసిన నటుడుతో పాటు ఇతర పాత్రదారులు తమ పరిధిమేరకు మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే&nbsp; పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే స్వచ్ఛమైన ప్రేమ కథగా దర్శకుడు స్మరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. రొటిన్ స్టోరీనే అయినప్పటికీ ఆంధ్రా - కర్ణాటక నేటివిటితో చాలా సహజంగా తెరకెక్కించారు. పెళ్లి చూపుల సీన్‌తో సినిమాను ప్రారంభించిన డైరెక్టర్‌, హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత నుంచి కథను ఆసక్తికరంగా మార్చారు. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా అనిపిస్తాయి. లవ్‌ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా? లేదా? అన్న క్యూరియాసిటీతోనే ఫస్టాఫ్‌ గడిచిపోతుంది. సెకండాఫ్‌లో హీరో ప్రేమను రిజెక్ట్ చేయడం, అందుకు చెప్పిన కారణం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా నడిపారు దర్శకుడు. క్లైమాక్స్‌తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా స్మరణ్ రెడ్డి మంచి మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే&nbsp; ప్రిన్స్‌ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నటీ నటులుభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీఫస్టాఫ్‌లో సాగదీత సీన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024
    <strong>Veekshanam Review: హత్యలు చేస్తోన్న యువతి 8 నెలల క్రితమే చనిపోతే.. ‘వీక్షణం’ ఎలా ఉందంటే?</strong>
    Veekshanam Review: హత్యలు చేస్తోన్న యువతి 8 నెలల క్రితమే చనిపోతే.. ‘వీక్షణం’ ఎలా ఉందంటే?
    నటీనటులు : రామ్‌ కార్తిక్‌, షైనింగ్‌ కశ్వి, నక్షత్ర నైనా, చిత్రం శ్రీను, దయానంద్‌ రెడ్డి, గాంధీ సమ్మెట, నాగ మహేష్‌, షైనింగ్‌ ఫణి తదితరులు డైరెక్టర్‌ : మనోజ్‌ పల్లేటి సంగీతం : సమర్థ్‌ గొల్లపూడి సినిమాటోగ్రఫీ : సాయిరామ్ ఉదయ్‌ ఎడిటర్‌: జస్విన్‌ ప్రభు నిర్మాతలు : పద్మనాభరెడ్డి, అశోక్‌ రెడ్డి విడుదల తేదీ: 18-10-2024 రామ్ కార్తీక్ (Ram Karthik), క‌శ్వి (Kashvi) జంటగా చేసిన తాజా చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). మ‌నోజ్ ప‌ల్లేటి దర్శకుడు. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. అక్టోబర్‌ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి హైదరాబాద్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు తన చుట్టు పక్కల వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. తన దగ్గరున్న బైనాకులర్స్‌తో అందరి ప్లాట్లలోకి చూస్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో ఉన్న నేహా (కశ్వి)ని చూసి ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అర్విన్ తన ఫోకస్ మరో ఇంటిపై పెడతాడు. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఆమె ఇంటికి రోజు ఎవరో వస్తూ పోతుంటారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకునేందుకు ఇంటికి వెళితే అనూహ్యంగా ఆ యువతి చనిపోయి కనిపిస్తుంది. చనిపోయి కూడా ఎనిమిది నెలలు అవుతుంటుంది. మరి అర్విన్‌ రోజూ చూసిన యువతి ఎవరు? ఆమె ఇంటికి రోజు వచ్చేది ఎవరు? మరి ఆమెది ఆత్మహత్య? హత్యనా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే రామ్ కార్తిక్ ఒక సగటు కుర్రాడు పాత్రలో ఇమిడిపోయాడు. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లోనూ మెప్పించాడు. హీరోయిన్‌గా చేసిన కశ్వి తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టిసేంది. హీరోయిన్‌గా తొలిసినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అంద చందాలు ఒలకబోసింది. మరో కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి కూడా ఆకట్టుకుంది. తక్కువ నిడివి ఉన్నప్పటికీ ఆమె పాత్ర కథపై పెద్ద ప్రభావాన్నే చూపింది. సమ్మెట గాంధీ, చిత్రం శీను, నాగమహేష్ వంటి వాళ్లు కనిపించింది కొద్దిసేపైనా ఆకట్టుకున్నారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దేశంలో చాలా మంది తన పని కన్నా పక్కవారు చేస్తున్న దానిపై ఎక్కువ ఇంట్రస్ట్‌ చూపిస్తుంటారు. దర్శకుడు మనోజ్‌ పల్లేటి ఈ కాన్సెప్ట్‌తోనే సినిమాను రూపొందించడం ప్రశంసనీయం. ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ రొటీన్‌గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ నుంచి ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించాడు డైరెక్టర్. చివరవరకు అదే టెంపోను కంటిన్యూ చేసి సక్సెస్‌ అయ్యాడు. తన కళ్లముందు వరుసగా హత్యలు జరగడం, చేస్తుందనుకున్న అమ్మాయి 8 నెలలు క్రితమే చనిపోయి ఉండటం హీరోతో పాటు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. మధ్యలో కొన్ని సీన్స్ బోర్ తెప్పించినా మెయిన్ స్టోరీపై ఇంట్రెస్ట్ తగ్గకుండా డైరెక్టర్‌ జాగ్రత్తపడ్డారు. ఇక క్లైమాక్స్ అయితే ఈ మధ్య కాలంలో వచ్చే రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. దర్శకుడు మనోజ్ పల్లేటి తొలి చిత్రంతోనే తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాలకు వస్తే సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి అదరగొట్టాడు. నేపథ్య సంగీతంతో సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేశాడు. సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరామ్ కార్తీక్ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా బోరింగ్‌ సీన్స్‌ఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 18 , 2024

    @2021 KTree