ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Youtubeఫ్రమ్
Watch
Free
స్ట్రీమింగ్ ఆన్Hotstar
Watch
Free
రివ్యూస్
How was the movie?
తారాగణం
నిఖిల్ సిద్ధార్థ్
సూర్యత్రిధా చౌదరి
సంజనమధు షా (మధుబాల)
సూర్య తల్లిసాయాజీ షిండే
సంజన తండ్రిరాఘవేంద్రరావుసూర్య స్నేహితుడు
తనికెళ్ల భరణి
ఎర్సంరావు రమేష్
డాక్టర్తాగుబోతు రమేష్
కుల్ఫీ వెండర్హర్ష చెముడు
ఐస్ కోలా విక్రేతసత్య అక్కల
అరుణ సాయిమస్త్ అలీ
జిన్ జుబెర్ప్రవీణ్
అల్లరి సుభాషిణి
రఘువరన్
సూర్య మరణించిన తండ్రి (ఫోటో చూపబడింది)సిబ్బంది
కార్తీక్ గట్టమ్నేని
దర్శకుడుమల్కాపురం శివనిర్మాత
సత్య మహావీర్సంగీతకారుడు
నవీన్ నూలి
ఎడిటర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీడేస్ చిత్రం ద్వారా నటుడిగా గుర్తింపు పొందాడు. కార్తికేయ2, సూర్య Vs సూర్య, శంకరాభరణం వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా గుర్తింపు ఉన్న నిఖిల్ గురించి మీకు తెలియని కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం.
నిఖిల్ సిద్ధార్థ ముద్దు పేరు?
"బేగంపేట బోయ్"
నిఖిల్ సిద్ధార్థ ఎత్తు ఎంత?
5 అడుగుల 10అంగుళాలు
నిఖిల్ తొలి సినిమా?
హ్యాపీ డెస్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో రాజేష్ పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
నిఖిల్ ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్, తెలంగాణ
నిఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జూన్ 1, 1985
నిఖిల్‌కు వివాహం అయిందా?
నిఖిల్ సిద్ధార్థ, పల్లవి వర్మ అనే యువతిని 2020 మే 14న పెళ్లి చేసుకున్నాడు.
విశ్వక్ సేన్ ఫస్ట్ క్రష్ ఎవరు?
తన ఫస్ట్ స్టాండర్డ్‌లో అయేష అనే అమ్మాయిని ఇష్టపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
నిఖిల్‌కు ఇష్టమైన సినిమా?
హ్యాపీడేస్
విశ్వక్ సేన్ ఇష్టమైన హీరో?
పవన్ కళ్యాణ్
నిఖిల్ సిద్ధార్థ్ తొలి హిట్ సినిమా?
హ్యాపీ డేస్ చిత్రం నిఖిల్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. కార్తికేయ2, 18 పెజేస్ చిత్రాలు హిట్లుగా నిలిచాయి.
నిఖిల్‌కు ఇష్టమైన కలర్?
బ్రౌన్ కలర్
నిఖిల్ సిద్ధార్థ్ తల్లిదండ్రుల పేర్లు?
తల్లి వీణా సిద్ధార్థ(మాజీ పాఠశాల ప్రిన్సిపాల్), తండ్రి శ్యామ్ సిద్ధార్థ(ప్రొఫెసర్)
నిఖిల్‌కు ఇష్టమైన ప్రదేశం?
దుబాయ్, లండన్
నిఖిల్ సిద్ధార్థ చదువు?
ఇంజినీరింగ్
నిఖిల్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి?
కార్తికేయ2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఐకానిక్ గోల్డ్, సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు.
నిఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
నిఖిల్ 2024 వరకు 20 సినిమాల్లో నటించాడు.
నిఖిల్‌కు ఇష్టమైన ఆహారం?
నాన్ వెజ్
నిఖిల్ తొలి పారితోషికం?
హ్యాపీడేస్ చిత్రానికి గాను నిఖిల్ రూ.25,000 తీసుకున్నట్లు చెప్పాడు
నిఖిల్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
నిఖిల్ ఒక్కో సినిమాకి దాదాపు రూ.5 నుంచి రూ.10కోట్ల వరకు తీసుకుంటున్నాడు
నిఖిల్ సిద్ధార్థ అభిరుచులు?
పుస్తకాలు చదవడం, ఫుట్‌బాల్ ఆడటం
నిఖిల్‌కు ఇష్టమైన హీరోయిన్?
భూమిక చావ్లా
నిఖిల్‌కు ఇష్టమైన హిందీ సినిమాలు?
షోలే, 3 ఇడియట్స్
https://www.youtube.com/watch?v=waTLUNgxueo
మార్చి 21 , 2024
Telugu Unique Movies: లోపంతో వచ్చి హిట్ కొట్టారు.. తెలుగులో కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన హీరోలు
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. మరెన్నో యాక్షన్ సినిమాలు ప్రేక్షకులను అలరించారు. హర్రర్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్లలో వచ్చిన మూవీలు సైతం వెండితెరను పలకరించాయి. అయితే రొటీన్ కథలతో విసిగిపోయిన టాలీవుడ్‌కు కొన్ని సినిమాలు కొత్తదనాన్ని పరిచయం చేశాయి. హీరోకు లోపం ఉన్న కథతో వచ్చి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. కొత్తగా ట్రై చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తాయని నిరూపించాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? లోపంతో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఇప్పుడు చూద్దాం.
పుష్ప
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అల్లుఅర్జున్ ఒక లోపంతో కనిపిస్తాడు. అతడి కుడి భుజం సహజంగా కంటే మరీ పైకి ఉంటుంది. సినిమా అంతా బన్నీ అలాగే ఉంటాడు. భుజాన్ని అలాగే పైకి పెట్టి షూటింగ్‌లో పాల్గొనటం ఎంతో కష్టంగా అనిపించిందని ఓ సందర్భంలో బన్నీ చెప్పుకొచ్చాడు.
రంగస్థలం
రామ్‌చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఎదుటి వ్యక్తి పెదాల కదలికలను బట్టి మాటలను ఆర్థం చేసుకుంటాడు. క్లైమాక్స్‌లో ఆ చెవిటి తనమే చెర్రీకి సమస్యగా మారుతుంది. తనను ఎవరూ చంపారో అన్న చెప్పినప్పటికీ అది బుచ్చిబాబు చెవికి ఎక్కదు. చివరకు విలన్ ప్రకాష్‌రాజ్ అని తెలుసుకొని చంపేయడంతో కథ సుఖాంతమవుతుంది.
రాజా ది గ్రేట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా టాలీవుడ్ భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో రవితేజకు కళ్లు కనిపించవు. బ్లైండ్‌గా ఉంటూ రవితేజ చేసిన కామెడీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమా టాలీవుడ్‌లో మంచి డైరెక్టర్‌గా అనిల్ రావిపూడిని నిలదొక్కుకునేలా చేసింది.
సూర్య vs సూర్య
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రం ‘సూర్య vs సూర్య’. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ జన్యుపరమైన లోపంతో బాధపడుతుంటాడు. అతడి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటంతో పగటివేళ బయటకు వెళ్తే 15 నిమిషాల్లో చనిపోతాడని వైద్యులు చెబుతారు. దీంతో రాత్రివేళ మాత్రమే హీరో బయటకు వస్తుంటాడు. ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
భలే భలే మగాడివోయ్
హీరో నాని, డైరెక్టర్ మారుతీ కాంబోలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో నాని మతిమరుపుతో బాధపడుతుంటాడు. ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతూ నవ్వులు పూయించాడు. అయితే అతడికున్న ఆ సమస్య కొన్ని చిక్కులను సైతం తెచ్చిపెడుతుంది. హీరోయిన్‌తో తన ప్రేమకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది.
సవ్యసాచి
నాగచైతన్య హీరోగా చేసిన ‘సవ్యసాచి’ చిత్రం ఇప్పటివరకూ వచ్చిన తెలుగు సినిమాలకు పూర్తి భిన్నం. ఇందులో హీరో ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే లోపంతో బాధపడుతుంటాడు. అవిభక్త కవలలుగా పుట్టాల్సిన ఇద్దరు ఒకరిగా కలిసిపోవడమే ఈ సమస్యకు కారణం. ఇందులో నాగచైతన్య మెదడు, ఎడమ చేయి కవల సోదరుడి ఆధీనంలో ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాసుల వర్షం కురిపించనప్పటికీ ఒక మంచి సినిమాగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
నా పేరు సూర్య
అల్లుఅర్జున్ హీరోగా వక్కంతం వంశీ రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య‘. ఇందులో బన్నీ సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో బన్నీకి విపరీతమైన కోపం ఉంటుంది. దాంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సైన్యం నుంచి సస్పెండ్ కూడా అవుతాడు. ఇందులో అల్లుఅర్జున్ అగ్రెసివ్ యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
మే 31 , 2023
Rajanikanth vs Suriya: స్టార్ హీరోల మధ్య బిగ్ ఫైట్.. బాక్సాఫీస్ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్ ఫైట్ లాక్ అయ్యింది. ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
రజనీకాంత్ vs సూర్య
తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్ ఫిల్మ్ వేట్టయాన్‌ను మేకర్స్ లాక్ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.
భారీ తారాగణం
సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్ డాల్ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్ రాజ్, జగపతిబాబు, డైరెక్టర్ కే.ఎస్. రవికుమార్ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.
గిరిజన యోధుడిగా 'సూర్య'
కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
రజనీకాంత్- అమితాబ్
ఇక రజనీకాంత్ హీరోగా చేసిన 'వేట్టయాన్' సినిమాకి 'జై భీమ్' వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, రావు రమేష్ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్ అయిన పోలీసు ఆఫీసర్.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్ యాక్షన్ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అటు టాలీవుడ్‌లోనూ..
టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ vs రామ్‌చరణ్ బాక్సాఫీస్ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్ డేట్ ఆగస్టు 15 నుంచి డిసెంబర్ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్-శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్ మెుదటి వారంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ చేయాలని భావిస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదు.
జూన్ 28 , 2024
Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. సుకుమార్ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ ఆసిస్టెంట్ డైరెక్టర్లు:
శ్రీకాంత్ ఓదెల(srikanth odela)
టాలీవుడ్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు మార్మోగుతోంది. డైరెక్టర్‌గా చేసిన తొలి సినిమాతోనే శ్రీకాంత్ బాక్సాఫీసును బద్దలు కొట్టాడు. నానితో చేసిన ‘దసరా’( DASARA ) సినిమాను రూ.100 కోట్ల క్లబ్‌లో చేర్చాడు. అయితే శ్రీకాంత్ ఈ సినిమాకు ముందు వరకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల సక్సెస్‌కు తనవంతు సాయం చేశాడు. శ్రీకాంత్ ఓదెల లేకుండా రంగస్థలం ఇంత బాగా వచ్చేది కాదని ఓ సందర్భంలో సుకుమార్ చెప్పారంటే ఈ డైరెక్టర్ టాలెంట్ అర్థమవుతోంది.
https://telugu.yousay.tv/srikanth-odela-went-around-sukumars-house-for-4-years-for-opportunities-dussehra-director-emotional.html
https://twitter.com/vamsikaka/status/1642932721612894208?s=20
బుచ్చిబాబు(Buchi Babu Sana)
సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి డైరెక్టర్‌గా ఎదిగిన వ్యక్తి బుచ్చిబాబు. తొలి సినిమా ఉప్పెనతో బుచ్చిబాబు ఓ ప్రభంజనమే సృష్టించాడు. సుకుమార్ నేర్పిన పాఠాలను చక్కగా అవపోసన పట్టిన ఆయన మెుదటి సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపించాడు. అరంగేట్ర హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టిని స్క్రీన్‌పై చక్కగా ప్రెజెంట్ చేశాడు. ఉప్పెన ఘనవిజయం ద్వారా రామ్‌చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ను బుచ్చిబాబు కొట్టేశారు. తన 16వ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తారని స్వయంగా చరణ్ చెప్పే స్థాయికి ఎదిగాడు.
పల్నాటి సూర్యప్రతాప్(Palnati surya pratap)
సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన పల్నాటి సూర్యప్రతాప్ కూడా తన తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కుమారి 21F చిత్రం ద్వారా తన టాలెంట్ ఎంటో నిరూపించుకున్నాడు. ఇటీవల హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ జంటగా ‘18 పేజెస్’ సినిమాను సూర్య తీశాడు. క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. కాగా, సుకుమార్ తీసిన 1 నేనొక్కడినే, రంగస్థలం, పుష్పకు సూర్య స్క్రీన్ రైటర్‌గా పనిచేశాడు.
రాజమౌళి ఆసిస్టెంట్ డైరెక్టర్లు: (Rajamouli assistant directors)
G.R కృష్ణ( GR KRISHNA )
టాలీవుడ్ డైరెక్టర్ G.R కృష్ణ తొలుత రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సింహాద్రి సినిమా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన కృష్ణ.. ఆశించిన రేంజ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 2019 నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న కృష్ణ ఇప్పటివరకూ మరో సినిమాను పట్టాలెక్కించలేదు.
కరుణ కుమార్ ( KARUNA KUMAR)
మరో టాలీవుడ్ డైరెక్టర్ కరుణ కుమార్ కూడా రాజమౌళి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్‌గా పలు సినిమాలు చేసి మెప్పించలేకపోయాడు. అయితే ఆయన తొలి సినిమా ‘పలాస’ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత తీసిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం వంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందలేక పోయాయి.
అశ్విన్ గంగరాజు (ASHWIN GANGA RAJU)
డైరెక్టర్ అశ్విన్ గంగరాజు సైతం రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైెరెక్టర్‌గా పనిచేశాడు. ఈగ, బాహుబలి-1, బాహుబలి-2 విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 2021లో ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా అశ్విన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
రాజమౌళి హీరోలకూ ఫ్లాపుల బెడద..!
రాజమౌళి శిష్యులే కాదు ఆయనతో సినిమా తీసిన హీరోలు సైతం తమ తర్వాతి సినిమాల్లో ఫెయిల్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జూ. NTR
రాజమౌళి తన మెుదటి సినిమా ‘స్టూడెంట్ నెం.1’ను ఎన్టీఆర్‌తో తీశారు. అది సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘సుబ్బు’ సినిమా ఫ్లాప్ అయింది. మళ్లీ ఎన్టీఆర్‌తో ‘సింహాద్రి’ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. అది కూడా ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తీసిన ‘ఆంధ్రావాల’ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. మరోమారు ఎన్టీఆర్‌తోనే రాజమౌళి యమదొంగ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ చేసిన కంత్రి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రభాస్
2005లో రాజమౌళి ప్రభాస్‌తో ఛత్రపతి సినిమా తీశారు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కానీ ఆ తర్వాత ప్రభాస్ తీసిన పౌర్ణమి చిత్రం ఫ్లాప్ అయ్యి ప్రభాస్‌ను నిరాశ పరిచింది.
ఛత్రపతి తర్వాత ప్రభాస్‌తో కలిసి బాహుబలి, బాహుబలి 2 సినిమాలను రాజమౌళి తీశారు. ఆ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ అమాంతం పెంచేశాయి. ప్రభాస్‌ను పాన్‌ఇండియా స్టార్‌గా నిలబెట్టాయి. కానీ, ఆ సినిమాల తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
రామ్‌చరణ్
‘ఆర్‌ఆర్‌ఆర్’కు ముందు రామ్‌చరణ్‌తో ‘మగధీర’ సినిమాను రాజమౌళి తీశారు. 2009లో వచ్చిన ఈ సినిమా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత 2010లో రామ్‌చరణ్ తీసిన ఆరెంజ్ సినిమా దారుణంగా విఫలమైంది.
రాజమౌళితో మర్యాదరామన్న చేసిన సునీల్ కూడా ఆ సినిమా తర్వాత సరైన సక్సెస్ రాక ఇబ్బందులు పడ్డాడు. అటు నాని సైతం రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమా తర్వాత ఫ్లాప్ అందుకున్నాడు. నాని, సమంత జంటగా వచ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఏప్రిల్ 06 , 2023
సోషల్ మీడియాలో #RC15 vs #JrNTR ఫ్యాన్ వార్… ట్రెండింగ్‌లో పోటా పోటీ
ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్స్ అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్. ఎందుకంటే గత రెండు నెలలుగా దాదాపు వీరిద్దరి పేరు ట్విటర్‌లో మార్మోగుతుంది. ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. పోటాపోటీగా హ్యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR పేరు ట్రెండింగ్‌లోకి రాగా.. ఇప్పుడు RC15 ట్రెండ్ నడుస్తోంది. టైటిల్ ప్రకటన చరణ్ పుట్టినరోజు ప్రకటిస్తామని దిల్ రాజు చెప్పటంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు.
ట్విటర్ వార్
గత కొన్ని నెలలుగా రామ్ చరణ్ ఏదో విధంగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నారు. HCA అవార్డ్ వచ్చినప్పటి నుంచి చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్యాన్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ట్వీట్లు పెడుతూ ఇద్దరిని ట్రెండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు jrNTR హ్యాష్ ట్యాగ్ దూసుకెళ్లగా.. ఇప్పుడు RC15పై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్కార్ ముంగిట ఇద్దరి హీరోల అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు.
హ్యాష్‌ట్యాగ్స్‌తో హల్‌చల్
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయటంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోను సృష్టించారు అభిమానులు.
https://twitter.com/i/status/1632680528578228224
అభిమాన నటుడితో నటిస్తున్నట్లు జాన్వీ ట్వీట్ చేయగా… ఆమెను స్వాగతిస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పిన స్క్రీన్ షాట్లు తీసి తెగ షేర్ చేశారు.
(1) Fukkard on Twitter: "On Cards ? #Dhanush - #JrNTR - #Vetrimaaran https://t.co/UXMEORDP78" / Twitter
షారుఖ్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఓ వార్తను ట్విటర్‌లో ట్రెండ్ చేయగా.. వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్, ధనుష్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తారక్ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు.
https://twitter.com/Fukkard/status/1633109919753805826?s=20
యంగ్ టైగర్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేసుకున్న వీడియోలు. అందులో కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ వైరల్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1633007975412400132
టైటిల్‌పై రచ్చ
మరోవైపు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న RC15 సినిమా గురించి నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. చిత్రానికి C.E.O అనే టైటిల్ పెట్టారని టాక్ రావటంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక చరణ్ పుట్టిన రోజున టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్ రాజు చెప్పేశాడు. దీంతో ట్విటర్‌లో RC15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్
RRR తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారీ చిత్రాల దర్శకుడు చరణ్‌తో సినిమా తీస్తుండటమే ఇందుకు కారణం. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండటంతో పాటు ఎస్‌జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలు
RC15కు శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొనటం సహజం. విభిన్న చిత్రాలు రూపొందించే ఆయన చరణ్‌తో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథను ఎంచుకొని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో IAS అధికారిగా చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది. దీంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
టైటిల్ ఇదేనా?
సినిమా టైటిల్ గురించే ఇప్పుడే అతిపెద్ద చర్చ. చిత్రానికి CEO అనే టైటిల్ ఖరారు చేశారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బయటకు వినిపిస్తున్న కథకు… టైటిల్ కూడా సెట్ కావటంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. హిట్ ఖాయమని కామెంట్లు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1633351074508845058
బర్త్‌డే కానుక
చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటిస్తామని నిర్మాత దిల్‌రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దర్శకుడు శంకర్ లోగోను తీర్చిదిద్దుతున్నారని మార్చి 27 బర్త్‌డే రోజున విడుదల చేస్తామని వెల్లడించారు. సినిమా విడుదలపై కూడా అటు ఇటుగా ఓ స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
https://twitter.com/i/status/1633737854919606273
ఫ్యాన్స్ నిరాశ
సినిమా ప్రకటించిన తర్వాత షూటింగ్ జరుగుతున్నా చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్‌లు లేవు. ఏ పండగకి కూడా ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. ఒక్కోసారి దిల్‌రాజు హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తుండటం అభిమానుల్లో జోష్ నింపింది.
మార్చి 09 , 2023
This Week Movies: ఈ వారం థియేటర్లలో రెండే బడా చిత్రాలు.. ఓటీటీలో అలరించేవి ఇవే!
గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సందడి చేశాయి. అయితే నవంబర్ మూడో వారంలో రెండు బిగ్ ఫిల్మ్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకదానితో ఒకటి ఢీ కొడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
కంగువా (Kanguva)
తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్ వాంటెడ్ చిత్రం 'కంగువా'. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళం తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నటి దిశా పటానీ, బాబీ దేవోల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 10వేల స్క్రీన్స్‌లో కంగువాను రిలీజ్ చేస్తున్నారు. త్రీడీలోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు.
మట్కా (Matka)
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
ఉషా పరిణయం (Usha Parinayam)
కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పెట్టి స్టార్ డైరెక్టర్ కె. విజయ్‌భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉషా పరిణయం’. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యువతను మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో నవంబరు 14 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ (Freedom At Midnight)
‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించారు. 1947 స్వాతంత్రం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, గాంధీ పాత్ర నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. హిందీతో పాటు, తెలుగులోనూ ఈ సిరీస్ నవంబరు 15వ తేదీ నుంచి ఓటీటీ వేదిక సోనీలివ్‌లో (SonyLiv) స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateTelisinavallu MovieTeluguAhaNov 8VettaiyanMovieTeluguAmazonNov 8ViswamMovieTeluguAmazonNov 1Return Of The King Documentary MovieEnglishNetflixNov 13Hot FrastySeriesEnglishNetflixNov 13Emilia PérezSeriesEnglishNetflixNov 13Cobra KaiSeriesEnglishNetflixNov 15Jake Paul vs. Mike TysonMovieEnglishNetflixNov 15In Cold WaterSeriesEnglishAmazon Nov 12CrossSeriesEnglishAmazon Nov 14Last World WarMovieEnglishAmazon Nov 8Deadpool & WolverineSeriesEnglishHotstarNov 12On Almost Christmas StoryAnimationTeluguHotstarNov 15Saint Denis MedicalSeriesEnglishJio CinemaNov 13The Day of the JackalSeriesEnglishJio CinemaNov 13Unstoppable S4 (Allu arjun)Talk ShowTeluguAhaNov 15
నవంబర్ 11 , 2024
Fan War : ఆ హీరోల ఫ్యాన్స్ వల్లే బలహీనపడుతున్న ఫిల్మ్ ఇండస్ట్రీ.. చెక్ పెట్టకుంటే ముప్పు తప్పదా!
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అనగానే బాలీవుడ్ మాత్రమే గుర్తుకువచ్చేది. హిందీ స్టార్లను మాత్రమే పాన్ ఇండియా సెలబ్రిటీలుగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సౌత్ ఇండస్ట్రీ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో అలరిస్తోంది. ముఖ్యంగా సౌత్ నుంచి టాలీవుడ్ (Tollywood), కోలివుడ్ (Kollywood) ఇండస్ట్రీల నుంచి మంచి కంటెంట్ ఉన్న పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అవి బాలీవుడ్ ఆదిపత్యానికి చెక్ పెడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏకత్రాటిపై ఉండాల్సిన సౌత్ ఇండస్ట్రీస్ అభిమానులు చేస్తోన్న ఫ్యాన్ వార్స్ కారణంగా బలహీన పడుతోంది. దీనిని కట్టడి చేయకపోతే మున్ముందు రోజుల్లో సౌత్ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ vs కోలీవుడ్
గతంలో ఫ్యాన్ వార్ అంటే ఒక ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమై ఉండేది. హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు పోస్టుల రూపంలో విమర్శలు చేసుకునేవారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా కారణంగా ఇది పక్క ఇండస్ట్రీలపైకి కూడా పాకింది. తమ హీరో తీసిన సినిమా కంటే పక్క ఇండస్ట్రీ స్టార్ చేసిన చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ పోకడ సౌత్‌లో టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో ప్రధానంగా కనిపిస్తోంది. తమిళ హీరో విజయ్ చేసిన చిత్రాలు రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. అదే సమయంలో మన హీరోల సినిమాలు వచ్చినప్పుడు అంతే స్థాయిలో తమిళులు సైతం నెట్టింట యాంటీ ప్రచారం చేస్తున్నారు.
https://twitter.com/iammvengence/status/1758435868799377642
https://twitter.com/RAO_Offl/status/1759121949656318267
నష్టం ఏంటంటే?
కొద్దిమంది మాత్రమే చేసే ఈ ఫ్యాన్ వార్ వల్ల హీరోలకు, సినిమా ఇండస్ట్రీలకు వచ్చే నష్టం ఏముందిలే అని చాలా మంది భావించవచ్చు. కానీ అది పొరపాటు. కొద్ది మంది ఫ్యాన్స్ చేస్తున్న ఈ ట్రోల్స్ చూసి ఆయా ఇండస్ట్రీలకు చెందిన చాలా మంది ఆడియన్స్ ప్రభావితమవుతున్నారు. దాని వల్ల సహజంగానే పక్క ఇండస్ట్రీకి చెందిన హీరోపై వారిలోనూ తెలియకుండానే ద్వేషం ఏర్పడుతోంది. ఫలితంగా పక్క ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా రిలీజైనప్పుడు దానిని చూడకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల నార్త్‌లో బాగా రాణించిన సినిమాలు ఎంతో కీలకమైన సౌత్‌లో దెబ్బతింటున్నాయి. అది మూవీ ఓవరాల్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. సినిమా ఎంత బాగున్నప్పటికీ మనం చేసుకుంటున్న నెగిటివ్ ట్రోల్స్ కారణంగా ఆ సినిమా హిందీ మూవీస్ కంటే కలెక్షన్స్ పరంగా వెనకబడిపోతున్నాయి.
ఆ సినిమాలకు దెబ్బ!
త్వరలో రిలీజ్ అయ్యేందుకు సౌత్ నుంచి పలు పాన్ ఇండియా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ నుంచి ‘పుష్ప 2’, ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకోగా కోలీవుడ్ నుంచి సూర్య నటించిన ‘కంగువా’, శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్క్రిప్ట్‌తో రూపొందినవే. గతంలో లాగే ఈ సినిమాల విషయంలోనూ ఫ్యాన్స్ ఇండస్ట్రీల పరంగా విడిపోయి ట్రోల్స్ దిగితే గట్టి ఎదురుదెబ్బ తప్పదని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా బాగుంటే ఇండస్ట్రీలకు అతీతంగా వాటిని ఆదరించాలని కోరుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయా చిత్రాలు మంచి వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో ఘనమైన కలెక్షన్స్ సాధించగలుగుతాయని పేర్కొంటున్నాయి. అలా కాకుండా మళ్లీ ఫ్యాన్ వార్‌కు దిగితే పరోక్షంగా లాభపడేది బాలీవుడ్‌యే అని స్పష్టం చేస్తున్నాయి.
టైటిల్స్ రచ్చకు చెక్ పెట్టాల్సిందే!
సౌత్‌లో బిగ్ ఇండస్ట్రీలుగా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన దర్శక, నిర్మాతలు తమ వైఖరితో ఫ్యాన్ వార్‌కు ఆజ్యం పోయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇటీవల కాలంలో కోలీవుడ్ చిత్రాలు నేరుగా తమిళ టైటిల్స్‌తో తెలుగులోనూ రిలీజ్ కావడం ఎక్కువగా చూస్తున్నాం. కంగువా, వేట్టయన్‌తో పాటు అంతకుముందు వచ్చిన ‘తంగలాన్’, ‘రాయన్’, ‘వెలిమై’ తమిళ పేర్లను పెట్టడం వల్ల ఇది తెలుగు ఆడియన్స్‌లో ఆగ్రహానికి కారణమైంది. కొందరు చేసిన తప్పిదాలు కారణంగా మెుత్తం తమిళ ఇండస్ట్రీపైనే ద్వేషం వచ్చే ప్రమాదం తలెత్తుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమిళ ఇండస్ట్రీ జాగ్రత్తపడాలి.
పొలిటికల్ టర్న్
ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల సనాతన ధర్మం పరిరక్షణలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టించాయి. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశిస్తూ పవన్ చేసిన పరోక్ష కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ తరహాలోనే ఉదయనిధి స్టాలిన్ తమిళ నటుడు కావడంతో ఈ వివాదం తెలుగు, తమిళ ఇండస్ట్రీల మధ్య వార్‌గా కూడా మారిపోయింది. ఇరువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరస్పరం మాటల దాడి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌తో ఉదయనిధిని పోలుస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అటు ఉదయనిధి విద్యార్హతను తెరపైకి తీసుకొచ్చి పవన్‌పై తమిళ నెటిజన్లు విమర్శలు చేశారు.
https://twitter.com/i/status/1841876236840374698
పవన్ కల్యాణ్ vs అల్లు అర్జున్
టాలీవుడ్‌లోని అతిపెద్ద సినీ నేపథ్యమున్న కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఆ ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా నటులు ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఆ కుటుంబానికి చెందిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌కు అసలు పడటం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో(Pawan Kalyan vs Allu Arjun) పవన్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో ఈ వివాదం ఆజ్యం పోసుకుంది. అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం వారికి దీటుగా బదులిస్తూ తమ హీరోకు అండగా నిలుస్తోంది. అయితే ఇటీవల ఓ ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌కు చెందిన హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరును ప్రస్తావించారు. ఆ హీరోలంటే తనకు ఎంతో గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ వివాదానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే బన్నీ పేరును పవన్ తీసుకొచ్చినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప 2 చిత్రాన్ని ప్రమోట్ చేయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అక్టోబర్ 17 , 2024
Hari Hara Veera Mallu: సమ్మర్ బరిలో పవర్‌స్టార్.. ఢీ కొట్టేందుకు సై అంటున్న విజయ్ దేవరకొండ!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లిపోతాయి. అయితే గత కొంతకాలంగా థియేటర్లలో పవన్ ఫ్యాన్స్ హడావుడి తగ్గింది. ఎందుకుంటే బ్రో సినిమా తర్వాత పవన్ నుంచి ఒక్కసినిమా కూడా రాలేదు. రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో చేతిలో ఉన్న మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ తిరిగి సెట్‌లోకి ఎప్పుడు వస్తాడా? ఆయన్ను మళ్లీ తెరపై ఎప్పుడు చూస్తామా? అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. విడుదల తేదీతో కూడిన అదిరిపోయే పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అదే రోజున విజయ్ దేవరకొండ చిత్రం కూడా బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ మార్చి 28న విడుదల కానుంది’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పవన్ కత్తిపైకెత్తి వారియర్‌లా కనిపించారు. ఇది చూసిన పవన్ అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. హరి హర వీరమల్లు సూపర్ హిట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో స్టేటస్ ఉన్నప్పటికీ ఆయన నుంచి ఇప్పటివరకూ ఒక్క పాన్ ఇండియా చిత్రం రాలేదు. ‘హరి హర వీరమల్లు’ పవన్‌కు తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish) కొంత భాగం తెరకెక్కించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆ చిత్రాల్లోనూ కదలిక!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. నేటి నుంచి (సెప్టెంబర్ 23) విజయవాడలో హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
పవన్ vs విజయ్ దేవరకొండ!
హరి హర వీరమల్లు రిలీజ్ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద పవన్, విజయ్ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా అదే రోజున హరిహర వీరమల్లు వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని అంటున్నారు. పవన్ లాంటి బిగ్‌స్టార్‌ను ఢీకొట్టేందుకు తమ హీరో సిద్ధమంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు 'VD 12'ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్ చేసే అవకాశం లేకపోదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటిస్తున్న 'సికిందర్' చిత్రం పవన్‌కు పోటీగా మారే అవకాశముంది. ఈ చిత్రాన్ని 2025 ఈద్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పాన్ ఇండియా స్థాయిలో వీరమల్లు వస్తుండటంతో నార్త్‌లో ప్రభావం చూపించవచ్చు.
సెప్టెంబర్ 23 , 2024
Rajanikanth vs KS Ravi Kumar: రజనీపై తమిళ డైరెక్టర్ సంచలన ఆరోపణలు.. అదేంటి అంత మాట అనేశారు!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయన్ను అభిమానులు ప్రేమిస్తుంటారు. టాలీవుడ్‌లో రజనీకి మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది. అటువంటి రజనీకాంత్‌పై ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ (K.S. Ravi Kumar) సంచలన ఆరోపణలు చేశారు. తన సినిమా ఫ్లాప్ కావడానికి కారణం రజనీ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కోలివుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
‘రజనీ.. గందరగోళం చేసేశారు’
సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్‌గా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్ కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మూడు చిత్రాలకు వర్క్!
దర్శకుడు కె.ఎస్. రవి కుమార్‌కు కోలీవుడ్‌లో మంచి గుర్తింపే ఉంది. అటు రజనీకాంత్‌తో కూడా ఆయన మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. ‘లింగ’కు ముందు కూడా ఆయన రజనీతో పనిచేసారు. ‘ముత్తు’, ‘నరసింహా’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అనంతరం వీరి కాంబోలో 2014లో ‘లింగ’ సినిమా వచ్చింది. సందేశాత్మక కంటెంట్‌తో వచ్చిన ఈ మూవీలో రజనీ ద్విపాత్రాభినయం చేశారు. సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120-130 కోట్లు వసూలు చేసింది.
33 ఏళ్ల తర్వాత మణిరత్నంతో..!
రజనీకాంత్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్ డైరెక్టర్ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
అస్వస్థతకు గురై కోలుకున్న రజనీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అస్వస్థకు గురై కోలుకున్నారు. సెప్టెంబర్ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని అక్టోబర్ 3 రాత్రి డిశ్చార్జ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
దసరా బరిలో రజనీ చిత్రం
రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం ‘వేట్టయాన్’ ఈ వారంలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ‘జై భీమ్’ వంటి సోషల్ మెసేజ్ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘కూలీ’లో స్టార్ క్యాస్ట్!
ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో ‘కూలీ’ అనే మరో బిగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస హిట్స్ తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్ 1421’ దేవాగా రజనీకాంత్ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్ పాత్ర చేస్తున్నాడు. సైమన్ అనే క్రూయల్ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి పాపులర్ నటులు ఈ బిగ్ ప్రాజెక్టులో భాగమయ్యారు.
అక్టోబర్ 07 , 2024
Kajal Aggarwal: కాజల్ Vs పాయల్ రాజ్‌పుత్.. ఈ ముద్దుగుమ్మల పోరులో గెలుపెవరిది!
గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే థియేటర్లలో విడుదలై సందడి చేస్తూ వచ్చాయి. ఇందులో కొన్ని హిట్ టాక్ తెచ్చుకుంటే మరికొన్ని ఫ్లాప్‌గా నిలిచి.. నెల అయినా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ వారం కూడా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి రాకపోవడం ఆడియన్స్ కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయితే ఈ వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతున్నాయి. ప్రముఖ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’, పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో చేసిన ‘రక్షణ’ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారోనని ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.
తొలిసారి ఖాకీ డ్రెసుల్లో..
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల తెరకెక్కించిన చిత్రం 'సత్యభామ' (Satyabhama). బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పోలీసు అధికారిణిగా కనిపించనుంది. ఆమె పోలీసు ఆఫీసర్‌గా చేయడం కెరీర్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది. అటు పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) చేసిన లేడీ ఓరియెంటేడ్ చిత్రం 'రక్షణ' (Rakshana) కూడా జూన్ 7వ తేదీనే థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇందులోనూ పాయల్ కూడా తొలిసారి ఖాకీ దుస్తుల్లో ప్రేక్షకులను అలరించనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానుండటంతో కాజల్, పాయల్ మధ్య కోల్డ్ వార్ మెుదలైనట్లు కనిపిస్తోంది.
యాక్షన్‌తో రాణించేనా!
కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ గత చిత్రాలను పరిశీలిస్తే.. వీరు గ్లామర్‌తోనే ఆడియన్స్‌ను ఎక్కువగా అలరించారు. అటువంటిది తొలిసారి వీరిద్దరు ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అది కూడా ఎంతో పవర్‌ఫుల్ అయినా పోలీసు అధికారిణి పాత్రల్లో థియేటర్లలోకి వస్తున్నారు. మరి వీరు యాక్షన్ సీక్వెన్స్‌లో ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన ‘సత్యభామ’, ‘రక్షణ’ ట్రైలర్స్ రెండూ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కాజల్, పాయల్ రాజ్‌పుత్ ఇద్దరూ తమ యాక్షన్‌తో దుమ్మురేపినట్లే కనిపిస్తోంది. కాజల్, పాయల్ మధ్య ప్రస్తుతం నెలకొన్న థగ్ ఆఫ్ వార్‌లో విజయం ఎవరిదో ఈ శుక్రవారం (జూన్ 7) తేలిపోనుంది.
ఇతర చిత్రాలు
ఈ శుక్రవారం సత్యభామ, రక్షణ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో రూపొందిన 'లవ్ మౌళి' (Love Mouli) చిత్రం.. అనేక వాయిదాల తర్వాత ఈ వారమే థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. అలాగే శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మనమే’ (Maname) కూడా ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ మూవీకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. మరోవైపు సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రలో నటించిన 'వెపన్' (Weapon) చితరం కూడా ఈ శుక్రవారం మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. వార్నర్ బ్రదర్స్, మార్వెల్ తరహాలో సూపర్ హ్యూమన్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
https://telugu.yousay.tv/this-week-movies-these-are-the-films-series-that-will-double-your-happiness-this-week.html
జూన్ 04 , 2024
Pawan vs Jr NTR: పవన్ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్ ‘దేవర’.. ఎందుకంటే?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG), జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
క్లాష్ ఎలా వచ్చిందంటే?
పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 27న వస్తుండగా.. తారక్ దేవర మూవీ అక్టోబర్ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283
గతంలోనూ ఇలాగే!
గతంలోనూ పవన్ కల్యాణ్, తారక్ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చినప్పటికీ పవన్ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.
2 వారాలు సరిపోతాయా?
పవన్ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన సలార్ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
‘ఒకేసారి రిలీజ్ చేయండి’
దేవర, ఓజీ సినిమాల క్లాష్ అంశం (Pawan vs Jr NTR) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 17 , 2024
Pushpa 2 vs NBK 109: అల్లు అర్జున్‌తో బాలకృష్ణ ‘ఢీ’.. బాక్సాఫీస్ వద్ద మరో బిగ్ ఫైట్ షురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) - డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). ప్రస్తుతం స్పీడ్‌గా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో అల్లు ఆర్మీ ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా డిసెంబర్ ఫస్ట్ వీక్ బరిలో ఇప్పటివరకూ ఏ సినిమా లేకపోడవంతో ఇక బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’కి తిరుగుండదని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే బన్నీ చిత్రానికి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూపంలో గట్టి పోటీ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ బరిలో బాలయ్య - బన్నీ ఒకరికొకరు తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పుష్ప 2 వర్సెస్ NBK 109..!
నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'NBK 109' వర్కింగ్ టైటిల్‌తో చాలా స్పీడ్‌గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని సంక్రాతి కానుకగా బరిలోకి దింపాలని తొలుత మేకర్స్ భావించారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం నెల రోజుల ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2న 'NBK 109'ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ వర్సెస్ నందమూరి బాలయ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
అఖండ సెంటిమెంట్!
డిసెంబర్ మెుదటి వీక్‌లోనే బాలయ్య తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ సెంటిమెంట్ కూడా దోహదం చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ - బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ (Akhanda Movie) చిత్రం సరిగ్గా మూడేళ్ల క్రితం డిసెంబర్ 2న విడుదలైంది. ఆ చిత్రం ఏ స్థాయి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ‘NBK 109’ని కూడా అదే రోజు రిలీజ్ చేస్తే ఆ మూవీ సైతం సక్సెస్ సాధిస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారట. మరోవైపు సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం నిలిచింది. జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో పాటు వెంకటేష్ - అనిల్ రావిపూడి చిత్రం, అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'శతమానం భవతి 2' మూవీస్ సైతం సంక్రాంతి పోటీలో ఉన్నాయి. దీంతో జనవరి నుంచి ‘NBK 109’ వెనక్కి తగ్గాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ.. గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులను టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఇన్విటేషన్ అందింది. బుధవారం ఆయనను అసోసియేషన్ల ప్రతినిధులు కలిసి అహ్వాన పత్రికను అందించారు. కొన్ని రోజుల క్రితమే చిరంజీవి, రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ తదితరులను వేడుకలకు ఆహ్వానించారు. అలాగే తమిళ నటులు విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్‌లను కూడా ఆహ్వానాలు అందాయి.
బాలయ్య.. అన్‌స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ గత 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతూనే ఉన్నారు. మొత్తం 109 సినిమాల్లో ఆయన నటించారు. అయితే బాలయ్య చేసిన సినిమాల కంటే ఆయన నటించిన హీరోయిన్స్ సంఖ్య చాలా ఎక్కువ. 109 సినిమాలకు గాను 129 మంది హీరోయిన్స్‌తో బాలయ్య నటించారు. ఇక ఆయన నటించిన సినిమాలు ఎన్నో 100 రోజులు ఆడాయి. 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఆయన కెరీర్‌లో ఉన్నాయి. సోషల్, పౌరాణిక, జానపద, బయోపిక్స్, సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ డ్రామాలు, యాక్షన్ ఇలా అన్ని జానర్స్‌లో బాలకృష్ణ సినిమాలు చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో అడుగు పెట్టి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా బాలయ్య సొంతం. 25 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా కొనసాగుతూ ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచారు.
ఆగస్టు 29 , 2024
69th Filmfare Awards 2024: బాలీవుడ్ ఇలాకాలో టాలీవుడ్ జెండా.. తెలుగోడి సత్తా అంటే ఇదే!
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా భావించే 69వ ‘ఫిల్మ్‌ఫేర్’ (69th FilmFare Awards) అవార్డుల జాబితా వచ్చేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికగా అట్టహసంగా సాగిన ఈ వేడుకలో విజేతలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రకటించారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన యానిమల్ (Animal) చిత్రానికి అవార్డుల పంట పడింది. అందరూ ఊహించినట్లుగానే సందీప్.. ఫిల్మ్‌ఫేర్ వేడుకల్లో తన సత్తా ఏంటో చూపించాడు. మెుత్తం ఐదు అవార్డులను కొల్లగొట్టి టాలీవుడ్ జెండా బాలీవుడ్‌లో ఎగిరేలా చేశాడు.
బాలీవుడ్‌లో ‘యానిమల్’ తుఫాన్!
డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ‘యానిమల్’ చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.910 కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సత్తాచాటుతోంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సందీప్ మూవీ ‘యానిమల్’ దుమ్మురేపింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్ ఇలా మెుత్తం ఐదు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది.
అదరగొట్టిన ‘12th ఫెయిల్’
ఇటీవల విడుదలైన ‘12th ఫెయిల్’ (12th Fail) చిత్రం కూడా యానిమల్ తరహాలోనే 69వ ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డు వేడుకల్లో అదరగొట్టింది. యానిమల్‌తో సమానంగా ఐదు అవార్డులను గెలుచుకొని అందరిచేత ప్రశంసలు అందుకుంది. ఉత్తమ క్రిటిక్స్ నటుడు అవార్డుతో పాటు సినిమా, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకుడు విభాకాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో 12th ఫెయిల్ అవార్డుల సంఖ్య ఐదుకు చేరాయి. మరోవైపు 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' నాలుగు అవార్డులు గెలుచుకొని మూడో స్థానంలో నిలిచింది.
బెస్ట్ యాక్టర్స్‌గా భార్య భర్తలు
ఫిల్మ్ ఫేర్ - 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అవార్డు అందుకోగా 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ (Alia Bhatt) అవార్డు గెలుచుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి. ఇక ఉత్తమ నటుడు క్రిటిక్స్ విభాగంలో విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్), ఉత్తమ నటి (క్రిటిక్స్) రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ), ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ) అవార్డులు సొంతం చేసుకున్నారు.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే:
ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జొరామ్
ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సె (12th ఫెయిల్)
ఉత్తమ నటి: అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య(తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బం: యానిమల్
ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్ బాబల్ ( అర్జన్ వెయిలీ- యానిమల్)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (చెలెయ- జవాన్)
ఉత్తమ కథ: అమిత్ రాయ్ (OMG 2)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ డైలాగ్: ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ)
జనవరి 29 , 2024
Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్‌లో ప్రభాస్, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్, డంకీ, జవాన్, శ్యామ్ బహదూర్ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్', 'సలార్' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.
ప్రభాస్‌కు అన్యాయం!
బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas) క్రేజ్ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్ చేసిన ఆదిపురుష్ (Aadipurush), సలార్ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్ మూవీ ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.
సలార్ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki)
షారుక్ ఖాన్ రీసెంట్ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్ ‘సలార్’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది. అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.
సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.
పాపం రష్మిక..!
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.
అప్పట్లోనే అవమానం
అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది.
https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20
‘యానిమల్’ సత్తా చాటేనా!
తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్ కపూర్, ఉత్తమ సహాయ నటులుగా అనిల్ కపూర్, బాబీ దేబోల్, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా
ఉత్తమ చిత్రం (పాపులర్)
12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)
12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్ బహదూర్‌త్రీ ఆఫ్ అజ్‌జ్విగాటో
ఉత్తమ దర్శకుడు
అమిత్ రాయ్ (ఓఎంజీ2)అట్లీ (జవాన్)కరణ్ జోహార్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)సందీప్ వంగా (యానిమల్)సిద్ధార్థ్ ఆనంద్ (పఠాన్)విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
ఉత్తమ నటుడు
రణ్‌బీర్ కపూర్ (యానిమల్)రణ్‌వీర్ సింగ్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)షారుక్‌ఖాన్ (డంకీ)షారుక్ ఖాన్(జవాన్)సన్నీ దేఓల్ (గదర్2)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)
అభిషేక్ బచ్చన్ (ఘూమర్)జయ్‌దీప్ అహల్వత్ (త్రీ ఆఫ్ అజ్)మనోజ్ బాజ్‌పాయ్ (జొరామ్)పంకజ్ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్ రావ్ (బీడ్)విక్కీ కౌశల్ (శ్యామ్ బహదూర్)విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
ఉత్తమ నటి
అలియా భట్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)భూమి పెడ్నేకర్ (థ్యాంక్యూ ఫర్ కమింగ్)దీపిక పదుకొణె (పఠాన్)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్)
దీప్తి నవల్ (గోల్డ్ ఫిష్)ఫాతిమా సనా షేక్ (ధక్ ధక్)రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్ (ఘూమర్)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్ షా (త్రీ ఆఫ్ అజ్)
ఉత్తమ సహాయ నటుడు
ఆదిత్య రావల్ (ఫరాజ్)అనిల్ కపూర్ (యానిమల్)బాబీ దేఓల్ (యానిమల్)ఇమ్రాన్ హష్మి (టైగర్3)టోటా రాయ్ చౌదరి (రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)విక్కీ కౌశల్ (డంకీ)
ఉత్తమ సహాయ నటి
జయా బచ్చన్ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)రత్న పాఠక్ షా (ధక్ ధక్)షబానా అజ్మీ (ఘూమర్)షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్)యామి గౌతమ్ (ఓఎంజీ2)
జనవరి 17 , 2024
NETFLIX: కొరియన్ కంటెంట్‌పై రూ. 25,000 కోట్ల పెట్టుబడులు … ఈ ఓటీటీలో టాప్-7 కొరియన్ డ్రామాలు ఇవే !
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.
1. SQUID GAME
ఈ సిరీస్ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో దాదాపు 90 దేశాల్లో మెుదటి స్థానంలో నిలిచింది. స్క్విడ్ గేమ్ ఓ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా. ఇందులో అప్పులతో సతమతమై డబ్బుల కోసం చూస్తున్న కొంతమందిని ఓ ఆట ఆడితే ప్రైజ్ మనీ ఇస్తామని తీసుకెళతారు. ప్రతి ఆటలో ఎలిమినేట్ అయినవారిని చంపుతుంటారు. చివరకు ఎవరు మిగిలారు. వాళ్లకు డబ్బులిచ్చారా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కథ. మీరు చూడకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూడండి.
https://www.youtube.com/watch?v=oqxAJKy0ii4
2. MY NAME
మై నేమ్ కొరియన్ డ్రామా 2021లో విడుదలయ్యింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఓ మహిళ. ఇందుకోసం ఓ గ్యాంగ్‌లో చేరుతుంది. నకిలీ పేరుతో చలామణీ అవుతూ పోలీసులను నమ్మిస్తుంటుంది. అంతేకాదు, నార్కోటిక్స్ అమ్మే ఓ డిటెక్టివ్‌తో జతకట్టి పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.
https://www.youtube.com/watch?v=ZOl7iOrD31Q
3. MR. SUNSHINE
మిస్టర్ సన్ షైన్ లవ్ పొలిటికల్, హిస్టారికల్ డ్రామా. జోసియన్ దేశంలో బానిస కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి యూఎస్ పారిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత చిన్నప్పుడే నిశ్చితార్థం అయిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. కథ మెుత్తం వీరి ప్రేమ, రాజకీయం, చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది. కొరియన్ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.
https://www.youtube.com/watch?v=rPJSo4fhtRU
4. CRASH LANDING ON YOU
రొమాంటిక్ డ్రామాలంటే ఇష్టముండే వారికి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఓ అద్భుతమైన సిరీస్. ఇది హృదయాన్ని హత్తుకునే టెలివిజన్ డ్రామా. సౌత్ కొరియా రాజకుటుంబానికి చెందిన ఓ వారసురాలు అనుకోకుండా సైనిక రహిత జోన్ మీదుగా నార్త్ కొరియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ యువ సోల్డియర్ ఆమెను తీసుకొని వెళతాడు. ఇది కొరియాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
https://www.youtube.com/watch?v=eXMjTXL2Vks
5. OUR BLUES
ఈ సిరీస్ 2022లో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. జెజూల్యాండ్ అనే ప్రాంతంలో రోజువారీ సంఘటనలు, మనుషుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ చూస్తున్నప్పుడల్లా అందులో ఉన్నది మనమే అనే భావన కలిగేలా రూపుదిద్దుకుంది. కొరియన్ డ్రామాల్లో కాస్త రియలిస్టిక్‌గా ఉన్న సిరీస్ ఇది.
https://www.youtube.com/watch?v=vSBIJQOLKoY
6. SIGNAL
షెర్‌లాక్, బ్రాడ్ చర్చ్ ఫ్యాన్స్ ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. సిగ్నల్ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ క్రిమినల్ ప్రొఫైల్‌కు 2015లో ఓ వాకీ టాకీ దొరకుతుంది. దానితో అతడు 1989లోని పోలీసుతో మాట్లాడతాడు. అలా ఓ కేసును చేధిస్తారు. ఇందులో దృష్టి మరల్చలేని ట్విస్టులతో సీటు అంచుల్లో కూర్చుంటారు.
https://www.youtube.com/watch?v=OonjouzGJKk
7. ALL OF US ARE DEAD
జాంబీ జోనర్‌లో వచ్చిన సిరీస్ ఇది. కొందరు విద్యార్థులు ట్రాప్ చేయబడతారు. ఓ సైన్స్ ఎక్సపర్‌మెంట్ విఫలమైన జాంబీ వ్యాప్తిలో చిక్కుకున్నారని గ్రహిస్తారు. ఇది ప్రేక్షకులను చాలా థ్రిల్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=IN5TD4VRcSM
ఏప్రిల్ 26 , 2023
Ram Charan vs Chiranjeevi: చిరంజీవి లేదా తారక్‌తో రామ్ చరణ్ బిగ్ ఫైట్.. దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Sankar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని ఆర్.కే బీచ్‌లో జరుగుతోంది. ఓపెన్ ప్లేస్‌లో చిత్రీకరణ జరుగుతుండటంతో షూటింగ్ స్పాట్ నుంచి ప్రధాన తారాగణానికి సంబంధించిన ఫొటోలు బయటకొస్తున్నాయి. ఇటీవలే రామ్‌చరణ్ లుక్ బయటకు రాగా అది నెట్టింట తెగ ట్రెండింగ్ అయ్యింది. తాజాగా హీరోయిన్ కియారా లుక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. మరోవైపు తారక్ ‘దేవర’ లేదా చిరంజీవి ‘విశ్వంభర’కు పోటీగా ‘గేమ్ ఛేంజర్’ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వెంటాడుతున్న లీకుల బెడద!
‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. వాటిని కంట్రోల్ చేసేందుకు చిత్ర యూనిట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా వైజాగ్ షూటింగ్ స్పాట్ నుంచి హీరోయిన్ కియారా ఫొటోలు లీక్ కావడం మేకర్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫొటోల్లో కియారా చాలా అందంగా కనిపించింది. శారీలో తెలుగింటి అమ్మాయిలాగా తళతళ మెరిసిపోయింది. ఈ భామ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన రామ్‌చరణ్ ఫొటోలతో ఈమె పిక్స్‌ను జత చేసి వీరి పెయిర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు మీరు చూడండి.
https://twitter.com/i/status/1769462838765240477
https://twitter.com/i/status/1769381487143776301
దసరా, సంక్రాంతి పరిశీలన!
గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా విడుదలపై ఇండస్ట్రీలో కొత్త చర్చ మెుదలైంది. నిర్మాణ సంస్థ కూడా సరైన తేదీ కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రెండు పెద్ద పండగలను నిర్మాత దిల్‌రాజు పరిశీలిస్తున్నట్లు టాక్. దసరా లేదా సంక్రాంతి సందర్భంగా 'గేమ్ ఛేంజర్'ను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆయన సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో ఫెస్టివల్ డేస్ అయితేనే సరిగ్గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ విషయాన్ని రామ్‌చరణ్ పుట్టిన రోజు నాడు 'జరగండీ.. ' పాటతో పాటు చెప్పాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పోస్టు ప్రొడక్షన్ పనులు ప్లానింగ్ చేసుకొని డేట్ చెప్పే యోచనలో యూనిట్ ఉందట.
చిరు - చరణ్ - తారక్.. బిగ్ ఫైట్!
అయితే దసరా, సంక్రాంతికి రెండు బడా హీరోల చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. తారక్ (Jr NTR) హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ‘దేవర’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతిన విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ రెండు పండగల్లో ఏదోక దానిని ‘గేమ్ ఛేంజర్’ ఫిక్స్ చేసుకోనున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో మరో బిగ్ ఫైట్ చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కలిసి నటించిన తారక్‌తో రామ్ చరణ్ పోటీ పడతాడా? లేదా తండ్రికి సవాలు విసురుతాడా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపై మార్చి 27న రామ్‌చరణ్ పుట్టిన రోజు సందర్భంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
చరణ్ కొత్త సినిమాపై క్రేజీ న్యూస్!
ఇక గేమ్ ఛేంజర్ తర్వాత రామ్‌చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రకు అమితాబ్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. అలాగే 'యానిమల్'లో విలన్‌గా ఆకట్టుకున్న బాబీ డియోల్ కూడా ఈ సినిమా నటించే అవకాశముందట. చరణ్‌కు అతడు ప్రత్యర్థిగా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మార్చి 18 , 2024
Nag Ashwin: అర్జునుడు vs కర్ణుడులో ఎవరు గొప్పా? ‘కల్కి’ డైరెక్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
భారీ అంచనాలతో విడుదలైన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా క్రేజీ డైరెక్టర్ అశ్విన్ (Nag Ashwin) రూపొందించిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాణాలకు ఫ్యూచరిక్ అంశాలను ముడిపెడుతూ తీర్చిదిద్దిన ‘కల్కి’పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే కొందరు మాత్రం.. నెట్టింట ‘కల్కి’ సినిమాను తప్పుబడుతున్నారు. పురణాలను నాగ్ అశ్విన్ వక్రీకరించారని పోస్టులు పెడుతున్నారు. కౌరవుల పక్షాన ఉన్న కర్ణుడ్ని.. అర్జునుడి కంటే బలవంతుడిగా చూపించడాన్ని తీసుకోలేకపోతున్నారు. కాగా, దీనిపై నాగ్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించారు.
కల్కిపై నెటిజన్ల ప్రశ్నలు!
'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్‌లో కర్ణుడు పాత్రను హైలెట్ చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. కర్ణుడు మరలా తిరిగొచ్చినట్లు చూపించడం పురాణాలను వక్రీకరించినట్లేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన తిరిగొచ్చినట్లు చూపించడంలో లాజిక్ ఉందని అంటున్నారు. కల్కి అవతార సమయంలో అశ్వత్థామ భగవంతుండికి అండగా ఉంటాడని పురణాలు సైతం చెప్పాయని పేర్కొంటున్నారు. మరి కర్ణుడు కూడా ఫ్యూచర్‌లో మళ్లీ తిరిగొస్తాడని పురణాల్లో ఎక్కడ చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. అంతా ఓకే గానీ కర్ణుడు విషయంలో మాత్రం దర్శకుడు తన లెక్కతప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు పాత్రను తగ్గిస్తూ.. కౌరవుల పక్షాన నిలిచిన కర్ణుడుని హైలెట్ చేయడం బాగోలేదని అంటున్నారు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు గొప్ప అయితే అర్జునుడు గొప్ప కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
‘కర్ణుడుని అందుకే హైలెట్ చేశా’
కల్కి సినిమాలో కర్ణుడు పాత్రపై వస్తున్న ప్రశ్నలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా స్పందించారు. కర్ణుడుని ఎందుకు అంత గొప్పగా చూపించారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'మహాభారతంలో ఉన్న కర్ణుడిని ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని స్వభావాన్ని మెచ్చుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అతని క్యారెక్టర్‌ని హైలైట్ చేశా' అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఈ మాటలతో కొందరు నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. పురణాలు సైతం కర్ణుడుని ధీశాలిగా కీర్తించాయని గుర్తు చేస్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవని, నాగ్ అశ్విన్ చూపించిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు.
కర్ణుడు vs అర్జునుడు ఎవరు గొప్పా?
మరి అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? అన్న ప్రశ్నను రిపోర్టర్లు నాగ్ అశ్విన్ ముందు ఉంచారు. దీనిపై నాగ్ అశ్విన్ మరో వివరణ ఇచ్చారు. ‘ వారిద్దరిలో (అర్జునుడు, కర్ణుడు) ఎవరు గొప్ప అనే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మహాభారతం మీద చర్చ జరుగుతుంది కదా.. అది మంచి విషయమే కదా.. అందరూ దీని గురించి తెలుసుకుంటారు కదా’ అని అసంపూర్ణ సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్‌ను కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే.. ధర్మం వైపు నిలిచిన అర్జునుడే గొప్ప అని చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇది సినిమా చూసే ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టడమేనని మండిపడుతున్నారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంటున్నారు.
'కల్కి 2' రిలీజ్ ఎప్పుడంటే?
‘కల్కి 2898 ఏడీ’ సూపర్ సక్సెస్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్‌ను రివీల్ చేశారు. అంతేకాకుండా 2025 సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.
జూలై 06 , 2024
Double Ismart: రామ్‌తో కోల్డ్ వార్? అందుకే ట్రైలర్ లాంచ్‌కు పూరీ రాలేదా!
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్ చేయాలని డిమాండ్ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్, డైరెక్టర్ పూరికి మధ్య మనస్పర్థలు (Ram Pothineni vs Puri Jagannadh) తలెత్తినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ కోల్డ్ వార్‌కు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ అసంతృప్తి!
హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)ను రూపొందించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ రెడీ కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై హీరో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'లైగర్' వివాదం కారణంగా తన చిత్రానికి చిక్కులు రావడంపై రామ్ గుర్రుగా ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికీ నైజాం పంపిణీ వ్యవహారం కొలిక్కిరాకపోవడం, నిర్మాత ఛార్మీ ప్రమోషన్స్ షురూ చేయకపోవడంపై రామ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారట. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ పూరి రాకపోవడం వెనుక రామ్‌తో తలెత్తిన వివాదాలే కారణమని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ ఈవెంట్‌లో ఏకాకిగా రామ్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పూరి వివరణ!
'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవడంపై డైరెక్టర్ పూరి ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్ కోసం ముంబయిలో ఫైనల్ మిక్సింగ్ ఉండి ఈవెంట్‌కి రాలేకపోయినట్లు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇవేమి నమ్మశక్యంగా లేవని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడు లేకుండా ట్రైలర్ లాంచ్ జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. రామ్‌తో గ్యాప్ వల్లే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పూరి రాలేదని ఆరోపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ సాధిస్తే ఆటోమేటిక్‌గా వీరి మధ్య గ్యాప్ తొలగిపోతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్, పూరి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
https://twitter.com/i/status/1820365775439552575
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఆదివారం రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‍తో, నాటు డైలాగ్‍లతో నిండిపోయింది. అటు తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‍లు, డ్యాన్స్‌తో రామ్ ట్రైలర్‌లో దుమ్మురేపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను చేశారు. బిగ్‍బుల్ బ్రెయిన్‍లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్‌లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‍ను తలలో పెడితే ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
https://www.youtube.com/watch?v=ym0upoayqJg
మిస్టర్ బచ్చన్ దూకుడు!
డబుల్ ఇస్మార్ట్ టీమ్‌తో పోలిస్తే ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ సరిగా మెుదలు పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోరినా.. వెనక్కి తగ్గలేదా?
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ ఇటీవల రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి.
ఆగస్టు 05 , 2024
వైష్ణవి చైతన్య గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
వైష్ణవి చైతన్య 'బేబి' (2023) చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. లవ్‌మీ, SVCC37 వంటి అప్‌కమింగ్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలవైకుంటపురములో, రంగ్‌దే, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బేబి చిత్రం ద్వారా యువత హృదయాలు గెలుచుకున్న వైష్ణవి చైతన్య గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Vaishnavi chaitanya) విషయాలు ఇప్పుడు చూద్దాం.
వైష్ణవి చైతన్య దేనికి ఫేమస్?
వైష్ణవి చైతన్య 'బేబి' చిత్రం హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. ఈ సినిమాకంటే ముందు చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
వైష్ణవి చైతన్య వయస్సు ఎంత?
1994, జనవరి 30న జన్మించింది. ఆమె వయస్సు 30 సంవత్సరాలు
వైష్ణవి చైతన్య ముద్దు పేరు?
వైషు
వైష్ణవి చైతన్య ఎత్తు ఎంత?
5 అడుగుల 2 అంగుళాలు
వైష్ణవి చైతన్య ఎక్కడ పుట్టింది?
విజయవాడ
వైష్ణవి చైతన్యకు వివాహం అయిందా?
ఇంకా కాలేదు
వైష్ణవి చైతన్య అభిరుచులు?
యాక్టింగ్, సినిమాలు చూడటం
వైష్ణవి చైతన్యకు ఇష్టమైన ఆహారం?
బిర్యాని, ఐస్‌క్రీం
వైష్ణవి చైతన్య ఫెవరెట్ హీరో?
పవన్ కళ్యాణ్, రజనీకాంత్
వైష్ణవి చైతన్య ఇష్టమైన హీరోయిన్?
కాజల్ అగర్వాల్
వైష్ణవి చైతన్య ఇష్టమైన కలర్
రెడ్ అండ్ పింక్
వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా?
బేబీ(2023)
వైష్ణవి చైతన్య ఏం చదివింది?
ఇంజనీరింగ్
వైష్ణవి చైతన్య పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.
వైష్ణవి చైతన్య తమ్ముడి పేరు?
నితిష్ చైతన్య
వైష్ణవి చైతన్య సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
వైష్ణవి సినిమాల్లోకి రాకముందు అనేక షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అనే యూట్యూబ్ సిరీస్ ద్వారా గుర్తింపు లభించింది. టిక్‌టాక్ వీడియోల ద్వారా కూడా ఫేమస్ అయింది.
వైష్ణవి చైతన్య ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/vaishnavi_chaitanya_/?hl=en
https://www.youtube.com/watch?v=VVwPCWIGFVs
ఏప్రిల్ 08 , 2024
OG Release Date: ఒకే నెలలో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల?
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్, పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ ఇటీవలే పెండింగ్ ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కించారు. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్ కూడా తిరిగి మెుదలైంది. త్వరలోనే పవన్ కూడా రెగ్యులర్ షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమ్మర్ బరిలో పవన్‌తో పవనే పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ vs పవన్
పవన్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఓజీ’ని కూడా సమ్మర్‌లోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ లేదా మేలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ విచిత్ర పరిస్థితి చూసి అభిమానులు షాకవుతున్నారు. మెున్నటి వరకూ పవన్ సినిమా లేదని బాధపడ్డ ఫ్యాన్స్‌కు ఈ వార్తతో ఎలా ఫీలవ్వాలో అర్థం కావడం లేదు. గబ్బర్ సింగ్‌లో చెప్పిన ‘నాకు నేనే పోటీ’ డైలాగ్‌ను పవన్ నిజం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నెల రోజుల గ్యాప్‌తోనే సెకండ్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉందని పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరి హర వీరమల్లు టీమ్ అసంతృప్తి!
‘ఓజీ’ చిత్రాన్ని సమ్మర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంపై హరిహర వీరమల్లు టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. రెండు సినిమాల మధ్య కనీసం 5 నెలల గ్యాప్ అయినా ఉండాలని హరి హర వీరమల్లు టీమ్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్‌ను జోక్యం చేసుకోవాలని కూడా కోరుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఎవరి పక్షాన నిలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మెుత్తం చూస్తుంటే పవన్ vs పవన్‌గా పరిస్థితులు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెుత్తానికి ‘ఓజీ’నే వెనక్కి తగ్గే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
‘ఓజీ.. బ్లాక్‌బాస్టర్ పక్కా’
పవన్ - సుజిత్ కాంబోలోని 'ఓజీ' చిత్రం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా ఇటీవల ఓజీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
త్వరలో సెట్స్‌పైకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’!
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 23 , 2024