• TFIDB EN
  • DJ:దువ్వాడ జగన్నాథం
    UATelugu2h 36m
    దువ్వాడ జగన్నాధం(అల్లు అర్జున్) వంట చేసే బ్రహ్మణ యువకుడు. తోటివారికి ఆపదలో సాయం చేస్తుంటాడు. అతని గుణాన్ని చూసి ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఓ సిక్రెట్ ఆపరేష్ నిర్వహించేందుకు DJను నియమిస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    అల్లు అర్జున్
    దువ్వాడ జగన్నాధ శాస్త్రి జగన్నాధం/ DJ
    సాథ్విక్ వర్మ యంగ్ DJ
    పూజా హెగ్డే
    పూజ
    రావు రమేష్
    రొయ్యల నాయుడు
    సుబ్బరాజు
    నాయుడు కొడుకు
    చంద్ర మోహన్
    డిజె మామయ్య
    మురళీ శర్మ
    DJ గురువు
    పోసాని కృష్ణ మురళి
    పూజా తండ్రి
    తనికెళ్ల భరణి
    DJ తండ్రి
    వెన్నెల కిషోర్
    ఆకెళ్ల విఘ్నేశ్వర శాస్త్రి
    హరీష్ ఉత్తమన్
    సుల్తాన్ బాషా
    పవిత్ర లోకేష్
    DJ తల్లి
    హరి తేజ
    లక్ష్మి డీజే అక్క
    రాళ్లపల్లి
    డీజే తాత
    విద్యుల్లేఖ రామన్
    కాత్యాయిని
    శత్రు
    నాయుడు కార్యదర్శి
    సమీర్
    ఆగ్రో డైమండ్ మాజీ CEO
    శశాంక్
    DJ అసిస్టెంట్
    శివన్నారాయణ నారిపెద్ది
    విఘ్నేష్ తండ్రి
    రజిత
    విఘ్నేష్ తల్లి
    ప్రభాకర్
    సూరి
    జీవా
    గ్యాంగ్‌స్టర్ లాలా
    షానూర్ సనా
    పూజా తల్లి
    శ్రవణ్ DJ అసిస్టెంట్
    గిరిధర్శర్మ DJ స్నేహితుడు
    ఝాన్సీ లక్ష్మి
    ఝాన్సీ
    సిబ్బంది
    హరీష్ శంకర్
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    అయనంక బోస్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌!
    Tillu Cube: టిల్లు గాడికి జోడీగా స్టార్‌ హీరోయిన్‌ లాక్‌!
    యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. ముఖ్యంగా సిద్ధు నటన, వాయిస్‌ మాడ్యూలేషన్‌కు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ముఖ్యంగా టిల్లు పాత్రకు యూత్‌ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లు పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సంపాదించాయి. ఫస్ట్‌ మూవీలో రాధిక పాత్రలో నేహా శెట్టి మెస్మరైజ్‌ చేయగా.. సీక్వెల్‌లో లిల్లీలో పాత్రలో అనుపమా కనిపించి మెప్పించింది. దీంతో తర్వాతి చిత్రం టిల్లు క్యూబ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మూడో పార్ట్‌లో సిద్ధూకు జోడీగా స్టార్‌ హీరోయిన్‌ను లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  సిద్ధూకి జోడీగా బుట్టబొమ్మ! ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్‌ (Tillu Square) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అదరగొట్టింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన అనుపమా.. తన హాట్‌షోతో అదరగొట్టింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు క్యూబ్‌ రూపొందించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే లెటేస్ట్‌ బజ్‌ ప్రకారం మూడో పార్ట్‌లో ‘పూజా హెగ్డే’ (Pooja Hegde)ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్‌ ఆమె వద్దకు కూడా వెళ్లిందని అంటున్నారు. హిట్ సిరీస్ కావడం, తన రోల్​కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.  సమంత, తమన్నా లేనట్లే! ‘టిల్లు స్క్వేల్‌’ భారీ సక్సెస్‌తో మూడో పార్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని మేకర్స్‌ భావించారు. ఇందులో భాగంగా టిల్లు క్యూబ్‌ సినిమా కోసం తొలుత ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత (Samantha), తమన్నా (Tamannaah) పేర్లను పార్ట్ -3 కోసం పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఒకరు దాదాపు ఖరారవుతారంటూ కూడా ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చివరకూ ‘పూజా హెగ్డే’ వైపే చిత్ర యూనిట్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, పూజా పెయిర్‌ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మెుదలైంది.  పూజాకు మంచి ఛాన్స్! ఒకప్పుడు బ్లాక్‌ బాస్టర్ హిట్స్‌తో దూసుకెళ్లిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా టైమ్‌ అసలు కలిసి రావడం లేదు. ఈ భామ నటింటిన వరుస సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త  బ్రేక్‌ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫ్యామిలీతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తోంది. అదే సమయంలో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూజా హెగ్డేకు ‘టిల్లు క్యూబ్‌’లో ఆఫర్‌ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. పూజా ఈ మూవీలో నటిస్తే కెరీర్‌ పరంగా ఆమెకు తప్పకుండా ప్లస్‌ అవుతుంది. సిద్ధు పక్కన రాధికగా నటిస్తే తిరిగి యూత్‌లో క్రేజ్‌ సంపాదించే అవకాశం ఉంది.  టిల్లు క్యూబ్‌ కథ అదే! డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా  మొదలుపెడతానని గతంలో స్పష్టం చేశాడు.
    మే 03 , 2024
    Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!
    Tillu Cube: టిల్లు క్యూబ్‌లో సమంత, తమన్నా?.. అట్లుంటది మనతోని!
    యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. ‘డీజే టిల్లు’ (DJ Tillu), ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ (Tillu Cube) రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే గత రెండు చిత్రాల్లో హీరోయిన్లు (నేహాశెట్టి, అనుపమా పరమేశ్వరన్‌) పాత్రలు కీలకం కావడంతో ‘పార్ట్‌ 3’లో ఎవరు చేస్తారన్న దానిపై ఇప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. అయితే తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్లను తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  ఆ స్టార్ హీరోయిన్లు ఎవరంటే? ‘టిల్లు స్క్వేర్‌’ బ్లాక్ బాస్టర్ కావడంతో ‘టిల్లు క్యూబ్‌’ను అంతకుమించి రూపొందించేలా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ప్లాన్‌ చేస్తున్నారు. కీలకమైన హీరోయిన్‌ పాత్రకు స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటే ఎలా ఉంటుందా? అన్న యోచనలో చిత్ర యూనిట్ ఉంది. అంతేకాదు వారి పరిశీలనలో ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నట్లు లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం తెలుస్తోంది. సమంత (Samantha), తమన్నా (Tamannah Bhatia)ను ఈ సినిమా కోసం తీసుకోవాలని యూనిట్‌ భావిస్తోందట. షూటింగ్‌ ప్రారంభం లోపు దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరోవైపు బడ్జెట్‌ పరంగానూ ఈ సినిమాను హైలెవల్‌కు తీసుకెళ్లాలని నిర్మాత భావిస్తున్నట్లు తెలుస్తోంది.  సినిమా అంతా ఫారెన్‌లోనే! ‘డీజే టిల్లు’లో అందాలు ఆరబోసిన హీరోయిన్‌ నేహా శెట్టి.. ‘టిల్లు స్క్వైర్’లో కూడా కనిపించింది. అది ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. దీంతో ఇదే ఫార్మూలాను టిల్లు క్యూబ్‌లోనూ రిపీట్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ‘టిల్లు క్యూబ్’లో నేహాశెట్టితో పాటు సీక్వెల్‌లో చేసిన అనుపమా పరమేశ్వరన్‌ కూడా మెరవనున్నట్లు సమాచారం. అయితే మెయిన్‌ హీరోయిన్‌గా మాత్రం స్టార్ నటి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈసారి ‘పార్ట్‌-3’ కథ అంతా ఫారెన్‌లోనే జరుగుతుందట.కాగా,ప్రస్తుతం సిద్ధూ ‘బొమ్మరిల్లు’ దర్శకుడు భాస్కర్‌తో ‘జాక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ప్రారంభంలో ‘టిల్లు క్యూబ్’ సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నిర్మాత నాగవంశీ.. సిద్దూకు పూర్తి స్వేచ్చను ఇచ్చినట్లు తెలుస్తోంది.   టిల్లు క్యూబ్‌ కథ అదే! డీజే టిల్లు, టిల్లు స్క్వేర్‌ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్‌ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్‌ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా  మొదలుపెడతానని స్పష్టం చేశాడు. https://twitter.com/i/status/1774843442021196268
    ఏప్రిల్ 12 , 2024
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?  టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.  లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.  టిల్లు:  పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  టిల్లు:  నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.  టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.  అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'  https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..  టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..  టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:  డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..  లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..  టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..  మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:  లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:  నాదా...? నా హార్ట్ చాలా వీకూ..  ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:  నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..  పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్:  ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    EXCLUSIVE: టిల్లు స్కేర్ అడల్ట్ సినిమా కాదు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్
    EXCLUSIVE: టిల్లు స్కేర్ అడల్ట్ సినిమా కాదు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్
    సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో మల్లిక్ రామ్ తెరకెక్కించిన టిల్లు స్కేర్ పట్ల అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. DJ టిల్లు హిట్‌ తర్వాత ఏర్పడిన అంచనాలను మించి ఈ సినిమా చొచ్చుకెళ్తోంది. ఈ మూవీ ప్రస్తుతం సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది. ఈ సినిమాను పలువురు సెలబ్రెటీలు ప్రశంసిస్తున్నారు.  తాజాగా టిల్లు స్కేర్(Tillu square) చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) స్పందించారు. టిల్లు స్కేర్ చిత్రం తాను చూశానని చాలా బాగుందని ప్రశంసల వర్షం కురిపించారు. అందరూ అనుకుంటున్నట్లు అడల్ట్ సినిమాగా ఈ చిత్రాన్ని చూడవద్దని యూనివర్సిల్‌గా యాక్సెప్ట్‌డ్ కంటెంట్ ఈ చిత్రంలో ఉందని వెళ్లడించారు. ఈక్రమంలో టిల్లు స్కేర్ చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించుకుని చిరంజీవి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." టిల్లు స్కేర్ సినిమా చూశాను. టిల్లు వన్ నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా తర్వాత ముచ్చటేసి రా అని ఇంటికి పిలిపించుకున్నాను. సిద్ధు అంటే ఇంట్లో అందరికి ఫేవర్. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత  టిల్లు స్కేర్ చేశాడు చూశాను. వావ్ చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ సినిమా చేసిన తర్వాత సెకండ్ సినిమా ఆ అంచనాలను మీట్ అవడమనేది రేర్ ఫీట్. ఆ అంచనాలను డైరెక్టర్ మల్లిక్ అండ్ హోల్ టీమ్ సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగారు.  ఉత్కంఠతోటి అదే సరదా తోటి ఈ టిల్లు స్కేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెబుతున్నాను.. దీనికోసం ఎంత కష్టపడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో సినిమాను చూస్తే అర్థం అవుతుంది.  దీని వెనుకాలా ఒక్కడై ఉండి, ఈ స్క్రిఫ్ట్ ఇంత బాగా రావడానికి ప్రయత్నించిన మా సిద్ధు జొన్నలగడ్డకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ సినిమాలో చాలా మంది ఏదో అడల్ట్ అని యూత్ అని ఏవెవో అంటున్నారు. ఇది యూనివర్సల్‌గా అంగీకరించదగిన కంటెంట్ ఉన్నా సినిమా ఇది. కాబట్టి నేనైతే ఎంజాయ్ చేశాను. అందరు తప్పక చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.   https://twitter.com/AlwaysPraveen7/status/1774701740287578526?s=20 మరోవైపు టిల్లు స్కేర్ కలెక్షన్ల పరంగా బాలీవుడ్ చిత్రం 'క్రూ'(CREW)ని బీట్ చేసింది. టబు, కరీనా కపూర్, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.62.53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టిల్లు స్కేర్ మూడు రోజుల్లో రూ.68.1కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆయా భాషల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్నాయి.  అటు టిల్లు స్కేర్‌కు సీక్వేల్‌గా 'టిల్లు క్యూబ్' ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. థియేటర్లలో అల్రెడీ క్లైమాక్స్ సీన్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వస్తోంది. తొలుత టిల్లు స్కేర్‌తో సీక్వెల్ ముగించాలని మేకర్స్ అనుకున్నప్పటికీ... ప్రేక్షకుల నుంచి వచ్చిన డిమాండ్ దృష్ట్యా సీక్వెల్ ఉంటుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు.
    ఏప్రిల్ 01 , 2024
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    Neha Shetty: టాలీవుడ్‌లో దూకుడు మీదున్న టిల్లు బ్యూటీ.. ఆశలన్నీ దానిపైనే!
    యంగ్‌ బ్యూటీ నేహా శెట్టి.. టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతోంది. కుర్ర హీరోలకు ప్రధాన ఆప్షన్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  యువ నటుడు విశ్వక్‌ సేన్‌ హీరోగా రూపొందుతున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రంలో.. నేహా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా మే 17న రిలీజ్‌ కానుంది.  ఇటీవల వచ్చిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) చిత్రంలోనూ ఈ బ్యూటీ మెరిసింది. తనకు పాపులారిటీ తీసుకొచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu)లోని రాధిక పాత్రలో మరోమారు తెరపై సందడి చేసింది.  నేహా శెట్టి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే.. ఈ భామ కర్ణాటకలోని మంగళూరులో డిసెంబర్‌ 6, 1999లో జన్మించింది.  సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహా.. మిస్‌ మంగళూరు-2014 టైటిల్‌ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.  2016లో వచ్చిన 'ముంగరు మలే 2' (Mungaru Male 2) అనే కన్నడ చిత్రంతో నేహా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో నందిని పాత్ర పోషించి ఆకట్టుకుంది.  పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ‘మెహాబూబా’ (Mehbooba) ద్వారా నేహా శెట్టి.. తెలుగు తెరపై అడుగుపెట్టింది. ఇందులో పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా చేశాడు.  ఆ తర్వాత 'గల్లీ రౌడీ' (Gully Rowdy), ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ (Most Eligible Bachelor) చిత్రాలు చేసింది. ఆ రెండూ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.  2022లో వచ్చిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాతో నేహా శెట్టి రాత్రికి రాత్రి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది.  యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)తో నేహా చేసినా రొమాన్స్‌ యూత్‌కు బాగా కనెక్ట్‌ అయ్యింది. ముఖ్యంగా ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో చెరగని ముద్ర వేసింది.  ఆ తర్వాత చేసిన 'బెదురులంక 2012' (Bedurulanka 2012) చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోగా.. అనంతరం చేసిన 'రూల్స్‌ రంజన్‌' మాత్రం ఈ భామ ఆశలను అడియాశలు చేసింది.  ప్రస్తుతం నేహా శెట్టి ఆశలన్నీ ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ పైనే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో తనకు తిరుగుండదని ఈ అమ్మడు భావిస్తోంది.  యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నేహా.. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది.  ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ నెటిజన్లను తన మాయలో పడేస్తోంది. నేహా పోస్టు చేసిన ప్రతీ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.  ప్రస్తుతం నేహా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 12 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
    ఏప్రిల్ 13 , 2024
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    Tillu Square Review In Telugu: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన టిల్లన్న.. సీక్వెల్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌, మురళీధర్‌ గౌడ్‌, ప్రిన్స్‌, ప్రణీత్‌ రెడ్డి కల్లెం, ఫిష్‌ వెంకట్‌, రాజ్‌ తిరణ్‌దాస్‌, శ్రీరామ్‌ రెడ్డి తదితరులు.. దర్శకత్వం : మల్లిక్‌ రామ్‌ సంగీతం: రామ్‌ మిర్యాల, శ్రీచరణ్‌ పరకాల, ఎస్‌.ఎస్‌ థమన్‌, సినిమాటోగ్రఫీ : నవీన్ నూలు ఎడిటింగ్‌ : నవీన్ నూలి నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాణ సంస్థ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్ఛ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ విడుదల తేదీ : 29-03-2024 సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌, ప్రమోషన్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టిల్లు పాత్రలో సిద్ధూ మరోమారు మాయ చేశాడా? ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ‘డీజే టిల్లు’ ఎక్కడైతే ముగిసిందో టిల్లు స్క్వేర్‌ కథ (Tillu Square Review in Telugu) అక్కడ నుంచే మెుదలైంది. దెబ్బ నుంచి కోలుకున్న టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ).. ‘టిల్లు ఈవెంట్స్’ పేరుతో కొత్త బిజినెస్‌ స్టార్ట్ చేస్తాడు. దాని ద్వారా వెడ్డింగ్ ప్లానింగ్స్‌, డీజే ఈవెంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి లైఫ్‌లోకి లిల్లీ జోసెఫ్ (అనుపమా) ప్రవేశిస్తుంది. తన బర్త్‌డే స్పెషల్‌గా టిల్లూను ఓ సాయం కోరుతుంది. రాధికా విషయంలో దెబ్బ తిన్న టిల్లు ఇప్పుడు ఏం చేశాడు? వీరి మధ్యకు మాఫియా డాన్ మెహబూబ్ అలీ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? రాధికా (నేహా శెట్టి) టిల్లు లైఫ్‌లోకి మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది తెలియాలంటే థియేటర్‌లో చూడాల్సిందే.  ఎవరెలా చేశారు స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ మరోసారి డీజే టిల్లుగా అదరగొట్టాడు. తన మార్క్‌ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. కొన్ని సీన్లలో మరింత హ్యాండ్సమ్‌ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ మెప్పించింది. ముఖ్యంగా తన గ్లామర్ షోతో కుర్రకారును ఊర్రూతలూగించింది. సిద్ధూ, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య కెమెస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. ఇక మాఫియా డాన్‌ పాత్రలో మురళీ శర్మ జీవించారు. తన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. టిల్లు తండ్రిగా మురళీ గౌడ్‌ కూడా మంచి ప్రదర్శనే చేశారు. అతని కామెడీ టైమింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపంచారు. డైరెక్షన్‌ ఉందంటే డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్.. ‘డీజే టిల్లు’ తరహాలోనే ‘టిల్లు స్క్వేర్‌’ను కూడా ఫన్‌ & ఎంటర్‌టైన్‌మెంట్‌ తరహాలోనే తెరకెక్కించారు. టిల్లు పాత్రను ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా చూపించి మంచి మార్కులు కొట్టేశారు. ఇక రాధిక అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అంటూ అనుపమా పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి పార్ట్‌తో పోలిస్తే రొమాన్స్‌లో మరింత ఘాటు పెంచి యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. అయితే కామెడీ, డైలాగ్స్‌ పరంగా సినిమా ఎంతో బాగున్నప్పటికీ.. కాన్సెప్ట్‌ను మాత్రం రొటీన్‌గా చూపించాడు దర్శకుడు. డీజే టిల్లు ఫ్లేవర్‌తోనే సీక్వెల్‌ను నడిపించాడు. కీలక సమయాల్లో వచ్చే ట్విస్ట్‌లు అంతగా వర్కౌట్‌ కాలేదు. సెకండాఫ్‌లో మురళీశర్మ చెప్పే డైలాగ్స్‌ విషయంలో మల్లిక్‌ రామ్‌ జాగ్రత్త వహించాల్సింది. ఎందుకంటే అవి లాజిక్స్‌కు దూరంగా అనిపిస్తాయి. అయితే న్యారేషన్‌, కామెడీ పరంగా చూస్తే మల్లిక్‌ రామ్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. సినిమా ఎక్కడా బోర్‌ కొట్టకుండా ఔట్‌ అండ్ ఔట్ ఎంటర్‌టైనింగ్‌గా మూవీని ఆయన తెరకెక్కించాడు.  టెక్నికల్‌గా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. రామ్ మిర్యాల, అచ్చు అందించిన సాంగ్స్.. భీమ్స్ ఇచ్చిన నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. అలాగే సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ మంచి కలర్ ఫుల్‌గా బ్యూటిఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకు నిర్మాతలు వెనకాడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ సిద్ధు జొన్నలగడ్డ నటనకామెడీసంగీతం మైనస్‌ పాయింట్స్ రొటీన్ స్టోరీఆకట్టుకోని ట్విస్టులు Telugu.yousay.tv Rating : 3.5/5 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-siddu-jonnalagadda.html
    మార్చి 29 , 2024
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.  నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు   నేహా శెట్టి ముద్దు పేరు?  నేహా  నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు   నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక  నేహా శెట్టి  అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి  ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి  తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి  ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి  ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి  ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే  నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి  ఏం చదివింది? డిగ్రీ  నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. More Information About Neha Shetty నేహా శెట్టి హాట్‌ ఫొటోలు (Neha Shetty Hot Images) నేహా శెట్టి పోషించిన బెస్ట్‌ రోల్ ఏంటి? డీజే టిల్లు సినిమా చేసిన రాధిక పాత్ర.. ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాల్లో బెస్ట్‌ అని చెప్పవచ్చు.  నేహా శెట్టి మూవీస్ లిస్ట్ ముంగారు మలె 2 (Mungaru Male 2), మెహబూబా (Mehbooba), గల్లీ రౌడి (Gully Rowdy), మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ (Most Eligible Bachelor), డీజే టిల్లు (DJ Tillu), బెదురులంక 2012 (Bedurulanka 2012), రూల్స్‌ రంజన్‌ (Rules Ranjann), టిల్లు స్క్వేర్‌ (Tillu Square) నేహా శెట్టి అప్‌కమింగ్‌ మూవీ? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) నేహా శెట్టి చీరలో దిగిన టాప్‌ ఫొటోలు( Neha shetty in Saree) నేహా శెట్టి బ్లౌజ్ కలెక్షన్స్(Neha Shetty Blouse Collections) నేహా శెట్టి బ్లౌజింగ్‌కు స్టైల్‌కు చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ట్రెండ్‌ తగ్గట్లు బ్లౌజులు ధరిస్తూ ఆమె చాలా మంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ఆ ట్రెండీ బ్లౌజులు ఏవో ఇప్పుడు చూద్దాం.  కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ  కోల్డ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ అమె అందాన్ని రెట్టింపు చేసింది. నలుగురిలో ప్రత్యేకంగా కలిపించాలని భావించే వారికి ఈ బ్లౌజ్‌ తప్పక నచ్చుతుంది.  వి-నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌ ట్రెడిషన్‌తో పాటు ట్రెండీగా కనిపించాలని భావించిన సమయంలో నేహా వి - నెక్‌ కట్‌ స్లీవ్‌ బ్లౌజ్‌లను దరిస్తూ ఉంటుంది. బ్లౌజ్‌కు తగ్గ శారీ, జ్యూయలరీ ధరించి కుర్రకారును ఫిదా చేస్తుంటుంది.  డీప్‌ ప్లంగింగ్‌ హల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ ట్రెండీ లుక్‌ను తీసుకొస్తుంది. యువతులు మరింత అందంగా.. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ బ్లౌజ్ ఉపయోగపడుతుంది.  ఆఫ్‌ షోల్డర్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ బ్లౌజ్‌ చాలా మోడరన్‌ లుక్‌ను అందిస్తుంది. యువతుల అందాలను చాలా బాగా ఎలివేట్‌ చేస్తుంది.  రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్‌ నేహా ధరించిన ఈ రౌండ్‌ నెక్‌ హాఫ్‌ స్లీవ్‌ బ్లౌజ్‌.. మంచి ట్రెడిషనల్‌ లుక్‌ తీసుకొస్తుంది. గోల్డెన్‌ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ బ్లౌజ్‌ను శుభకార్యాలకు ధరించవచ్చు. క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ నేహా.. ట్రెడిషన్‌, మోడరన్‌, ట్రెండ్‌ తగ్గట్లు ఇట్టే మారిపోగలదు. అయితే కాస్త సాఫ్ట్‌ లుక్‌లో కనిపించాలని భావించినప్పుడు ఈ అమ్మడు క్లాసిక్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ను ధరిస్తుంది. ఈ లుక్‌లో నేహాకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు.  నేహా శెట్టిని వైరల్‌ చేసిన పోస్టు/ రీల్‌? ‘రూల్స్‌ రంజన్‌’ సినిమాలో తాను చేసిన ‘సమ్మోహనుడా’ సాంగ్‌కు నేహా శెట్టి రీల్‌ చేసింది. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా అది సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అయ్యింది. చాలా మంది యువతులు ఈ పాటపై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు.  View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) సోషల్‌ మీడియాలో ఉన్న నేహా శెట్టి హాట్‌ వీడియోస్? https://twitter.com/i/status/1730782118777950693 నేహా శెట్టి చేసిన బెస్ట్‌ స్టేజీ పర్‌ఫార్మెన్స్‌ ఏది? గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిలోని ‘సుట్టంలా సూసి’ సాంగ్‌ రిలీజ్‌ సందర్భంగా హీరో విశ్వక్‌తో నేహాశెట్టి స్టేజీపై డ్యాన్స్‌ వేస్తుంది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది.  View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) నేహా శెట్టి ఏ ఏ భాషలు మాట్లాడగలదు? ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు నేహా శెట్టిది ఏ రాశి? మిథున రాశి నేహా శెట్టికి సోదరుడు/ సోదరి ఎవరైనా ఉన్నారా? నేహాకు ఓ సోదరి ఉంది. ఆమె పేరు నవామి శెట్టి నేహా శెట్టి పైన వచ్చిన రూమర్లు ఏంటి? ఈ బ్యూటీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచంద్రన్‌, ఆకాష్‌ పూరితో అప్పట్లో ప్రేమయాణం కొనసాగించినట్లు రూమర్లు ఉన్నాయి.  నేహా శెట్టికి ఇష్టమైన గాయకులు ఎవరు? ఏ.ఆర్‌ రెహమాన్‌, శంకర్‌ మహదేవన్‌, ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేహా శెట్టి ఫేవరేట్‌ స్పోర్ట్స్‌ ఏది? క్రికెట్‌ నేహాశెట్టి ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు? ధోని, విరాట్‌ కోహ్లీ నేహా శెట్టికి ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు? మైసూర్‌, గోవా, కర్ణాటక నేహా శెట్టి చేసిన చిత్రాల్లోని బెస్ట్‌ సీన్‌? https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_ నేహా శెట్టి జ్యూయలరీ ఫొటోలు? నేహా శెట్టి చిన్నప్పటి ఫొటోలు? నేహా శెట్టి సినిమాలోని బెస్ట్ డైలాగ్స్‌ ఏవి? డీజే టిల్లులో నేహా శెట్టి చేసిన సన్నివేశాలన్నీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ముఖ్యంగా టిల్లు.. రాధిక (నేహా శెట్టి) ప్లాటులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చే సీన్‌ హైలెట్‌గా అని చెప్పవచ్చు. ఎందుకంటే కథలో రాధిక పుల్‌ లెంగ్త్‌ పాత్ర పరిచయమయ్యేది ఈ సీన్‌ నుంచే. రాధిక ఓ హత్య చేసి అమాయకంగా చెప్పే డైైలాగ్స్ ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఆ సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం.  డీజే టిల్లులో రాధిక పాత్రకు సంబంధించి మరో కీలకమైన సన్నివేశం కూడా ఉంది. నేహా శెట్టి బాగా పాపులర్ అవ్వడానికి అందులో ఆమె చెప్పే డైలాగ్స్‌ కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.  టిల్లు : ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావ్‌ రాధిక నాతోని..! రాధిక : ఎందుకు టిల్లు.. నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లమ్‌ నీకు? టిల్లు: నిజంగా ఈ క్వశ్చన్‌ నన్ను అడుగుతున్నావా రాధిక? రాధిక : అవును టిల్లు.. చెప్పు? టిల్లు:  నేను ఇది నీకు ఎక్స్‌ప్లనేషన్‌ ఇస్తున్న చూడు ఇది సెకండ్‌ హైలెట్ ఆఫ్‌ ది నైట్‌ అది. కానీ చెప్తా.. నేను హౌలా గాడ్ని కాబట్టి.  https://youtu.be/r6L5KO89Azs?si=wuYC205pIGEZWNMB టిల్లు : ఐ హ్యావ్‌ ఏ స్మాల్‌ డౌట్‌.. ఇదంతా సెల్ఫ్‌ డిఫెన్స్‌లోనే జరిగింది కదా? కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్‌ అయితే కాదు కదా? రాధిక : కాదు, టిల్లు.. ఐ ప్రామిస్‌ టిల్లు : అయితే పోదాం కదా.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిజం చెప్పేద్దాం. రాధిక : పోలీసు.. పోలీసు.. అనొద్దు టిల్లు ప్లీజ్‌.. టిల్లు : ఎందుకట్ల పోలీసు.. పోలీసు.. అంటే భయపడుతున్నావ్‌? హా.. పాత కేసులేమైనా ఉన్నాయా నీ మీద? హే ఉంటే చెప్పు నేనేమి అనుకోను. ఎందుకంటే నేను ఒక నైట్‌లో ఒక సర్‌ప్రైజే హ్యాండిల్‌ చేయగల్గుతా. ఇట్ల మల్టిపుల్‌ అంటే నోతోని గాదు. ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు పోయినాక ఆడ సడెన్‌గా యూ ఆర్ ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌ నెంబర్‌ వన్‌ క్రిమినల్‌ అని తెలిసినాక గుండె ఆగి చస్తా. అసలే డెలికేట్‌ మైండ్‌ నాది.  రాధిక: అవును టిల్లు 40 మర్డర్స్‌ చేశాను.. ఐదేళ్లుగా నాకోసం వెతుకున్నారు. టిల్లు: అట్ల అనకు ప్లీజ్‌.. నాకు నిజంగా భయమైతాంది. రాధిక: ఇంకేం టిల్లు.. అప్పటి నుంచి చెప్తున్నా పోలీసు పోలీసు అంటే వద్దని. మళ్లీ పెద్ద ఇష్యూ అవుతుంది. ఇద్దరం ఇరుక్కుంటాం. నీకు అర్థం కాదు. అప్పటి నుంచి పోలీసు పోలీసు అని ఒకటే నస. టిల్లు: వన్‌ మినిట్‌.. వన్‌ మినిట్‌.. ఒక వన్‌ స్టెప్‌ బ్యాక్‌ వద్దాం. ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటాం అని అన్నావ్ కదా. అంటే నేనెందుకు ఇరుక్కుంటాను. నాకేం సంబంధం. నాకు వాడు రూమ్‌లో ఉన్నట్లు కూడా తెల్వదు.  రాధిక: టిల్లు.. మన ఇద్దరి ఫొటోస్‌ ఇంక ఎక్కడ సేవ్‌ చేసుకున్నాడో తెలీదు మనకి. అండ్ ఈ బిల్డింగ్‌లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. https://youtu.be/eGnO1LA_Epk?si=eXKpGn4R8g2vkiw_  నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=sv7EkhD7c1U
    ఏప్రిల్ 25 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.  టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి  ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.  'కర్మ' అనే సినిమాతో  డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.  విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.  మరో నాలుగేళ్ల తర్వాత  దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.  సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే  అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే  డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    Summer Movies 2024: ‘ఫ్యామిలీ స్టార్‌’, ‘టిల్లు స్క్వేర్‌’కి బెస్ట్ ఛాన్స్‌.. అలా జరిగితే కలెక్షన్ల సునామీనే!
    సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి (Sankranti) తరువాత సమ్మర్ సీజన్‌ (Summer Season) అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఉండటంతో యూత్‌, చిన్నారుల తల్లిదండ్రులు సమ్మర్‌లో సినిమాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు ప్రతీ సమ్మర్‌లోనూ పెద్ద హీరోల సినిమాలు రెడీగా ఉంటాయి. అయితే 2024 సమ్మర్‌లో మాత్రం ఏ స్టార్‌ హీరొ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. వాస్తవానికి ‘దేవర’ (Devara), ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలను సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేశారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఈ సమ్మర్‌ మెుత్తానికి ఇద్దరు యంగ్‌ హీరోల సినిమాలే దిక్కుగా కనిపిస్తున్నాయి. అవి సరైన విజయం సాధిస్తే కలెక్షన్ల పరంగా ఆ చిత్రాలకు తిరుగుండదని చెప్పవచ్చు. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  సమ్మర్‌లో ఆ చిత్రాలదే హవా! ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అప్‌కమింగ్‌ చిత్రాలు.. ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square), ‘ఫ్యామిలీ స్టార్‌’’ (Family Star). సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్‌' (Tillu Square Release Date) చిత్రం మార్చి 29న ధియేటర్స్‌లోకి రానుంది. అటు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసిన 'ఫ్యామిలీ స్టార్‌’' (Family Star Release Date) ఏప్రిల్‌ 5న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రాలు మినహా మరే పెద్ద హీరో సినిమా ఈ సమ్మర్‌లో లేకపోవడంతో అందరి దృష్టి వీటిపైనే పడింది.  హిట్‌ అయితే కలెక్షన్స్‌ సునామే! ‘టిల్లు స్క్వేర్‌’, ‘ఫ్యామిలీ స్టార్‌’’ చిత్రాలు రెండూ కూడా యూత్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో స్టూడెంట్స్ అందరూ కూడా సెలవులతో ఉంటారు. కాబట్టి ఇవి రెండూ కూడా రిలీజ్ అనంతరం మంచి సక్సెస్ అందుకుంటే వచ్చే కలెక్షన్స్ సూపర్‌గా ఉంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇవి రెండూ కూడా ఆ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటాయో లేదో చూడాలి. కాగా ‘ఫామిలీ స్టార్’ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా.. ‘టిల్లు స్క్వేర్’ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. హిట్‌ కాంబో రిపీట్‌ అవుతుందా? ‘టిల్లు స్క్వేర్‌’కు ముందు సిద్దు జొన్నలగడ్డ, డైరెక్టర్‌ మల్లిక్‌ రామ్‌ (Mallik Ram) కాంబోలో వచ్చిన ‘డీజే టిల్లు’ (DJ Tillu) బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు తన నటనతో, డైలాగ్స్‌తో ఆడియన్స్‌ను ఫిదా చేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సిద్ధు కెరీర్‌లోనే ‘డీజే టిల్లు’ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మరోవైపు డైరెక్టర్‌ పరుశురామ్‌ పెట్ల, నటుడు విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha Govindam) ఘన విజయం అందుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సూపర్‌ హిట్‌ కాంబోలో వస్తున్న టిల్లు స్క్వేర్‌, ఫ్యామిలీ మ్యాన్‌ చిత్రాలు కూడా కచ్చితంగా విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.  సమ్మర్‌పై కన్నేసిన ‘సుహాస్‌’ హాస్యనటుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా తనని తాను నిరూపించుకున్న నటుడు సుహాస్ (Suhas). రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో తాజాగా ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) అనే మూవీతో రాబోతున్నాడు. అర్జున్ వైకే ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా.. మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా ఆడియన్స్‌లో బజ్‌ ఏర్పడింది. 
    మార్చి 21 , 2024
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా  సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)  మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.  తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి  ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),  'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
    ఆగస్టు 03 , 2023
    ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
    ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
    గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది. దసరా- మార్చి 30 నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న విడుదల కాబోతోంది. సినిమాపై నాని ఈ సారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల కాలంలో తన సినిమాలన్నీ కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. చివరిసారిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అయితే పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నా నాని కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మరి పక్కా మాస్‌ మూవీగా వస్తున్న ‘దసరా’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. OTT విడుదలలు శ్రీదేవి శోభన్ బాబు సంతోశ్‌ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా శ్రీదేవీ శోభన్‌ బాబు. గత నెలలో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఓటీటీ: డిస్పీ+హాట్‌స్టార్‌ తేదీ : మార్చి 30 అమిగోస్‌ కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినంతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో జనాలకు బాగానేే వినోదాన్ని పంచింది. కల్యాణ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిశాయి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే   ఓటీటీలో సందడి చేయబోతోంది. ఓటీటీ: నెట్‌ ఫ్లిక్స్‌ తేదీ: ఏప్రిల్‌ 01 అసలు రవిబాబు దర్శకత్వంలో ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా వస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అసలు’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌గా వస్తున్న ఈ సినిమా కథ ఓ అమ్మాయి జర్నీ, అందులోని సవాళ్ల చుట్టూ జరిగే థ్రిల్లర్‌గా ఉంటనుంది. ఓటీటీ: ఈటీవీ విన్‌ తేదీ: ఏప్రిల్ 05 అన్ని ఓటీటీ విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateGODARIDocumentaryTeluguAhaMarch 31SattiGaani RendekaraluMovieTeluguAhaApril 01My Little Pony- Tell Your TaleWeb seriesenglishNetflixMarch 27Emergency NYCWeb seriesenglishNetflixMarch 29UnseenmovieenglishNetflixMarch 29Almost Pyaar with DJ MohbatMovieHindiNetflixMarch 31Murder Mistery 2MovieEnglishNetflixMarch 31Company of HeroesMovieEnglishNetflixApril 01Jar Head 3 - The SiegeMovieEnglishNetflixApril 01ShehzadaMovieHindiNetflixApril 01Spirit UntamedMovieEnglishNetflixApril 01WarSailerSeriesEnglishNetflixApril 02Avatar 2MovieenglishDisney+HotstarMarch 28GaslightMovieHindiDisney+HotstarMarch 31All That BreathesMovieHindiDisney+HotstarMarch 31AgilanMovieTamilZee5March 31AyothiMovieTamilZee5March 31United Kache MovieHindiZee5March 31Tetris MovieEnglishApple TvMarch 31MummiesMovieEnglishBookMyShowMarch 27BhageeraMovieTamilMobiMarch 31Indian SummersMovieHindiMX PlayerMarch 27
    మార్చి 27 , 2023

    @2021 KTree