• TFIDB EN
  • అతడు
    UTelugu2h 52m
    ఓ రాజకీయ నాయకుడు మరో పొలిటిషియన్‌ను హత్య చేసేందుకు ప్రొఫెషనల్ కిల్లర్‌ నంద గోపాల్‌ను నియమించుకుంటాడు. కానీ, మరో వ్యక్తి చేత ఆ హత్య చేయించి నేరం నంద గోపాల్‌పై వేయిస్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతడు పార్ధు అనే వ్యక్తిగా ఓ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    మహేష్ బాబు
    పార్ధుని గుర్తింపును తీసుకున్న నంద గోపాల్ (నందు).
    త్రిష కృష్ణన్
    పార్ధు కజిన్
    సోనూ సూద్
    నందు భాగస్వామి
    మనోజ్ నందం
    యంగ్ నందు
    ప్రకాష్ రాజ్
    సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్
    సాయాజీ షిండే
    ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రతాప్ రెడ్డి తండ్రి
    కోట శ్రీనివాసరావు
    శివారెడ్డి సన్నిహితుడు
    నాసర్
    పార్ధు తాత
    బ్రహ్మానందం
    పూరి మామ
    సునీల్
    పార్ధు స్నేహితుడు
    రాహుల్ దేవ్
    ఒక స్థానిక డాన్
    రాజీవ్ కనకాల
    పార్ధసారధి పార్ధుడు
    అజయ్
    శివారెడ్డి కొడుకు
    సుధ
    పూరి తల్లి
    గిరి బాబు
    పూరి తండ్రి
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    పూరి మామ
    శృతిధర్మవరపు సుబ్రహ్మణ్యం భార్య
    హేమ
    కృష్ణ మూర్తి భార్య/పూరీ అత్త
    చరణ్ రాజ్
    పోలీస్ ఆఫీసర్
    తనికెళ్ల భరణి
    నాయుడు
    బ్రహ్మాజీ
    నాగసముద్రం బుజ్జి
    పోసాని కృష్ణ మురళి
    శివారెడ్డి సహాయకుడు
    రవి ప్రకాష్
    ఆంజనేయ ప్రసాద్ అసిస్టెంట్
    హర్ష వర్ధన్
    కార్ ఏజెన్సీ యజమాని
    ప్రభుసబ్-ఇన్‌స్పెక్టర్
    ఎంఎస్ నారాయణ
    టీ షాప్ కస్టమర్
    అనంత్ బాబు
    డాక్టర్
    జయ ప్రకాష్ రెడ్డి
    గుండు సుదర్శన్
    రాళ్లపల్లి
    షానూర్ సనా
    కె. విశ్వనాథ్
    CBI అధికారి KS పతంజలి (ప్రత్యేక ప్రదర్శన)
    సిబ్బంది
    త్రివిక్రమ్ శ్రీనివాస్
    దర్శకుడు
    డి. కిషోర్నిర్మాత
    ఎం. రామ్ మోహన్నిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    KV గుహన్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Letterboxd: ‘అతడు’, ‘జెర్సీ’, ‘ఖలేజా’ చిత్రాలకు గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌.. టాప్-100లో చోటు!
    Letterboxd: ‘అతడు’, ‘జెర్సీ’, ‘ఖలేజా’ చిత్రాలకు గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌.. టాప్-100లో చోటు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమ అందిస్తుందని దేశంలో ఏ సినీ ప్రేక్షకుడిని అడిగినా చెబుతాడు. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బలగం’ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఇదిలా ఉంటే ప్రముఖ సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ లెటర్స్‌బాక్స్డ్‌ (Letterboxd) తాజా ప్రకటించిన ప్రపంచంలోని టాప్‌ 100 చిత్రాల్లో టాలీవుడ్‌కు చెందిన నాలుగు సినిమాలకు చోటు దక్కాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  ర్యాంకులు ఇవే! న్యూజిలాండ్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ నెట్‌వర్క్‌ లెటర్‌బాక్స్‌డ్‌.. అత్యంత ప్రజాధరణ పొందిన చిత్రాల గురించి చర్చను ఆహ్వానిస్తుంటుంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ తమకు నచ్చిన సినిమా గురించి ఈ వేదికపై తమ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. రేటింగ్స్‌ కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అత్యధిక మంది అభిమానుల ఆదరణ పొందిన ‘టాప్‌-100’ చిత్రాల జాబితాను లెటర్‌బాక్స్‌డ్ ప్రకటించింది. ఆ వంద చిత్రాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నాలుగు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అతడు (42), జెర్సీ (57), సాగర సంగమం (75), ఖలేజా (85) చిత్రాలు ఎక్కువ మంది ఇష్టపడ్డ మూవీస్‌గా నిలిచాయి.  ఫుల్‌ జోష్‌లో మహేష్‌ ఫ్యాన్స్‌! లెటర్‌బాక్స్డ్ ప్రకటించిన వరల్డ్‌ టాప్‌ 100 చిత్రాల్లో.. టాలీవుడ్‌ నుంచి మహేష్‌ బాబు చేసిన అతడు, ఖలేజా చోటు దక్కించుకున్నాయి. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇందుకు ఓ కారణం ఉంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద మోస్తరు వసూళ్లతోనే అతడు, ఖలేజాలు సర్దుకోవాల్సి వచ్చింది. అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాలు అత్యధిక టీఆర్పీతో టెలికాస్ట్‌ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలను టీవీలో చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాలు టాప్‌100లో నిలవడంతో మహేష్‌ ఫ్యాన్స్‌ కాలర్ ఎగరేస్తున్నారు.  ‘SSMB29’ ముహోర్తం ఫిక్స్‌! మహేష్‌ తన తర్వాతి చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నాడు. దీంతో అందరి దృష్టి SSMB29 పైనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా సాగుతున్నాయి. మహేష్‌ కూడా ఈ మూవీ కోసం పలు దేశాలు తిరుగుతూ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం 'SSMB29' చిత్రాన్ని మే 31న అధికారికంగా లాంచ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. మహేష్‌ తండ్రి, దివంగత స్టార్‌ హీరో కృష్ణ పుట్టిన రోజు నేపథ్యంలో ఆ రోజున సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. 
    ఏప్రిల్ 25 , 2024
    <strong>RC16: రామ్‌చరణ్‌కు విలన్‌గా మున్నా భయ్యా.. అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా!&nbsp;</strong>
    RC16: రామ్‌చరణ్‌కు విలన్‌గా మున్నా భయ్యా.. అతడు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా!&nbsp;
    'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer) తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) చేస్తున్న ప్రాజెక్ట్‌ 'RC 16'. ఉప్పెన ఫేమ్‌ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాహ్నవి కపూర్‌ నటించనుంది. ఇటీవలే తెలుగు స్టార్‌ నటుడు జగపతిబాబు సైతం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్‌ నటుడు సైతం&nbsp; 'RC 16' ప్రాజెక్టులో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని స్పెషల్‌ పోస్టర్‌ ద్వారా మేకర్స్ ప్రకటించారు.&nbsp; మున్నా భాయ్‌ ఆగమనం.. హిందీ వెబ్‌ సిరీస్ ‘మీర్జాపూర్‌’ (Mirzapur Series) ఎంత పెద్ద సక్సెస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సిరీస్‌లో మున్నాభాయ్‌ పాత్ర తెగ హైలెట్‌ అయ్యింది. సిరీస్‌ విజయవంతం కావడంలో ఆ పాత్ర చేసిన దివ్యేందు (Divyenndu) కీలక పాత్ర పోషించాడు. అటువంటి దివ్యేందు తాజాగా&nbsp; 'RC 16' జాయిన్‌ అయ్యాడు. ఈ విషయాన్నితెలియజేస్తూ దర్శకుడు బుచ్చిబాబు (Director Buchi Babu) స్పెషల్‌ పోస్టు రిలీజ్‌ చేశాడు. దీనికి ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టాడు. ‘మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్‌కమ్‌ దివ్యేందు. లెట్స్‌ రాక్‌ ఇట్‌' అని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అతడు నెగిటివ్‌ రోల్‌ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దివ్యేందు రాకతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/BuchiBabuSana/status/1862732574239678593 దివ్యేందు ఎంత కష్టపడ్డాడో! బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ 1983 జూన్‌ 19న జన్మించాడు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కిరోరి మల్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్ చేశాడు. యాక్టింగ్‌లో రెండేళ్ల డిప్లమో కోర్స్‌ చేశాడు. సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్‌లో దివ్యేందు నటించాడు. 'ఆజా నచ్లె' (2007) చిత్రంలో మైనర్ రౌడీగా తొలిసారి సిల్వర్‌ స్క్రీన్‌పై అడుగుపెట్టాడు. తొలి మూడేళ్లు చిన్న వేషాలు వేసుకుంటూ అనేక స్ట్రగుల్స్‌ పడ్డాడు. 2011లో వచ్చిన 'ప్యార్‌ కా పంచ్‌నామా' చిత్రంతో ఇండ్రస్ట్రీలో కాస్త గుర్తింపు తగ్గింది. 2018లో వచ్చి మీర్జాపూర్‌ సిరీస్‌ అతడి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. దాని తర్వాత వరుసగా హిందీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. అదే ఏడాది వచ్చిన 'బట్టి గుల్‌ మీటర్‌ చాలు' సినిమాలో ముఖ్యమైన పాత్రలో మెరిశాడు. ఆ తర్వాతి ఏడాది 'బద్నాం గలి' చిత్రంలో ఏకంగా లీడ్‌ రోల్‌ చేశాడు. ఈ ఏడాది 'మడ్‌గాన్‌ ఎక్స్‌ప్రెస్‌'తో హిందీ ఆడియన్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హీరోగ 'అగ్ని' చిత్రంలో చేస్తున్నాడు. ఇప్పుడు రామ్‌చరణ్‌ మూవీలో అవకాశం దక్కించుకొని తెలుగు ప్రేక్షకులను నేరుగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. రెండేళ్లుగా స్ట్రిప్ట్‌పైనే.. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రెండో చిత్రమే రామ్‌ చరణ్‌తో చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. RC 16 ప్రాజెక్టు కోసం దాదాపు రెండేళ్ల నుంచి బుచ్చిబాబు వర్క్‌ చేస్తున్నారు. సోర్ట్స్‌ డ్రామాగా వీలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రానుంది. ఇందులో దివ్యేందుతో పాటు కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ (Siva Raj Kumar) సైతం కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘పెద్ది’ (RC 16 Title) అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు అందించనున్నాడు. ‘RC16’ కథ ఇదే? ‘RC16’ చిత్రాన్ని బుచ్చిబాబు వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మలయుద్ధం కాన్సెప్ట్‌లో ఈ సినిమా రానున్నట్లు టాక్‌. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్‌ మేకోవర్‌ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో 'బీస్ట్‌ మోడ్‌ ఆన్‌' అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్‌ పంచుకున్నాడు. ‘గేమ్‌ ఛేంజర్‌’ లుక్‌తో పోలిస్తే చరణ్‌ బాడీతో పాటు, లాంగ్‌ హెయిర్‌, గడ్డం పెంచాడు.&nbsp; https://twitter.com/BabaiAbbaiFC/status/1859625463477567813
    నవంబర్ 30 , 2024
    తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణం.. పరిచయం అక్కడేనంట?
    తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణం.. పరిచయం అక్కడేనంట?
    ]తెలిసిన వాడేమిల్కీని ముద్దు పెట్టుకున్నది ఎవరిని నెటిజన్లు చాలామందే వెతికారు. అతడు తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వ్యక్తి. నాని హీరోగా చేసిన MCA చిత్రంలో విలన్‌గా చేశాడు విజయ్ వర్మ.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Mokshagna Teja: </strong><strong>యాక్షన్‌కు సిద్ధమా?&nbsp; సినిమా లాంచ్ ఎప్పుడంటే?</strong>
    Mokshagna Teja: యాక్షన్‌కు సిద్ధమా?&nbsp; సినిమా లాంచ్ ఎప్పుడంటే?
    నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ‘హనుమాన్‌’తో యావత్‌ దేశాన్ని అలరించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో అతడు ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి సింబ’ (Simba) అనే సాలిడ్‌ పేరును సైతం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నిర్మించనుంది. ప్రస్తుతం ఈ మూవీ కోసం తన లుక్‌ను మార్చుకునే పనిలో మోక్షజ్ఞ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంబంధించిన తాజా లుక్‌ బయటకు వచ్చింది. ఇది చూసిన నందమూరి ఫ్యాన్స్ అతడి మేకోవర్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు.&nbsp; లుక్‌ ఎలా ఉందంటే? ఒకప్పుడు మోక్షజ్ఞ (Mokshagna Teja)ను చూస్తే చాలా బొద్దుగా హీరో మెటీరియల్‌ లాగానే అనిపించేవాడు కాదు. అయితే సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమైన నేపథ్యంలోనే ఈ యంగ్‌ నట సింహం తన మేకోవర్‌పై దృష్టి పట్టింది. ఫిట్‌నెస్‌ పెంచుకోవడంతో పాటు హ్యాండ్సమ్‌గా కనిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే ఇటీవల మోక్షజ్ఞ సంబంధించిన నయా మేకోవర్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హీరో అంటే ఇలా కదా ఉండాని అనేంతలా అతడు మారిపోయాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఫొటోనే మోక్షజ్ఞకు సంబంధించి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో మోక్షజ్ఞ గత ఫొటోల్లోకంటే మరింత హ్యాండ్సమ్‌గా కనిపించాడు. లుక్స్‌లో తనకు సాటి ఎవరు రాలేరు అన్న విధంగా మెస్మరైజ్‌ చేశాడు.&nbsp; ‘యాక్షన్‌కు సిద్ధమా?’ టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) మోక్షజ్ఞకు సంబంధించిన నయా ఫొటోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అది క్షణాల్లో నెట్టింట వైరల్ మారింది. మోక్షజ్ఞ ఫొటోను షేర్‌ చేస్తూ 'యాక్షన్‌ కోసం సిద్ధమా?' అంటూ ప్రశాంత్ వర్మ క్యాప్షన్ ఇచ్చాడు. 'సింబా ఈజ్‌ కమింగ్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ను దానికి జోడించారు. దీంతో ‘సింబా’ సినిమాలో మోక్షజ్ఞ ఈ లుక్‌లోనే కనిపిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టాలీవుడ్‌లో మరో ప్రిన్స్‌ అడుగుపెట్టబోతున్నారంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి కుటుంబం నుంచి మరో అందగాడు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు. బాలయ్య కుమారుడు అంటే ఆ మాత్రం గ్లామర్‌ తప్పనిసరి అంటూ ఆకాశానికెత్తుతున్నారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1862361623903486423 ఇతిహాసాల స్ఫూర్తితో.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 'సింబా' ప్రాజెక్ట్‌ రూపొందనుంది. లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి S.L.V. సినిమాస్‌ పతాకంపై సుధారర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు. ఇతిహాసాల ఆధారంగా రూపొందనున్న సోషియో ఫాంటసీ చిత్రమిదని గతంలోనే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేసారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఆఖరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మూవీ లాంచ్‌ గురించి ఏర్పాట్లు కూడా మెుదలుకానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో పక్కాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 'యాక్షన్‌ కోసం సిద్ధమా?' అంటూ ప్రశాంత్ పెట్టిన లేటెస్ట్‌ పోస్టును బట్టే ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఎక్కువ రోజుల సమయం లేదని స్పష్టమవుతోంది.&nbsp; విలన్‌, హీరోయిన్ ఫిక్స్‌! మోక్షజ్ఞ (Mokshagna Teja) సినిమాలో హీరోయిన్‌, విలన్ సైతం ఫిక్సయినట్లు ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ కూతురు రాషా థడాని (Rasha Thadani) ఇందులో కథానాయికగా చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను ఆడిషన్‌ సైతం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వచ్చింది. మరోవైపు విలన్‌ పాత్రను కూడా డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ&nbsp; ఫైనల్‌ చేశారని అంటున్నారు. రానా (Rana Daggubati) పేరును విలన్‌ క్యారెక్టర్‌కు పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఆయన సంప్రదిస్తారని ప్రచారం జరుగుతోంది. రానా ఓకే చెప్పేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సైతం మోక్షజ్ఞ సినిమాలో స్పెషల్‌ రోల్‌ చేసే ఛాన్స్ ఉందని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా పట్టాలెక్కకముందే మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
    నవంబర్ 29 , 2024
    <strong>HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!</strong>
    HBD Naga Chaitanya: నాగ చైతన్య క్రష్ ఎవరో తెలుసా? మీరు అనుకునేవారు మాత్రం కాదు!
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోల్లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ఒకరు. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. సాలిడ్‌ విజయాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా అనిపిస్తూ తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇవాళ (నవంబర్‌ 23) నాగ చైతన్య పుట్టిన రోజు. 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో చైతూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్స్ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి ఘనమైన కుటుంబ నేపథ్యం అక్కినేని నాగ చైతన్యకు ఉంది. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని చైతూ కొణికి పుచ్చుకున్నాడు. 1986 నవంబర్‌ 23న అక్కినేని నాగార్జున, లక్ష్మీ (డి. రామానాయుడు కూతురు, వెంకటేష్‌ సోదరి) దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. నాగచైతన్య చిన్నప్పుడే లక్ష్మీతో నాగార్జున విడిపోయారు. దీంతో చెన్నైలో తల్లి వద్దనే చైతన్య పెరిగాడు. అక్కడే పీఎస్‌బీబీ స్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తి చేసి హైదరాబాద్‌ వచ్చాడు.&nbsp; హైదరాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో కామర్స్‌ చేశాడు. చదువులో చైతన్య బ్రిలియంట్‌ ఏమి కాదు. తాను జస్ట్ యావరేజ్‌ స్టూడెంట్‌ అని చైతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.&nbsp; ప్రస్తుతం నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)ను చూస్తే చాలా ఫిట్‌గా 38 ఏళ్లు వచ్చినట్లు అసలు కనిపించడు. కానీ టీనేజ్‌లో అతడు చాలా లావుగా ఉండేవాడు. 98 కేజీల వరకూ బరువు ఉండేవాడట. చూడటానికి చాలా బొద్దుగా కనిపిస్తుండటంతో అప్పట్లో అందరూ 'డంబూ' అని చైతూను పిలిచేవారట. అక్కినేని కంటే దగ్గుబాటి ఫ్యామిలీ వారే చైతూనూ బాగా ముద్దు చేశారని సమాచారం.&nbsp; హీరో కావాలన్న కోరిక నాగచైతన్య చిన్నప్పటి నుంచి లేదట. డిగ్రీ మిడిల్‌కు వచ్చాక కూడా కెరీర్‌పై స్పష్టత లేదట. తండ్రితో షూటింగ్స్‌ వెళ్లడం వల్ల సినిమాలపై చైతూకి ఆసక్తి వచ్చింది.&nbsp; సినిమాల్లోకి వస్తానని నాగార్జునకు చైతూ చెప్పగా నీ ఇష్టమని ఆయన బదులిచ్చారు. అయితే బరువు తగ్గాలని మాత్రం సూచించినట్లు తెలిసింది.&nbsp; నాగార్జున సూచనతో ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టిన నాగచైతన్య బాగా బరువు తగ్గాడు. దాంతోపాటు కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్‌ స్కూల్లో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకున్నాడు.&nbsp; అలా 2009లో 'జోష్‌' సినిమాతో నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత చేసిన 'ఏం మాయ చేశావే' సినిమా నాగచైతన్య కెరీర్‌ను మలుపు తిప్పింది.&nbsp; సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే తెలుగు నటుడు అనగానే ముందుగా నాగ చైతన్యనే గుర్తుకు వస్తాడు. ఈ మధ్య పర్వాలేదు గానీ మెుదట్లో మెయిన్ స్ట్రీమ్‌ మీడియాకు సైతం చైతూ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు.&nbsp; సోషల్ మీడియాలో పంచుకుంటే ఇక మన ప్రైవసీ ఏముందని నాగ చైతన్య తరచూ చెబుతుంటాడు. వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ప్రైవేటుగానే ఉండాలని ఈ కుర్ర హీరో అభిప్రాయం. నాగచైతన్య (HBD Akkineni Naga Chaitanya) చూడటానికి సాఫ్ట్‌గా కనిపించినా రేసింగ్‌లో మాత్రం దుమ్మురేపుతుంటాడు. హైస్పీడ్‌ బైక్స్‌, కార్లు అవలీలగా నడిపేస్తుంటాడు వాస్తవానికి రేసర్ కావాలని తొలుత నాగ చైతన్య భావించాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నట్లు అతడి సన్నిహితులు చెప్పారు. కొన్ని కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నాడు.&nbsp; ప్రొఫెషనల్ రేసర్ కానప్పటికీ ఇప్పటికీ రేసర్‌గానే తనని తాను భావిస్తుంటాడు చైతూ. రేసింగ్ కార్లను కొనుగోలు చేయడం అభిరుచిగా పెట్టుకున్నాడు. ఖాళీ సమయాల్లో ఫుల్‌ స్పీడుతో డ్రైవింగ్‌ చేస్తుంటాడు. ప్రస్తుతం చైతూ గ్యారేజీలో ఫెరారీ, నిస్సాన్‌ జీటీ-ఆర్‌, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్‌ రోవర్‌ వోగ్‌ లాంటి అత్యంత వేగంగా వెళ్లే కార్లు ఉన్నాయి. వీటితో పాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ వంటి రేసింగ్‌ బైక్స్‌ కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్‌కు చైతూ (HBD Akkineni Naga Chaitanya) చాలా ప్రాధాన్యత ఇస్తాడు. క్రమం తప్పకుండా వర్కౌట్లు చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటాడు. ఇందుకోసం ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.&nbsp; చైతూకి మెుహమాటం చాలా ఎక్కువ. అతడితో కొద్దిసేపు మాట్లాడితే ఎవరికైనా ఇది తెలిసిపోతుందని ఆయన ఫ్రెండ్స్‌ చెబుతుంటారు.&nbsp; చైతూకి ఫ్రెండ్స్‌ కూడా చాలా తక్కువేనట. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా. బంధుత్వానికి మించిన స్నేహం చిన్నప్పటి నుంచి వారి మధ్య ఉంది.&nbsp; చైతూ మంచితనం, వ్యక్తిత్వం చూసి 'స్వీట్‌ కిడ్‌' అని పేరు పెట్టానని రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చైతూని ఎవరైనా ఇష్టపడతారని పేర్కొన్నారు.&nbsp; చైతూ ఇష్టమైన ఫుడ్ విషయానికి వస్తే ‘బటర్‌ చికెన్‌’ అంటే అతడికి బాగా ఇష్టం. వారంలో కనీసం రెండుసార్లైనా అది ఉండాల్సిందేనని చైతూ చెబుతుంటాడు.&nbsp; నాగ చైతన్య (HBD Akkineni Naga Chaitanya)కు ఓ ఊతపదం ఉంది. బాగా అబ్జర్వ్‌ చేస్తే తప్ప అది గుర్తించలేరు. ఇంతకీ ఆ పదం ఏంటంటే 'యూ నో'. ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ నటిపై టీనేజ్‌ నుంచి నాగచైతన్యకు క్రష్‌ ఉండేదట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ఏడేళ్ల పాటు ప్రేమించి స్టార్‌ హీరోయిన్‌ సమంతను 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నాడు. అనివార్య కారణాలతే నాలుగేళ్లకే (2021) వారు విడిపోయారు.&nbsp; ప్రముఖ నటి శోభితా దూళిపాళ్లను 2024 ఆగస్టు 8న చైతు నిశ్చితార్థం చేసుకున్నాడు. డిసెంబర్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది.&nbsp; ఇక సినిమాల విషయానికొస్తే విరూపాక్ష డైరెక్టర్‌ కార్తీక్‌ దండుతో చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇవాళ (నవంబర్‌ 23) చైతూ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ నుంచి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1860218199587062221 'NC 24' వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌తో కలిసి డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మించనున్నారు.&nbsp;
    నవంబర్ 23 , 2024
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ తర్వాత అతడు చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చరణ్‌ ఇటీవల రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. అంబానీ ఇంట వివాహానికి సైతం ఈ కారులోనే వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ కారు రిజిస్టేషన్‌కు చరణ్ స్వయంగా వెళ్లారు. ఈ కారుకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్ సైతం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ఫ్యాన్సీ నెంబర్ ఇదే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ (Rolls Royce Car) కారును కొనుగోలు చేశారు. ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రవాణాశాఖ ‘TG 09 C 2727’ నెంబర్‌ను కేటాయించింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఆఫీసుకు వచ్చారు. ఆయన రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. అభిమానులు సెల్ఫీలు దిగారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సైతం కలిశారు. ఫొటోలు దిగారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో వెళ్లిపోయారు. https://twitter.com/i/status/1848718642428711223 ఎన్నికోట్ల ఖర్చంటే! చరణ్‌ రోల్స్ రాయిస్ కారును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా చరణ్‌ ఏరి కోరి మరి ‘TG 09 C 2727’ ఫ్యాన్సీ నెంబర్‌ను కారుకు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10-20 లక్షల వరకూ రుసుము చెల్లించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే చరణ్‌ దగ్గర చాలా కార్లే ఉన్నాయ్‌. ఇప్పుడు ఆ చెర్రీ గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరింది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా రోల్స్‌ రాయిస్‌ కారునే వినియోగిస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీస్‌ దగ్గర కూడా ఈ కారు ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కారుకి సంబంధించిన ఫ్యాన్సీ నెంబర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1811294194205425882 రామ్‌చరణ్‌ అరుదైన ఘనత సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం ‘రైమ్‌’ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వీటికి సంబంధించిన కొలతలను సైతం మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ - 2 కూడా గతంలో తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించారు. ఆమె తర్వాత చరణ్‌ మాత్రమే తన పెట్‌ డాగ్‌తో మైనపు విగ్రహంగా కనిపించబోతున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా రామ్‌చరణ్‌ నిలిచాడు. ‘రైమ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ ఈ విగ్రహం రూపుదిద్దుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నాను’ అని చరణ్‌ అన్నారు. https://twitter.com/Nilzrav/status/1840120654193897699 రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    అక్టోబర్ 23 , 2024
    <strong>Akira Nandan: అకీరా నందన్‌ గురించి ఈ టాప్‌ - 10 సీక్రెట్స్‌ తెలుసా?</strong>
    Akira Nandan: అకీరా నందన్‌ గురించి ఈ టాప్‌ - 10 సీక్రెట్స్‌ తెలుసా?
    పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ ఏదోక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా అకీరా పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో అతడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అకీరా ఫిల్మ్ ఎంట్రీ పవన్‌ మూవీతోనే జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక అకీరా అంటే పవన్‌ కల్యాణ్‌ కుమారుడిగానే చాలా మందికి తెలుసు. అతడి గురించి తెలియని టాప్ -10 సీక్రెట్స్‌ ఇప్పుడు చూద్దాం.&nbsp; అకీరానందన్‌ 2004 ఏప్రిల్‌ 8న పవన్‌ - రేణు దేశాయ్‌ దంపతులకు జన్మించాడు. అప్పటికీ పవన్‌ రేణుదేశాయ్‌ను వివాహం చేసుకోలేదు. 2009లో పవన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2012లో వారిద్దరు విడిపోయారు.&nbsp; అకీరా కటౌట్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హైట్‌లో ప్రభాస్‌, రానా, వరుణ్‌ తేజ్‌లను గుర్తుచేస్తుంటాడు. అతడి హైట్‌ ప్రస్తుతం 6 అడుగుల 4 అంగుళాలు ఉంది.&nbsp; అకీరా నందన్ విద్యాబ్యాసం హైదరాబాద్‌లోనే జరిగింది. ఆక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అకీరా చదువుకున్నాడు. క్రికెట్ ఆడటమంటే అకీరాకు చాలా ఇష్టం.&nbsp; అకీరా నందన్‌ ఫేవరేట్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కాదట. యంగ్‌ హీరో అడివి శేష్‌ అంటే అకీరాకు చాలా ఇష్టమట. ఈ విషయం అకీరా తల్లి రేణు దేశాయ్‌ గతంలో వెల్లడించింది.&nbsp; ఇండస్ట్రీలోని కుర్ర హీరోల్లో అకీరాకు ఓ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడు. అతడు ఎవరో కాదు అడివి శేషూనే. ఈ విషయాన్ని మేజర్‌ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్‌ చెప్పాడు. అకీరా తనకు మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఉన్నా తామిద్దరం మంచి స్నేహితులమని, తరుచూ కలుస్తుంటామని చెప్పుకొచ్చాడు. అకీరాకు చాలా మృదుస్వభావి. స్టార్‌ హీరో, డిప్యూటీ సీఎం కుమారుడిని అన్న ఫీలింగ్ అతడిలో కాస్తంత కూడా కనిపించదని అకీరా సన్నిహితులు చెబుతుంటారు.&nbsp; ప్రస్తుతం అకీరా మెగా ఫ్యామిలీతో గానీ, తల్లి రేణుదేశాయ్‌తో గానీ కలిసి ఉండటం లేదట. హైదరాబాద్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడట. అతడి బాగోగులు పవన్‌ కల్యాణే చూసుకుంటున్నారు.&nbsp; తన తల్లికి పవన్‌ విడాకులు ఇచ్చారన్న ఫీలింగ్‌ అకీరాలో రాకుండా రేణు దేశాయ్‌ చాలా జాగ్రత్త పడిందట. రాజకీయ కారణాల వల్లే తాము విడిపోవాల్సి వచ్చిందని పదే పదే చెప్తూ తండ్రిపై అకీరాకు కోపం రాకుండా చూసుకుందట. అకీరానందన్‌ చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించాడు. 2014లో తన తల్లి దర్శకత్వం వహించిన ‘ఇష్క్‌ వాలా లవ్‌’లో అతడు తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు.&nbsp; ప్రస్తుతానికి అకీరాకు యాక్టింగ్‌ చేయాలన్న ఆసక్తి లేదు. కానీ సంగీతం అంటే చాలా ఇష్టమట. ఇందుకోసం పియానో కూడా నేర్చుకున్నాడు. అలాగే యోగ, మార్షల్ ఆర్ట్స్‌, కిక్‌ బాక్సింగ్‌లోనూ అకీరాకు ప్రావీణ్యం ఉంది.&nbsp;
    అక్టోబర్ 21 , 2024
    <strong>Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!</strong>
    Vishwak Sen: పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌తో విష్వక్‌ సేన్‌ రొమాన్స్‌.. క్రేజీ కాంబో లోడింగ్‌!
    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జాతి రత్నాలు డైరెక్టర్‌ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో విష్వక్‌ రొమాన్స్‌ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; ‘VS14’లో హీరోయిన్‌ ఫిక్స్‌! విష్వక్‌ సేన్‌ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘VS14’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టులో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే లేటేస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో విష్వక్‌కు జోడీగా తమిళ నటి  ప్రియాంక అరుళ్‌ మోహనన్‌ చేయనుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సరసన నటించిన ప్రియాంక మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'ఓజీ' సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది. ఇక విష్వక్‌ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తే ‘VS14’పై అంచనాలు భారీగా పెరగనున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వ ప్రసాద్‌ నిర్మించనున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం సమకూర్చనున్నారు. యాక్షన్‌ డ్రామా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ ఇటీవల మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; రెండోసారి ఖాకీ పాత్రలో.. విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; విష్వక్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెకండ్‌ సాంగ్‌ కూడా రిలీజై ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    సెప్టెంబర్ 24 , 2024
    <strong>David Warner: తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌.. ఇదెక్కడి మాస్‌ ఎంట్రీరా సామి!&nbsp;</strong>
    David Warner: తెలుగు సినిమాలో ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌.. ఇదెక్కడి మాస్‌ ఎంట్రీరా సామి!&nbsp;
    ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్‌, సాంగ్స్‌కు రీల్స్‌ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అల్లు అర్జున్‌ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్‌ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్‌ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన వార్నర్‌ సినిమాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మెుదలుపెడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.&nbsp; 'పుష్ప 2'లో కీ రోల్! అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2'. అయితే ఇందులో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డేవిడ్ వార్నర్‌కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో వార్నర్ చూట్టు ప్రొఫెషనల్​ బౌన్సర్లు ఉన్నారు. వైట్ అండ్ వైట్ ఔట్​ ఫిట్​లో వార్నర్ గన్​ పట్టుకొని స్టైలిష్​గా కనిపిస్తున్నాడు. అయితే ఈ లుక్​ ‘పుష్ప 2’ సినిమాలోనిదే అని నెటిజన్లు అంటున్నారు. కానీ, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ‘పుష్ప 2’ మేకర్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఈ ప్రచారం నిజం కావాలని వార్నర్ అభిమానులు కోరుకుంటున్నారు. https://twitter.com/AuTelugu_Films/status/1837406285702074497 సుకుమార్‌ ప్లాన్‌ ఇదేనా! ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' (Pushpa: The Rise)తో డేవిడ్‌ వార్నర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట గతంలో ఇండియా మెుత్తం సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ పాటకు వార్నర్‌ రీల్స్ కూడా చేశాడు. అప్పట్లో అవి తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు మైదానంలో పలుమార్లు 'తగ్గేదేలే' అంటూ బన్నీ మేనరిజాన్ని వార్నర్‌ అనుసరించాడు. తద్వారా తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌ క్రేజ్‌ను 'పుష్ప 2’లో వినియోగించుకోవాలని డైరెక్టర్ సుకుమార్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ‘పుష్ప 2’లో డేవిడ్ మామను తప్పకుండా చూసే ఛాన్స్ ఉంది.&nbsp; https://twitter.com/i/status/1484806143595532289 https://twitter.com/AAAdmirersKL/status/1516976589069701121 ఐపీఎల్‌తో చేరువ టీమిండియా ఆటగాళ్లతో సమానంగా వార్నర్‌ను తెలుగు క్రికెట్ అభిమానులు గౌరవిస్తుంటారు. వార్నర్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు జట్టుకు ఐపీఎల్‌ ట్రోఫీని సైతం అందించాడు. దీంతో వార్నర్‌కి తెలుగు అభిమానులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. అటు వార్నర్‌ సైతం ఇందుకు ప్రతిగా తెలుగు సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేస్తూ, సినిమా డైలాగ్స్‌ చెబుతూ రీల్స్‌ చేసేవాడు. ఇలా తెలుగువారికి వార్నర్‌ దగ్గరయ్యాడు. వార్నర్‌ పలు సందర్భాల్లో హైదరాబాద్‌పై, తెలుగు అభిమానులపై ప్రేమ చూపించాడు. హైదరాబాద్‌ను మిస్‌ అవుతున్నట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో సన్‌రైజర్స్‌ వార్నర్‌ని తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. రాజమౌళితో యాడ్‌ షూట్‌ ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం రాజమౌళి, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ కలిసి గతంలో ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్‌ చేయాలని వార్నర్‌ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు. ఒక వేళ తన సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు.&nbsp; బాహుబలి తరహా గెటప్‌లో వార్నర్‌ చేసే అల్లరి, డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్‌ ఇవన్నీ ఊహించుకొని ఒక్కసారిగా భయపడతాడు. అప్పట్లో ఈ యాడ్‌ విపరీతంగా వైరల్ అయ్యింది. మళ్లీ ఓసారి చూసేయండి.&nbsp; https://twitter.com/i/status/1778705794340720824
    సెప్టెంబర్ 21 , 2024
    <strong>Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?</strong>
    Jayam Ravi Divorce: భార్యతో విడిపోయిన జయం రవి.. విడాకులకు ముందు ఇంత జరిగిందా?
    తమిళ స్టార్‌ హీరో జయం రవికి కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పేరుంది. ఆయన హీరోగా చేసిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్బింగ్ అయ్యి రిలీజ్‌ అయ్యాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘సైరెన్‌’ చిత్రం తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జయం రవి సంచలన ప్రకటన చేశారు. భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఎక్స్‌ వేదికగా అతడు పెట్టిన సుదీర్ఘ పోస్టు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.&nbsp; ‘మా ఇద్దరి మంచి కోసమే..’ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అతడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం.&nbsp; ఈ విషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని జయం రవి పేర్కొన్నారు. https://twitter.com/actor_jayamravi/status/1833030619481444611 15 ఏళ్ల బంధానికి బ్రేక్‌ 2009 జూన్‌లో జయం రవి, ఆర్తి పెళ్లితో ఒక్కటయ్యారు. వాళ్లకు ఇద్దరు కొడుకులు ఆరవ్, అయాన్ కూడా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట విడాకులకు సంబంధించి ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని కోలివుడ్‌ మీడియా సైతం అనేకసార్లు కథనాలు రాసింది. ఈ క్రమంలోనే వారు వేర్వేరుగా జీవిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరు త్వరలో విడిపోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి. వాటికి తాజా పోస్టుతో జయం రవి ముగింపు పలికారు. అయితే ఎందుకు విడిపోతున్న సంగతి ఎక్కడా రివీల్‌ చేయలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా? అని సెలబ్రిటీలతో పాటు జయం రవి అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కలిసి ఉంటూ బాధ పడటం కన్నా విడిపోయి ఎవరికి నచ్చినట్లు హ్యాపీగా ఉండటమే బెటర్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp; తెలుగు సినిమాతోనే గుర్తింపు 1993లో వచ్చిన 'బావ బామ్మర్ది','పల్నాటి పౌరుషం' (1994) వంటి చిత్రాలతో బాల నటుడిగా జయం రవి పరిచయమయ్యారు. 2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. ఇది హీరోగా జయం రవికి ఫస్ట్‌ ఫిల్మ్‌. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్‌ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. 2015లో వచ్చిన జెండాపై కపిరాజు మూవీలో జయం రవి ఓ అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 &amp; 2’ చిత్రాల్లో టైటిల్‌ రోల్‌ పోషించి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>Saripodhaa Sanivaaram Day 1 Collections: ‘సరిపోదా శనివారం’కు అదిరిపోయే ఓపెనింగ్స్‌.. రెండో చిత్రంగా రికార్డ్‌!</strong>
    Saripodhaa Sanivaaram Day 1 Collections: ‘సరిపోదా శనివారం’కు అదిరిపోయే ఓపెనింగ్స్‌.. రెండో చిత్రంగా రికార్డ్‌!
    నేచురల్‌ స్టార్‌ నాని (Natural Star Nani) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా అతడు నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 29 గ్రాండ్‌గా విడుదలై సర్వత్రా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నానితో పాటు విలన్‌గా చేసిన ఎస్‌.జే. సూర్య నటనపై ఆడియన్స్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో సినిమాలో తమను నిరాశకు గురిచేసిన అంశాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. అయితే ఓవరాల్‌గా పాజిటివ్ రివ్యూస్‌ సాధించిన నాని చిత్రం తొలి రోజు మంచి వసూళ్లనే సాధించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.&nbsp; తొలి కలెక్షన్స్‌ ఎంతంటే? నాని హీరోగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ జంటగా నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram Day 1 Collections) చిత్రం తొలి రోజు ఆశించిన స్థాయిలోనే వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.20.3 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఒక్క ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రూ.8.8 కోట్లు మేర రాబట్టినట్లు స్పష్టం చేశాయి. ఓవర్సీస్‌లో రూ.7.6 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలిపాయి. అటు కర్ణాటకలో రూ.1.4 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.2.5 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఈ వీకెండ్‌ సాలిడ్‌ వసూళ్లను సాధించే అవకాశముందని అంచనా వేశాయి. సినిమా హిట్‌ టాక్‌ అనంతరం టికెట్‌ బుకింగ్స్‌ గణనీయ సంఖ్యలో పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.&nbsp; ‘దసరా’ కంటే తక్కువే! నాని గత చిత్రం 'హాయ్‌ నాన్న' (Hi nanna) తొలి రోజున రూ.10.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ చిత్రంతో పోలిస్తే ‘సరిపోదా శనివారం’ రెట్టింపు వసూళ్లను సాధించడం విశేషం. అయితే నాని అంతకుముందు చిత్రం ‘దసరా’ కంటే ఇది చాల తక్కువనే చెప్పవచ్చు. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా తొలి రోజున రూ.38 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి నాని కెరీర్‌లో హైయస్ట్‌ ఓపెనింగ్‌గా నిలిచింది. దానితో పోలిస్తే 'సరిపోదా శనివారం' రూ.18 కోట్ల మేర వెనకబడింది. అయినప్పటికీ నాని కెరీర్‌లో సెకండ్‌ హయ్యేస్ట్ ఓపెనింగ్‌ చిత్రంగా ‘సరిపోదా శనివారం’ రికార్డు సృష్టించింది. సినిమాలో అవే హైలెట్స్‌ ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’ చిత్రాలతో క్లాసిక్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన వివేక్‌ ఆత్రేయ తనలోని ఊర మాస్‌ను ఈ చిత్రం ద్వారా పరిచయం చేశారు. తన శైలికి భిన్నంగా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. నాని, ఎస్‌.జే సూర్య నటన, యాక్షన్ సీక్వెన్స్‌, జేక్స్‌ బేజోయ్‌ నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో - విలన్‌ మధ్య వచ్చే టామ్‌ అండ్‌ జెర్రీ తరహా సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించాయి. అయితే నిడివి మరి ఎక్కువగా ఉండటం, పెద్దగా మలుపులు లేకపోవడం, కమర్షియల్‌ హంగులు మిస్సవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం సినిమాకు కాస్త మైనస్‌లుగా మారాయి. ‘సరిపోదా శనివారం’ స్టోరీ ఇదే.. సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. పోలీసు ఆఫీసర్‌ దయా (ఎస్‌.జే సూర్య) వారిని హింసిస్తుంటాడు. తన అధికార బలంతో చిత్ర హింసలకు గురిచేస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో హీరో సోకులపాలెం ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత క్రూరమైన పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? హీరో శనివారమే విజృంభించడానికి కారణమేంటి? హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌తో అతడి లవ్‌ ట్రాక్‌ ఏంటి? హీరో-విలన్‌ మధ్య జరిగిన నువ్వా నేనా పోటీలో ఎవరు గెలిచారు? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/saripodhaa-sanivaaram-review-nani-ooramas-massacre-in-the-action-sequence-how-about-saripodhaa-sanivaaram.html
    ఆగస్టు 30 , 2024
    <strong>VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్‌ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ వచ్చేసిందిగా!</strong>
    VS13: పోలీసు ఆఫీసర్‌గా విష్వక్‌ సేన్.. అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ వచ్చేసిందిగా!
    ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌ హీరోల్లో విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) ఒకరు. వరుసగా చిత్రాలను రిలీజ్‌ చేస్తూ అతడు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ హిట్స్‌తో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న ఈ మాస్‌ కా దాస్‌ వరుసగా కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. రెండు చిత్రాలు ఇప్పటికే సెట్స్‌పై ఉండగా తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఆ మూవీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; యాక్షన్‌ డ్రామా.. యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌ తాజాగా మరో ప్రాజెక్టును ప్రకటించాడు. 'VS13' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. 'కాంతార' (Kantara) మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ ఈ మూవీలు స్వరాలు సమకూర్చనున్నారు. తాజా పోస్టర్‌ను గమనిస్తే ఇందులో విష్వక్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ డ్రామాగా ‘VS13’ రాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.&nbsp; https://twitter.com/SLVCinemasOffl/status/1820696576098197948 రెండోసారి ఖాకీ పాత్రలో.. విష్వక్‌ సేన్‌ పోలీసు పాత్రను పోషించడం ఇదే తొలిసారి కాదు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్‌ : ది ఫస్ట్‌ కేసు' (HIT: The First Case) చిత్రంలోనూ విష్వక్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమా సక్సెస్‌తో విష్వక్‌ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ‘VS13’ ప్రాజెక్ట్‌లోనూ విష్వక్‌ మరోమారు పోలీసు పాత్ర పోషిస్తుండటంతో ఆడియన్స్‌లో ఆసక్తి ఏర్పడింది. తనకు బాగా కలిసొచ్చిన కాప్‌ రోల్‌లో విష్వక్‌ మరోమారు సక్సెస్ అవుతాడని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; విష్వక్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)లో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా చేస్తోంది. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీంతో పాటు ఇటీవల ‘లైలా’ (Laila) అనే కొత్త సినిమాను సైతం విష్వక్‌ ఇటీవల ప్రకటించారు. ఇందులో విష్వక్‌ అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘లైలా’ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హ్యాట్రిక్‌ హిట్స్‌ ప్రస్తుతం విష్వక్‌ హ్యాట్రిక్‌ విజయాలతో మంచి ఊపు మీదనున్నారు. ఆయన రీసెంట్‌ చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' (Gangs Of Godavari) థియేటర్లలో పాజిటిక్‌ టాక్‌ తెచ్చుకుంది. మంచి వసూళ్లను సైతం సాధించింది. లంకల రత్నాకర్‌ పాత్రలో విష్వక్‌ మాస్‌ జాతర చేశాడు. అలాగే విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో వచ్చిన 'గామి' (Gaami) కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో అఘోరా శంకర్‌ పాత్రలో విష్వక్‌ నటన మెప్పించింది. హీరోయిన్‌ చాందిని చౌదరి (Chandini Chowdary) మరో ముఖ్య పాత్రలో కనిపించింది. అంతకుముందు వచ్చిన ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మూవీ కూడా విష్వక్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విష్వక్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో విష్వక్‌ ద్విపాత్రాభినయంతో అలరించాడు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    ఆగస్టు 06 , 2024
    <strong>Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;</strong>
    Hero Vishal: విశాల్‌ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!&nbsp;
    కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. అతడు చేసే యాక్షన్‌ చిత్రాలకు మాస్‌ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్‌ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్‌ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్‌ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్‌ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలేం జరిగింగంటే? హీరో విశాల్‌ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్‌ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ విశాల్‌ కొన్ని కామెంట్స్‌ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్‌ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్‌ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్‌ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్‌ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.&nbsp; విశాల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!&nbsp; ‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్‌ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్‌. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్‌ కథిరేసన్‌ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్‌ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.&nbsp; https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070 విశాల్‌ ఎలా పాపులర్ అంటే? తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్‌ టాలీవుడ్‌ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్‌ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్‌ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్‌ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.&nbsp;
    జూలై 27 , 2024
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    EXCLUSIVE: విజయ్ దేవరకొండతో ‘ప్రేమలు’ హీరోయిన్ రొమాన్స్!
    టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల 'ఫ్యామిలీ స్టార్‌' (Family Star) చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ పలకరించాడు. ప్రస్తుతం అతడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్‌గా తీసుకుంటారన్న ఆసక్తి టాలీవుడ్‌లో మెుదలైంది. తొలుత శ్రీలీల (Sreeleela)ను విజయ్‌కు జోడీగా తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం యంగ్‌ సెన్సేషన్‌ మమితా బైజును హీరోయిన్‌గా లాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.&nbsp; విజయ్‌కు జోడీగా కేరళ బ్యూటీ! ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం హృదయాలను మలయాళీ సోయగం ‘మమితా బైజు’ (Mamita Baiju) దోచుకుంది. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌ కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో భారీ ఆఫర్లు మెుదలయ్యాయి. ఈ క్రమంలోనే విజయ్‌ దేవరకొండ, దర్శకుడు గౌతం తిన్ననూరి కాంబోలో రానున్న ‘VD12’ చిత్రంలో ఈ అమ్మడికి ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. సరికొత్త ప్రేమ కథతో రానున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మమితా బైజు సరిగ్గా ఉంటుందని యూనిట్‌ భావించిందట. ఈ ఆఫర్‌ పట్ల మమితా కూడా చాలా ఆసక్తి కనబరిచిందట. విజయ్‌తో నటించేందుకు చాలా ఇంట్రస్ట్ చూపించిందట. దీంతో ఈ మలయాళ బ్యూటీ నేరుగా చేయనున్న తెలుగు చిత్రం ఇదే అవుతుందని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని సమాచారం.&nbsp; ఆ హీరోయిన్ల సరసన చోటు! మలయాళం భామలు తెలుగు సినిమాల్లో నటించడం ఇదేమి తొలిసారి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అనుపమా పరమేశ్వరన్‌, కీర్తి సురేష్‌, నివేదా థామస్‌, మాళవిక మోహనన్‌ వంటి భామలు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించారు. తమ నటన, గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు యంగ్ సెన్సేషన్‌ మమితా బైజు రెడీ అవుతోంది. ‘ప్రేమలు’లో ఈ అమ్మడి నటనకు ఫిదా అయిన యూత్‌ ఆడియన్స్‌.. ‘VD12’పై ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు. తెలుగులోనూ ఈ అమ్మడి మ్యాజిక్‌ మెుదలవుతుందని బలంగా నమ్ముతున్నారు.&nbsp; View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) మమితాపై ఆసక్తికి కారణమదేనా? 'VD 12' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనుంది. హీరో విజయ్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళం సహా నార్త్‌ ప్రేక్షకులకు 'VD12' చిత్రాన్ని మరింత చేరువ చేసేందుకు మమితా బైజు ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఇటీవల వచ్చిన&nbsp; ‘ప్రేమలు’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడం.. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను సాధించడంతో ఈ అమ్మడి క్రేజ్‌ సినిమాకు బాగా కలిసొస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీలను కాదని మమితా పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 20 , 2024
    Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
    Rajamouli - David Warner: డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి ఎందుకు షూటింగ్ చేశాడంటే?
    ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner)కు క్రికెట్‌తో పాటు యాక్టర్‌గానూ సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందాడు. అతడు తెలుగు సినిమాలకు సంబంధించిన పలు డైలాగ్స్‌, సాంగ్స్‌కు రీల్స్‌ చేసి గతంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తరపున ఆడుతున్న సమయంలో ఎక్కువగా సినిమా రీల్స్‌ చేసి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫేమస్ అయ్యాడు. అల్లు అర్జున్‌ (Allu Arjun), ప్రభాస్ (Prabhas), మహేష్‌ బాబు (Mahesh Babu) వంటి హీరోలను అతడు ఇమిటేట్‌ చేసిన వీడియోలు అప్పట్లో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్నర్.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌ షూట్‌ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది.&nbsp; రాజమౌళిని ఫేవర్‌ కోరిన వార్నర్‌! ప్రముఖ పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) కోసం.. రాజమౌళి, డేవిడ్‌ వార్నర్‌ ఇద్దరూ కలిసి ఓ ఫన్నీ యాడ్‌లో నటించారు. ఆ యాడ్ ఓపెనింగ్‌లో ‘మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి` అని వార్నర్‌ను రాజమౌళి అడుగుతాడు. ‘రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ యాప్ ఉంటే క్యాష్‌బ్యాక్ వస్తుంది’ అని వార్నర్ బదులిస్తాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ.. ‘నార్మల్ యూపీఐ యాప్ ఉంటే రాదా?’ అని ప్రశ్నిస్తాడు. అలా అయితే డిస్కౌంట్ కోసం తనకు ఫేవర్‌ చేయాలని వార్నర్‌ కోరతాడు. తనతో సినిమా చేయమని అడుగుతాడు.&nbsp; https://twitter.com/CRED_club/status/1778703889715646779? వార్నర్‌ రాక్స్.. రాజమౌళి షాక్స్‌! ఒక వేళ తన సినిమాలో డేవిడ్‌ వార్నర్‌ నిజంగానే హీరోగా నటిస్తే ఎలా ఉంటుందోనని రాజమౌళి ఊహించుకుంటాడు. బాహుబలి తరహా గెటప్‌లో అతడు నటిస్తే షూటింగ్‌ సెట్‌ ఎలా ఉంటుందోనని ఆలోచనల్లోకి వెళ్లిపోతాడు. సెట్స్‌లో వార్నర్‌ చేసే అల్లరి, డ్యాన్స్‌ స్టెప్పులు, డైలాగ్స్‌.. ఇవన్నీ ఊహించుకొని దర్శకధీరుడు ఒక్కసారిగా భయపడిపోయినట్లు యాడ్‌లో చూపించారు. మధ్యలో ‘ఆస్కార్ వేదికగా కలుద్దాం’, ‘నాకు గుర్రం వద్దు.. కంగారూ కావాలి’ అంటూ వార్నర్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చివరకు ఆ సినిమా ఆలోచన మానుకుని క్రెడ్ యాప్‌ను రాజమౌళి డౌన్‌లోడ్ చేసుకోవడంతో యాడ్ ముగుస్తుంది. ఈ వీడియోను క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కొన్ని సార్లు ఫేవర్స్‌ కూడా మార్కెట్‌ రిస్క్‌కి లోబడి ఉంటాయంటూ వీడియోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులతో పాటు క్రికెట్‌ లవర్స్‌ను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.&nbsp;
    ఏప్రిల్ 13 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.&nbsp; ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    Guntur Kaaram: నిరాశలో మహేశ్ ఫ్యాన్స్.. బర్త్ డే పోస్టర్‌తో సరిపెట్టిన మూవీ టీమ్‌.. ఎప్పుడూ ఇదే వరస!
    మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో సినిమా వస్తుందంటే చాలు ఎన్నో అంచనాలు ఏర్పడతాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేశ్ బాబును విభిన్నంగా చూపించి మెప్పించాడు త్రివిక్రమ్. తన మార్క్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక, వీరిద్దరి కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేశ్ బాబు బర్త్ డే(Mahesh babu Birthday) సందర్భంగా మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. అయితే, తెర వెనకాల ఇందుకు పరిస్థితి విరుద్ధం. వీరి కాంబోలో మూవీ వస్తుందంటే అభిమానులకు నిరీక్షణ తప్పడం లేదు. ఏళ్లకు ఏళ్లు వేచి ఉండాల్సి వస్తోంది. తాజాగా బర్త్ డే ట్రీట్ విషయంలోనూ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. రెండేళ్లు.. అతడు(Athadu Movie) మూవీ 2005లో విడుదలైంది. నాని, అర్జున్ సినిమాల వరుస పరాభవం తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ మూవీ రిలీజ్ కావడానికి దాదాపు రెండేళ్ల సమయం తీసుకుంది. రెండేళ్ల పాటు చిత్రీకరణ దశలోనే ఉంది. సినిమా విడుదలయ్యాక ఈ ఆలస్యాన్ని మరిచిపోయి ఫ్యాన్స్ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేశారు. ఒక ఏడాదిలో 1350 సార్లు టీవీల్లో ప్రసారం అయిన తొలి సినిమాగా(Athadu Movie Record) ఇది రికార్డ్ నెలకొల్పింది.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1672478971827720192 మూడేళ్లు.. అతడు స్టోరీ ఒప్పుకున్నాక మహేశ్ బాబు మధ్యలో రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే, ఖలేజా మూవీ విషయంలో సూపర్ స్టార్ పూర్తి సమయాన్ని కేటాయించాడు. అతిథి (2007) సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఖలేజా చిత్రీకరణకే తన టైంని డెడికేట్ చేశాడు. అలా, వివిధ కారణాలతో వాయిదాల మీద వాయిదాలతో సినిమా షూటింగ్ మూడేళ్లకు పూర్తయింది. 2010లో ఖలేజా మూవీ విడుదలైంది. కానీ, మధ్యలో ఫ్యాన్స్ తెగ నిరీక్షించారు.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1664273686810198024 గుంటూరు కారం 2021 మే నెలలో మహేశ్, త్రివిక్రమ్‌ల మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. తొలుత 2022 సమ్మర్‌కి ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2023 సంక్రాంతికి వాయిదా వేద్దామని చూశారు. అయినప్పటికీ పూర్తి కాలేదు. స్క్రిప్ట్‌లో మాటల మాంత్రికుడు తెగ మార్పులు చేశాడట. ఈ క్రమంలోనే ఓల్డ్ రీల్స్‌ని తీసేసి మళ్లీ ఫ్రెష్‌గా సీన్లు తెరకెక్కించాడట. ఇక, ఎట్టకేలకు వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే షూటింగ్ కూడా శర వేగంగా జరుపుకుంటోందని భావిస్తుండగానే మరో షాక్ ఎదురైంది.&nbsp; కారణాలు.. సినిమా నుంచి లీడ్ హీరోయిన్ పూజా హెగ్డేని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. కారణాలు వెల్లడి కానప్పటికీ బుట్ట బొమ్మ స్థానంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. సైడ్ హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్ రోల్‌లోకి వచ్చేసింది. దీంతో సీన్స్‌ని మళ్లీ తెరకెక్కించాల్సి వచ్చింది. శ్రీలీల క్యారెక్టర్‌ని మీనాక్షి చౌదరికి అప్పగించడంతో పని రెట్టింపయ్యింది. ఇదిలా ఉండగానే, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పీఎస్ వినోద్‌ని చిత్రబృందం తీసేసినట్లు ప్రచారం జరిగింది. ఇతడి స్థానంలో రాధేశ్యామ్, బీస్ట్ మూవీలకు పనిచేసిన మనోజ్ పరమహంసను తీసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పీఎస్ వినోద్ పేరునే ఉంచడం గమనార్హం. ఇలా గందరగోళం నెలకొనడంతో చిత్రం వాయిదా పడుతూ వస్తోంది.&nbsp; https://twitter.com/SSMB_CULTS_/status/1680635379073032192 త్రివిక్రమ్ డైవర్ట్? ‘గుంటూరు కారం’ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు డైలాగ్స్ అందించాడు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు త్రివిక్రమ్ పనిచేశాడు. దీంతో మహేశ్ సినిమాపై త్రివిక్రమ్ సరిగా ఫోకస్ పెట్టట్లేదని ఫ్యాన్స్ కాస్త గుర్రుగా ఉన్నారు. సినిమా షూటింగ్ వాయిదాకు దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. మరి, ఇప్పటికైనా సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుందా? అంటే సందేహమే.&nbsp; https://twitter.com/GunturKaaram/status/1664248261442678784 నిరాశలో ఫ్యాన్స్ సూపర్ స్టార్ క్రిష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ‘గుంటూరు కారం’గా వెల్లడించింది. ఈ మేరకు ఓ గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అయితే, మహేశ్ బర్త్ డే సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ని తెగ నిరుత్సాహ పరిచింది. తమ హీరో పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కి చిత్రబృందం కసరత్తులు చేయడంతో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ, అది తుది రూపం దాల్చలేదు. ఏ క్షణమైనా పాటను రిలీజ్ చేయాల్సి వస్తే.. ముందు జాగ్రత్తగా ప్రోమోని కూడా కట్ చేసి పెట్టుకున్నారట. చివరికి ఆ ఆశ నిరాశే అయింది. శ్రీలీల, మహేశ్ బాబు బర్త్ డేలు రెండూ ఒక్కటేనా? అంటూ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU
    ఆగస్టు 09 , 2023
    <strong>Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;</strong>
    Vikrant Massey Net worth: సినిమా కెరీర్‌లో విక్రాంత్‌ మెస్సే ఎంత సంపాదించాడో తెలుసా?&nbsp;
    బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 37 ఏళ్ల ఈ టాలెంటెడ్‌ నటుడు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవలే ‘12th ఫెయిల్‌’ చిత్రంతో విక్రాంత్‌ మాస్సే పేరు మార్మోగింది. ఈ చిత్రం పలు అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో బాలీవుడ్‌లో విక్రాంత్‌కు ఒక్కసారిగా ఆఫర్లు పెరిగాయి. చేతినిండా ప్రాజెక్ట్స్‌తో అతడు బిజీగా మారిపోయారు. అలాంటి సమయంలో సినిమాలకు బిగ్‌ బ్రేక్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.&nbsp; కారణం ఏంటంటే? సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విక్రామ్‌ మాస్సే (Vikrant Massey Net worth) ప్రకటించాడు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టాడు. కొన్నేళ్ల నుంచి ప్రేక్షకులు చూపిస్తున్న అసాధారణ ప్రేమ, అభిమానానికి విక్రాంత్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ఇకపై కుటుంబ సభ్యులకు టైమ్‌ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. అందుకే ఇకపై కొత్త ప్రాజెక్ట్స్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. 2025లో విడుదలయ్యే చిత్రమే తన చివరిదని స్పష్టం చేశాడు. ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలంటూ తన నోట్‌ను ముగించాడు. అయితే విక్రాంత్‌ నిర్ణయాన్ని ఆయన అభిమానులు తీసుకోలేకపోతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ, ప్రొఫెషనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగమని సూచిస్తున్నారు.&nbsp; విక్రాంత్‌ సినీ నేపథ్యం సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడంతో విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అతడి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. విక్రాంత్‌ (Vikrant Massey) 1987 ఏప్రిల్‌ 3న ముంబయిలో జన్మించాడు. అక్కడి ఆర్‌.డి. నేషనల్‌ కాలేజీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. 2007లో వచ్చిన 'ధూమ్‌ మచావో ధూమ్‌' సీరియల్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ధరమ్‌ వీర్‌ (2008), ‘బాలిక వధు’, ‘కుతుబ్‌ హై’ సీరియల్స్‌లో చేశాడు. 2013లో వచ్చిన ‘లూతేరా’ ఫిల్మ్‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత పదుల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్‌ రాలేదు. 2018లో వచ్చిన 'మీర్జాపుర్‌' సిరీస్‌ నటుడిగా అతడికి గుర్తింపు తెచ్చిపెట్టింది. గతేడాది చేసిన '12th ఫెయిల్‌' మూవీ విక్రాంత్‌ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది వచ్చిన 'సెక్టార్‌ 36' ఫిల్మ్‌ సైతం నటుడిగా విక్రాంత్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ ఏడాదే వచ్చిన 'ది సబర్మతి రిపోర్ట్‌' సైతం విక్రాంత్‌కు మంచి మార్కులు పడేలా చేసింది. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో 'యార్‌ జిగ్రి', 'టీఎంఈ', 'అన్‌కౌన్‌ కి గుస్తాఖియాన్‌' ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. కొడుకు కోసం స్పెషల్ టాటూ! విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) కుటుంబానికి చాలా విలువ ఇస్తాడు. బాలీవుడ్‌ నటి షీతల్‌ థాకూర్‌ (Sheetal Thakur) ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2022 ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున తొలుత రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 18న కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. విక్రాంత్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాబు పుట్టాడు. అతడికి వర్ధన్ పేరు పెట్టాడు. కొడుకుపై ప్రేమకు గుర్తుగా చేతిపై పుట్టిన తేదీతో సహా వర్ధన్‌ అనే పేరును టాటూ వేసుకున్నాడు. దీన్ని బట్టి కుటుంబానికి, కుమారుడికి విక్రాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్థమవుతుంది. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌ ఉండటంతో వారితో సమయం గడపడం కుదరట్లేదని సినిమాలకు లాంగ్‌ బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఆ హీరోయిన్‌కు బిగ్‌ ఫ్యాన్‌ విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) ఇష్టా ఇష్టాలకు వస్తే బాలీవుడ్‌లో అతడికి చాలా మంది ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అజయ్‌ దేవగన్‌, కె.కె. మీనన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, పంకజ్‌ కపూర్‌ తన అభిమాన నటులని విక్రాంత్‌ చెబుతుంటాడు. అయితే హీరోయిన్‌ విషయంలో మాత్రం విక్రాంత్‌కు చాలా స్పష్టత ఉంది. ప్రముఖ నటి టబు విక్రాంత్‌కు ఫేవరేట్ యాక్ట్రెస్‌. అటు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ (1999), ‘వాస్తవ్‌’ (1999), ‘యువ’ (2004) చిత్రాలు విక్రాంత్‌కు ఆల్‌టైమ్‌ ఫేవరేట్ అని చెప్పవచ్చు. స్పోర్ట్స్‌ విషయానికి వస్తే క్రికెట్‌ను విక్రాంత్‌ బాగా ఇష్టపడతాడు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం వంటివి విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు. ఫుడ్‌ విషయానికి వస్తే రాజ్మా చావల్‌, పాలక్ పన్నీర్‌ను ఎంతో ఇష్టంగా విక్రాంత్‌ తింటాడు. డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌, క్రికెట్‌ ఆడటం, పర్‌ఫ్యూమ్స్‌ను కలెక్ట్‌ చేయడం విక్రాంత్ హాబీలుగా చెప్పవచ్చు.&nbsp; విక్రాంత్‌ ఆస్తుల విలువ ఎంతంటే? విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey Net worth) 2007 నుంచే నటన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మాత్రం ఆస్తులు కూడబెట్టలేకపోయాడు. వాస్తవానికి ‘12th ఫెయిల్‌’ (2023) చిత్రం తర్వాతే రెమ్యూనరేషన్‌ భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ముందు వరకూ రూ.30-40 లక్షలు మాత్రమే తీసుకున్న విక్రాంత్‌, ప్రస్తుతం రూ.2 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతడి నెట్‌ వర్త్‌ రూ.20-26 కోట్ల వరకూ ఉండొచ్చని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అతడికి రూ.60 లక్షలు విలువైన Volvo S90 కారు, డుకాటి మాన్‌స్టర్ (రూ.12 లక్షలు), మారుతీ సుజుకీ డిజైర్‌ (రూ.8.4లక్షలు) ఉన్నాయి. అలాగే ముంబయిలో సొంతిల్లు కూడా ఉన్నట్లు సమాచారం.&nbsp;
    డిసెంబర్ 02 , 2024
    Vikkatakavi Web Series Review: 1970ల నాటి దేవతల గుట్ట మిస్టరీ.. ‘వికటకవి’ థ్రిల్లింగ్‌గా ఉందా?
    Vikkatakavi Web Series Review: 1970ల నాటి దేవతల గుట్ట మిస్టరీ.. ‘వికటకవి’ థ్రిల్లింగ్‌గా ఉందా?
    నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్ తదితరులు దర్శకుడు: ప్రదీప్ మద్దాలి&nbsp; సంగీత దర్శకుడు: అజయ్ అరసాడా&nbsp; సినిమాటోగ్రఫీ: షోయెబ్ సిద్దికీ&nbsp;&nbsp; ఎడిటర్: సాయి బాబు తలారి నిర్మాత : రజని తాళ్లూరి&nbsp; ఓటీటీ వేదిక : జీ 5 యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Vikkatakavi Web Series Review) కథేంటి ఈ సిరీస్‌ 1970 కాలంలో సాగుతుంటుంది. రామకృష్ణ (నరేష్‌ అగస్త్య) ఫేమస్‌ డిటెక్టివ్‌. తన తెలివి తేటలతో ఎంతో సంక్లిష్టమైన కేసులను పరిష్కరిస్తుంటాడు. దీంతో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి పోలీసులు సైతం అతడి సాయం తీసుకుంటుంటారు. మరోవైపు అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. రామకృష్ణ డిటెక్టివ్‌ స్కిల్స్‌ గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్‌ దేవతల గుట్ట రహాస్యాన్ని కనుగొనాలని ఛాలెంజ్‌ చేస్తాడు. దీంతో దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు?. అతడితో అమరగరి సంస్థాన రాజు మనవరాలు లక్ష్మీ (మేఘా ఆకాష్‌) ఎందుకు వెళ్లింది? వారిద్దరి పరిచయం ఎలా జరిగింది? ఇంతకీ ఆ శాపం ఏంటి? దానిని రామకృష్ణ పరిష్కరించాడా? లేదా? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే డిటెక్టివ్‌ రామకృష్ణ పాత్రలో నరేష్ ఆగస్త్య (Vikkatakavi Web Series Review) ఆకట్టుకున్నాడు. సెటిల్డ్‌ నటనతో అదరగొట్టాడు. లుక్స్‌, డైలాగ్స్‌ పరంగా ఎంతో పరిణితి సాధించాడని చెప్పవచ్చు. తన బాడీ లాంగ్వేజ్‌తో పాత్రకు మంచి వెయిటేజ్‌ తీసుకొచ్చాడు. మేఘా ఆకాష్‌ (Megha Akash) నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించింది. హావాభావాలను చక్కగా పలికించింది. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా అతడి స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది. ఏ దశలోనూ కథ నుంచి డివియేట్‌ కాకుండా మెప్పించాడు. కథలోని ప్రతీ పాత్రకు ఓ పర్పస్ ఉండటం, ఆ క్యారెక్టర్లను డిజైన్‌ చేసిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కథకు సంబంధించి హింట్స్‌ ఇస్తూనే ఇంట్రస్ట్‌ క్రియేట్‌ చేశారు. ట్విస్టులు కాస్త ఊహించే విధంగానే ఉన్నప్పటికీ ఎంగేజింగ్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాలను ఇంకాస్త బలంగా చూపించే అవకాశమున్నప్పటికీ దర్శకుడు వినియోగించుకోలేకపోయాడు. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగదీతగా అనిపించిన ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని ఎలివేషన్స్‌ షాట్స్‌ కూడా బెటర్‌గా తీసి ఉంటే సిరీస్‌ నెక్స్ట్‌ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు. ఊహాజనితంగా సాగడం కూడా ఇంకో మైసన్‌గా చెప్పవచ్చు. సాంకేతికంగా.. ఈ సిరీస్‌కు టెక్నికల్‌ విభాగాలు (Vikatakavi Web Series Review) అన్నీ మంచి పనితీరు కనబరిచాయి. పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ కావడంతో అప్పటి సెటప్‌, డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా తీర్చిదిద్దింది. సినిమాటోగ్రాఫీ కూడా వెనకటి కాలానికి తీసుకెళ్లేలా ఉంది. నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంనరేష్‌ అగస్త్య నటనట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ ఊహాజనితంగా ఉండటంకొన్ని సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 28 , 2024

    @2021 KTree