• TFIDB EN
  • గద్దలకొండ గణేష్
    UATelugu2h 52m
    ఒక ఫిల్మ్ మేకర్ గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలని కలలు కంటాడు. ఈ క్రమంలో రియల్ గ్యాంగ్‌స్టర్ అయి గద్దలకొండ గణేష్‌ని తన సబ్జెక్ట్‌గా ఎంచుకుంటాడు. గద్దలకొండ గణేష్‌కు తెలియకుండా అతన్ని అనుసరిస్తాడు. ఈ విషయం గద్దలకొండ గణేష్‌కు తెలిసి ఏం చేశాడు అనేది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    వరుణ్ తేజ్
    గద్దలకొండ గణేష్ గాని
    అధర్వ
    అభిలాష్ అభి
    పూజా హెగ్డే
    శ్రీదేవి దేవి
    సుప్రియా పాఠక్
    గద్దలకొండ గణేష్ తల్లి
    బ్రహ్మాజీ
    ఒక యాక్టింగ్ కోచ్
    ప్రదీప్అభి నాన్న
    సరస్వతిఅభి అమ్మ
    సుబ్బరాజు
    బుచ్చి నాయుడు అనుచరుడు
    అన్నపూర్ణ
    గని చెఫ్
    తనికెళ్ల భరణి
    చలం థియేటర్ ఆపరేటర్
    సత్య అక్కల
    అభిలాష్ స్నేహితుడు
    రాజా రవీందర్
    నల్లమందు బాబ్జీ
    రఘు బాబు
    నిర్మాత
    ప్రభాస్ శ్రీను
    బలిజయ్య
    శత్రు
    కాశి
    అప్పాజీ అంబరీష దర్భ శ్రీదేవి తండ్రి
    ఫిష్ వెంకటయ్య
    ఖాన్బేరి కాంతయ్య
    బ్రహ్మానందం
    రావు రమేష్
    రావు రమేష్ అతిధి పాత్రలో కనిపించారు
    నితిన్
    స్వయంగా (అతిథి పాత్ర)[16]
    డింపుల్ హయాతీ
    జర్రా జర్రా పాటలో ఐటెమ్ నంబర్
    సిబ్బంది
    హరీష్ శంకర్
    దర్శకుడు
    రామ్ ఆచంటనిర్మాత
    గోపీచంద్ ఆచంటనిర్మాత
    మిక్కీ J. మేయర్
    సంగీతకారుడు
    అయనంక బోస్
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    డింపుల్ హయాతి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    డింపుల్ హయాతి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో హద్దులు దాటేస్తున్న డింపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన (Some Lesser Known Facts about dimple hayathi) విషయాలు ఓసారి చూద్దాం. డింపుల్ హయాతి ముద్దు పేరు? డింపుల్  డింపుల్ హయాతి ఎప్పుడు పుట్టింది? 1988, ఆగస్టు 21న జన్మించింది డింపుల్ హయాతి తొలి సినిమా? గల్ఫ్ (2017) డింపుల్ హయాతి ఎత్తు ఎంత? 5 అడుగుల 8అంగుళాలు  డింపుల్ హయాతి ఎక్కడ పుట్టింది? విజయవాడ  డింపుల్ హయాతి ఏం చదివింది? డిగ్రీ డింపుల్ హయాతి అభిరుచులు? ట్రావెలింగ్ డింపుల్ హయాతికి ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్ డింపుల్ హయాతికి  ఇష్టమైన కలర్ ? బ్లాక్ డింపుల్ హయాతి ఇష్టమైన హీరో? మహేష్ బాబు, అల్లు అర్జున్ డింపుల్ హయాతి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది డింపుల్ హయాతి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/dimplehayathi/ https://www.youtube.com/watch?v=Padz5P7mPsI
    ఏప్రిల్ 06 , 2024
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు
    మెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌తో మాస్  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి  హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్‌ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ అసలు పేరు? సాయి వరుణ్ తేజ్. స్క్రీన్‌పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది. వరుణ్ తేజ్  ఎత్తు ఎంత? 6 అడుగుల 4 అంగుళాలు వరుణ్ తేజ్ తొలి సినిమా? ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది.  వరుణ్ తేజ్‌కు వివాహం అయిందా? 2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది. వరుణ్ తేజ్ క్రష్ ఎవరు? తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్‌గా సాయి పల్లవి పేరు చెప్పాడు. వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి. వరుణ్ తేజ్‌కు ఇష్టమైన కలర్? వైట్ వరుణ్ తేజ్ పుట్టిన తేదీ? 19 January 1990 వరుణ్ తేజ్ తల్లి పేరు? పద్మజ వరుణ్ తేజ్ వ్యాపారాలు? ఆర్ట్స్‌ వర్క్స్ రీ సెల్లింగ్  వరుణ్ తేజ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? సైమా అవార్డ్స్‌ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు. వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు.  https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI వరుణ్ తేజ్‌కు ఇష్టమైన సినిమా? ఇంద్ర వరుణ్ తేజ్‌కు ఇష్టమైన ఆహారం? థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ? వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.
    మార్చి 21 , 2024
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ఈక్రమంలో (Some Lesser Known Facts Pooja hegde)గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే  ముద్దు పేరు? పూజిత పూజా హెగ్డే వయస్సు ఎంత? 1990, అక్టోబర్ 13న జన్మించింది పూజా హెగ్డే తెలుగులో నటించిన తొలి సినిమా? ఒక లైలా కోసం(2014) పూజా హెగ్డే ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు  పూజా హెగ్డే ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్ణాటక పూజా హెగ్డే ఉండేది ఎక్కడ? ముంబై పూజా హెగ్డే  ఏం చదివింది? Mcom పూజా హెగ్డే  అభిరుచులు? ట్రావెలింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, పుస్తకాలు చదవటం పూజా హెగ్డేకి ఇష్టమైన ఆహారం? బిర్యాని, ఫిజా పూజా హెగ్డేకి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పూజా హెగ్డేకి ఇష్టమైన హీరో? హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ పూజా హెగ్డేకు ఇష్టమైన హీరోయిన్? మాధురి దీక్షిత్ పూజా హెగ్డే  పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. పూజా హెగ్డే  తల్లిదండ్రుల పేరు? లతా హెగ్డే, మంజునాథ్ హెగ్డే పూజా హెగ్డే  రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది పూజా హెగ్డే  ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/hegdepooja/ పూజా హెగ్డే నికర ఆస్తుల విలువ? రూ.50కోట్లు https://www.youtube.com/watch?v=B-Ep3Hhy2Sk
    ఏప్రిల్ 16 , 2024
    <strong>Mega Multi Starrer Movie: చిరు, పవన్‌, చరణ్‌ కాంబోలో మల్టీస్టారర్‌.. డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ బిగ్‌ ప్లాన్‌!</strong>
    Mega Multi Starrer Movie: చిరు, పవన్‌, చరణ్‌ కాంబోలో మల్టీస్టారర్‌.. డైరెక్టర్‌ హారీష్‌ శంకర్‌ బిగ్‌ ప్లాన్‌!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న కుటుంబాల్లో 'మెగా ఫ్యామిలీ' (Mega Family) ఒకటి. మెగాస్టార్‌ చిరంజీవి ఈ ఫ్యామిలీకి మూల పురుషుడు కాగా ఆయన తర్వాత ఎంతో మంది హీరోలు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలా వచ్చిన పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), రామ్‌ చరణ్‌ (Ram Charan), అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా అది టాలీవుడ్‌లో సెన్సేషనే అని చెప్పవచ్చు. అటువంటిది చిరు, పవన్‌, చరణ్‌ కలిసి ఒక మల్టీస్టారర్‌ తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ..! అయితే ఇది త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగా డైరెక్టర్ హరీష్ శంకర్‌ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; ‘అదే అతి పెద్ద పాన్‌ ఇండియా’.. మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్‌ (Harish Shankar) ఒకరు. ఆయన పవన్‌ కల్యాణ్‌ భక్తుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అటువంటి హరీశ్‌ శంకర్‌ తన 'మిస్టర్‌ బచ్చన్‌' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్‌ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. 'కాంతార' పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. కల్యాణ్‌ గారు, రామ్ చరణ్, చిరంజీవి ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగా ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1817891248398795055 గతంలోనే స్పెషల్‌ క్యామియోలు! మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌ గతంలోనే ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో చరణ్‌ ఓ స్పెషల్‌ క్యామియోతో అలరించాడు. అంతకుముందు ‘బ్రూస్‌లీ’ ‘మగధీర’ చిత్రాల్లో కుమారుడి కోసం మెగాస్టార్‌ ఒక చిన్న క్యామియో ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సైతం రెండు సినిమాల్లో కలిసి నటించారు. ‘శంకర్‌దాదా MBBS’ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్‌లో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ మెరిశారు. ‌అలాగే ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా క్లైమాక్స్‌లోనూ అన్న చిరుతో కలిసి పవన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. అయితే చిరు, పవన్‌, చరణ్‌ ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నటించలేదు. క్యామియోలు తప్ప కలిసి ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో నటించలేదు. దీంతో మెగా మల్టీస్టారర్‌ చిత్రం కోసం ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.&nbsp; మెగా ఫ్యామిలీతో అనుబంధం దర్శకుడు హరీష్‌ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. పవన్‌ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడన్న పేరు ఈ మాస్‌ డైరెక్టర్‌కు ఉంది. మెగా ఆడియన్స్‌ పల్స్ గురించి హరీష్‌ శంకర్‌కు బాగా తెలుసు. ఆయన ఇప్పటికే నలుగురు మెగా హీరోలతో పని చేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 'గబ్బర్‌ సింగ్‌' (Gabbar Singh), అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), వరుణ్‌తేజ్‌తో 'గద్దలకొండ గణేష్‌' (Gaddalakonda Ganesh), సాయి ధరమ్‌ తేజ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' (Subrahmanya For Sale) చిత్రాలు తెరెకెక్కించారు. అందులో మెగా హీరోలను చూపించిన తీరు ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించింది. దీంతో అతడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌ వస్తే ఇక బాక్సాఫీస్‌ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యి త్వరలోనే పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.&nbsp; ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ గుర్తుండిపోతుంది’&nbsp; పవన్‌ కల్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబోలో 'ఉస్తాద్ భగత్‌ సింగ్‌' (Ustad Bhagat Singh) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రవితేజతో 'మిస్టర్‌ బచ్చన్‌' (Mr.Bachchan) సినిమాను సైతం హరీష్‌ శంకర్‌ రూపొందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఉస్తాద్ భగత్‌ సింగ్‌ గురించి హరీష్‌ శంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులకు గుర్తుండిపోతుందని భరోసా ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే ఏది ఆశించి థియేటర్లకు వస్తోరో ఆ అంశాలన్నీ సంపూర్ణంగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్‌ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.&nbsp;
    జూలై 30 , 2024
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు&nbsp;
    Dimple Hayati: ‘రామబాణం’లోనూ తగ్గని డింపుల్ అందాల తెగింపు&nbsp;
    ‘ఖిలాడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది తెలుగు గర్ల్ డింపుల్ హయతి. కెరీర్‌లో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకెళ్తోంది. నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల వైపు అడుగు పెట్టిన ఈ అమ్మాయి ‘రామబాణం’తో దూసుకొస్తోంది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.&nbsp; డింపుల్ హయతి పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనూ. విజయవాడలో డింపుల్ జన్మించింది. హైదరాబాద్‌లో పెరిగింది. తన ఫ్యామిలీలో అంతా నటులు, నృత్యకారులే అంటూ గతంలో చెప్పుకొచ్చింది. గల్ఫ్ చిత్రంతో 16వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. వాస్తవానికి తొలుత ‘డింపుల్’ అని మాత్రమే పేరుండేది. ఆ తర్వాత మరీ చిన్నగా ఉందని న్యూమరాలజీని అనుసరించి డింపుల్ హయతిగా మార్చుకుంది.&nbsp; తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో గల్ఫ్, విశాల్ సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం చిత్రాల్లో మెరిసిందీ బ్యూటీ.&nbsp; కెరీర్‌లో డింపుల్ హయతి ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు వెళ్లిందట. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్‌గా చేసిందట. కానీ, 90శాతం షూటింగ్ పూర్తి కాగానే సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ ఆఫర్‌ని కూడా వదులుకున్నట్లు డింపుల్ తెలిపింది.&nbsp; బడా మూవీ ఆగిపోవడంతో డింపుల్ డిప్రెషన్‌కి వెళ్లింది. ఈ విషయం ‘గద్దలకొండ గణేశ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి తెలియగా ఐటం సాంగ్‌లో ఆడిపాడే అవకాశం కల్పించాడు. అనూహ్యంగా ఈ ‘జరా జరా’ సాంగ్‌ డింపుల్ కెరీర్‌ను మలుపు తిప్పింది.&nbsp; ఈ సాంగ్ హిట్ కావడంతో వరుసగా అవే ఆఫర్లు వచ్చాయట. కానీ, నటనా ప్రాధాన్యమున్న సినిమాలు చేయాలని భావించి వీటికి డింపుల్ నో చెప్పిందట. అలా ట్రై చేస్తూ ఉండగా రవితేజ ‘ఖిలాడీ’ ఆఫర్ వచ్చిందట.&nbsp; ఖిలాడీ చేస్తుండగానే రామబాణం సినిమాకు సైన్ చేసిందీ బ్యూటీ. అలా ఈ సినిమాలో భైరవీగా నటించింది. ఇందులో వ్లాగర్‌‌గా కనిపించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధమవలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.&nbsp; డింపుల్ హయతి స్కిన్ టోన్ కారణంగా చాలా అవకాశాలు మిస్సయ్యాయట. ఎదురుగా చెప్పకున్నా, తాను వెళ్లిపోయాక నలుపు రంగులో ఉందంటూ రిజెక్ట్ చేసేవారని గుర్తు చేసుకొనేది. కానీ, ఇప్పుడు ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సానుకూల పరిణామమని అభిప్రాయపడింది.&nbsp; హిందీలో ‘అత్రాంగి రే’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. పరభాషా చిత్రాలు మరిన్ని చేయాలని డింపుల్ అనుకుంటోందట.&nbsp; డింపుల్‌కి ఓ పెంపుడు శునకం ఉంది. వాడి పేరు భగీరథ్. తన ఇన్‌స్టాగ్రాంలో తరచూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కు ప్రియారిటీ ఇస్తుంది. ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది.&nbsp; ఇన్‌స్టాలో డింపుల్‌కి 6.5లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఓ తెలుగు, తమిళ సినిమాలకు ఓకే చెప్పిందీ బ్యూటీ.&nbsp;
    మే 01 , 2023
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్‌ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి. [toc] Samantha Ruth Prabhu సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్‌ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి. Samantha bikini images Kajal Aggarwal కాజల్ అగర్వాల్ &nbsp; తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్‌ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.&nbsp; Kajal Agarwal bikini video https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250 Tamannaah Bhatia తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్‌ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. Tamannaah Bhatia Bikini images View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) Anushka Shetty అనుష్క శెట్టి&nbsp; పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు. Anushka shetty Bikini Images Disha Patani దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో&nbsp; హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది. Disha Patani Bikini images Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్‌ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి. Pragya Jaiswal bikini Images ShwetaTiwari శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి. ShwetaTiwari Bikini Images Deepika Padukone దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది. deepika padukone bikini Images Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి. Pooja Hegde Bikini Images Pooja Hegde Hot Videos https://twitter.com/RakeshR86995549/status/978983052364808194 View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) Raashii Khanna రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. Raashii Khanna Bikini images Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్‌ బీట్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్‌ వేయండి https://twitter.com/PicShareLive/status/1525365506471231488 Ketika Sharma Bikini Images కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్‌ వేయండి Ketika Sharma Bikini Images Catherine Tresa కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి. Catherine Tresa Bikini images Mrunal Thakur మృణాల్ ఠాకూర్ లవ్‌ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి. Mrunal Thakur Bikini images Mrunal Thakur hot video https://twitter.com/MassssVishnu/status/1786566946600988750 https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193 https://twitter.com/SastaJasoos/status/1788498532162236427 Anasuya Bharadwaj బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి. Anasuya Bharadwaj Bikini images View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Nidhhi Agerwal నిధి అగర్వాల్&nbsp; ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్‌-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. Nidhhi Agerwal Bikini Images Mehreen Kaur Pirzada మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. Mehreen Kaur Pirzada Bikini Videos View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) Manushi Chillar మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి. Manushi Chillar Bikini Images Manushi Chillar Bikini videos View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182 Sobhita Dhulipala శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి. Sobhita Dhulipala bikini images Hot videos View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) Tripti Dimri తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి. Tripti Dimri Bikini images View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) Shirley Setia షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. Shirley Setia Bikini Images
    మే 11 , 2024
    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Mirnalini Ravi: ‘లవ్‌ గురు’ ఫేమ్‌ మృణాళిని రవి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ మృణాళిని రవి (Mirnalini Ravi).. తెలుగు, తమిళ చిత్రాలలో వరుసగా నటిస్తూ చాలా బిజీగా ఉంది. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌ గురు' ఏప్రిల్‌ 11న తెలుగులో విడుదల కాబోతోంది. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ఆంటోని ఇందులో హీరోగా చేశాడు. కాగా, ఇటీవల ట్రైలర్‌లో మృణాళిని నటన అందర్నీ ఫిదా చేసింది. ముఖ్యంగా శోభనం గదిలో భర్త విజయ్ ఆంటోనికి గ్లాసులో మందు పోసే సీన్‌ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు ఆడియన్స్ తెగ వెతుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. మృణాళిని రవి ఎక్కడ పుట్టింది? తమిళనాడులోని పాండిచ్చేరిలో మృణాళిని జన్మించింది.&nbsp; మృణాళిని రవి పుట్టిన తేదీ ఏది? 10 మే, 1995 మృణాళిని రవి విద్యాభ్యాసం ఎక్కడ సాగింది? బెంగళూరు మృణాళిని రవి.. ఏ స్కూల్‌లో చదువుకుంది? లేక్‌ మౌంట్‌ఫోర్ట్‌ స్కూల్‌, బెంగళూరు మృణాళిని రవి ఏం చదువుకుంది? బెంగళూరులోని ఈస్ట్‌ పాయింట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మృణాళిని బీటెక్‌ చేసింది. ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేసింది.&nbsp; మృణాళిని రవి తల్లిదండ్రులు ఎవరు? తండ్రి పేరు విశాల్‌ రవి, తల్లి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. మృణాళిని రవి వయసు ఎంత? 29 సంవత్సరాలు (2024) మృణాళిని రవి బరువు ఎంత? 60 కేజీలు మృణాళిని రవి ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు మృణాళిని రవి ఎలా ఫేమస్‌ అయ్యింది? టిక్‌ టాక్‌, డబ్‌స్మాష్‌లో రీల్స్‌ చేసి మృణాళిని అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; మృణాళిని రవి తొలి చిత్రం? 2019లో వచ్చిన తమిళ చిత్రం 'సూపర్‌ డీలక్స్‌'.. మృణాళిని చేసిన మెుట్ట మెుదటి చిత్రం. దర్శకుడు త్యాగరాజన్‌ కుమారరాజా సోషల్‌ మీడియాలో ఈ భామ వీడియోలు చూసి అవకాశం ఇచ్చారు.&nbsp; మృణాళిని రవి తొలి తెలుగు చిత్రం? గద్దల కొండ గణేష్‌ మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు? గద్దల కొండ గణేష్‌, ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్ అల్లుడు మృణాళిని రవి.. ఇప్పటివరకూ చేసిన తమిళ చిత్రాలు? ‘సూపర్‌ డీలక్స్‌’, ‘ఛాంపియన్‌’, ‘ఎనిమీ’, ‘ఎంజీఆర్‌ మగన్‌’, ‘జంగో’, ‘కోబ్రా’.. మృణాళిని రవి హాబీస్‌? ట్రావెలింగ్‌, రీడింగ్‌, సింగింగ్‌ మృణాళిని రవికి పెళ్లైందా? కాలేదు&nbsp; మృణాళిని రవి నాన్‌-వెజ్‌ వంటకాలు తింటుందా? ఆమెకు నాన్ వెజ్‌ ఐటెమ్స్‌ను ఆమె ఎంతో ఇష్టంగా ఆరగించేస్తుందట. మృణాళిని రవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు? ఫేవరేట్‌ హీరో, హీరోయిన్ల గురించి మృణాళిని ఎక్కడా రివీల్ చేయలేదు.&nbsp; మృణాళిని రవి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా లింక్‌? https://www.instagram.com/mirnaliniravi/
    ఏప్రిల్ 10 , 2024
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!
    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై&nbsp; ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.&nbsp; పార్కింగ్ స్థలంలో కారు తీసెటప్పుడు ఆమె కారు అడ్డుగా ఉండటంతో ఓసారి తాను డింపుల్‌ను రిక్వెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తుండటం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.&nbsp; ఈరోజు కూడా ఓ ఎమర్జెన్సీ పనిపై వెళ్లే క్రమంలో అడ్డుగా ఉన్న డింపుల్‌ కారును తీయాలని&nbsp; డ్రైవర్&nbsp; రిక్వెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ కారును గుద్దడంతో పాటు కాలుతో తన్నిందని అది సీసీటీవీలో కూడా రికార్డైందని పేర్కొన్నారు. దీంతో తన డ్రైవర్‌ డింపుల్‌పై కేసు పెట్టినట్లు వివరించారు.&nbsp; డింపుల్ రియాక్షన్ తాజా వివాదంపై డింపుల్ హయాతి కూడా రియాక్ట్ అయింది. ‘అధికారాన్ని ఉపయోగించడం వల్ల ఏ తప్పు ఆగదు, అధికార దుర్వినియోగం తప్పులను దాచదు’ అంటూ ట్వీట్ చేసింది. ఎప్పటికీ సత్యమే గెలుస్తుందని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/DimpleHayathi/status/1660877913200406529 https://twitter.com/DimpleHayathi/status/1660863210436583424 డింపుల్ కోపానికి కారణం ఇది! తాజా వివాదం నేపథ్యంలో డీసీపీ రాహుల్ హెగ్డే, డింపుల్ మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత వారం రోజులుగా డింపుల్&nbsp; కారుపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నట్లు తెలిసింది. ట్రాఫిక్‌ డీసీపీతో తలెత్తిన వివాదం వల్లే తన కారుకు అధికంగా చలాన్లు పడుతున్నట్లు డింపుల్‌ హయాతి భావించింది. ఈ నేపథ్యంలో తన ఫ్రస్టేషన్‌ అంతా రాహుల్‌ హెగ్డే కారుపై చూపించినట్లు తెలుస్తోంది.&nbsp; డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో ‘యురేక’ సినిమాలో ఆమె నటించింది. అభినేత్రి 2 సినిమాలో తన నటనతో డింపుల్ ఆకట్టుకుంది. గద్దల కొండ గణేష్‌ చిత్రంలో జర్ర జర్ర పాటలో స్టెప్పులేసి తెలుగు యువతను అలరించింది. ఆ తర్వాత ‘సామాన్యుడు’, ‘ఖిలాడి’ సినిమాలతో డింపుల్‌ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల రిలీజైన ‘రామబాణం’ లోనూ డింపుల్ హీరోయిన్‌గా చేసింది.&nbsp;
    మే 23 , 2023
    <strong>Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?</strong>
    Exclusive: చిరంజీవి, నాగార్జున పని అయిపోయినట్లేనా? ఒత్తిడిలో ఆ స్టార్ డైరెక్టర్లు?
    టాలీవుడ్‌లో గత ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కొందరు హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకొని పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగితే మరికొందరు తమ ఫేమ్‌ను తిరోగమనంలోకి తీసుకెళ్లారు. కొందరు హీరోలు చకచకా సినిమాలు చేస్తూ తమ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తే ఇంకొందరు రెండేళ్లకు కూడా ఒక సినిమా రిలీజ్‌ చేయలేక ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమయ్యారు. ముఖ్యంగా కొందరు యంగ్‌ హీరోలు ఫ్లాప్స్‌ తియ్యడంలో పోటీ పడుతూ భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి మరి దారుణంగా ఉంది. గత ఐదేళ్లలో టాలీవుడ్‌లో వచ్చిన గణనీయమైన మార్పులు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. ఒక మూవీకి ఏళ్లకు ఏళ్ల సమయం! టాలీవుడ్‌లో ఒకప్పుడు ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి దిగ్గజ నటులు ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ను అలరించేవారు. వీరి తర్వాత వచ్చిన చిరంజీవి, నాగార్జున, వెంటటేష్‌, బాలకృష్ణ సైతం ఈ పరంపరను కొనసాగిస్తూ ఏడాదిలో ఒక సినిమాకు తగ్గకుండా రిలీజ్‌ చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల సమయం పడుతోంది. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, తారక్‌ వంటి స్టార్‌ హీరోల నుంచి సినిమా వచ్చి దాదాపుగా మూడేళ్లు దాటిపోయింది. ఓ వైపు ప్రభాస్‌ ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ ముగ్గురు స్టార్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నారు. సైంటిఫిక్‌, మైథాలజీ, ఫ్యూచరిక్‌ సినిమాలంటే కొంత ఆలస్యం జరిగిన ఓ అర్థం ఉంది. ప్రస్తుతం తారక్‌ (దేవర), రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌), అల్లు అర్జున్‌ (పుష్ప 2) చేస్తున్న కమర్షియల్‌ చిత్రాలకు కూడా ఇంత ఆలస్యం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతోంది.&nbsp; ఫ్లాప్స్‌తో పోటీపడుతున్న కుర్ర హీరోలు! యంగ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), నాగచైతన్య (Naga Chaitanya), రామ్‌ పోతినేని (Ram Pothineni)లకు గత ఐదేళ్లుగా టాలీవుడ్‌లో అసలు కలిసి రావడం లేదు. వారి నుంచి సాలిడ్‌ హిట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు హిట్‌ సినిమాలతో పోటీ పడిన ఈ ముగ్గురు హీరోలు అనూహ్యంగా గత ఐదేళ్ల నుంచి ఫ్లాప్స్‌తో పోటీ పడుతున్నారు. విజయ్‌ నటించిన రీసెంట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’తో పాటు గతంలో వచ్చిన ‘లైగర్‌’, ‘ఖుషి’, ‘డియర్ కామ్రేడ్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. అలాగే నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’, ‘లాల్‌ సింగ్‌ చద్ధా’, ‘థ్యాంక్యూ’, ‘బంగార్రాజు’ చిత్రాలు ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని చేసిన లేటెస్ట్‌ చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అంతకుముందు వచ్చిన ‘స్కంద’, ‘వారియర్‌’, ‘రెడ్‌’ సినిమాలు హిట్స్‌ అందుకోలేక ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. మార్కెట్‌ కోల్పోయే దిశగా సీనియర్లు ఇక సీనియర్‌ హీరోల పరిస్థితి గత ఐదేళ్ల వ్యవధిలో దారుణంగా మారిపోయింది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి ఇప్పటివరకూ సరైన కమ్‌బ్యాక్‌ లభించలేదని చెప్పాలి. ఓవైపు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ తమ వయసుకు తగ్గ స్టోరీలు ఎంచుకొని ‘జైలర్‌’, ‘విక్రమ్‌’ సినిమాలతో సాలిడ్‌ విజయాలను అందుకున్నారు. అయితే చిరు ఇప్పటికే కమర్షియల్ పాత్రలనే ఎంచుకుంటూ పోవడం ఆయనకు మైనస్‌గా మారుతోంది. అటు నాగార్జున, వెంకటేష్‌ పరిస్థితి కూడా ఇంచు మించు అలాగే ఉంది. నాగార్జున గత చిత్రాలు ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’, ‘నా సామిరంగ’లోని పాత్రలు ఏమాత్రం నాగార్జునకు సెట్ అయ్యేవిగా కనిపించవు. ఇక వెంటేష్‌ ‘రానా నాయుడు’ సిరీస్‌తో విపరీతంగా ట్రోల్స్‌కు గురయ్యారు. నందమూరి బాలకృష్ణ మాత్రం ఎప్పటిలాగే మాస్ సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటున్నారు. అయితే కొత్త కథలు ఎంచుకోకపోవడం, వయసు తగ్గ పాత్రలు చేయకపోవడం, సరైన హిట్స్ లేకపోవడంతో ఒకప్పటి స్టార్‌ హీరోలుగా వెలిగిన ఈ హీరోల కలెక్షన్స్‌ కుర్రహీరోలతో పోలిస్తే పడిపోతూ వస్తున్నాయి. మార్కెట్‌ను పూర్తిగా కోల్పేయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; ప్రభాస్‌, నాని సూపర్బ్‌! గత ఐదేళ్ల కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న హీరోలుగా ప్రభాస్‌, నానిలను చెప్పవచ్చు. ఓవైపు వేగంగా సినిమాలు చేస్తూనే ప్రతీ మూవీకి కథ, పాత్ర పరంగా వైవిధ్యం చూపిస్తూ ఆకట్టుకున్నారు. క్వాలిటీ పరంగానూ మంచి సినిమాలు తీస్తూ ఎప్పటికప్పుడు తమ క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రభాస్‌ గత చిత్రాలను పరిశీలిస్తే ‘బాహుబలి 1 &amp; 2’, ‘సాహో’, ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు కథ, పాత్ర పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. అటు నాని రీసెంట్ చిత్రాలైన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘అంటే సుందరానికి’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ కూడా విభిన్నమైనవే. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ కూడా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిందే. అటు ప్రభాస్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ‘రాజాసాబ్‌’, సలార్‌ 2, ‘కల్కి 2’, ‘స్పిరిట్‌’, ‘ఫౌజీ’ కథ, పాత్ర పరంగా ప్రభాస్‌ను మరో లెవల్‌లో చూపించనున్నాయి.&nbsp; రీరిలీజ్‌లతో ఫ్యాన్స్‌ సంతృప్తి! గతంలో లేని విధంగా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో రీరిలీజ్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్‌ హీరోల బర్త్‌డేల సందర్భంగా గతంలో వారు చేసిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు లాంగ్‌ గ్యాప్‌ వస్తుండటంతో రీరిలీజ్‌ మూవీస్‌లోనే తమ హీరోను చూసుకొని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. గత రోజులను గుర్తుచేసుకుంటూ సంతోష పడుతున్నారు. అయితే రీరిలీజ్‌ చిత్రాలకు ఆదరణ పెరగడానికి ఓ కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఆ తరహా చిత్రాలను హీరోలు చేయకపోవడమే ఇందుకు కారణంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రీరిలీజ్‌ రూపంలో తమ ఫేవరేట్‌ చిత్రాలను మళ్లీ చూసుకొని అభిమానులు సంతోష పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.&nbsp; ఆ స్టార్‌ డైరెక్టర్లకు ఏమైంది? టాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా ఎదిగిన పూరి జగన్నాథ్‌కు హీరోలతో సమానంగా సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. గతంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనేది. ‘ఇడియట్‌’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’, ‘బిజినెస్‌ మ్యాన్‌’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్స్‌తో ఓ దశలో టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. అటువంటి పూరి గత కొంత కాలంగా హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన గత చిత్రం ‘లైగర్‌’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. తాజాగా వచ్చిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సైతం ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. అటు హరీష్‌ శంకర్‌ పరిస్థితి కూడా ఇంచుమించు పూరి లాగానే ఉంది. ‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌తో మాస్‌ డైరెక్టర్‌గా హరీష్‌ శంకర్‌ ఇటీవల సరైన హిట్స్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’, ‘గద్దల కొండ గణేష్‌’ ప్లాప్స్‌తో లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’పై అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే మిస్టర్‌ బచ్చన్‌ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. హరీష్‌ శంకర్‌ టేకింగ్‌ సాదా సీదాగా ఉందంటూ విమర్శలు సైతం వచ్చాయి.&nbsp;
    ఆగస్టు 17 , 2024

    @2021 KTree