• TFIDB EN
  • మాస్
    UATelugu2h 42m
    మాస్ ఒక అనాథ. మాఫియా డాన్ కూతురితో ప్రేమలో ఉన్న తన యజమాని కొడుకు ఆదితో మంచి బంధం ఏర్పడుతుంది. ప్రేమికులను విడదీసే ప్రయత్నంలో, గ్యాంగ్‌స్టర్లు ఆదిని చంపుతారు. దీంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మాస్ బయలుదేరుతాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstar
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    నాగార్జున
    మాస్ / గణేష్
    జ్యోతిక
    మాస్ ప్రేమ ఆసక్తి
    ఛార్మీ కౌర్
    ప్రియా
    రఘువరన్
    అంజలి తండ్రి
    ప్రకాష్ రాజ్
    న్యాయవాది దుర్గా ప్రసాద్
    సునీల్
    మాస్ తమ్ముడిని పరిగణలోకి తీసుకుంటారు
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    ఆది తండ్రి
    ఎం. బాలయ్య
    అంజలి తాతయ్య
    జీవా
    పోలీస్ ఆఫీసర్
    సమీర్
    పోలీస్ ఆఫీసర్
    వేణు మాధవ్
    ఒక బిచ్చగాడు
    నర్సింగ్ యాదవ్
    నర్సింగ్
    సత్యం రాజేష్
    టాక్సీ డ్రైవర్
    కరుణశిరీష
    అపూర్వప్రియ తల్లి
    రవి కాలే
    ఏసీపీ
    వర్ష
    రుతిక
    రాఘవ లారెన్స్
    తనూ రాయ్
    సిబ్బంది
    రాఘవ లారెన్స్
    దర్శకుడు
    నాగార్జున
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    శ్యామ్ కె. నాయుడు
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
    RAKESH MASTER: ప్రభాస్‌, రామ్‌ పొత్తినేని, రవితేజకు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే!.. ఇవిగో వీడియోలు!
    రాకేష్ మాస్టర్ హ్యాష్ ట్యాగ్‌(#RakeshMaster) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల తాలుకు వీడియోలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎంతో మంది డ్యాన్స్ మాస్టర్లు, హీరోలకు శిక్షణ ఇచ్చిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అందరికీ దూరమై ఏకాకిగా మిగలడంపై పలువరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు మీద కోపం, నిజాలను నిర్భయంగా చెప్పడం, ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం రాకేష్ మాస్టర్‌ను ఒంటరి చేసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.  ప్రభాస్‌కు మాస్టర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు డ్యాన్స్ శిక్షణ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు రాకేష్ మాస్టర్ శిక్షణ ఇస్తున్న ఫొటోను నెటిజన్లు షేర్ చేశారు. https://twitter.com/SumanthOffl/status/1670414528235073537?s=20 RAPOకు డ్యాన్స్ శిక్షణ యంగ్ హీరో రామ్ పొత్తినేని కూడా రాకేష్ మాస్టర్ దగ్గర డ్యాన్స్‌లో మెళకువలు నేర్చుకున్నవాడే. ఆయన నటించిన దేవదాసు సినిమాకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలోని డ్యాన్స్... RAPOకు ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. https://twitter.com/RamUniversal1/status/1670429314993594368?s=20 మాస్ మహారాజా రవితేజ నటించిన ఓ సినిమాలోని  ఫుల్ సాంగ్‌లో రాకేష్ మాస్టర్ రవితేజతో కలిసి డ్యాన్స్ చేశారు. https://twitter.com/avinashgoud00/status/1670430461372534785?s=20 1500 సినిమాలకు కొరియోగ్రఫీ రాకేశ్ మాస్టర్‌ ఒకానొక దశలో టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగారు. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. ఈటీవీ డ్యాన్స్ షో ద్వారా రాకేష్ మాస్టర్ ప్రతిభ చాలా మందికి తెలిసింది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20 జనసేనకు ఓటు వేస్తా.. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్‌కే వేస్తానని పేర్కొన్నారు. https://twitter.com/Vamsitweetzz/status/1670428040638386181?s=20 శేఖర్‌కు లైఫ్‌ ఇచ్చాడు.. తన తమ్ముడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడు అని రాకేష్ మాస్టర్ అక్కగారు అన్నారు. శేఖర్, జానీ, సత్య మాస్టర్లు చాలా కాలం పాటు తన తమ్ముడి ఇంట్లోనే ఉండేవారని చెప్పారు. రాకేష్ మాస్టర్ ఎవరికీ అన్యాయం చేయలేదని వివరించారు. డ్యాన్స్ ప్రొఫెషన్ వల్ల కుటుంబానికి దూరమయ్యానరని వెల్లడించారు. ఈ మధ్య ఫొన్ చేసి మమ్మల్ని కలవాలని ఉందని చెప్పుకొచ్చారు. అనారోగ్య సమస్యల వల్ల తననే ఇక్కడకు రావాలని కోరినట్లు చెప్పారు. అంతలోనే తన తమ్ముడు చనిపోవడం బాధకలిగిస్తోందని కన్నీటి పర్యంతం అయ్యారు.  https://www.facebook.com/watch/?v=188462650858056 శేఖర్‌ మాస్టర్‌తో చెడింది ఇక్కడే.. శేఖర్ మాస్టర్‌ను తన కన్న కొడుకులాగా చూసుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు కొరియోగ్రఫీ చేసే అవకాశం శేఖర్ మాస్టర్‌కు వచ్చింది. అయితే ఆ విషయం తనకు శేఖర్ చెప్పలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు. ఇంట్లో భార్యకు చెప్పాడు కానీ తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ఇతరులతో తాము ఎలా ఉన్నా.. తమ మధ్య మాత్రం అబద్దాలు, దాపరికాలు తావు ఉండొద్దని ప్రతిజ్ఞ చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని శేఖర్ మరిచాడని ఆరోపించారు. తనకు వచ్చిన అవకాశాలను శేఖర్‌కు ఇప్పించానని చెప్పుకొచ్చారు. తాను చనిపోతే... తన శవాన్ని కూడా శేఖర్ తాకొద్దని రాకేష్ మాస్టర్ అన్నారు. అయితే ఇదే విషయమై శేఖర్ మాస్టర్‌ కూడా స్పందించారు. ఖైదీ 150 సినిమాలో రెండు పాటలకు అవకాశం వచ్చిందని కానీ అవి కన్ఫర్మ్‌గా తెలియదని వెల్లడించాడు. కన్ఫర్మ్‌ అయ్యాక రాకేష్ మాస్టర్‌కు చెబుదామని అనుకున్నాని పేర్కొన్నాడు. తనను ఏరా పోరా అన్నా పడుతానని.. కానీ తన భార్యకు కాల్ చేసి అసభ్యంగా మాట్లాడరని శేఖర్ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచే వీరి మధ్య దూరం పెరిగింది. మరి ఈరోజు రాకేష్ మాస్టర్ అంత్య క్రియలకు శేఖర్ మాస్టర్ వస్తారో లేదో చూడాలి మరి..
    జూన్ 19 , 2023
    <strong>Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!</strong>
    Jani Master: జానీ మాస్టర్‌ను బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలబెట్టిన టాప్‌-10 సాంగ్స్ ఇవే!
    ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. తనను కొద్ది కాలంగా లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్‌ 376, 506, 323(2) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కోసం గాలింపు ముమ్మరం చేసిన సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం ఎట్టకేలకు ‌ఆయనను గోవాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.&nbsp; [toc] అసలేం జరిగిందంటే? జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘2017లో జానీ మాస్టర్‌ నాకు పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులం వెళ్లాం. అక్కడ హోటల్‌లో నాపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం (సెప్టెంబర్‌ 19) ఆయన్ని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. తప్పు చేస్తే ఒప్పుకోండి: మంచు మనోజ్‌ మైనర్ అయినప్పటి నుంచి జానీ మాస్టర్‌ తనను వేధించాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన తర్వాత నుంచి జానీ మాస్టర్‌ కనిపించకుండా పోయారు. దీనిపై నటుడు మంచు మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ‘జానీ మాస్టర్.. మీరు కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది’ అని మంచు మనోజ్ పేర్కొన్నారు. https://twitter.com/HeroManoj1/status/1836692133216174368 జానీ మాస్టర్‌ టాప్‌-10 సాంగ్స్‌ జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని కాస్త పక్కన పెడితే ఆయన బెస్ట్‌ కొరియోగ్రాఫర్ అన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా ఆయన ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలలో పలు సూపర్‌ హిట్‌ సాంగ్స్‌కు నృత్యాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఇటీవల నేషనల్‌ అవార్డు సైతం అందుకొని దేశంలోనే బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా నిలిచారు. ఇప్పటివరకూ ఆయన కొరియోగ్రఫీలో వచ్చిన టాప్‌ -10 సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం&nbsp; మేఘం కరిగేనా (తిరు) తమిళంలో ధనుష్‌ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రంబళం’ సినిమా తెలుగులో 'తిరు' పేరుతో డబ్ అయ్యింది. ఈ సినిమాలోని 'మేఘం కరిగేనా' సాంగ్‌ను జానీ మాస్టర్‌ అద్భుతంగా కొరియోగ్రాఫ్‌ చేశారు. ధనుష్‌, నిత్య స్టెప్పులను నెక్స్ట్‌ లెవల్లో కంపోజ్‌ చేశారు. గతంలో ప్రభుదేవ చేసిన ‘వెన్నెలవే వెన్నలవే’ తరహాలో ఈ సాంగ్ అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఇందుకుగాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో నేషనల్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంపికై అందరి ప్రశంసలు అందుకున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=0IdqwA2GXgY అరబిక్‌ కుతు (బీస్ట్‌) విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ సినిమాలోని అరబిక్‌ కుతు సాంగ్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీకి తమిళ ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లు స్టెప్స్‌ కంపోజ్‌ చేసిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. నటి పూజా హెగ్డే కూడా కెరీర్‌ బెస్ట్‌ స్టెప్స్‌తో ఓ ఊపు ఊపింది. https://www.youtube.com/watch?v=vOYJmUE_U24 రంజితమే (వారసుడు) విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే సాంగ్‌ కూడా పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ పాటలో విజయ్‌, రష్మిక డ్యాన్స్‌ దెబ్బకు థియేటర్లు ఈలలు, గోలలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా సాంగ్‌ చివరిలో వచ్చే సింగిల్‌ టేక్‌ స్టెప్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఈ సాంగ్‌తో జానీ మాస్టర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చింది.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=RoBavDxV-Y8 రారా రక్కమ్మ (విక్రాంత్‌ రోణ) విక్రాంత్‌ రోణ సినిమాలోని రారా రక్కమ్మ సాంగ్‌ దేశంలోని మ్యూజిక్‌ లవర్స్‌ను షేక్‌ చేసింది. ముఖ్యంగా జానీ మాస్టర్‌ అందించిన సిగ్నేచర్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. చాలా ముంది యువత ఆ హుక్‌ స్టెప్‌పై రీల్స్‌ చేసి వైరల్‌ అయ్యారు. ఈ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండజ్‌, కన్నడ నటుడు సుదీప్‌తో ఆడిపాడింది.&nbsp; https://www.youtube.com/watch?v=aC9KBju5BNY నువ్వు కావాలయ్యా (జైలర్‌) రజనీకాంత్‌ గత చిత్రం ‘జైలర్‌’లో నువ్వు కావాలయ్యా సాంగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. మిల్క్‌ బ్యూటీ తమన్న వేసిన హుక్‌ స్టెప్‌కు యూత్‌ ఫిదా అయ్యారు. ఈ సాంగ్‌ను కూడా జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్స్‌ కొద్ది వ్యూస్‌ వచ్చాయి. రీల్స్‌ సైతం పెద్ద ఎత్తున చేశారు.&nbsp; https://www.youtube.com/watch?v=xMOuFKJmjNk రౌడీ బేబీ (మారి 2) సాయి పల్లవి, ధనుశ్ నటించిన ‘మారి 2’లోని రౌడీ బేబి సాంగ్‌ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట యూట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి, ధనుష్‌ స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. వాస్తవానికి మెుదట ఈ సాంగ్‌ ప్రభుదేవ వద్దకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో జానీ మాస్టర్‌ ఈ పాటను కంపోజ్ చేశారు. ప్రభుదేవా పర్యవేక్షణలో సాంగ్‌ చిత్రీకరణ జరిగింది.&nbsp; https://www.youtube.com/watch?v=O6FNcjUs0YI బుట్టబొమ్మ (అల వైకుంఠపురంలో) ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన ‘అల వైకుంఠపురంలో’ని బుట్టబొమ్మ సాంగ్‌ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాయకుడు అర్మాన్‌ మాలిక్ ఆలపించిన పాటకు జాని మాస్టర్‌ తనదైన శైలిలో స్టెప్పులు డిజైన్‌ చేశారు. సాహిత్యానికి తగ్గట్లు యూనిక్‌ స్టెప్పులను బన్నీ చేత వేయించి సాంగ్‌ సక్సెస్‌లో కీలకపాత్ర పోషించాడు. https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ సినిమా చూపిస్తా మావా (రేసు గుర్రం) ‘రేసుగుర్రం’లోని మాస్‌ బీట్‌ ఉన్న సినిమా చూపిస్తా మావ పాటను కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫ్‌ చేశారు. ఇందులో బన్నీ, శ్రుతి హాసన్ వేసే స్టెప్పులు వీక్షకులను ఫిదా చేశాయి. ఆధ్యాంతం ఉత్సాహాం నింపేలా జానీ మాస్టర్ ఈ పాటను కంపోజ్‌ చేయడం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=H7EAJW8jYzA లైలా ఓ లైలా (నాయక్‌) రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించిన సినిమా ‘నాయక్’. ఈ సినిమాలో ‘లైలా ఓ లైలా’ పాటతో చెర్రీ ఓ బెస్ట్ డాన్సర్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పక్క ఇండస్ట్రీ వాళ్లు కూడా చెర్రీ టాప్ డాన్సర్ అని ప్రశంసించారు. ఈ పాటలో మాస్ స్టెప్పులకు తగ్గట్టుగానే చాలా క్లాసిక్ స్టెప్పులను కూడా జానీ మాస్టర్ చాలా పర్ఫెక్ట్‌గా సెట్ చేశాడు. https://www.youtube.com/watch?v=HGgHSi-kg78 ఏం మాయో చేశావే (ద్రోణ) 2009లో నితిన్ హీరోగా వచ్చిన ‘ద్రోణ’ సినిమాతో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఢీ’ షోలో జానీ మాస్టర్‌ టాలెంట్‌ చూసిన నితిన్‌ ఈ అవకాశాన్ని ఆయనకు అందించారు. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన ’ఏం మాయ చేశావో’ సాంగ్ అప్పట్లో సూపర్‌ హిట్‌ అయ్యింది. నితిన్‌ చేత ఆ స్థాయిలో స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ ఎవరూ అంటూ అంతా జానీ మాస్టర్‌ కోసం తెగ సెర్చ్ చేశారు. ఆ సాంగ్‌ తర్వాత నుంచి జానీ మాస్టర్‌ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.&nbsp; https://www.youtube.com/watch?v=DPdL89Ho4P8
    సెప్టెంబర్ 19 , 2024
    Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్‌ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?
    Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్‌ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే?
    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా&nbsp; ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' ఫ్లాప్&nbsp; తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన&nbsp; సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్‌- పూరి కాంబో మరోసారి హిట్‌ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.&nbsp; కథేంటి? మాఫియా డింపుల్ బిగ్‌ బుల్‌(సంజయ్ దత్‌) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్‌ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్‌ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్‌ బ్రేయిన్‌లోకి బిగ్‌ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా. సినిమా ఎలా ఉందంటే? ఫస్టాఫ్‌ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది.&nbsp; పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్‌ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్‌ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్‌ ఉంటాయి.&nbsp; రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.&nbsp; ఎవరెలా చేశారంటే? ఇస్మార్ట్ శంకర్‌గా రామ్‌ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్‌ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్‌ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్‌ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్‌ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది.&nbsp; యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్‌ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్‌ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. సాంకేతికంగా టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్‌ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; ప్లస్ పాయింట్స్ రామ్ పొత్తినేని నటన పూరి డైరెక్షన్ సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు మైనస్ పాయింట్స్ లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్ కొన్ని పాటలు తీర్పు:&nbsp; ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రేటింగ్:&nbsp; 3/5
    ఆగస్టు 16 , 2024
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు రచన &amp; దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్‌ సంగీతం : సాయి చరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా ఎడిటర్‌ : కార్తిక్ ఉన్నవ నిర్మాతలు : రవితేజ, సుధీర్‌ కుమార్ కుర్రు విడుదల తేదీ : 23-02-2024 హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్‌ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్‌ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్‌ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్‌ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్‌ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్‌ సీరియస్‌ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.&nbsp; టెక్నికల్‌గా ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్‌ చేసిన ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్‌ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ హర్ష నటనకామెడీ&nbsp;సంగీతం మైనస్‌ పాయింట్స్ పసలేని క్లైమాక్స్‌&nbsp;లాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
    Naa Saami Ranga Review: మాస్ యాక్షన్‌తో వింటేజ్ నాగార్జునను గుర్తు తెచ్చిన ‘నా సామిరంగ’... సినిమా హిట్టా? ఫట్టా?
    సొగ్గాడే చిన్నినాయన చిత్రం తర్వాత కింగ్ నాగార్జున(Nagarjuna) కమర్షియల్ విజయం దక్కలేదు. మధ్యలో ఘోస్ట్ చిత్రం చేసినప్పటికీ.. విజయం వరించలేదు. దీంతో మరోసారి యాక్షన్ జనర్ నమ్ముకున్న నాగార్జున 'నా సామిరంగ' చిత్రం ద్వారా సంక్రాంతి బరిలో నిలిచాడు. ఈ సినిమా విడుదలకు (Naa Saami Ranga Review) ముందు వచ్చిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి బరిలో నాగార్జునకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో నా సామిరంగ చిత్రంపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నాగార్జున హిట్ కొట్టాడా? YouSay సమీక్షలో చూద్దాం. నటీనటులు నాగార్జున, అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, రాజ్ తరుణ్, మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లన్, కరుణ కుమార్, నాసర్, రావు రమేష్ కథ ఒక ఊరిలో రంగా(నాగార్జున) స్నేహితులతో కలిసి సరదాగా జీవనం సాగిస్తుంటాడు. అవసరం ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. అలాంటి రంగాకి(Naa Saami Ranga Review) ఆ ఊరిలో కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది. ఇదే సమయంలో తన స్నేహితులు అయిన అంజి (అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది. దీంతో ఆ పెద్ద మనుషులు వీరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. చంపడానికి కూడా సిద్ధపడుతారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో రంగా తన స్నేహితులను ఎలా కాపాడుకున్నాడు?. వరలక్ష్మి, రంగాల మధ్య ప్రేమ ఎలా ఉంది? తన స్నేహితులను చంపాలనుకున్న దుర్మార్గులను రంగా ఏం చేశాడు అనేది మిగతా కథ. డైరెక్షన్ ఎలా ఉందంటే? కొరియోగ్రాఫర్ అయిన విజయ్ బిన్నికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చిన నాగార్జున నమ్మకాన్ని బిన్ని నిలబెట్టుకున్నాడు.&nbsp; కథలో ఎక్కడా ఎమోషన్స్ పండించాలో అక్కడ పండించి క్యారెక్టర్స్‌కు తగ్గ ఎలివేషన్స్ అందించాడు.&nbsp; ఎక్కడ ఎమోషన్స్ మిస్‌ కాకుండా నాగార్జున మ్యానరిజాన్ని జాగ్రత్తగా వాడుకుని కామెడీ పండిచడంలో విజయవంతం అయ్యాడు.&nbsp; సినిమా ఎలా ఉందంటే? నా సామిరంగ ఫస్టాఫ్ మొత్తం నాగార్జున, అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్ కామెడీ ట్రాక్, ఆషికా రంగనాథ్(Ashika Ranganath) లవ్ ట్రాక్ అలరిస్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్‌ల మధ్య నడిచే కామెడీ సీన్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంటుంది. సెకండాఫ్ పూర్తి సీరియస్‌గా నడుస్తుంది. ఓ కీలక పాత్ర చనిపోవడంతో నాగార్జున ప్రతీకారం తీర్చుకునేందుకు విలన్లపై పొరాడుతుంటాడు. ఎమోషనల్ సీన్లు బాగున్నప్పటికీ..కొన్ని సీన్లల్లో లెంత్ మరీ ఎక్కువ అయిపోయింది.&nbsp; దాన్ని లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే (Naa Saami Ranga Review in Telugu) ఈ సినిమాలో కొన్ని సీన్లు అనవసరంగా పెట్టారు అనే భావన కనిపిస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిజంతో పాటు ఆషిక రంగనాథ్‌తో నాగార్జున రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయి. ఎవరెలా చేశారంటే? నా సామిరంగ(Naa Saami Ranga ) సినిమాలో టైటిల్‌ రోల్ పోషించిన నాగార్జున యాక్టింగ్ ఇరగదీశాడు. కింగ్ నాగార్జున(Nagarjuna) మరోసారి వింటేజ్ మాస్‌ లుక్‌ను గుర్తు తెచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆకట్టుకునేలా కనిపించాడు. ఆషికా రంగనాథ్‌తో రొమాన్స్ పండించాడు. ముఖ్యంగా 'నా సామిరంగ' అనే ఆ ఊత పదంతో ప్రేక్షకులందరిలో జోష్ నింపాడు. ఇంటర్వెల్‌ బ్రేక్‌లో నాగార్జున స్వాగ్ సినిమాకే హైలెట్. ఆ సీన్‌న్లో కీరవాణి బీజీఎమ్‌ అదిరిపోయింది.&nbsp; అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు తమ నటనతో ఆకట్టుకున్నారు. నాగార్జునతో కామెడీ పండిస్తూనే ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించారు. ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్&nbsp; గ్లామర్ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. తన పాత్ర పరిధి మేరకు నటించడమే కాకుండా రొమాంటిక్, ఎమోషనల్ సీన్లలో పోటీపడి నటించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులు నాజర్, రావురమేష్ కూడా వాళ్ల పరిధి మేరకు నటించారు. సినిమా విజయానికి కావాల్సిన ఇన్‌పుట్స్‌ను తమ నటన ద్వారా అందించారు. టెక్నికల్ విషయాలు… సాంకేతికంగా నా సామిరంగ చిత్రం ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర దాశరధి తన విజువల్స్ టేకింగ్‌లో మ్యాజిక్ చేశాడు. వింటేజ్ నాగార్జున చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన ఆస్కార్ విజేత MM కీరవాణి మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు ఓకే అనిపిస్తాయి. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే', నాసామిరంగ(Naa Saami Ranga ) టైటిల్ సాంగ్ విజిల్స్ కొటిస్తాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్బ్‌గా ఉంది. నాగార్జున యాక్షన్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రాజమౌళి సినిమాలో ఇచ్చినట్టుగా మ్యూజిక్ రాలేదు కానీ... సినిమాకు కావాల్సిన మేర అందించాడు. మరోవైపు చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు.&nbsp; చాలా సీన్లను లాంగ్ లెంగ్త్‌తో కట్‌&nbsp; చేశారు. అక్కడక్కడా లాగ్ అనిపిస్తాయి. ఇక రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ కూడా అదిరిపోయాయి. మరి ఓవర్ కాకుండా హీరోయిజన్ని ఎలివేట్ చెసేలా ఉన్నాయి.&nbsp; బలాలు నాగార్జున వింటేజ్ యాక్షన్అల్లరి నరేష్, రాజ్‌ తరుణ్ కామెడీ ట్రాక్ఆషికా రంగనాథ్- నాగార్జున లవ్ ట్రాక్ఇంటర్వెల్ సీన్ బలహీనతలు ల్యాగ్ సీన్లుఅక్కడక్కడ అనవసరమైన సీన్లు చివరగా: సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే వారికి నా సామిరంగ నిరాశ పరుచదు. రేటింగ్: 3/5
    జనవరి 14 , 2024
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    Skanda Movie Review: మాస్ అవతార్‌లో రామ్‌ పొత్తినేని వీర కుమ్ముడు.. బొమ్మ బ్లాక్ బాస్టర్
    నటీనటులు: రామ్ పొత్తినేని, శ్రీలీల, శ్రీకాంత్, ప్రిన్స్, ఇంద్రజ, సాయిమంజ్రేకర్, శరత్ లోహితాశ్వ నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి డైరెక్టర్: బోయపాటి శ్రీను సంగీతం: ఎస్‌ఎస్ తమన్ ఎడిటింగ్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ప్రపంచవ్యాప్తంగా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది.&nbsp; ఇస్మార్ట్ శంకర్ తర్వాత&nbsp; వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌..ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడా? అఖండాతో భారీ విజయాన్ని నమోదు చేసిన బోయపాటి మరోసారి తన మాస్ మార్క్‌ను చూపించాడా? ఇంతకు సినిమా ఎలా ఉంది? సినిమాలోని ఏ అంశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి? వంటి అంశాలను YouSay రివ్యూలో చూద్దాం. కథ స్కంద స్టోరీ విషయానికి వస్తే ఓ ఊరిలో ఉండే హీరో రామ్ కుటుంబమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అదేక్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతుంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతుంది. ఆ నిందను రామ్ చెరిపేశాడా? ఈ మధ్యలో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ ఎలా మొదలైంది. హీరో మరియు విలన్‌ల మధ్య పగ ఎందుకు స్టార్ట్ అయింది. క్లైమాక్స్ ఏంటీ? వంటి విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని ఇప్పటివరకు అభిమానులు చూడని మాస్‌ అవతార్‌లో కనిపించడం బాగుంది. సినిమాలో ఫస్టాఫ్ విషయానికొస్తే.. హీరో రామ్- శ్రీలీల మధ్య లవ్ ట్రాక్, హీరోయిన్‌తో కామెడీ ట్రాక్ రొమాన్స్ ఉంటుంది. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోయింది.&nbsp; అప్పటి వరకు సాదాసీదగా నడిచిన సినిమా ఆ తర్వాత నుంచి సినిమా హైప్‌లోకి వెళ్తుంది. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు బాగున్నాయి. కొన్ని సీన్లు కంటతడిపెట్టిస్తాయి. రామ్ చెప్పే మాస్ డైలాగ్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది. 'ఇయ్యాలే పొయ్యాలే... గట్టిగా అరిస్తే తొయ్యాలే... అడ్డం వస్తే లేపాలే, దెబ్బతాకితే సౌండ్ గొల్కొండ దాటలే' వంటి డైలాగ్స్ ఊపు తెప్పిస్తాయి. ఇక సాంగ్స్‌లో రామ్- శ్రీలీల ఇద్దరు పోటీ పడి మరి స్టెప్పులతో ఇరగదీశారు. నీ చుట్టు సాంగ్, కల్ట్ మామ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది.&nbsp; ఎవరెలా చేశారంటే? ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ కంప్లీట్ మాస్ అవతార్‌లో అదరగొట్టాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమా మొత్తం హై వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రామ్‌ను బోయపాటి బాగా చూపించారు. రెండు విభిన్న పాత్రల్లో రామ్ మెప్పించాడు.&nbsp; మాస్ డైలాగ్స్ థియేటర్స్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. రామ్ పక్కన శ్రీలీల జోడీ బాగుంది. తన అందం, అభినయంతో పాటు డ్యాన్స్‌తో అదరగొట్టింది. మరో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ సైతం ఆకట్టుకుంది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్ తమ పరిధిమేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ బాలకృష్ణతో అఖండ విజయం తర్వాత బోయపాటి మరోసారి తన యాక్షన్ మార్క్‌ను చూపించాడు. లవ్లీ బాయ్ రామ్‌ను పూర్తి స్థాయి మాస్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంటెన్సివ్ యాక్షన్ సీన్లు ప్రేక్షకుల ఊహకు మించి ఉంటాయి. పస్టాఫ్‌ను కామెడీ లవ్‌ ట్రాక్‌తో నడిపిన బోయపాటి... సెకండాఫ్‌ నుంచి కథలో సీరియస్ నెస్‌ తీసుకొచ్చి స్టోరీకి ప్రేక్షకున్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఓ నార్మల్ ఫ్యామిలీ స్టోరీకి మాస్ ఎలిమెంట్స్ జోడించి కమర్షియల్ సినిమాగా బోయపాటి మార్చేశాడు.&nbsp; టెక్నికల్‌ పరంగా సాంకేతికంగా , నిర్మాణ విలువల పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థమన్ అందించిన BGM బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. ఇంటర్వేల్ బ్యాంగ్ అదిరిపోతుంది.&nbsp; సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ప్రేక్షకులకు మాస్ మీల్స్‌ను అందించడంలో ప్రొడ్యూసర్స్ ఎక్కడా రాజీపడలేదని తెలుస్తోంది.&nbsp; బలం బోయపాటి మార్క్ డైరెక్షన్ రామ్ మాస్ యాక్టింగ్ శ్రీలీల అందం&nbsp; థమన్ BGM బలహీతనలు అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు చివరగా: &nbsp;మాస్ మీల్స్ కోరుకునే ప్రేక్షకులకు ఊహకు మించిన ట్రీట్ అందిస్తుంది స్కంద. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రేటింగ్ 4/5
    సెప్టెంబర్ 28 , 2023
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,&nbsp; ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.&nbsp; పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.&nbsp; ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    RAKESH MASTER: ఏపీ కల్తీ మద్యమే రాకేష్ మాస్టర్‌ను చంపేసిందా?... ఇవిగో సాక్ష్యాలు!
    టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ రాకేష్‌ మాస్టర్‌&nbsp; తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే రాకేష్ మాస్టర్ మృతి కారణాల పట్ల సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాకేష్ మాస్టర్ చనిపోవడానికి ఏపీలో అమ్ముతున్న చీప్ లిక్కర్, కల్తీ మద్యమే కారణమని వైసీపీ సర్కారును ట్రోల్ చేస్తున్నారు. అక్కడ విరివిగా లభించే 'బూమ్ బూమ్' బీర్లను రాకేశ్ మాస్టర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు కోల్పోయారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు వీడియోలను షేర్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/mana_Prakasam/status/1670462301533765632?s=20 ఏపీలో మద్యపానం నిషేధం పేరిట తొలుత మద్యం ధరలు భారీగా పెంచారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత నకిలీ, కల్తీ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చి విచ్చలవిడిగా అమ్ముతున్నారనీ ఆరోపించారు.&nbsp; వీటి తయారీ వెనుక ఉన్నది వైసీపీ నేతలే ఉన్నారని గతంలో&nbsp; ప్రతిపక్షాలు కూడా పెద్దఎత్తున విమర్శించిన సంగతి తెలిసిందే. బ్రాండెడ్ మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాదని.. అందుకే చీప్ మద్యానికి అనుమతించారని కామెంట్లు చేస్తున్నారు. కల్తీ మద్యానికి రాకేష్ మాస్టర్ బలి అయ్యారని పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/apramayanam/status/1670464153348190209?s=20 మరణం ముందే తెలుసు.. ఎప్పుడూ యూట్యూబ్‌లో ఎంటర్‌టైన్ చేసే రాకేష్ మాస్టర్ మృతిని చూసి తట్టుకోలేని అభిమానులు ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. రాకేష్ మాస్టర్ తాను చనిపోతాననే విషయం తనకు ముందే తెలుసు. తన అనారోగ్యం గురించి తెలిసినా... అందర్ని నవ్విస్తూ కడుపులోనే తన బాధను దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రాకేశ్ మాస్టర్ మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. "నా శరీరంలో మార్పు కనిపిస్తోంది. అది నాకు తెలుస్తోంది. నువ్వు ఉదయించే సూర్యుడివి నువ్వు  అయితే… నేను అస్తమించే సూర్యుడిని. అమ్మా, నాన్నలను బాగా చూసుకో'' అంటూ వీడియోలో చెబుతున్నట్లు ఉంది. దీంతో తాను చనిపోతానన్న విషయం తనకు ముందే తెలుసని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. https://twitter.com/Devineni_Hari/status/1670424465300402177?s=20 రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన రాకేష్ మాస్టర్ తన చివరి కోరిక ఏమిటో చెప్పారు. ఆయన చనిపోయాక ఎక్కడ సమాధి చేయాలో పేర్కొన్నారు. 'ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. నా మామగారి సమాధి పక్కన వేప మెుక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా' అని మాస్టర్‌ అన్నారు.&nbsp; డాక్టర్లు ఏమన్నారు? &nbsp;రాకేశ్ మాస్టర్ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు బులెటెన్ విడుదల చేశారు. ఉదయం రక్త విరేచనాలు కావడంతో మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో రాకేష్ మాస్టర్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు డయాబెటిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ తీవ్రంగా ఉండటంతో శరీరంలోని చాలా అవయవాలు దెబ్బతిన్నాయి అని&nbsp; గాంధీ సూపరింటిండెంట్ రాజారావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు రాకేశ్ మాస్టర్ తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ప్రభాస్‌కు డ్యాన్స్ శిక్షణ రాకేశ్ మాస్టర్‌కి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. దాదాపు 1500కు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే. కెరీర్ ఆరంభంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరో వేణు ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కంటెస్టెంట్‌కు మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆయన మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తోంది. https://twitter.com/CreatorYog/status/1670510684935962625?s=20
    జూన్ 19 , 2023
    Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?
    Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?
    నటినటులు: కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి దర్శకత్వం: రమేష్‌ కడూరి సంగీతం: సాయి కార్తిక్‌ నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం  రీసెంట్‌ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కిరణ్‌ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. ప్రస్తుతం ఆయన లెటేస్ట్‌ మూవీ మీటర్‌ ఇవాళ (ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి అంచనాలను కిరణ్ అబ్బవరం అందుకున్నాడా?. వరుసగా రెండో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడా? అసలు సినిమా కథేంటి? వంటి ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం.  కథ ఏంటంటే: కథలోకి వెళితే... అర్జున్‌ కళ్యాణ్‌ (కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ మంచి పోలీసు ఆఫీసర్‌. కానిస్టేబుల్‌గా చేస్తూ ఎన్నో అవమానాలు పడుతుంటాడు. కొడుకుని ఎస్సైని చేయాలని తండ్రి కలలు కంటాడు. కాని అర్జున్‌కు అది అసలు ఇష్టం ఉండదు. అయితే అనుకోకుండా పరీక్ష రాసిన అర్జున్.. ఎస్సై అయిపోతాడు. ఈ క్రమంలో హోమంత్రి కంఠం బైరెడ్డి(పవన్‌), అర్జున్‌ మధ్య గొడవ జరుగుతుంది. బైరెడ్డి చేసిన స్కామ్‌ ఏంటి?. అర్జున్‌ దాన్ని ఎలా బయటపెడతాడు? అనేది అసలు కథ. అది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే.. ఎవరెలా చేశారంటే: మీటర్‌ సినిమాలో కిరణ్‌ అబ్బవరం మాస్‌ హీరోగా అదరగొట్టాడు. గత సినిమాల్లో కంటే ఎంతో ఉత్సాహాంగా నటించి అలరించాడు. ప్రతీ సీన్‌లో తన మార్క్‌ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. తన పంచులు, ప్రాసలతో ఆడియన్స్‌ మెప్పించాడు. కిరణ్‌ చెప్పిన డైలాగ్స్‌ థియేటర్లలో చాలా అద్భుతంగా పేలాయి. హీరోయిన్‌గా అతుల్య రవి పాటల మేరకే పరిమితం అయ్యింది. సప్తగిరి కామెడి అక్కడక్కడ నవ్వులు పూయిస్తుంది. పోసాని కృష్ణమురళి సహా ఇతర నటులు తమ పరిధిమేరకు నటించారు. విశ్లేషణ సినిమాలో చాలా పాత్రలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. ఖాళీగా తిరిగే హీరో ఒక్కసారిగా ఎస్సై అవ్వడం వాస్తవ దూరంగా ఉంటుంది. అబ్బాయిలంటేనే ఇష్టపడని హీరోయిన్‌ ఒక్క పాటతో హీరో ప్రేమలో పడిపోవడం ఆడియన్స్‌కు అంతగా రుచించదు. సీఎంను కూడా భయపెట్టేంత రేంజ్‌లో విలన్‌ను చూపించి హీరో ముందు మరీ తక్కువ చేయడం అర్థంకాని అంశంగా ఉంది. సినిమా కథలో కొత్త దనం లేకపోవడంతో పాటు, కొన్ని సీన్లను ఎక్కడో చూశామన్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇక సాయికార్తిక్‌ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్యం సంగీతం కూడా నార్మల్‌గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హీరో నటనకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ స్టోరీసహజత్వం లోపించడంకథలో సాగదీతసంగీతం రేటింగ్‌: 2/5
    ఏప్రిల్ 07 , 2023
    Dasara Movie Story: నాని మాస్ ‌అవతారం… దసరా అసలు కథ ఇదేనా..!
    Dasara Movie Story: నాని మాస్ ‌అవతారం… దసరా అసలు కథ ఇదేనా..!
    ]విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న దసరా చిత్రంపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. నాని కెరీర్ గ్రాఫ్‌తో పాటు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కేరీర్‌ను కూడా ఈ చిత్రం ఫలితం శాసించనుంది.
    ఫిబ్రవరి 24 , 2023
    <strong>Daaku Maharaaj Trailer: బాలకృష్ణ మాస్ అవతార్.. ట్రైలర్‌లో ఇది గమనించారా?</strong>
    Daaku Maharaaj Trailer: బాలకృష్ణ మాస్ అవతార్.. ట్రైలర్‌లో ఇది గమనించారా?
    సంక్రాంతి పండుగకు బాలకృష్ణ సినిమాలు అంటే ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్‌ అన్నట్లుగా మారింది. బాలయ్య నటించిన చిత్రాలు సంక్రాంతి విడుదల కాగానే సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన వీరసింహా రెడ్డి మిక్స్డ్ టాక్‌ను అధిగమించి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈసారి బాలయ్య మరింత క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా డాకు మహారాజ్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదటి నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ బాలయ్య మాస్ అవతార్‌ను కళ్లకు కట్టింది. రిలీజ్ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ తాజాగా డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. మొదట విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, తాజా రిలీజ్ ట్రైలర్ మాత్రం నందమూరి అభిమానులకు మాస్ ట్రీట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లో బాలకృష్ణ స్క్రీన్‌ ప్రజెన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ డైలాగ్స్ గమనించారా?(Daaku Maharaaj Dialogues) ఈ ట్రైలర్‌లో బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి: "ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు.. వైల్డ్ యానిమల్""రాయలసీమ మాలూమ్ హే తెరకు.. ఓ బి మై అడ్డా""ఎవడైనా చదవడంలో మాస్టర్స్ చేస్తాడేమో.. నేను చంపడంలో మాస్టర్స్ చేశా" ఈ మాస్ డైలాగ్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌లో బాలయ్య శివతాండవం లాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. డాకు మహారాజ్ చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా, సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతికి హిట్ గ్యారంటీ? సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాలు విజయవంతంగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి కూడా డాకు మహారాజ్ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం రామ్‌ చరణ్ గేమ్ ఛేంజర్, సంక్రాతికి వస్తున్నాం సినిమాలతో పోటీపడాల్సి వస్తోంది. వీటిలో గేమ్‌ ఛేంజర్ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సంక్రాంతి బరిలో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
    జనవరి 10 , 2025
    <strong>Akhanda 2: బాలయ్య - బోయపాటి మాస్‌ తాండవం షురూ.. రికార్డులన్నీ సర్దుకోవాల్సిందే!&nbsp;</strong>
    Akhanda 2: బాలయ్య - బోయపాటి మాస్‌ తాండవం షురూ.. రికార్డులన్నీ సర్దుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్‌లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్‌’ (Legend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే వీరి కాంబోలో నాల్గో సినిమా కూడా రాబోతున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన సైతం వచ్చింది. అయితే తాజాగా ‘అఖండ 2’ ప్రాజెక్ట్‌ను మేకర్స్‌ పట్టాలెక్కించారు. ఇవాళ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; క్లాప్‌ కొట్టిన బ్రాహ్మణి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). ‘తాండవం’ అనే పేరును క్యాప్షన్‌గా పెట్టారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌కు బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/TeluguChitraalu/status/1846413204492374156 టైటిల్‌ థీమ్‌ అదుర్స్‌&nbsp; అఖండ 2 సినిమాను గ్రాండ్‌గా లాంఛ్‌ చేసిన కాసేపటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ థీమ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ థీమ్​కు మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్​ టైటిల్​కే ఈ రేంజ్​లో ఇచ్చాడంటే సినిమాకు ఏ రేంజ్​లో ఇస్తాడో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక థియేటర్లలో పూనకాలు రావడం పక్కా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా క్యాప్షన్‌కు తగ్గట్లు థమన్‌ తాండవం చేయడం కన్ఫార్మ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మీరు కూడా అఖండ్‌ 2 టైటిల్‌ను ఓ సారి వినేయండి. https://www.youtube.com/watch?v=FdBnvmLOuiM కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌! బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్​గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. థమన్‌ BGM దెబ్బకు థియేటర్స్​లో సౌండ్​ బాక్స్​లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్​గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp; యానిమేషన్‌లో బాలయ్య ప్రోమో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించే అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ మూడు సీజన్లుగా ఈ టాక్ షో ప్రసారం కాగా ఓటీటీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బాలయ్య హోస్టింగ్‌ బాగుందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4ను ప్రసారం చేసేందుకు ఆహా వర్గాలు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఇటీవల ‘బాలయ్య పండగ’ పేరుతో యానిమేషన్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. యానిమేషన్‌ రూపంలో ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్‌ తెగ మురిసిపోయారు. అక్టోబర్‌ 24 నుంచి అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది. https://twitter.com/CBN_Era/status/1845061468053438745 నాన్నకు హ్యాట్సాఫ్‌ : తేజస్విని బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి అన్‌స్టాపబుల్ షోని నడిపించిన తేజస్విని ఇటీవల జరిగిన సీజన్‌ 4 లాంచింగ్‌ ప్రెస్‌ మీట్‌లో తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. అల్లు అరవింద్ ఈ టాక్‌షో గురించి చెప్పినప్పుడు అందరం చేద్దామా? వద్దా? అని తెగ ఆలోచించినట్లు తెలిపారు. కానీ తన తండ్రి మాత్రం చేయాల్సిందేనని చెప్పారన్నారు. ఆ ధైర్యమే ఇవాళ అన్‌స్టాపబుల్‌ని ఈ రేంజ్‌కి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. IMDB రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ షో వరల్డ్‌ 18వ ర్యాంక్ సాధించిందని గుర్తు చేశారు. తన తండ్రి ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని తేజస్విని అన్నారు. హిందూపూర్‌లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. నాన్నకు హ్యాట్సాఫ్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. తేజస్విని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యింది. https://twitter.com/GulteOfficial/status/1845034242280956027 రాజకీయ వారసురాలిగా తేజస్విని! బాలయ్య చిన్న కూతురు తేజస్విని తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడారు. తాను చెప్పాలనుకున్న అంశాలను ఏమాత్రం తడబడకుండా అర్ధవంతంగా తెలియజేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. తేజస్విని ఇంత బాగా మాట్లాడతారని తాము అసలు ఎక్స్‌పెక్ట్‌ చేయాలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమె మాటల్లోని స్పష్టత చూస్తుంటే రాజకీయాల్లోనూ రాణించగలదన్న నమ్మకం తమకు కలుగుతోందని పోస్టులు పెడుతున్నారు. బాలయ్యకు రాజకీయ వారసత్వంగా తేజస్విని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, తేజస్విని భర్త భరత్‌ ఇప్పటికే వైజాగ్‌ ఎంపీగా గెలుపొందారు. రానున్న రోజుల్లో తేజస్విని రాజకీయాల్లో చూసే అవకాశం లేకపోలేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.&nbsp;
    అక్టోబర్ 16 , 2024
    Eagle Movie Review: ‘ఈగల్‌’లో రవితేజ మాస్‌ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
    Eagle Movie Review: ‘ఈగల్‌’లో రవితేజ మాస్‌ జాతర.. సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు : రవితేజ, కావ్య థాపర్‌, అనుపమా పరమేశ్వరన్‌, మధు, వినయ్‌ రాయ్‌, నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, ప్రణీత పట్నాయక్‌, అజయ్‌ ఘోష్‌, నితిన్‌ మెహతా, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని సంగీతం: దావ్‌జాంద్ సినిమాటోగ్రఫీ: కార్తీక్, కమిల్ ప్లాకి, కర్మ చావ్లా నిర్మాతలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. విడుదల తేది: 09-02-2024 రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా (Eagle Movie Review) కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? అనుపమ, కావ్య తమ అందాలతో ప్రేక్షకులను అలరించారా? లేదా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ తలకోన అడవిలోని ఓ గిరిజన తండాలో జీవించే సహదేవ్ వర్మ (రవితేజ)ను స్థానికులు దైవంగా భావిస్తుంటారు. అనుకోకుండా ఓ రోజు అతడు మిస్‌ అవుతాడు. ఓ విషయాన్ని అన్వేషిస్తూ ఆ తండాకు వచ్చిన క్రైమ్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టు నళిని రావు (అనుపమా పరమేశ్వరన్‌) దృష్టి అతడిపై పడుతుంది. అతడి అదృశ్యంపై ఓ ఆర్టికల్‌ రాయగా వెంటనే సీబీఐ రంగంలోకి దిగుతుంది. అసలు ఆ మిస్సయిన సహదేవ్ వర్మ ఎవరు? ఎక్కడికి వెళ్లాడు? అతని గురించి పేపర్లో చూసి సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సహదేవ్ భార్య రచన (కావ్య)కి ఏమైంది? అక్రమ ఆయుధాలతో హీరోకు ఉన్న సంబంధం ఏంటి? ఈ లాంటి విషయాలు తెలియాలంటే సినిమా మొత్తం చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే మాస్‌ మహారాజ్‌ రవితేజ తన రొటీన్ పాత్రల కంటే భిన్నంగా ఈ సహదేవ్‌ వర్మ పాత్రలో నటించాడు. ఎక్కువ డైలాగ్స్ లేకపోయినప్పటికీ స్టైలిష్‌ లుక్‌తో కళ్లతోనే తన హావభావాలను పలకించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌కు మంచి పాత్రే దక్కింది. నటనకు పెద్దగా స్కోప్ లేనప్పటికీ సినిమా మెుత్తం ఆమెనే కనిపిస్తుంది. వినయ్ రాయ్ పాత్ర చిన్నదైనా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. అవసరాల శ్రీనివాస్, మధుబాల, మిర్చి కిరణ్ వంటి వాళ్ళ పాత్రలు కూడా పరిమితమైనా ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, అమృతం అప్పాజీ తమ కామెడీ ట్రాక్‌తో నవ్వించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే? దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో సినిమాను తెరకెక్కించారు. గన్‌ కల్చర్‌ను ప్రధానాంశంగా చేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్‌ప్లేను నడిపించారు. రవితేజకు కేజీఎఫ్‌ స్థాయిలో ఎలివేషన్స్‌ ఇచ్చిన తీరు బాగుంది. అంతేకాక రవితేజను మోస్ట్ స్టైలిష్ అవతార్‌లో చూపించి ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ పెట్టాడు డైరెక్టర్‌. అయితే రవితేజ మార్క్‌ కామెడీని ఆశించే వారికి ఈ సినిమా నిరాశనే మిగిలిస్తుంది. సినిమా మెుత్తం మాస్‌ మాహారాజ్‌ సిరియస్‌ లుక్‌లోనే కనిపిస్తాడు. మరోవైపు సినిమాను చాప్టర్లుగా విడగొట్టి చూపించడం ప్రేక్షకులను కాస్త కన్‌ఫ్యూజన్‌కు గురిచేసింది. కొన్ని సీన్లు లాజిక్‌కు దూరంగా అనిపించినా ఓవరాల్‌గా సినిమా మొత్తం ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసేలాగే ఉంటుంది. టెక్నికల్‌గా.. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే దేవ్ జాండ్ పాటలకన్నా సౌండ్ డిజైనింగ్, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు కూడా ‘ఆడు మచ్చ’, ‘గల్లంతు’ వంటివి వినడానికే కాదు విజువల్‌గా కూడా బాగున్నాయి. కార్తీక్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. మణి బాబు రాసిన డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు మెచ్చుకోవాల్సిందే. ప్లస్‌ పాయింట్స్ రవితేజ నటనహీరో ఎలివేషన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌ సాగదీతలాజిక్‌కు అందని సీన్లు రేటింగ్‌: 3/5
    ఫిబ్రవరి 09 , 2024
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!
    నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్‌, సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ దర్శకుడు: సుధీర్‌ వర్మ రచయిత: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్ సిసిరోలియో మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాల్లో కెల్లా రావణసుర ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఇందులో రవితేజ విలన్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, ట్రైలర్‌, టీజర్‌ ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో రావణసుర చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రవితేజకు మరో హిట్‌ తెచ్చిపెట్టిందా? అసలు సినిమా స్టోరీ ఏంటి? విలన్‌గా రవితేజ నటనకు ఎన్ని మార్కులు పడ్డాయి? వంటి ప్రశ్నలకు ఆన్సర్స్‌ ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే: రావణసుర కథలోకి వెళితే... ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్‌ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్‌ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు?. మర్డర్స్‌ ఎందుకు జరుగుతున్నాయి?. రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? రవితేజ ఎందుకు విలన్‌గా మారాడు? అనేది సినిమా కథాంశం. ఎలా చేశారంటే: ఈ సినిమాకు రవితేజ నటనే హైలెట్‌ అని చెప్పాలి. ఫస్టాఫ్‌లో కామెడి చేస్తూ నవ్వించే రవితేజ.. విలన్‌ షెడ్స్‌లో కనిపించి మెప్పిస్తాడు. రవితేజ చేసిన నెగిటివ్‌ రోల్‌ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఆ పాత్ర ద్వారా విలన్‌గానూ ఆడియన్స్‌ను మెప్పించగలనని రవితేజ నిరూపించాడు. ఇక యువ హీరో సుశాంత్ కి చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్ర దక్కింది అనే చెప్పాలి. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తాడు. తన నటనతో ఆడియన్స్‌ను మెప్పిస్తాడు. &nbsp;హీరోయిన్స్ గా నటించిన ఫైరా అబ్దుల్లా, దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ తమ పరిధిమేర బాగానే నటించారు. ఇక సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ నటన కూడా ఆకట్టుకుంటుంది.&nbsp; టెక్నికల్‌గా: ఈ సినిమాను డైరెక్టర్‌ సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. రవితేజ మార్క్‌ కామెడీని చూపిస్తూనే థ్రిల్లింగ్‌ అనుభూతిని కూడా పంచాడు. రవితేజలోని నటుడ్ని సుధీర్‌ చాాలా బాగా ఉపయోగించుకున్నాడు. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు మరీ సాగదీసినట్లు అనిపిసిస్తుంది. ఇక విజయ్‌ కార్తిక్‌ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్‌, భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్‌ బాగుంది. ముఖ్యంగా&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రవితేజ యాక్టింగ్హీరోయిన్స్ గ్లామర్కథబ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్‌ పాయింట్స్‌ &nbsp;సినిమా ఫస్టాప్&nbsp;సాగదీత సన్నివేశాలు చివరిగా: వాల్తేరు వీరయ్య, ధమాాకా చిత్రాల తర్వాత రవితేజ నుంచి మరో డీసెంట్‌ మూవీ రావణాసుర అని చెప్పొచ్చు. ఈ వీకెండ్‌లో మంచి టైంపాస్‌ కావాలనుకునేవారికి రావణాసుర మంచి ఛాయిస్‌. రేటింగ్‌: 2.75/5
    ఏప్రిల్ 07 , 2023
    <strong>Max Movie Review: కిచ్చా సుదీప్‌ మాస్‌ తాండవం.. ‘మ్యాక్స్‌’ ఎలా ఉందంటే?</strong>
    Max Movie Review: కిచ్చా సుదీప్‌ మాస్‌ తాండవం.. ‘మ్యాక్స్‌’ ఎలా ఉందంటే?
    నటీనటులు : కిచ్చా సుదీప్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సంయుక్త హోర్నాడ్‌, సుక్రుతా వాగ్లే, అనిరుధ్‌ భట్‌ తదితరులు దర్శకత్వం : విజయ్‌ కార్తికేయ సంగీతం : అజనీష్‌ లోక్‌నాథ్‌ ఎడిటింగ్‌ : ఎస్‌. ఆర్‌. గణేష్‌ బాబు నిర్మాతలు : కలైపులి ఎస్‌. థను, సుదీప్‌ విడుదల తేదీ :&nbsp; డిసెంబర్‌ 27, 2024 కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మాక్స్’ (Max). ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రలు చేశారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. ఇందులో సుదీప్‌ పవర్‌ఫుల్‌ పోలీసు పాత్ర చేశాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Max Movie Review) కథేంటి మాక్స్‌ (సుదీప్‌ కిచ్చా) ఓ కేసు విషయంలో సస్పెండ్‌ అయ్యి (Max Movie Review In Telugu)తిరిగి డ్యూటీలో చేరేందుకు బయలు దేరతాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో ఇద్దరు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని చితక్కొట్టి అరెస్ట్‌ చేస్తాడు. అయితే వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసు స్టేషన్‌లో ఉన్న నిందితులిద్దరు అనూహ్యంగా మరణిస్తారు. వారిద్దరు ఎలా చనిపోయారు? కుమారులు చనిపోయారన్న వార్త మంత్రులకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? బంధీగా ఉన్న మినిస్టర్స్‌ కొడుకులను విడిపించేందుకు క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రూప (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌), గ్యాంగ్‌స్టర్‌ గని (సునీల్‌) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్‌ ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే సీఐ మ్యాక్స్‌ (Max Movie Review) పాత్రలో కన్నడ నటుడు సుదీప్‌ జీవించేశాడు. యాక్షన్‌, మాస్‌ కలగలసిన ఈ పాత్రలో దుమ్మురేపాడు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో తన మార్క్‌ చూపిస్తూ అలరించాడు. ఇక నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో వరలక్ష్మీ చక్కగా ఒదిగిపోయింది. కథలో ఆమెకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కింది. ఆమెకు ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. విలన్‌ గనిగా సునీల్‌ రొటీన్‌ పాత్రలో కనిపించాడు. ప్రతినాయకుడిగా తనదైన శైలిలో ప్రభావం చూపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌ తమ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు విజయ్‌ కార్తికేయ.. తమిళ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ తీసిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ ఛాయలతో సినిమాను రూపొందించారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మూమెంట్స్ ఇందులో చాలానే ఉన్నాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలని అనుకునే ఆడియన్స్‌కి అవి కూడా ఉంటాయి. మంత్రుల కొడుకులను హీరో అరెస్టు చేయడం, దీంతో పోలీసు స్టేషన్‌ చుట్టూ రౌడీలు తిరుగుతుండటం, వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడటం వంటి సీన్స్‌తో ఫస్టాప్‌ యావరేజ్‌గా సాగింది. సెకండాఫ్‌ నుంచి కథను పరుగులు పెట్టించాడు డైరెక్టర్‌. టైమ్‌ కౌంట్‌ చేస్తూ వచ్చే సీన్స్‌ అదిరిపోతాయి. క్లైమాక్స్ కూడా మెప్పించేలా దర్శకుడు రూపొందించాడు. ఇతర చిత్రాలతో పోలికలను పక్కన పెడితే యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి ‘మ్యాక్స్‌’ నచ్చుతుంది.&nbsp; సాంకేతికంగా..&nbsp; టెక్నికల్‌ విషయాలకు వస్తే (Max Movie Review).. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అజనీష్‌ లోకనాథ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తనదైన BGMతో సినిమా స్థాయిని పెంచేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే నేపథ్య సంగీతం నెక్ట్స్‌ లెవల్లో ఉంటుంది. అయితే పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సుదీప్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్‌ ఫస్టాఫ్‌చూసినట్టు ఉండే సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    డిసెంబర్ 27 , 2024
    <strong>Jani Master: మరో వివాదంలో జానీ మాస్టర్.. వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని వార్నింగ్</strong>
    Jani Master: మరో వివాదంలో జానీ మాస్టర్.. వారిని చట్టపరంగా ఎదుర్కొంటానని వార్నింగ్
    కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనపై కేసు నమోదవ్వడం, జైలుకు వెళ్లడం తెలిసిందే. తాజాగా, డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్‌ను శాశ్వతంగా తొలగించారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ విషయంపై జానీ మాస్టర్ స్వయంగా స్పందించారు. జానీ మాస్టర్ స్పందన జానీ మాస్టర్ మాట్లాడుతూ, "ఈ రోజు ఉదయం నుంచి నన్ను డ్యాన్సర్స్ యూనియన్(Dancers Union) నుండి శాశ్వతంగా తొలగించారనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. నేను ఇప్పటికీ అసోసియేషన్ సభ్యుడినే. నా కార్డ్‌ను ఎవరూ తీసివేయలేరు. నా పదవీ కాలం ఇంకా ఉంది. అనధికారికంగా ఎలక్షన్లు నిర్వహించి, తమకు నచ్చిన విధంగా హోదాలు పొందడాన్ని ఒప్పుకోను. చట్టపరంగా దీనిపై పోరాడతాను" అని అన్నారు. అంతేకాకుండా, తన తాజా ప్రాజెక్టుల గురించి కూడా వివరించారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రానికి కొరియోగ్రఫీ చేశానని, ఆ సినిమాలోని ఓ పాట త్వరలో విడుదలకానుందని చెప్పారు. ఈ సాంగ్ ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. https://twitter.com/AlwaysJani/status/1866073580125196680 కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్(Joseph Prakash) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో జోసెఫ్ ప్రకాష్ విజయం సాధించారు. గతంలోనూ ఆయన నాలుగు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన నియామకంతో జానీ మాస్టర్ అధ్యక్ష పదవి నుంచి తప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై కూడా జానీ మాస్టర్ తాను అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నానని, ఎవరూ తనను హోదా నుంచి తొలగించే హక్కు లేదని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడు వచ్చినందునే తనను అసోసియేషన్ నుండి తప్పించారని వచ్చే కథనాలపై ఆయన విమర్శలు గుప్పించారు. వేధింపుల ఆరోపణలపై జానీ మాస్టర్ స్పందన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయమై గతంలో పెద్ద దుమారం రేగింది. ఆయన అసిస్టెంట్‌ ఓ లేడీ కొరియోగ్రాఫర్‌ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతకాలం జైలులో ఉండిన జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు నేపథ్యంలోనే అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, జానీ మాస్టర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ‘‘నాపై చేసిన ఆరోపణలు నిర్ధారణ కానివి. అలాంటి ఆరోపణల ఆధారంగా నన్ను శాశ్వతంగా తొలగించారనే వార్తలు కేవలం ఫేక్ న్యూసే. నేను లీగల్‌గా పోరాడతాను. నాకు న్యాయం దక్కుతుందని నమ్ముతున్నాను,’’ అని తెలిపారు. ఇప్పటికీ అసోసియేషన్ సభ్యుడినే "కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి పరిశీలన చేయకుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నాయి. నన్ను అసోసియేషన్ నుండి తొలగించారన్నది అసత్యం. నాకు సంబంధించిన హక్కులను ఎవరూ హరించలేరు. నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరూపించబడాల్సినవి. నా పదవీ కాలం ఇంకా ఉంది. ఎవరైనా నాకు వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, నేను చట్టపరంగా పోరాడతాను’’ అని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. జానీ మాస్టర్ తన కెరీర్‌ను ఒక సాధారణ డ్యాన్సర్‌గా ప్రారంభించి, కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఆయన చేసిన కొరియోగ్రఫీతో చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలతో చేసిన పాటలు అభిమానులకు తెగ నచ్చాయి. తాను టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్‌గా ఎదగడానికి డ్యాన్సర్స్ యూనియన్ ప్రధాన కారణమని జానీ మాస్టర్ పేర్కొన్నారు. తన వద్ద పనిచేసిన డ్యాన్సర్లు కూడా ఇప్పుడు కొరియోగ్రాఫర్లుగా ఎదుగుతున్నారని చెప్పుకొచ్చారు. ‘‘నా వద్ద పని చేసిన వాళ్లు ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇదే నా నిజమైన గౌరవం’’ అని తెలిపారు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొత్త అధ్యక్షుడిగా జోసెఫ్ ప్రకాష్ ఎన్నికవడంతో, జానీ మాస్టర్‌ను అసోసియేషన్ నుంచి తొలగించారని ప్రచారం జరిగింది. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ వార్తలను ఖండించారు. తన పదవీ కాలం ఇంకా ఉందని, ఎవరి ఒత్తిడి వల్లనో తనను తొలగించలేరని అన్నారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
    డిసెంబర్ 09 , 2024
    <strong>Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?</strong>
    Pushpa 2 Review: అల్లు అర్జున్‌ మాస్‌ తాండవం.. ‘పుష్ప 2’ బ్లాక్ బాస్టర్‌ కొట్టినట్లేనా?
    నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేశ్‌, ధనుంజయ, జగదీశ్‌ ప్రతాప్‌ భండారి, తారక్‌ పొన్నప్ప, అజయ్‌, శ్రీతేజ్ తదితరులు రచన, దర్శకత్వం: సుకుమార్‌ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్‌ కూబా బ్రోజెక్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: నవీన్‌ యెర్నేని, రవి యలమంచిలి నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ విడుదల: 05-12-2024 అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' (Pushpa) చిత్రం 2021లో విడుదలై ఎంత పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. దీంతో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'పుష్ప 2' దేశవ్యాప్తంగా అందరి దృష్టి పడింది. ఈ మూవీలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Fazil) ఇందులో విలన్‌గా చేశాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు, ప్రమోషన్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. చిత్ర బృందం కూడా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్‌ నిర్వహించి మరింత హైప్‌ పెంచేసింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైంది. తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో థియేటర్లలోకి వచ్చింది. మరి ‘పుష్ప 2’ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? బ్లాక్‌ బాస్టర్ విజయాన్ని అందుకుందా? ఈ రివ్యూ (Pushpa 2 Review In Telugu)లో తెలుసుకుందాం.&nbsp; కథేంటి&nbsp; ఎర్రచందనం కూలీగా ప్రయాణం మెుదలుపెట్టిన పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌) స్మగ్లింగ్‌ సిండికేట్‌ను శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. తన సిండికేట్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరిస్తాడు. అధికార పార్టీకి ఫండ్‌ ఇచ్చి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలో ఎస్పీ భన్వర్‌సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)తో శత్రుత్వం కూడా పెరిగి పెద్దదవుతుంది. బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ పెళ్లాం శ్రీవల్లి (రష్మిక) మాట మాత్రం పుష్పరాజ్ జవదాటడు. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రామేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్పరాజ్‌ బయలుదేరగా సీఎంతో 'ఓ ఫొటో తీసుకొని రా' అంటూ శ్రీవల్లి ఆశగా అడుగుతుంది. దీంతో సీఎంను ఫొటో అడిగ్గా అతడు పుష్పను హేళన చేస్తాడు. దీంతో ఎంపీ సిద్ధప్పను సీఎంని చేస్తానని సవాలు విసురుతాడు. అందుకోసం పుష్ప ఏం చేశాడు? కేంద్రమంత్రి వీర ప్రతాప్‌ రెడ్డి (జగపతిబాబు)తో వైరం ఏంటి? పుష్పను అడ్డుకునేందుకు ఎస్పీ షెకావత్‌ ఎలాంటి ప్లాన్స్‌ వేశాడు? శ్రీవల్లికి ఇచ్చిన మాటను పుష్ప నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే బన్నీ (Allu Arjun) మరోసారి పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. భాష, బాడీ లాంగ్వేజ్‌ విషయంలో మరింత ప్రభావం చూపాడు. ఫైట్స్‌, డ్యాన్స్‌లలో మెస్మరైజ్‌ చేశాడు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్‌లో బన్నీ యాక్టింగ్‌ మరో లెవల్లో ఉంటుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పడింది. తొలి భాగంతో పోలిస్తే సెకండ్‌ పార్ట్‌లో గ్లామర్‌ డోస్‌ బాగా పెంచింది. చాలా చోట్ల ఆమె నటన పీక్స్‌లో ఉంటుంది. ఇక ‘కిస్సిక్’ పాటతో హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) మాయచేసింది. ఎప్పటిలాగే తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. షెకావత్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చక్కగా చేశాడు. కానీ ఆ పాత్రలో సీరియస్‌నెస్‌ తగ్గుతూ రావడంతో చాలా చోట్ల తేలిపోయింది. ఎంపీ పాత్రలో రావు రమేష్‌ ఆకట్టుకున్నారు. మెుదటి పార్ట్‌తో పోలిస్తే సునీల్‌, అనసూయ పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. కేంద్ర మంత్రిగా జగపతిబాబు, కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కథలో ప్రభావం చూపించారు. అల్లుఅర్జున్‌కి ఫ్రెండ్‌గా చేసిన జగదీష్ కీలక పాత్రలో కనిపిస్తాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఫస్ట్‌ పార్ట్‌తో పోలిస్తే డైరెక్టర్‌ సుకుమార్‌ పుష్ప రాజ్‌ (Pushpa 2 Review) పరిధిని మరింత పెంచేశారు. కథలో తన మార్క్ సైకలాజికల్‌, మైండ్‌ గేమ్‌ను జోడించాడు. అడుగడుగునా హీరో ఎలివేషన్లతో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించాడు. అల్లు అర్జున్‌ ఇంట్రో, పుష్ప - షెకావత్‌ టామ్‌ అండ్‌ జెర్రీ ఫైట్‌, ఎత్తుకు పై ఎత్తులు చక్కగా చూపించాడు. కథ నెమ్మదిగా సాగినట్లు అనిపించినా ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు డైరెక్టర్‌. ఓ వైపు పుష్ప వ్యాపార, రాజకీయ సామ్రాజ్యాలను చూపిస్తూనే శ్రీవల్లితో అతడికి ఉన్న ఎఫెక్షన్స్‌ కళ్లకు కట్టాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య ప్రేమ, కెమెస్ట్రీ తెరపై క్యూట్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో గంగమ్మ జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌. జాతర ఎపిసోడ్‌లో హీరోయిజం, కుటుంబ భావోద్వేగాలు సుకుమార్‌ బాగా చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అలరిస్తాయి. అయితే బలమైన విలనిజం లేకపోవడం, నిడివి బాగా పెద్దగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌, టర్న్‌తో ‘పుష్ప3’ సినిమాకు రూట్‌ వేశారు సుకుమార్‌.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతికంగా సినిమా (Pushpa 2 Review) అద్భుతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరుని ప్రదర్శించింది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతంతో కట్టిపడేశాడు. మరో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కూడా నేపథ్య సంగీతంలో ఆకట్టుకున్నాడు. కూబా కెమెరా వర్క్‌ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ప్రతి ఎపిసోడ్‌ను కెమెరా పనితనంతో గ్రాండ్‌గా చూపించాడు. శ్రీకాంత్ విస్సా మాటలు ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్&nbsp; నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతి సన్నివేశంలోనూ రిచ్‌నెస్ కనిపిస్తుంది. ప్లస్‌ పాయింట్స్‌ అల్లు అర్జున్‌ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌జాతర ఎపిసోడ్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ తేలిపోయిన విలనిజంసెకండాఫ్‌ Telugu.yousay.tv Rating : 3.5/5 
    డిసెంబర్ 05 , 2024
    <strong>Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!</strong>
    Pushpa 2 Dialogues: అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్&nbsp; వైరల్!
    "పుష్ప 2"&nbsp; సినిమా తెలుగులోనే కాదు, దేశమంతా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివరీతమైన బజ్ ఏర్పడింది. ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ లీకయ్యాయని అవి ఇవేనంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పుష్ప పంచ్ డైలాగ్స్‌కి ప్యాన్ ఇండియా ఫాలోయింగ్ పుష్ప పార్ట్ 1లో "పుష్పరాజ్" పాత్రలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్స్, ఆయన ప్రత్యేకమైన మ్యానరిజమ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశాయి. "తగ్గేదే లే" అనే డైలాగ్ యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు, "పుష్ప 2"లో సుకుమార్ మరింత పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో ఉన్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "పుష్ప-2" పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేలా సుకుమార్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఈ పార్ట్‌లో ప్రత్యేకంగా ఊర్వశి రౌతేలాతో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేశారు. రష్మిక మందన్న క్రేజ్ మొదటి భాగంలో "శ్రీవల్లి" పాత్రతో రష్మిక మందన్నకు భారీ క్రేజ్ వచ్చింది. "పుష్ప" సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ దక్కిన రష్మిక, పుష్ప 2లో తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకునేలా ఆమె పాత్రను డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారంట. ఇటీవల విడుదలైన “సూసేకి అగ్గిరవ్వ” పాట కూడా సూపర్ హిట్‌ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.&nbsp; ఫుల్ జోష్‌లో అభిమానులు అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, అయితే పుష్ప 2 ద్వారా పాన్ వరల్డ్ క్రేజ్ అందుకునేలా సుకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో ఒకేసారి విడుదల కానుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఇదే విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 4 నుంచి యూఎస్‌లో లాంగ్‌ వీకెండ్‌ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్‌ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌, వీడియోను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్‌ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.&nbsp; నాన్‌ థియేట్రికల్‌ రికార్డు పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్‌ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ థియేట్రికల్‌ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని స్పష్టం చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్‌ షూట్‌ నవంబర్‌ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్‌ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు. అల్లు అర్జున్ రెమ్మ్యూనరేషన్ ఈ సినిమాకి అల్లు అర్జున్ భారీగా రెమ్మ్యూనరేషన్ తీసుకుంటున్నారు, ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయనకు ఏకంగా రూ. 125 కోట్లు అందినట్టు టాక్. పుష్ప 2 నుంచి లీకైన డైలాగ్స్ ఇక పుష్ప 2 నుంచి కొన్ని డైలాగ్స్ లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.&nbsp; ఓ&nbsp; సినిమా ప్రమోషన్‌లో అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు ఓ డైలాగ్ చెప్పాడు. అది పుష్ప 2లోనిదే అని కామెంట్ చేస్తున్నారు. "జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుంది, పుష్ప గాడి రూల్." ఈ డైలాగ్‌తో పాటు మరో రెండు డైలాగ్స్‌ కూడా లీకయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. "అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే? పులి వచ్చిందని అర్థం.&nbsp; అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం." అనే డైలాగ్&nbsp; సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డైలాగ్‌తో పాటు మరో డైలాగ్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. . “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” &nbsp;అనే ఈ&nbsp; డైలాగ్&nbsp; అల్లు అర్జున్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
    అక్టోబర్ 26 , 2024
    <strong>Mahesh - Balakrishna Multi Starrer: క్లాస్‌-మాస్‌ కాంబినేషన్‌లో క్రేజీ మల్టీస్టారర్‌? స్టోరీ కూడా రెడీ అట!</strong>
    Mahesh - Balakrishna Multi Starrer: క్లాస్‌-మాస్‌ కాంబినేషన్‌లో క్రేజీ మల్టీస్టారర్‌? స్టోరీ కూడా రెడీ అట!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna), మహేష్‌బాబు (Mahesh Babu) ఒకరు. క్లాసీ లుక్స్‌తో మహేష్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తే, బాలకృష్ణ తనదైన మాస్‌ డైలాగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగిస్తారు. అటువంటి ఈ ఇరువురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య, మహేష్‌ కాంబోలో మల్టీస్టారర్‌ అంటే ఆ ఊహే ఎంతో బాగుంది కదూ!. అయితే టాలీవుడ్‌ ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌ వ్యాఖ్యలను బట్టి ఈ మల్టీస్టారర్‌ త్వరలోనే సాధ్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఓ షోలో తమన్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; థమన్ ఏమన్నారంటే? ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’లో తెలుగు ఇండియన్ ఐడల్ (Indian Idol) సింగింగ్ షో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మూడవ సీజన్​కు సంగీత దర్శకుడు తమన్ జడ్జిగా వ్యవహరిస్తుండగా సింగర్ శ్రీరామచంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు. ఈ షో సెమీఫైనల్​లో భాగంగా యాంకర్ శ్రీరామచంద్ర తమన్​ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. 'బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరి సినిమాలకు ఒకేసారి మ్యూజిక్ డైరెక్షన్ చేసే అవకాశమొస్తే ఇద్దరిలో ఎవరి చిత్రానికి పని చేస్తారు?' అని అడిగారు. దీనిపై తమన్ ఇచ్చిన సమాధానం టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారిపోయింది. బాలయ్య బాబు, మహేష్ బాబు కలిసి మల్టీసారర్ సినిమా చేస్తారని ఆ సినిమా కథ కూడా తాను విన్నానని చెప్పుకొచ్చాడు. దీనికి యాంకర్ శ్రీరామచంద్రతో పాటు ప్రేక్షకులంతా ఈలలు వేస్తూ గోల చేశారు. https://twitter.com/CINE_EXPLORERS/status/1832658977953607782 రచ్చ చేస్తున్న ఫ్యాన్స్‌! క్లాస్‌, మాస్ కాంబోలో మల్టీస్టారర్ రానున్నట్లు తమన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్‌, బాలయ్య కాంబోలో సినిమా వస్తే రికార్డులు చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. గతంలో సూపర్‌ కృష్ణ (Super Star Krishna), ఎన్టీఆర్‌ (N T Rama Rao)&nbsp; కలిసి నటించిన విషయాన్ని నెట్టింట ప్రస్తావిస్తున్నారు. తిరిగి వారి కుమారులు కూడా కలిసి నటిస్తే చూడాలని ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే తమన్‌ ఈ వ్యాక్యలు సరదాగా చేశారా? లేదా నిజంగానే అందులో వాస్తవముందా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ గురించి ప్రేక్షకుల ఊహలే తప్ప సినిమా కథ, దర్శకత్వం లాంటి వాటి గురించి ఇప్పటివరకూ ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇదే నిజమైతే స్పీకర్లే కాదు బాక్సాఫీస్​ రికార్డులు బద్దలవడం ఖాయమని ఇరు హీరోల అభిమానులు చెబుతున్నారు. ఒకవేళ ఉన్నా.. ఇప్పట్లో లేనట్టే! ‘గుంటూరు కారం’ తర్వాత మహేష్‌ తన తర్వాతి చిత్రాన్ని దర్శకుధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం ఇంకో మూడేళ్లు మహేశ్ మరే మూవీ చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి.. ఆ ఇద్దరూ ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. ఇక రాజమౌళి సినిమా కోసం మహేష్‌ తన లుక్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు.&nbsp; ఇప్పటికే జుట్టు, గడ్డం భారీగా పెంచేశారు. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందనుంది.&nbsp; బాలయ్య బిజీ బిజీ బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్‌ బాబీ కొల్లితో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ (NBK 109) చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మూవీకి థమనే సంగీతం అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్ (Bobby Deol), ఉర్వశి రౌతేలా (Urvashi Rautela) కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొంటూ బాలయ్య బిజీ బిజీగా ఉన్నారు.&nbsp;
    సెప్టెంబర్ 09 , 2024
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    Kalki 2898 AD: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ట్వీట్‌ వెనక నాగ్‌ అశ్విన్‌ మాస్టర్‌ ప్లాన్‌..!&nbsp;
    ప్రభాస్‌ హీరోగా చేస్తోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిస్టిక్ సినిమా 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD)పై వరల్డ్‌ వైడ్‌గా బజ్‌ ఏర్పడింది. ఈ సినిమాను మహానటి డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా కల్కి రికార్డు సృష్టించింది. జూన్‌ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. సినిమాలో రోబిటిక్‌ వెహికల్‌గా కీలక పాత్ర పోషించిన బుజ్జి అనే వాహనాన్ని ఇటీవల అందరీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచాడు. సినిమా కోసం స్పెషల్‌గా తయారు చేయించిన వెహికల్‌ కావడంతో బుజ్జిపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం బుజ్జిని ఉపయోగించుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ప్రమోషన్స్‌కు తెరలేపారు.&nbsp; అపర కుబేరుడికి రిక్వెస్ట్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన టెస్లా అధినేత ఎలా మస్క్‌ (Elon Musk)కు.. 'కల్కి 2898 ఏడీ' డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఓ రిక్వెస్ట్‌ పెట్టారు. బుజ్జి వెహికల్‌ను నడపడానికి ఆహ్వానిస్తున్నట్లు ఓ ట్వీట్‌ను ఎలాన్‌ మస్క్‌కు ట్యాగ్‌ చేశాడు. ‘ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా&nbsp; బుజ్జిని చూడటానికి, డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువుతో సరికొత్తగా డిజైన్‌ చేశాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అద్భుతమైన ఇంజినీరింగ్ వర్క్‌తో నిర్మించబడింది. మీకు బుజ్జి తప్పకుండా మంచి అనుభూతిని ఇస్తుంది' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/nagashwin7/status/1795534761072693594 ట్వీట్‌ వెనక మాస్టర్‌ ప్లాన్‌ అపర కుభేరుడు ఎలాన్‌ మస్క్‌కు నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ పెట్టడం వెనక ఓ మాస్టర్‌ ప్లాన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. కల్కి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎలాన్‌ మస్క్‌ దృష్టిని కల్కి మీదకు మళ్లిస్తే అది గ్లోబల్‌ స్థాయిలో మూవీకి ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అసాధ్యమని తెలిసినా బుజ్జిని నడపాలని, ఇండియాకు రావాలని ఆయన మస్క్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది భారతీయులు ట్వీట్‌పై స్పందిస్తున్నారు. ఈ అడ్వాన్స్‌డ్‌ వెహికల్‌ను నడపాలని మస్క్‌కు సైతం సూచిస్తున్నారు. అటు మస్క్‌ కూడా అశ్విన్‌ ట్వీట్‌కు సమాధానం ఇస్తే అది ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి రావాల్సినంత ప్రమోషన్ వరల్డ్‌ వైడ్‌గా వచ్చేస్తుంది.&nbsp; బుజ్జిని నడిపిన చైతూ బుజ్జి వెహికల్‌పై మనసు పారేసుకున్న టాలీవుడ్‌ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya).. ఇప్పటికే దానిపై ఓ రైడ్‌ కూడా వేశాడు. రేసింగ్ కోర్స్‌లా ఉన్న చోట రయ్‍రయ్ అంటూ ఇటీవల ఈ కారును డ్రైవ్ చేసాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఎక్స్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. అనంతరం బుజ్జి వెహికల్‌కు హాట్యాఫ్‌ చెప్పిన చైతూ.. అదొక ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడాడు. బుజ్జితో తాను సరదాగా గడిపినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; https://twitter.com/chay_akkineni/status/1794262966986215753 బుజ్జి ఎందుకు స్పెషలో తెలుసా? బుజ్జి అనే ఫ్యూచరస్టిక్‌ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వెహికల్‌ తయారీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎంతో శ్రమించారు. మహీంద్రా సంస్థ, జయం ఆటోమోటివ్ భాగస్వామ్యంతో పాటు చాలా మంది ఇంజినీర్లతో బుజ్జి కారును తయారు చేయించారు. ఇది తయారు చేసేందుకు సుమారు రెండేళ్ల కాలం పట్టిందట. బుజ్జి వాహనానికి ముందు రెండు, వెనుక ఒకటే భారీ టైర్లు ఉన్నాయి. ఈ టైర్లు తయారు చేసేందుకే చాలా కసరత్తులు చేశారు. సియట్ కంపెనీతో ఈ టైర్లను తయారు చేయించారు. సుమారు 6 టన్నుల బరువు ఉన్న బుజ్జీని తయారు చేసేందుకు సుమారు రూ.7 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.&nbsp; కల్కి బడ్జెట్‌ తెలిస్తే షాకే! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27వ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్‍తో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమిళ లెజెండ్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, దిశా పటానీ కీలకపాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా వస్తోంది. సుమారు రూ.600 కోట్ల వరకు ఈ చిత్రానికి బడ్జెట్ వెచ్చించినట్టు అంచనాలు ఉన్నాయి. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.
    మే 29 , 2024

    @2021 KTree