తమిళనాట (Tamil Nadu) మరో కొత్త రాజకీయ పార్టీ (Political Party) ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు, దళపతి విజయ్ (thalapathy Vijay) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘తమిళగ వెట్రి కళగం’ (Tamilaga Vettri Kazhagam) పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ నేడు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని, తమ పార్టీ ఎవరికీ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ వెల్లడించారు. ఇక పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే విజయ్ పార్టీ ఏర్పాటు వెనక ఎవరున్నారు? ఆ పార్టీ విజయవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం.
పక్కా ప్లాన్‌తోనే పార్టీ ఏర్పాటు!
విజయ్ రాజకీయ ప్రవేశం (Vijay Political Party) వెనక చాలా రోజుల కృషి ఉంది. పక్కా ప్లాన్‌తోనే ఆయన అడుగులు వేశారు. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే చురుగ్గా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ‘విజయ్ మక్కళ్ ఇయక్కుమ్’ (Vijay Makkal Iyakkham) పేరుతో సేవా సంఘాన్ని స్థాపించి దాని ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు యత్నించారు. ఆ సంఘం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత విద్య, న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతేడాది తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల టాపర్లను తన కార్యాలయానికి రప్పించి బహుమతులు అందజేశారు. నెల క్రితం తమిళనాడును భారీ తుపాను ముంచెత్తగా అప్పుడు కూడా విజయ్ తన వంతు సాయం చేసి బాధితులకు అండగా నిలిచాడు. వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా స్టార్ హీరోగానే కాకుండా మంచి మనిషిగానూ విజయ్ ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించాడు.
తమిళనాట రాజకీయ శూన్యత!
ఒకప్పుడు తమిళ రాజకీయాలు (Vijay Political Party) అనగానే ముందుగా జయలలిత (అన్నా డీఎంకే), కరుణానిధి (డీఎంకే) గుర్తుకు వచ్చేవారు. వారి మరణం తర్వాత ఆ స్థాయిలో చెప్పుకునే నేతలు ఎవరూ ప్రస్తుత రాజకీయాల్లో లేరు. కరుణానిధి కుమారుడు ఎం.కె స్టాలిన్ (M. K. Stalin) ప్రస్తుతం సీఎంగా ఉన్నప్పటికీ ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత కాదు. అటు జయలలిత పార్టీకి (Aiadmk) చీఫ్‌గా ఉన్న మాజీ సీఎం పళనిస్వామి (Edappadi K. Palaniswami) కూడా రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో లేరు. జాతీయ పార్టీల విషయానికి వస్తే భాజాపా, కాంగ్రెస్ పార్టీలకు మెుదటి నుంచి తమిళ రాజకీయాల్లో చెప్పుకోతగ్గ స్థానం లేదు. జయలలిత, కరుణానిధి తర్వాత రజనీకాంత్ ఆ స్థాయి పొలిటిషియన్ అవుతారని తమిళ ప్రజలు భావించినప్పటికీ వారు ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన నాయకుడి లోటు స్పష్టంగా కనిపిస్తున్న వేళ విజయ్ పార్టీ (Tamilaga Vettri Kazhagam)ని ప్రకటించడం అతడికి కలిసి రానుంది.
సనాతన ధర్మంపై దాడి
సీఎం ఎం.కె స్టాలిన్ (M. K. Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటోదన్న విమర్శలు ఉన్నాయి. స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వివక్షను రూపుమాపాలంటే.. అన్నిటికంటే ముందు సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సి ఉంటుందని ఉదయనిధి స్టాలిన్ గతంలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, భాజపా నేతలు తీవ్రంగా స్పందించాయి. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై కూడా వ్యతిరేకతను కూడా పెంచాయని సమాాచారం. మరోవైపు డీఎంకే ప్రభుత్వ అవలంభించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే బలమైన గొంతుక కూడా రాష్ట్ర రాజకీయాల్లో లేదన్నది అక్కడి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ తరుణంలో విజయ్ పార్టీ (Vijay Political Party) బలమైన ప్రజా గొంతుక కాగలదని విశ్లేషణలు ఉన్నాయి.
విజయ్ వెనక కేసీఆర్?(KCR behind Vijay’s political party?)
స్టార్ హీరో విజయ్ పార్టీ పెట్టడం వెనక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ప్రోద్బలం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాదిలో మేలో విజయ్ కేసీఆర్ (Telangana Ex CM)ను కలిసారు. అప్పట్లో విజయ్‌ను సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. శాలువాతో సత్కరించి ఓ జ్ఞాపికను కూడా అందజేశారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అప్పటికే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయాలపై ఆసక్తితో ఉన్న విజయ్.. కేసీఆర్ నుంచి కొన్ని రాజకీయ సలహాలు తీసుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పటి చర్చల ఫలితంగానే విజయ్ రాజకీయ పార్టీ ఆవీర్భవించి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పార్టీ పేరుకు అర్థం ఇదే?
తమిళ సెంటిమెంట్ కలిసి వచ్చేలా విజయ్ (Vijay Political Party) తన పార్టీకి ‘తమిళ వెట్రి కళగం’ పేరును ఫిక్స్ చేశారు. అయితే చాలా మంది ఈ పేరుకు అర్థం ఏంటో తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేస్తున్నారు. తమిళం వెట్రి అంటే విజయం అని అర్థం. కళగం అంటే పార్టీ. దీని ప్రకారం ‘తమిళనాడు సక్సెస్/విక్టరీ పార్టీ’ అని మీనింగ్ వస్తుంది. ప్రస్తుతం (Tamilaga Vettri Kazhagam) తమిళనాడులో సినిమా పరిశ్రమ నుంచి కమల్ హాసన్, ఖుష్బూ, నమిత వంటి వారు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. విజయ్ రాకతో ఆయన పార్టీలోకి మరికొంత మంది నటులు వచ్చే అవకాశముందని సమాచారం.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం