• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గీతాగోవిందం సీక్వెల్‌ పనులు ప్రారంభం!

  టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘గీత గోవిందం’ సీక్వేల్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో చేయాల్సిన సినిమా రద్దు కావడంతో డైరెక్టర్‌ పరుశురామ్‌ సీక్వేల్‌పై దృష్టిసారించినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ కూడా చకచకా రెడీ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. హిట్‌ కోసం ఎదురుచూస్తున్న గీతాఆర్ట్స్‌కు, లైగర్‌తో ఫ్లాప్‌ అందుకున్న విజయ్‌ దేవరకొండకు ఈ సినిమా కీలకం కానుంది. గీతా గోవిందం-2 నిర్మాణ వ్యయం 130కోట్లుగా ఉండొచ్చని చిత్ర బృందం అంచనా వేస్తోంది.

  టీమ్‌ఇండియాపై నోరుపారేసుకున్న పాక్‌ మాజీ కెప్టెన్

  పాక్‌తో పోలిస్తే భారత బౌలింగ్‌ కాస్త బలహీనంగా ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రమీజ్‌ విమర్శించారు. ఈ విషయంలో పాక్‌ బౌలింగ్‌ను టీమ్ఇండియా అనుసరిస్తోందని పేర్కొన్నాడు. అయితే భారత పేస్ దళం పాక్‌ కంటే తక్కువే కానీ.. స్పిన్‌ విభాగం మాత్రం పటిష్ఠమైందని రమీజ్ అన్నారు. ఇటీవల కివీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్‌ బౌలింగ్‌ సాధారణంగా అనిపించిందని చెప్పారు. కివీస్‌ ఆందోళనకు గురై సిరీస్‌ను వదిలేసుకొందని రమీజ్‌ రజా వ్యాఖ్యానించాడు.

  బిల్‌గేట్స్‌ కుకింగ్‌ వీడియోపై ప్రధాని ఆసక్తికర కామెంట్

  బిల్‌గేట్స్‌ కుకింగ్‌ వీడియోపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. భారత వంటకమైన రోటీని బిల్‌గేట్స్‌ తయారు చేయడాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభినందించారు. ‘‘సూపర్‌. ఇప్పుడు భారత్‌లో మిల్లెట్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. తృణధాన్యాలతోనూ ఎన్నో వంటకాలు చేయొచ్చు. వాటిని కూడా ట్రై చేయండి’’ అంటూ గేట్స్‌కు ప్రధాని సూచించారు. కాగా బిలగేట్స్‌తో కలిసి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌ ఐటన్‌ బెర్నాత్‌ చేసిన కుకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

  ‘అనుభవంతో చెప్తున్నా.. భారత్‌కు సవాలు విసరకండి’

  అదానీ గ్రూప్‌ షేర్ల పతనంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా పరోక్షంగా స్పందించారు. అదానీ సంస్థకు మద్దతుగా మాట్లాడారు. ‘ప్రపంచ ఆర్థిక శక్తిగా ఉండాలన్న భారత్‌ లక్ష్యాన్ని ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లు దెబ్బతీస్తాయా..? అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. నేను నా జీవితకాలంలో భూకంపాలు, కరవుకాటకాలు, యుద్ధాలు, ఉగ్రదాడులు, మాంద్యం పరిస్థితులను చాలినన్ని చూశాను. వాటిని చూసిన అనుభవంతో నేను చెప్తున్నాను. ఎప్పుడూ భారత్‌కు సవాళ్లు విసరకండి’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.

  ప్రాక్టీస్‌లో తలమునకలైన టీమ్‌ఇండియా

  ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి జరిగే బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్‌ ​కోసం భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది.కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ , గిల్, జడేజా, సిరాజ్‌, ఉనద్కత్‌ వంటి కీలక ఆటగాళ్లు ప్రాక్టిస్‌లో మునిగిపోయారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పేస్‌ను ఎదుర్కొవడంపై బ్యాటర్లు దృష్టి సారించారు. ఇందుకోసం పేసర్లు సిరాజ్, జయ్‌దేవ్‌ బౌలింగ్‌లో సాధన చేస్తున్నారు. మరోవైపు భారత స్పిన్‌ దళాన్ని ఎదుర్కొనేందుకు కంగారూ బ్యాటర్లు కసరత్తు ప్రారంభించారు. స్పిన్నర్లు నాథన్ లియాన్, ఆష్టన్ అగర్, టాడ్‌ మర్ఫీ, మిచెల్‌ స్వేప్సన్ చేత బౌలింగ్‌ … Read more

  కియారా-సిద్దార్థ్‌ పెళ్లి కోసం ముస్తాబవుతున్న రాజకోట

  బాలీవుడ్ నటులు కియారా అద్వానీ, నటుడు సిద్దార్ద్ మల్హోత్రా పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 6న రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు మొత్తం 150మంది వీవీఐపీలను మాత్రమే ఈ వెడ్డింగ్‌కి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా ఫిబ్రవరి 5న జైసల్మేర్ చేరుకోనున్నట్లు సమాచారం. అటు వివాహ ఏర్పాట్లను ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ చూస్తోంది.

  హిందుత్వంపై రిషి సునాక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  బ్రిటన్‌ పీఎంగా బాధ్యతలు చేపట్టి 100 రోజులైన సందర్భగా రిషి సునాక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంలో ధర్మం ఉందని అది కర్తవ్యాన్ని బోదిస్తుందని పేర్కొన్నారు. మీ ఆస్తి ఎంత అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా తన బ్యాంకు ఖాతాలో ఎంత ఉందనేది ఇప్పుడు ముఖ్యం కాదని రిషి అన్నారు. తన విలువలు, తీసుకుంటున్న చర్యలే ఇక్కడ ప్రాధాన్యమని బదులిచ్చారు. రిషి సునాక్‌ గతేడాది అక్టోబరు 25న బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

  గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు

  తెలంగాణలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి 9,51,321 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. శుక్రవారం సాయంత్రం దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో ఈ మేరకు అభ్యర్థుల వివరాలు ప్రకటించింది. కాగా మొదట 9,168 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కానీ తుది నోటిఫికేషన్‌లో మాత్రం పోస్టుల సంఖ్య 8039గా పేర్కొంది

  భారత స్టార్ జిమ్నాస్టర్‌పై 21 నెలల నిషేధం

  ఒలింపిక్స్ పతక విజేత, స్టార్​ జిమ్నాస్ట్​ దీపా కర్మాకర్​పై అంతర్జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ-ఐటీఏ నిషేధం విధించింది.నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నందుకు గాను ఐటీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2021 అక్టోబర్​లో దీపా కర్మాకర్‌పై నిర్వహించిన శాంపిల్‌- ఏ టెస్టు రిజల్ట్‌ పాజిటివ్‌గా వచ్చింది. అయినప్పటికీ ఈ విషయాన్ని ఆమె బయటపెట్టలేదు. అయితే తాజాగా ఈ విషయం వెలుగుచూడటంతో ఐటీఐ ఆమెపై సస్పెన్షన్​ వేటు వేసింది. ఈ నిషేధంతో దీపా పలు అంతర్జాతీయ టోర్నీలకు దూరం కానుంది.

  మూఢనమ్మకానికి బలైన 3 నెలల చిన్నారి

  మధ్యప్రదేశ్‌: భోపాల్‌లో దారుణం జరిగింది. మూఢనమ్మకంతో సొంత తల్లిదండ్రులే తమ చిన్నారిని బలిగొన్నారు.. కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి రుచితా కోల్ నిమోనియా బారినపడింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు స్థానికంగా ఉండే మంత్రగాళ్లకు పాపను చూపించారు. అక్కడ వ్యాధి తగ్గాలంటూ చిన్నారి పొట్టపై కాలిన ఇనుపరాడ్డుతో 51 సార్లు వాతలు పెట్టారు. ఆ తర్వాత పాప పరిస్థితి మరింత దిగజారింది. పదిహేను రోజులు మృత్యువుతో పోరాడి మరణించింది.