• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

    ఈ నెల 14 నుంచి తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పెరటాసి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 19న సాయంత్రం 6.30 గంటలకు శ్రీవారి గరుడ ఉత్సవాన్ని ప్రారంభించనున్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా 14వ తేదీ నుంచి 23 వరకు స్వామివారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

    ‘రామ మందిరం ప్రతిష్ఠ రోజు వారు రావొద్దు’

    అయోధ్యలో జనవరి 22న జరిగే రామ మందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విదేశీ రాయబారులు రావొద్దని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వారికి తగిన ఏర్పాట్లు చేయలేమని, అధికారులు సైతం ప్రొటోకాల్ పాటించే పరిస్థితి ఉండదని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులను విడతల వారీగా ఆహ్వానించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి 26 తర్వాత భారత్‌తో పాటు విదేశాల్లోని భక్తులకు సైతం అవకాశం కల్పిస్తామన్నారు.

    ‘స్మార్ట్ ఫోన్’తో నోటి కేన్సర్‌ గుర్తింపు

    నోటి కేన్సర్‌ను గుర్తించేందుకు స్పెషల్ స్మార్ట్ ఫోన్ త్వరలో ప్రభుత్వ వైద్యులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐ హబ్, ఏఎన్ఏఐ ప్రతినిధులు దీనిని కనుగొన్నారు. ఈ ఫోన్‌తో నోటిని ఫొటో తీస్తే అందులో ఉన్న ఏఐ కేన్సర్ ఉందా లేదా అనేది చెబుతుంది. బయాప్సీ అవసరం లేకుండానే వ్యాధిని గుర్తించడంతో పాటు ఏ దశలో ఉందనేది తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌తో ఆరోగ్య సర్వే నిర్వహించేటప్పుడు నోటి కేన్సర్‌ను సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    చిరు మూవీ టైటిల్ ‘ముల్లోక వీరుడు’?

    వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరు గెటప్‌‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. ఈ సోషియో ఫాంటసీ మూవీలో చిరు పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటుందని చెబుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

    చంద్రబాబుకు స్కిన్ అలర్జీ

    రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. ఉక్కపోత కారణంగా ఆయనకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు ప్రకటించారు.

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    హైదరాబాద్ ఇన్‌చార్జ్‌ సీపీగా విక్రమ్‌సింగ్

    హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో ఇన్‌చార్జ్ సీపీగా విక్రమ్‌సింగ్ మాన్ నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురు పోలీస్ కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, పది మంది ఎస్పీలతో సహా మొత్తం 20 మంది ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బదిలీ అయిన వారి స్థానంలో ఇన్‌చార్జ్‌లను నియమించారు.

    సినీ అభిమానులకు బంపర్ ఆఫర్

    ఈ నెల 13న నేషనల్ మూవీ డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సినీ అభిమానులకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో కేవలం రూ.99కే టికెట్ బుక్ చేసుకోవచ్చిన చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన నగరాలు, థియేటర్లలో మాత్రమే ఉంటుంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, డిలైట్, ఎం2కేలో ఆన్‌లైన్ టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

    గాజా స్ట్రిప్‌లో తీవ్రంగా ఫుడ్ కొరత

    గాజా స్ట్రిప్ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల కొరత సైతం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంపై గత గురువారం జరిగిన రాకెట్ల దాడిలో వెయ్యి మందకి పైగా పౌరులు మృతి చెందారు. యుద్ధ వాతావరణం కారణంగా అక్కడి ప్రజలు చాలా మంది ఇజ్రాయెల్, ఈజిప్ట్ భూ భాగంలోకి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు వారిని నిలువరించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

    మరికాసేపట్లో ‘సైంధవ్’ టీజర్

    ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ కాబోతుందనే చర్చ మొదలైంది. వెంకటేశ్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ఈ మూవీని శైలేశ్ కొలను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ‘సైంధవ్’ రాబోతోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు.