• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బకాయిలుంటే ట్యాక్స్‌ రీఫండ్‌లో కటింగ్‌

  ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సరికొత్త ప్రణాళిక రచించింది. బకాయిలున్న పన్ను చెల్లింపుదారులు తమకు రావాల్సిన ట్యాక్స్‌ రీఫండ్‌తో బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపింది. రీఫండ్‌ల జారీని త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఐటీ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

  వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

  తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని పేర్కొంది. సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అవయవాలను దానం చేసేందుకు కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆర్గాన్‌ డోనర్స్‌ అంత్యక్రియలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్టాలిన్‌ పేర్కొన్నారు.

  జమిలి ఎన్నికల కమిటీ భేటీ అందుకేనా?

  మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికల కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరణకు గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, గుర్తింపు పొందిన పతిపక్షపార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటనను కమిటీ విడుదల చేసింది.

  క్రికెట్‌ స్టేడియానికి మోదీ శంకుస్థాపన

  ప్రధాని మోదీ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. మహదేవుడి నగరంలో నిర్మిస్తున్న ఈ స్టేడియం ఆ మహదేవుడికే అంకితం ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. కాశీలో ఉన్న క్రికెట్‌ అభిమానులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడలు-2023లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, క్రీడా జట్లకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మోదీతో పాటు సీఎం యోగీ ఆదిత్యనాథ్, భారత్ మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌,సచిన్‌ తదితరులు ఉన్నారు.

  కాశీ విశ్వనాథుడికి సచిన్ ప్రత్యేక పూజలు

  కాశీ విశ్వనాథుడికి సచిన్ టెండూల్కర్ ప్రత్యేక పూజలు చేశారు. శివలింగానికి గంగాభిషేకం చేసి తరించారు. ఆయనతో పాటు బీసీసీఐ సెక్రెటరీ జైషా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వారణాసి ఆలయంలో ప్రార్థనలు చేశారు.

  9 వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

  దేశంలో ఒకేసారి 9 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ప్రధాని మోదీ వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాల మీదుగా 2 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తుంది. మరోకటి విజయవాడ-చెన్నై మధ్య నడుస్తుంది. కొత్తగా వచ్చే వాటితో కలిసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంఖ్య 34కు చేరనుంది.

  ఎన్డీయేలో చేరిన జేడీఎస్

  కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా జేడీఎస్ పార్టీ ఎన్డీయే కూటమిలో చేరింది. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా నేతృత్వంలో జేడీఎస్ నేత కుమారస్వామి ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే కర్ణాటకలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపులకు సంబంధించి వివరాలు మాత్రం వెల్లడించలేదు. తాజా చేరికతో గత కొంత కాలంగా బీజేపీ-జేడీఎస్‌ల మధ్య పొత్తులపై ఉహాగానాలకు తెరపడినట్లైంది.

  9 వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

  దేశంలో ఒకేసారి 9 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24న ప్రధాని మోదీ వర్చువల్‌గా వీటిని ప్రారంభించనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాల మీదుగా 2 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ మధ్య నడుస్తుంది. మరోకటి విజయవాడ-చెన్నై మధ్య నడుస్తుంది. కొత్తగా వచ్చే వాటితో కలిసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సంఖ్య 34కు చేరనుంది.

  ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్య‌లు

  ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీకి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 25 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. లోక్‌సభలో బీజేపీ ఎంపీ బిధురి, బీఎస్పీ ముస్లీం ఎంపీని ఉగ్రవాదిగా వర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో బిధురిని స్పీకర్ ఓంబిర్లా తీవ్రంగా మందలించారు. మ‌రోసారి ఇలా జ‌రిగితే క‌ఠిన చర్య‌లు తీసుకుంటామని ఆయ‌నను హెచ్చ‌రించారు. దీనిపై సదరు ఎంపీ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. బిధురిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  ల్యాండర్ కమ్యూనికేషన్‌కు యత్నం

  జాబిల్లిపై నిద్రిస్తున్న ప్రజ్ఙాన్ రోవర్‌లు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. తాజాగా వాటిని తిరిగి పనిచేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో ట్వీట్ చేస్తూ.. ‘విక్రమ్ ల్యాండర్, రోవర్‌లు చంద్రుడిపై మేల్కొంటాయా? అన్న విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. చంద్రయాన్-3తో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని ఇస్రో పేర్కొంది.