• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 గంటలకు సెన్సెక్స్‌ 151 పాయింట్ల లాభంతో 66,174 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 19,858 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు ఉండడంతో మార్కెట్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. .

    ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. తప్పిన ప్రమాదం

    సుందర్‌గఢ్‌ జిల్లాలో మూడు రైళ్లకు ప్రమాదం తప్పింది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో సహా రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చినా అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మెము రైలు, పాసింజర్‌ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైన్లో ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇదే ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. మెము-పాసింజరు రైళ్లు వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో ప్రమాదం జరగలేదు. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.

    కాంగ్రెస్ ఉంటే దేశాభివృద్ధి కష్టమే: మోదీ

    కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రతీక అని విమర్శించారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ చోరులకు, అల్లరి మూకలకు అప్పగించిందని ఆరోపించారు.

    Realme: స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

    చైనీస్‌ మెుబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్‌లో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్‌ చేస్తూ టెక్‌ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme C65 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. దేశంలో రియల్‌మీ సీ-సిరీస్‌ నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్‌ ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో YouSay Webపై క్లిక్ చేసి చూసేయండి. Realme C65 … Read more

    మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు

    టమాటా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీపావళి తర్వాత మార్కెట్‌లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలికిన ధర ఇప్పుడు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. టమాటాలను విక్రయించేందుకు నాగ్‌పూర్‌లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి.

    ఉద్యోగం కోసం తండ్రిపై కాల్పులు

    ప్రభుత్వ ఉద్యోగం కోసం ఓ కుమారుడు తండ్రిని హతమార్చాలనుకున్నాడు. అందుకు కిరాయి హంతకులను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. రామ్‌జీ అనే వ్యక్తి సీసీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం లేని తన 25 ఏళ్ల కుమారుడు అమిత్‌ ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి మరణిస్తే ఆ ఉద్యోగం తనకే వస్తుందని కుమారుడు ఆశపడ్డాడు. దీంతో తండ్రినే చంపేందుకు పథకం రచించాడు. అందుకు కిరాయి హంతకులకు సుపారి ఇచ్చి తండ్రిపై కాల్పులు జరిపించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారించగా కుమారుడే ఈ అఘాయిత్యానికి … Read more

    మద్యం మత్తులో విమాన సిబ్బందితో అసభ్య ప్రవర్తన

    ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరు నుంచి జైపుర్‌కు వెళుతున్న విమానంలో జరిగింది. అతని ప్రవర్తనతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జైపుర్‌లో విమానం దిగిన తర్వాత సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ అందులో పేర్కొన్నారు.

    స్థిరంగా పసిడి ధరలు

    దీపావళి నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్, విజయవాడలో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 5655, కాగా 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 6169గా ఉంది. గుంటూరు, ప్రొద్దుటూరు, ముంబై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు ఉంటాయి. చెన్నైలో నేడు ఒక గ్రామ్ బంగారం ధరలు రూ. 5700 (22 క్యారెట్స్), రూ. 6218 (24 క్యారెట్స్)గా ఉన్నాయి.నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలలో ఎటువంటి మార్పు లేదు.

    కొత్త రూపంలో కోవిడ్‌-19 వ్యాప్తి

    కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను మార్చుకుంటుంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూకేలో వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు.

    శబరిమలకు పోటెత్తిన భక్తులు

    కేరళలోని శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి, స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు పోటెత్తారు. రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. దర్శనం కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక నుంచి వేల మంది భక్తులు తరలివచ్చారు. రెండు నెలల పాటు కొనసాగే మణికంఠుడి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.