భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్‌లు భారీ లాభాల్లో ముగిశాయి. వారాంతం రోజున సెన్సెక్స్ 909.64 పాయింట్లు లాభపడి 60,841.88 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 243.65 పాయింట్ల లాభంతో 17,854.05 దగ్గర స్థిరపడింది. టీసీఎస్, టైటాన్, ఐసీసీ, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంకు, కోల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇక డాలరుతో పోలీస్తే రూపాయి మారకం విలువ 81.86గా ఉంది.