• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి మృతి

    HYD: సికింద్రాబాద్‌ జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్‌ బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సోదరుడికి తోడుగా స్కూల్‌ బస్సు వద్దకు వచ్చిన చిన్నారి భవిష్యను. ప్రమాదవశాత్తు వాహనం ముందు చక్రాల కిందపడి మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసునమోదు చేశారు.

    కుమార్తెకు ఉరివేసి.. దంపతుల ఆత్మహత్య

    హైదరాబాద్ నగరం ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల కుమార్తెకు ఉరివేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సురేశ్‌బాబు, చిత్రలేఖ వారి కుమార్తె తేజస్విగా పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వారిది కర్నూలు జిల్లా లక్ష్మీపురమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    వేశ్యతో రూమ్ షేర్ చేసుకుని మోసపోయాడు

    HYD: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. తనతో పాటు రూమ్ షేర్ చేసుకుంటున్న సదరు మహిళ వేశ్య అని తెలియడంతో రూమ్ ఖాళీ చేయమని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి లైంగిక దాడి చేశాడని ఉద్యోగిపై కేసు పెట్టింది. అంతటితో ఆగకుండా సన్నితంగా ఉన్న ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించి రూ.4.7లక్షలు తీసుకుంది. అయినా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఉద్యోగి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కోపంతో రాత్రి పూట ఇద్దరు వ్యక్తులతో ఉద్యోగిపై … Read more

    ప్రమాదంపై సీఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి

    HYD: నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు గవర్నర్‌ సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబానికి సంతాపం తెలిపిన కేసీఆర్‌ గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

    ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

    HYD: నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని నాలుగంతస్తుల భవనంలో చెలరేగిన మంటల్లో తొమ్మిది మంది మృతిచెందారు. మృతుల్లో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనాస్థలికి 4 ఫైరింజన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్‌ తయారీ కోసం వాడే కెమికల్స్‌ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్నట్లు సమాచారం. యజమాని జైశ్వాల్‌కు ఓ ప్లాస్టిక్‌ తయారీ ఫ్యాక్టరీ ఉన్నట్లు గుర్తించారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Major #FireAccident out break … Read more

    హైదరాబాద్‌లో భారీ వర్షం

    హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్‌, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, మూసాపేట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కేపీహెచ్‌బీ వద్ద రహదారిపై నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు.

    హోర్డింగ్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

    రూ.1000 కోసం ఓ యువకుడు హోర్డింగ్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రవీందర్‌ అనే వ్యక్తి పెయింటింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ వ్యక్తి అతడికి రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో రవీందర్ హోర్ఢింగ్ ఎక్కి డబ్బు ఇప్పించాలంటూ హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది ద్వారా అతడిని కిందకు దింపారు. యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

    చంద్రబాబుతో పవన్‌ కీలక భేటి

    HYD: తెదేపా అధినేత చంద్రబాబును జనసేనాని పవన్‌ కల్యాణ్ హైదరాబాద్‌లో కలిశారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఏపీకి సంబంధించి 10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై నేతలు చర్చించారు.

    ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు

    HYD: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. ఈ ఉదయమే వైద్య పరీక్షల కోసం ఆయన గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షల అనంతరం చంద్రబాబు అక్కడే అడ్మిట్‌ అయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయన వైద్యుల సంరక్షణలో ఒకరోజు పాటు ఉండే అవకాశం ఉంది.

    ప్రియుడిపై కోపంతో ప్రేయసి ఆత్మహత్య

    ప్రియుడిపై కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) హైదరాబాద్‌లోని గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఆమెకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో నెల్లూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో మనోజ్‌ను తన ఇంటి వద్దకు రమ్మని చెప్పింది, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతడు రాకపోవడంతో ఖుష్భు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.