• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రియుడిపై కోపంతో ప్రేయసి ఆత్మహత్య

    ప్రియుడిపై కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) హైదరాబాద్‌లోని గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఆమెకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో నెల్లూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో మనోజ్‌ను తన ఇంటి వద్దకు రమ్మని చెప్పింది, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతడు రాకపోవడంతో ఖుష్భు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

    భార్యపై అనుమానంతో భర్త హత్య

    హైదరాబాద్‌ చంపాపేట్‌లో జరిగిన స్వప్న (20) హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్త ప్రేమ్‌కుమార్‌ ఆమెను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారించారు. భార్య మరోకరితో చనువుగా ఉండటం చూసి కోపంతో భార్త వారిద్దరిపై దాడి చేశాడు. ఇంట్లోని కత్తితో భార్య గొంతుకోశాడు. కళ్లెదుట స్నేహితురాలు రక్తపుమడుగులో పడిపోవడంతో యువకుడు ప్రేమ్‌కుమార్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కుమార్‌ను మేడమీద నుంచి కిందకు తోశాడు. అనంతరం ఆ యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ‘కాంగ్రెస్‌ వస్తే రాష్ట్రం నాశనమే’

    HYD: రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే భారాస ప్రభుత్వం తిరిగి రావాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డిని ఇంటికెళ్లి కలిసిన మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.

    పనిచేస్తున్న బడికే కన్నం వేసిన టీచర్

    HYD: ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి తన మిత్రుడితో కలిసి పనిచేస్తున్న పాఠశాలలోనే చోరీ చేశాడు. బోరబండ ప్రాంతానికి చెందిన సంతోష్‌ (34) వివేకానంద నగర్‌లోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఫీజుల రూపంలో వచ్చే డబ్బును కొట్టేద్దామని సంతోష్ తన స్నేహితుడైన ఇసాక్‌ అహ్మద్‌ (27)కు చెప్పాడు. ఈ నెల 17న ఇద్దరూ కలిసి స్కూల్‌లోని రూ.11.50లక్షల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానస్పదంగా ఉన్న సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.

    ఘనంగా దుర్గదేవి నిమజ్జనోత్సవం

    TG: హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం కొనసాగుతోంది. దేవీ శరన్న నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలు భారీ వాహనాల్లో ఎన్టీఆర్‌ మార్గ్‌ వద్దకు చేరుకుంటున్నాయి. దీంతో ట్యాంక్‌బండ్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. మరోవైపు దుర్గాదేవి నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు ట్యాంక్‌బండ్‌ వద్దకు తరలివస్తున్నారు.

    సికింద్రాబాద్‌లో భారీ అగ్రి ప్రమాదం

    సికింద్రాబాద్‌లో భారీ అగ్రి ప్రమాదం సంభవించింది. క్లాక్‌ టవర్‌ సమీపంలో ఉన్న నవకేతన్‌ కాంప్లెక్స్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నవకేతన్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న ప్రజలు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది.

    వివాహితపై ఇద్దరు మహిళల అసహజ శృంగారం

    హైదరాబాద్- యూసుఫ్ గూడలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు దాడి చేసి.. అసహజ శృంగారానికి పాల్పడ్డారు. ఆమెపై తీవ్రంగా దాడి చేసి వంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం అపహరించారు. ఓ వివాహిత భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బస్టాప్‌లో తలదాచుకుంటున్న ఆమె దగ్గరకు ఇద్దరు మహిళలు సమీపించారు. మాయమాటలు చెప్పి వారింటికి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. తెరుకున్న వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    మహిళకు మత్తుమందు ఇచ్చి బంగారం చోరి

    మహిళకు మత్తుమందు ఇచ్చి కొందరు దుండగులు నగలు దోపిడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తలో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆమె వద్దకు వెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. దీంతో కూల్‌డ్రింక్ తాగి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు సదరు మహిళ మెడలోని బంగారాన్ని లాక్కెళ్లిపోయారు. అనంతరం బాధిత మహిళ భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

    నేడు HCA ఎన్నికలు

    నేడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో హెచ్‌సీఎ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 173 మంది ఓటు వేయనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు. ఫలితాలు సాయంత్రం 4 తర్వాత వెలువడనున్నాయి.

    భార్యను చంపి భర్త ఆత్మహత్య

    HYD: నాగోలులో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆపై భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబకలహాల కారణంగానే భర్త భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.