• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు HCA ఎన్నికలు

    నేడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో హెచ్‌సీఎ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 173 మంది ఓటు వేయనున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు. ఫలితాలు సాయంత్రం 4 తర్వాత వెలువడనున్నాయి.

    భార్యను చంపి భర్త ఆత్మహత్య

    HYD: నాగోలులో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. ఆపై భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబకలహాల కారణంగానే భర్త భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    కాంగ్రెస్‌లో మొదలైన అసమ్మతి సెగ

    కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో ఆ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. మేడ్చల్ సీటు ఆశించి భంగపడ్డ సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశా. రేవంత్ రెడ్డి నాకు అన్యాయం చేశావు. నీ అంతు చూస్తా. మేడ్చల్ జనరల్ సీటులో ‌బీసీకి టికెట్ ఇచ్చారు. ఇక పార్టీకోసం కష్టపడే ఓపికలేదు, త్వరలోనే నా కార్యాచరణను ప్రకటిస్తా అని చెప్పారు. మరోవైపు ఓల్డ్ సిటీలో టికెట్ల కేటాయింపుపై పలువురు నేతలు గాంధీ భవన్‌ను ముట్టడించి … Read more

    హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య

    హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో విద్యార్థిని మృతి కలకలం రేపుతోంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ప్రవళిక (23) అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

    మెట్రోలో CBN అభిమానుల నిరసన

    TG: చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ ఆయన అభిమానులు హైదరాబాద్‌లో ‘లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సిటీ పోలీసులు అన్నీ మెట్రో స్టేషన్ల ద్వారాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నల్ల చొక్కాలు ధరించిన వారిని లోనికి అనుమతించడం లేదు. అటు చంద్రబాబు అభిమానులు భారీగా తరలిరావడంతో మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. కొద్దిసేపటి తర్వాత ప్రయాణికులను అనుమతించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గారికి మద్దతుగా "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" కార్యక్రమం. చంద్రబాబు … Read more

    గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్య

    HYD: గ్రూప్‌-2 అభ్యర్థిని ఆత్మహత్యకు పాల్పడటం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. మృతురాలు వరంగల్‌ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23)గా గుర్తించారు. హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఆమె సూసైడ్‌ చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని తరలించే యత్నం చేయగా అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభ్యర్థులు అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడడం వల్లే ఆమె సూసైడ్‌ చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Massive protest after a 23 year … Read more

    ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం

    డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని ప్రగతిభవన్ ఎదుట ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్ (40) తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ముంజూరైనట్లు ఇటీవల అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత సదరు అధికారుల చుట్టూ తిరిగినా వారు స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన మహేందర్ కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

    ఐసెట్ అభ్యర్థులకు స్పెషల్ కౌన్సెలింగ్

    తెలంగాణలో ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించి MBA, MCA కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల 15న స్లాట్ బుకింగ్.. 16 నుంచి 17 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఉంటుంది. 20న సీట్ల కేటాయింపు చేయనుండగా.. 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 30 నుంచి 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.

    శంషాబాద్‌లో భారీ భూ కుంభ కోణం

    శంషాబాద్ పరిధిలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొంత ప్రభుత్వాధికారులు, రియల్టర్‌లతో కలిసి రూ.1000 కోట్ల విలువైన భూముల రికార్డులు మార్చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని రియాల్టర్లకు అప్పగించారు. పెద్ద గొల్కొండ గ్రామంలో 190 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 25 ఏళ్ల కిందట ఈ భూమిని పేద రైతులకు పంపిణీ చేసింది. ఇవి అసైన్డ్ భూములు వీటిని కొనడం గాని అమ్మటం గాని చేయరాదు. అయితే వీటి రికార్డులు మార్చి రియాల్టర్లకు అప్పగించారు ప్రభుత్వాధికారులు.

    రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

    ఖాజీపేట నుంచి పూణె వరకు కొత్తగా మరో ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి నుంచే ఈ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పూణె- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఖాజీపేట వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో వరంగల్, జనగామ, భువనగిరితో పాటు మరికొన్ని జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.