• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కూకట్‌పల్లి బరిలో బండ్ల గణేశ్‌!

    HYD: కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి అధిష్ఠానం ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు.

    ‘తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’

    సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతంలో గోదావరి తలాపున వెళ్తున్నా నీళ్ల కోసం అవస్థలు పడ్డామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరుగుతున్న బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 12.70 లక్షల మందికి కళ్యాణలక్ష్మి అందించామని హరీశ్ రావు పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులు పెరిగితే ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు పెరుగుతున్నాయని చెప్పారు.

    ఈ నెల 10న తెలంగాణకు అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 10న తెలంగాణ రానున్నారు. ఆయన ఒకే రోజు రెండు సభల్లో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. 10న ఉదయం ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడలో జరిగే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. త్వరలో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి.

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో ఇన్పెక్షన్

    సీఎం కేసీఆర్‌కు ఛాతిలో బాక్టీరియల్ ఇన్పెక్షన్ సోకిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎం కేసీఆర్ గత మూడు వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆయన కోలుకుంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    తమ్ముడిని నరికి చంపిన అన్న

    హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను వేధిస్తున్నాడన్న అనుమానంతో అన్న తమ్ముడిని హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. షబ్బీర్‌ అహ్మద్‌ తన భార్యను తమ్ముడు సాజిద్‌ వేధిస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

    ప్రియుడు మృతి..ప్రేయసి ఆత్మహత్య

    hyd: గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. నేహా అనే యువతి (19) స్థానికంగా కేఫ్‌లో పనిచేస్తుంది. అదే కేఫ్‌లో పనిచేస్తున్న సహా ఉద్యోగి సల్మాన్‌ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సల్మాన్‌..తన నివాసంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆమె ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

    లండన్‌లో హైదరాబాది దారుణ హత్య

    లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రైసుద్దీన్.. స్నేహితుడితో వెళ్తుండగా హత్య చేసి అతని వద్ద ఉన్న డబ్బు, వస్తువులను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. కుమార్తె పెళ్లి డబ్బుల కోసం గతేడాది రైసుద్దీన్ లండన్ వెళ్లాడు. ఇంటి దగ్గర పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. లండన్‌లో అన్ని పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్‌కు తెప్పించాలని ప్రభుత్వాన్ని … Read more

    రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల పంట

    హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖకు ఫ్యాన్సి నంబర్ల వేలం.. కాసుల వర్షం కురిపిస్తోంది. రంగారెడ్డి, మెడ్చల్, హైదరాబాద్‌లో గత నెల నంబర్ల వేలం ద్వారా రూ.38.48 కోట్ల ఆదాయం ఆర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా 0009, 007, 9999, 0001 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 0009 నంబర్‌ను రూ.10.5 లక్షలకు ఆన్‌లైన్‌ వేలంలో గెలుపొందాడు. అలాగే 9999 నంబర్‌కు రూ.21 లక్షలు ధర పలికినట్లు చెప్పారు.

    LIVE: బాలాపూర్ లడ్డు వేలం

    తెలంగాణలో బాలాపూర్ వినాయకుడి లడ్డుకు ప్రత్యేకత ఉంది. నవరాత్రులు పూజలందుకున్న బాలాపూర్ గణేషుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈక్రమంలో లడ్డుకు వేలం పాట పాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

    రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్

    రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో కేరళ- వయనాడ్ కాకుండా.. హైదరాబాద్ వచ్చి తన మీద పోటీ చేయాలని సవాలు విసిరారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణాలో ఎంఐఎం పోటీ చేసిన దగ్గర ఎంఐఎంకి వోట్ వేయాలని ముస్లిం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోటీ చేయని దగ్గర బీఆర్ఎస్ పార్టీకి వోట్ వెయ్యాలని సూచించారు. https://x.com/TeluguScribe/status/1706223721248354682?s=20