కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రైలు టికెట్లపై రాయితీ సర్వీసులను తిరిగి పునరుద్ధరించనున్నట్లు సమాచారం. సీనియర్ సిటిజెన్లకు టికెట్లలో రాయితీలు కల్పించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. రాధామోహన్ సింగ్ నేతృత్వంలోని కమిటీ రైల్వేశాఖకు సిఫార్సు చేసింది. సీనియర్ సిటిజన్లకు రాయితీ ప్రకటించే విషయంలో సానుభూతితో చూడాలని రైల్వే శాఖను కోరింది. కాగా కరోనా కాలం నుంచి రైల్వే శాఖ రాయితీలు నిలిపివేసింది.