• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరీక్షల్లో తలను కవర్‌ చేయడం నిషేధం

    కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. బ్లూటూత్ డివైసెస్‌ ద్వారా అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

    గోవులతో తొక్కించుకున్న భక్తులు

    మధ్యప్రదేశ్‌లోని బిధావత్‌ గ్రామంలో భక్తులు గోవులతో తొక్కించుకున్నారు. దీపావళి రోజు గ్రామస్థులు గోవులకు పూజలు చేశారు. ఆ తర్వాత వాటన్నిటినీ ఒకేచోటు చేర్చారు. డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. తర్వాత పురుషులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని భక్తులు పేర్కొన్నారు. గోమాతలో దేవతలు ఉంటారని అందుకే వాటితో తొక్కించుటామని చెబుతున్నారు.

    చిన్నారిపై ఎస్సై లైంగిక దాడి

    రాజస్థాన్‌ దౌసా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి చిన్నారిపై లైంగిక దాడి చేశాడు. భూపేంద్ర సింగ్‌ అనే వ్యక్తి రహువాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ అతడున్న ఇంటి ముందుకు వచ్చింది. ఆ చిన్నారికి చాకెట్లు ఇస్తానని ఆశజూపి తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లికి వివరించడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు నిందితుడినిపై కేసు నమోదు చేశారు.

    బస్సు హారన్‌ కొట్టాడని.. డ్రైవర్‌పై దాడి

    బస్సు హారన్‌ కొట్టాడని డ్రైవర్‌పై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు పుట్టినరోజు వేడుకలను నగరంలోని ప్రధాన రోడ్డుపై నిర్వహించారు. ఆరుగురు యువకులు కలిసి నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు అడ్డు పెట్టి కేకులు కోస్తూ హడావుడి చేశారు. అదే సమయంలో ట్రావెల్స్‌ బస్సు వెళ్తూ రోడ్డుకు అడ్డుగా ఉన్న యువకులు తప్పుకోవాలని డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు. ఆగ్రహించిన యువకులు బస్సుపై రాళ్లు విసిరి డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.

    హైదరాబాద్‌లో మోదీ రోడ్‌ షో

    తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. వరుసగా మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈనెల 25న కరీంనగర్, 26న నిర్మల్ సభల్లో పాల్గొననున్నారు. చివరిగా 27న మోదీ హైదరాబాద్‌లో రోడ్ షో చేపట్టనున్నారు.

    కాంగ్రెస్ ప్రచారకురాలిగా మాజీ బీజేపీ నేత

    బీజేపీ టికెట్ ఆశించిన సాధ్వి అనాది సరస్వతికి ఆ పార్టీ షాకిచ్చింది. చివరి నిమిషంలో రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ ఉత్తర నియోజకవర్గం టికెట్ ఇతరులకు కేటాయించారు. దీంతో ఆమె తీవ్ర నిరాసకు గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన సరస్వతికి రాష్ట్ర ప్రచారకర్తగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పార్టీ ఆదేశానుసారం ప్రచారం ప్రారంభిస్తానని తెలిపారు.

    ‘సత్యభామ’ టీజర్‌ రిలీజ్‌

    హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సత్యభామ’ చిత్రం నుంచి తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేసింది. ఇందులో ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే క్రమంలో సత్యభామ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనే ఆసక్తికర కోణంలో టీజర్‌ ఉంది. ఈ సినిమాకు సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు. What if Anirudh scores BGM for Satyabhama teaser..@MsKajalAggarwal Screen Presence 🥵🔥#SatyabhamaTeaser #KajalAggarwal pic.twitter.com/MsSzZhE3GF — Nani45 (@NaniTarak45) November 10, 2023

    యూట్యూబ్‌లో “హుకుం” సాంగ్ హవా

    సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన జైలర్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం లోని పాటలు అన్నీ కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. అయితే హుకుమ్ లిరికల్ వీడియో యూ ట్యూబ్ లో మరొక సెన్సేషన్ క్రియేట్ చేయసింది. ఇప్పటి వరకూ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టడం జరిగింది.

    తమిళనాడులో భారీ వర్షాలు

    తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించింది. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబ‌త్తూరు, తిరువూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండ‌పోత వాన కురిసింది.

    శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

    తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.. అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.