• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెత్తకుప్పలో రూ.25 కోట్లు..!

    బెంగళూరులో చెత్త ఏరుకునే వ్యక్తికి రూ.25 కోట్లు దొరికాయి. అయితే అది భారతీయ కరెన్సీ కాదు. అమెరికా డాలర్లు. నగర శివారులో చెత్త ఏరుకుంటుండగా 23 కట్టల అమెరికన్‌ డాలర్లు అతడికి కనిపించాయి. ఆ మొత్తాన్ని సదరు వ్యక్తి తన ఇంటి యజమాని అప్పగించాడు. అతను ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. దొరికిన కరెన్నీ విలువ రూ.25 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అవి ఒరిజినల్‌ డాలర్లేనా?లేదంటే నకిలీవా? అని గుర్తించేందుకు వాటిని పోలీసులు ఆర్బీఐకి పంపించారు.

    నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్‌ 188 పాయింట్ల నష్టంతో 64,643 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 19,348 దగ్గర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఒక్క టాటా మోటార్స్‌ తప్ప మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌ నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

    రోడ్డు ప్రమాదం.. ముగ్గరు మృతి

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్‌ప్లాజా వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉంది.

    9 పిల్లలకు జన్మనిచ్చిన కుక్క.. యజమాని విందు

    పెంపుకుడు కక్కు 9 పిల్లలకు జన్మనివ్వడంతో యజమాని ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఆ సంతోషంలో 400 మందికి విందు ఇచ్చింది. హామిర్‌పుర్‌లోని మేరాపుర్‌కు చెందిన రాజ్‌కాళి అనే మహిళ తన పెంపుడు కుక్క ఇటీవలే 9 పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో గ్రామస్థులు, బంధువులను ఇంటికి పలిచి విందును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుక్క పిల్లలను అందంగా అలకరించింది.

    పలు మెము రైళ్లు రద్దు

    విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. అభివృద్ధి పనుల కారణంగా పలు మెము రైళ్లను రద్దయ్యాయి. ఇప్పటికే బిట్రగుంట-విజయవాడ మధ్య నడిచే రైళ్లను బిట్రగుంట-గూడూరు మధ్య నడిచే రైలును రద్దు చేశారు. తాజాగా బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే 17237ను, చెన్నై సెంట్రల్‌ నుంచి బిట్రగుంటకు వెళ్లే 17238ను 13వ తేదీ నుంచి 17 వరకు రద్దు చేశారు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458 మెము రైలు 14 నుంచి 20వ తేదీ వరకు రద్దు … Read more

    Amazon: కంపెనీ ఛార్జర్లపై బిగ్ డిస్కౌంట్స్..

    చాలా స్మార్ట్‌ ఫోన్ కంపెనీలు ఛార్జింగ్ అడాప్టర్‌లను నిలిపివేశాయి. దీంతో పోర్టబుల్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ఇవన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలతో వస్తున్నాయి. ఇవి ఛార్జింగ్ టైంను ఆదా చేస్తాయి. ఈ ఛార్జర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, స్పీకర్‌లు, ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, పవర్ బ్యాంక్‌లు మొదలైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేస్తాయి. కంపెనీ ఛార్జర్ల మాదిరి హై-స్పీడ్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ వాటేజ్ రేటింగ్‌తో ఛార్జర్ల జాబితాను అందించాం. YouSay Webపై వాటిపై మీరూ ఓ లుక్ వేయండి. Best Deals On Popular … Read more

    నాకు సొంతిల్లు కూడా లేదు: మోదీ

    పేదల సొంతింటి కళను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనకు మాత్రం సొంతిల్లు లేదన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతే కనిపించేది. పేదల కోసం మా ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విధ్వంసమే ఉంటుంది. కాంగ్రెస్ నకిలీ లబ్ధిదారుల ముసుగులో తమ అనుచరుల జేబులను నింపేసింది. మా ప్రభుత్వం వచ్చాక వారిని ఏరివేశాం. తద్వారా రూ.2.75లక్షల కోట్లను ఆదా చేశాం’ అని మోదీ పేర్కొన్నారు.

    విద్యార్థితో టీచర్ శృంగారం

    ఓ టీచరే వికృత చేష్టలకు పాల్పడి జైలుపాలైంది. విద్యార్థితో టీచర్‌ శృంగారంలో పాల్గొందని ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మాంట్‌గోమెరి విలేజ్‌ మిడిల్‌ స్కూల్‌లో మెలిసా మేరి కర్టిస్‌ టీచర్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో 14 ఏళ్ల విద్యార్థితో కర్టిస్‌ (22) శృంగారంలో పాల్గొంది. బాధిత విద్యార్థికి పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చి టీచర్‌ శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

    మారువేషంలో జనం మధ్యలోకి సీఎం

    హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు. సాధారణ వ్యక్తిలా కాసేపు ప్రజల మధ్యలో తిరిగారు. టోపీ పెట్టుకుని, మాస్క్‌ ధరించి.. ముఖానికి తువ్వాలు చుట్టుకుని ఫోన్‌ చూసుకుంటూ నిలబడ్డారు. రోడ్డుపై సమోసాలు తిని ప్రజలలో మమేకమై ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ఆ సమయంలో కట్టర్ చుట్టూ భద్రతా సిబ్బంది లేరు.

    స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్‌లు

    దేశీయ స్టాక్‌ మార్కెట్ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 65,101.95 దగ్గర స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. 64,851.06 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 33.21 పాయింట్ల స్వల్ప లాభంతో 64,975.61 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 19,449.60 దగ్గర ప్రారంభమై చివరకు 36.80 పాయింట్లు లాభపడి 19,443.50 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.28 వద్ద నిలిచింది.