• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతి

    ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత ఎన్నికల పోలింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఉపాధ్యాయులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్నవాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు.

    మహిళలకు సీఎం క్షమాపణలు

    జనాభా నియంత్రణ అంశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పారు. సెంబ్లీలో నితీష్ మాట్లాడుతూ.. ‘స్త్రీలు చదువుకుంటే భర్తలను కంట్రోల్‌లో పెట్టి జనాభాను తగ్గిస్తారు. మహిళలు విద్యావంతులైతే కలయిక వేళ భర్తలను అదుపులో పెడతారు, తద్వారా జనాభా తగ్గుతుందని నితీష్ వ్యాఖ్యానించారు. అయితే ఆయన మాటలు మహిళల హక్కులను భంగపరిచేవిలా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?

    దీపావళి రెండు రోజులు రావడంతో 12, 13 ఏ తేదీల్లో జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై వేద పండితులు ఏం చేబుతున్నారో చూద్దాం.. కార్తీక మాస అమావాస్య నవంబర్ 12 మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని. అందుకే నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని’.పండితులు చెబుతున్నారు.

    సౌరజ్వాలను ఫొటో తీసిన ఆదిత్య-ఎల్‌1

    సూర్యుడిపై పరిశోధనలకు భారత్‌ ఆదిత్య-ఎల్‌1 ప్రయోగించిన విషయం తెలిసిందే.. ఈ వ్యోమనౌక తొలిసారిగా సౌర జ్వాలలకు సంబంధించిన ఫొటోలను పంపించింది.ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన చేసింది. ‘సౌర వాతావరణం అకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటారు. హెచ్‌ఈల్‌1ఓఎస్‌ను గత నెల 27న ఇస్రో ఆన్‌ చేసింది. ప్రస్తుతం ఈ పరికరాన్ని పూర్తిస్థాయి పరిశీలనలకు సిద్ధం చేస్తున్నారు’. అని ఇస్రో పేర్కొంది.

    రిజర్వేషన్లపై బిహార్‌ కీలక నిర్ణయం

    రిజర్వేషన్లకు సంబంధించి బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలు కలిపి 30శాతం ఉండగా.. తాజా పెంపుతో అవి 43శాతం కానున్నాయి. మరోవైపు ఎస్టీలకు 2 శాతాన్ని ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి.

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్

    మిజోరంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 52.73 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెర్చిప్‌ జిల్లాలో 60.37శాతం పోలింగ్‌ నమోదైంది. లౌంగల్లాయ్ జిల్లాలో 59.31 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తుండగా.. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

    చంద్రబాబుకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌

    చంద్రబాబు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చంద్రబాబుకు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరగనుంది. ఇప్పటికే రెండు సార్లు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కూడా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. తాజాగా మళ్లీ క్యాటరాక్ట్‌ చికిత్స కోసం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి వచ్చారు.

    Poco C65 Mobile: ఫీచర్లు చూస్తే షాకే!

    ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ పోకో నుంచి సరికొత్త మెుబైల్ లాంచ్‌ అయ్యింది. ‘Poco C65’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి గ్లోబల్‌ ముందుకు వచ్చింది. ‘Poco C55’ మెుబైల్‌కు అప్‌డేట్‌ వెర్షన్‌గా ‘Poco C65’ రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. గత ఫోన్‌తో పోలిస్తే దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్‌ ఫీచర్లను అమర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘పోకో సీ65’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను తెలుసునేందుకు YouSay Webపై క్లిక్ … Read more

    సనాతనంపై నా వ్యాఖ్యలు సరైనవే: ఉదయనిధి

    తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతనం ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని సమర్థించుకున్నారు. అంబేడ్కర్‌, పెరియార్‌, తిరుమావళవన్‌లు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడిన దానికంటే తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. సనాతన ధర్మంపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు పాల్గొనడం తప్పని, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించినదానిపై బదులిచ్చారు. తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నాదన్నారు.

    నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 176 పాయింట్ల నష్టంతో 64,781 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 19,363 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్ల నష్టానికి దారితీశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.